అత్యంత సంపన్న ఆసియన్లు వీరే..
అత్యంత సంపన్న ఆసియన్లు వీరే..
Published Sat, Mar 18 2017 1:46 PM | Last Updated on Sat, Jul 6 2019 12:42 PM
లండన్ : ఎన్ఆర్ఐ వ్యాపారవేత్త హిందూజా బ్రదర్స్ మరోసారి అత్యంత సంపన్న ఆసియన్ గా నిలిచారు. శుక్రవారం రాత్రి విడుదలైన బ్రిటన్ లో అత్యంత సంపన్న ఆసియన్ల వార్షిక ర్యాంకింగ్స్ లో హిందూజా మళ్లీ మొదటి స్థానంలో నిలిచినట్టు వెల్లడైంది. ఈయన మొత్తం సంపద 19 మిలియన్ పౌండ్స్ అంటే రూ.1,54,253 కోట్లకు పైననే. గతేడాది కంటే ఆయన సంపద దాదాపు 2.5 బిలియన్ పౌండ్లకు పైననే పెరిగినట్టు తాజా ర్యాంకింగ్స్ లో తెలిసింది. ఆయన తర్వాత స్థానాన్ని స్టీల్ టైకూన్ గా పేరున్న లక్ష్మి ఎన్ మిట్టర్ దక్కించుకున్నారు.
గతేడాది కంటే ఈ ఏడాది 6.4 బిలియన్ పౌండ్లను పెంచుకున్న లక్ష్మి మిట్టల్ 12.6 బిలియన్ పౌండ్ల(రూ.1,02,294కోట్లు)తో రెండో స్థానంలో నిలిచారు. బ్రిటన్ లో 101 అత్యంత సంపన్నపరుల ఆసియన్ల 2017 జాబితా శుక్రవారం రాత్రి విడుదలైంది. ఈ జాబితాలో తొలి స్థానంలో నిలిచిన హిందూజా బ్రదర్స్- లండన్ లోని శ్రీచంద్, గోపి, ముంబాయిలోని అశోక్, జెనీవాలో ప్రకాశ్ లు తమ అశోక్ లేల్యాండ్, ఇండస్ ఇండ్ బ్యాంకు, గల్ఫ్ ఆయిల్, ఎనర్జీ, రియల్ ఎస్టేట్ లలో భారీగా లాభాలను పెంచుకున్నారు.
బ్రిటన్ లోని 101 సంపన్న ఆసియన్ల సంపద మొత్తం 69.9 బిలియన్ పౌండ్లు(రూ.5,67,492కోట్లకు పైనే)గా ఉంది.. గతేడాది కంటే ఇది 25 శాతం పెరిగింది. హిందూజా బ్రదర్స్, లక్ష్మి మిట్టల్ అనంతరం ఇండోరమ కార్పొరేషన్ చైర్మన్ ప్రకాశ్ లోహియా మూడో సంపన్నవంతుడిగా ఉన్నారు.
Advertisement
Advertisement