ఇండస్‌ఇండ్ ఇంటర్నేషనల్ హోల్డింగ్స్‌కు 60%
ముంబై: మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్కో అసెట్ మేనేజ్‌మెంట్ ఇండియా (ఐఏఎంఐ)లో 60 శాతం వాటాలు కొనుగోలు చేస్తున్నట్లు హిందుజా గ్రూప్ సంస్థ ఇండస్‌ఇండ్ ఇంటర్నేషనల్ హోల్డింగ్స్ (ఐఐహెచ్‌ఎల్) వెల్లడించింది. ఇందుకు సంబంధించి జాయింట్ వెంచర్‌ను ఏర్పాటు చేసేందుకు ఐఐహెచ్‌ఎల్, ఇన్వెస్కో ఒప్పందం కుదుర్చుకున్నట్లు వివరించింది. దీని ద్వారా ఐఏఎంఐలో ఐఐహెచ్‌ఎల్‌కు 60 శాతం, ఇన్వెస్కోకు 40% వాటాలు ఉంటాయి.
1.6 లక్షల కోట్ల డాలర్ల విలువ చేసే అసెట్స్‌ను నిర్వహించే అంతర్జాతీయ ఇన్వెస్ట్‌మెంట్ మేనేజ్‌మెంట్ దిగ్గజం ఇన్వెస్కోకి ఐఏఎంఐ భారత విభాగంగా ఉంది. లోటస్ ఇండియా అసెట్ మేనేజ్‌మెంట్‌ను కొనుగోలు చేయడం ద్వారా 2008 ఆఖర్లో భారత మార్కెట్లో కార్యకలాపాలు ప్రారంభించింది. 2024 మార్చి 31 నాటికి ఐఏఎంఐ ఏయూఎం (నిర్వహణలో ఉన్న ఆస్తులు) రూ. 85,393 కోట్లుగా ఉండగా, దేశవ్యాప్తంగా 40 నగరాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. సంస్థకు హైదరాబాద్‌లో ఎంటర్‌ప్రైజ్ సెంటర్ కూడా ఉంది. ఇందులో 1,700 మంది పైచిలుకు ఉద్యోగులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment