bid
-
రూ.70,000 కోట్ల బిడ్‌ను తిరస్కరించిన రక్షణ శాఖ
భారత్ ప్రతిష్టాత్మంగా చేపట్టిన ప్రాజెక్టు 75ఇండియా(P75I)లో భాగంగా రూ.70,000 కోట్ల విలువైన జలాంతర్గాముల తయారీ కోసం లార్సెన్ అండ్ టుబ్రో (L&T) వేసిన బిడ్‌ను రక్షణ మంత్రిత్వ శాఖ తిరస్కరించింది. ఈ నిర్ణయంతో మజగావ్ డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్ (MDL) మాత్రమే ఆరు తదుపరి తరం జలాంతర్గాములను నిర్మించే రేసులో నిలిచింది.ప్రాజెక్ట్ 75 ఇండియాభారత నౌకాదళం ప్రాజెక్ట్ 75ఇండియా(పీ75ఐ) మూడు వారాల పాటు నీటి అడుగున ఉండగల సామర్థ్యం కలిగిన ఆరు అధునాతన జలాంతర్గాములను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. పెరుగుతున్న ప్రాంతీయ బెదిరింపుల మధ్య నౌకా సామర్థ్యాలను ఆధునీకరించడానికి భారతదేశం చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా ఈ ప్రాజెక్టును ప్రారంభించారు.ఎల్ అండ్ టీ బిడ్ భారత నౌకాదళ అవసరాలకు అనుగుణంగా లేదని రక్షణ మంత్రిత్వ శాఖ గుర్తించింది. స్పానిష్ కంపెనీ నవంతియా భాగస్వామ్యంతో ఎల్ అండ్ టీ స్పెయిన్‌లో కీలకమైన ఎయిర్ ఇండిపెండెంట్ ప్రొపల్షన్ (ఏఐపీ) వ్యవస్థ పనితీరును ప్రదర్శించింది. అయినా ప్రభుత్వం కంపెనీ బిడ్‌ను తిరస్కరించడం గమనార్హం. ఏదేమైనా, భారత నౌకాదళం వ్యవస్థను, దాని అంచనాలు, డిమాండ్లను అందుకోవడంలో ఎల్ అండ్ టీ విఫలమైంది.పరిమిత పోటీపై ఆందోళనఎల్ అండ్ టీ అనర్హతతో ఎండీఎల్ ఇప్పటికే షార్ట్ లిస్ట్ చేసిన ఒరిజినల్ ఎక్విప్మెంట్ మాన్యుఫ్యాక్చరర్స్(ఓఈఎం)ల్లో ఒకటైన నావల్ గ్రూప్ (ఫ్రాన్స్), థైసెన్ క్రుప్ మెరైన్ సిస్టమ్స్ (జర్మనీ), డేవూ షిప్ బిల్డింగ్ (దక్షిణ కొరియా), రోసోబోరో నెక్స్పోర్ట్(రష్యా)తో కలిసి పనిచేయనుంది. ఇంత ముఖ్యమైన ఒప్పందంలో పరిమిత పోటీపై ఆందోళనలను వస్తున్నాయి. రక్షణ రంగంలో, దేశీయంగా నౌకాదళ ఉత్పత్తుల తయారీలో కీలక పాత్ర పోషిస్తున్న ఎల్ అండ్ టీని మినహాయించడం భారత్ స్వావలంబనపై ప్రభావం చూపనుందని కొందరు అభిప్రాయపడుతున్నారు.ఇదీ చదవండి: పన్ను చెల్లింపుదారులతో సర్వే.. ఆసక్తికర అంశాలుపీ75ఐ గురించి మరికొంత..ప్రాజెక్ట్ 75 ఇండియా (పీ75ఐ) భారత నౌకాదళం ముఖ్యమైన ప్రాజెక్ట్. అత్యాధునిక ఎయిర్ ఇండిపెండెంట్ ప్రొపల్షన్ (ఏఐపీ) వ్యవస్థలతో కూడిన ఆరు అధునాతన డీజిల్-ఎలక్ట్రిక్ జలాంతర్గాములను తయారు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఏఐపీ వ్యవస్థ జలాంతర్గాములు ఎక్కువ సేపు బయటకు రాకుండా ఉండడానికి వీలు కల్పిస్తుంది. వీటిని ఎక్కువ లోతుల్లోకి వెళ్లేలా రూపొందించనున్నారు. ఈ జలాంతర్గాముల్లో సమకాలీన పరికరాలు, ఆయుధాలు, సెన్సర్లు, ఆధునిక క్షిపణులు ఉంటాయి. -
ప్రైవేటు చేతుల్లోకి ప్రభుత్వ డేటా!
సాక్షి, అమరావతి:‘ప్రపంచంలో అత్యంత ఖరీదైన సంపద ఏదైనా ఉంది అంటే.. అది ఒక్క డేటా మాత్రమే. ఎవరి దగ్గర ఎక్కువ డేటా ఉంటే వారే అత్యంత ధనికులు’ అమరావతి డ్రోన్ సదస్సులో సీఎం చంద్రబాబు చెప్పిన మాటలివి. నూతన టెక్నాలజీ పరుగులు పెడుతున్న తరుణంలో డేటా అత్యంత విలువైనదని సీఎం చంద్రబాబు చెబుతూనే.. అత్యంత విలువైన ప్రభుత్వ డేటాను ప్రైవేటు ఏజెన్సీల చేతిలో పెట్టడానికి కూటమి ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. మంగళగిరిలోని ‘పై డేటా సెంటర్’లో గల స్టేట్ డేటా సెంటర్ నిర్వహణ బాధ్యతలను థర్డ్ పార్టీ ఏజెన్సీలకు అప్పగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం టెండర్లు ఆహ్వానించింది. రెండేళ్ల లీజు కాలానికి స్టేట్ డేటా సెంటర్ నిర్వహణకు రాష్ట్ర ఐటీ శాఖకు చెందిన ఏపీ టెక్నాలజీ సర్వీసెస్ లిమిటెడ్ (ఏపీటీఎస్ఎల్) బిడ్లు పిలిచింది. ప్రముఖ సిస్టమ్ ఇంటిగ్రేటర్, డేటా సెంటర్ మేనేజ్డ్ సర్వీస్ ప్రొవైడర్లు టెండర్లలో పాల్గొనవచ్చని పేర్కొంది. కేంద్ర ప్రభుత్వం డిజిటల్ ఇండియా పేరుతో ఈ–గవర్నెన్స్‌ను ప్రోత్సహిస్తోందని, దీన్ని అందిపుచ్చుకుంటూ రాష్ట్రంలో ఈ–గవర్నెన్స్ కార్యక్రమాలను కొనసాగించడం కోసం మౌలిక సదుపాయాల అభివృద్ధిలో భాగంగా ఈ డేటాసెంటర్ నిర్వహణను ప్రైవేటు సంస్థలకు అప్పగిస్తున్నట్టు టెండర్ నోటీసులో పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ (ఐసీటీ) ప్రాధాన్యతను గుర్తించిందని, ఐటీ సేవలను విస్తరించడం ద్వారా ప్రభుత్వ పథకాలను విజయవంతంగా అమలు చేయనున్నట్టు పేర్కొంది. ఆసక్తి గల సంస్థలు అక్టోబర్ 30 మధ్యాహ్నం 3గంటలలోపు టెండర్ దాఖలు చేయాల్సి ఉంటుందని, కాంట్రాక్టు గెలిచిన సంస్థ ఒప్పందం కుదుర్చుకున్న తేదీ నుంచి రెండేళ్ల పాటు సేవలను అందించాల్సి ఉంటుందని బిడ్ డాక్యుమెంట్లో పేర్కొంది.ఐటీ నిపుణుల ఆందోళనడేటా చౌర్యంతో సైబర్ నేరాలు పెరుగుతున్న తరుణంలో ప్రభుత్వ డేటా నిర్వహణను ప్రైవేటు సంస్థలకు అప్పగించడంపై ఐటీ నిపుణలతో పాటు అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ డేటా సెంటర్ నిర్వహణను ప్రభుత్వమే చేపట్టడం ద్వారా ప్రజలకు భరోసా కల్పించాల్సిన ఆవశ్యకత ప్రభుత్వంపై ఉందని అధికారులు స్పష్టం చేస్తున్నారు. గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఐటీ గ్రిడ్ పేరుతో డేటా చౌర్యం జరగడంపై తీవ్ర దుమారమే రేగిందన్న విషయాన్ని వారు గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు ఏకంగా ప్రభుత్వ డేటా సెంటర్ నిర్వహణను ప్రైవేటు సంస్థలకు అప్పగించడంపై వీరు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. -
ఆయిల్, గ్యాస్ బ్లాకుల కోసం పోటాపోటీ
న్యూఢిల్లీ: దేశంలోనే అతిపెద్ద ఆయిల్, గ్యాస్ బ్లాకుల వేలంలో ప్రభుత్వ, ప్రైవేటు రంగ సంస్థలు పాలు పంచుకున్నాయి. ఓపెన్ ఎకరేజ్ లైసెన్సింగ్ పాలసీ (ఓఏఎల్‌పీ–8) ఎనిమిదో దశ వేలంలో భాగంగా కేంద్ర సర్కారు 28 బ్లాకులను వేలానికి పెట్టింది. ఇవి 1.36 లక్షల చదరపు కిలోమీటర్ల పరిధిలో విస్తరించి ఉన్నాయి.ప్రైవేటు రంగంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్–బీపీ సంస్థలు మొదటిసారి ఓఎన్జీసీతో కలసి గుజరాత్ తీరంలోని ఓ బ్లాక్‌కు బిడ్ వేశాయి. ఓఎన్జీసీతోపాటు మరో ప్రభుత్వరంగ సంస్థ ఆయిల్ ఇండియా లిమిటెడ్, వేదాంత, రిలయన్స్ ఇండస్ట్రీస్–బీపీ జేవీ, సన్ పెట్రోకెమికల్స్ ఇందులో పాల్గొన్నాయి. ఎనిమిదో విడత ఓఏఎల్‌పీలో 28 బ్లాక్‌లకు బిడ్ల దాఖలు గడువు సెప్టెంబర్ 21తో ముగిసింది. దీంతో ఈ వివరాలను డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హైడ్రోకార్బన్స్ (డీజీహెచ్) విడుదల చేసింది.ఓఎన్జీసీ తాను సొంతంగా 14 బ్లాకులకు బిడ్లు దాఖలు చేసింది. ఆయిల్ ఇండియా, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్‌తో కలసి మరో నాలుగు బ్లాక్‌లకు బిడ్లు వేసింది. రిలయన్స్–బీపీతో కలసి వేసిన మరో బిడ్ కూడా కలిపి చూస్తే మొత్తం 19 బ్లాక్‌లకు ఓఎన్జీసీ పోటీ పడుతోంది. ఇక అనిల్ అగర్వాల్‌కు చెందిన వేదాంత లిమిటెడ్ మొత్తం 28 బ్లాకులకు సొంతంగా బిడ్లు సమర్పించింది. సన్ పెట్రోకెమికల్స్ ఏడు బ్లాకులకు బిడ్లు వేసింది. మొత్తం మీద నాలుగు బ్లాక్‌లకు మూడేసి చొప్పున బిడ్లు రాగా, మిగిలిన వాటికి రెండేసి చొప్పున దాఖలయ్యాయి. -
అదానీ పవర్‌కు భారీ కాంట్రాక్ట్
న్యూఢిల్లీ: అదానీ గ్రూప్ అటు పునరుత్పాదక(రెనెవబుల్), ఇటు బొగ్గుఆధారిత(థర్మల్) విద్యుత్ సరఫరాకు భారీ కాంట్రాక్టును పొందింది. దీనిలో భాగంగా మహారాష్ట్ర ప్రభుత్వానికి 6,600 మెగావాట్ల రెనెవబుల్, థర్మల్ విద్యుత్‌ను సరఫరా చేయనుంది. ఇందుకు వేసిన బిడ్ గెలుపొందినట్లు అదానీ గ్రూప్ ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ బాటలో యూనిట్‌కు కోట్ చేసిన రూ. 4.08 ధర ద్వారా జేఎస్‌డబ్ల్యూ ఎనర్జీ, టొరెంట్ పవర్లను అధిగమించింది.వెరసి రెనెవబుల్, థర్మల్ మిక్స్ ద్వారా 25ఏళ్ల దీర్ఘకాలానికి విద్యుత్‌ను సరఫరా చేయనుంది. ప్రస్తుతం మహారాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తున్న ఎలక్ట్రిసిటీ ధరతో పోలిస్తే అదానీ గ్రూప్ యూనిట్‌కు దాదాపు రూపాయి తక్కువగా కోట్ చేసినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.ఎల్వోఐ జారీ అయిన తేదీ నుంచి రెండు రోజుల్లోగా సరఫరాలు ప్రారంభంకానున్నట్లు తెలుస్తోంది. కాగా.. మహారాష్ట్ర స్టేట్ ఎలక్ట్రిసిటీ పంపిణీ సంస్థ(ఎంఎస్ఈడీసీఎల్) 6,600 మెగావాట్ల విద్యుత్ కోసం ఎల్‌వోఐను జారీ చేసినట్లు అదానీ పవర్ తాజాగా వెల్లడించింది. దీనిలో భాగంగా అదానీ పవర్ కొత్తగా ఏర్పాటు చేసిన 1,600 మెగావాట్ల అల్ట్రాసూపర్క్రిటికల్ సామర్థ్యం నుంచి 1,496 మెగావాట్ల థర్మల్ పవర్‌ను సరఫరా చేయనుంది. సహచర సంస్థ అదానీ గ్రీన్ ఎనర్జీ గుజరాత్, కచ్‌లోని ఖావ్డా రెనెవబుల్ ఎనర్జీ పార్క్ నుంచి 5 గిగావాట్ల(5,000 మెగావాట్లు) సోలార్ పవర్‌ను సరఫరా చేయనుంది. బిడ్ ప్రకారం అదానీ గ్రీన్ యూనిట్‌కు రూ. 2.70 ఫిక్స్డ్ ధరలో సోలార్ పవర్‌ను కాంట్రాక్ట్ కాలంలో సరఫరా చేయనుంది. -
నేటితో ధాన్యం వేలం బిడ్ల దాఖలుకు గడువు పూర్తి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని రైస్‌మిల్లుల్లో నిల్వ ఉన్న 2022–23 రబీ సీజన్‌కు సంబంధించిన 35 లక్షల మెట్రిక్ టన్నులు (ఎల్ఎంటీ)ల ధాన్యం వేలం బిడ్ల దాఖలుకు గడువు శుక్రవారంతో ముగియనుంది. గత రబీలో సేకరించిన ధాన్యాన్ని రా రైస్‌గా మిల్లింగ్ చేయడానికి మిల్లర్లు ఆసక్తి చూపని విషయం తెలిసిందే. రబీలో సేకరించిన 66.84 ఎల్ఎంటీల ధాన్యం నుంచి బాయిల్డ్ రైస్‌కు సంబంధించి భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ) ఇచ్చిన టార్గెట్ ప్రకారం సుమారు 20 ఎల్ఎంటీల ధాన్యాన్ని మాత్రమే మిల్లింగ్ చేసి కస్టమ్ మిల్డ్ రైస్ (సీఎంఆర్) కింద ఎఫ్సీఐకు అప్పగించాలని నిర్ణయించారు. మిగతా ధాన్యాన్ని ముడి బియ్యంగా ఇవ్వాల్సి ఉండటంతో వారు ససేమిరా అన్నారు. దీంతో గత ప్రభుత్వం 25 ఎల్ఎంటీల ధాన్యం కోసం బిడ్లు ఆహ్వానించినప్పటికీ, ఎన్నికల నేపథ్యంలో ఆ ప్రక్రియ రద్దయింది. దీంతో గత నెలలో గ్లోబల్ టెండర్ నోటీస్ జారీ చేశారు. ఈ మేరకు వేలంలో పాల్గొనే బిడ్డర్లతో ఇటీవల సమావేశం జరగగా, వేలం నిబంధనల్లో కొన్ని సవరణలను సూచించారు. ఈ మేరకు నిబంధనలను మారుస్తూ బిడ్లు దాఖలు చేసేందుకు గడువును శుక్రవారం వరకు పొడిగించారు. -
2036 ఒలింపిక్స్‌కు భారత్ బిడ్ వేయాలి: పీటీ ఉష
హాంగ్జౌ: ఆసియా క్రీడల చరిత్రలోనే భారత క్రీడా బృందం ఈసారి అత్యుత్తమ ప్రదర్శన కనబరిచి, అత్యధికంగా 107 పతకాలు సాధించడంపట్ల భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) అధ్యక్షురాలు, దిగ్గజ అథ్లెట్ పీటీ ఉష ఆనందం వ్యక్తం చేసింది. ‘ఆసియా క్రీడల్లో రికార్డుస్థాయి ప్రదర్శన తర్వాత భారత క్రీడాకారులు వచ్చే ఏడాది జరిగే పారిస్ ఒలింపిక్స్‌పై దృష్టి సారించాలి. మన క్రీడాకారులు, కోచ్‌లు, జాతీయ క్రీడా సమాఖ్యలు శ్రమిస్తే పారిస్ ఒలింపిక్స్‌లో మన పతకాల సంఖ్య కచ్చితంగా రెండంకెలు దాటుతుంది. ఇక మనం కూడా ఒలింపిక్స్ ఆతిథ్యం కోసం బిడ్ వేయాల్సిన సమయం ఆసన్నమైంది. 2036 ఒలింపిక్స్ ఆతిథ్య హక్కుల కోసం భారత్ పోటీపడాలి’ అని 59 ఏళ్ల పీటీ ఉష వ్యాఖ్యానించింది. కేవలం ఒకట్రెండు క్రీడాంశాల్లో కాకుండా వేర్వేరు క్రీడాంశాల్లో భారత్‌కు పతకాలు రావడంపట్ల రాజ్యసభ సభ్యురాలైన ఉష ఆనందాన్ని వ్యక్తం చేసింది. -
పోలీస్ స్టేషన్ పైనే యువకుల ట్రెండింగ్ వీడియో.. చివరికి..
తిరువనంతపురం: సోషల్ మీడియాలో హైలెట్ కావడం కోసం తెగ పరితపిస్తుంటారు. వినూత్న రీతిలో వీడియోలు పెడుతూ లైకులు, వ్యూస్ చూసుకుని సంబరపడిపోతుంటారు. ఈ మైకంలోపడి ప్రాణాల మీదికి కూడా తెచ్చుకుంటారు. ఇలాగే సోషల్ మీడియా పిచ్చి కేరళ యువకులను కటకటాలపాలు చేసింది. ఇంతకూ వారు ఏం చేశారో తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు..? ఖాలీగా ఉన్న సమయాన్ని ఏం చేయాలో తెలియని ఐదుగురు యువకులు ట్రెండ్ అయ్యే వీడియో చేయాలనుకున్నారు. అందుకు ఏకంగా పోలీసు స్టేషన్‌నే ఎంచుకున్నారు. తమకు తెలిసిన యానిమేషన్ స్కిల్స్ ఉపయోగించి స్టేషన్లో బాంబు పేలుడు సంభవించినట్లు ఓ వీడియో తయారు చేశారు. అంతేకాకుండా సినిమాల్లోని వచ్చే పాపులర్ డైలాగ్‌లను ఉపయోగించారు. ఆ వీడియోను సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు. అది కాస్త ఇన్‌స్టా, యూట్యూబ్‌లలో విపరీతంగా వైరల్ అయింది. దీంతో అది పోలీసుల కంట పడింది. దర్యాప్తు చేపట్టిన స్థానిక మేలట్టూరు పోలీసులు.. మహ్మద్ రియాజ్(25), మహ్మద్ ఫావేజ్(22), మహ్మద్ జాష్మైన్(19), సాలిమ్ జిషాజియాన్(20), సాల్మానుల్ పారిస్(19)లను నిందితులుగా గుర్తించారు. సోషల్ మీడియాలో వైరల్ కావడం కోసమే ఇదంతా చేశారని పోలీసులు గుర్తించారు. ఐదుగుర్ని అరెస్టు చేశారు. ఇదీ చదవండి: విరిగిపడిన కొండచరియలు.. కుప్పకూలిన ఇళ్లు.. వీడియో వైరల్.. -
రిలయన్స్ క్యాపిటల్‌పై హిందూజా బ్రదర్స్ కన్ను: బిలియన్ డాలర్ల ఫండ్
అప్పుల ఊబిలో కూరుకుపోయిన అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ క్యాపిటల్‌ను కొనుగోలు చేసేందుకు హిందూజా కుటుంబం ప్లాన్ చేస్తోంది. తాజా నివేదికల ప్రకారం దాదాపు రూ. 8,200 కోట్లు (1 బిలియన్ డాలర్లు) గ్లోబల్ క్రెడిట్ ఫండ్స్‌ను సమీకరించిందట. ఒకప్పుడు రూ.93,851 కోట్ల విలువైన రిలయన్స్ క్యాపిటల్ కొనుగోలుకు ప్రయత్నించిన దిగ్గజ కంపెనీల్లో హిందుజాలు ప్రాధాన్యమైన బిడ్డర్ కావడం గమనార్హం. (లెజెండ్ విశ్వనాథన్ ఆనంద్ ట్వీట్ చూశారా? ఇంటర్నెట్ లేటెస్ట్ హల్చల్) తాజాగా ఫరాలోన్ క్యాపిటల్, ఓక్ట్రీ, అరేస్ ఆసియా అండ్ ఆసెర్బెరస్ లాంటి వాటితో హిందుజాలు టచ్‌లో ఉన్నారని మూలాలను ఉటంకిస్తూ ఎకనామిక్ టైమ్స్ నివేదించింది. రిలయన్స్ క్యాపిటల్ లైఫ్, జనరల్ ఇన్సూరెన్స్ షేర్ల ద్వారా హిందుజాలు ఫైనాన్సింగ్‌కు మద్దతు ఇవ్వవచ్చని దీనికి సంబంధించి బీమా రెగ్యులేటర్ నుండి అవసరమైన అనుమతికి ఫండింగ్ పార్టనర్లు హిందుజాల నుండి గ్యారెంటీని కోరే అవకాశం ఉందని నివేదించింది. (Google Doodle Pani Puri Game: క్రిస్పీ..క్రిస్పీ పానీ పూరీ లవ్: గూగుల్ డూడుల్ ఇంటరాక్టివ్ గేమ్) స్వాధీనానికి కోర్టు అనుమతి లభించిన తర్వాత మాత్రమే ఫైనాన్సింగ్ చేయనున్నారని, రాబోయే వారాల్లో ఫైనాన్షియర్ల తుది జాబితా మారే అవకాశం ఉందని పేర్కొంది. హిందూజా గ్రూప్ కంపెనీ ఇండస్ఇండ్ ఇంటర్నేషనల్ హోల్డింగ్స్ లిమిటెడ్ (IIHL) సమర్పించిన రూ. 9,650 కోట్ల రిజల్యూషన్ ప్లాన్‌ను అనిల్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ క్యాపిటల్ రుణదాతలు దివాలా అండ్ దివాలా కోడ్ (IBC) నిబంధనల ప్రకారం ఆమోదించారని హిందూజా గ్రూప్ జూలై 3న తెలిపింది. చెల్లింపు డిఫాల్ట్‌లు , పాలనాపరమైన సమస్యల కారణంగా నవంబర్ 29, 2021న ఆర్బీఐ రిలయన్స్ క్యాపిటల్ బోర్డ్‌ను తన ఆధీనంలోకి తెచ్చుకుంది. బోర్డు టేకోవర్ తర్వాత, కంపెనీ కార్పొరేట్ ఇన్సాల్వెన్సీ రిజల్యూషన్ ప్రాసెస్ (CIRP)కి సంబంధించి నాగేశ్వరరావు వైని అడ్మినిస్ట్రేటర్‌గా నియమించింది. రిలయన్స్ క్యాపిటల్ మొదటి వేలం డిసెంబర్లో జరగ్గా, ఇందులో టోరెంట్ ఇన్వెస్ట్మెంట్స్ రూ. 8,640 కోట్ల ఆఫర్‌తో అత్యధిక బిడ్డర్‌గా, హిందుజా గ్రూప్ రూ. 8,110 కోట్ల ఆఫర్ ఇచ్చింది. కానీ 24 గంటల్లోనే 9,000 కోట్ల రూపాయలతో సవరించిన బిడ్‌ను సమర్పించింది . అయితే టోరెంట్ నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (NCLT)దీన్ని సవాలు చేసింది. ఇక తదుపరి వేలం ఏప్రిల్ 26న జరిగింది, 9,650 కోట్ల రూపాయలతో ఐఐహెచ్లో మాత్రమే వేలంలో పాల్గొంది. ఈప్లాన్ ఆమోదంకోసం ఈ వారంలోనే ఎన్సీఎల్టీని సంప్రదించనున్నారు.ఈ అంచనాలపై అటు రిలయన్స్ క్యాపిటల్‌గానీ, ఇటు హిందూజా గ్రూప్ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. -
రిలయన్స్ గ్యాస్‌కు టాప్ బిడ్డరుగా ఐవోసీ
న్యూఢిల్లీ: కేజీ–డీ6 గ్యాస్ విక్రయానికి సంబంధించి రిలయన్స్–బీపీ నిర్వహించిన వేలంలో వరుసగా రెండోసారి ప్రభుత్వ రంగ ఇండియన్ ఆయిల్ (ఐవోసీ) టాప్ బిడ్డరుగా నిల్చింది. మే నెలలో రోజుకు 5 మిలియన్ ప్రామాణిక ఘనపు మీటర్ల (ఎంసీఎండీ) గ్యాస్‌ను వేలం వేయగా 2.5 ఎంసీఎండీని దక్కించుకుంది. అంతకు ముందు ఏప్రిల్‌లో కూడా రిలయన్స్-బీపీ 6 ఎంసీఎండీ గ్యాస్‌ను వేలం వేయగా దాదాపు అందులో సగభాగాన్ని ఐవోసీ కొనుగోలు చేసింది. తాజాగా మూడేళ్ల పాటు సరఫరా కోసం గత నెల 19 నుంచి 23 వరకు కేజీ–డీ6 గ్యాస్ ఈ–వేలం నిర్వహించగా మొత్తం 16 సంస్థలు కొనుగోలు చేశాయి. యూనిట్ (ఎంబీటీయూ) ఒక్కింటికి సగటున దాదాపు 10 డాలర్ల చొప్పున రేటు పలికినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. -
అధ్యక్ష రేసులో ఆయన.. ట్విటర్ అతలాకుతలం
శాన్ ఫ్రాన్సిస్కో: ఆయన అగ్రరాజ్యం అధ్యక్ష రేసుపై ఆసక్తి ప్రకటించాడు. ఆ క్షణం నుంచే ప్రచారం ప్రారంభిస్తున్నానని తెలిపాడు. అయితే అందుకు ఆయన ఎంచుకున్న వేదిక.. అవతలి నుంచి సంభాషణ జరిపిన వ్యక్తి.. తదితర కారణాలతో సోషల్ మీడియా అతలాకుతలం అయ్యింది. ఫ్లోరిడా గవర్నర్ రాన్ డెశాంటిస్ అమెరికా అధ్యక్ష రేసులో ప్రచారం ప్రారంభించారు. అమెరికా పునర్వైభవం కోసం తాను పోటీ చేయబోతున్నట్లు ట్వీట్ చేశారాయన. సారథ్యం వహించే ధైర్యం కావాలి, గెలిచే శక్తి ఉండాలి అంటూ తన ప్రచార నినాదాన్ని సైతం ప్రకటించారాయన. అయితే.. ఆ సమయంలో ట్విటర్ క్రాష్ అయిపోవడం గమనార్హం. అంతకు ముందు ఆయన రిపబ్లికన్ పార్టీ తరుపున అధ్యక్ష బిడ్‌ను ధృవీకరిస్తూ ఫెడరల్ ఎన్నికల అధికారులకు నామినీ పత్రాలను సమర్పించారు. దీంతో రిపబ్లికన్ పార్టీ నుంచి డొనాల్డ్ ట్రంప్‌కు పోటీగా.. రాన్ సైతం బిడ్‌లో నిలిచినట్లయ్యింది. ట్విటర్ సీఈవో ఎలన్ మస్క్‌తో కలిసి లైవ్ ఆడియో ఛాట్‌లో పాల్గొన్నారు ఫ్లోరిడా గవర్నర్ రాన్ డెశాంటిస్. ఆరున్నర లక్షల మందికిపైగా ఆ సంభాషణను లైవ్‌లో విన్నారు. ఇంకేం.. ఆ సమయంలో ట్విటర్ పదే పదే క్రాష్ అయ్యింది. I’m running for president to lead our Great American Comeback. pic.twitter.com/YmkWkLaVDg — Ron DeSantis (@RonDeSantis) May 24, 2023 గతేడాది అక్టోబర్‌లో ఎలన్ మస్క్.. ట్విటర్‌ను టేకోవర్ చేశాడు. ఆ సమయంలోనే వేలమందిని తొలగించాడు. వాళ్లలో బగ్స్‌ను ఫిక్స్ చేసే ఇంజినీర్లు సైతం ఉండడం గమనార్హం. ఒకేసారి ట్విటర్‌పై లక్షల్లో యూజర్లు ఎగబడినప్పుడు.. ఆ హెవీ ట్రాఫిక్ కారణంగా ఇలాంటి అంతరాయం ఏర్పడుతుంది. ఈ ఏడాదిలో ట్విటర్ ఇలాంటి పరిస్థితి ఎదుర్కోవడం ఇది ఆరోసారి. Ron DeSantis fought against President Donald Trump's America First agenda while in Washington. pic.twitter.com/YytIGaSjyX — MAGA War Room (@MAGAIncWarRoom) May 24, 2023 అయితే.. ఈ ప్రభావం ట్విటర్‌ను ముందు ముందు దారుణంగా దెబ్బ తీయొచ్చని సాంకేతిక నిపుణులు చెబుతున్నారు. మరోవైపు అదే టైంలో.. #FailuretoLaunch #Crashed, #DeSaster లాంటి హ్యాష్‌ట్యాగ్‌లు ట్విటర్ విషయంలో ట్రెండ్ అవుతుండడం గమనార్హం. -
ఓఆర్ఆర్ లీజులో భారీ కుంభకోణం ఆరోపణలు.. పూర్తి వివరాలు ఇవిగో!
