హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: హిందుజా గ్రూపునకు చెందిన గల్ఫ్ ఆయిల్ కార్పొరేషన్ మార్చితో ముగిసిన త్రైమాసికానికి రూ.272 కోట్ల ఆదాయంపై రూ. 18 కోట్ల నికరలాభాన్ని ప్రకటించింది. అంతకుముందు సంవత్సరం ఇదే కాలానికి కంపెనీ రూ.265 కోట్ల ఆదాయంపై 17 కోట్ల నికరలాభాన్ని నమోదు చేసింది. ఏడాది మొత్తం మీద గల్ఫ్ ఆయిల్ నికరలాభం రూ. 47 కోట్ల నుంచి రూ.70 కోట్లకు పెరగ్గా, ఆదాయం రూ. 1,285 కోట్ల నుంచి రూ. 1,301 కోట్లకు చేరింది.
వాటాదారులకు రూ. 2.50 డివిడెండ్‌ను ప్రకటిస్తూ గురువారం బోర్డ్ ఆఫ్ డెరైక్టర్ల సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. గల్ఫ్ ఆయిల్ నుంచి లూబ్రికెంట్ వ్యాపారాన్ని విడదీస్తూ గల్ఫ్ ఆయిల్ లూబ్రికెంట్స్ ఇండియా లిమిటెడ్‌తో ఏర్పాటు చేస్తున్న కంపెనీకి హైకోర్టు నుంచి అనుమతి రావడంతో డీమెర్జర్ స్కీంను అమలు చేయడానికి బోర్డు నిర్ణయం తీసుకుంది.
గల్ఫ్ ఆయిల్ లాభం 18 కోట్లు
Published Fri, May 9 2014 1:20 AM | Last Updated on Tue, Aug 21 2018 3:08 PM
Advertisement