యూకే కుబేరుల్లో రూబెన్, హిందుజా బ్రదర్స్ టాప్ | India-born Reuben brothers top UK rich list, Hindujas close second | Sakshi
Sakshi News home page

యూకే కుబేరుల్లో రూబెన్, హిందుజా బ్రదర్స్ టాప్

Published Mon, Apr 25 2016 12:10 AM | Last Updated on Sun, Sep 3 2017 10:39 PM

యూకే కుబేరుల్లో రూబెన్, హిందుజా బ్రదర్స్ టాప్

యూకే కుబేరుల్లో రూబెన్, హిందుజా బ్రదర్స్ టాప్

లండన్: యూకే సంపన్నుల్లో భారతీయ సంతతికి చెందిన వారు టాప్‌లో ఉన్నారు. ‘సండేటైమ్స్ సంపన్నుల జాబితా-2016’లో రూబెన్ , హిందుజా బ్రదర్స్ తొలి రెండు స్థానాలను కైవసం చేసుకున్నారు. ముంబైకి చెందిన వ్యాపారవేత్తలు డేవిడ్, సైమన్ రూబెన్ బ్రదర్స్ 13.1 బిలియన్ పౌండ్ల సంపదతో అగ్రస్థానంలో నిలిచారు. ప్రాపర్టీ విలువ పెరుగుదల కారణంగా వీరి సంపద బాగా పెరిగింది. వీరి తర్వాతి స్థానంలో 13 బిలియన్ పౌండ్ల సంపదతో శ్రీచంద్-గోపిచంద్ హిందుజా బ్రదర్స్ ఉన్నారు.

ఇక 11.59 బిలియన్ పౌండ్లతో లెన్ బ్లవట్నిక్ మూడో స్థానంలో నిలిచారు. కాగా  స్టీల్ పరిశ్రమ సంక్షోభం.. యూకే ధనవంతుల సంపద, ర్యాకింగ్‌పై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపింది. 2008లో 27.7 బిలియన్ పౌండ్లతో టాప్‌లో ఉన్న ఆర్సిలర్‌మిట్టల్ చైర్మన్ లక్ష్మీ మిట్టల్ సంపద ఈ ఏడాది 7.12 బిలియన్ పౌండ్లకు పడిపోయింది.

ఇండియాలో జన్మించిన రూబెన్ బ్రదర్స్ 1950వ దశకంలో బ్రిటన్ వెళ్లి, అక్కడ మెటల్స్, ప్రాపర్టీ రంగాల్లో సంపదను ఆర్జించారు. ఇక ప్రవాస భారతీయులైన హిందుజా బ్రదర్స్‌కు ఇండియాలో కూడా అశోక్ లేలాండ్, ఇండస్‌ఇండ్ బ్యాంక్ వంటి పెద్ద లిస్టెడ్ కంపెనీలున్న సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement