
న్యూఢిల్లీ: కేజీ–డీ6 గ్యాస్ విక్రయానికి సంబంధించి రిలయన్స్–బీపీ నిర్వహించిన వేలంలో వరుసగా రెండోసారి ప్రభుత్వ రంగ ఇండియన్ ఆయిల్ (ఐవోసీ) టాప్ బిడ్డరుగా నిల్చింది. మే నెలలో రోజుకు 5 మిలియన్ ప్రామాణిక ఘనపు మీటర్ల (ఎంసీఎండీ) గ్యాస్‌ను వేలం వేయగా 2.5 ఎంసీఎండీని దక్కించుకుంది. అంతకు ముందు ఏప్రిల్‌లో కూడా రిలయన్స్-బీపీ 6 ఎంసీఎండీ గ్యాస్‌ను వేలం వేయగా దాదాపు అందులో సగభాగాన్ని ఐవోసీ కొనుగోలు చేసింది.
తాజాగా మూడేళ్ల పాటు సరఫరా కోసం గత నెల 19 నుంచి 23 వరకు కేజీ–డీ6 గ్యాస్ ఈ–వేలం నిర్వహించగా మొత్తం 16 సంస్థలు కొనుగోలు చేశాయి. యూనిట్ (ఎంబీటీయూ) ఒక్కింటికి సగటున దాదాపు 10 డాలర్ల చొప్పున రేటు పలికినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
Comments
Please login to add a commentAdd a comment