retail stores
-
భారత్‌లో యాపిల్ నాలుగు స్టోర్లు..? ఎక్కడంటే..
ప్రపంచ దిగ్గజ సంస్థ యాపిల్ భారత్‌లో తన రిటైల్ స్టోర్లను విస్తరించాలని యోచిస్తోంది. ఇప్పటికే ఢిల్లీ, ముంబయిలో రిటైల్ స్టోర్లను ప్రారంభించిన యాపిల్ మరో నాలుగు అవుట్లెట్లను ఏర్పాటు చేసేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి.ప్రపంచవ్యాప్తంగా యాపిల్ ఉత్పత్తులకు భారీగా డిమాండ్ ఏర్పడుతుంది. అందుకు అనుగుణంగా ఉత్పాదకతను పెంచేలా కంపెనీ ఏర్పాట్లు చేస్తోంది. దేశీయంగా యాపిల్ ఉత్పత్తుల తయారీ కోసం ఫాక్స్‌కాన్, టాటా వంటి కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకుంది. సెప్టెంబర్ 20న యాపిల్ ఐఫోన్ 16 సిరీస్ విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. దాంతో దేశంలోని ముంబయి, ఢిల్లీ స్టోర్‌ల్లో భారీగా వినియోగదారుల రద్దీ నెలకొంది. వేగంగా అభివృద్ధి చెందుతున్న భారత ఆర్థిక వ్యవస్థను ఆసరాగా చేసుకుని కంపెనీ రెవెన్యూ పెంచుకోవాలని ఆశిస్తుంది. దేశంలో కొత్తగా బెంగళూరు, పుణె, ఢిల్లీ-ఎన్సీఆర్, ముంబయిలో రిటైల్ స్టోర్లు ప్రారంభించాలని యోచిస్తోంది. దాంతోపాటు ‘మేడ్ ఇన్ ఇండియా’లో భాగంగా ఐఫోన్ 16 ప్రో, ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్‌ను స్థానికంగా తయారు చేయాలనే ప్రతిపాదనలున్నట్లు కంపెనీ అధికారులు పేర్కొన్నారు.ఇదీ చదవండి: కేంద్రం కొత్త పథకాలు ప్రారంభం.. ఎవరికంటే..ఆపిల్ రిటైల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ డెయిడ్రే ఓబ్రియన్ మాట్లాడుతూ..‘భారత్‌లో సంస్థ రిటైల్ స్టోర్లు విస్తరించాలని యోచిస్తోంది. అందుకు అనుగుణంగా మెరుగైన టీమ్‌ను సిద్ధం చేస్తున్నాం. మా కస్టమర్ల సృజనాత్మకత, అభిరుచికి అధిక ప్రాధాన్యం ఇస్తాం. వారి ఇష్టాలకు అనువుగా సరైన ఉత్పత్తులను అందించడం సంస్థ బాధ్యత. స్థానికంగా స్టోర్లను పెంచడం ద్వారా మరింత ఎక్కువ మంది వినియోగదారులకు సేవలందించే అవకాశం ఉంటుంది’ అన్నారు. -
హైదరాబాద్‌లో కొత్త పెయింట్ ఉత్పత్తులు
గ్రాసిమ్ ఇండస్ట్రీస్ ఆధ్వర్యంలోని బిర్లా ఓపస్ పెయింట్స్ హైదరాబాద్‌లో విస్తరిస్తోంది. స్థానికంగా రెండు స్టోర్లను ప్రారంభించినట్లు కంపెనీ ప్రతినిధి మహ్మద్ తబ్రుద్దీన్ తెలిపారు. దేశవ్యాప్తంగా కంపెనీ 50కుపైగా ఫ్రాంఛైజీ స్టోర్లను కలిగి ఉన్నట్లు పేర్కొన్నారు.