ఐఏఎంఏఐ చైర్మన్‌గా రాజన్ ఆనందన్
న్యూఢిల్లీ: గూగుల్ వైస్–ప్రెసిడెంట్‌గా (దక్షిణ–తూర్పు ఆసియా, ఇండియా) ఉన్న రాజన్ ఆనందన్ తాజాగా ఇంటర్నెట్ అండ్ మొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఐఏఎంఏఐ) కొత్త చైర్మన్‌గా నియమితులయ్యారు. ఈయన ఫ్రీచార్జ్ సహ వ్యవస్థాపకుడు, సీఈవో కునాల్ షా వద్ద నుంచి ఈ పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు. అలాగే ఐఏఎంఏఐ వైస్ చైర్మన్‌గా మేక్‌మైట్రిప్ చైర్మన్, సీఈవో దీప్ కల్రా ఎంపికయ్యారు.
ఈయన మ్యూజిక్ యాప్ సావన్ సహ వ్యవస్థాపకుడు, ప్రెసిడెంట్ వినోద్ భట్ వద్ద నుంచి బాధ్యతలు స్వీకరిస్తారు. ఇక ఐఏఎంఏఐ ట్రెజరర్‌గా ఫేస్‌బుక్ మేనేజింగ్ డైరెక్టర్ (ఇండియా, దక్షిణాసియా) ఉమాంగ్ బేడి నియమితులయ్యారు. సుబో రాయ్ అసోసియేషన్ ప్రెసిడెంట్‌గా అలాగే కొనసాగుతున్నారు. కొత్తగా నియమితులైన వీరు రెండేళ్లపాటు పదవిలో కొనసాగుతారు.