
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: యాపిల్ ఐఫోన్ 13 స్మార్ట్‌ఫోన్ దేశవ్యాప్తంగా 3,500 ప్రాంతాల్లో అందుబాటులో ఉంటుందని రెడింగ్టన్ ప్రకటించింది. అలాగే వినియోగదార్లకు క్యాష్ బ్యాక్ అందించేందుకు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌తో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్టు వెల్లడించింది.
ఐఫోన్ 13, 13 మినీ, 13 ప్రో, 13 ప్రో మ్యాక్స్ మోడళ్లను కంపెనీ ఇటీవల ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. భారత్‌తోసహా 30 కిపైగా దేశాల్లో శుశ్రవారం (సెప్టెంబర్ 17) నుంచి ప్రీ–ఆర్డర్స్ ప్రారంభం అయ్యాయి. ముందస్తుగా బుక్ చేసుకున్న వినియోగదార్లకు ఈ స్మార్ట్‌ఫోన్ కొనుగోలు కోసం సమయాన్ని నిర్ధేశిస్తున్నట్టు కంపెనీ తెలిపింది.
సెప్టెంబర్ 24 నుంచి స్మార్ట్‌ఫోన్లు కస్టమర్ల చేతుల్లో తళుక్కుమంటాయి. ధరల శ్రేణి మోడల్‌నుబట్టి రూ.69,900 నుంచి రూ.1,79,900 వరకు ఉంది.
Comments
Please login to add a commentAdd a comment