IAMIA
-
‘ఇన్వెస్కో’లో హిందుజా సంస్థకు వాటాలు
ముంబై: మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్కో అసెట్ మేనేజ్మెంట్ ఇండియా (ఐఏఎంఐ)లో 60 శాతం వాటాలు కొనుగోలు చేస్తున్నట్లు హిందుజా గ్రూప్ సంస్థ ఇండస్ఇండ్ ఇంటర్నేషనల్ హోల్డింగ్స్ (ఐఐహెచ్ఎల్) వెల్లడించింది. ఇందుకు సంబంధించి జాయింట్ వెంచర్‌ను ఏర్పాటు చేసేందుకు ఐఐహెచ్ఎల్, ఇన్వెస్కో ఒప్పందం కుదుర్చుకున్నట్లు వివరించింది. దీని ద్వారా ఐఏఎంఐలో ఐఐహెచ్ఎల్కు 60 శాతం, ఇన్వెస్కోకు 40% వాటాలు ఉంటాయి. 1.6 లక్షల కోట్ల డాలర్ల విలువ చేసే అసెట్స్‌ను నిర్వహించే అంతర్జాతీయ ఇన్వెస్ట్మెంట్ మేనేజ్మెంట్ దిగ్గజం ఇన్వెస్కోకి ఐఏఎంఐ భారత విభాగంగా ఉంది. లోటస్ ఇండియా అసెట్ మేనేజ్మెంట్ను కొనుగోలు చేయడం ద్వారా 2008 ఆఖర్లో భారత మార్కెట్లో కార్యకలాపాలు ప్రారంభించింది. 2024 మార్చి 31 నాటికి ఐఏఎంఐ ఏయూఎం (నిర్వహణలో ఉన్న ఆస్తులు) రూ. 85,393 కోట్లుగా ఉండగా, దేశవ్యాప్తంగా 40 నగరాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. సంస్థకు హైదరాబాద్‌లో ఎంటర్ప్రైజ్ సెంటర్ కూడా ఉంది. ఇందులో 1,700 మంది పైచిలుకు ఉద్యోగులు ఉన్నారు. -
ఐఏఎంఏఐ చైర్మన్‌గా రాజన్ ఆనందన్
న్యూఢిల్లీ: గూగుల్ వైస్–ప్రెసిడెంట్‌గా (దక్షిణ–తూర్పు ఆసియా, ఇండియా) ఉన్న రాజన్ ఆనందన్ తాజాగా ఇంటర్నెట్ అండ్ మొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఐఏఎంఏఐ) కొత్త చైర్మన్‌గా నియమితులయ్యారు. ఈయన ఫ్రీచార్జ్ సహ వ్యవస్థాపకుడు, సీఈవో కునాల్ షా వద్ద నుంచి ఈ పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు. అలాగే ఐఏఎంఏఐ వైస్ చైర్మన్‌గా మేక్మైట్రిప్ చైర్మన్, సీఈవో దీప్ కల్రా ఎంపికయ్యారు. ఈయన మ్యూజిక్ యాప్ సావన్ సహ వ్యవస్థాపకుడు, ప్రెసిడెంట్ వినోద్ భట్ వద్ద నుంచి బాధ్యతలు స్వీకరిస్తారు. ఇక ఐఏఎంఏఐ ట్రెజరర్‌గా ఫేస్బుక్ మేనేజింగ్ డైరెక్టర్ (ఇండియా, దక్షిణాసియా) ఉమాంగ్ బేడి నియమితులయ్యారు. సుబో రాయ్ అసోసియేషన్ ప్రెసిడెంట్‌గా అలాగే కొనసాగుతున్నారు. కొత్తగా నియమితులైన వీరు రెండేళ్లపాటు పదవిలో కొనసాగుతారు. -
జీరో రేటెడ్ ప్లాన్స్ సరికాదు-ఐఏఎంఏఐ
న్యూఢిల్లీ: జీరో రేటెడ్ ప్లాన్స్‌పై ఇంటర్నెట్, మొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఐఏఎంఏఐ) విముఖత వ్యక్తంచేసింది. జీరో రేటెడ్ ప్లాన్స్ ఏ రూపంలో ఉన్న కూడా తాము వాటికి వ్యతిరేకమని పేర్కొంది. అలాంటి ప్లాన్స్ వల్ల ఆన్లైన్ కంటెంట్‌కు ప్రమాదం తలెత్తే అవకాశం ఉందని తెలిపింది. అలాగే కొన్ని వెబ్ సర్వీసులు టెల్కోల వివక్షతకు ఎదుర్కోవలసి వస్తుందని పేర్కొంది.