Redington India
-
లేటెస్ట్ ఐఫోన్స్: ఈ ఆఫర్లు తెలుసా మీకు?
iPhone 15 series , Watch Series 9 ఎంతోకాలంగా ఎదురు చూస్తున్న యాపిల్ ఐఫోన్స్ 15 సిరీస్‌లు లాంచ్ అయ్యాయి. అయితే లాంచ్ అయిన వెంటనే లేటెస్ట్ ఐఫోన్ 15, యాపిల్ వాచ్ 9 సిరీస్ ఉత్పత్తులు భారత మార్కెట్లో అవకాశం ఈ ఏడాది ఐఫోన్ లవర్స్‌కు పండగే అని చెప్పాలి. లేటెస్ట్ ఐఫోన్లు, యాపిల్ వాచ్‌లను దేశవ్యాప్తంగా ఉన్న తమ స్టోర్స్‌లో విక్రయించనున్నట్లు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సొల్యూషన్స్ సంస్థ రెడింగ్టన్ లిమిటెడ్ తెలిపింది. 7,000 పై చిలుకు రిటైల్ స్టోర్స్‌లో ఐఫోన్ 15, 15 ప్లస్, 15 ప్రో, 15 ప్రో మ్యాక్స్ అందుబాటులో ఉంటాయని పేర్కొంది. అలాగే, 2,800 స్టోర్స్‌లో యాపిల్ వాచ్ సిరీస్ 9, వాచ్ అల్ట్రా 3 కూడా లభిస్తాయని వివరించింది. స్మార్ట్‌ఫోన్స్, వాచ్‌ల లభ్యత, ధరల గురించి ఇండియా ఐస్టోర్డాట్కామ్ను సందర్శించవచ్చని కస్టమర్లకు సూచించింది. రూ. 5,000, రూ. 4,000 తక్షణ క్యాష్‌బ్యాక్‌ను పొందవచ్చు. అలాగే జీరో డౌన్ పేమెంట్, ఎంపిక చేసిన మోడల్స్‌పై రూ. 3,329 నుండి ప్రారంభమయ్యే నో-కాస్ట్ EMI ఎంపికలతో సహా వివిధ రుణ పథకాలు అందుబాటులో ఉన్నాయి. ఈ కొత్త మోడళ్లపై రెడింగ్టన్ రూ. 6,000 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్‌ను కూడా అందిస్తోంది. ముందస్తు ఆర్డర్లు ఇప్పటికే ప్రారంభం. అలాగే ఇంగ్రామ్ మైక్రో ఇండియా కూడా 7,000 కంటే ఎక్కువ రిటైల్ ప్రదేశాలలో తాజా ఆపిల్ ఉత్పత్తులను అందిస్తుంది. అలాగే హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కార్డ్‌లపై రూ. 5,000 క్యాష్‌బ్యాక్ , ఆరు నెలల నో-కాస్ట్ EMI ఎంపికతో సహా ఆకర్షణీయమైన బ్యాంక్ ఆఫర్లు లభ్యం. అదనంగా, రూ. 6,000 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్ ఆఫర్ కూడా ఉంది. -
3,500 స్టోర్లు, ఇండియాలో భారీ ఎత్తున ఐఫోన్ 13 అమ్మకాలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: యాపిల్ ఐఫోన్ 13 స్మార్ట్‌ఫోన్ దేశవ్యాప్తంగా 3,500 ప్రాంతాల్లో అందుబాటులో ఉంటుందని రెడింగ్టన్ ప్రకటించింది. అలాగే వినియోగదార్లకు క్యాష్ బ్యాక్ అందించేందుకు హెచ్డీఎఫ్సీ బ్యాంక్‌తో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్టు వెల్లడించింది. ఐఫోన్ 13, 13 మినీ, 13 ప్రో, 13 ప్రో మ్యాక్స్ మోడళ్లను కంపెనీ ఇటీవల ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. భారత్‌తోసహా 30 కిపైగా దేశాల్లో శుశ్రవారం (సెప్టెంబర్ 17) నుంచి ప్రీ–ఆర్డర్స్ ప్రారంభం అయ్యాయి. ముందస్తుగా బుక్ చేసుకున్న వినియోగదార్లకు ఈ స్మార్ట్‌ఫోన్ కొనుగోలు కోసం సమయాన్ని నిర్ధేశిస్తున్నట్టు కంపెనీ తెలిపింది. సెప్టెంబర్ 24 నుంచి స్మార్ట్ఫోన్లు కస్టమర్ల చేతుల్లో తళుక్కుమంటాయి. ధరల శ్రేణి మోడల్‌నుబట్టి రూ.69,900 నుంచి రూ.1,79,900 వరకు ఉంది. చదవండి: ఐఫోన్ లవర్స్‌కు గుడ్ న్యూస్ : తగ్గిన ధరలు -
