hinduja brothers
-
హిందూజా బ్రదర్స్ మధ్య చిచ్చుపెట్టిన లేఖ
లండన్: ‘హిందూజా బ్రదర్స్’ ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని పేరు. మనల్ని వందల సంవత్సరాల పాటు పాలించిన బ్రిటీష్ వారి గడ్డపై అత్యంత ధనవంతులుగా నిలిచిన భారతీయులు. 'ఐకమత్యమే మహాబలం' అనే నానుడి అపరకుబేరులైన హిందుజా సోదరులకు సరిగ్గా సరిపోతుంది. అయితే ప్రస్తుతం వీరి మధ్య కూడా ఆస్తి వివాదాలు నడుస్తున్నట్లు సమాచారం. లండన్ కోర్టు మంగళవారం ఇచ్చిన తీర్పుతో ఈ సోదరుల మధ్య ఉన్న వివాదం వెలుగులోకి వచ్చింది. ఈ నలుగురు సోదరులు సంతకం చేసిన ఓ లేఖ వారి మధ్య వివాదాన్ని రాజేసింది. అంతేకాక 11.2 బిలయన్ డాలర్ల కుటుంబ సంపద ప్రస్తుతం చట్టపరమైన ఇబ్బందులు ఎదుర్కోబోతుంది. ఆ వివరాలు.. 2014 నాటిదిగా చెప్తున్న ఈ లేఖలో ఒక సోదరుడి వద్ద ఉన్న ఆస్తులు అందరికీ చెందినవని.. ప్రతి మనిషి ఇతరులను వారి కార్యనిర్వాహకులుగా నియమిస్తారని పేర్కొంటుంది. అయితే ప్రస్తుతం ఆ కుటుంబ పెద్ద అయిన శ్రీచంద్ హిందూజా(84) అతని కుమార్తె వినో ఈ లేఖను పనికిరానిదిగా ప్రకటించాలనుకుంటున్నారు. ఈ లేఖను ఆధారంగా చేసుకుని గోపిచంద్, ప్రకాష్, అశోక్ ముగ్గురు సోదరులు హిందూజా బ్యాంక్‌ను నియంత్రణలోకి తీసుకోవడానికి ప్రయత్నించారని విను ఆరోపిస్తున్నారు. శ్రీచంద్ పేరు మీద ఉన్న ఏకైక ఆస్తి ఈ హిందూజా బ్యాంక్ మాత్రమే. ఈ క్రమంలో శ్రీచంద్, అతడి కుమార్తె విను ఈ లేఖకు చట్టపరమైన విలువ ఉండకూడదని.. దానిని వీలునామాగా ఉపయోగించరాదంటూ తీర్పు చెప్పాల్సిందిగా న్యాయమూర్తిని కోరుకుంటున్నారు. అంతేకాక 2016లోనే శ్రీచంద్ ఈ లేఖ తన ఆలోచనలకు విరుద్ధంగా ఉందని తెలపడమే కాక కుటుంబ ఆస్తులను వేరుచేయాలని పట్టుబట్టారని ఆయన కుమార్తె విను తెలిపారు. అయితే శ్రీచంద్ తరపు న్యాయవాది దీనిపై స్పందించడానికి ఇష్టపడలేదు. అయితే మిగతా ముగ్గురు సోదరులు మాత్రం ఈ కేసు తమ వ్యాపారంపై ఎటువంటి ప్రభావాన్ని చూపదన్నారు. కానీ ఈ విచారణ తమ వ్యవస్థాపకుడి ఆశయాలకు.. కుటుంబ విలువలకు విరుద్ధంగా ఉందన్నారు. ‘ప్రతిదీ అందరికీ చెందినది.. ఏదీ ఎవరికీ చెందదు’ అనే సూత్రం మీదనే తమ కుటుంబం దశాబ్దాలుగా నడుస్తుందని వారు తెలిపారు. కుటుంబ విలువలను సమర్థించే వాదనకు తాము మద్దతిస్తామని అని ముగ్గురు సోదరులు ఒక ఇమెయిల్ ద్వారా తెలిపారు. ఒకవేళ ఈ దావా గనక విజయవంతమైతే.. బ్యాంక్‌లోని మొత్తం వాటాతో సహా శ్రీచంద్ పేరులోని అన్ని ఆస్తులు అతని కుమార్తె వినుకి.. ఆమె వారసులకు చెందుతాయని ముగ్గురు సోదరులు తెలిపారు. ప్రపంచంలోని అత్యంత ధనవంతులలో హిందూజా కుటుంబం ఒకటి. వారి సంపదలో ఎక్కువ భాగం హిందూజా గ్రూప్ నుండి వచ్చింది. దీనికి ఒక శతాబ్దానికి పైగా చరిత్ర ఉంది. ఈ రోజు వీరికి దాదాపు 40 దేశాలలో ఫైనాన్స్, మీడియా, ఆరోగ్య సంరక్షణలో పెట్టుబడులు ఉన్నాయి. బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ సూచిక హిందూజా కుటుంబ సంపదను 11.2 బిలియన్ డాలర్లుగా అంచనా వేసింది. -
జెట్ ఎయిర్వేస్కు మంచి రోజులు?!
సాక్షి, ముంబై: అప్పుల ఊబిలో చిక్కుకుని చివరకు మూతపడిన జెట్ ఎయిర్వేస్కు సంబంధించి ఒకకీలక విషయం మార్కెట్ వర్గాల్లో నానుతోంది. హిందూజా గ్రూప్ మూతపడిన జెట్ ఎయిర్వేస్ ఇండియా లిమిటెడ్‌ను కొనుగోలు చేయడానికి బిడ్‌ను సిద్ధం చేస్తోంది. బిలియనీర్ హిందూజా బ్రదర్స్ జెట్ ఎయిర్వేస్కు బిడ్ సిద్ధం చేస్తున్నట్టు తాజా నివేదికలు వెల్లడిస్తున్నాయి. గోపిచంద్ హిందూజా, అశోక్ హిందూజా సోదరుల బృందం 2020 జనవరి 15 గడువు లోగా బిడ్‌ను సమర్పించాలని యోచిస్తోంది. అయితే ఈ వార్తలపై హిందుజా గ్రూపు అధికారికంగా స్పందించాల్సి వుంది. -
యుకెలో అత్యంత సంపన్నుల జాబితాలో హిందుజా సోదరులు
-
బ్రిటన్ సంపన్నుల్లో హిందుజాలు నంబర్–2
లండన్: బ్రిటన్ సంపన్నుల్లో హిందుజా సోదరులు రెండో స్థానంలో నిలిచారు. కెమికల్స్ వ్యాపారి జిమ్రాట్క్లిఫ్ అత్యంత సంపన్నుడిగా ప్రథమ స్థానంలో ఉన్నారు. రాట్క్లిఫ్ సంపద 21.05 బిలియన్ పౌండ్లు కాగా... శ్రీచంద్(82), గోపీచంద్ హిందుజా(78)ల ఉమ్మడి సంపద 20.64 బిలియన్ పౌండ్లుగా ఉన్నట్టు ‘సండే టైమ్స్ రిచ్ లిస్ట్ 2018’ పేర్కొంది. 1,000 మంది బ్రిటన్ సంపన్నులతో ఈ నివేదిక విడుదలైంది. ఇందులో భారత సంతతికి చెందిన 47 మంది కంటే హిందుజా సోదరులు ముందున్నారు. హిందుజా సోదరులు 2017తో పోల్చుకుంటే 4.44 బిలియన్ డాలర్ల మేర తమ సంపద విలువను పెంచుకున్నప్పటికీ స్వల్ప తేడాతో తొలి స్థానం చేజార్చుకున్నారు. అశోక్ లేలండ్, ఇండస్ఇండ్ బ్యాంకు సహా హిందుజాల ఆధ్వర్యంలో ఎన్నో కంపెనీలు నడుస్తున్నాయి. ఈ జాబితాలో మీడియా దిగ్గజం సర్లెన్ బ్లావత్నిక్ 15.26 బిలియన్ పౌండ్లతో మూడో స్థానంలో ఉండగా, జన్మతః భారతీయులైన డేవిడ్, సిమన్ రూబెన్ సోదరులు 15.09 బిలియన్ పౌండ్లతో మూడో స్థానం నుంచి నాలుగుకు దిగిపోయారు. లక్ష్మి నివాస్ మిట్టల్ 14.66 బిలియన్ పౌండ్లతో ఐదో స్థానంలో ఉన్నారు. ఇక, ప్రపంచ టాప్–50 సంపన్నుల జాబితాలో రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ 31.7 బిలియన్ పౌండ్లతో 19వ స్థానం దక్కించుకున్నారు. వాల్‌మార్ట్ యజమానులు వాల్టన్ కుటుంబం మొదటి స్థానంలో నిలిచింది. -
మళ్లీ తెరపైకి బోఫోర్స్ కేసు
-
అత్యంత సంపన్న ఆసియన్లు వీరే..
లండన్ : ఎన్ఆర్ఐ వ్యాపారవేత్త హిందూజా బ్రదర్స్ మరోసారి అత్యంత సంపన్న ఆసియన్ గా నిలిచారు. శుక్రవారం రాత్రి విడుదలైన బ్రిటన్ లో అత్యంత సంపన్న ఆసియన్ల వార్షిక ర్యాంకింగ్స్ లో హిందూజా మళ్లీ మొదటి స్థానంలో నిలిచినట్టు వెల్లడైంది. ఈయన మొత్తం సంపద 19 మిలియన్ పౌండ్స్ అంటే రూ.1,54,253 కోట్లకు పైననే. గతేడాది కంటే ఆయన సంపద దాదాపు 2.5 బిలియన్ పౌండ్లకు పైననే పెరిగినట్టు తాజా ర్యాంకింగ్స్ లో తెలిసింది. ఆయన తర్వాత స్థానాన్ని స్టీల్ టైకూన్ గా పేరున్న లక్ష్మి ఎన్ మిట్టర్ దక్కించుకున్నారు. గతేడాది కంటే ఈ ఏడాది 6.4 బిలియన్ పౌండ్లను పెంచుకున్న లక్ష్మి మిట్టల్ 12.6 బిలియన్ పౌండ్ల(రూ.1,02,294కోట్లు)తో రెండో స్థానంలో నిలిచారు. బ్రిటన్ లో 101 అత్యంత సంపన్నపరుల ఆసియన్ల 2017 జాబితా శుక్రవారం రాత్రి విడుదలైంది. ఈ జాబితాలో తొలి స్థానంలో నిలిచిన హిందూజా బ్రదర్స్- లండన్ లోని శ్రీచంద్, గోపి, ముంబాయిలోని అశోక్, జెనీవాలో ప్రకాశ్ లు తమ అశోక్ లేల్యాండ్, ఇండస్ ఇండ్ బ్యాంకు, గల్ఫ్ ఆయిల్, ఎనర్జీ, రియల్ ఎస్టేట్ లలో భారీగా లాభాలను పెంచుకున్నారు. బ్రిటన్ లోని 101 సంపన్న ఆసియన్ల సంపద మొత్తం 69.9 బిలియన్ పౌండ్లు(రూ.5,67,492కోట్లకు పైనే)గా ఉంది.. గతేడాది కంటే ఇది 25 శాతం పెరిగింది. హిందూజా బ్రదర్స్, లక్ష్మి మిట్టల్ అనంతరం ఇండోరమ కార్పొరేషన్ చైర్మన్ ప్రకాశ్ లోహియా మూడో సంపన్నవంతుడిగా ఉన్నారు. -
యూకే కుబేరుల్లో రూబెన్, హిందుజా బ్రదర్స్ టాప్
లండన్: యూకే సంపన్నుల్లో భారతీయ సంతతికి చెందిన వారు టాప్‌లో ఉన్నారు. ‘సండేటైమ్స్ సంపన్నుల జాబితా-2016’లో రూబెన్ , హిందుజా బ్రదర్స్ తొలి రెండు స్థానాలను కైవసం చేసుకున్నారు. ముంబైకి చెందిన వ్యాపారవేత్తలు డేవిడ్, సైమన్ రూబెన్ బ్రదర్స్ 13.1 బిలియన్ పౌండ్ల సంపదతో అగ్రస్థానంలో నిలిచారు. ప్రాపర్టీ విలువ పెరుగుదల కారణంగా వీరి సంపద బాగా పెరిగింది. వీరి తర్వాతి స్థానంలో 13 బిలియన్ పౌండ్ల సంపదతో శ్రీచంద్-గోపిచంద్ హిందుజా బ్రదర్స్ ఉన్నారు. ఇక 11.59 బిలియన్ పౌండ్లతో లెన్ బ్లవట్నిక్ మూడో స్థానంలో నిలిచారు. కాగా స్టీల్ పరిశ్రమ సంక్షోభం.. యూకే ధనవంతుల సంపద, ర్యాకింగ్‌పై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపింది. 