సాక్షి, హైదరాబాద్: ఔటర్ రింగ్‌రోడ్డు లీజు అంతా పారదర్శకమని, కేంద్రం ఆమోదంతో జాతీయ రహదారుల సంస్థ గుర్తించిన టోల్ ఆపరేట్ అండ్ ట్రాన్స్ఫర్ (టీఓటీ) విధానాన్ని పాటించినట్లు పురపాలకశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, హెచ్ఎండీఏ కమిషనర్ అర్వింద్‌కుమార్ తెలిపారు. 30 ఏళ్ల లీజుపై తాము నిర్ణయించిన బేస్‌ప్రైస్ కంటే ఐఆర్బీ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ డెవలపర్స్ లిమిటెడ్ సంస్థ రూ.7380 కోట్లతో ఎక్కువ మొత్తంలో బిడ్ చేసినట్లు వెల్లడించారు. పోటీలో ఉన్న నాలుగు సంస్థల్లో ఇదే ఎక్కువ మొత్తమని చెప్పారు. బేస్‌ప్రైస్ విషయంలో సాంకేతికంగానే గోప్యత పాటించినట్లు పేర్కొన్నారు. ఔటర్ లీజులో భారీ కుంభకోణం జరిగినట్లు ప్రతిపక్షాల నుంచి పెద్ద ఎత్తున ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో బుధవారం ఆయన విలేకరుల సమావేశంలో టెండర్ ప్రక్రియకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. ఆయన ఏం చెప్పారంటే.. బిడ్డింగ్‌లో లోపాల్లేవ్.. . ♦ జాతీయ రహదారుల సంస్థ ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 6 బండిల్స్‌లో సుమారు 1600 కిలోమీటర్లను టీఓటీ ప్రాతిపదికన 15 నుంచి 30 ఏళ్ల కాలపరిమితికి లీజుకు ఇచ్చిన పద్ధతినే ఔటర్ విషయంలో అనుసరించాం. రెవెన్యూ మ ల్టిఫుల్ పరంగా దేశంలోని రోడ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ప్రాజెక్టుల కోసం ఖరారు చేసిన వాటిలో ఔటర్ లీజు అత్యుత్తమ బిడ్. ♦ హైదరాబాద్ మహానగరం చుట్టూ 8 లేన్లతో చేపట్టిన ఔటర్ రింగ్‌రోడ్డు నిర్మాణం 2006లో ప్రారంభమైంది. 2012 నాటికి 79.45 కిలోమీటర్లు, 2018 నాటికి 158 కి.మీ పూర్తి చేశారు. 2012 నుంచే ఔటర్‌పై టోల్ వసూలు మొదలైంది. ఆ ఏడాది రూ.11.11 కోట్లు ఆదాయం లభించగా 2018 నాటికి రూ.340 కోట్లు, 2022 నాటికి రూ.542 కోట్ల చొప్పున ఆదాయం లభించింది. జాతీయ రహదారుల సంస్థ 2008లో విధించిన నిబంధనల మేరకు టోల్ రుసుము నిర్ణయించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు టోల్ రుసుముపై అదే విధానాన్ని అనుసరిస్తున్నాం. ♦ కేంద్ర క్యాబినెట్ సబ్ కమిటీ ఆమోదించిన టీఓటీ ప్రకారం ఔటర్ రింగ్‌రోడ్డును 30 ఏళ్ల పాటు లీజుకు ఇచ్చేందుకు గతేడాది ఆగస్టు 11న రాష్ట్ర మంత్రివర్గ సమావేశం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు గతేడాది నవంబర్ 9న అంతర్జాతీయ సంస్థల నుంచి హెచ్ఎండీఏ టెండర్లను ఆహ్వానించింది. ఈ ఏడాది మార్చి 31 నాటికి 11 బిడ్డర్లు ఆసక్తి ప్రదర్శించారు. బిడ్డింగ్‌లో ఎలాంటి లోపాలకు తావులేకుండా పారదర్శకతను పాటించేందుకు 142 రోజుల వ్యవధి ఇచ్చాం. పదేళ్లకోసారి సమీక్ష... ♦ ఐఆర్బీకి 30 ఏళ్ల పాటు లీజుకు ఇచ్చినప్పటికీ ప్రతి పదేళ్లకు ఒకసారి లీజును సమీక్షిస్తారు. రోడ్డు మరమ్మతులు, నిర్వహణ, టోల్ రుసుము, సిబ్బంది జీతభత్యాలు, ఆదాయ,వ్యయాలు, తదితర అంశాలన్నింటిని పరిగణనలోకి తీసుకొని ఈ సమీక్షను నిర్వహిస్తారు. ♦ టోల్ పెంపు పైన ఐఆర్బీ చేసే ప్రతిపాదనలు జాతీయ రహదారుల సంస్థ నిబంధనలకు లోబడి ఉంటాయి. హెచ్ఎండీఏ ఆమోదంతోనే అవి అమలవుతాయి. ఔటర్‌పైన పచ్చదనం నిర్వహణ పూర్తిగా హెచ్ఎండీఏ పర్యవేక్షిస్తుంది. ఇందుకయ్యే ఖర్చును ఐఆర్బీ చెల్లించవలసి ఉంటుంది. ప్రస్తుతం ఔటర్‌పైన ఇంటర్‌చేంజ్‌ల వద్ద ఉన్న ట్రామాకేర్ సెంటర్లను ఐఆర్బీ నిర్వహించనుంది. ఐఆర్బీ సంస్థకు లీజు ఆమోదపత్రం అందజేశాం. 120 రోజుల్లోపు ఐఆర్బీ బిడ్డింగ్ మొత్తాన్ని (రూ.7380కోట్లు) ఏకమొత్తంలో చెల్లించిన అనంతరమే ఔటర్‌ను అప్పగిస్తాం. అప్పటి వరకు ప్రస్తుతం ఉన్న ఈగిల్ ఇన్ఫ్రా సంస్థే టోల్ వసూలు చేస్తుంది. ఎవరెంత బిడ్ వేశారంటే.. ♦ మొత్తం ఈ బిడ్డింగ్ ప్రక్రియలో 11 సంస్థల్లో చివరకు నాలుగు మాత్రమే అర్హత సాధించాయి. ‘ప్రస్తుతం టోల్ వసూలు చేస్తున్న ఈగల్ ఇన్ఫ్రా సంస్థ 30 ఏళ్ల ఔటర్ లీజుపై రూ.5634 కోట్లు, గవార్ కన్స్ట్రక్షన్స్ రూ.6767 కోట్లు, దినేష్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ రూ.7007 కోట్లు చొప్పున బిడ్ వేశాయి. ఐఆర్బీ అత్యధికంగా రూ. 7380 కోట్లతో ముందుకు వచ్చింది. తాము నిర్ణయించిన బేస్ ప్రైస్ కంటే ఇది ఎక్కువగా ఉండడంతో ఐఆర్బీ హెచ్–1 కింద లీజు పొందింది. ♦ బేస్ ప్రైస్ ముందే నిర్ణయించినప్పటికీ ఎన్హెచ్ఏఐ నిబంధనలతో పాటు ఆశించిన దానికంటే ఎక్కువ ఆదాయాన్ని పొందే లక్ష్యంతో బేస్ ప్రైస్‌ను గోప్యంగా ఉంచాం. ఓఆర్ఆర్పై వస్తున్న సుమారు రూ.541 కోట్ల ఆదాయాన్ని రెవెన్యూ మ ల్టిపుల్ ఫార్ములా (ఆర్‌ఎంఎఫ్) ప్రకారం లీజు మొత్తంతో హెచ్చించగా 30 ఏళ్లలో అది రూ.1.30 లక్షల కోట్లకు సమానమవుతుందన్నారు. ఔటర్ బిడ్డింగ్‌లో ఆర్‌ఎంఎఫ్ 13.64 వరకు వచ్చింది. టీఓటీ విధానంలో ఇది ఉత్తమ ఆర్‌ఎంఎఫ్. ప్రస్తుతం ఔటర్‌పై ప్రతి రోజు సగటున 1.6 లక్షల వాహనాలు రాకపోకలు సాగిస్తుండగా, రూ.1.48 కోట్ల వరకు ఆదాయం లభిస్తోంది. -
ఎయిర్పోర్ట్ మెట్రోపై ‘విదేశీ’ ఆసక్తి.. జనరల్ కన్సల్టెంట్‌దే కీలక పాత్ర
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఎయిర్పోర్ట్ ఎక్స్‌ప్రెస్ మెట్రో ప్రాజెక్టులో పాలుపంచుకునేందుకు పలు విదేశీ కంపెనీలు ఆసక్తి చూపుతున్నాయి. ప్రాజెక్టు నిర్మాణంలో అత్యంత కీలక పాత్ర పోషించే జనరల్ కన్సల్టెంట్ నియామకానికి సంబంధించి నిర్వహించిన అర్హత అభ్యర్థన (రిక్వెస్ట్ ఫర్ క్వాలిఫికేషన్)కు పలు విదేశీ సంస్థల నుంచి పలు బిడ్లు దాఖలయ్యాయి. ఈ జాబితాలో ఫ్రాన్స్, జర్మనీ, జపాన్, స్పెయిన్, సౌత్ కొరియా, స్విట్జర్లాండ్ తదితర దేశాలకు చెందిన కంపెనీలున్నాయి. మొత్తంగా 13 ప్రతిష్టాత్మక దేశ, విదేశీ సంస్థలు అయిదు కన్సార్షియంలుగా ఏర్పడి ప్రీ క్వాలిఫికేషన్ బిడ్లు దాఖలు చేసినట్లు హైదరాబాద్ ఎయిర్పోర్ట్ మెట్రో లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. ఆయా కన్సార్షియంలు దాఖలు చేసిన బిడ్లను మూల్యాంకన ప్రక్రియను ఈ నెలాఖరుకు పూర్తి చేస్తామన్నారు. చదవండి: కరోనా కొత్త వేరియంట్‌పై తెలంగాణ ప్రభుత్వం అలర్ట్ బిడ్ దాఖలు చేసిన కన్షార్షియంలు ఇవే.. ►సిస్ట్రా (ఫ్రాన్స్), ఆర్ఐటీఈఎస్ (ఇండియా, డీబీ ఇంజినీరింగ్ అండ్ కన్సల్టింగ్(జర్మనీ). ►ఆయేసా ఇంజనెర్సియా ఆర్కెటెక్ట్రా (స్పెయిన్),నిప్పాన్ కోయి (జపాన్), ఆర్వీ అసోసియేట్స్ (ఇండియా). ►టెక్నికా వై ప్రోయెక్టోస్ (టీవైపీఎస్ఏ–స్పెయిన్), పీనీ గ్రూప్ (స్విట్జర్లాండ్). ►ఏఈకామ్ ఇండియా, ఈజిస్ రెయిల్(ఫ్రాన్స్), ఈజిస్ ఇండియా. ►కన్సల్టింగ్ ఇంజినీర్స్ గ్రూప్ (ఇండియా), కొరియా నేషనల్ రైల్వే (సౌత్ కొరియా). జనరల్ కన్సల్టెంట్ నిర్వహించాల్సిన విధులివే.. ►హైదరాబాద్ ఎయిర్పోర్ట్ మెట్రో లిమిటెడ్‌కు అన్ని సాంకేతిక, ప్రాజెక్ట్ నిర్వహణ సంబంధిత విధుల్లో జనరల్ కన్సల్టెంట్ ఏజెన్సీ సహాయం చేస్తుంది. మూడేళ్ల కాల వ్యవధిలో ఈ కింది విధులు నిర్వహించాల్సిఉంటుంది. ►సమగ్ర ప్రాజెక్ట్ నివేదికను సమీక్షిస్తుంది. టెండర్ డాక్యుమెంటేషన్ ,మూల్యాంకనం చేపడుతుంది. డిజైన్ మేనేజ్మెంట్. వివిధ రకాల కాంట్రాక్టర్లు, సరఫరాదారులు సమర్పించిన డిజైన్లు,డ్రాయింగ్ల ప్రూఫ్ చెక్ చేస్తుంది. దస్తావేజు నియంత్రణ. ►ప్రాజెక్ట్ ప్రణాళిక. ఇంటర్ఫేస్ నిర్వహణ. నిర్మాణ నిర్వహణ. నాణ్యత హామీ, నాణ్యత నియంత్రణ. ఆరోగ్యం, భద్రత నిర్వహణ, కాంట్రాక్ట్ అడ్మిని్రస్టేషన్, పునరుత్పాదక శక్తి వ్యవస్థ, లోపాలు సరిదిద్దడంతో సహా అంగీకార ప్రమాణాలు సరిపోలుస్తుంది. ఓఅండ్ఎం ప్రణాళిక. హెచ్ఏఎంఎల్, మెట్రో సిబ్బందికి శిక్షణ. ప్రాజెక్ట్ కోసం సెక్యూరిటీ ఆడిట్ మొదలైన విధులు నిర్వహించాల్సి ఉంటుంది. -
ఆకాశమే హద్దురా.. అక్కడి ప్లాటు ధరలకు రెక్కలు.. ఏకంగా 5 రెట్లు పెరగడంతో..
ముంబై: రియల్ ఎస్టేట్ రంగం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇందులో ప్రాపర్టీ డిమాండ్ బట్టి కోట్లు సంపాదిస్తారు, ఒక్కో సారి కొనేవాళ్లు లేక అదే స్థాయిలో నష్టపోతూ ఉంటారు.అయితే ఇటీవల ప్రజలు సొంత ఇళ్లు లేదా ఫ్లాట్ కొనుగోలుపై ఆసక్తి చూపడంతో రియల్టర్ల పంట పండుతోంది. తాజాగా నేవీ ముంబైలోని ఫ్లాట్ల ధరలకు రెక్కలు రావడంతో అవి ఒక్క సారిగా ప్రారంభ ధర కంటే 5 రేటు పెరిగి అందరనీ ఆశ్చరపరిచింది. బాబోయ్.. ప్లాటు ధరలకు రెక్కలు సిటీ అండ్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (సిడ్కో) నవీ ముంబైలోని ఓ ప్రాంతానికి సంబంధించిన 28 ప్లాట్లను బ్లాక్‌లో ఉంచింది. అయితే ఊహించని విధంగా ఆ ప్లాటు ఒక చదరపు మీటరుకు రూ. 5.54 లక్షలు వసూలు చేసింది. ఇ-వేలం ఈ ఇరవై ఎనిమిది ప్లాట్లు గాను సిడ్కో దాదాపు రూ.1,365 కోట్లను ఆర్జించనుంది. గతంలో దీని ప్రారంభ ధర రూ.1.14 లక్షలుగా నిర్ణయించగా ప్రస్తుతం రయ్ అంటూ దూసుకుపోయి ఐదు రెట్లు ఎక్కువగా పలుకుతోంది. సెక్టార్ 20, పామ్ బీచ్ రోడ్, సన్పాద వద్ద ఉన్న సుమారు 1.3 ఎకరాల ప్లాట్ (5,526 చదరపు మీ) రూ. 306 కోట్లు బిడ్‌ను దక్కించుకుంది. ఈ బిడ్‌ను గెలుచుకున్న బిల్డర్ డీపీవీజి వెంచర్స్‌కి చెందిన యజమానులు మాట్లాడుతూ.. పామ్ బీచ్ రోడ్లో సముద్రానికి ఎదురుగా ఉన్న ప్రధాన ప్లాట్లలో ఇది చివరిది. అందుకే ఇది రికార్డు ధర పలికిందన్నారు. చదవండి: కేంద్రం కీలక నిర్ణయం.. వాటికి చెక్, ఈ–కామర్స్ కంపెనీలు ఇలా చేయాల్సిందే! -
సై అంటై సై.. రెండో రోజు బిడ్లు@ రూ.1.49 లక్షల కోట్లు
న్యూఢిల్లీ: అత్యంత వేగవంతమైన 5జీ టెలికం సేవలకు అవసరమైన స్పెక్ట్రంను కేటాయించేందుకు నిర్వహిస్తున్న వేలంలో టెల్కోలు గట్టిగా పోటీపడుతున్నాయి. రెండో రోజు (బుధవారం) ముగిసేసరికి తొమ్మిది రౌండ్లు పూర్తి కాగా రూ. 1.49 లక్షల కోట్ల విలువ చేసే బిడ్లు వచ్చాయి. తొలి రోజున నాలుగు రౌండ్లు నిర్వహించగా, టెల్కోలు రూ. 1.45 లక్షల కోట్ల బిడ్లను దాఖలు చేశాయి. రెండో రోజైన బుధవారం మరో అయిదు రౌండ్లు జరిగాయి. వేలం ప్రక్రియ మూడో రోజున (గురువారం) కూడా కొనసాగనున్నట్లు టెలికం శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. చదవండి: America Federal Reserve Bank: ప్చ్.. మళ్లీ పెంచారు, ఏడాది చివరికల్లా మరో షాక్! -
5జీ వేలం: కంపెనీలు తగ్గేదేలే.. రికార్డ్ బ్రేక్, తొలి రోజు రూ.1.45లక్షల కోట్లు!
న్యూఢిల్లీ: వేగవంతమైన 5జీ టెలికం సర్వీసులకు సంబంధించి మంగళవారం ప్రారంభమైన స్పెక్ట్రం వేలానికి భారీ స్పందన లభించింది. తొలి రోజున నాలుగు రౌండ్లలో, నాలుగు కంపెనీలు ఏకంగా రూ. 1.45 లక్షల కోట్ల బిడ్లు వేశాయి. నేడు (బుధవారం) కూడా వేలం కొనసాగనుంది. టెలికం దిగ్గజాలు రిలయన్స్ జియో, భారతి ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియాలతో పాటు అదానీ ఎంటర్ప్రైజెస్ కూడా వేలంలో కూడా ‘చురుగ్గా‘ పాల్గొన్నట్లు టెలికం శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. అంచనాలను దాటి, 2015 రికార్డులను కూడా అధిగమించి తొలి రోజే ఏకంగా రూ. 1.45 లక్షల కోట్ల బిడ్లు దాఖలైనట్లు పేర్కొన్నారు. ఆగస్టు 14 కల్లా స్పెక్ట్రంను కేటాయించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, సెప్టెంబర్ నాటికి 5జీ సేవలు ప్రారంభమయ్యే అవకాశం ఉందన్నారు. మధ్య, పైస్థాయి బ్యాండ్లకు బిడ్లు.. గత వేలంలో అమ్ముడు కాకుండా మిగిలిపోయిన 700 మెగాహెట్జ్ బ్యాండ్‌కు కూడా ఈసారి బిడ్లు వచ్చినట్లు మంత్రి తెలిపారు. మధ్య స్థాయి 3300 మెగాహెట్జ్, పైస్థాయి 26 గిగాహెట్జ్ బ్యాండ్లపై టెల్కోల నుంచి ఎక్కువగా ఆసక్తి వ్యక్తమైనట్లు వివరించారు. 4జీ సర్వీసులతో పోలిస్తే 5జీ టెలికం సేవలు అత్యంత వేగవంతంగా ఉంటాయి. వీటితో అత్యంత నాణ్యమైన వీడియోలు, సినిమాలను కేవలం సెకన్ల వ్యవధిలోనే డౌన్లోడ్ చేసుకోవచ్చు. టెలీ మెడిసిన్, అడ్వాన్స్డ్ మొబైల్ క్లౌడ్ గేమింగ్ మొదలైన విభాగాల్లో 5జీ సేవలు ఉపయోగకరంగా ఉండనున్నాయి. ప్రస్తుతం 600 మెగాహెట్జ్ మొదలుకుని 26 గిగాహెట్జ్ వరకూ వివిధ ఫ్రీక్వెన్సీల్లో స్పెక్ట్రంను వేలం వేస్తున్నారు. చదవండి: RBI: క్లెయిమ్ చేయని నిధులు రూ.48వేల కోట్లు.. వీటిని ఏం చేస్తారంటే! -
అమ్మకానికి మరో ప్రభుత్వ సంస్థ, కేంద్రం గ్రీన్ సిగ్నల్!
2021 ఆర్ధిక సంవత్సరంలో ఎయిరిండియాను ప్రైవేట్ పరం చేసిన కేంద్రం.. ఇప్పుడు మరో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థను అమ్మేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వ రంగ హెలికాప్టర్ సర్వీస్ ప్రొవైడర్ పవన్ హన్స్ లిమిటెడ్ ను స్టార్ 9 మొబిలిటీ ప్రైవేట్ లిమిటెడ్‌కు అమ్మేందుకు సిద్ధమైంది. పవన్ హన్స్లో కేంద్రప్రభుత్వానికి 51 శాతం వాటా ఉండగా, ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్‌కు 49 శాతం మేర ఇందులో వాటాలు ఉన్నాయి. అయితే వరుస నష్టాలతో కేంద్రం పవన్ హన్స్లో వాటాను ఉపసంహరించుకునేందుకు సిద్ధం కాగా..ఇప్పటికే ఓఎన్జీసీ సైతం తన వాటాను కేంద్రం నిర్ణయించిన వాటాకే అమ్మేందుకు సిద్ధమైంది. తాజాగా ఈ అమ్మకానికి సంబంధించి ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ సభ్యులు,కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, నిర్మలా సీతారామన్, జ్యోతిరాదిత్య ఆమోదం తెలిపారు. కాగా 2019-20లో పవన్ హాన్స్ రూ.28.08 కోట్లు, 2018-19లో రూ.69.2 కోట్ల నష్టాన్ని నమోదు చేసింది. 2020-21, 2021-22లో రూ.100 కోట్ల నికర నష్టాన్ని చవిచూడాల్సి వచ్చింది. అందుకే కేంద్రం పవన్ హాన్స్‌ను ప్రైవేట్ పరం చేసేందుకు సిద్ధమైనట్లు ఆర్ధిక వేత్తలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. చదవండి👉బీపీసీఎల్ ప్రయివేటైజేషన్, కొత్త దారిలో అమ్మకానికి సన్నాహాలు! -
బ్రిటన్ కంపెనీపై ముఖేష్ అంబానీ కన్ను! అదే నిజమైతే!