దేశవ్యాప్తంగా రియల్ ఎస్టేట్ రంగం వేగంగా విస్తరిస్తోంది. స్టీల్, సిమెంట్ పరిశ్రమతోపాటు ఈ రంగం వృద్ధిలో పెయింట్ పరిశ్రమ కీలకపాత్ర పోషిస్తుంది. ఈ పెయింట్ పరిశ్రమలో ఇప్పటికే చాలాకంపెనీలు సేవలందిస్తున్నాయి. అయితే బిర్లా ఓపస్ మాత్రం తన వినియోగదారులకు ఏఐ సాయంతో విభిన్న రంగులు ఎంచుకునేలా తోడ్పడుతుందని కంపెనీ ప్రతినిధి నకుల్ వ్యాస్ పేర్కొన్నారు. పెయింట్ తయారీలో వెలువడే వ్యర్థాలను తగ్గించేలా కొత్త సాంకేతికతలను వాడుతున్నట్లు చెప్పారు. ఇటీవల హైదారబాద్‌లో ప్రారంభించిన బిర్లా ఓపస్ స్టోర్లు హఫీజ్ బాబా నగర్, పొప్పల్గూడ విలేజ్‌లో ఉన్నట్లు తెలిపారు.ఇదీ చదవండి: ఉచితాలు.. శాపాలు! -
బ్లూడార్ట్ సేవల విస్తరణ
ముంబై: ఎక్స్‌ప్రెస్ ఎయిర్, ట్రాన్స్‌పోర్టేషన్, లాజిస్టిక్స్ సేవల్లోని బ్లూడార్ట్ విస్తరణపై దృష్టి సారించింది. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా 76 పిన్కోడ్లకు తన కార్యకలాపాలను కొత్తగా విస్తరించినట్టు ప్రకటించింది. అలాగే, దేశవ్యాప్తంగా కంపెనీ ఆధీనంలో 15 కొత్త రిటైల్ స్టోర్లను ప్రారంభించింది. అలాగే 15 ఫ్రాంచైజీ కలెక్షన్ సెంటర్లు, 15 ఎక్స్‌ప్రెస్ ఏజెంట్లు, 15 ప్రాంతీయ సరీ్వస్ ప్రొడైడైర్ ఫ్రాంచైజీలను నియమించుకున్నట్టు ప్రకటించింది. తద్వారా దేశంలోని ప్రతి పాంతానికీ సేవలు అందించగలమని తెలిపింది. దేశ ప్రజలకు సేవలు అందించే విషయంలో తమ అంకిత భావానికి ఈ సేవల విస్తరణ నిదర్శనంగా కంపెనీ పేర్కొంది. విజయవాడ, సికింద్రాబాద్, మధురై, భువనేశ్వర్, లుధియానా, కోల్‌కతా తదితర పట్టణాల్లోని వ్యూహాత్మకంగా కీలకమైన ప్రాంతాల్లో కొత్త రిటైల్ స్టోర్లు తెరిచినట్టు తెలిపింది. తాజా విస్తరణతో దేశవ్యాప్తంగా 55వేలకు పైగా ప్రాంతాలకు తమ సేవలు చేరువ అయినట్టు వివరించింది. మారుతున్న కస్టమర్ల ప్రాధాన్యతలకు అనుగుణంగా సేవలు అందించడంపై తమ దృష్టి ఉంటుందని బ్లూడార్ట్ చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ కేతన్ కులకర్ణి తెలిపారు. -
ఈజ్‌మైట్రిప్ ఫ్రాంచైజీ స్టోర్లు
హైదరాబాద్: ఈజ్‌మైట్రిప్ రిటైల్ స్టోర్లను ప్రారంభించనుంది. ఫ్రాంచైజీ విధానంలో కస్టమర్లకు ట్రావెల్, ఇతర బుకింగ్ సేవలు అందించనుంది. స్టోర్ల ద్వారా ఆఫ్‌లైన్ కస్టమర్లను చేరుకోగలమన్న విశ్వాసాన్ని కంపెనీ వ్యక్తం చేసింది. ట్రావెల్ వ్యాపారంలోకి ప్రవేశించాలనే ఆసక్తితోపాటు, ధనికులైన క్లయింట్ల నెట్వర్క్, కస్టమర్లు, సొసైటీల నెట్వర్క్, అసోసియేషన్లతో సంబంధాలు కలిగిన వారు ఫ్రాంచైజీ ప్రారంభించొచ్చని సంస్థ తెలిపింది. అన్ని