
సాక్షి, ముంబై: అప్పుల ఊబిలో చిక్కుకుని చివరకు మూతపడిన జెట్ ఎయిర్‌వేస్‌కు సంబంధించి ఒకకీలక విషయం మార్కెట్ వర్గాల్లో నానుతోంది. హిందూజా గ్రూప్ మూతపడిన జెట్ ఎయిర్‌వేస్ ఇండియా లిమిటెడ్‌ను కొనుగోలు చేయడానికి బిడ్‌ను సిద్ధం చేస్తోంది. బిలియనీర్ హిందూజా బ్రదర్స్ జెట్ ఎయిర్‌వేస్‌కు బిడ్ సిద్ధం చేస్తున్నట్టు తాజా నివేదికలు వెల్లడిస్తున్నాయి. గోపిచంద్ హిందూజా, అశోక్ హిందూజా సోదరుల బృందం 2020 జనవరి 15 గడువు లోగా బిడ్‌ను సమర్పించాలని యోచిస్తోంది. అయితే ఈ వార్తలపై హిందుజా గ్రూపు అధికారికంగా స్పందించాల్సి వుంది.