లండన్: కొన్నాళ్ల క్రితం ఆటబొమ్మల రిటైల్ సంస్థ హామ్లీస్‌ను కొనుగోలు చేసిన దేశీ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్) తాజాగా మరో బ్రిటన్ కంపెనీపై కన్నేసింది. ఫార్మసీ చెయిన్ ’బూట్స్’ను కొనుగోలు చేయాలని యోచిస్తోంది. అమెరికన్ ప్రైవేట్ ఈక్విటీ సంస్థ అపోలో గ్లోబల్ మేనేజ్మెంట్తో కలిసి సంయుక్తంగా బిడ్ వేయాలని ఆర్ఐఎల్ భావిస్తున్నట్లు బ్రిటన్ వార్తాపత్రిక ది ఫైనాన్షియల్ టైమ్స్ ఒక కథనం ప్రచురించింది. ఈ డీల్ సాకారమైతే.. బూట్స్ కొత్తగా భారత్, మధ్య ప్రాచ్య, ఆగ్నేయాసియా మార్కెట్లలోకి కూడా కార్యకలాపాలు విస్తరించేందుకు వీలుంటుందని పేర్కొంది. బ్రిటన్‌లో పేరొందిన ఫార్మసీ చెయిన్ అయిన బూట్స్‌కు అమెరికాకు చెందిన వాల్‌గ్రీన్స్ బూట్స్ అలయన్స్ మాతృ సంస్థ. తమ దేశంలో హెల్త్‌కేర్ వ్యాపారంపైనే పూర్తిగా దృష్టి పెట్టాలనే ఉద్దేశంతో బూట్స్‌ను వాల్గ్రీన్ బూట్స్ గతేడాది డిసెంబర్లో అమ్మకానికి పెట్టింది. బిడ్ల దాఖలుకు మే 16 ఆఖరు రోజు. బూట్స్‌కు బ్రిటన్‌లో 2,000 పైచిలుకు స్టోర్స్ ఉన్నాయి -
రోగితో నర్సు చాటింగ్.. రూ. 20 లక్షలు ఇవ్వమంటూ బ్లాక్మెయిల్!
ఇంతవరకు మనం చాలారకాలు దోపిడీల గురించి విన్నాం. అంతేందుకు కార్పొరేట్ ఆసుపత్రులు ఎలా రోగుల పై పెద్ద మొత్తంలో బిల్లు వేసి ముక్కు పిండి డబ్బులు వసూలు చేస్తున్నారో కూడా మనకు తెలుసు. అయితే ఇక్కడొక నర్సు మాత్రం సరికొత్త విధానంలో రోగిని దోచుకునేందుకు యత్నించి జైలుపాలైంది. (చదవండి: రావణుడి వేషధారణలో పాల ప్యాకెట్ పట్టుకొని..) అసలు విషయలోకెళ్లితే...పోలీసుల కథనం ప్రకారం...పుణేకి చెందిన ఒక డయాలసిస్ రోగి చికిత్స నిమిత్తం డయాలసిస్ సెంటర్‌కు వెళ్లేవాడు. ఈ క్రమంలో ఆ డయాలసిస్ సెంటర్లోని నర్సుతో పరిచయం ఏర్పడింది. అయితే ఆ తర్వాత వాళ్లిద్దరూ చాట్లు చేసుకోవడం మొదలుపెట్టారు. ఈ మేరకు ఓ రోజు ఆమె నువ్వు గనుక రూ. 20 లక్షలు ఇవ్వకపోతే మన చాటింగ్ మెసేజ్‌లను పబ్లిక్‌లో పెట్టడమే కాక ఒక మహిళను మోసం చేశావంటూ సోషల్ మీడియాలో పెట్టి నీ పరువు తీస్తాను అని బెదిరించడం మొదలు పెట్టింది. దీంతో సదరు వ్యక్తి తమకు ఫిర్యాదు చేశాడని పోలీసులు తెలిపారు. పోలీసుల ముందస్తు పథకం ప్రకారం పోలీసులు డబ్బులిస్తానని నర్సుకి చెప్పమని ఫిర్యాదు దారుడికే చెప్పారు. అలా ఆ నర్సు డబ్బులు వసూలు చేసేందుకు పుణేలోని రహత్నీలోని శివర్ చౌక్ వద్దకు రాగా వకాడ్ పోలీసులు ఆమెను అరెస్టు చేశారు. (చదవండి: ఆ సమయంలో కూడా సేవలందించిన సూపర్ ఉమెన్లు) -
ఎయిర్ ఇండియాను దక్కించుకున్న టాటా సన్స్
ఎయిర్ ఇండియా సంస్థ టాటా సన్స్ పరమైంది. పెట్టుబడుల ఉపసంహారణలో భాగంగా ఎయిర్ ఇండియాను కేంద్రం అమ్మకానికి పెట్టగా స్పైస్ జెట్‌తో పాటు ఎయిర్ ఇండియా కూడా బిడ్‌ను దాఖలు చేసింది. రెండు బిడ్లను పరిశీలించిన కేంద్ర మంత్రుల బృందం చివరకు టాటా సన్స్‌కే మొగ్గు చూపింది. ఎయిర్ ఇండియాను సొంతం చేసుకునేందుకు టాటా సన్స్ రూ. 18,000 కోట్లను వెచ్చించనుంది. ఈ మేరకు ప్రభుత్వ ఆస్తుల నిర్వహణ విభాగం (దీపమ్) కార్యదర్శి తహిన్ కాంత పాండే అధికారికంగా ప్రకటించారు. ఇదీ ప్రస్థానం 1946లో టాటా సన్స్ ఏవియేషన్ విభాగం ఎయిరిండియాగా లిస్టయ్యింది. 1948లో యూరప్‌కు విమాన సేవలతో ఎయిరిండియా ఇంటర్నేషనల్ ఏర్పాటైంది. దేశీయంగా ప్రభుత్వ–ప్రైవేట్ భాగస్వామ్యానికి ఈ ఇంటర్నేషనల్ సర్వీసే నాం ది. అప్పట్లో ఈ సంస్థలో ప్రభుత్వానికి 49 శాతం, టాటాలకు 25 శాతం, మిగతా వాటా పబ్లిక్ దగ్గర ఉండేది. 1953లో ఎయిరిండియాను కేంద్రం జాతీయం చేసింది. 1990లు, 2000ల దాకా ఎయిరిండియా ఆధిపత్యం కొ నసాగినా ఆ తర్వాత ప్రైవేట్ సంస్థలు కూడా రంగంలోకి దిగడం మొదలయ్యాక క్రమంగా ప్రాభవం తగ్గడం మొదలైంది. 2017 నుంచి అమ్మకానికి ఎయిరిండియా 2007 నుంచి నష్టాల్లోనే కొనసాగుతోంది. భారీ రుణభారంలో కూరుకుపోయిన ఎయిరిండియాను ప్రైవేటీకరించేందుకు 2017 నుంచే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అప్పట్లో కంపెనీని కొనుగోలు చేసేందుకు ఇన్వెస్టర్లు ఎవరూ ఆసక్తి చూపకపోవడంతో.. కేంద్రం గతేడాది అక్టోబర్‌లో ఆసక్తి వ్యక్తీకరణ పత్రాల (ఈవోఐ) నిబంధనలను సడలించింది. పోటీలో ఇద్దరు ఎయిర్ ఇండియా కొనుగోలుకు ఆసక్తి ఉన్న కంపెనీలు బిడ్ దాఖలు చేసేందుకు రెండోసారి కేంద్రం బిడ్లను ఆహ్వానించింది. 2021 సెప్టెంబరు 15 చివరి తేదీగా నిర్ణయించింది. ఈసారి టాటా సన్స్‌తో పాటు స్పైస్ జెట్ సంస్థలు బిడ్లు దాఖలు చేశాయి. ఇందులో టాటా సన్స్ అత్యధికంగా రూ. 18,000 కోట్లతో బిడ్ సమర్పించింది. 68 ఏళ్ల తర్వాత ఎయిరిండియా ప్రస్థానం .. 1932లో టాటా ఎయిర్‌లైన్స్ గా ప్రారంభమైంది. జహంగీర్ రతన్జీ దాదాభాయ్ (జేఆర్డీ) దీన్ని నెలకొల్పారు. తొలినాళ్లలో దీన్ని బాంబే, కరాచీ మధ్య పోస్టల్ సర్వీసులకు ఉపయోగించారు. ఆ తర్వాత ప్రయాణికులకు విమాన సర్వీసులను ప్రారంభించాక కంపెనీ చాలా వేగంగా ప్రాచుర్యంలోకి వచ్చింది. స్వాతంత్రం వచ్చాక భారత ప్రభుత్వం దీన్ని స్వాధీనం చేసుకుంది. ఎయిర్ ఇండియాకు చెందిన మహారాజా మస్కట్‌తో ఎంతో ప్రాచుర్యం పొందింది. 2007 వరకు లాభాలో ఉన్న సంస్థ ఆ తర్వాత నష్టాలకే కేరాఫ్ అడ్రస్‌గా మారింది. దీంతో అమ్మేయాలని కేంద్రం నిర్ణయించింది. చివరకు 68 ఏళ్ల తర్వాత తిరిగి టాటా గూటికే ఎయిర్ ఇండియా చేరింది. ప్రైవేటు పరం అయ్యేనాటికి ఎయిరిండియా రుణం రూ. 60,074 కోట్లుగా ఉంది. చదవండి : అమ్మకానికి కసరత్తు, అప్పుల ఊబిలో ఎయిర్ ఇండియా -
అక్టోబర్ 17న రెండు ఐపీఎల్ కొత్త జట్లకు వేలం?
ముంబై: ఐపీఎల్ 2022లో రెండు కొత్త జట్లు రాబోతున్నాయనే విషయం తెలిసిందే. ఇప్పటికే లీగ్ పాలక మండలి రెండు కొత్త ఫ్రాంచైజీలుకు టెండర్లు జారీ చేసింది. అక్టోబర్ 5న ఆ గడువు ముగుస్తుంది. ఈ క్రమంలో అక్టోబర్ 17 న కొత్తగా వచ్చే రెండు ఫ్రాంచైజీల కోసం వేలం నిర్వహించడానికి బీసీసీఐ యోచిస్తున్నట్లు సమాచారం. అక్టోబర్ 17 ఐసీసీ టీ 20 వరల్డ్ కప్ ప్రారంభమయ్యే రోజు కాబట్టి, మిడిల్ ఈస్ట్ నగరాల్లో ఒకటైన దుబాయ్ లేదా మస్కట్‌లో బిడ్డింగ్ జరిగే అవకాశాలు ఉన్నాయి. కాగా గువాహటి, రాంచీ, కటక్, అహ్మదాబాద్, లక్నో, ధర్మశాల నగరాలను షార్ట్ లిస్ట్ చేశారు. వీటిల్లో నుంచి టెండర్లు వచ్చే రెండు నగరాలను ఎంపిక చేస్తారు. అయితే రెండు ఫ్రాంచైజీలకు గాను ఒక్కో దానికి కనీసం రూ.2000 కోట్లను బేస్ ప్రైస్‌గా నిర్ణయించారు. దీంతో మొత్తం జట్ల సంఖ్య 10కి చేరుకోనుంది. చదవండి: MS Dhoni: పాక్‌పై బౌల్ అవుట్ విజయానికి 14 ఏళ్లు.. ధోని వ్యూహాలు ఫలించడంతో.. -
ప్రైవేట్ ట్రైన్స్, రూ.30వేల కోట్ల టెండర్లను రిజెక్ట్ చేసిన కేంద్రం
ఇండియన్ రైల్వే ప్రైవేట్ రైళ్ల నిర్వహణకు మరింత సమయం పట్టనున్నట్లు తెలుస్తోంది. ప్రైవేట్ రైళ్ల నిర్వహణపై రూ.30వేల కోట్ల టెండర్లు నిర్వహించి.. వాటిని కేంద్ర రైల్వే శాఖ రిజెక్ట్ చేసినట్లు తెలుస్తోంది. రైల్వే శాఖ నిర్వహించిన టెండర్లలో ప్రైవేట్ రైలు సర్వీసుల్ని అందించేందుకు జీఎంఆర్‌హైవే లిమిటెడ్, ఐఆర్ సీటీసీ, ఐఆర్బీ ఇన్ఫ్రా, క్యూబ్ ఐవే, సీఏఎఫ్ ఇండియా, మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో పాటు పలు కంపెనీలు పోటీ పడ్డాయి. వీటిలో ఐఆర్సీటీసీ, మేఘా ఇంజనీరింగ్ టెండర్లపై చర్చలు జరుపుతున్నట్లు,మిగిలిన కంపెనీల టెండర్లను రిజెక్ట్ చేసినట్లు సమాచారం. మళ్లీ కొత్త కంపెనీల నుంచి టెండర్లను ఆహ్వానించగా.. టెండర్లను కేంద్రం ఎందుకు రిజెక్ట్ చేసిందనే అంశంపై ఇన్ఫ్రాస్ట్రక్చర్ నిపుణుడు మనీష్ అగర్వాల్ స్పందించారు. సామాన్యుడిపై భారం తగ్గించేందుకు కేంద్రం టెండర్లను తక్కువ ధరకే పాడేలా ప్రైవేట్ సంస్థలపై ఒత్తిడి తెస్తుందని అన్నారు. రైల్వేశాఖ న్యాయమైన నియంత్రణకు ప్రాధాన్యత ఇస్తున్నప్పటికీ, ప్రాజెక్టుకు ఆర్థిక సహాయం అందించడానికి ఒప్పంద నిబద్ధత ఉండాలి' అని అగర్వాల్ తెలిపారు. కాగా, గతేడాది జులైలో కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ మాట్లాడుతూ.. ఇండియన్ రైల్వే ప్రైవేట్ రైళ్లను నడిపేందుకు సిద్ధంగా ఉందని, మొదటి దశలో 2023 నాటికి 12 ప్రైవేట్ రైళ్ల సర్వీసుల్ని ప్రారంభించనున్నట్లు తెలిపారు. 151 ప్రైవేట్ రైలు సర్వీసులు 2027 నాటికి మొత్తం దశలవారీగా దేశంలోని 109 రూట్లల్లో ప్రయాణికులకు సేవలు అందిస్తాయన్నారు. ఇందుకోసం మొత్తం రూ.30,000 కోట్ల ప్రైవేట్ సంస్థల్ని టెండర్ల కోసం ఆహ్వనించనున్నట్లు వెల్లడించిన విషయం తెలిసిందే. -
Reliance : అమ్మకానికి అనిల్ అంబానీ ఆస్తులు
న్యూఢిల్లీ: రుణ భారంతో కుదేలైన అనిల్ అంబానీ గ్రూప్ సంస్థ రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ కొనుగోలుకి ఆథమ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గరిష్ట బిడ్డర్‌గా నిలిచింది. రూ. 2,900 కోట్ల ఆఫర్‌తో బిడ్‌ను వేసినట్లు సంబంధిత వర్గాలు తెలియజేశాయి. ఆథమ్ నుంచి ముందస్తు చెలింపుగా 90 శాతం నిధులు లభిచనుండగా.. మరో రూ. 300 కోట్లు ఏడాదిలోగా బీవోబీ పొందనున్నట్లు వివరించాయి. బిడ్డింగ్‌కు వారాంతాన గడువు ముగిసింది. ఈ ప్రక్రియ సజావుగా పూర్తయితే రిలయన్స్ హోమ్ ఫైనాన్స్‌కు రుణాలిచ్చిన బ్యాంక్ ఆఫ్ బరోడా(బీవోబీ) రూ. 2,587 కోట్లు అందుకునే వీలున్నట్లు పేర్కొన్నాయి. రేసులో ఆథమ్ దేశీ ఎన్బీఎఫ్సీ ఆథమ్ రేసులో తొలి ర్యాంకులో నిలిచినట్లు తెలుస్తోంది. 15 ఏళ్లుగా కార్యకలాపాలు సాగిస్తున్న ఆథమ్ నెట్‌వర్త్ రూ. 1,500 కోట్లుగా నమోదైంది. రుణ పరిష్కార ప్రణాళికలో భాగంగా ఆథమ్ వేసిన బిడ్ అత్యధిక నికర ప్రస్తుత విలువ(ఎన్పీవీ)ను కలిగి ఉన్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. దీంతో అత్యధిక శాతం రుణదాతలు ఆథమ్కు ఓటు వేసినట్లు వెల్లడించాయి. ఇతర సంస్థలూ రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ కొనుగోలుకి ఆథమ్ కాకుండా.. ఏఆర్ఈఎస్ ఎస్ఎస్జీ, అసెట్స్కేర్– రీకన్స్ట్రక్షన్ ఎంటర్ప్రైజ్, ఏఆర్సీఎల్తో కలసి ఎవెన్యూ క్యాపిటల్, క్యాప్రి గ్లోబల్ క్యాపిటల్ బిడ్ వేసినట్లు తెలుస్తోంది. చదవండి: Reliance AGM: లక్ష కోట్లతో భారీ ఒప్పందం..! -
నేడు బీపీసీఎల్ బిడ్ల పరిశీలన!
