
సాక్షి,ముంబై: ప్రైవేటు రంగ విమాన యాన సంస్థ చాలా రోజుల తరువాత మళ్లీ వార్తల్లోకి వచ్చింది. బిలియనీర్ హిందూజా బ్రదర్స్ జెట్ ఎయర్‌వేస్‌ను కొనుగోలుకు బిడ్‌ను సిద్ధం చేస్తోందన్న వార్తల మధ్య జెట్ ఎయిర్‌వేస్ షేర్లు లాభపడుతున్నాయి. మంగళవారం నాటి బలహీన సెషన్‌లో ఇన్వెస్టర్లు జెట్ ఎయిర్‌వేస్ షేర్లుకొనుగోళ్లకు మొగ్గు చూపారు. దీంతో బీఎస్‌ఈలో 5 శాతం అప్పర్ సర్క్యూట్ అయ్యి రూ .296 వద్ద లాక్ అయ్యాయి. కాగా హిందూజా సోదరులు గోపిచంద్, అశోక్ హిందూజా నేతృత్వంలోని బృందం జనవరి 15 గడువులోగా జెట్ ఎ యిర్‌వేస్‌కు బిడ్ దాఖలు చేయాలని యోచిస్తోంది. రుణాలు, నష్టాలు పేరుకుపోయిన నేపథ్యంలో ఈ ఏడిది ఏప్రిల్ 17 నుంచి జెట్ ఎయిర్‌వేస్ కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేసిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment