ఓ వైపు యాపిల్ ఉత్పత్తులు పడిపోతుండగా.. మరోవైపు యాపిల్ ఉత్పత్తులకు డిస్ట్రిబ్యూటర్ అయిన రెడింగ్ టన్ ఇండియా లాభాల్లో దూసుకుపోయింది. మార్కెట్ విశ్లేషకుల అంచనాలను అధిగమించి నికర లాభాలను నమోదుచేసింది. నాలుగో త్రైమాసికంలో రూ.10,474 కోట్ల అమ్మకాలపై రూ.138 కోట్ల నికరలాభాలు వచ్చినట్లు రెడింగ్ టన్ ప్రకటించింది. ఈ లాభాలు కేవలం రూ.126 కోట్లు మాత్రమే ఉంటాయని మార్కెట్ విశ్లేషకులు అంచనా వేశారు. వీరి అంచనాలను అధిగమిస్తూ రెడింగ్ టన్ లాభాల్లో దూసుకుపోయింది.
గత ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో రూ.123 కోట్ల లాభాలను రెండింగ్ టన్ నమోదుచేసింది. నిర్వహణ లాభాలు సైతం 5శాతం పెరిగి రూ.221 కోట్లగా రెడింగ్ టన్ చూపించింది. ఈ లాభాలు గతేడాది రూ.211 కోట్లగా ఉన్నాయి. రెడింగ్ టన్ ప్రకటించిన మెరుగైన త్రైమాసిక ఫలితాలతో మార్కెట్లో ఈ కంపెనీ షేర్లు దూసుకుపోయాయి. ఒక్కసారిగా 12.03శాతం ఎగబాకి షేరు ధర రూ.122 గా ట్రేడ్ అయింది.