రిలయన్స్ క్యాపిటల్ కొనుగోలు జనవరి చివరికి పూర్తి అవుతుందని హిందుజా గ్రూప్ కంపెనీ ఐఐహెచ్‌ఎల్ ఆశాభావం వ్యక్తం చేసింది. ఆర్‌క్యాప్ కొనుగోలుతో బ్యాంకింగ్, ఫైనాన్షియల్‌సర్వీసెస్ (బీఎఫ్‌ఎస్‌ఐ) వ్యాపారాన్ని వచ్చే ఐదేళ్లలో 50 బిలియన్ డాలర్లకు చేర్చాలనే లక్ష్యంతో ఉన్నట్టు తెలిపింది. ప్రస్తుత విలువ 15 బిలియన్ డాలర్లుగా ఉంది.
‘‘రిలయన్స్ క్యాపిటల్‌కు సంబంధించి చాలా వరకు అనుమతులు, పరిష్కార ప్రక్రియలు ముగింపునకు వచ్చాయి. మరికొన్ని ప్రక్రియలు అడ్మినిస్ట్రేటర్, సీవోసీ స్థాయిలో పూర్తి కావాల్సి ఉంది. వచ్చే 4–6 వారాల్లో ఇవి పూర్తవుతాయని భావిస్తున్నాం’’అని ఐఐహెచ్‌ఎల్ చైర్మన్ అశోక్ పి. హిందుజా ప్రకటించారు. రూ.9,650 కోట్లకు ఆర్‌క్యాప్ కొనుగోలు బిడ్డింగ్‌లో ఐఐహెచ్‌ఎల్ విజేతగా నిలవడం తెలిసిందే.
ఇందులో రూ.2,750 కోట్లను ఈక్విటీ రూపంలో సమకూర్చనుండగా, మిగిలిన మొత్తాన్ని రుణాలకు చెల్లించాల్సి ఉంది. దీనికి కట్టుబడి ఉన్నట్టు హిందుజా తెలిపారు. ఇండస్ ఇండ్ బ్రాండ్ ప్రచారం చేయాలని అనుకుంటున్నామని, బ్రాండ్ ప్రచారంపై ఏజెన్సీలు పనిచేస్తున్నట్టు ప్రకటించారు. ఐఐహెచ్‌ఎల్ మరో సబ్సిడరీ అయిన ఇండస్‌ఇండ్ బ్యాంక్‌తో బ్యాంక్ అష్యూరెన్స్ ఒప్పందం కోసం ఆర్‌క్యాప్ చర్చించనున్నట్టు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment