న్యూఢిల్లీ: రుణ సంక్షోభంలో చిక్కుకున్న రిలయన్స్ క్యాపిటల్(ఆర్‌క్యాప్) కొనుగోలు రేసులో హిందుజా గ్రూప్‌నకు వెసులుబాటు లభించింది. పరిశ్రమలు, అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక శాఖ(డీపీఐఐటీ) తాజాగా హిందుజా గ్రూప్ సంస్థ ఐఐహెచ్‌ఎల్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
ఇండస్‌ఇండ్ ఇంటర్నేషనల్ హోల్డింగ్స్(ఐఐహెచ్‌ఎల్)లోని కొంతమంది వాటాదారులు చైనా అధీనంలోని హాంకాంగ్ నివాసితులు కావడంతో డిపీఐఐటీ అనుమతి తప్పనిసరి అయ్యింది. కాగా.. సరిహద్దు(చైనా, బంగ్లాదేశ్ తదితర) దేశాల పౌరులు ఎవరైనా దేశీ సంస్థకు యజమాని అయితే.. స్థానికంగా పెట్టుబడుల కోసం ప్రభుత్వ అనుమతిని తీసుకోవలసి ఉంటుంది. వెరసి ఆర్‌క్యాప్ కొనుగోలుకి మారిషస్ సంస్థ ఐఐహెచ్‌ఎల్ రుణ పరిష్కార(రిజల్యూషన్) ప్రణాళికకు దారి ఏర్పాటుకానుంది.
ఇదీ చదవండి: అనిల్ అంబానీ భారీ ప్లాన్..
ఇప్పటికే రూ. 9,861 కోట్ల విలువైన రిజల్యూషన్ ప్రణాళిక ద్వారా ఐఐహెచ్‌ఎల్ బిడ్డింగ్‌లో గెలుపొందింది. ఈ ప్రణాళికను 2024 ఫిబ్రవరి 27న ఎన్‌సీఎల్‌టీ ముంబై బెంచ్ అనుమతించిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా రుణదాతల కమిటీ 99.96 శాతం వోటింగ్‌తో మద్దతు పలికింది. దీనిలో భాగంగా డీపీఐఐటీ తాజాగా అనుమతించింది.
Comments
Please login to add a commentAdd a comment