International Holding Company
-
మేము అదానీ వెంటే...
న్యూఢిల్లీ: క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొంటున్న అదానీ గ్రూప్‌నకు ఇన్వెస్టర్లు బాసటగా నిలుస్తున్నారు. గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ తదితరులపై అమెరికాలో ఆరోపణలు వచ్చినప్పటికీ తమ పెట్టుబడుల విషయంలో పునరాలోచనేమీ లేదని అబు ధాబీకి చెందిన ఇంటర్నేషనల్ హోల్డింగ్ కంపెనీ (ఐహెచ్సీ) వెల్లడించింది. హరిత ఇంధనం, పర్యావరణ అనుకూల రంగాల్లో అదానీ గ్రూప్ చేస్తున్న కృషిపై తమకు పూర్తి నమ్మకం ఉందని పేర్కొంది. ఐహెచ్సీ 2022లో అదానీ గ్రీన్ ఎనర్జీ (ఏజీఈఎల్), అదానీ ట్రాన్స్‌మిషన్‌లో (ఏటీఎల్) చెరి 500 మిలియన్ డాలర్లు, అదానీ ఎంటర్‌ప్రైజెస్‌లో 1 బిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేసింది. ఆ తర్వాత ఏజీఈఎల్, ఏటీఎల్‌లో ఒక శాతం పైగా వాటాలు విక్రయించినప్పటికీ అదానీ ఎంటర్‌ప్రైజెస్‌లో మాత్రం 5 శాతం పైగా వాటాలు పెంచుకుంది. మరోవైపు, అంతర్జాతీయ భాగస్వాములు కూడా అదానీ గ్రూప్‌నకు మద్దతు తెలిపారు. అదానీ గ్రూప్‌తో భాగస్వామ్యంపై తమకు పూర్తి విశ్వాసం ఉందని శ్రీలంక పోర్ట్స్ అథారిటీ తెలిపింది. దేశంలో పోర్ట్ మౌలిక సదుపాయాల అభివృద్ధిలో అదానీ గ్రూప్ కీలక పాత్ర పోషిస్తోందని వివరించింది. అదానీ గ్రూప్ 1 బిలియన్ డాలర్లతో కొలంబో టెరి్మనల్‌ను గ్రూప్ అభివృద్ధి చేస్తోంది. మరోవైపు, టాంజానియా ప్రభుత్వం కూడా అదానీ పోర్ట్స్‌తో ఒప్పందాలకు కట్టుబడి ఉన్నట్లు స్పష్టం చేసింది. ప్రస్తుతం కొనసాగుతున్న ప్రాజెక్టులపై ఎలాంటి ఆందోళన లేదని, కాంట్రాక్టులన్నీ దేశ చట్టాలకు అనుగుణంగానే ఉన్నాయని వివరించింది. దార్–ఎ–సలామ్ పోర్టులోని 2వ కంటైనర్ టెర్మినల్ నిర్వహణకు టాంజానియాతో అదానీ పోర్ట్స్ ఇటీవలే 30 ఏళ్ల ఒప్పందాన్ని కుదుర్చుకుంది. సౌర విద్యుత్ కాంట్రాక్టుల కోసం అధికారులకు లంచాలిచ్చారని అదానీపై అమెరికాలో ఆరోపణలు రావడంతో గ్రూప్ కంపెనీల షేర్లు కుదేలుకావడం, అభియోగాలేమీ తీవ్రమైనవి కావని సంస్థ స్పష్టతనివ్వడంతో మళ్లీ పుంజుకోవడం తెలిసిందే. -
48 గంటల్లో రూ. 2,750 కోట్లు డిపాజిట్ చేయండి
ముంబై: రిలయన్స్ క్యాపిటల్ (ఆర్‌క్యాప్) పరిష్కార ప్రణాళికకు సంబంధించి 48 గంటల్లోగా రూ. 2,750 కోట్ల మొత్తాన్ని ఎస్క్రో ఖాతాలో జమ చేయాల్సిందిగా ఇండస్ఇండ్ ఇంటర్నేషనల్ హోల్డింగ్స్ (ఐఐహెచ్ఎల్)ను నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) ఆదేశించింది. ఈ ఖాతాపై వచ్చే వడ్డీ, రుణదాతల కమిటీకే (సీవోసీ) చెందుతుందని స్పష్టం చేసింది. వివరాల్లోకి వెడితే.. రుణాల చెల్లింపులో విఫలమైన ఆర్‌క్యాప్ దివాలా చట్టం కింద చర్యలు ఎదుర్కొంటోంది. సంస్థను కొనుగోలు చేసేందుకు దివాలా పరిష్కార ప్రణాళిక కింద రూ. 9,661 కోట్లు ఆఫర్ చేసిన హిందుజా గ్రూప్ సంస్థ ఐఐహెచ్ఎల్ .. బిడ్డింగ్‌లో విజేతగా నిలి్చంది. ఇందులో రూ. 2,750 కోట్ల మొత్తాన్ని రుణదాతల కమిటీ ఖాతాలోకి డిపాజిట్ చేయాలంటూ జూలై 23న ఐఐహెచ్ఎల్ని ఎన్సీఎల్టీ ముంబై బెంచ్ ఆదేశించింది. అయితే, ఇందుకు సంబంధించిన ప్రణాళిక అమలుకు గడువు పెంచుతూ ఆదేశాల్లో కొన్ని సవరణలు చేయాలంటూ కంపెనీ కొత్తగా దాఖలు చేసిన పిటీషన్‌పై విచారణ సందర్భంగా ఎన్సీఎల్టీ తాజా ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే మరో రూ. 7,300 కోట్ల నిధుల సమీకరణ వివరాలను కూడా పర్యవేక్షణ కమిటీకి తెలియజేయాలంటూ సూచించింది. మరోవైపు, ఎన్సీఎల్టీ ఆదేశించినట్లుగా రూ. 2,750 కోట్ల మొత్తాన్ని సీవోసీ ఖాతాల్లో డిపాజిట్ చేయకుండా ఆ మొత్తాన్ని తన సొంత ఖాతాలోనూ, ప్రమోటర్ల ఖాతాలోనూ జమ చేసుకుందని దివాలా పరిష్కార నిపుణుడు ఆరోపించారు. అయితే, ఎస్క్రో ఖాతా వివరాలను సీవోసీ ఇవ్వనందువల్లే అలా చేయాల్సి వచి్చందని ఐఐహెచ్ఎల్ వివరణ ఇచి్చంది. -
హిందుజా కంపెనీకి రిలయన్స్ క్యాపిటల్!
న్యూఢిల్లీ: రుణ భారంతో ఉన్న రిలయన్స్ క్యాపిటల్ కొనుగోలు రేసులో రూ.9,650 కోట్ల ఆఫర్‌తో హిందుజా గ్రూప్ కంపెనీ అయిన ఇండస్ఇండ్ ఇంటర్నేషనల్ హోల్డింగ్స్ (ఐఐహెచ్ఎల్) హైయెస్ట్ బిడ్డర్‌గా నిలిచింది. 2022 డిసెంబర్లో తొలిసారిగా జరిగిన వేలంలో టోరెంట్ ఇన్వెస్ట్మెంట్స్ రూ.8,640 కోట్లు ఆఫర్ చేసింది. రెండవ రౌండ్ వేలంలో టోరెంట్తోపాటు ఓక్ట్రీ పాల్గొనలేదు. రుణదాతల కమిటీ (సీవోసీ) కనీస బిడ్ మొత్తాన్ని తొలి రౌండ్‌కు రూ.9,500 కోట్లు, రెండవ రౌండ్‌కు రూ.10,000 కోట్లుగా నిర్ణయించారు. అన్ని బిడ్స్‌కు కనీసం రూ.8,000 కోట్ల ముందస్తు నగదు చెల్లింపు ఉండాలని కూడా సీవోసీ షరతు విధించింది. సుప్రీం తీర్పునకు లోబడి.. రిలయన్స్ క్యాపిటల్ ఆస్తుల విక్రయం ద్వారా గరిష్టంగా రికవరీని పొందడానికి రుణదాతలకు గడువు పొడిగిస్తూ సుప్రీంకోర్టు అనుమతించడంతో బుధవారం రెండవ రౌండ్ వేలం జరిగింది. రిలయన్స్ క్యాపిటల్ పరిష్కారం విషయంలో సీవోసీ ద్వారా ఏదైనా నిర్ణయం టోరెంట్ ఇన్వెస్ట్మెంట్స్ దాఖలు చేసిన అప్పీల్లో సుప్రీం కోర్టు తీర్పు ఫలితానికి లోబడి ఉంటుంది. రిలయన్స్ క్యాపిటల్ పరిష్కార ప్రక్రియ మొదటి రౌండ్ వేలం తర్వాత వ్యాజ్యంలో చిక్కుకుంది. మొదటి రౌండ్ వేలం ముగిసిన తరువాత హిందూజా గ్రూప్ సంస్థ బిడ్‌ను సమర్పించింది. 2022 డిసెంబరులో దాఖలు చేసిన రూ.8,110 కోట్ల ఆఫర్‌ను సవరిస్తూ ఐఐహెచ్ఎల్ రూ.9,000 కోట్లతో మరో బిడ్‌ను అందించింది. రుణదాతలు రెండో రౌండ్ వేలం నిర్వహించాలని తమ ఉద్దేశాన్ని వ్యక్తం చేసినప్పటికీ ఇది జరిగింది. -
అదానీ గ్రీన్‌కు భారీ పెట్టుబడులు
న్యూఢిల్లీ: ప్రైవేట్ రంగ దిగ్గజం అదానీ గ్రూప్ పర్యావరణ అనుకూల కంపెనీలలో ఇంటర్నేషనల్ హోల్డింగ్ కంపెనీ(ఐహెచ్సీ) భారీగా ఇన్వెస్ట్ చేయనుంది. అబు దాబికి చెందిన ఐహెచ్సీ అదానీ గ్రూప్‌నకు చెందిన మూడు గ్రీన్ కంపెనీలకు 200 కోట్ల డాలర్లు(సుమారు రూ. 15,000 కోట్లు) పెట్టుబడులు అందించనుంది. గ్రూప్ ప్రధాన కంపెనీ అదానీ ఎంటర్ప్రైజెస్(ఏఈఎల్)లో రూ. 7,700 కోట్లు(1.02 బిలియన్ డాలర్లు), అదానీ గ్రీన్ ఎనర్జీ(ఏజీఈఎల్)లో రూ. 3,850 కోట్ల చొప్పున ఇన్వెస్ట్ చేయనుంది. ఈ బాటలో అదానీ ట్రాన్స్మిషన్(ఏటీఎల్)కు సైతం రూ. 3,850 కోట్లు అందించనుంది. ఇందుకు వీలుగా మూడు కంపెనీలూ ఐహెచ్‌సీకి ప్రిఫరెన్షియల్ షేర్లను జారీ చేయనున్నాయి. ఇందుకు శుక్రవారం సమావేశమైన కంపెనీల బోర్డులు ‘గ్రీన్’సిగ్నల్ ఇచ్చాయి. అయితే తద్వారా మూడు కంపెనీలలోనూ ఐహెచ్‌సీకి ఎంతమేర వాటా లభించనున్నదీ అదానీ గ్రూప్ వెల్లడించలేదు. తాజా పెట్టుబడులను ఆయా కంపెనీల బిజినెస్ వృద్ధికి వినియోగించనున్నట్లు పేర్కొంది. బ్యాలెన్స్‌షీట్లను పటిష్టపరచడం, సాధారణ కార్పొరేట్ అవసరాలకు సైతం నిధులను వెచ్చించనున్నట్లు తెలియజేసింది. -
స్కైవర్త్ నుంచి 2 ఎల్ఈడీ టీవీలు
హైదరాబాద్ : మారుతున్న వినియోగదారు ప్రాధాన్యాలకు అనుగుణంగా, వారి అభిరుచికి సరిపోయే విధంగా ప్రముఖ అంతర్జాతీయ హోల్డింగ్ కంపెనీ స్కైవర్త్ రెండు ఎల్ఈడీ టీవీలను మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ 43 అంగుళాల, 49 అంగుళాల ఎల్ఈడీ టీవీల్లో మంచి ఐపీఎస్ ప్యానెల్, ఫుల్ హెచ్డీ డిస్ప్లే, స్మార్ట్ రెడీ, ఆకర్షణీయ డిజైన్ వంటి తదితర ప్రత్యేకతలు ఉన్నాయని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. 49 అంగుళాల టీవీ ధర రూ. 49,990గా, 43 అంగుళాల టీవీ ధర రూ.39,990గా ఉంది.