రెడింగ్టన్- సిటీ యూనియన్.. దూకుడు
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2020-21) తొలి త్రైమాసికంలో నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించినప్పటికీ ఐటీ ప్రొడక్టుల పంపిణీ దిగ్గజం రెడింగ్టన్ ఇండియా కౌంటర్‌కు డిమాండ్ పెరిగింది. మరోపక్క ఇదే కాలంలో ఫలితాలు అంచనాలను చేరడంతో ప్రయివేట్ రంగ సంస్థ సిటీ యూనియన్ బ్యాంక్ కౌంటర్ సైతం వెలుగులోకి వచ్చింది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో ఈ రెండు కౌంటర్లూ భారీ లాభాలతో సందడి చేస్తున్నాయి. వివరాలు చూద్దాం.. రెడింగ్టన్ ఇండియా ఈ ఆర్థిక సంవత్సరం క్యూ1(ఏప్రిల్- జూన్)లో రెడింగ్టన్ ఇండియా నికర లాభం 19 శాతం క్షీణించి రూ. 89 కోట్లకు పరిమితమైంది. మొత్తం ఆదాయం సైతం 8 శాతం నీరసించి రూ. 10,722 కోట్లకు చేరింది. ఇబిటా 6 శాతం వెనకడుగుతో రూ. 230 కోట్లను తాకింది. అయితే కోవిడ్-19 కట్టడికి లాక్డౌన్ల అమలు నేపథ్యంలోనూ కంపెనీ పటిష్ట ఫలితాలు సాధించగలిగినట్లు నిపుణులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో రెడింగ్టన్ ఇండియా షేరు ప్రస్తుతం ఎన్ఎస్ఈలో 17 శాతం దూసుకెళ్లి రూ. 110 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో రూ. 112 వరకూ ఎగసింది. సిటీ యూనియన్ బ్యాంక్ ఈ ఆర్థిక సంవత్సరం క్యూ1(ఏప్రిల్- జూన్)లో సిటీ యూనియన్ బ్యాంక్ నికర లాభం 17 శాతం క్షీణించి రూ. 154 కోట్లకు పరిమితమైంది. మొత్తం ఆదాయం మాత్రం నామమాత్ర వృద్ధితో రూ. 1210 కోట్లను తాకింది. అయితే స్థూల మొండిబకాయిలు 4.09 శాతం నుంచి 3.9 శాతానికి తగ్గాయి. ఇక నికర ఎన్పీఏలు సైతం 2.29 శాతం నుంచి 2.11 శాతానికి దిగివచ్చాయి. ఈ నేపథ్యంలో సిటీ యూనియన్ బ్యాంక్ షేరు ప్రస్తుతం ఎన్ఎస్ఈలో 5 శాతం జంప్‌చేసి రూ. 123 వద్ద ట్రేడవుతోంది. -
దూసుకుపోయిన యాపిల్ డిస్ట్రిబ్యూటర్
ఓ వైపు యాపిల్ ఉత్పత్తులు పడిపోతుండగా.. మరోవైపు యాపిల్ ఉత్పత్తులకు డిస్ట్రిబ్యూటర్ అయిన రెడింగ్ టన్ ఇండియా లాభాల్లో దూసుకుపోయింది. మార్కెట్ విశ్లేషకుల అంచనాలను అధిగమించి నికర లాభాలను నమోదుచేసింది. నాలుగో త్రైమాసికంలో రూ.10,474 కోట్ల అమ్మకాలపై రూ.138 కోట్ల నికరలాభాలు వచ్చినట్లు రెడింగ్ టన్ ప్రకటించింది. ఈ లాభాలు కేవలం రూ.126 కోట్లు మాత్రమే ఉంటాయని మార్కెట్ విశ్లేషకులు అంచనా వేశారు. వీరి అంచనాలను అధిగమిస్తూ రెడింగ్ టన్ లాభాల్లో దూసుకుపోయింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో రూ.123 కోట్ల లాభాలను రెండింగ్ టన్ నమోదుచేసింది. నిర్వహణ లాభాలు సైతం 5శాతం పెరిగి రూ.221 కోట్లగా రెడింగ్ టన్ చూపించింది. ఈ లాభాలు గతేడాది రూ.211 కోట్లగా ఉన్నాయి. రెడింగ్ టన్ ప్రకటించిన మెరుగైన త్రైమాసిక ఫలితాలతో మార్కెట్లో ఈ కంపెనీ షేర్లు దూసుకుపోయాయి. ఒక్కసారిగా 12.03శాతం ఎగబాకి షేరు ధర రూ.122 గా ట్రేడ్ అయింది.