ముంబై: రియల్ ఎస్టేట్ రంగం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇందులో ప్రాపర్టీ డిమాండ్ బట్టి కోట్లు సంపాదిస్తారు, ఒక్కో సారి కొనేవాళ్లు లేక అదే స్థాయిలో నష్టపోతూ ఉంటారు.అయితే ఇటీవల ప్రజలు సొంత ఇళ్లు లేదా ఫ్లాట్ కొనుగోలుపై ఆసక్తి చూపడంతో రియల్టర్ల పంట పండుతోంది. తాజాగా నేవీ ముంబైలోని ఫ్లాట్ల ధరలకు రెక్కలు రావడంతో అవి ఒక్క సారిగా ప్రారంభ ధర కంటే 5 రేటు పెరిగి అందరనీ ఆశ్చరపరిచింది.
బాబోయ్.. ప్లాటు ధరలకు రెక్కలు
సిటీ అండ్ ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (సిడ్కో) నవీ ముంబైలోని ఓ ప్రాంతానికి సంబంధించిన 28 ప్లాట్‌లను బ్లాక్‌లో ఉంచింది. అయితే ఊహించని విధంగా ఆ ప్లాటు ఒక చదరపు మీటరుకు రూ. 5.54 లక్షలు వసూలు చేసింది. ఇ-వేలం ఈ ఇరవై ఎనిమిది ప్లాట్లు గాను సిడ్కో దాదాపు రూ.1,365 కోట్లను ఆర్జించనుంది.
గతంలో దీని ప్రారంభ ధర రూ.1.14 లక్షలుగా నిర్ణయించగా ప్రస్తుతం రయ్ అంటూ దూసుకుపోయి ఐదు రెట్లు ఎక్కువగా పలుకుతోంది. సెక్టార్ 20, పామ్ బీచ్ రోడ్, సన్‌పాద వద్ద ఉన్న సుమారు 1.3 ఎకరాల ప్లాట్ (5,526 చదరపు మీ) రూ. 306 కోట్లు బిడ్‌ను దక్కించుకుంది. ఈ బిడ్‌ను గెలుచుకున్న బిల్డర్ డీపీవీజి వెంచర్స్‌కి చెందిన యజమానులు మాట్లాడుతూ.. పామ్ బీచ్ రోడ్‌లో సముద్రానికి ఎదురుగా ఉన్న ప్రధాన ప్లాట్లలో ఇది చివరిది. అందుకే ఇది రికార్డు ధర పలికిందన్నారు.
చదవండి: కేంద్రం కీలక నిర్ణయం.. వాటికి చెక్, ఈ–కామర్స్ కంపెనీలు ఇలా చేయాల్సిందే!
Comments
Please login to add a commentAdd a comment