ఆర్‌క్యాప్ ప్రణాళికపై ఐఐహెచ్‌ఎల్‌కు ఎన్‌సీఎల్‌టీ ఆదేశం
ముంబై: రిలయన్స్ క్యాపిటల్ (ఆర్‌క్యాప్) పరిష్కార ప్రణాళికకు సంబంధించి 48 గంటల్లోగా రూ. 2,750 కోట్ల మొత్తాన్ని ఎస్క్రో ఖాతాలో జమ చేయాల్సిందిగా ఇండస్‌ఇండ్ ఇంటర్నేషనల్ హోల్డింగ్స్ (ఐఐహెచ్‌ఎల్)ను నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్‌సీఎల్‌టీ) ఆదేశించింది. ఈ ఖాతాపై వచ్చే వడ్డీ, రుణదాతల కమిటీకే (సీవోసీ) చెందుతుందని స్పష్టం చేసింది. వివరాల్లోకి వెడితే.. రుణాల చెల్లింపులో విఫలమైన ఆర్‌క్యాప్ దివాలా చట్టం కింద చర్యలు ఎదుర్కొంటోంది. సంస్థను కొనుగోలు చేసేందుకు దివాలా పరిష్కార ప్రణాళిక కింద రూ. 9,661 కోట్లు ఆఫర్ చేసిన హిందుజా గ్రూప్ సంస్థ ఐఐహెచ్‌ఎల్ .. బిడ్డింగ్‌లో విజేతగా నిలి్చంది.
ఇందులో రూ. 2,750 కోట్ల మొత్తాన్ని రుణదాతల కమిటీ ఖాతాలోకి డిపాజిట్ చేయాలంటూ జూలై 23న ఐఐహెచ్‌ఎల్‌ని ఎన్‌సీఎల్‌టీ ముంబై బెంచ్ ఆదేశించింది.
అయితే, ఇందుకు సంబంధించిన ప్రణాళిక అమలుకు గడువు పెంచుతూ ఆదేశాల్లో కొన్ని సవరణలు చేయాలంటూ కంపెనీ కొత్తగా దాఖలు చేసిన పిటీషన్‌పై విచారణ సందర్భంగా ఎన్‌సీఎల్‌టీ తాజా ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే మరో రూ. 7,300 కోట్ల నిధుల సమీకరణ వివరాలను కూడా పర్యవేక్షణ కమిటీకి తెలియజేయాలంటూ సూచించింది. మరోవైపు, ఎన్‌సీఎల్‌టీ ఆదేశించినట్లుగా రూ. 2,750 కోట్ల మొత్తాన్ని సీవోసీ ఖాతాల్లో డిపాజిట్ చేయకుండా ఆ మొత్తాన్ని తన సొంత ఖాతాలోనూ, ప్రమోటర్ల ఖాతాలోనూ జమ చేసుకుందని దివాలా పరిష్కార నిపుణుడు ఆరోపించారు. అయితే, ఎస్క్రో ఖాతా వివరాలను సీవోసీ ఇవ్వనందువల్లే అలా చేయాల్సి వచి్చందని ఐఐహెచ్‌ఎల్ వివరణ ఇచి్చంది.
Comments
Please login to add a commentAdd a comment