క్షణికావేశంలో తనువుచాలిస్తున్న పోలీసులు
మొన్న ఎస్‌ఐ.. నేడు హెడ్ కానిస్టేబుళ్లు..
రోజురోజుకు పెరుగుతున్న ఘటనలు
సాక్షి, సిద్దిపేట/మెదక్ జోన్: ఎవరికి ఏ ఆపద వచ్చినా ముందుగా పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి బాధలు చెప్పుకుంటారు. అక్కడ వారికి న్యాయం జరుగుతుందని భావిస్తారు. అయితే వారిలో మనోధైర్యం నింపాల్సిన పోలీసులే అధైర్యానికి లోనవుతున్నారు. కష్టపడి పోలీస్ కొలువు సాధించి అర్థంతరంగా తనువుచాలిస్తున్నా రు. నాలుగు రోజులు క్రితం మెదక్‌జిల్లా కొల్చారం గ్రామానికి చెందిన బిక్కనూర్ ఎస్సై సాయికుమార్ మరణ ం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపింది. కానిస్టేబుల్ శృతి, కంప్యూటర్ ఆపరేటర్ నిఖిల్‌తో పరిచయాలు చివరకు ఆత్మహత్య చేసుకునే వరకు వెళ్లాయి. ఆ ఘటన మరువకముందే కొల్చారం పోలీస్‌స్టేషన్‌లో విధులు నిర్వర్తించే హెడ్‌కానిస్టేబుల్ సాయికుమార్ ఆదివారం స్టేషన్ ఆవరణలో చెట్టుకు ఉరేసుకుని బలవన్మరణం చెందాడు. ఇందుకు ప్రధాన కారణం వివాహేతర సంబంధమేనని సమాచారం. సాయికుమార్ తనను బెదిరిస్తున్నా డని నర్సాపూర్‌కు చెందిన ఓ వ్యాపారి ఇటీవల స్థానిక సీఐకి ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. తన భార్యతో ఫోన్‌లో మాట్లాడుతున్నాడని, ఎందుకు మాట్లాడుతున్నావని అడిగితే బెదిరింపులకు దిగుతున్నాడని ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఇటీవల కానిస్టేబుల్ తరఫున కొందరు నాయకులు, వ్యాపారి తరఫున బంధువులు చర్చలు జరిపినా విఫలమైనట్లు సమాచారం. రెండో దఫా చర్చలు జరగకముందే సాయికుమార్ ఆత్మహత్య చేసుకోవడం గమనార్హం. ఏపీలోని బాపట్ల జిల్లా రేపల్లె ప్రాంతానికి చెందిన సాయికుమార్ 1992లో కానిస్టేబుల్‌గా ఉద్యోగంలో చేరాడు. ఉమ్మడి మెదక్ జిల్లాలోని పలు పోలీస్‌స్టేషన్‌లలో విధులు నిర్వర్తించాడు. ఆరేళ్ల క్రితం హెడ్ కానిస్టేబుల్‌గా ప్రమోషన్ పొంది ఎస్‌బీలో కొంతకాలం విధులు నిర్వర్తించి ఇటీవలే సివిల్ విభాగంలోకి వచ్చాడు. అలాగే సిద్దిపేటకు చెందిన బెటాలియన్ కానిస్టేబుల్ బాలకృష్ణ తన భార్యతో పాటు ఇద్దరు పిల్లలకు పురుగు మందు తాగించి ఉరేసుకొని తనువు చాలించాడు. ప్రస్తుతం అతడి భార్యాపిల్లలు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కారణాలేమైనా పోలీసుల మరణాలు ఆ శాఖలో కలకలం రేపుతున్నాయి.
మరికొన్ని ఘటనలు..
2017లో దుబ్బాక ఎస్‌ఐ చిట్టిబాబు సర్వీస్ రివాల్వర్‌తో భార్యను చంపి తాను ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
2016లో గజ్వేల్ నియోజకవర్గం కుకునూర్‌పల్లి పోలీస్‌స్టేషన్‌లో విధులు నిర్వర్తించే ఎస్‌ఐ రామకృష్ణారెడ్డి సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకున్నాడు. మామూళ్ల విషయంలో ఉన్నతాధికారుల ఒత్తిడితోనే ఆత్మహత్యకు పాల్పడినట్లు అప్పట్లో ప్రచారం జరిగింది.
2017లో ఇదే పోలీస్‌స్టేషన్‌లో ఎస్‌ఐ ప్రభాకర్‌రెడ్డి రివాల్వల్‌తో కాల్చుకుని చనిపో యాడు. సెటిల్‌మెంట్లు బయట పడతాయనే ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలిసింది.
2023లో కలెక్టర్ గన్‌మెన్ కానిస్టేబుల్ నరేష్ ఆన్‌లైన్ గేమ్స్‌కు అలవాటుపడి చేసిన అప్పు లు తీర్చే మార్గం లేక తనువు చాలించాడు. సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలం ఎర్రవల్లికి చెందిన మరో కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు సర్వీ స్ రివాల్వర్‌తో కాల్చుకుని చనిపోయాడు.
Comments
Please login to add a commentAdd a comment