న్యూఢిల్లీ: బీపీసీఎల్ ప్రైవేటీకరణలో మరో అడుగు ముందుకు పడింది. ఈ కంపెనీలో తనకున్న 52.98 శాతం వాటాను కేంద్రం విక్రయించనున్న విషయం తెలిసిందే. ఈ వాటా కొనుగోలు కోసం దరఖాస్తు చేసిన కంపెనీల బిడ్లను నేడు (మంగళవారం) అత్యున్నత సంఘం మదింపు చేయనున్నదని సమాచారం. ఈ వాటా కొనుగోలు కోసం వేదాంతతో పాటు అంతర్జాతీయ ప్రైవేట్ ఈక్విటీ సంస్థలు అపోలో గ్లోబల్, ఐ స్క్వేర్డ్ క్యాపిటల్ (థింక్ గ్యాస్ మాతృసంస్థ)లు బిడ్లు సమర్పించాయి. ఈ బిడ్లను తనిఖీ చేసి డెలాయిట్ సంస్థ రూపొందించిన నివేదికపై ఈ అత్యున్నత సంఘం చర్చిస్తుందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఈ లావాదేవీకి సలహాదారుగా డెలాయిట్ సంస్థ వ్యవహరిస్తోంది. కేంద్రానికి రూ.46,600 కోట్లు...! బీపీసీఎల్‌లో వాటా విక్రయానికి గత ఏడాది నవంబర్లోనే ఆమోదం లభించింది. అప్పటి నుంచి చూస్తే, షేర్ ధర 20 శాతం మేర పడిపోయింది. బీఎస్ఈలో సోమవారం నాడు బీపీసీఎల్ షేర్ రూ.406 వద్ద ముగిసింది. ఈ ధర ప్రకారం చూస్తే 52.98 శాతం వాటాకు కేంద్ర ప్రభుత్వానికి రూ.46,600 కోట్లు లభిస్తాయి. కాగా ఈ వాటాను కొనగోలు చేసిన ఏ కంపెనీ అయినా మరో 26 శాతం వాటా కోసం ఓపెన్ ఆఫర్‌ను ప్రకటించాల్సి ఉంటుంది. ఈ ఓపెన్ ఆఫర్‌కోసం మరో రూ.22,800 కోట్లు వెచ్చించాల్సి ఉంటుంది. భారత్‌లో రెండో అతి పెద్ద ఆయిల్ మార్కెటింగ్ కంపెనీ ఇదే. భారత ముడి చమురు రిఫైనరీలో బీపీసీఎల్ వాటా 15.33 శాతంగా ఉంది. ఇంధనాల మార్కెటింగ్‌లో ఈ కంపెనీ మార్కెట్ వాటా 22 శాతం. ఈ కంపెనీకి దేశవ్యాప్తంగా నాలుగు రిఫైనరీలున్నాయి. ముంబై(మహారాష్ట్ర), కోచి(కేరళ), బినా(మధ్యప్రదేశ్), నుమాలిఘర్(అస్సాం)లోని నాలుగు రిఫైనరీల వార్షిక చమురు శుద్ధి సామర్థ్యం 35.3 మిలియన్ టన్నులు. ఈ కంపెనీ మొత్తం 17,355 పెట్రోల్ పంపులు, 6,159 ఎల్పీజీ డీలర్లు, 61 విమానయాన ఇంధన స్టేషన్లను నిర్వహిస్తోంది. -
కాఫీడే వెండింగ్ వ్యాపారంపై టాటా కన్ను
సాక్షి, ముంబై : కెఫే కాఫీ డే యజమాని సిద్ధార్థ సంచలన ఆత్మహత్య సంక్షోభంలో పడిన సంస్థ మరో కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తోంది.కాఫీడే కంపెనీకి చెందిన కాఫీ వెండింగ్ మెషిన్ వ్యాపారాన్ని కొనుగోలు చేసేందుకు టాటా కన్స్యూమర్ ప్రోడక్ట్స్ లిమిటెడ్ యోచిస్తోంది. దీనికి సంబందించిన చర్చల అనంతరం, ఈ ప్రతిపాదనకు టాటా బోర్డు అనుమతినిచ్చినట్టు విశ్వసీనయ వర్గాల సమాచారం. కాఫీడే వెండింగ్ వ్యాపారం రూ. 2 వేల కోట్లు (271 మిలియన్ డాలర్లు) ఉంటుందని అంచనా. భారతదేశపు అతిపెద్ద కాఫీ తయారీ సంస్థ కాఫీ డే, వ్యవస్థాపకుడు సిద్ధార్థ అనూహ్య మరణం తరువాత అప్పులు చెల్లించేందుకు కంపెనీతీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా సంస్థ ఆస్తులను విక్రయించడానికి సిద్ధపడుతోంది. అలాగే గతంలో కార్పొరేట్ బిజినెస్ పార్కును బ్లాక్‌స్టోన్ గ్రూప్ ఇంక్‌కు విక్రయించడానికి అంగీకరించిన సంగతి తెలిసిందే. ఈ వార్తలపై ఇరు సంస్థలు అధికారికంగా స్పందించాల్సి ఉంది. -
ఐపీఎల్ 2020 : బిడ్డింగ్ రేసులో పతంజలి
సాక్షి,న్యూఢిల్లీ : మెగా స్పోర్ట్స్ ఈవెంట్ ఐపీఎల్-2020 టైటిల్ స్పాన్సర్షిప్ నుంచి వివో నిష్క్రమించిన తరువాత, యోగా గురువు బాబా రాందేవ్‌కు చెందిన ఆయుర్వేద ఉత్పత్తుల సంస్థ పతంజలి రేసులో ముందుకు వచ్చింది. తన ఉత్పత్తులకు ప్రపంచవ్యాప్త గుర్తింపును తీసుకొచ్చే వ్యూహంలో పంతాంజలి ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్షిప్ కోసం ప్రయత్నిస్తోంది. ఈ అంశాన్ని తాము పరిశీలిస్తున్నామంటూ ప్రతినిధి ఎస్ కె టిజరవాలా ధృవీకరించారు. ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని ఆగస్టు 14 లోగా తన ప్రతిపాదనను సమర్పించాల్సి ఉందని చెప్పారు. (‘వివో’ లేకుంటే నష్టమేం లేదు: గంగూలీ ) ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్)13 వ ఎడిషన్ టైటిల్ స్పాన్సర్ల వివాదం నేపథ్యంలోస్వదేశీ బ్రాండ్ పతంజలి రంగంలోకి దిగింది. తద్వారా తమ బ్రాండ్ కు అంతర్జాతీయ గుర్తింపును తీసుకురావాలని భావిస్తోంది. హరిద్వార్‌కు చెందిన పతంజలి గ్రూప్ టర్నోవర్ సుమారు10,500 కోట్ల రూపాయలు. అదానీ గ్రూపుతో పోటీ పడి పరీ భారీ అప్పుల్లో కూరుకుపోయిన రుచీ సోయాను కొనుగోలు చేసింది. అయితే ఇటీవల ఆయుర్వేద మందు కరోనిల్ కరోనా నివారణకు విజయవంతంగా పనిచేస్తుందని ప్రకటించి వివాదంలో పడింది. (ఐపీఎల్ : ఒమర్ అబ్దుల్లా సెటైర్లు) కాగా చైనా-ఇండియా సరిహద్దు వివాదం నేపథ్యంలో చైనా కంపెనీలతో సహా అన్న స్పాన్సర్ షిప్ లను కొనసాగిస్తూ బీసీసీఐ తీసుకున్ననిర్ణయం విమర్శలకు దారితీసింది. ఇప్పటికే అమెజాన్, బైజూస్, డ్రీమ్ 11 వంటి టాప్ బ్రాండ్స్ ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్షిప్ రేసులో ఉన్న సంగతి తెలిసిందే. -
ఎయిరిండియా రేసులో టాటా గ్రూప్
సాక్షి, న్యూఢిల్లీ: దాదాపు 87 ఏళ్ల క్రితం తాము ప్రారంభించిన విమానయాన సంస్థ ఎయిరిండియాను తిరిగి దక్కించుకునేందుకు టాటా గ్రూప్ గట్టిగా కసరత్తు చేస్తోంది. సింగపూర్ ఎయిర్‌లైన్స్‌తో కలిసి ఎయిరిండియా కోసం బిడ్ చేసే ప్రయత్నాల్లో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ దిశగా నిబంధనలకు అనుగుణంగా వ్యూహాలు రూపొందించుకుంటోంది. ఎయిరిండియా ఫుల్ సర్వీస్ విభాగాన్ని విస్తారాతో కలిసి, చౌక చార్జీల విభాగం ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌ను ఎయిర్ఏషియా ఇండియాతో కలిసి నడపవచ్చని యోచిస్తోంది. ప్రస్తుతం మలేషియాకు చెందిన ఎయిర్‌ఏషియాతో కలిసి చౌక చార్జీల ఎయిర్‌లైన్స్ వెంచర్ ఎయిర్ఏషియా ఇండియా, సింగపూర్ ఎయిర్‌లైన్స్‌తో ఫుల్ సర్వీస్ ఎయిర్‌లైన్స్ వెంచర్ విస్తారాను టాటా గ్రూప్ నిర్వహిస్తోంది. ఎయిర్‌ఏషియాతో భాగస్వామ్య ఒప్పందం ప్రకారం.. ముందస్తు అనుమతి లేకుండా మరో చౌక బడ్జెట్ ఎయిర్‌లైన్స్‌లో టాటా గ్రూప్ 10 శాతానికి మించి ఇన్వెస్ట్ చేయడానికి వీలు లేదు. ఎయిరిండియాకు బిడ్ చేసే క్రమంలో ఈ నిబంధనను సడలింపచేసుకునేందుకు టాటా గ్రూప్ ప్రయత్నిస్తోంది. ఇందుకోసం ఎయిరిండియాలో బడ్జెట్ విభాగమైన ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌ను .. ఎయిర్ఏషియా ఇండియాలో విలీనం చేసే ప్రతిపాదనను తెరపైకి తెచ్చింది. దీనికి ఆమోదం పొందేందుకు ఎయిర్ఏషియా చీఫ్ టోనీ ఫెర్నాండెజ్‌తో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. కొత్త ఒప్పందం త్వరలోనే కుదుర్చుకోవచ్చని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఎయిరిండియా కొనుగోలుకు ఆసక్తి వ్యక్తీకరణ పత్రాలు దాఖలు చేయడానికి ఆఖరు తేది. మార్చి 17. ఉభయతారకం.. ఒకవేళ ఫెర్నాండెజ్ గానీ టాటా గ్రూప్ ప్రతిపాదనకు ఓకే చెప్పినట్లయితే రెండు వర్గాలకు ఇది ప్రయోజనకరంగానే ఉండగలదని నిపుణులు పేర్కొన్నారు. టాటా సన్స్‌తో జాయింట్ వెంచర్ కింద 2013లో ఎయిర్ఏషియా .. భారత్‌లో చౌక చార్జీల విమానయాన కార్యకలాపాలు ప్రారంభించింది. ఇందులో టోనీకి 49 శాతం, టాటా సన్స్‌కు 51 శాతం వాటాలు ఉన్నాయి. ఆ తర్వాత సింగపూర్ ఎయిర్‌లైన్స్‌తో కలిసి టాటా గ్రూప్ విస్తారా పేరిట ఫుల్ సర్వీస్ ఎయిర్‌లైన్స్ ప్రారంభించింది. ఇందులో టాటాలకు 51 శాతం వాటాలు ఉన్నాయి. ఎయిర్ఏషియా ఇండియా.. విదేశాలకు సర్వీసులు ప్రారంభించేందుకు చాలాకాలంగా పర్మిషన్ల కోసం ఎదురు చూస్తోంది. ఇటీవలే క్రిమినల్ కుట్ర, మనీ లాండరింగ్ ఆరోపణలతో ఫెర్నాండెజ్‌తో పాటు ఎయిర్ఏషియా బోర్డులో టాటా గ్రూప్ నామినీ ఆర్ వెంకటరమణన్ తదితరులపై కేసులు నమోదయ్యాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఎయిర్ఏషియా ఇండియాకు విదేశీ సేవల కోసం అనుమతులు రావడంలో మరింత జాప్యం జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఎయిర్ఏషియా ఇండియాలో ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విలీనం ప్రతిపాదనకు ఫెర్నాండెజ్ గానీ అంగీకరిస్తే.. భారత ఏవియేషన్ రంగంలో మరింత పెద్ద పాత్ర పోషించేందుకు సత్వరం అవకాశం లభించగలదు. అలాగే, ఎయిరిండియా.. విస్తారాలు కలిస్తే దేశీయంగా ఫుల్ సర్వీస్ విభాగంలో టాటాలకు గుత్తాధిపత్యం దక్కగలదని నిపుణులు పేర్కొన్నారు. ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ ప్రస్తుతం 20 భారతీయ నగరాలు, గల్ఫ్.. ఆగ్నేయాసియాలోని 13 ప్రాంతాలకు విమాన సర్వీసులు నడుపుతోంది. 25 బోయింగ్ 737 విమానాలు ఉన్నాయి. ఎయిర్ఏషియా 29 ఎయిర్‌బస్ ఏ320 రకం విమానాలతో దేశీయంగా 21 నగరాల మధ్య సర్వీసులు నడుపుతోంది. ఎయిరిండియాలోకి 100 శాతం ఎఫ్‌డీఐలపై దృష్టి ఎయిరిండియా డిజిన్వెస్ట్‌మెంట్ ప్రణాళికను మరింత వేగవంతం చేసే దిశగా.. కంపెనీలో 100 శాతం ఎఫ్‌డీఐలను అనుమతించే ప్రతిపాదనను కేంద్రం పరిశీలిస్తోంది. ప్రస్తుతం ఎయిరిండియాలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులపై (ఎఫ్‌డీఐ) పరిమితి 49 శాతంగా ఉంది. దీన్ని 100 శాతానికి పెంచిన పక్షంలో ప్రవాస భారతీయులు (ఎన్నారై) కూడా పూర్తి స్థాయిలో ఇన్వెస్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో 49 శాతం పరిమితి నిబంధనను తొలగించేందుకు చర్యలు తీసుకోవాలంటూ పరిశ్రమ, అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక విభాగం (డీపీఐఐటీ)కి పౌర విమానయాన శాఖ కోరినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. దీనిపై వివిధ శాఖల అభిప్రాయాలు కోరుతూ డ్రాఫ్ట్ నోట్ జారీ చేసినట్లు వివరించాయి. -
జెట్ ఎయిర్వేస్ షేర్లు జూమ్
సాక్షి,ముంబై: ప్రైవేటు రంగ విమాన యాన సంస్థ చాలా రోజుల తరువాత మళ్లీ వార్తల్లోకి వచ్చింది. బిలియనీర్ హిందూజా బ్రదర్స్ జెట్ ఎయర్‌వేస్‌ను కొనుగోలుకు బిడ్‌ను సిద్ధం చేస్తోందన్న వార్తల మధ్య జెట్ ఎయిర్వేస్ షేర్లు లాభపడుతున్నాయి. మంగళవారం నాటి బలహీన సెషన్లో ఇన్వెస్టర్లు జెట్ ఎయిర్వేస్ షేర్లుకొనుగోళ్లకు మొగ్గు చూపారు. దీంతో బీఎస్ఈలో 5 శాతం అప్పర్ సర్క్యూట్ అయ్యి రూ .296 వద్ద లాక్ అయ్యాయి. కాగా హిందూజా సోదరులు గోపిచంద్, అశోక్ హిందూజా నేతృత్వంలోని బృందం జనవరి 15 గడువులోగా జెట్ ఎ యిర్‌వేస్‌కు బిడ్ దాఖలు చేయాలని యోచిస్తోంది. రుణాలు, నష్టాలు పేరుకుపోయిన నేపథ్యంలో ఈ ఏడిది ఏప్రిల్ 17 నుంచి జెట్ ఎయిర్వేస్ కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేసిన సంగతి తెలిసిందే. -
జెట్ ఎయిర్వేస్కు మంచి రోజులు?!
సాక్షి, ముంబై: అప్పుల ఊబిలో చిక్కుకుని చివరకు మూతపడిన జెట్ ఎయిర్వేస్కు సంబంధించి ఒకకీలక విషయం మార్కెట్ వర్గాల్లో నానుతోంది. హిందూజా గ్రూప్ మూతపడిన జెట్ ఎయిర్వేస్ ఇండియా లిమిటెడ్‌ను కొనుగోలు చేయడానికి బిడ్‌ను సిద్ధం చేస్తోంది. బిలియనీర్ హిందూజా బ్రదర్స్ జెట్ ఎయిర్వేస్కు బిడ్ సిద్ధం చేస్తున్నట్టు తాజా నివేదికలు వెల్లడిస్తున్నాయి. గోపిచంద్ హిందూజా, అశోక్ హిందూజా సోదరుల బృందం 2020 జనవరి 15 గడువు లోగా బిడ్‌ను సమర్పించాలని యోచిస్తోంది. అయితే ఈ వార్తలపై హిందుజా గ్రూపు అధికారికంగా స్పందించాల్సి వుంది. -
కార్పొరేట్ బ్రదర్స్ : అనిల్ అంబానీకి భారీ ఊరట
సాక్షి, ముంబై: అప్పుల్లోమునిగిపోయిన సోదరుడిని ఆదుకునేందుకు మరోసారి అన్న రంగంలోకి దిగనున్నారు. ఈ అపూర్వ సహోదరులు ఎవరంటే..కార్పొరేట్ బదర్స్ అనిల్ అంబానీ, ముకేశ్ అంబానీ. ప్రముఖ పారిశ్రామికవేత్త, రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ తన సోదరుడిని గట్టెక్కించేందుకు పెద్ద మనసు చేసుకోనున్నారనే టాక్ బిజినెస్ వర్గాల్లో వ్యాపించింది. అన్ని అడ్డంకులను దాటుకుని ఇది వాస్తవ రూపం దాలిస్తే..అనిల్ అంబానీ భారీ ఊరట లభించినట్టేనని భావిస్తున్నారు. ధీరూభాయ్ అంబానీ తనయులైన ముకేశ్, అనిల్ అంబానీ ఎవరి వ్యాపారాలు వారు చూసుకుంటున్న సంగతి తెలిసిందే. అయితే ముకేశ్ వ్యాపారంలో రాణిస్తూ ఫోర్బ్స్ ధనవంతుల జాబితాలో దూసుకు పోతుండగా, అనిల్ అంబానీ అప్పుల ఊబిలో కూరుకపోయి ఫోర్బ్స్ ధనవంతుల జాబితాలోంచి ఇటీవల పడిపోయారు. ముకేశ్ అంబానీ నేతృత్వంలోని జియో సంస్థ, రిలయన్స్ కమ్యూనికేషన్స్ ఆస్తుల కొనుగోలుకు యోచిస్తోందని అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం. ఆర్‌కాం సంస్థ దివాలా తీసిన నేపథ్యంలో ఆయా ఆస్తులను కొనుగోలు చేసేందుకు ముకేశ్ అంబానీ బిడ్ దాఖలు చేయనున్నారని తెలుస్తోంది. ఆర్‌కామ్‌కు సంబంధించిన టవర్లు, ఫ్రీక్వెన్సీలను కొనుగోలు చేయాలని భావిస్తోందట. అంతేకాదు నవీ ముంబైలోని పలు భూములను కూడా కొనుగోలు చేయాలని ముఖేష్ అంబానీ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇంక ధీరూభాయ్ అంబానీ నాలెడ్జ్ సిటీని కూడా కొనుగోలు చేయాలనే ఆలోచనలో ముఖేష్ అంబానీ ఉన్నట్లు సమాచారం. దీని విలువ దాదాపు రూ.25వేల కోట్లు ఉంటుందని ఓ నివేదిక పేర్కొంది. కాగా రూ.7,300 కోట్లమేర ఆర్‌కాం ఆస్తుల కొనుగోలు చేయాలని ముకేశ్ గతంలో ప్రయత్నించారు, కానీ టెలికాం శాఖ అనుమతి లభించక పోవడంతో ఈ డీల్‌కు బ్రేక్ పడింది. అయితే ఈ ఏడాది మార్చిలో ఎరిక్సన్ కు కట్టాల్సిన రూ.580 కోట్లు అప్పును ముకేశ్ అంబానీ చెల్లించి అనిల్‌ను పెద్ద ప్రమాదం (జైలుకు వెళ్లకుండా) నుంచి తప్పించిన సంగతి తెలిసిందే. -
జెట్ ఎయిర్వేస్ : ఉద్యోగుల చొరవ
సాక్షి, న్యూఢిల్లీ : రుణభారంతో కుదేలైన విమానయాన సంస్థ జెట్ ఎయిర్వేస్పై దివాలా ప్రక్రియ ప్రారంభం కానున్న నేపథ్యంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. జెట్ ఎయిర్ వేస్ ఉద్యోగులు తమ సంస్థను గట్టెక్కించేందుకు , తద్వారా తమ భవిష్యత్తు భరోసాకు నడుం బిగించారు. ఆది గ్రూపు భాగస్వామ్యంతో ఉద్యోగుల కన్సార్షియం బిడ్ దాఖలు చేసేందుకు ముందుకు వచ్చింది. ఎన్సీఎల్టీ(నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్) ద్వారా 75 శాతానికి బిడ్ దాఖలు చేస్తామని శుక్రవారం ప్రకటించింది. సంస్థ ఉద్యోగులు ఇలాంటి చొరవ తీసుకోవడం ఇదే తొలిసారని బిజినెస్ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. భారత విమానయాన చరిత్రలో ఇదొక కొత్త అధ్యాయమని అంటున్నారు. "ఇది నిజంగా ప్రధానమంత్రి కల 'సబ్కా సాథ్, సబ్ కా వికాస్ సబ్ కా విశ్వస్' ను సూచిస్తుందంటూ , ఉద్యోగుల కన్సార్షియం ఆదిగ్రూప్ జారీ చేసిన సంయుక్త ప్రకటనలో తెలిపారు. న్యూఢిల్లీలో ఏర్పాటు విలేకరుల సమావేశంలో సొసైటీ ఫర్ వెల్ఫేర్ ఆఫ్ ఇండియన్ పైలట్స్, జనరల్ సెక్రటరీ, జెట్ సీనియర్-మోస్ట్ పైలట్లలో ఒకరైన కెప్టెన్ అశ్వని త్యాగి, ఆది గ్రూపు ప్రతినిధులు పాల్గొన్నారు. కంపెనీకి రుణాలిచ్చిన 26 సంస్థల తరపున స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జెట్ ఎయిర్వేస్పై 2016 నాటి ఇన్సాల్వెన్సీ బ్యాంక్రప్టసీ చట్టం ప్రకారం కార్పొరేట్ ఇన్సాల్వెన్సీ రిజల్యూషన్ ప్రాసెస్(సీఐఆర్‌పీ) దివాలా ప్రక్రియ పిటీషన్ దాఖలు చేసింది. ఎన్సీఎల్టీ ముంబై ధర్మాసనం ఈ పిటీషన్‌ను ఈ నెల 20న స్వీకరించగా తదుపరి విచారణ జూలై 5న జరగనుంది. భారత్‌లో దివాలా ప్రక్రియకు చేరిన తొలి విమానయాన సంస్థగా జెట్ ఎయిర్వేస్ నిలిచింది. ఐఆర్‌పీగా నియమితులైన ఆశీష్ చౌచారియా 90 రోజుల్లో రిజల్యూషన్ ప్రణాళికను అందజేయాలని ఎన్సీఎల్టీ ముంబై ధర్మాసనం ఆదేశించింది. కాగా బ్యాంక్‌లు, ఇతర ఆర్థిక సంస్థలకు జెట్ ఎయిర్వేస్ కంపెనీ రూ.8 500 కోట్లు బకాయిలు చెల్లించాల్సి ఉంది. ఉద్యోగులకు, ఇతర రుణదాతలకు, వెండార్లకు కలిపి మొత్తం 25వేల కోట్ల లోనే బకాయిలున్నాయి. ఈ ఏడాది ఏప్రిల్ 17 నుంచి ఈ కంపెనీ కార్యకలాపాలు నిలిపేసిన సంగతి తెలిసిందే. -
జెట్ ఎయిర్వేస్ సాగాలో న్యూ ట్విస్ట్
సాక్షి,ముంబై : జెట్ ఎయిర్వేస్ సాగాలో సరికొత్త ట్విస్ట్ వ్యాపార వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. మాజీ ప్రమోటర్, గత నెలలో చైర్మన్‌గా తప్పుకున్న నరేష్ గోయల్ ఎయిర్‌లైన్స్‌లో వాటాను తిరిగి దక్కించు కోవాలని యోచిస్తున్నారట. జెట్‌లో వాటాల కొనుగోలుకు ప్రధాన ఇన్వెస్టర్లు ఎవరూ ఆసక్తి కనబర్చని నేపథ్యంలో ఆయన నిర్దిష్టమైన రోడ్‌మ్యాప్‌తో సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. త్వరలోనే ఆయన బిడ్‌ను దాఖలు చేయనున్నారని తెలుస్తోంది. ఎస్బీఐ నేతృత్వంలోని బ్యాంకుల కన్సార్షియం రుణపరిష్కారప్రనాళికను వేగవంతం చేసింది. ఈ నేపథ్యంలో జెట్ ఎయిర్‌వెస్‌లో దాదాపు 75 శాతం వాటాను విక్రయించేందుకు బిడ్లను ఆహ్వానించారు. అయితే దీనికి పెద్దగా స్పందన లభించకపోవడంతో ఆసక్తి వ్యక్తీకరణ పత్రాల (ఈవోఐ) దాఖలుకు డెడ్‌లైన్‌ను పొడిగించింది. బిడ్లనును సమర్పించే గడువును ఏప్రిల్ 12వరకు పొడిగిస్తున్నట్టు ఎస్బీఐ క్యాపిటల్ ప్రకటించింది. దీంతో జెట్ ఎయిర్వేస్లో ఇప్పటికే పెట్టుబడిదారుగా ఉన్నఎతిహాడ్, జెట్ ఎయిర్ వేస్ మాజీ సీఈవో క్రామర్ బాల్ కూడా జెట్ వాటాల ఒక కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నట్టు సమాచారం. దాదాపు ప్రతి రోజు ఎస్బీఐ అధికారులతో సమావేశమవుతున్నట్టు పరిశ్రమ వర్గాలు పేర్కొన్నాయి. కాగా అప్పుల సంక్షోభంతో కుప్పకూలుతున్న జెట్ ఎయిర్వేస్కు కష్టాలు వెన్నంటుతున్నాయి. తీవ్ర నిధుల కొరత, రుణాల భారంతో పాటు, సిబ్బందికి జీతాలు కూడా చెల్లించలేని స్ధితిలో జెట్ ఎయిర్వేస్ అష్ట కష్టాలు పడుతోంది. బాకీలు కట్టలేందంటూ ఎయిర్వేస్కు ప్రభుత్వ రంగ ఇంధన మార్కెటింగ్ సంస్థ ఇండియన్ ఆయిల్ (ఐవోసీ) ఇంధన సరఫరాను నిలిపివేసింది. తక్షణమే రూ.1,500 కోట్ల మేర నిధులను అందించే ప్రణాళికలో భాగంగా జెట్ ఎయిర్వేస్ను స్థాపించి విజయపథంలో పరుగులు పెట్టించిన ఛైర్మన్ నరేష్ గోయల్ చివరికి అనివార్య పరిస్థితుల్లో కంపెనీ బోర్డు నుంచి సతీమణి అనితా గోయల్‌తోపాటు వైదొలగిన సంగతి తెలిసిందే. -
జీ వాటాపై బిలియనీర్ల కన్ను?
సాక్షి, న్యూఢిల్లీ: బడా పారిశ్రామిక వేత్త, రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ, దేశీయ రెండవ అతిపెద్ద టెలికాం దిగ్గజం ఎయిర్టెల్ ఛైర్మన్ సునీల్ మిట్టల్ ప్రముఖ మీడియా సంస్థ జీ ఎంటర్టైన్మెంట్ కంపెనీ వాటాలపై కన్నేసినట్లు వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. దేశీయ బిలియనీర్లు ముకేశ్ అంబానీ, సునీల్ మిట్టల్ జీ ఎంటర్టైన్మెంట్ ప్రమోటర్ సుభాష్ చంద్ర వాటాను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు తొలి దశ చర్చలు జరుగుతున్నాయని బ్లూమ్‌బెర్గ్ క్వింట్ తాజాగా పేర్కొంది. త్వరలోనే జీ ఎంటర్టైన్మెంట్లో సుభాష్ వాటా కొనుగోలుకు నిమిత్తం ప్రాథమిక బిడ్స్ దాఖలు చేయవచ్చని, ఈ మేరకు అధికారిక ప్రతిపాదన త్వరలోనే రానుందని రిపోర్ట్ చేసింది. అయితే వాటా కొనుగోలు రేసులో ఆర్ఐఎల్, ఎయిర్టెల్ ఉన్నాయన్న వార్తలపై ఎయిర్టెల్ స్పందించింది. ఈ ఊహాగానాలను ఎయిర్టెల్ ప్రతినిధి తిరస్కరించారు. జీలో వాటాల కొనుగోలు రేసులో ఎయిర్టెల్ లేదంటూ ఒక ప్రకటన జారీ చేశారు. కాగా ఎస్సెల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తదితర కార్యకలాపాలలో పెట్టుబడుల కారణంగా ఆర్థిక సమస్యలు ఎదురుకావడంతో జీ ప్రమోటర్ సుభాష్ చంద్ర కొంతమేర వాటాను విక్రయించేందుకు ఇప్పటికే సన్నాహాలు మొదలుపెట్టిన విషయం సంగతి తెలిసిందే. -
ఆర్సెలర్ మిట్టల్ చేతికి ఎస్సార్ స్టీల్!
సాక్షి, ముంబై: రుణ భారంతో కుదేలైన ఎస్సార్ స్టీల్ ను ప్రపంచ ఉక్కు దిగ్గజం ఆర్సెలార్ మిట్టల్ ఎట్టకేలకు సొంతం చేసుకుంది. లక్ష్మీ మిట్టల్ యాజమాన్యంలోని ఆర్సెలార్ మిట్టల్ ఈ స్టీల్స్ ను రూ.42,000కోట్లకు దక్కించుకున్నారు. ఆర్సెలర్ మిట్టల్, భాగస్వామి జపాన్ నిస్సాన్ స్టీల్ అండ్ సుమిటోమోకు కమిటీ ఆఫ్ క్రెడిటర్స్ (బ్యాంకుల రుణదాతల కమిటీ ) లెటర్ ఆఫ్ ఇంటెంట్ జారీ చేసింది. ఈ మేరకు కంపెనీ శుక్రవారం ఒక ప్రకటన జారీ చేసింది. రూ.49వేల కోట్ల బకాయిలను తాము చెల్లించాల్సి ఉందని మిట్టల్ తెలిపారు. ముందుగా అప్పులను తీర్చుందుకు 42వేల కోట్లను, మరో ఎనిమిదివేల కోట్ల రూపాయల నిర్వాహక పెట్టుబడులను సంస్థకు సమకూర్చనుంది. ఎస్సార్ స్టీల్‌ను దివాలానుంచి బయటపడేందుకు గాను రుణదాతలకు రూ. 54,389 కోట్లు, 47,507 కోట్ల రూపాయల నగదు చెల్లింపులకు ఆర్సెలర్ అంగీకరించిన తర్వాత రోజు ఈ అభివృద్ధి జరిగింది. -
ఎస్సార్ స్టీల్‌కు ఆర్సెలర్ మిట్టల్ తాజా బిడ్
న్యూఢిల్లీ: భారీ రుణాల్లో కూరుకుపోయిన ఎస్సార్ స్టీల్ కొనుగోలుకు ఆర్సెలర్ మిట్టల్ సోమవారం ఉదయం తాజా బిడ్ దాఖలు చేసింది. జపాన్‌కు చెందిన నిప్పన్ స్టీల్ అండ్ సుమిటోమో మెటల్ కార్పొరేషన్ భాగస్వామ్యంతో ఈ బిడ్ దాఖలు చేసినట్లు తెలిసింది. బిడ్ విలువ ఎంతన్నది అధికారికంగా తెలియనప్పటికీ, ఈ మొత్తం రూ.42,000 కోట్లు ఉండవచ్చని వినిపిస్తోంది. ఎస్సార్ స్టీల్ రుణ దాతలకు తిరిగి చెల్లింపులు చేయటానికి ఆర్సెలర్ మిట్టల్ ఈ ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఎస్సార్ స్టీల్ ఇండియా లిమిటెడ్ (ఈఎస్‌ఐఎల్) క్రెడిటార్స్ కమిటీకి ఈ మేరకు సవరించిన బిడ్‌ను సమర్పించినట్లు ఆర్సెలర్ మిట్టల్ తెలియజేసింది. గత అనుబంధ సంస్థలు... ఉత్తమ్ గాల్వా, కేఎస్ఎస్ పెట్రోన్ల రూ.7,000 కోట్ల బకాయిల చెల్లింపులకు కూడా తాజా ఆర్సెలర్ మిట్టల్ బిడ్ ఆఫర్ ప్రతిపాదనలో ఉన్నట్లు సమాచారం. సంబంధిత రూ. 7,000 కోట్ల రుణబాకీలను సెప్టెంబర్ 11లోగా చెల్లించేస్తే ఆర్సెలర్ మిట్టల్ బిడ్‌కు పరిశీలనార్హత ఉంటుందని నేషనల్ కంపెనీ లా అప్పిలేట్ ట్రైబ్యునల్ (ఎన్సీఎల్ఏటీ) స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. బకాయిలు రూ.49,000 కోట్లు... సుమారు రూ. 49,000 కోట్ల మొండిబాకీలను రాబట్టుకునేందుకు ఎస్సార్ స్టీల్‌ను బ్యాంకులు వేలం వేస్తున్నాయి. తొలి రౌండులో రష్యా సంస్థ న్యూమెటల్, ఆర్సెలర్‌మిట్టల్ బిడ్లు వేసినప్పటికీ.. డిఫాల్ట్ అయిన సంస్థలతో వాటి ప్రమోటర్లకు లావాదేవీలున్నాయన్న కారణంతో సీవోసీ సదరు బిడ్లను తిరస్కరించింది. న్యూమెటల్‌లో ఎస్సార్ స్టీల్ ప్రమోటరు రవి రుయా కుమారుడు రేవంత్ రుయాకు వాటాలున్నాయన్న కారణంతో ఆ సంస్థ బిడ్‌ను తిరస్కరించింది. బ్యాంకులకు బాకీ పడ్డ ఉత్తమ్ గాల్వా, కేఎస్ఎస్ పెట్రోన్‌లలో వాటాలు ఉన్నందున ఆర్సెలర్ మిట్టల్ బిడ్ తిరస్కరణకు గురైంది. దీంతో సీవోసీ రెండో విడత బిడ్లను ఆహ్వానించింది. వేదాంత కూడా మూడవ బిడ్డర్‌గా ఉంది. -
ఎన్సీఎల్టీలో పతంజలి పిటిషన్
న్యూఢిల్లీ: రుచి సోయా రుణదాతలు అదానీ విల్మర్ బిడ్‌కు ఆమోదం తెలపడాన్ని సవాల్ చేస్తూ పతంజలి ఆయుర్వేద కంపెనీ ఎన్సీఎల్టీని ఆశ్రయించింది. రూ.12,000 కోట్ల భారీ బ్యాంక్ రుణాల కారణంగా రుచి సోయా కంపెనీపై దివాలాప్రక్రియ కొనసాగుతోంది. ఈ ప్రక్రియలో భాగంగా రుచి సోయాను టేకోవర్ చేయడానికి అదానీ విల్మర్‌తో పాటు బాబా రామ్‌దేవ్‌కు చెందిన పతంజలి ఆయుర్వేద్ కూడా బిడ్లు వేశాయి. రుచిసోయా రుణదాతలు రూ.6,000 కోట్ల అదానీ విల్మర్ బిడ్‌కు ఆమోదం తెలిపాయి. దీనిని ఎన్సీఎల్టీ ఆమోదించాల్సి ఉంది. అయితే రుచి సోయా రుణదాతలు అదానీ విల్మర్‌కు ఆమోదం తెలపడాన్ని సవాల్ చేస్తూ నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్(ఎన్సీఎల్టీ)ను పతంజలి ఆయుర్వేద్ ఆశ్రయించింది. దీనిపై ఈ నెల 27న(సోమవారం) విచారణ జరిగే అవకాశాలున్నాయని అంచనా. వివాదమిది... రుచి సోయాను చేజిక్కించుకోవడానికి అదానీ విల్మర్, పతంజలిల మధ్య దీర్ఘకాలంగా పోరు జరుగుతోంది. అదానీ విల్మర్ రూ.6,000 కోట్ల మేర బిడ్‌ను దాఖలు చేయగా, పతంజలి ఆయుర్వేద కంపెనీ రూ.5,700 కోట్ల మేర్ బిడ్‌ను దాఖలు చేసింది. రుచి సోయా రుణదాతలు అదానీ విల్మర్ బిడ్‌కు పచ్చజెండా ఊపారు. ఏ ప్రాతిపదికన అదానీ విల్మర్ బిడ్‌ను ఆమోదించారో వెల్లడించాలని పతంజలి ఆయుర్వేద్ ప్రశ్నించింది. ఈ ప్రక్రియకు సంబంధించిన రిజల్యూషన్ ప్రొఫెషనల్ (ఆర్పీ), శేలైంద్ర అజ్మీరకు న్యాయ సలహాదారుగా సిరిల్ అమర్‌చంద్ మంగళ్‌దాస్ నియామకాన్ని కూడా పతంజలి కంపెనీ తప్పుపట్టింది. అదానీ గ్రూప్‌నకు కూడా సిరిల్ అమర్‌చంద్ న్యాయ సలహాదారుగా వ్యవహరిస్తున్నారని వివరించింది. వ్యాఖ్యానించడానికి పతంజలి నిరాకరణ... ఈ అంశం కోర్టు పరిధిలో ఉన్నందున దీనిపై వ్యాఖ్యానించడానికి నిరాకరిస్తున్నామని పతంజలి ప్రతినిధి ఎస్.కె. తిజరవాలా పేర్కొన్నారు. మరోవైపు అదానీ గ్రూప్ ప్రతినిధి కూడా వ్యాఖ్యానించడానికి నిరాకరించారు. -
‘భోగాపురం’లో గ్లోబల్ స్కాం!
సాక్షి, అమరావతి: భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణ టెండర్లలో గ్లోబల్ స్కాంకు తెరలేచింది! భోగాపురం ఎయిర్‌పోర్టు పనులను బిడ్‌లో దక్కించుకుని అత్యధిక రెవెన్యూ వాటా ఇచ్చేందుకు ఎయిర్‌పోర్ట్స్ అధారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) ముందుకొచ్చినా ఆ టెండర్లను రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేయడం తెలిసిందే. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ కావడంతో ముడుపులు, కమీషన్లు రావనే ‘ముఖ్య’నేత ఈ టెండర్లను రద్దు చేసినట్లు అధికార వర్గాలు బహిరంగంగానే పేర్కొన్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఆంధ్రప్రదేశ్ విమానాశ్రయాల అభివృద్ధి కార్పొరేషన్ లిమిటెడ్ ఈ నెల 17వ తేదీన భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం పనులకు ఆసక్తి వ్యక్తీకరణ ప్రతిపాదనలను ఆహ్వానించింది. ఎక్కువ మంది పాల్గొనకుండా...! ప్రైవేట్ సంస్థకు అది కూడా ‘ముఖ్య’నేతకు భారీ ఆర్థిక ప్రయోజనం చేకూర్చేవారికే భోగాపురం అంతర్జాతీయ ఎయిర్‌పోర్టు పనులను అప్పగించాలనే రాష్ట్ర సర్కారు ఉద్దేశం స్పష్టంగా కనిపిస్తోందని ఉన్నతాధికారులు వ్యాఖ్యానిస్తున్నారు. అందులో భాగంగానే ముందుగా నిర్ణయించుకున్న ప్రైవేట్ సంస్థకు పనులు అప్పగించేందుకు వీలుగా గ్లోబల్ టెండర్ల నిబంధనలకు పాతర వేశారని పేర్కొన్నారు. గ్లోబల్ టెండర్ల దాఖలుకు కనీసం 45 రోజులు సమయం ఇవ్వాలి. అయితే భోగాపురం ఎయిర్‌పోర్టు విషయంలో ఈ నిబంధనను పట్టించుకోకుండా ఆసక్తి వ్యక్తీకరణకు 10 రోజులు, బిడ్ల దాఖలుకు 8 రోజులు మాత్రమే గడువు ఇవ్వడం గమనార్హం. ఎక్కువ మంది టెండర్లలో పాల్గొనకుండా కావాల్సిన వారికి మాత్రమే అవకాశం కల్పించేందుకే హడావుడిగా ముగిస్తున్నారని అధికార వర్గాలే వ్యాఖ్యానిస్తున్నాయి. ఏఏఐ అత్యధికంగా రెవెన్యూ వాటా ఇస్తామన్నా... భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం పనులను చేపట్టేందుకు ఆసక్తి వ్యక్తీకరణ ప్రతిపాదనల దగ్గర నుంచి బిడ్ల దాఖలుకు రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఏకంగా 13 నెలలు సమయాన్ని ఇచ్చింది. ఎయిర్‌పోర్ట్స్ అధారిటీ ఆఫ్ ఇండియాతో పాటు, జీఎంఆర్ అప్పుడు బిడ్లు దాఖలు చేశాయి. 2016 జూన్‌లో ఆసక్తి వ్యక్తీకరణ ప్రతిపాదనలను ఆహ్వానించి 2017 జూలై 31 వరకు గడువు పొడిగిస్తూ వచ్చారు. అనంతరం జీఎంఆర్, ఏఏఐ బిడ్లు సక్రమంగా ఉన్నాయని తేల్చారు. ఏఏఐ అత్యధికంగా 30.2 శాతం రెవెన్యూ వాటాతో పాటు 26 శాతం ఈక్విటీ ఇస్తానందని, ఎకరానికి ఏటా రూ.20 వేల లీజు చెల్లించేందుకు ముందుకొచ్చినట్లు భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం కార్పొరేషన్ లిమిటెడ్ రాష్ట్ర ప్రభుత్వానికి తెలిపింది. జీఎంఆర్ కేవలం 21.6 శాతం మాత్రమే రెవెన్యూ వాటా ఇస్తానందని, ఈ నేపథ్యంలో ఏఏఐకి పనులు అప్పగించాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. అయితే ఏఏఐకి ఎయిర్‌పోర్టు పనులు అప్పగించేందుకు ఇష్టం లేని రాష్ట్ర ప్రభుత్వం అక్కడ ఏరో సిటీ, ఏవియేషన్ అకాడమీ లాంటి అదనపు పనులు చేపట్టాలనే సాకుతో గత డిసెంబర్ 20వ తేదీన టెండర్ల రద్దుకు ఆదేశించింది. అనంతరం ఈ ఏడాది జనవరి 20వ తేదీన భోగాపురం విమానాశ్రయం టెండర్లను రద్దు చేస్తూ మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. పునరాలోచనకు నిరాకరణ అయితే రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్న ఆ అదనపు పనులు కూడా తామే చేపడతామని, బిడ్ల దాఖలు గడువును పొడిగించాలని ఏఏఐ కోరినప్పటికీ, ఆంధ్రప్రదేశ్ విమానాశ్రయాల అభివృద్ధి కార్పొరేషన్ సూచించినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం పట్టించు కోకుండా టెండర్లను రద్దు చేస్తూ మళ్లీ మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు తాజాగా కొత్త టెండర్లను ఆహ్వానించింది. ఈ నెల 17వ తేదీ నుంచి 26వ తేదీ వరకు ఆసక్తి వ్యక్తీకరణ ప్రతిపాదనలను సమర్పించాలని పేర్కొంది. -
టాటా కూడా టాటా చెప్పేసినట్టేనా?
సాక్షి,ముంబై: రుణ సంక్షోభంలో కూరుకుపోయిన ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిరిండియా విక్రయానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి వరుసగా ఎదురు దెబ్బలు తప్పడం లేదు. అప్పుల కుప్ప కొనుగోలు రేసులో ఒక్కొక్కరు తప్పుకోవడం ఇపుడు చర్చనీయాంశంగా మారింది. అప్పుల భారం తగ్గించేందుకు ప్రైవేటీకరణ బాట పట్టినా.. కొనుగోలు చేసేందుకు ఎవరూ ముందుకు రావట్లేదు. డీకాపిటలైజేషన్ బాటలో ఎయిరిండియాలో ప్రభుత్వ 76 శాతం వాటా కొనుగోలుకు తొలుత కొన్ని సంస్థలు ఆసక్తి చూపించినా.. ఆ తర్వాత వెనక్కి తగ్గుతున్నాయి. ఇప్పటికే ఇండిగో, జెట్ ఎయిర్వేస్ పక్కకు తప్పుకోగా తాజాగా ఈ రేసులో ప్రధానంగా నిలబడిన టాటా గ్రూప్ కూడా బాటలో పయనించనున్నట్లు సమాచారం. ఎయిరిండియా వాటా కొనుగోలుకు దూరంగా ఉండాలని టాటా గ్రూప్ భావిస్తున్నట్లు ఈ వ్యవహారంతో సంబంధమున్న కొందరు వ్యక్తుల ద్వారా తెలుస్తోంది. కొనుగోలుకు సంబంధించి ప్రభుత్వం విధించిన నిబంధనలే ఇందుకు కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు. ఎయిరిండియాలో వాటా కొనుగోలు చేసినవారు ప్రభుత్వ వాటా వున్నంత కాలం తమ సొంత వ్యాపారాలతో దీన్ని విలీనం చేయరాదన్న ప్రభుత్వ నిబంధన ఇపుడు సంస్థలకు కొరకరాని కొయ్యగా మారింది. అంతేకాదు ఉద్యోగులను తగ్గించకూడదంటూ కొన్ని ఇతర కీలక నిబంధనలు విధించింది ప్రభుత్వం. దీంతో తొలుత వాటా కొనేందుకు టాటా గ్రూప్ ఆసక్తి కనబర్చినా.. తాజా నిబంధనల నేపథ్యంలో పునరాలోచనలో పడింది. ఎయిరిండియాపై పూర్తి నియంత్రణ కోరుకుంటున్న టాటా గ్రూపు ఇన్ని నిబంధనల మధ్య ఎయిరిండియాను నడపగలమా? లేదా అన్న సందిగ్ధతలో ఉన్నట్లు సమాచారం. మరోవైపు దీనిపై టాటా గ్రూప్ స్పందించడానికి నిరాకరించింది. కాగా ప్రైవేటీకరణ ప్రక్రియ పూర్తి అయిన తర్వాత ఎయిర్ ఇండియాపై దృష్టి పెడతామని గత ఏడాది అక్టోబర్‌లో టాటా గ్రూపు చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ ఒక టీవీ ఇంటర్వ్యూలో ప్రకటించడం తెలిసిందే. -
ఎస్సార్ స్టీల్ ట్విస్ట్: రేసులో వేదాంత
సాక్షి,న్యూఢిల్లీ: అప్పుల ఊబిలో పీకల్లోతున కూరుకుపోయి దివాలా దిశగా అడుగులు వేస్తున్న దేశీయ ఉక్కు సంస్థ ఎస్సార్ స్టీల్ బిడ్డింగ్ రేసులో తాజాగా మరోదిగ్గజం చేరింది.ఇప్పటికే అంతర్జాతీయ ఉక్కు దిగ్గజం ఆర్సెలార్ మిట్టల్ ఈ రేసులో ముందుండగా ఇపుడు వేదాంతా వచ్చి చేరింది. రెండవ రౌండ్ బిడ్డింగ్ ప్రక్రియలో ఎస్సార్ స్టీల్‌ను కొనుగోలు చేసేందుకు బిడ్‌ను దాఖలు చేసినట్లు తెలుస్తోంది. ఈ బిడ్ల దాఖలుకు సోమవారమే తుది గడువు. ఫిబ్రవరి 12నాటి మొదటి దశలో బిడ్డింగ్‌లో ఆర్సెలార్ మిట్టల్, మారిషస్‌కు చెందిన ఇన్వెస్ట్మెంట్ సంస్థ న్యుమెతాల్తో కలిసి జెస్ డబ్ల్యూ రెండు సంస్థలు ప్రధానంగా నిలవగా ఇపుడు వేదాంతా దీనికోసం పోటీ పడుతున్న దిగ్గజాల సరసన చేరింది. అయితే మొదటి దశ బిడ్డింగ్‌లో ఐబిసి చట్టాల ప్రకారం ఎస్బీఐ నేతృత్వంలోని బ్యాంకుల కన్సార్టియం ఈ రెండు సంస్థల బిడ్లను తిరస్కరించాయి. కాగా దివాలా చట్టం కింద తొలి విడతలో చర్యలు చేపట్టేందుకు రిజర్వు బ్యాంకు గుర్తించిన 12 కంపెనీల్లో ఎస్సార్ స్టీల్ ఒకటి. గుజరాత్లో ప్రధాన ఉత్పత్తి కేంద్రం ఉన్న ఎస్సార్స్టీల్ సంవత్సరానికి 9.6 మిలియన్ టన్నుల నామమాత్రపు సామర్ధ్యం కలిగివుంది. అయితే భారీగా పెరిగిన ముడి ఇనుము ధరలు, ఉత్పత్తి వ్యయాలు కంపెనీకి ప్రతిబంధకం మారాయి. -
టాటా స్టీల్ చేతికి భూషణ్ స్టీల్
సాక్షి, ముంబై: మొత్తానికి భూషణ్ స్టీల్ విక్రయానికి మార్గం సుగమమైంది. సుమారు రూ.50వేల కోట్ల రుణభారంతో సతమతమవుతూ.. దివాలా చట్ట పరిధిలోకి చేరిన భూషణ్ స్టీల్ కొనుగోలుకి వేసిన బిడ్ గెలుపొందినట్లు స్టాక్ ఎక్స్ఛేంజీలకు అందించిన సమాచారంలో టాటా స్టీల్ తాజాగా తెలియజేసింది. ఈ మేరకు మార్చి 22న భూషణ్ స్టీల్ లిమిటెడ్ (బీఎస్ఎల్) కు చెందిన క్రెడిట్ కమిటీల (కోసీ) నిర్ణయం తీసుకుందని టాటాస్టీల్ పేర్కొంది. అయితే ఈ డీల్ రెగ్యులేషన్ కమిటీ ఆమోదానికి లోబడి ఉంటుందని తెలిపింది. జాతీయ కంపెనీ చట్ట ట్రిబ్యునల్(ఎన్సీఎల్టీ), కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) తదితర నియంత్రణ సంస్థల నుంచి తగిన అనుమతులు లభించాల్సి ఉందని టాటాస్టీల్ పేర్కొంది. రుణ చెల్లింపుల్లో విఫలంకావడంతో భూషణ్ స్టీల్‌పై బ్యాంకులు దివాలా చర్యలు చేపట్టాయి. ఈ నేపథ్యంలో వార్షికంగా 5.6 మిలియన్ టన్నుల సామర్థ్యమున్న భూషణ్ స్టీల్ కొనుగోలుకి పలు సంస్థలు ఆసక్తి చూపాయి. అయితే అనూహ్యంగా టాటా గ్రూప్ మెటల్ దిగ్గజం టాటా స్టీల్ రూ. 35వేల కోట్ల బిడ్‌తో ఒక్కసారిగా ముందుకొచ్చింది. తద్వారా ఈ బిడ్‌లో ముందంజలో ఉన్న జేఎస్‌డబ్ల్యూ స్టీల్ (బిడ్ వాల్యూరూ. 29,700 కోట్లు) వెనక్కి నెట్టేసింది. కాగా.. ప్రస్తుతం టాటా స్టీల్, భూషణ్ స్టీల్ షేర్లు నష్టాల్లోకదులుతున్నాయి. -
టాటా టెలీ ఫైబర్ ఆస్తుల కోసం బిడ్
ముంబై: టాటా టెలీసర్వీసెస్‌కు చెందిన ఎంటర్ప్రైజ్ బిజినెస్‌ను(ఫైబర్ టెలికం నెట్వర్క్) కొనుగోలు చేయటానికి టాటా టెలీ సర్వీసెస్‌కు చెందిన ఉన్నతాధికారులే బిడ్ వేసినట్లు తెలిసింది. టాటా గ్రూప్‌కు చెందిన అంతర్జాతీయ కార్యకలాపాల అధినేత, గతంలో బ్రాండ్ కస్టోడియన్‌గా వ్యవహరించిన ముకుందరాజన్ నేతృత్వంలో టాటా టెలీ సర్వీసెస్‌కు చెందిన కొందరు ఉన్నతాధికారులు ఈ బిడ్‌ను దాఖలు చేశారని ఈ విషయంతో నేరుగా సంబంధం ఉన్న ఒక వ్యక్తి వెల్లడించారు. వీరికి టీపీజీ క్యాపిటల్ నేతృత్వంలోని కన్సార్షియమ్ తోడ్పాటునందిస్తోంది. ఈ కన్సార్షియమ్ ఈ ఆస్తుల కోసం వంద కోట్ల డాలర్లపైనే కోట్ చేసినట్లు తెలుస్తోంది. ఈ డీల్ కుదిరితే ఈ రంగంలో ఇదే అతి పెద్ద డీల్ కానుంది. టాటా గ్రూప్‌కు చెందిన టాటా కమ్యూనికేషన్స్ కూడా ఈ ఆస్తుల కొనుగోళ్ల రేసులో ఉంది. 1,25,000 రూట్ కిలోమీటర్ల ఫైబర్ నెట్వర్క్, ఇతర ఆస్తులను ఈ కన్సార్షియమ్ దక్కించుకుంటే ఈ వ్యాపారాన్ని చూసుకోవడం కోసం ముకుందరాజన్ టాటా గ్రూప్ నుంచి బయటకొస్తారని ఆ వ్యక్తి పేర్కొన్నారు. గతంలో టాటా టెలీసర్వీసెస్‌కు ఎమ్‌డీగా రాజన్ పనిచేశారని, దీంతో ఈ వ్యాపారాన్ని నిర్వహించే అనుభవం అయనకుందని, అంతేకాకుండా కొన్ని ప్రైవేట్ ఈక్విటీ సంస్థలతో ఆయనకు సన్నిహిత సంబంధాలు కూడా ఉన్నాయని ఆ వ్యక్తి పేర్కొన్నారు. ఈ వార్తలపై టాటా సన్స్, టీపీజీ క్యాపిటల్ ప్రతినిధులు వ్యాఖ్యానించడానికి నిరాకరించారు. టాటాటెలి సర్వీసెస్ తన మొబైల్ ఫోన్ వ్యాపారాన్ని గత ఏడాది అక్టోబర్‌లో భారతీ ఎయిర్‌టెల్‌కు విక్రయించిన విషయం తెలిసిందే. -
700, 900 బ్యాండ్లలో ఒక్క బిడ్ రాలేదు
స్పెక్ట్రమ్ వేలం రెండో రోజు పలు సర్కిళ్లలో అధిక స్పందన న్యూఢిల్లీ: కేంద్ర టెలికం శాఖ నిర్వహిస్తున్న స్పెక్ట్రమ్ వేలంలో రెండో రోజైన సోమవారం ముంబై, రాజస్తాన్, గుజరాత్ సర్కిళ్లలో అధిక బిడ్లు దాఖలు అయ్యాయి. అత్యంత ఖరీదైన 700 మెగాహెడ్జ్‌తోపాటు 900 మెగాహెడ్జ్ బ్యాండ్‌లో ఇంత వరకు ఒక్క బిడ్ కూడా నమోదు కాలేదు. మొదటి రెండు రోజుల్లో మూడు రౌండ్ల వేలం పూర్తయింది. ఈ నెల 1న మొదటి రోజు ఐదు మొబైల్ ఫ్రీక్వెన్సీ బ్యాండ్లలో స్పెక్ట్రమ్ కోసం రూ.53,531 కోట్ల విలువైన బిడ్లు దాఖలు అయ్యాయి. ఆదివారం సెలవు కావడంతో సోమవారం రెండో రోజు వేలం కొనసాగింది. ఈ స్పెక్ట్రమ్ వేలం ఎప్పుడు ముగిసేదీ టెలికం శాఖ ఇంతవరకు ప్రకటించలేదు. అధిక ఆదరణ వీటికే..: 1800 మెగాహెడ్జ్ బ్యాండ్‌విడ్త్ ఫ్రీక్వెన్సీ స్పెక్ట్రమ్‌కు టెల్కోల నుంచి మంచి స్పందన వస్తోంది. మహారాష్ట్ర ముంబై సహా ఐదు సర్కిళ్లలో ఈ బ్యాండ్‌విడ్త్ కోసం అధిక బిడ్లు వచ్చాయి. అలాగే, 2300, 2100, 2500 మెగాహెడ్జ్ బ్యాండ్లకూ ఆదరణ బావున్నట్టు అధికార వర్గాలు తెలిపాయి. రూ.5.63 లక్షల కోట్ల ఆదాయ అంచనాతో కేంద్రం 2,354.55 మెగాహెడ్జ్ ఫ్రీక్వెన్సీలను వేలానికి ఉంచింది. -
కొనేవారే కరువయ్యారు!
