Shares Jump
-
ఒక్క రోజులో.. వొడాఫోన్ ఐడియా పంట పండింది!
టెలికాం కంపెనీ వొడాఫోన్ ఐడియా పంట పండింది. తక్కువ లాభాలు ఉన్నప్పటికీ, వొడాఫోన్ ఐడియా షేర్ ధరలు ఒక్క రోజులో అమాంతం పెరిగాయి. ఆల్ టైమ్ హైని తాకాయి. గత కొన్ని నెలలుగా నీరసమైన లాభాలు ఉన్నప్పటికీ డిసెంబర్ 29న 2023 చివరి మార్కెట్ సెషన్లో వోడాఫోన్ ఐడియా షేర్ ధరలు ఏకంగా 20 శాతానికి పైగా ఎగిశాయి. సంవత్సర కాల గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. వొడాఫోన్ ఐడియా షేర్లు శుక్రవారం నాటి ట్రేడింగ్ సెషన్లో 20 శాతానికి పైగా ఎగిసి రూ.13 నుంచి రూ.16కి చేరాయి. ఇది కంపెనీ 52 వారాల గరిష్టం. ఇక వొడాఫోన్ ఐడియా షేర్ ధరల 52 వారాల కనిష్టం విషయానికి వస్తే రూ. 5.70 వద్ద నమోదైంది. ఆ డీలే కారణం! 16.05 కోట్ల షేర్లను విక్రయించి నిధులను సేకరించేందుకు వొడాఫోన్ ఐడియా ఇటీవల చేసిన ప్రయత్నాల కారణంగానే షేర్ల ధరలు అకస్మాత్తుగా పెరిగినట్లుగా తెలుస్తోంది. మొత్తం డీల్ లావాదేవీ విలువ రూ. 233 కోట్లు అని హిందీ వార్తా సంస్థ ఆజ్‌తక్ నివేదించింది. నిధుల సమీకరణ కోసం వొడాఫోన్ ఐడియా గడువు డిసెంబర్ 31తో ముగుస్తుంది. అయితే కంపెనీ ఇంకా చాలా బ్యాంకులతో చర్చలు జరుపుతున్నందున పొడిగింపును కోరుతుందని భావిస్తున్నారు. అలాగే భారత్‌లో 5జీ రోల్ అవుట్ కోసం ప్రణాళికను రూపొందిస్తోంది. 2022లో కొనుగోలు చేసిన స్పెక్ట్రమ్‌కు సంబంధించి వొడాఫోన్ ఐడియా ఈ సంవత్సరం ప్రారంభంలో టెలికమ్యూనికేషన్స్ విభాగానికి రూ.1700 కోట్లు చెల్లించింది. ఇది కంపెనీ షేర్హోల్డర్లలో నమ్మకాన్ని పెంచి, కంపెనీ షేర్ ధరను పెంచింది. వాటాదారుల సొమ్ము రెట్టింపు గత ఆరు నెలల్లో వొడాఫోన్ ఐడియా షేర్ ధరలు 113 శాతం పెరిగాయి. ఇన్వెస్టర్లు, వాటాదారుల డబ్బును రెట్టింపు చేసింది. 2007లో స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయినప్పటి నుంచి వొడాఫోన్ ఐడియా షేర్లకు 2023 ఉత్తమ సంవత్సరం. -
కిక్కు అంటే అదీ! ఆ షేర్లు ‘బ్రహ్మాండం’
సాక్షి,ముంబై: బ్రహ్మాస్త్ర బాక్సాఫీస్ కలెక్షన్లుమార్కెట్లోకి మల్టీప్లెక్స్ దిగ్గజ కంపెనీలకు జాక్‌పాట్ తగిలింది. ఈ మూవీ బాలీవుడ్ వసూళ్లు రూ.100 కోట్లు దాటడంతో పీవీఆర్, ఐనాక్స్ షేర్లు ఒక రేంజ్లో పుంజుకున్నాయి. బ్రహ్మాస్త్ర బాక్సాఫీస్ వసూళ్లతో ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు దిగారు. అందులోనూ ఇటీవలి నష్టాలతో షేర్ ధర తక్కువకు అందుబాటులో ఉండటంతో మరింత ఉత్సాహం నెలకొంది. ఫలితంగా పీవీఆర్ షేర్ 4.06 శాతం లేదా రూ.74.45 మేర ఎగిసింది. ఇంట్రా-డే ట్రేడింగ్‌లో, ఈ షేర్లు గరిష్టంగా రూ.1,926.20ని తాకాయి. ఐనాక్స్ లీజర్ షేర్లు 4.5 శాతం లేదా రూ. 