అప్పుల ఊబిలో కూరుకుపోయిన అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ క్యాపిటల్‌ను కొనుగోలు చేసేందుకు హిందూజా కుటుంబం ప్లాన్ చేస్తోంది. తాజా నివేదికల ప్రకారం దాదాపు రూ. 8,200 కోట్లు (1 బిలియన్ డాలర్లు) గ్లోబల్ క్రెడిట్ ఫండ్స్‌ను సమీకరించిందట. ఒకప్పుడు రూ.93,851 కోట్ల విలువైన రిలయన్స్ క్యాపిటల్ కొనుగోలుకు ప్రయత్నించిన దిగ్గజ కంపెనీల్లో హిందుజాలు ప్రాధాన్యమైన బిడ్డర్ కావడం గమనార్హం. (లెజెండ్ విశ్వనాథన్ ఆనంద్ ట్వీట్ చూశారా? ఇంటర్నెట్ లేటెస్ట్ హల్‌చల్)
తాజాగా ఫరాలోన్ క్యాపిటల్, ఓక్‌ట్రీ, అరేస్ ఆసియా అండ్ ఆసెర్బెరస్ లాంటి వాటితో హిందుజాలు టచ్‌లో ఉన్నారని మూలాలను ఉటంకిస్తూ ఎకనామిక్ టైమ్స్ నివేదించింది. రిలయన్స్ క్యాపిటల్ లైఫ్, జనరల్ ఇన్సూరెన్స్ షేర్ల ద్వారా హిందుజాలు ఫైనాన్సింగ్‌కు మద్దతు ఇవ్వవచ్చని దీనికి సంబంధించి బీమా రెగ్యులేటర్ నుండి అవసరమైన అనుమతికి ఫండింగ్ పార్టనర్‌లు హిందుజాల నుండి గ్యారెంటీని కోరే అవకాశం ఉందని నివేదించింది. (Google Doodle Pani Puri Game: క్రిస్పీ..క్రిస్పీ పానీ పూరీ లవ్: గూగుల్ డూడుల్ ఇంటరాక్టివ్ గేమ్)
స్వాధీనానికి కోర్టు అనుమతి లభించిన తర్వాత మాత్రమే ఫైనాన్సింగ్ చేయనున్నారని, రాబోయే వారాల్లో ఫైనాన్షియర్ల తుది జాబితా మారే అవకాశం ఉందని పేర్కొంది. హిందూజా గ్రూప్ కంపెనీ ఇండస్ఇండ్ ఇంటర్నేషనల్ హోల్డింగ్స్ లిమిటెడ్ (IIHL) సమర్పించిన రూ. 9,650 కోట్ల రిజల్యూషన్ ప్లాన్‌ను అనిల్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ క్యాపిటల్ రుణదాతలు దివాలా అండ్ దివాలా కోడ్ (IBC) నిబంధనల ప్రకారం ఆమోదించారని హిందూజా గ్రూప్ జూలై 3న తెలిపింది.
చెల్లింపు డిఫాల్ట్‌లు , పాలనాపరమైన సమస్యల కారణంగా నవంబర్ 29, 2021న ఆర్‌బీఐ రిలయన్స్ క్యాపిటల్ బోర్డ్‌ను తన ఆధీనంలోకి తెచ్చుకుంది. బోర్డు టేకోవర్ తర్వాత, కంపెనీ కార్పొరేట్ ఇన్‌సాల్వెన్సీ రిజల్యూషన్ ప్రాసెస్ (CIRP)కి సంబంధించి నాగేశ్వరరావు వైని అడ్మినిస్ట్రేటర్‌గా నియమించింది.
రిలయన్స్ క్యాపిటల్ మొదటి వేలం డిసెంబర్‌లో జరగ్గా, ఇందులో టోరెంట్ ఇన్వెస్ట్‌మెంట్స్ రూ. 8,640 కోట్ల ఆఫర్‌తో అత్యధిక బిడ్డర్‌గా, హిందుజా గ్రూప్ రూ. 8,110 కోట్ల ఆఫర్ ఇచ్చింది. కానీ 24 గంటల్లోనే 9,000 కోట్ల రూపాయలతో సవరించిన బిడ్‌ను సమర్పించింది . అయితే టోరెంట్ నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (NCLT)దీన్ని సవాలు చేసింది. ఇక తదుపరి వేలం ఏప్రిల్ 26న జరిగింది, 9,650 కోట్ల రూపాయలతో ఐఐహెచ్‌లో మాత్రమే వేలంలో పాల్గొంది. ఈప్లాన్ ఆమోదంకోసం ఈ వారంలోనే ఎన్‌సీఎల్‌టీని సంప్రదించనున్నారు.ఈ అంచనాలపై అటు రిలయన్స్ క్యాపిటల్‌గానీ, ఇటు హిందూజా గ్రూప్ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు.
Comments
Please login to add a commentAdd a comment