వేలకోట్ల రుణాలను ఉద్దేశ్యపూర్వకంగా ఎగ్గొట్టి, విదేశాలకు పారిపోయిన వ్యాపార వేత్త.. విజయ్ మాల్యాకు చెందిన ఆస్తుల అమ్మకానికి సైతం నానా తిప్పలూ పడాల్సివస్తోంది. భారత బ్యాంకులను సుమారు 9000 కోట్ల రుణం తీసుకొని మోసగించి, మాల్యా విదేశాలకు పారిపోయిన విషయం తెలిసిందే. దీంతో ఆయనకు సంబంధించి ఆస్తులను కొనేందుకూ ఎవ్వరూ ముందుకు రావడం లేదు. తాజాగా ఆయన కంపెనీకి చెందిన జెట్ విమానం వేలానికి పెట్టగా కనీస ధర కూడ పలకకపోవడంతో వేలం నిలిపివేయాల్సి వచ్చింది. లిక్కర్ కింగ్ విజయమాల్యా ఆస్తుల వేలంలో మరోసారి నిరాశ ఎదురైంది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఏవియేషన్ సపోర్ట్ కంపెనీ.. అల్నా ఏరో డిస్ట్రిబ్యూషన్ వేసిన బిడ్ ను సర్వీస్ ట్యాక్స్ డిపార్ట్ మెంట్ రిజెక్ట్ చేసింది. కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ లిమిటెడ్ ఛైర్మన్ విజయమాల్యాకు చెందిన లగ్జరీ జెట్ విమానం.. వేలానికి పెడితే కనీస ధర 150 కోట్లు వస్తుందని అంచనా వేసిన కంపెనీకి నిరాశే మిగింలింది. బిడ్ కేవలం 1.09 కోట్ల రూపాయల అతి తక్కువ ధర రావడంతో ట్యాక్స్ అధికారులు అమ్మకానికి నిరాకరించారు. కనీస ధర కూడ పలకకపోవడంతో వేలాన్ని నిలిపివేశారు. -
ఎన్ఎస్ జీ సభ్యత్వానికి మెక్సికో మద్దతు
మెక్సికో: అమెరికా, స్విట్జర్లాండ్ ల తర్వాత కీలకమైన న్యూక్లియర్ సప్లైయర్స్ గ్రూప్(ఎన్ఎస్జీ)లో భారత్ స్థానం కోసం మెక్సికో మద్దతు తెలిపింది. గురువారం ప్రధానమంత్రి నరేంద్రమోదీతో సంప్రదింపులు జరిపిన ఆ దేశ అధ్యక్షుడు ఎన్రిక్ పెనా నీటో తమ మద్దతును ప్రకటించారు. మోదీతో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన ఈ విషయాన్ని తెలిపారు. దీంతో ఎన్రిక్ కు ధన్యవాదాలు తెలిపిన మోదీ మెక్సికో భారత్ కు ఎనర్జీ సెక్యురిటీలో కీలకభాగస్వామిగా పేర్కొన్నారు. ఐదు దేశాల పర్యటన కోసం వెళ్లిన మోదీ చివరగా మెక్సికోలో ఆ దేశ అధ్యక్షుడితో సమావేశమై చర్చలు జరిపారు. అమ్మకందారు-కొనుగోలుదారులుగా కాకుండా అంతకంటే మంచి భాగస్వామ్యంతో ముందకెళ్తామని అన్నారు. ట్రేడ్ సెక్టార్, పెట్టుబడులు, వాతావరణ మార్పులు, ఎనర్జీ తదితర ఒప్పందాలపై ఇరువురు సంతకాలు చేశారు. చైనా ఎన్ఎస్ జీలో భారత సభ్యత్వాన్ని వ్యతిరేకిస్తుండటంతో మెక్సికో, స్విట్జర్లాండ్ల మద్దతు భారత్ కు కలిసొచ్చే అంశం. భారత్ కు న్యూక్లియర్ ఆయుధాల అమ్మకాలకు సంబంధించిన ఎన్పీటీలో స్థానం లేదని చైనా వాదిస్తుండగా.. భారత్ ట్రాక్ రికార్డు కారణంగా తాము, మిగతా దేశాలు ఇందుకు సపోర్ట్ చేస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా మంగళవారం తెలిపిన విషయం తెలిసిందే. ఎన్ఎస్ జీ స్థానం వల్ల అటామిక్ ఎనర్జీ సెక్టార్ లో భారత్ భారీగా లాభపడుతుంది. -
సింగిల్ టెండర్!
జనం అవసరాల రీత్యా ఆ పని అత్యవసరం.. దాన్నే వారు అడ్డంగా వాడుకొని సర్కారు సొమ్ము దోచుకోవాలనుకున్నారు. సింగిల్ టెండరే.. అది కూడా ఎక్సెస్ రేటుకు బిడ్ దాఖలైనా.. నిబంధనలు అంగీకరించకున్నా.. ఖాతరు చేయలేదు. ఏదోలా దాన్ని ఓకే చేసేసి పబ్బం గడిపేయాలని ప్లాన్ వేశారు. గుట్టుగా టెక్నికల్ బిడ్ కూడా తెరిచి ఓకే చేశారు. అక్కడే కథ అడ్డం తిరిగింది. విషయం లీకైంది. బాస్ ఆరా తీశారు. లోగట్టు అర్థమైంది. అంతే టెండర్ రద్దు చేసి.. మళ్లీ కొత్తగా ఆహ్వానించాలని ఆదేశించడంతో అక్రమార్కుల నోట్లో వెలక్కాయ పడినట్లయ్యింది. విశాఖపట్నం : అధిక రేటుతో దాఖలైన ఒకే ఒక టెండర్‌ను అత్యవసరం అన్న సాకుతో నిబంధనలకు విరుద్ధంగా ఆమోదించేందుకు జరిగిన ప్రయత్నాలు చివరి క్షణంలో బెడిసికొట్టాయి. హైడ్రామా మధ్య ఏలేరు నీటి పంపింగ్ టెండర్ రద్దయింది. ఏలేరులో ప్రసుతం 63 మీటర్ల కంటే తక్కువ నీటి మట్టం ఉంది. డెడ్‌స్టోరేజ్ కంటే దిగువకు పడిపోయినప్పటికీ విశాఖ నగర అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఉన్న కొద్దిపాటిని నీటిని పంపింగ్ చేసేందుకు అధికారులు టెండర్లు పిలిచారు. షెడ్యూల్ ప్రకారం రెండు నెలల పాటు నీరు పంపింగ్ చేయాల్సి ఉంటుంది. ప్రసుతం నీరు లేకపోయినప్పటికీ వర్షాలు పడితే చేరే నీటిని ఎప్పటికప్పుడు పంపింగ్ చేసి ఏలేరు కాల్వ ద్వారా విశాఖకు తరలించేందుకు ఆగమేఘాల మీద ఈ టెండర్‌ను పిలిచారు. రూ.4.83 కోట్ల విలువైన ఈ టెండర్ కోసం ఒకే ఒక్క బిడ్ దాఖలైంది. అందులోనూ షెడ్యూల్ రేటు కంటే రెండు మూడు శాతం ఎక్కువ రేటు కోట్ చేసినట్లు తెలిసింది. ఆ రేటు ఎంతన్నది అధికారులు వెల్లడించలేదు. సింగిల్ బిడ్ దాఖలైనప్పుడు దాన్ని రద్దు చేయాలని నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి. వాటిని పట్టించుకోకుండా దాఖలైన ఏకైక బిడ్‌ను ఖరారు చేసేయాలని ఇంజినీరింగ్ అధికారులు ఉత్సాహం చూపించారు. గురువారం రాత్రి టెక్నికల్ బిడ్ ఓకే చేసిన సీఈ దుర్గాప్రసాద్ నేతృత్వంలోని కమిటీ సభ్యులు అదే ఊపులో సమయం తక్కువగా ఉందనే సాకుతో ఫైనాన్షియల్ బిడ్‌ను కూడా తెరిచి ఒకే చేయాలని చేసిన ప్రయత్నాలు బెడిసి కొట్టాయి. కమిషనర్‌కు తెలియజేయకుండానే.. ఈ విషయం తెలిసిన ‘సాక్షి’ సీఈ దుర్గాప్రసాద్‌ను సంప్రదించగా సింగిల్ టెండర్ దాఖలైనంత మాత్రాన రద్దు చేయాల్సిన అవసరం లేదని.. ఈ రాత్రికే ఖరారు చేస్తామని ఆయన స్పష్టం చేశారు. టెండర్ తెరుస్తున్న విషయాన్ని కనీసం కమిషనర్‌కు కూడా చెప్పకుండా ఖరారు చేసేందుకు కమిటీ రెడీ అయ్యింది. అయితే చివరి నిముషంలో ఈ విషయం తెలుసుకున్న కమిషనర్ ప్రవీణ్‌కుమార్ టెండర్ వివరాలపై ఆరా తీశారు. ఎక్సెస్ టెండర్ దాఖలైనప్పటికీ సమయం తక్కువగా ఉందనే సాకుతో కమిటీ ఆమోదముద్ర వేసేందుకు సిద్ధమవుతున్నదని కమిషనర్ గుర్తించారు. టెండర్ షెడ్యూల్లో నిర్ణయించిన రేటు కంటే కాంట్రాక్టర్ ఎక్కువగా కోట్ చేసినట్టు నిర్థారణకు వచ్చిన ఆయన ఆ టెండర్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ ఖరారు చేయొద్దని.. దాన్ని రద్దు చేయాలని ఆదేశించారు. మూడురోజుల కాలవ్యవధితో శుక్రవారం మళ్లీ టెండర్లు ఆహ్వానించాలని కూడా ఆదేశించారు. స్పెల్బో కంపెనీ జాయింట్ వెంచర్‌గా వేసిన ఈ సింగిల్ టెండర్‌ను ఎలాగైనా ఖరారు చేయాలని ఇంజనీరింగ్ అధికారులు ఉత్సాహం చూపడం చూస్తే.. అధికారులు, సదరు కాంట్రాక్టు సంస్థ కుమ్మక్కయ్యారన్న ఆరోపణలకు ఆస్కారమిస్తోంది. దీనిపై కమిషనర్ ప్రవీణ్‌కుమార్ వివరణ కోరగా అత్యవసర పని కావడంతో సింగిల్ టెండర్ దాఖలైనప్పటికీ ఖరారు చేసే అవకాశం ఉందని.. అయితే ఎక్సెస్ రేటు కోట్ చేస్తే మాత్రం రద్దు చేయాల్సిందేనని ఆయన అన్నారు. ఈ కారణంతోనే టెండర్‌ను రద్దు చేసి రీ టెండర్ పిలిచేందుకు ఆదేశాలు జారీ చేశామని ‘సాక్షి’కి తెలిపారు. -
అమెరికా అధ్యక్ష పోటీలో మనోడు!
వాషింగ్టన్: ప్రపంచానికి పెద్దన్నగా చెలామణీ అవుతోన్న అమెరికా దేశానికి అధ్యక్షుడిగా భారత సంతతికి చెందిన వ్యక్తి పోటీ పడతారో లేదో మరి కొద్ది గంటల్లో తేతిపోనుంది. 2016లో జరగనున్న ఎన్నికల రేసు మొదలైన దగ్గర్నుంచి.. 'అతడే గెలుపు గుర్రం' అని అందరిచేతా అనిపించుకున్న లూసీయానా గవర్నర్ బాబీ జిందాల్ మరి కొద్దసేపట్లో తన నిర్ణయాన్ని వెల్లడించనున్నారు. రిపబ్లికన్ పార్టీ తరఫున బాబీతోపాటు పదకొండు మంది ప్రముఖులు అధ్యక్ష అభ్యర్థిత్వం కోసం పోటీపడుతున్నారు. వారిలో మాజీ అధ్యక్షుడు జార్జి బుష్ సోదరుడు, ఫ్లోరిడా మాజీ గవర్నర్ జెబ్ బుష్, న్యూరో సర్జన్ బెన్ కార్సన్, టెక్సాస్ సెనెటర్ టెడ్ క్రూజ్, హెచ్‌పీ (హ్యులెట్ ప్యాకర్డ్) సంస్థ మాజీ సీఈవో కార్లీ ఫియోరీనా, 2008లో అధ్యక్ష స్థానంకోసం పోటీచేసి ఓడిపోయిన మైక్ హుక్కాబీ తదితరులు ఉన్నారు. అయితే అపారమైన పాలనా అనుభవంతోపాటు సమర్థుడైన నాయకుడిగా పేరుతెచ్చుకున్న బాబీ జిందాల్ రేసులో అందరికంటే ముందున్నారు. పైగా ప్రస్తుతం అత్యంత ప్రధానమైన రిపబ్లికన్ గవర్నర్ల అసోసియేషన్‌కు ఆయన చైర్మన్‌గా కొనసాగుతున్నారు. అంతేకాదు విధాన పరమైన అంశాల్లో ప్రత్యర్థి డెమోక్రాట్ పార్టీని చీల్చి చెండాడటంలో రిపబ్లికన్ల తరఫున బాబీని మించిన వ్యక్తి ఎవరూ లేరు. ఇప్పటికే ఆయనకు 'వోకల్ క్రిటిక్ ఆఫ్ ఒబామా' అనే పేరుంది. డెమోక్రాట్ల తరఫున అధ్యక్ష పదవికి రేసులో ఉన్న హిల్లరీ క్లింటన్‌ను ఇప్పటికే తన విమర్శనాస్త్రాలతో ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు బాబీ జిందాల్.