22.55 పైగా ఎగిసి రూ.516.95 వద్ద ఉన్నాయి. ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ అంచనాల ప్రకారం శుక్రవారం రూ. 31.5 కోట్లు, శనివారం రూ. 37.5 కోట్లు, ఆదివారం రూ. 39.5 కోట్లు వసూలు చేసింది. ఫైనల్‌గా ఈ లెక్కే ఇంకా ఎక్కువే ఉండవచ్చని కూడా ఆయన అంచనావేశారు. జాతీయ స్థాయిలో మంచి వసూళ్లు సాధిస్తోందని ఆదర్శ్ అన్నారు. అయితే ఈ మూవీ బాక్సాఫీస్ కలెక్షన్లు డీలాపడటంతో శుక్రవారం, పీవీఆర్, ఐనాక్స్ లీజర్ దాదాపు 5 శాతం కుప్పకూలిన సంగతి తెలిసిందే. కాగా రణబీర్ కపూర్, అలియా నటించిన బ్రహ్మాస్త్రా పార్ట్ వన్: శివ సినిమాలో బిగ్‌బీ అమితాబ్ బచ్చన్, మౌని రాయ్‌తోపాటు, టాలీవుడ్ సీనియర్ హీరో నాగార్జున కీలక పాత్రల్లో నటించారు. అలాగే షారుఖ్ ఖాన్ అతిధి పాత్రలో అలరిస్తున్నాడు. దాదాపు 450 కోట్ల రూపాయల బడ్జెట్‌తో నిర్మించిన ఈ మూవీ ఇంగ్లీష్, తమిళం, తెలుగు, కన్నడ , మలయాళ భాషలలో విడుదలైంది. 18 కోట్లకు పైగా అడ్వాన్స్ బుకింగ్స్ కూడా నమోదు చేసింది. అంతేకాదు 'బ్రహ్మాస్త్రా పార్ట్ 2: దేవ్' అనే టైటిల్‌ను కూడా నిర్మాతలు ప్రకటించారు. ఈ చిత్రంలో హృతిక్ రోషన్ లేదా రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో నటించవచ్చని ఊహాగానాలు వచ్చాయి. -
అదర గొట్టిన టీవీఎస్ మోటార్, షేరు జూమ్
న్యూఢిల్లీ: టీవీఎస్ మోటార్ కంపెనీ కన్సాలిడేటెడ్‌గా జూన్ త్రైమాసికానికి రూ.297 కోట్ల లాభాన్ని ప్రకటించింది. ఆదాయం రూ.7,348 కోట్లకు దూసుకుపోయింది. ఈ నేపథ్యంలో టీవీఎస్ షేరు శుక్రవారం నాటి మార్కెట్లో 5 శాతం ఎగిసింది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో టీవీఎస్ మోటార్ రూ.15 కోట్ల నష్టాన్ని ప్రకటించడం గమనార్హం. ఆదాయం రూ.4,692 కోట్లుగా ఉంది. గతేడాది మొదటి త్రైమాసికంలో లాక్డౌన్లు అమల్లో ఉన్నందున, నాటి ఫలితాలను తాజాగా ముగిసిన త్రైమాసికంతో పోల్చి చూడకూడదని సంస్థ పేర్కొంది. ద్విచక్ర వాహనాలు, త్రిచక్ర వాహనాల విక్రయాలు (ఎగుమతులు సహా) 9.07 లక్షల యూనిట్లుగా ఉన్నాయి. అంతక్రితం ఏడాది ఇదే కాలానికి విక్రయాలు 6.58 లక్షల యూనిట్లుగా ఉండడం గమనించాలి. మోటారు సైకిళ్ల విక్రయాలు 3.06 లక్షల యూనిట్ల నుంచి 4.34 లక్షల యూనిట్లకు పెరిగాయి. స్కూటర్ల విక్రయాలు 1.38 లక్షల నుంచి 3.06 లక్షల యూనిట్లకు చేరాయి. 2.96 లక్షల యూనిట్ల ద్వచక్ర వాహనాలను ఎగుమతి చేసింది. రూ.125 కోట్ల విలువైన ఎన్సీడీలను ప్రైవేటు ప్లేస్మెంట్ విధానంలో జారీ చేయాలని సంస్థ నిర్ణయించింది. -
జొమాటోకుషాక్, షేర్లు జంప్, కొనుక్కోవచ్చా?
సాక్షి, ముంబై: ఆన్లైన్ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్ జొమాటోకు వరుస నష్టాల షాక్ తగిలింది. గత ఆర్థిక సంవత్సరం(2021-22) చివరి త్రైమాసికంలో నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన క్యూ4(జనవరి-మార్చి)లో నికర నష్టం భారీగా మూడురెట్లు పెరిగి రూ. 360 కోట్లకు చేరింది. అంతక్రితం ఏడాది(2020-21) ఇదే కాలంలో రూ. 134 కోట్ల నష్టం నమోదైంది. మొత్తం ఆదాయం మాత్రం రూ. 692 కోట్ల నుంచి రూ. 1,212 కోట్లకు జంప్ చేసింది. అయితే మొత్తం వ్యయాలు రూ. 885 కోట్ల నుంచి రూ. 1,702 కోట్లకు పెరిగాయి. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన మార్చితో ముగిసిన పూర్తి ఏడాదికి జొమాటో నికర నష్టం భారీగా పెరిగి రూ. 1,225 కోట్లను దాటింది. 202021లో రూ. 816 కోట్ల నష్టం నమోదైంది. అయితే మొత్తం ఆదాయం రూ. 1,994 కోట్ల నుంచి రూ. 4,192 కోట్లకు ఎగసింది. కంపెనీ తిరిగి వృద్ధి బాట పట్టినట్లు జొమాటో వ్యవస్థాపకుడు, సీఈవో దీపిందర్ గోయల్ ఫలితాల విడుదల సందర్భంగా అభిప్రాయపడ్డారు. కోవిడ్ తదుపరి సవాళ్లు బిజినెస్ వృద్ధిపై ఎలాంటి ప్రతికూలతలూ చూపించబోవని అంచనా వేశారు. వృద్ధిని కొనసాగించడం, నష్టాలను తగ్గించుకోవడం తదితర దీర్ఘకాలిక వ్యూహాలతో ముందుకు సాగుతున్నట్లు తెలియజేశారు. ఫలితాల నేపథ్యంలో సోమవారం జొమాటో షేరు 2.2 శాతం క్షీణించి రూ. 57 వద్ద ముగిసింది. అయితే మంగళవారం ట్రేడింగ్ ఆరంభంలోనే ఏకంగా 17 శాతం ఎగిసింది. ప్రస్తుతం 8శాతం లాభాలతో కొనసాగుతోంది. ట్రేడ్పండితులు టార్గెట్ ధరను రూ.100గా నిర్ణయించడంతో పేర్కొనడంతో కొనుగోళ్ల జోరు నెలకొంది. -
టాటా రయ్.. ఝున్‌ఝున్‌వాలా ఖాతాలో 375 కోట్లు
Rakesh Jhunjhunwala Stocks: ఇన్వెస్ట్మెంట్ గురు రాకేష్ ఝున్‌ఝున్‌వాలా మరోసారి స్టాక్ మార్కెట్‌తో లాభపడ్డారు. నాలుగు సెషన్ల వ్యవధిలో 375 కోట్ల రూపాయల్ని సంపాదించారు. ఆయన పెట్టుబడులు పెట్టిన నజారా టెక్నాలజీస్, టైటాన్ కంపెనీ, టాటా మోటర్స్ స్టాకులు ఒక్కసారిగా పెరగడంతో.. ఆయన సంపాదనా పెరిగింది. చివరి నాలుగు సెషన్స్‌లో ఒక్క టాటా మోటర్స్ షేర్సే 30 శాతం పెరగడం విశేషం. మోర్గాన్ స్టాన్లే వెల్లడించిన రిపోర్ట్ ప్రకారం.. 298రూ.గా ఉన్న టాటా షేర్ల ధరలు.. 448రూ. చేరుకున్నాయి. ఈ బలమైన పెరుగుదలతో ఆయన ఆదాయం వందల కోట్లను దాటేసింది. మూడు సెషన్స్‌లోనే 310 కోట్ల రూపాయల్ని(24 శాతం షేర్ల పెరుగుదల) సంపాదించారాయాన. ఇదిలా ఉంటే కరోనా టైంలోనే టాటా మోటర్స్ షేర్లపై ఝున్‌ఝున్‌వాలా దృష్టిసారించారు. సుమారు 4 కోట్ల షేర్లను సెప్టెంబర్ 2020లో కొనుగోలు చేశారాయన. ఈ ఏడాది జూన్ చివరినాటికి ఝున్‌ఝున్‌వాలా టాటా మోటర్స్‌లో 1.14 శాతం వాటాను(1,643 కోట్ల విలువ), 3కోట్ల77లక్షల ఈక్విటీ షేర్లను కలిగి ఉన్నారు. మార్కెట్ ర్యాలీలో నాలుగు రోజుల్లో 375 కోట్ల రూపాయల్ని సంపాదించారాయన. పండుగ సీజన్, పైగా ఈవీ కార్ల రంగంలోకి ప్రయత్నాలు మొదలయిన తరుణంలో టాటా షేర్లు విపరీతంగా పెరగడానికి కారణం అయ్యాయని మోర్గాన్ స్టాన్లే వెల్లడించింది. చదవండి: Akasa Air: ఝున్‌ఝున్‌వాలాకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ -
ఓలా ఎలక్ట్రిక్ బైక్స్ రాకతో ఆ కంపెనీ దశ తిరిగింది..!
న్యూఢిల్లీ: భారీ అంచనాల మధ్య ఓలా ఎలక్ట్రిక్ బైక్‌లను 75 వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఓలా సహా వ్యవస్థాపకుడు భవీష్ అగర్వాల్ లాంచ్ చేసిన విషయం తెలిసిందే. ఓలా ఎలక్ట్రిక్ బైక్‌లలో భాగంగా ఎస్1, ఎస్1 ప్రొ పేరుతో రెండు మోడల్స్‌ను మార్కెట్లలోకి తీసుకొనివచ్చింది. ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ ఎస్1 మోడల్ ధర రూ.99,999గా ఉంటే ఎస్1 ప్రో మోడల్ ధర రూ.1,29,999గా కంపెనీ నిర్ణయించింది. (చదవండి: సరికొత్త రికార్డు సృష్టించిన టీసీఎస్) భారత మార్కెట్లలో ఓలా ఎలక్ట్రిక్ బైక్‌లు వాహన ప్రియులకు ఏవిధంగా లాభం చేకూరుస్తుందో ఇప్పడే చెప్పలేము కానీ, ఓలా ఎలక్ట్రిక్ బైక్‌ల రాకతో విడిభాగాలను తయారుచేసే ఫియమ్ ఇండస్ట్రీస్ కంపెనీ దశ మారిపోయింది. ఓలా ఎలక్ట్రిక్ బైక్‌ల విడిభాగాలకు ఫియమ్ ఏకైక సరఫరాదారుగా నిలిచినట్లు తెలుస్తోంది. ఓలా ఎలక్ట్రిక్ బైక్‌లకు హెడ్‌ల్యాంప్స్, టెయిల్ ల్యాంప్స్, ఇండికేటర్లు, రేర్ ఫెండర్ అసెంబ్లీ, మిర్రర్స్‌ను ఫియమ్ ఇండస్ట్రీస్ అందించింది. దూసుకుపోయిన కంపెనీ షేర్లు..! తాజాగా స్టాక్ మార్కెట్లో ఫియమ్ ఇండస్ట్రీస్ కంపెనీ షేర్లు 20 శాతం మేర పెరిగి రికార్డుస్థాయిలో అత్యధికంగా షేర్ల విలువ రూ. 951.80 వరకు చేరుకుంది. స్టాక్మార్కెట్లో ఇప్పటివరకు ఫియమ్ ఇండస్ట్రీస్ షేర్లు 68 శాతంమేర పెరిగాయి. ఓలా ఎలక్ట్రిక్ బైక్‌లకు విడిభాగాలను అందించిన కంపెనీగా ఫియమ్ నిలిచిందని కంపెనీ ఒక ప్రకటనలో పేర్కొంది. ఇతర ఎలక్ట్రిక్ వాహన తయారీదారులకు కూడా విడిభాగాలను ఫియమ్ సప్తే చేస్తోంది. భవిష్యత్తులో ఓలా ఎలక్ట్రిక్ వాహనాల డిమాండ్లను తీర్చేందుకు ఫియమ్ సిద్ధంగా ఉందని వెల్లడించింది. (చదవండి: Apple: ఐఫోన్ యూజర్లకు గుడ్‌న్యూస్..!) -
లిస్టింగ్‌లు: మూడు హిట్.., ఒకటి ఫట్
ముంబై: నాలుగు ఐపీఓల్లో మూడు ప్రీమియం ధరతో.., ఒకటి డిస్కౌంట్ ధరతో లిస్ట్ అయ్యాయి. మొదటిరోజు దేవయాని ఇంటర్నేషనల్, ఎక్సారో టైల్స్, క్రిష్ణా డయాగ్నస్టిక్స్ షేర్లు వరుసగా 37%, పదిశాతం, నాలుగు శాతం లాభాలన్ని ఇన్వెస్టర్లకు పంచాయి. విండ్లాస్ బయోటెక్ షేరు మాత్రం 11.58 శాతం నష్టంతో ముగిసింది. బీఎస్ఈలో దేవయాని ఇంటర్నేషనల్ షేర్లు 69.15 లక్షల షేర్లు చేతులు మారగా, మార్కెట్ క్యాప్ రూ.14,833 కోట్ల వద్ద స్థిరపడింది. -
ఈ షేర్లు- రేస్ గుర్రాలు
ముంబై, సాక్షి: ఓవైపు దేశీ స్టాక్ మార్కెట్లు రికార్డుల ర్యాలీ చేస్తుంటే.. మరోవైపు సానుకూల వార్తల నేపథ్యంలో కొన్ని ఎంపిక చేసిన కౌంటర్లు భారీ లాభాలతో దూసుకెళ్లాయి. వెరసి నేటి ట్రేడింగ్‌లో కొన్ని కంపెనీల షేర్లు సరికొత్త గరిష్టాలను తాకాయి. జాబితాలో అల్ట్రాటెక్, గుడ్ఇయర్ ఇండియా, గోద్రెజ్ ప్రాపర్టీస్, ఎవెన్యూ సూపర్‌మార్ట్స్ చోటు సాధించాయి. వివరాలు చూద్దాం.. మార్కెట్ క్యాప్ సిమెంట్ రంగ దిగ్గజం అల్ట్రాటెక్ షేరు ఎన్ఎస్ఈలో 3 శాతం ఎగసి రూ. 5.211 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో రూ. 5,237 వద్ద సరికొత్త గరిష్టాన్ని అందుకుంది. కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్(విలువ) రూ. 1.5 లక్షల కోట్లను తాకడం విశేషం. ఇటీవల 12.8 ఎంటీపీఏ ప్లాంటు ఏర్పాటుకు బోర్డు అనుమతించింది. ఇందుకు రూ. 