2008లో 27.7 బిలియన్ పౌండ్లతో టాప్‌లో ఉన్న ఆర్సిలర్‌మిట్టల్ చైర్మన్ లక్ష్మీ మిట్టల్ సంపద ఈ ఏడాది 7.12 బిలియన్ పౌండ్లకు పడిపోయింది. ఇండియాలో జన్మించిన రూబెన్ బ్రదర్స్ 1950వ దశకంలో బ్రిటన్ వెళ్లి, అక్కడ మెటల్స్, ప్రాపర్టీ రంగాల్లో సంపదను ఆర్జించారు. ఇక ప్రవాస భారతీయులైన హిందుజా బ్రదర్స్‌కు ఇండియాలో కూడా అశోక్ లేలాండ్, ఇండస్ఇండ్ బ్యాంక్ వంటి పెద్ద లిస్టెడ్ కంపెనీలున్న సంగతి తెలిసిందే. -
బ్రిటన్ లో టాప్-5 ప్రవాసులు భారతీయులే!
లండన్: బ్రిటన్‌లోని సంపన్న ఆసియా వ్యాపారవేత్తల జాబితాలో హిందూజా సోదరులు వరుసగా నాలుగోసారి అగ్రస్థానం దక్కించుకున్నారు. వారి వ్యక్తిగత సంపద విలువ 16.5 బిలియన్ పౌండ్లుగా ఉంది. బ్రిటన్‌కి చెందిన ఆసియన్ మీడియా అండ్ మార్కెట్ రూపొందించిన ‘ది ఆసియన్ రిచ్ లిస్ట్ 2016’ జాబితా ప్రకారం ప్రవాస భారతీయ సోదరులైన జీపీ హిందుజా, ఎస్పీ హిందుజా సంపద గత ఏడాది కాలంలో బిలియన్ పౌండ్ల మేర పెరిగింది. జాబితాలో ఉక్కు దిగ్గజం లక్ష్మీ నివాస్ మిట్టల్ 6.4 బిలియన్ పౌండ్ల సంపదతో రెండో స్థానంలో, ఇండోరమా కార్పొరేషన్ చైర్మన్ శ్రీప్రకాశ్ లోహియా 3 బిలియన్ పౌండ్లతో మూడో స్థానంలో ఉన్నారు. 2.1 బిలియన్ పౌండ్లతో ఆరోరా బ్రదర్స్ నాలుగో స్థానంలో, 2 బిలియన్ పౌండ్లతో సైరస్ వంద్రేవాలా 5వ స్థానంలో ఉన్నారు. మిట్టల్ సంపద 3.3 బిలియన్ పౌండ్లు కరిగిపోయింది. ఎన్నారై పారిశ్రామికవేత్త లార్డ్ స్వరాజ్ పాల్ 500 మిలియన్ పౌండ్లతో 15వ సంపన్న ఆసియా వ్యాపారవేత్తగా నిల్చారు. -
మిట్టల్‌ను మించిన హిందుజా
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: సంపన్నుల కేంద్రంగా విరాజిల్లుతున్న బ్రిటన్‌లో మన భారతీయులు మరోసారి ప్రపంచ దృష్టిని ఆకర్షించారు. భారత సంతతికి చెందిన హిందుజా సోదరులు గోపిచంద్, శ్రీచంద్లు బ్రిటన్‌లో అత్యంత సంపన్నులుగా నిలిచారు. వీరి సంపద 11.9 బిలియన్ పౌండ్లు. అంటే రూ.1,20,190 కోట్లు. వచ్చే వారం విడుదల కానున్న సండే టైమ్స్ యూకే సూపర్ రిచ్ వార్షిక జాబితా ముందస్తు గణాంకాల ప్రకారం.. రష్యా వ్యాపారవేత్త అలిషర్ ఉస్మనోవ్ 10.65 బిలియన్ పౌండ్లతో (రూ.1,07,565 కోట్లు) రెండో స్థానంలో ఉన్నారు. గతేడాది ఆయన తొలి స్థానంలో ఉన్నారు. ఇక కోల్‌కతాలో పుట్టిన లక్ష్మీ మిట్టల్ 10.25 బిలియన్ పౌండ్లతో (రూ.1,03,525 కోట్లు) 3వ స్థానంతో సరిపెట్టుకున్నారు. వాహన, రియల్ ఎస్టేట్, చమురు తదితర రంగాల్లో హిందుజా గ్రూప్ కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఇంకా ఉన్నారు.. బ్రిటన్ సంపన్నుల్లో మరింత మంది భారత సంతతివారు తమ స్థానాలను పదిలపర్చుకున్నారు. లక్ష్మీ మిట్టల్ సమీప బంధువు వస్త్ర, ప్లాస్టిక్ రంగంలో ఉన్న ప్రకాశ్ లోహియా 46వ ర్యాంకు దక్కించుకున్నారు. స్టీలు కంపెనీ కపారో అధినేత లార్డ్ స్వరాజ్‌పాల్ 48వ స్థానంలో నిలిచారు. మెటల్, మైనింగ్ రంగంలో ఉన్న వేదాంతా రిసోర్సెస్ చీఫ్ అనిల్ అగర్వాల్ 50వ ర్యాంకు దక్కించుకున్నారు. ఇండస్ గ్యాస్ ఫౌండర్ అజయ్ కల్సి 102వ స్థానంలో నిలిచారు. చమురు, సహజ వాయువు, పాదరక్షలు, రియల్ ఎస్టేట్ వంటి రంగాల్లో పలు కంపెనీలను అజయ్ నిర్వహిస్తున్నారు. సూపర్ రిచ్ టాప్-100 జాబితాలో చోటు సంపాదించాలంటే నికర విలువ 1 బిలియన్ పౌండ్లు (రూ.10,100 కోట్లు) దాటాలి. ఇక టాప్ 50 జాబితాకైతే సంపద 1.7 బిలియన్ పౌండ్లు (రూ.17,170 కోట్లు) ఉండాల్సిందే. 10 ఏళ్ల క్రితం 70 కోట్ల పౌండ్లు ఉంటే టాప్ 50 జాబితాలో చోటు దక్కేది. సంపన్నుల నగరం లండన్.. సూపర్ రిచ్ వార్షిక జాబితా ప్రకారం ప్రపంచంలో అత్యధికంగా బిలియనీర్లున్న నగరంగా లండన్ నిలి చింది. బ్రిటన్ తొలిసారిగా 100కుపైగా సంపన్నులతో కిక్కిరిసిపోయింది. మొత్తం 104 మంది చోటు సంపాదించారు. వీరందరి సంపాదన 301 బిలియన్ పౌండ్లు దాటింది. అంటే రూ.30,40,100 కోట్లుగా ఉంది. ఇక కేవలం లండన్ నగరం నుంచే 72 మంది బిలియనీర్లు పోటీపడుతున్నారు. 48 మంది బిలియనీర్లతో మాస్కో, ఆ తర్వాతి స్థానాల్లో న్యూయార్క్, శాన్‌ఫ్రాన్సిస్కోలు ఉన్నాయి. కాగా, 104 మంది సంపన్నుల్లో బ్రిటన్ వెలుపల జన్మించిన వారు 44 మంది ఉండడం విశేషం. లండన్ ప్రభుత్వం గురించి సంపన్నుల జాబితా రచయిత ఫిలిప్ బెరెస్ఫోర్డ్ మాట్లాడుతూ పన్నుల విధానం, భద్రతా కారణంగా లండన్ ప్రపంచ ఆర్థిక కేంద్రంగా నిలిచిందన్నారు.