hinduja group
-
చివరికి వచ్చేసిన రిలయన్స్ క్యాపిటల్ కొనుగోలు
రిలయన్స్ క్యాపిటల్ కొనుగోలు జనవరి చివరికి పూర్తి అవుతుందని హిందుజా గ్రూప్ కంపెనీ ఐఐహెచ్ఎల్ ఆశాభావం వ్యక్తం చేసింది. ఆర్‌క్యాప్ కొనుగోలుతో బ్యాంకింగ్, ఫైనాన్షియల్సర్వీసెస్ (బీఎఫ్ఎస్ఐ) వ్యాపారాన్ని వచ్చే ఐదేళ్లలో 50 బిలియన్ డాలర్లకు చేర్చాలనే లక్ష్యంతో ఉన్నట్టు తెలిపింది. ప్రస్తుత విలువ 15 బిలియన్ డాలర్లుగా ఉంది.‘‘రిలయన్స్ క్యాపిటల్‌కు సంబంధించి చాలా వరకు అనుమతులు, పరిష్కార ప్రక్రియలు ముగింపునకు వచ్చాయి. మరికొన్ని ప్రక్రియలు అడ్మినిస్ట్రేటర్, సీవోసీ స్థాయిలో పూర్తి కావాల్సి ఉంది. వచ్చే 4–6 వారాల్లో ఇవి పూర్తవుతాయని భావిస్తున్నాం’’అని ఐఐహెచ్ఎల్ చైర్మన్ అశోక్ పి. హిందుజా ప్రకటించారు. రూ.9,650 కోట్లకు ఆర్‌క్యాప్ కొనుగోలు బిడ్డింగ్‌లో ఐఐహెచ్ఎల్ విజేతగా నిలవడం తెలిసిందే.ఇందులో రూ.2,750 కోట్లను ఈక్విటీ రూపంలో సమకూర్చనుండగా, మిగిలిన మొత్తాన్ని రుణాలకు చెల్లించాల్సి ఉంది. దీనికి కట్టుబడి ఉన్నట్టు హిందుజా తెలిపారు. ఇండస్ ఇండ్ బ్రాండ్ ప్రచారం చేయాలని అనుకుంటున్నామని, బ్రాండ్ ప్రచారంపై ఏజెన్సీలు పనిచేస్తున్నట్టు ప్రకటించారు. ఐఐహెచ్ఎల్ మరో సబ్సిడరీ అయిన ఇండస్ఇండ్ బ్యాంక్‌తో బ్యాంక్ అష్యూరెన్స్ ఒప్పందం కోసం ఆర్‌క్యాప్ చర్చించనున్నట్టు తెలిపారు. -
అనిల్ అంబానీ ఆర్‌క్యాప్ టేకోవర్.. హిందూజాకు గ్రీన్ సిగ్నల్
న్యూఢిల్లీ: రుణ సంక్షోభంలో చిక్కుకున్న రిలయన్స్ క్యాపిటల్(ఆర్‌క్యాప్) కొనుగోలు రేసులో హిందుజా గ్రూప్‌నకు వెసులుబాటు లభించింది. పరిశ్రమలు, అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక శాఖ(డీపీఐఐటీ) తాజాగా హిందుజా గ్రూప్ సంస్థ ఐఐహెచ్ఎల్కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.ఇండస్ఇండ్ ఇంటర్నేషనల్ హోల్డింగ్స్(ఐఐహెచ్ఎల్)లోని కొంతమంది వాటాదారులు చైనా అధీనంలోని హాంకాంగ్ నివాసితులు కావడంతో డిపీఐఐటీ అనుమతి తప్పనిసరి అయ్యింది. కాగా.. సరిహద్దు(చైనా, బంగ్లాదేశ్ తదితర) దేశాల పౌరులు ఎవరైనా దేశీ సంస్థకు యజమాని అయితే.. స్థానికంగా పెట్టుబడుల కోసం ప్రభుత్వ అనుమతిని తీసుకోవలసి ఉంటుంది. వెరసి ఆర్‌క్యాప్ కొనుగోలుకి మారిషస్ సంస్థ ఐఐహెచ్ఎల్ రుణ పరిష్కార(రిజల్యూషన్) ప్రణాళికకు దారి ఏర్పాటుకానుంది.ఇదీ చదవండి: అనిల్ అంబానీ భారీ ప్లాన్..ఇప్పటికే రూ. 9,861 కోట్ల విలువైన రిజల్యూషన్ ప్రణాళిక ద్వారా ఐఐహెచ్ఎల్ బిడ్డింగ్‌లో గెలుపొందింది. ఈ ప్రణాళికను 2024 ఫిబ్రవరి 27న ఎన్సీఎల్టీ ముంబై బెంచ్ అనుమతించిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా రుణదాతల కమిటీ 99.96 శాతం వోటింగ్‌తో మద్దతు పలికింది. దీనిలో భాగంగా డీపీఐఐటీ తాజాగా అనుమతించింది. -
48 గంటల్లో రూ. 2,750 కోట్లు డిపాజిట్ చేయండి
ముంబై: రిలయన్స్ క్యాపిటల్ (ఆర్‌క్యాప్) పరిష్కార ప్రణాళికకు సంబంధించి 48 గంటల్లోగా రూ. 2,750 కోట్ల మొత్తాన్ని ఎస్క్రో ఖాతాలో జమ చేయాల్సిందిగా ఇండస్ఇండ్ ఇంటర్నేషనల్ హోల్డింగ్స్ (ఐఐహెచ్ఎల్)ను నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) ఆదేశించింది. ఈ ఖాతాపై వచ్చే వడ్డీ, రుణదాతల కమిటీకే (సీవోసీ) చెందుతుందని స్పష్టం చేసింది. వివరాల్లోకి వెడితే.. రుణాల చెల్లింపులో విఫలమైన ఆర్‌క్యాప్ దివాలా చట్టం కింద చర్యలు ఎదుర్కొంటోంది. సంస్థను కొనుగోలు చేసేందుకు దివాలా పరిష్కార ప్రణాళిక కింద రూ. 9,661 కోట్లు ఆఫర్ చేసిన హిందుజా గ్రూప్ సంస్థ ఐఐహెచ్ఎల్ .. బిడ్డింగ్‌లో విజేతగా నిలి్చంది. ఇందులో రూ. 2,750 కోట్ల మొత్తాన్ని రుణదాతల కమిటీ ఖాతాలోకి డిపాజిట్ చేయాలంటూ జూలై 23న ఐఐహెచ్ఎల్ని ఎన్సీఎల్టీ ముంబై బెంచ్ ఆదేశించింది. అయితే, ఇందుకు సంబంధించిన ప్రణాళిక అమలుకు గడువు పెంచుతూ ఆదేశాల్లో కొన్ని సవరణలు చేయాలంటూ కంపెనీ కొత్తగా దాఖలు చేసిన పిటీషన్‌పై విచారణ సందర్భంగా ఎన్సీఎల్టీ తాజా ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే మరో రూ. 7,300 కోట్ల నిధుల సమీకరణ వివరాలను కూడా పర్యవేక్షణ కమిటీకి తెలియజేయాలంటూ సూచించింది. మరోవైపు, ఎన్సీఎల్టీ ఆదేశించినట్లుగా రూ. 2,750 కోట్ల మొత్తాన్ని సీవోసీ ఖాతాల్లో డిపాజిట్ చేయకుండా ఆ మొత్తాన్ని తన సొంత ఖాతాలోనూ, ప్రమోటర్ల ఖాతాలోనూ జమ చేసుకుందని దివాలా పరిష్కార నిపుణుడు ఆరోపించారు. అయితే, ఎస్క్రో ఖాతా వివరాలను సీవోసీ ఇవ్వనందువల్లే అలా చేయాల్సి వచి్చందని ఐఐహెచ్ఎల్ వివరణ ఇచి్చంది. -
హిందూజ గ్రూప్ ఫ్యామిలీకి జైలు శిక్ష.. అంతా ఉత్తదే!
హిందూజా కుటుంబానికి ఎటువంటి జైలు శిక్ష పడలేదని వారికి సంబంధించిన అధికార ప్రతినిధి తెలిపారు. హిందూజా గ్రూప్ చైర్మన్ ప్రకాశ్ హిందుజా, ఆయన భార్య కమల్ హిందూజా, కుమారుడు అజయ్, కోడలు నమ్రత తమ జెనీవా నివాసంలో పనిచేసే భారతీయ వలసదారు సిబ్బందిని వేధించారంటూ స్విస్ కోర్టులో పిటిషన్ వేయగా కోర్టు వారికి జైలు శిక్ష విధించినట్లు వార్తలు వచ్చాయి. అయితే హిందూజా కుటుంబంలోని నలుగురు సభ్యులను జైల్లో పెట్టలేదని, వారిపై మానవ అక్రమ రవాణా అభియోగాలను కోర్టు కొట్టివేసినట్లు హిందూజా అధికార ప్రతినిధి ఒక ప్రకటనలో తెలిపారు. ‘స్విస్ పౌరులైన హిందూజా కుటుంబానికి చెందిన నలుగురు సభ్యులు కమల్, ప్రకాశ్ హిందూజా, నమ్రత, అజయ్ హిందూజాలకు ఎలాంటి జైలుశిక్ష, నిర్బంధం విధించలేదు’ అని పేర్కొన్నారు.మిగిలిన అభియోగాల్లో దిగువ కోర్టు తీర్పుపై ఉన్నత న్యాయస్థానంలో తాము అపీల్ చేసినట్లు హిందూజా ప్రతినిధి తెలిపారు. "స్విస్ చట్టాల ప్రకారం.. అత్యున్నత న్యాయస్థానం తుది తీర్పు వచ్చేంత వరకు నిర్దోషిత్వ భావన చాలా ముఖ్యమైనది కాబట్టి దిగువ కోర్టు తీర్పు పనిచేయదు" అని వివరించారు. తమకు అర్థం కాని స్టేట్ మెంట్లపై సంతకాలు చేయించారని బాధిత సిబ్బంది కోర్టులో ప్రకటించారని, హిందుజా కుటుంబం తమను గౌరవంగా, హుందాగా, కుటుంబ సభ్యుల్లా చూసుకున్నారని వారంతా సాక్ష్యం చెప్పారని వివరించారు. స్విస్ న్యాయ ప్రక్రియపై తమకు పూర్తి విశ్వాసం ఉందని, సత్యం గెలుస్తుందని పేర్కొన్నారు. -
బ్రిటన్‌లో అత్యంత సంపన్నుడు భారతీయుడే..!
భారత సంతతికి చెందిన వ్యాపారవేత్త గోపీచంద్ హిందూజా యూకేలో అత్యంత సంపన్న వ్యక్తిగా నిలిచారు. ‘ది సండే టైమ్స్ రిచ్ లిస్ట్’ యూకేలోని 1,000 మంది సంపన్నులు లేదా కుటుంబాలతో వారి మొత్తం నెట్‌వర్త్ ప్రకారం జాబితా రూపొందించింది. ఈ జాబితాలో హిందుజా గ్రూప్ ఛైర్మన్ గోపీచంద్ హిందూజాను అగ్రస్థానంలో నిలిచారు.‘ది మిర్రర్’ ప్రకారం.. హిందుజా కుటుంబం ఆరు సంవత్సరాలుగా బ్రిటన్‌లో అత్యంత సంపన్నులుగా నిలుస్తూ వస్తోంది. ర్యాంకింగ్ ఆధారంగా హిందూజా నెట్‌వర్త్ అంతకు ముందు సంవత్సరంలోని 35 బిలియన్ పౌండ్ స్టెర్లింగ్స్ (సుమారు రూ. 3.7 లక్షల కోట్లు) నుంచి సుమారు 37.196 బిలియన్ పౌండ్ స్టెర్లింగ్స్‌కు (సుమారు రూ. 3.9 లక్షల కోట్లు) పెరిగింది.జీపీగా పిలిచే గోపీచంద్ హిందూజా భారత్‌లో 1940లో జన్మించారు. హిందూజా ఆటోమోటివ్ లిమిటెడ్ ఛైర్మన్ అయిన ఆయన గత సంవత్సరం తన సోదరుడు శ్రీచంద్ హిందూజా మరణించిన తరువాత తమ వ్యాపార సమూహానికి నాయకత్వ బాధ్యతలు చేపట్టారు. గోపీచంద్ 1959లో ముంబైలోని జై హింద్ కళాశాల నుంచి న్యాయశాస్త్ర పట్టా పొందారు. వెస్ట్‌మినిస్టర్ విశ్వవిద్యాలయం నుంచి గౌరవ డాక్టరేట్ అందుకున్నారు. దీంతోపాటు లండన్‌లోని రిచ్మండ్ కళాశాల నుంచి ఆర్థికశాస్త్రంలో గౌరవ డాక్టరేట్‌ను పొందారు. గోపీచంద్ తండ్రి, పరమానంద్ హిందూజా 1914లో హిందూజా ఫ్యామిలీ కంపెనీని స్థాపించారు. -
‘ఇన్వెస్కో’లో హిందుజా సంస్థకు వాటాలు
ముంబై: మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్కో అసెట్ మేనేజ్మెంట్ ఇండియా (ఐఏఎంఐ)లో 60 శాతం వాటాలు కొనుగోలు చేస్తున్నట్లు హిందుజా గ్రూప్ సంస్థ ఇండస్ఇండ్ ఇంటర్నేషనల్ హోల్డింగ్స్ (ఐఐహెచ్ఎల్) వెల్లడించింది. ఇందుకు సంబంధించి జాయింట్ వెంచర్‌ను ఏర్పాటు చేసేందుకు ఐఐహెచ్ఎల్, ఇన్వెస్కో ఒప్పందం కుదుర్చుకున్నట్లు వివరించింది. దీని ద్వారా ఐఏఎంఐలో ఐఐహెచ్ఎల్కు 60 శాతం, ఇన్వెస్కోకు 40% వాటాలు ఉంటాయి. 1.6 లక్షల కోట్ల డాలర్ల విలువ చేసే అసెట్స్‌ను నిర్వహించే అంతర్జాతీయ ఇన్వెస్ట్మెంట్ మేనేజ్మెంట్ దిగ్గజం ఇన్వెస్కోకి ఐఏఎంఐ భారత విభాగంగా ఉంది. లోటస్ ఇండియా అసెట్ మేనేజ్మెంట్ను కొనుగోలు చేయడం ద్వారా 2008 ఆఖర్లో భారత మార్కెట్లో కార్యకలాపాలు ప్రారంభించింది. 2024 మార్చి 31 నాటికి ఐఏఎంఐ ఏయూఎం (నిర్వహణలో ఉన్న ఆస్తులు) రూ. 85,393 కోట్లుగా ఉండగా, దేశవ్యాప్తంగా 40 నగరాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. సంస్థకు హైదరాబాద్‌లో ఎంటర్ప్రైజ్ సెంటర్ కూడా ఉంది. ఇందులో 1,700 మంది పైచిలుకు ఉద్యోగులు ఉన్నారు. -
గల్ఫ్ ఆయిల్ చేతికి టైరెక్స్
ముంబై: ఎలక్ట్రిక్ వాహన(ఈవీ) చార్జర్ల తయారీ కంపెనీ టైరెక్స్ ట్రాన్స్‌మిషన్‌లో నియంత్రణ వాటాను కొనుగోలు చేయనున్నట్లు హిందుజా గ్రూప్ కంపెనీ గల్ఫ్ ఆయిల్ లూబ్రికెంట్స్ ఇండి యా తాజాగా పేర్కొంది. ఇందుకు రూ.103 కోట్లు వెచి్చంచనున్నట్లు పేర్కొంది. తద్వారా ఈవీ విభాగంలో కంపెనీ కార్యకలాపాలు మరింత విస్తరించనున్నట్లు అంచనా వేసింది. ఈవీ చార్జింగ్ మార్కెట్ ప్రస్తుత అంచనా విలువ 20 బిలియన్ డాలర్లుకాగా.. 2030కల్లా భారీగా 200 బిలియన్ డాలర్లను తాకగలదన్న అంచనాలున్నట్లు తెలిపింది. -
రిలయన్స్ క్యాపిటల్‌పై హిందూజా బ్రదర్స్ కన్ను: బిలియన్ డాలర్ల ఫండ్
అప్పుల ఊబిలో కూరుకుపోయిన అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ క్యాపిటల్‌ను కొనుగోలు చేసేందుకు హిందూజా కుటుంబం ప్లాన్ చేస్తోంది. తాజా నివేదికల ప్రకారం దాదాపు రూ. 8,200 కోట్లు (1 బిలియన్ డాలర్లు) గ్లోబల్ క్రెడిట్ ఫండ్స్‌ను సమీకరించిందట. ఒకప్పుడు రూ.93,851 కోట్ల విలువైన రిలయన్స్ క్యాపిటల్ కొనుగోలుకు ప్రయత్నించిన దిగ్గజ కంపెనీల్లో హిందుజాలు ప్రాధాన్యమైన బిడ్డర్ కావడం గమనార్హం. (లెజెండ్ విశ్వనాథన్ ఆనంద్ ట్వీట్ చూశారా? ఇంటర్నెట్ లేటెస్ట్ హల్చల్) తాజాగా ఫరాలోన్ క్యాపిటల్, ఓక్ట్రీ, అరేస్ ఆసియా అండ్ ఆసెర్బెరస్ లాంటి వాటితో హిందుజాలు టచ్‌లో ఉన్నారని మూలాలను ఉటంకిస్తూ ఎకనామిక్ టైమ్స్ నివేదించింది. రిలయన్స్ క్యాపిటల్ లైఫ్, జనరల్ ఇన్సూరెన్స్ షేర్ల ద్వారా హిందుజాలు ఫైనాన్సింగ్‌కు మద్దతు ఇవ్వవచ్చని దీనికి సంబంధించి బీమా రెగ్యులేటర్ నుండి అవసరమైన అనుమతికి ఫండింగ్ పార్టనర్లు హిందుజాల నుండి గ్యారెంటీని కోరే అవకాశం ఉందని నివేదించింది. (Google Doodle Pani Puri Game: క్రిస్పీ..క్రిస్పీ పానీ పూరీ లవ్: గూగుల్ డూడుల్ ఇంటరాక్టివ్ గేమ్) స్వాధీనానికి కోర్టు అనుమతి లభించిన తర్వాత మాత్రమే ఫైనాన్సింగ్ చేయనున్నారని, రాబోయే వారాల్లో ఫైనాన్షియర్ల తుది జాబితా మారే అవకాశం ఉందని పేర్కొంది. హిందూజా గ్రూప్ కంపెనీ ఇండస్ఇండ్ ఇంటర్నేషనల్ హోల్డింగ్స్ లిమిటెడ్ (IIHL) సమర్పించిన రూ. 9,650 కోట్ల రిజల్యూషన్ ప్లాన్‌ను అనిల్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ క్యాపిటల్ రుణదాతలు దివాలా అండ్ దివాలా కోడ్ (IBC) నిబంధనల ప్రకారం ఆమోదించారని హిందూజా గ్రూప్ జూలై 3న తెలిపింది. చెల్లింపు డిఫాల్ట్‌లు , పాలనాపరమైన సమస్యల కారణంగా నవంబర్ 29, 2021న ఆర్బీఐ రిలయన్స్ క్యాపిటల్ బోర్డ్‌ను తన ఆధీనంలోకి తెచ్చుకుంది. బోర్డు టేకోవర్ తర్వాత, కంపెనీ కార్పొరేట్ ఇన్సాల్వెన్సీ రిజల్యూషన్ ప్రాసెస్ (CIRP)కి సంబంధించి నాగేశ్వరరావు వైని అడ్మినిస్ట్రేటర్‌గా నియమించింది. రిలయన్స్ క్యాపిటల్ మొదటి వేలం డిసెంబర్లో జరగ్గా, ఇందులో టోరెంట్ ఇన్వెస్ట్మెంట్స్ రూ. 8,640 కోట్ల ఆఫర్‌తో అత్యధిక బిడ్డర్‌గా, హిందుజా గ్రూప్ రూ. 8,110 కోట్ల ఆఫర్ ఇచ్చింది. కానీ 24 గంటల్లోనే 9,000 కోట్ల రూపాయలతో సవరించిన బిడ్‌ను సమర్పించింది . అయితే టోరెంట్ నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (NCLT)దీన్ని సవాలు చేసింది. ఇక తదుపరి వేలం ఏప్రిల్ 26న జరిగింది, 9,650 కోట్ల రూపాయలతో ఐఐహెచ్లో మాత్రమే వేలంలో పాల్గొంది. ఈప్లాన్ ఆమోదంకోసం ఈ వారంలోనే ఎన్సీఎల్టీని సంప్రదించనున్నారు.ఈ అంచనాలపై అటు రిలయన్స్ క్యాపిటల్‌గానీ, ఇటు హిందూజా గ్రూప్ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. -
రిలయన్స్ క్యాపిటల్ కొనుగోలు.. నిధుల వేటలో ‘ఇండస్ఇండ్’
ముంబై: ప్రతిపాదిత రిలయన్స్ క్యాపిటల్ (ఆర్‌క్యాప్) కొనుగోలు కోసం ఇండస్ఇండ్ ఇంటర్నేషనల్ హోల్డింగ్స్ (ఐఐహెచ్ఎల్) 1.5 బిలియన్ డాలర్లు సమీకరించనుంది. అలాగే సంస్థలో వాటాలను ప్రస్తుతమున్న 15 శాతం నుంచి 26 శాతానికి పెంచుకునేందుకు కూడా ఈ నిధులను వినియోగించనుంది. 1.5 బిలియన్ డాలర్ల నిధులను సమీకరణతో తమ వ్యాపారాన్ని మరింతగా విస్తరించేందుకు అప రిమితమైన అవకాశాలు లభించగలవని ఐఐహెచ్ఎల్ చైర్మన్ అశోక్ పి హిందుజా ఒక ప్రకటనలో తెలిపారు. -
హిందూజా గ్రూప్ చైర్మన్ ఎస్పీ హిందూజా కన్నుమూత
SP Hinduja: హిందూజా గ్రూప్ చైర్మన్ ఎస్పీ హిందూజా కన్నుమూశారు. 87 ఏళ్ల వయసున్న ఎస్పీ హిందూజా అనారోగ్యం కారణంగా లండన్‌లో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ‘హిందూజా కుటుంబ పెద్ద, హిందూజా గ్రూప్ చైర్మన్ ఎస్పీ హిందూజా బుధవారం (మే17) మృతి చెందారని తెలియజేస్తున్నందుకు చింతిస్తున్నాం’ అని హిందూజా కుటుంబ ప్రతినిధి అధికారికంగా తెలియజేశారు. ‘దివంగత పీడీ హిందూజా వ్యవస్థాపక సూత్రాలు, విలువలను కొనసాగించి ఎస్పీ హిందూజా మా కుటుంబానికి మార్గదర్శకుడిగా నిలిచారు. తాను ఉంటున్న యూకే, స్వదేశమైన భారత్‌ల మధ్య బలమైన సంబంధాన్ని నిర్మించడంలో తన సోదరులతో కలిసి చాలా ముఖ్యమైన పాత్ర పోషించారు’ అని హిందూజా కుటుంబం ఒక ప్రకటనలో తెలిపింది. సిరిచంద్ పరమానంద్ హిందూజా.. నలుగురు హిందూజా బ్రదర్స్‌లో పెద్దవాడు. హిందూజా గ్రూప్ సంస్థలకు చైర్మన్‌గా ఉన్న ఆయన లండన్‌లో ఉంటూ బ్రిటిష్ పౌరసత్వం పొందారు. ఇదీ చదవండి: ఫోన్‌పే, గూగుల్‌పే, పేటీఎంలకు షాక్! కొత్త సర్వీస్‌ను తీసుకొచ్చిన జొమాటో.. -
హిందుజా కంపెనీకి రిలయన్స్ క్యాపిటల్!
న్యూఢిల్లీ: రుణ భారంతో ఉన్న రిలయన్స్ క్యాపిటల్ కొనుగోలు రేసులో రూ.9,650 కోట్ల ఆఫర్‌తో హిందుజా గ్రూప్ కంపెనీ అయిన ఇండస్ఇండ్ ఇంటర్నేషనల్ హోల్డింగ్స్ (ఐఐహెచ్ఎల్) హైయెస్ట్ బిడ్డర్‌గా నిలిచింది. 2022 డిసెంబర్లో తొలిసారిగా జరిగిన వేలంలో టోరెంట్ ఇన్వెస్ట్మెంట్స్ రూ.8,640 కోట్లు ఆఫర్ చేసింది. రెండవ రౌండ్ వేలంలో టోరెంట్తోపాటు ఓక్ట్రీ పాల్గొనలేదు. రుణదాతల కమిటీ (సీవోసీ) కనీస బిడ్ మొత్తాన్ని తొలి రౌండ్‌కు రూ.9,500 కోట్లు, రెండవ రౌండ్‌కు రూ.10,000 కోట్లుగా నిర్ణయించారు. అన్ని బిడ్స్‌కు కనీసం రూ.8,000 కోట్ల ముందస్తు నగదు చెల్లింపు ఉండాలని కూడా సీవోసీ షరతు విధించింది. సుప్రీం తీర్పునకు లోబడి.. రిలయన్స్ క్యాపిటల్ ఆస్తుల విక్రయం ద్వారా గరిష్టంగా రికవరీని పొందడానికి రుణదాతలకు గడువు పొడిగిస్తూ సుప్రీంకోర్టు అనుమతించడంతో బుధవారం రెండవ రౌండ్ వేలం జరిగింది. రిలయన్స్ క్యాపిటల్ పరిష్కారం విషయంలో సీవోసీ ద్వారా ఏదైనా నిర్ణయం టోరెంట్ ఇన్వెస్ట్మెంట్స్ దాఖలు చేసిన అప్పీల్లో సుప్రీం కోర్టు తీర్పు ఫలితానికి లోబడి ఉంటుంది. రిలయన్స్ క్యాపిటల్ పరిష్కార ప్రక్రియ మొదటి రౌండ్ వేలం తర్వాత వ్యాజ్యంలో చిక్కుకుంది. మొదటి రౌండ్ వేలం ముగిసిన తరువాత హిందూజా గ్రూప్ సంస్థ బిడ్‌ను సమర్పించింది. 2022 డిసెంబరులో దాఖలు చేసిన రూ.8,110 కోట్ల ఆఫర్‌ను సవరిస్తూ ఐఐహెచ్ఎల్ రూ.9,000 కోట్లతో మరో బిడ్‌ను అందించింది. రుణదాతలు రెండో రౌండ్ వేలం నిర్వహించాలని తమ ఉద్దేశాన్ని వ్యక్తం చేసినప్పటికీ ఇది జరిగింది. -
టొరంట్‌కు ఎన్సీఎల్టీ రిలీఫ్
న్యూఢిల్లీ: రుణ సంక్షోభంలో చిక్కుకున్న రిలయన్స్ క్యాపిటల్ విక్రయ అంశాన్ని ఎన్సీఎల్టీ ముంబై బెంచ్ తాజాగా తాత్కాలికంగా నిలిపివేసినట్లు తెలుస్తోంది. దివాలా పరిష్కార ప్రక్రియలో ఉన్న ఆర్‌క్యాప్ కొనుగోలుకి హిందుజా గ్రూప్ చివర్లో దాఖలు చేసిన సవరించిన బిడ్‌పై స్టే ఆర్డర్ ఇచ్చినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఈ వివరాల ప్రకారం.. ఆర్‌క్యాప్ రుణ పరిష్కార ప్రణాళికలో భాగంగా రూ. 8,640 కోట్ల బిడ్‌తో టొరంట్ గ్రూప్ గరిష్ట బిడ్డర్‌గా నిలిచింది. అయితే తదుపరి హిందుజా గ్రూప్ రూ. 9,000 కోట్లకు సవరించిన బిడ్‌ను డిసెంబర్ 21న ఈవేలం ముగిశాక దాఖలు చేసినట్లు టొరంట్ గ్రూప్ ఎన్సీఎల్టీకి ఫిర్యాదు చేసింది. వేలం ముగిసిన తదుపరి రోజు హిందుజా గ్రూప్ సంస్థ ఇండస్ఇండ్ బ్యాంక్ తొలి ఆఫర్‌ను రూ. 8,100 కోట్లను తదుపరి రూ. 9,000 కోట్లకు సవరించినట్లు టొరంట్ గ్రూప్ ఫిర్యాదులో పేర్కొంది. ఈ అంశంపై వచ్చే వారం విచారణ జరగనున్నట్లు తెలుస్తోంది. కాగా.. మరోపక్క రిలయన్స్ క్యాప్ రుణదాతలు అటు టొరంట్ గ్రూప్, ఇటు హిందుజా గ్రూప్‌తో రిజల్యూషన్‌పై చర్చలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. -
అశోక్ లేలాండ్ ఎండీ రాజీనామా
న్యూఢిల్లీ: హిందూజా గ్రూప్‌నకు చెందిన వాహన తయారీ సంస్థ అశోక్ లేలాండ్ ఎండీ, సీఈవో విపిన్ సోంధి రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతో తన పదవి నుంచి తప్పుకున్నట్టు ఆయన తెలిపారు. డిసెంబర్ 31 వరకు ఆయన పదవీ కాలం కొనసాగనుంది. ధీరజ్ హిందూజా కంపెనీ ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా బాధ్యతలను చేపట్టారు. ప్రస్తుతం ఆయన నాన్–ఎగ్జిక్యూటివ్, నాన్–ఇండిపెండెంట్ డైరెక్టర్–చైర్‌పర్సన్‌గా ఉన్నారు. తదుపరి ఎండీ, సీఈవో ఎంపిక కోసం బోర్డు త్వరలో సమావేశం కానుందని అశోక్ లేలాండ్ వెల్లడించింది. -
కష్టం.. ఆ కరెంట్‌తో 'ఎంతో నష్టం'