5,477 కోట్లు వెచ్చించనుంది. దీంతో కంపెనీ మొత్తం సిమెంట్ తయారీ సామర్థ్యం 136.25 ఎంటీపీఏకు చేరనుంది. బెంగళూరులోని వైట్‌ఫీల్డ్‌లో రెసిడెన్షియల్ ప్రాజెక్టును అభివృద్ధి చేయనున్నట్లు ప్రకటించడంతో గోద్రెజ్ ప్రాపర్టీస్ షేరు 4 శాతం లాభపడి రూ. 1,255 వద్ద ముగిసింది. తొలుత రూ. 1262 వద్ద లైఫ్‌టైమ్ గరిష్టానికి చేరింది. 18 ఎకరాలలో ఈ ప్రాజెక్టును చేపట్టనున్నట్లు కంపెనీ తెలియజేసింది. చదవండి: (పసిడి, వెండి- 2 వారాల గరిష్టం) డీమార్ట్ జోరు వాటాదారులకు షేరుకి రూ. 80 చొప్పున మధ్యంతర డివిడెండ్‌ను ప్రకటించడంతో గుడ్ఇయర్ ఇండియా షేరు ఎన్ఎస్ఈలో తొలుత 18 శాతం దూసుకెళ్లింది. రూ. 1,179 సమీపంలో సరికొత్త గరిష్టాన్ని చేరింది. చివరికి 16 శాతం లాభపడి రూ. 1,157 వద్ద ముగిసింది. డివిడెండ్ చెల్లింపునకు ఈ నెల 17 రికార్డ్‌డేట్‌గా పేర్కొంది. గత 7 రోజుల్లో ఈ షేరు 41 శాతం పెరిగింది! ఇక డీమార్ట్ స్టోర్ల కంపెనీ ఎవెన్యూ సూపర్‌మార్ట్స్ షేరు ఎన్ఎస్ఈలో 6 శాతం బలపడి రూ. 2,678 వద్ద నిలిచింది. ఇంట్రాడేలో రూ. 2,689 వద్ద రికార్డ్ గరిష్టాన్ని తాకింది. గత 6 రోజుల్లో ఈ షేరు 16 శాతం ర్యాలీ చేసింది. కోవిడ్-19 లాక్‌డవున్‌ల తదుపరి తిరిగి బిజినెస్ జోరందుకోవడంతో ఈ కౌంటర్‌కు డిమాండ్ పెరిగినట్లు నిపుణులు పేర్కొన్నారు. -
జెట్ ఎయిర్వేస్ షేర్లు జూమ్
సాక్షి,ముంబై: ప్రైవేటు రంగ విమాన యాన సంస్థ చాలా రోజుల తరువాత మళ్లీ వార్తల్లోకి వచ్చింది. బిలియనీర్ హిందూజా బ్రదర్స్ జెట్ ఎయర్‌వేస్‌ను కొనుగోలుకు బిడ్‌ను సిద్ధం చేస్తోందన్న వార్తల మధ్య జెట్ ఎయిర్వేస్ షేర్లు లాభపడుతున్నాయి. మంగళవారం నాటి బలహీన సెషన్లో ఇన్వెస్టర్లు జెట్ ఎయిర్వేస్ షేర్లుకొనుగోళ్లకు మొగ్గు చూపారు. దీంతో బీఎస్ఈలో 5 శాతం అప్పర్ సర్క్యూట్ అయ్యి రూ .296 వద్ద లాక్ అయ్యాయి. కాగా హిందూజా సోదరులు గోపిచంద్, అశోక్ హిందూజా నేతృత్వంలోని బృందం జనవరి 15 గడువులోగా జెట్ ఎ యిర్‌వేస్‌కు బిడ్ దాఖలు చేయాలని యోచిస్తోంది. రుణాలు, నష్టాలు పేరుకుపోయిన నేపథ్యంలో ఈ ఏడిది ఏప్రిల్ 17 నుంచి జెట్ ఎయిర్వేస్ కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేసిన సంగతి తెలిసిందే. -
అనిల్ అంబానీకి భారీ ఊరట
సాక్షి, ముంబై : చుట్టూ సమస్యలతో సతమతమవుతున్న అనిల్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ గ్రూపునకు భారీ ఊరట లభించింది. తనఖా పెట్టిన షేర్లను విక్రయించకుండా రుణదాతలతో అనిల్ అంబానీ గ్రూప్ ఒప్పందాన్ని కుదుర్చుకోవడంతో అడాగ్ గ్రూపు షేర్లు లాభాల పరుగందుకున్నాయి.. సెప్టెంబర్‌వరకూ తనఖా షేర్లను విక్రయించకుండా 90 శాతం రుణదాతలతో ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు అడాగ్ తాజాగా వెల్లడించింది. ఇందుకువీలుగా రుణాలకు సంబంధించిన వాయిదా చెల్లింపులను సమయానుగుణంగా చెల్లించే విధంగా అడాగ్ రుణదాతలకు హామీ ఇచ్చింది. దీంతో ఇన్వెస్టర్లలో ఉత్సాహం నెలకొంది. ముఖ్యంగా ఇటీవల భారీ నష్టాలను మూటగట్టుకున్న అనిల్ అంబానీ గ్రూప్ షేర్లు నష్టాల మార్కెట్లో మెరుపులు మెరిపిస్తున్నాయి. ఇన్వెస్టర్లు కొనుగోళ్లతో రిలయన్స్ కమ్యూనికేషన్స్ ఏకంగా 12 శాతం దూసుకెళ్లింది. రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ 12 శాతం, రిలయన్స్ కేపిటల్ దాదాపు 10 శాతం దూసుకెళ్లింది. రిలయన్స్ పవర్, రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ రిలయన్స్ నిప్పన్ లైఫ్ సైతం లాభాల బాటపట్టడం విశేషం. కాగా అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ గ్రూప్ కంపెనీలకు ఊరట లభించింది. ప్రమోటర్ తనఖా పెట్టిన షేర్లను ఈ ఏడాది సెప్టెంబర్ వరకూ విక్రయించకుండా రుణదాతలతో ఒక ఒప్పందాన్ని రిలయన్స్ గ్రూప్ కుదుర్చుకుంది. ఈ ఒప్పందానికి రుణదాతల్లో దాదాపు 90 శాతం సంస్థలు అంగీకరించాయి. -
పర్వాలేదనిపించిన ఎస్బీఐ
ప్రభుత్వ రంగ దిగ్గజ బ్యాంకు స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) శుక్రవారం ప్రకటించిన తొలి త్రైమాసిక ఫలితాల నికర లాభాల్లో పడిపోయింది. అయితే మార్కెట్ విశ్లేషకుల అంచనాలను కంటే తక్కువగానే పడిపోయి రూ.2520.96 కోట్ల నికర లాభాలను నమోదుచేసింది. 2016-17 ఆర్థిక సంవత్సరంలో జూన్‌తో ముగిసిన త్రైమాసికం నాటికి నికరలాభాలు యేటికేటికీ 31.7 శాతం పడిపోయినట్టు ఎస్బీఐ వెల్లడించింది. యేటికేటికీ నికర వడ్డీరేట్ల ఆదాయాలు 4.2 శాతం ఎగిసి, రూ.14,312.31 కోట్లగా ఉన్నట్టు తెలిపింది. మార్కెట్ విశ్లేషకులు బ్యాంకు నికర లాభాలు రూ. 