జెనీవా: ప్రకృతిలోని నిజమైన అద్భుతం అది. అందుకే వెల కూడా అదే స్థాయిలో రాబట్టింది. మంగళవారం స్విట్జర్లాండ్ జెనీవాలో క్రిస్టీస్ సంస్థ నిర్వహించిన వేలంపాటలో రికార్డుస్థాయిలో దాదాపు రూ.231 కోట్ల ధర($28.8 millions) పలికింది ఫార్చూన్ పింక్. అత్యంత అరుదైన రత్నం ఇది. ఆసియాకు చెందిన ఒక వ్యక్తి దీనిని సొంతంచేసుకున్నారు. ఆ వ్యక్తి వివరాలు వెల్లడించేందుకు క్రిస్టీస్ జ్యువెలరీ విభాగపు అధినేత మాక్స్ ఫావ్కెట్ నిరాకరించారు. అయితే.. పదిహేనేళ్ల కిందట బ్రెజిల్ గనుల్లో ఆ వజ్రాన్ని సేకరించినట్లు తెలిపారు.
ఇక ఇక్కడో ఆసక్తికర విషయం ఏంటంటే.. ప్రపంచంలోనే మొట్టమొదటి పింక్ డైమండ్ ఇండియాలోని గోల్కొండ గనుల్లో 16వ శతాబ్ధంలో బయటపడ్డాయి. ఆపై ఆఫ్రికా, ఆస్ట్రేలియా, బ్రెజిల్, రష్యా గనుల్లో వీటిని గుర్తించారు. న్యూయార్క్, షాంగై, సింగపూర్, తైవాన్ తర్వాత జెనీవాలో పింక్ డైమండ్స్ వేలం నిర్వహిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment