
ఎల్‌ఐసీకి గోల్డెన్ పీకాక్ అవార్డు
భారత జీవిత బీమా సంస్థ (ఎల్‌ఐసీ)కు 2015 సంవత్సరానికిగాను గోల్డెన్ పీకాక్ అవార్డు లభించింది. కార్పొరేట్ గవర్నెర్స్‌లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచినందుకు ఎల్‌ఐసీ ఈ ప్రతిష్టాత్మక అవార్డు పొందింది. లండన్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో సంస్థ తరఫున ఎల్‌ఐసీ ఇంటర్నేషనల్ చీఫ్ మేనేజర్ కేఆర్ అశోక్ ఈ అవార్డును అందుకున్నారు. బ్రిటన్ కేబినెట్ మంత్రి, డ్యూష్ ఆఫ్ లాన్‌కాస్టర్ చాన్సలర్ ఆలీవర్ లిట్‌విన్ అవార్డులను ప్రదానం చేశారు. లుక్రామ్ గ్రూప్ వ్యవస్థాపకులు, చైర్మన్ మిలింద్ కాంగ్లే, హిందూజా గ్రూప్ ఆఫ్ కంపెనీల కో-చైర్మన్ గోపీచంద్ పీ హిందూజా, ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డెరైక్టర్స్ ప్రెసిడెంట్ లెఫ్టినెంట్ జనరల్ జేఎస్ అహ్లువాలియా(రిటైర్డ్), రీడింగ్ వెస్ట్ పార్లమెంట్ సభ్యులు (బ్రిటన్) అలోక్ శర్మ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.