2,504.9 కోట్లగా, నికర వడ్డీ ఆదాయాలు రూ.14,489.5 కోట్లగా నమోదుచేస్తుందని అంచనావేశారు. స్టేబుల్ అసెట్ క్వాలిటీని కొనసాగిస్తున్నట్టు బ్యాంకు ఈ ఫలితాల నేపథ్యంలో ప్రకటించడంతో, మార్నింగ్ ట్రేడింగ్‌లో 2 శాతం మేర డౌన్ అయిన ఎస్బీఐ షేర్లు, మధ్యాహ్నం సెషన్లో9 శాతం మేర లాభాల్లో దూసుకెళ్తున్నాయి. ఎస్బీఐ ఇతర ఆదాయాలు 44 శాతం మేర జంప్ అయ్యాయని బ్యాంకు పేర్కొంది. ఇతర ఆదాయాలు, నిర్వహణ లాభాలు, తక్కువ పన్నుధరలు బ్యాంకు లాభాలకు సపోర్టుగా నిలిచినట్టు ఎస్బీఐ వెల్లడించింది. అయితే బ్యాంకుకు మళ్లీ స్థూల బ్యాడ్ లోన్స్ బెడదగానే ఉన్నాయి. ఈ లోన్స్ జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో రూ.1,01,541 కోట్లకు ఎగిశాయి. మార్చి త్రైమాసికంలో ఇవి రూ.98,713 కోట్లగా ఉన్నాయి. బ్యాడ్ లోన్స్ పెంపు స్ట్రీట్ అంచనాల కంటే తక్కువగానే ఉన్నాయి. నికర నిరర్థక ఆస్తులు 3.8 శాతం నుంచి 4.05 శాతానికి ఎగిశాయి.బ్యాడ్ లోన్స్ ప్రొవిజన్లు జూన్ త్రైమాసికంలో రూ. 6,340 కోట్లకు పెరిగాయి. మార్చి త్రైమాసికంతో పోలిస్తే ఈ లోన్స్ తక్కువగానే నమోదయ్యాయి. మార్చి త్రైమాసికంలో బ్యాడ్ లోన్స్ ప్రొవిజన్లు రూ.12,139 కోట్లు. -
దూసుకుపోయిన యాపిల్ డిస్ట్రిబ్యూటర్
ఓ వైపు యాపిల్ ఉత్పత్తులు పడిపోతుండగా.. మరోవైపు యాపిల్ ఉత్పత్తులకు డిస్ట్రిబ్యూటర్ అయిన రెడింగ్ టన్ ఇండియా లాభాల్లో దూసుకుపోయింది. మార్కెట్ విశ్లేషకుల అంచనాలను అధిగమించి నికర లాభాలను నమోదుచేసింది. నాలుగో త్రైమాసికంలో రూ.10,474 కోట్ల అమ్మకాలపై రూ.138 కోట్ల నికరలాభాలు వచ్చినట్లు రెడింగ్ టన్ ప్రకటించింది. ఈ లాభాలు కేవలం రూ.126 కోట్లు మాత్రమే ఉంటాయని మార్కెట్ విశ్లేషకులు అంచనా వేశారు. వీరి అంచనాలను అధిగమిస్తూ రెడింగ్ టన్ లాభాల్లో దూసుకుపోయింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో రూ.123 కోట్ల లాభాలను రెండింగ్ టన్ నమోదుచేసింది. నిర్వహణ లాభాలు సైతం 5శాతం పెరిగి రూ.221 కోట్లగా రెడింగ్ టన్ చూపించింది. ఈ లాభాలు గతేడాది రూ.211 కోట్లగా ఉన్నాయి. రెడింగ్ టన్ ప్రకటించిన మెరుగైన త్రైమాసిక ఫలితాలతో మార్కెట్లో ఈ కంపెనీ షేర్లు దూసుకుపోయాయి. ఒక్కసారిగా 12.03శాతం ఎగబాకి షేరు ధర రూ.122 గా ట్రేడ్ అయింది.