సాక్షి, అమరావతి: హిందూజా నేషనల్ పవర్ కార్పొరేషన్ తీరును విద్యుత్ శాఖ తీవ్రస్థాయిలో ఎండగట్టింది. ఆ విద్యుత్‌ను తీసుకుంటే ప్రజలకు భారమేనని పునరుద్ఘాటించింది. సంస్థ ఇష్టానుసారం ప్రాజెక్టు నిర్మాణ వ్యయాన్ని పెంచేసి, దాన్ని ప్రజలపై రుద్దడాన్ని తీవ్రంగా ఆక్షేపించింది. దీనివల్ల కలిగే నష్టంపై ఇంధన శాఖ ప్రభుత్వానికి స్పష్టమైన నివేదిక కూడా సమర్పించింది. తాజాగా.. సోమవారం సుప్రీంకోర్టులోనూ హిందూజా పవర్‌పై ఏపీ ప్రభుత్వం తరఫు న్యాయవాదులు వాస్తవాలను న్యాయస్థానం దృష్టికి తెచ్చారు. దీంతో కేసు విచారణను అత్యున్నత న్యాయస్థానం రెండు వారాలకు వాయిదా వేసింది. వ్యతిరేకించిన వైఎస్సార్ విశాఖపట్నానికి సమీపంలో 1040 మెగావాట్ల సామర్థ్యంతో థర్మల్ విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చిన హిందూజా సంస్థకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అవసరమైన తోడ్పాటునిచ్చింది. 1995లో డిస్కమ్‌లు ఈ సంస్థలతో విద్యుత్ కొనుగోలు ఒప్పందం కూడా చేసుకున్నాయి. రూ.4,553 కోట్లతో ప్లాంట్ నిర్మాణం చేస్తామని హిందూజా అప్పట్లో పేర్కొంది. కానీ, అనుకున్న ప్రకారం హిందూజా ప్లాంట్‌ను పూర్తిచేయలేదు. పైగా డిస్కమ్‌లతో ఒప్పందం చేసుకున్న సంస్థ తన విద్యుత్‌ను ఓపెన్ యాక్సెస్‌లో అమ్ముకుంటానని 2007లో అప్పటి ప్రభుత్వానికి తెలిపింది. అయితే, అన్ని వసతులు తాము కల్పిస్తే ఇతరులకు విద్యుత్ అమ్మడాన్ని వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ప్రభుత్వం వ్యతిరేకించింది. రాష్ట్ర ప్రజలకే విద్యుత్ ఇవ్వాలని గట్టిగా పట్టుబట్టింది. ఓపెన్ యాక్సెస్ బిడ్‌ను రద్దుచేసింది. ఇదిలా ఉంటే.. హిందూజా 2012లో నిర్మాణ వ్యయాన్ని అమాంతం పెంచేసింది. రూ.4,553 కోట్ల నుంచి రూ.5,630 కోట్లుగా పేర్కొంది. అయినప్పటికీ 2013లో అప్పటి ప్రభుత్వం ఆ సంస్థతో అవగాహన ఒప్పందం చేసుకుంది. 1995లో జరిగిన పీపీఏని 2016లో పునరుద్ధరించారు. ఇదే సంవత్సరం జనవరి నుంచి హిందూజా విద్యుత్ అందిస్తోంది. నిజానికి అనుకున్న గడువులోగా విద్యుత్ ఇవ్వకపోవడంతో హిందూజా పీపీఏ రద్దయిందని విద్యుత్ శాఖ చెబుతోంది. కానీ, 2014లో హిందూజాతో టీడీపీ డీల్ కుదుర్చుకుందని, అందుకే ఈ రుణం తీర్చుకునేందుకే 2016లో పీపీఏ పునరుద్ధరించిందనే విమర్శలొచ్చాయి. బెడిసికొట్టిన టీడీపీ ముడుపుల వ్యవహారం ఇదిలా ఉంటే.. అడ్డగోలు లెక్కలతో హిందూజా సంస్థ ప్లాంట్ నిర్మాణ వ్యయాన్ని 2017లో మరోసారి రూ.8 వేల కోట్లకు పైగా పెంచేసింది. ఇందులో టీడీపీ పెద్దల హస్తం ఉందని అప్పట్లో విమర్శలొచ్చాయి. ఈ వ్యవహారంపై విద్యుత్ నియంత్రణ మండలి విచారణ జరుగుతున్న సమయంలోనే ప్రభుత్వ పెద్దలు ముడుపుల కోసం హిందూజాను డిమాండ్ చేయడం, అది కుదరకపోవడంతో వ్యవహారం బెడిసికొట్టిందని ఆరోపణలు వచ్చాయి. దీంతో 2017 నుంచి విద్యుత్ తీసుకోవడం నిలిపివేశారు. అంతేకాక.. హిందూజా వ్యయం ఎక్కువగా ఉన్నందున పీపీఏ రద్దుచేయాలని అప్పటి ప్రభుత్వ ప్రోద్బలంతో ఏపీఈఆర్సీలో డిస్కమ్‌లు ఫిర్యాదు చేశాయి. కమిషన్ దీన్ని సమర్థించింది. దీంతో హిందూజా ట్రిబ్యునల్‌కు వెళ్లింది. విద్యుత్ తీసుకోవాలంటూ ట్రిబ్యునల్ ఆదేశాలిచ్చింది. అప్పటి నుంచి ప్రతీ యూనిట్ రూ.3.82 చొప్పున (తాత్కాలిక ధర) ఏటా 2,832 మిలియన్ యూనిట్లను డిస్కమ్‌లు తీసుకున్నాయి. 2020లో ఈ వ్యవహారాన్ని పరిశీలించిన వైఎస్సార్సీపీ ప్రభుత్వం హిందూజా విద్యుత్ ప్రజలకు నష్టమని భావించింది. ట్రిబ్యునల్ ఉత్తర్వులపై సుప్రీంకోర్టుకు వెళ్లి స్టే తెచ్చింది. ఈ నేపథ్యంలో గత ప్రభుత్వ విధానాలవల్ల హిందూజా వ్యవహారం ప్రజలకు భారమైందని.. దీన్ని అడ్డుకునేందుకు ప్రస్తుత ప్రభుత్వం అన్ని విధాలా కృషిచేస్తోందని, సుప్రీంకోర్టులోనూ బలంగా వాదనలు వినిపిస్తోందని విద్యుత్ వర్గాలు తెలిపాయి. -
ఒక్క డబుల్ బెడ్రూమ్ రూ.60 కోట్లు!
సాక్షి, హైదరాబాద్: లండన్‌లోని చరిత్రాత్మక ఓల్డ్ వార్ ఆఫీస్ (ఓడబ్ల్యూఓ) విక్రయానికి సిద్ధంగా ఉంది. 2014లో మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ నుంచి కొనుగోలు చేసిన బహుళ జాతి కంపెనీ హిందుజా గ్రూప్ ప్రస్తుతం దీన్ని అమ్మకానికి పెట్టింది. అధికారిక విక్రయ భాగస్వాములుగా లండన్‌కు చెందిన అతిపెద్ద ప్రాపర్టీ కన్సల్టెంట్ స్ట్రట్ అండ్ పార్కర్, గ్లోబల్ ప్రాపర్టీ కన్సల్టెంట్ నైట్‌ఫ్రాంక్‌లను నియమించుకుంది. ఇందులో 85 రాఫెల్స్ బ్రాండెడ్ రెసిడెన్సీలతో పాటు ఫస్ట్ రాఫెల్ లండన్ హోటల్లో 125 రూమ్స్, సూట్స్, 9 రెస్టారెంట్స్ అండ్ బార్స్, స్పాలున్నాయి. ఓడబ్ల్యూఓ రెసిడెన్సీలో స్టూడియో నుంచి ఐదు పడకగదుల నివాసాలున్నాయి. 2 బీహెచ్‌కే ధర సుమారు రూ.60 కోట్లు (5.8 మిలియన్ పౌండ్లు). ఇందులో ప్రైవేట్ ల్యాండ్‌స్కేప్ గార్డెనింగ్, 7 లాంజ్‌లు, ప్రైవేట్ డైనింగ్ రూమ్, సినిమా, జిమ్, 3 ట్రైనింగ్ స్టూడియోలు, 20 మీ. హోటల్ పూల్, 9 రెస్టారెంట్స్ వంటి నివాసితులకు ప్రైవసీ, సెక్యూరిటీ పరమైన అన్ని రకాల విలాసవంతమైన వసతులున్నాయి. వందేళ్ల తర్వాత సందర్శన.. వారసత్వ చరిత్ర, సంప్రదాయాలకు నెలవైన ఓడబ్ల్యూఓను సుమారు వంద సంవత్సరాల నుంచి ప్రజల సందర్శనను మూసివేశారు. ఆరేళ్ల క్రితం దీన్ని కొనుగోలు చేసిన హిందుజా గ్రూప్ ఓడబ్ల్యూఓను ఫైవ్ స్టార్ హోటల్, రెసిడెన్షియల్ అపార్ట్‌మెంట్‌గా అభివృద్ధి చేసింది. ప్రత్యేకమైన, చరిత్రాత్మక పునఃనిర్మాణాలలో ప్రత్యేక అనుభవం ఉన్న న్యూయార్క్‌కు చెందిన ఫ్రెంచ్ ఆర్కిటెక్ట్, డిజైనర్ థియరీ డెస్పాంట్ హోటల్ లోపలి భాగాలను డిజైన్ చేశారు. హిస్టారిక్ ఇంగ్లాండ్, మ్యూజియం ఆఫ్ లండన్ ఆర్కియాలజీ, ఈఆర్పీ ఆర్కిటెక్ట్‌లు ఓడబ్ల్యూఓ భవన పునఃనిర్మాణాభివృద్ధిని పర్యవేక్షిస్తున్నాయి. గత నలభై ఏళ్ల నుంచి ఓడబ్ల్యూఓ తమ నివాసంగా ఉందని.. ప్రస్తుత అభివృద్ధి పనులు పూర్తి చేసి.. వచ్చే ఏడాది నుంచి ప్రజల సందర్శనకు అందుబాటులోకి వస్తుందని హిందుజా గ్రూప్ కో–చైర్మన్ గోపీచంద్ పీ హిందుజా తెలిపారు. భారతీయ హైనెట్ వర్త్ ఇండివిడ్యువల్స్ (హెచ్ఎన్ఐ), సూపర్ రిచ్ కమ్యూనిటీలు తమ సెకండ్ హోమ్ కొనుగోళ్లలో యూకే మూడో స్థానంలో ఉందని.. 2019లో 79 శాతం మంది ఇండియన్ హెచ్ఎన్ఐలు యూకేలో పెట్టుబడులు పెట్టారని నైట్‌ఫ్రాంక్ ఇండియా సీఎండీ శిశీర్ బైజాల్ తెలిపారు. వారసత్వ చరిత్ర.. రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో యూకే ప్రధాన మంత్రులైన విన్స్టన్ చర్చిల్, డేవిడ్ లాయి డ్ జార్జ్‌లతో పాటు పలువురు రాజకీయ, సైనిక నాయకులకు ఓడబ్ల్యూఓ ప్రధా న నివాసంగా ఉండేది. మొత్తం 5.80 లక్షల చ. అ.ల్లో.. ఏడంతస్తుల భవంతి. ఇందులో మొత్తం 1,110 రూమ్స్ ఉంటాయి. బ్రిటీష్ పార్లమెంట్‌కు, ప్రధానమంత్రి నివాసానికి చేరువలో ఓడబ్ల్యూఓ ఉంటుంది. -
ఇండస్‌ఇండ్‌కు తాజా పెట్టుబడులు
న్యూఢిల్లీ: ప్రయివేట్ రంగ సంస్థ ఇండస్ఇండ్ బ్యాంకుకు తాజాగా రూ. 2,201 కోట్ల పెట్టుబడులు లభించాయి. హిందుజా గ్రూప్‌నకు చెందిన బ్యాంక్ ప్రమోటర్లు ప్రిఫరెన్షియల్ వారంట్లను ఈక్విటీగా మార్పిడి చేసుకోవడం ద్వారా ఈ నిధులను అందించారు. 2019 జూలైలో భారత్ ఫైనాన్షియల్ ఇన్‌క్లూజన్‌ను విలీనం చేసుకున్న నేపథ్యంలో ప్రమోటర్లకు బ్యాంకు వారంట్లను జారీ చేసింది. విలీన సమయంలో ప్రమోటర్లు వారంట్లపై తొలిదశలో రూ. 673 కోట్లు చెల్లించారు. మిగిలిన రూ. 2021 కోట్లను తాజాగా విడుదల చేసినట్లు బ్యాంక్ పేర్కొంది. వారంట్లను షేరుకి రూ. 1,709 ధరలో ఈక్విటీగా మార్పిడి చేసుకున్నట్లు వెల్లడించింది. బుధవారం షేరు ముగింపు ధర రూ. 1033తో పోలిస్తే మార్పి డి ధర 65 శాతం ప్రీమియంకావడం గమనార్హం! 2019లో..: ప్రమోటర్ సంస్థలు ఇండస్ఇండ్ ఇంటర్నేషనల్ హోల్డింగ్స్, ఇండస్ఇండ్ లిమిటెడ్‌కు దాదాపు 1.58 కోట్ల ఈక్విటీ షేర్లను కేటాయించేందుకు తాజాగా ఇండస్ఇండ్ బ్యాంక్ ఫైనాన్స్ కమిటీ అనుమతించింది. 2019 జూలై 6న ప్రమోటర్ సంస్థలకు బ్యాంకు ఇదే స్థాయిలో వారంట్లను జారీ చేసింది. వీటి విలువ రూ. 2,695 కోట్లు. ఈ సమయంలో 25% సొమ్ము (రూ.674 కోట్లు)ను ప్రమోటర్లు చెల్లించారు. కాగా.. తాజా పెట్టుబడుల నేపథ్యంలో కనీస మూలధన నిష్పత్తి 17.68 శాతానికి బలపడినట్లు బ్యాంక్ తెలియజేసింది. ఎన్ఎస్ఈలో ఇండస్ఇండ్ బ్యాంక్ షేరు 1 శాతం లాభంతో రూ. 1,043 వద్ద ముగిసింది. -
జెట్ ఎయిర్వేస్ షేర్లు జూమ్
సాక్షి,ముంబై: ప్రైవేటు రంగ విమాన యాన సంస్థ చాలా రోజుల తరువాత మళ్లీ వార్తల్లోకి వచ్చింది. బిలియనీర్ హిందూజా బ్రదర్స్ జెట్ ఎయర్‌వేస్‌ను కొనుగోలుకు బిడ్‌ను సిద్ధం చేస్తోందన్న వార్తల మధ్య జెట్ ఎయిర్వేస్ షేర్లు లాభపడుతున్నాయి. మంగళవారం నాటి బలహీన సెషన్లో ఇన్వెస్టర్లు జెట్ ఎయిర్వేస్ షేర్లుకొనుగోళ్లకు మొగ్గు చూపారు. దీంతో బీఎస్ఈలో 5 శాతం అప్పర్ సర్క్యూట్ అయ్యి రూ .296 వద్ద లాక్ అయ్యాయి. కాగా హిందూజా సోదరులు గోపిచంద్, అశోక్ హిందూజా నేతృత్వంలోని బృందం జనవరి 15 గడువులోగా జెట్ ఎ యిర్‌వేస్‌కు బిడ్ దాఖలు చేయాలని యోచిస్తోంది. రుణాలు, నష్టాలు పేరుకుపోయిన నేపథ్యంలో ఈ ఏడిది ఏప్రిల్ 17 నుంచి జెట్ ఎయిర్వేస్ కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేసిన సంగతి తెలిసిందే. -
అశోక్ లేలాండ్ లాభం 93 శాతం డౌన్
న్యూఢిల్లీ: హిందుజా గ్రూప్‌నకు చెందిన ప్రధాన కంపెనీ అశోక్ లేలాండ్ నికర లాభం ఈ ఆరి్థక సంవత్సరం సెపె్టంబర్ క్వార్టర్లో 93 శాతం తగ్గింది. గత క్యూ2లో రూ.528 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ2లో రూ.39 కోట్లకు తగ్గిందని అశోక్ లేలాండ్ తెలిపింది. ఆదాయం రూ.7,621 కోట్ల నుంచి 48 శాతం తగ్గి రూ.3,939 కోట్లకు చేరిందని కంపెనీ చైర్మన్ ధీరజ్ జి. హిందుజా తెలిపారు. వాహన పరిశ్రమ అమ్మకాలు ఈ క్యూ2లో 53 శాతం మేర తగ్గాయని ధీరజ్ హిందుజా పేర్కొన్నారు. ఈ క్యూ2లో తమ కంపెనీ అమ్మకాలు గణనీయంగానే తగ్గినప్పటికీ, 5.8 శాతం నిర్వహణ లాభ మార్జిన్ సాధించామని తెలిపారు. -
సగానికి తగ్గిన అశోక్ లేలాండ్ లాభం
చెన్నై: హిందుజా గ్రూప్ ప్రధాన కంపెనీ అశోక్ లేలాండ్ ఈ ఆర్థిక సంవత్సరం జూన్ క్వార్టర్లో రూ.275 కోట్ల నికర లాభం(కన్సాలిడేటెడ్) సాధించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్లో రూ.467 కోట్ల నికర లాభం వచ్చిందని అశోక్ లేలాండ్ తెలిపింది. మొత్తం ఆదాయం రూ.7,194 కోట్ల నుంచి రూ.6,612 కోట్లకు తగ్గిందని కంపెనీ చైర్మన్ ధీరజ్ జి. హిందుజా తెలిపారు. ఇక పూర్తి ఆర్థిక సంవత్సరం పరంగా చూస్తే, గత ఆర్థిక సంవత్సరంలో రూ.33,325 కోట్ల ఆదాయం, రూ.2,195 కోట్ల నికర లాభం సాధించామ న్నారు. 4 శాతం పెరిగిన మార్కెట్ వాటా.. వాహన పరిశ్రమలో అమ్మకాలు 17 శాతం తగ్గగా, తమ కంపెనీ మార్కెట్ వాటా 4 శాతం పెరిగిందని ధీరజ్ వెల్లడించారు. తేలిక రకం వాణిజ్య వాహనాల విక్రయాలు 12 శాతం పెరిగాయని వివరించారు. భారత్ స్టేజ్ సిక్స్ వాహనాలను త్వరలోనే అందుబాటులోకి తెస్తామని పేర్కొన్నారు. ఎన్సీడీలు, బాండ్ల జారీ ద్వారా రూ.600 కోట్లు సమీకరించనున్నామని చెప్పారు. -
జెట్‌లో పెట్టుబడులపై హిందుజా ఆసక్తి
ముంబై: ఆర్థిక సంక్షోభం కారణంగా దాదాపు నెల రోజుల్నించి కార్యకలాపాలు నిలిపివేసిన ప్రైవేట్ రంగ జెట్ ఎయిర్వేస్లో పెట్టుబడులు పెట్టే అవకాశాలను హిందుజా గ్రూప్ పరిశీలిస్తోంది. మంగళవారం ఈ విషయం ఒక ప్రకటనలో తెలియజేసింది. రుణాలు, నష్టాలు పేరుకుపోయిన నేపథ్యంలో ఏప్రిల్ 17 నుంచి జెట్ ఎయిర్వేస్ కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేసింది. దీంతో రుణాలిచ్చిన బ్యాంకులు, ఆర్థిక సంస్థలు జెట్ విక్రయంపై కసరత్తు చేస్తున్నాయి. ఎతిహాద్ గ్రూప్ వంటి సంస్థలు బిడ్లు వేశాయి. ప్రస్తుతం వివిధ విమానాశ్రయాల్లో ఖాళీగా ఉన్న జెట్ ఎయిర్వేస్ స్లాట్స్‌ను ఇతర ఎయిర్‌లైన్స్‌కు తాత్కాలిక ప్రాతిపదికన కేంద్ర పౌర విమానయాన శాఖ కేటాయించింది. ఈ పరిస్థితుల నేపథ్యంలో కంపెనీలో పెట్టుబడులు పెట్టేందుకు హిందుజా గ్రూప్ ఆసక్తి వ్యక్తం చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. హిందుజా గ్రూప్‌నకు ఆటోమోటివ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులు, విద్యుత్, రియల్ ఎస్టేట్, హెల్త్‌కేర్ తదితర రంగాల్లో కార్యకలాపాలున్నాయి. గ్రూప్ సంస్థల్లో దాదాపు 1,50,000 మంది పైచిలుకు ఉద్యోగులున్నారు. పెట్టుబడులు పెట్టేందుకు హిందుజా గ్రూప్ ఆసక్తిగా ఉందన్న వార్తల నేపథ్యంలో మంగళవారం జెట్ ఎయిర్వేస్ షేర్లు ఏకంగా 15 శాతం ఎగిశాయి. బీఎస్ఈలో 14.73 శాతం పెరిగి రూ.150.75 వద్ద ముగిశాయి. అటు ఎన్ఎస్ఈలో సుమారు 13 శాతం పెరిగి రూ. 148.40 వద్ద క్లోజయ్యాయి. రూ.135 వద్ద ప్రారంభమైన షేరు ఒక దశలో రూ. 154.80 గరిష్ట స్థాయికి కూడా ఎగిసింది. దీంతో వరుసగా రెండో రోజూ జెట్ షేరు పెరిగినట్లయింది. -
మీ నెట్వర్క్..మీ వ్యాపారం..మీ లాభాలు
-
డిజిటల్ నానో కోప్ ప్రారంభం
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: కేబుల్ ఆపరేటర్లను ఆర్థిక స్వతంత్రులను చేయడంతోపాటు స్వయం ఉపాధి కల్పించుకునేందుకు తోడ్పాటు అందించే లక్ష్యంతో హిందూజా మీడియా గ్రూపు ఆధ్వర్యంలో ఎన్ఎక్స్టీ డిజిటల్ నానో కోప్ను ఖమ్మంలో ప్రారంభించింది. కేబుల్ ఆపరేటర్లను స్వతంత్ర వ్యాపారిగా తీర్చిదిద్ది.. ఎవరిపై ఆధారపడకుండా ఉండాలనే లక్ష్యంతోపాటు ఈ డిజిటల్ ద్వారా నాణ్యమైన ప్రసారాలను అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించి అందించాలనేదే తమ ప్రధాన ధ్యేయమని హిందూజా మీడియా గ్రూపు ఎండీ, సీఈవో అశోక్ మన్సుఖానీ చెప్పారు. తెలంగాణ రీజినల్ హెడ్ శ్రీకుమార్‌తో కలసి ఆయన మంగళవారం ఖమ్మంలోని ఓ హోటల్లో నానోకోప్‌ను ప్రారంభించారు. అనంతరం విలేకరులతో మా ట్లాడారు. దేశంలో అతిపెద్ద డిజిటల్ టీవీ కం పెనీ వేదికగా ఉన్న ఎన్ఎక్స్టీ డిజిటల్ రంగంలో ఆపరేటర్లకు మరింత చేరువ కావడం ద్వారా నాణ్యమైన ప్రసారాలను అందించాలని నిర్ణయించిందన్నారు. ప్రతి ఆపరేటర్ రూ.15 లక్షల ఖర్చు తో 500కు పైగా చానల్స్ వచ్చే లా ఏర్పాటు చేసుకోవచ్చని చెప్పారు. గ్రామీణ ప్రాంతాల ఆపరేటర్లు రూ. 4.40 లక్షలతో దాదాపు 250 చానల్స్‌ను వీక్షకులకు అందించవచ్చని, నగర ప్రాంత ఆపరేటర్లు హెచ్డీ నాణ్యతగల చానల్స్‌ను అందించగలుగుతారన్నారు. కేబుల్ రంగంలో హిందూజా గ్రూపుకు ఉన్న అనుభవంతో కేబుల్ ఆ పరేటర్లను అనుసంధానం చేసి.. వారి కి వ్యాపార ప్రయోజనాలను కల్పిస్తామన్నారు. కేబుల్ ఆపరేటర్లు తమతో అనుసంధానమైతే ఎక్కడి నుంచైనా ప్రసారాలను ఆపరేట్ చేసుకోవచ్చని శ్రీకుమార్ తెలిపారు. ప్రాంతీయ అవసరాలకు తగినట్టు ప్యాకేజీల రూపకల్పన జరుగుతుందని, ‘మీ నె ట్‌వర్క్.. మీ వ్యాపారం.. మీ లాభాలు’నినాదంతో తమ వ్యాపార ప్రక్రియ ప్రారంభమవుతుందని చెప్పారు. -
అత్యంత సంపన్న ఆసియన్లు వీరే..
లండన్ : ఎన్ఆర్ఐ వ్యాపారవేత్త హిందూజా బ్రదర్స్ మరోసారి అత్యంత సంపన్న ఆసియన్ గా నిలిచారు. శుక్రవారం రాత్రి విడుదలైన బ్రిటన్ లో అత్యంత సంపన్న ఆసియన్ల వార్షిక ర్యాంకింగ్స్ లో హిందూజా మళ్లీ మొదటి స్థానంలో నిలిచినట్టు వెల్లడైంది. ఈయన మొత్తం సంపద 19 మిలియన్ పౌండ్స్ అంటే రూ.1,54,253 కోట్లకు పైననే. గతేడాది కంటే ఆయన సంపద దాదాపు 2.5 బిలియన్ పౌండ్లకు పైననే పెరిగినట్టు తాజా ర్యాంకింగ్స్ లో తెలిసింది. ఆయన తర్వాత స్థానాన్ని స్టీల్ టైకూన్ గా పేరున్న లక్ష్మి ఎన్ మిట్టర్ దక్కించుకున్నారు. గతేడాది కంటే ఈ ఏడాది 6.4 బిలియన్ పౌండ్లను పెంచుకున్న లక్ష్మి మిట్టల్ 12.6 బిలియన్ పౌండ్ల(రూ.1,02,294కోట్లు)తో రెండో స్థానంలో నిలిచారు. బ్రిటన్ లో 101 అత్యంత సంపన్నపరుల ఆసియన్ల 2017 జాబితా శుక్రవారం రాత్రి విడుదలైంది. ఈ జాబితాలో తొలి స్థానంలో నిలిచిన హిందూజా బ్రదర్స్- లండన్ లోని శ్రీచంద్, గోపి, ముంబాయిలోని అశోక్, జెనీవాలో ప్రకాశ్ లు తమ అశోక్ లేల్యాండ్, ఇండస్ ఇండ్ బ్యాంకు, గల్ఫ్ ఆయిల్, ఎనర్జీ, రియల్ ఎస్టేట్ లలో భారీగా లాభాలను పెంచుకున్నారు. బ్రిటన్ లోని 101 సంపన్న ఆసియన్ల సంపద మొత్తం 69.9 బిలియన్ పౌండ్లు(రూ.5,67,492కోట్లకు పైనే)గా ఉంది.. గతేడాది కంటే ఇది 25 శాతం పెరిగింది. హిందూజా బ్రదర్స్, లక్ష్మి మిట్టల్ అనంతరం ఇండోరమ కార్పొరేషన్ చైర్మన్ ప్రకాశ్ లోహియా మూడో సంపన్నవంతుడిగా ఉన్నారు. -
అశోక్ లేలాండ్ లాభం రెండు రెట్లు
ఆదాయం 10 శాతం అప్ న్యూఢిల్లీ: హిందుజా గ్రూప్‌కు చెందిన ప్రధాన కంపెనీ అశోక్ లేలాండ్ నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసిక కాలంలో రెండు రెట్లు పెరిగింది. గత ఆర్థిక సంవత్సరం క్యూ1లో రూ.144 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం క్యూ1లో రూ.291 కోట్లకు పెరిగిందని అశోక్ లేలాండ్ తెలిపింది. నికర అమ్మకాలు రూ.3,775 కోట్ల నుంచి 10 శాతం వృద్ధితో రూ.4,176 కోట్లకు పెరిగాయి. ఈ క్యూ1లో వాహన పరిశ్రమ 15 శాతం వృద్ధిని సాధిస్తే తాము మాత్రం 19 శాతం వృద్ధిని సాధించామని అశోక్ లేలాండ్ ఎండీ, వినోద్ కె. దాసరి చెప్పారు. ‘‘కరెన్సీ, వడ్డీరేట్ల స్వాప్ సంబంధిత లాభాలు రూ.18 కోట్ల నుంచి రూ.50 కోట్లకు పెరిగాయి. మేం వాహనాలు ఎగుమతి చేస్తున్న కీలక మార్కెట్లలో అమ్మకాలు తగ్గాయి. కానీ రెండో క్వార్టర్ నుంచి పుంజుకుంటామనే నమ్మకం ఉంది. దేశీయం గా 22,061 యూనిట్ల మధ్య, భారీ తరహా వాణిజ్య వాహనాను విక్రయించాం. కంపెనీ చరిత్రలో ఈ విభాగంలో ఇవే రికార్డ్ స్థాయి అమ్మకాలు’’ అని వివరించారు. వివిధ రాష్ట్ర ప్రభుత్వ రవాణా సంస్థల నుం చి 3,600 బస్సులకు ఆర్డర్లు పొందామని, వీటిని ఈ ఏడాదిలోనే పూర్తి చేయాల్సి ఉందని చెప్పారాయన. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో బీఎస్ఈలో అశోక్ లేలాం డ్ షేర్ 3.6% లాభపడి రూ.97 వద్ద ముగిసింది. -
అశోక్ లేలాండ్ ఎండీగా వినోద్ కె దాసరి
న్యూఢిల్లీ: హిందుజా గ్రూప్ ప్రధాన కంపెనీ అశోక్ లేలాండ్ ఎండీగా మళ్లీ వినోద్ కె దాసరి నియమితులయ్యారు. ఐదేళ్ల పదవీ కాలంతో వినోద్ కె దాసరి నియామకానికి డెరైక్టర్ల బోర్డు ఆమోదం తెలిపిందని అశోక్ లేలాండ్ బీఎస్ఈకి నివేదించింది. అంటే ఈయన 2016 ఏప్రిల్ 1 నుంచి 2021 మార్చి 31 వరకు అశోక్ లేలాండ్ ఎండీగా బాధ్యతలు నిర్వహిస్తారు.