బుకింగ్ లావాదేవీలపై మెరుగైన కమీషన్ ఇస్తామని పేర్కొంది. రోజులో 24 గంటల పాటు సపోర్ట్ సేవలతో, మూడు, నాలుగు నెలల్లోనే లాభనష్టాల్లేని స్థితికి చేరుకునేందుకు సహకారం అందించనున్నట్టు తెలిపింది. ఈజ్‌మైట్రిప్ ద్వారా ఫ్లయిట్ల బుకింగ్, హోటల్ రూమ్‌లు, ఐఆర్సీటీసీ, క్యాబ్, బస్‌లు, క్రూయిజ్‌లు, చార్టర్ల సేవలు పొందొచ్చు. -
Bureau of Indian Standards: 18వేల ఆటబొమ్మలు సీజ్
న్యూఢిల్లీ: గత నెల రోజుల వ్యవధిలో ఆర్చీస్, హ్యామ్లీస్, డబ్ల్యూహెచ్ స్మిత్ వంటి రిటైల్ స్టోర్స్ నుంచి 18,600 ఆటబొమ్మలను అధికారులు సీజ్ చేశారు. భారతీయ నాణ్యతా ప్రమాణాలకు సంబంధించిన బీఐఎస్ మార్కు లేకపోవడం, నకిలీ లైసెన్సులతో తయారు చేయడం తదితర అంశాలు ఇందుకు కారణం. బీఐఎస్ డైరెక్టర్ జనరల్ ప్రమోద్ కుమార్ తివారీ శుక్రవారం ఈ విషయాలు తెలిపారు. బీఐఎస్ ప్రమాణాలకు తగ్గట్లుగా లేని బొమ్మల విక్రయం జరుగుతోందంటూ దేశీ తయారీదారుల నుంచి ఫిర్యాదులు రావడంతో దేశవ్యాప్తంగా గత నెలలో పెద్ద విమానాశ్రయాలు, మాల్స్‌లోని బడా రిటైలర్స్ స్టోర్స్‌లో 44 సోదాలు నిర్వహించినట్లు ఆయన వివరించారు. హైదరాబాద్, ఢిల్లీ, ముంబై తదితర విమానాశ్రాయాల్లో వేల కొద్దీ బొమ్మలను సీజ్ చేసినట్లు తెలిపారు. బీఐఎస్ చట్టం కింద నిబంధనల ఉల్లంఘనకు గాను రూ. 1 లక్ష జరిమానా మొదలుకుని జైలు శిక్ష వరకూ నేరం తీవ్రతను బట్టి శిక్షలు ఉంటాయి. -
కొత్త ఉద్యోగాలు, దిగి రానున్న ఐఫోన్ ధరలు: యాపిల్ బిగ్ ప్లాన్స్
టెక్ దిగ్గజం, ఇండియాలో టాప్ ప్రీమియం స్మార్ట్‌ఫోన్ బ్రాండ్, యాపిల్ భారత్‌లో తన దూకుడును మరింత పెంచుతోంది. త్వరలోనే ఇండియాలోనే సొంతంగా రెండు రీటైల్ స్టోర్లను ఏర్పాటు చేయనుంది. భారత్‌లో ఐఫోన్లకు డిమాండ్ భారీగా పెరుగుతున్న నేపథ్యంలో రెండు ప్రధాన నగరాల్లో సొంతంగా రీటైల్ స్టోర్లను తెరిచేందుకు సన్నద్ధమవుతోంది. ఢిల్లీలో 12,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో స్టోర్ ఏర్పాటు కానుండగా, ముంబైలో దాదాపు దీనికి రెట్టింపు సైజులో 22,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో స్టోర్ రానుందని పలు నివేదికల సమాచారం. కోవిడ్ -19 మహమ్మారి కారణంగా ఇండియాలో యాపిల్ స్టోర్ల లాంచింగ్ ఆలస్యమైంది. ఎట్టకేలకు ఈ ఏడాది ఏప్రిల్‌లో దేశంలో ముంబై, న్యూఢిల్లీలో ఏర్పాటు చేయనుంది. ముందుగా ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్ (BKC)లో తొలి స్టోర్ తెరుచుకోనుంది. అంతేకాదు ఈ స్టోర్లలో పనిచేసేందుకు ఉద్యోగులను నియమించుకోవడంపై దృష్టి సారించింది. ఇప్పటికే ఐదుగురు ఉద్యోగులకు ఎంపిక చేసిన యాపిల్ ఇండియా సోషల్ మీడియా నెట్వర్క్ లింక్డ్ఇన్లో తమ నియామక ప్రకటనలు ఓపెనింగ్స్ వివరాలను ప్రచురించడం విశేషం. యాపిల్ రిటైల్‌లో 12 కొత్త ఉద్యోగ అవకాశాలుండగా, ఇందులో స్టోర్ లీడర్లు, మార్కెట్ లీడర్లు, మేనేజర్లు, సీనియర్ మేనేజర్ స్థాయి (ఫుల్ టైం, పార్ట్-టైమ్) జాబ్స్ ఉన్నాయి. భారతదేశంలో తన రిటైల్ స్టోర్లను ఏర్పాటు చేయడమే కాకుండా, యాపిల్ స్థానికంగా ఐఫోన్ల తయారీ , అసెంబ్లింగ్‌ను కూడా ప్రారంభించింది. గత ఐదేళ్లుగా భారతీయ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో కంపెనీ భారీగా పెట్టుబడులు పెడుతోంది. 2017లో యాపిల్ తొలిసారిగా భారతదేశంలో ఐఫోన్లను (ఐఫోన్ SE) అసెంబ్లింగ్ చేయడం ప్రారంభించింది. సెప్టెంబర్ 2022లో, కంపెనీ ఐఫోన్ 14 మోడల్‌ల ఉత్పత్తిని చైనా నుండి భారతదేశానికి మార్చింది. తన గ్లోబల్ పార్ట్నర్ ఫాక్స్‌కాన్ ప్రస్తుతం ఈ ఫోన్‌ను చెన్నై సమీపంలోని శ్రీపెరంబుదూర్ ప్లాంట్‌లో తయారు చేస్తోన్న సంగతి తెలిసిందే. చైనా, అమెరికా వాణిజ్య యుద్ధం, ఇతర కారణాల రీత్యా భారత్ త్వరలో చైనా, వియత్నాంలను అధిగమించి ప్రపంచంలోనే అతిపెద్ద స్మార్ట్‌ఫోన్ తయారీ కేంద్రంగా అవతరించనుందని అంచనా. దీంతో ఐఫోన్ ధరలు దిగి రానున్నాయని అటు విశ్లేషకులు, ఇటు ఐఫోన్ లవర్స్ అంచనా. ముఖ్యంగా ఇతర దేశాలతో పోలిస్తే మన దేశంలో ఐఫోన్లపై 22 శాతం కస్టమ్స్ సుంకం, 18శాతం జీఎస్టీతో భారతదేశంలో ఐఫోన్లు ఖరీదే. ఉదాహరణకు, ఐఫోన్ 14 ప్రో బేస్ ధర దేశంలో కేవలం రూ.90,233. అయితే, కస్టమ్స్ సుంకం, జీఎస్టీ కలిపి మొత్తం ధర రూ. 129,900 అవుతోంది. -
CBRE India: ఆకర్షించేలా ఉంటేనే మాల్స్‌కి మనుగడ
న్యూఢిల్లీ: షాపింగ్ మాల్స్, ఇతరత్రా రిటైల్ స్టోర్స్.. కస్టమర్లను ఆకట్టుకునేలా విశిష్టమైన అనుభూతిని అందించగలిగితేనే మనుగడ సాగించగలవని ప్రాపర్టీ కన్సల్టెన్సీ సేవల సంస్థ సీబీఆర్ఈ ఇండియా ఒక నివేదికలో పేర్కొంది. ‘భౌతిక రిటైల్ స్టోర్స్‌కి వెడితే బాగుంటుందని కోరుకునేలా ఉండాలే తప్ప .. ఏదో అవసరార్ధం వెళ్లక తప్పదనే విధంగా ఉండకూడదు. కస్టమర్లను ఆకర్షించేలా ఉంటేనే రిటైల్ స్టోర్స్ విజయవంతం కాగలవు‘ అని సంస్థ చైర్మన్ అన్షుమన్ మ్యాగజైన్ తెలిపారు. నివేదిక ప్రకారం కోవిడ్ మహమ్మారి తగ్గుముఖం పట్టే కొద్దీ రిటైల్ స్టోర్స్, వినోద కేంద్రాలను సందర్శించే వారి సంఖ్య పెరుగుతోంది. 2022 రెండో త్రైమాసికంలో (ఏప్రిల్ – జూన్) రిటైల్ రంగం గణనీయంగా కోలుకుంది. మొత్తం మీద 2022 ప్రథమార్ధంలో (జనవరి–జూన్) 160 శాతం పైగా వృద్ధి (గతేడాదితో పోలిస్తే) నమోదు చేసింది. ప్రస్తుత పరిస్థితుల్లో రిటైల్ రంగంలో సంస్థలు కస్టమర్లకు భౌతికంగా అనుభూతిని ఎంత మేర మెరుగుపర్చగలమనే అంశంపై మరింత దృష్టి పెట్టాల్సి ఉంటోందని సీబీఆర్ఈ ఇండియా ఎండీ రామ్ చంద్నానీ తెలిపారు. స్టోర్ ఫార్మాట్లు, పనితీరులో వైవిధ్యం పాటించడం, ప్రాంతాన్ని బట్టి వ్యూహాలు రూపొందించేందుకు డేటా సైన్స్‌ను ఉపయోగించుకోవడం, వ్యక్తిగతంగా మెరుగైన అనుభూతిని సృష్టించేందుకు ప్రయత్నించడం తదితర అంశాలను పరిశీలించవచ్చని పేర్కొన్నారు. వివిధ నగరాల్లో తమ కార్యకలాపాలను విస్తరించేందుకు బ్రాండ్లు తమ భౌతిక స్టోర్ల వ్యూహాలను సవరించుకుంటున్నాయని, ప్రత్యేక ’అనుభూతి’ని కల్పించడానికి ప్రాధాన్యమిస్తున్నాయని చంద్నానీ తెలిపారు. -
మోసం చేసేందుకు సహాయపడ్డారు
న్యూఢిల్లీ: రిలయన్స్ గ్రూప్‌నకు రిటైల్ స్టోర్ల బదలాయింపు విషయంలో ఫ్యూచర్ రిటైల్‌తో (ఎఫ్ఆర్ఎల్) ఈ–కామర్స్ సంస్థ అమెజాన్ వివాదం కొనసాగుతోంది. ఈ ’మోసపూరిత వ్యూహం’ అమలుకు ఎఫ్ఆర్ఎల్ స్వతంత్ర డైరెక్టర్లు సహాయం చేశారంటూ అమెజాన్ తాజాగా ఆరోపించింది. ఎఫ్ఆర్ఎల్ భారీ అద్దె బకాయిలు కట్టలేకపోవడం వల్లే 835 పైచిలుకు స్టోర్లను రిలయన్స్ గ్రూప్ స్వాధీనం చేసుకుందన్న వాదనలన్నీ తప్పుల తడకలని పేర్కొంది. స్టోర్స్ స్వాధీనానికి నెల రోజుల ముందే ఈ బకాయిలు కేవలం రూ. 250 కోట్లు మాత్రమే ఉంటాయంటూ ఎఫ్ఆర్ఎల్ వెల్లడించిందని.. ఆ కాస్త మొత్తానికి అన్ని స్టోర్స్‌ను రిలయన్స్‌కు ఎలా బదిలీ చేస్తారంటూ ప్రశ్నించింది. ఎఫ్ఆర్ఎల్ స్వతంత్ర డైరెక్టర్లకు ఈ మేరకు లేఖ రాసింది. సంక్షోభంలో ఉన్న ఎఫ్ఆర్ఎల్కు తాము ఆర్థిక సహాయం అందిస్తామంటూ ఆఫర్ చేసినప్పటికీ అప్పట్లో రిలయన్స్‌కు రిటైల్ వ్యాపార విక్రయ డీల్‌పై చర్చల సాకును చూపించి స్వతంత్ర డైరెక్టర్లు తమ ప్రతిపాదన తిరస్కరించారని పేర్కొంది. ఆ తర్వాత కంపెనీ, దాని ప్రమోటర్లు, డైరెక్టర్లు మొదలైన వారంతా రిలయన్స్ గ్రూప్‌తో కుమ్మక్కై ఎఫ్ఆర్ఎల్ నుంచి రిటైల్ స్టోర్స్‌ను వేరు చేశారని, ఈ మోసాన్ని అడ్డుకోవడానికి స్వతంత్ర డైరెక్టర్లు ఎలాంటి చర్యలు తీసుకోలేదని అమెజాన్ ఆరోపించింది. తద్వారా ప్రజలు, నియంత్రణ సంస్థలను మోసం చేశారని వ్యాఖ్యానించింది. ఈ నేపథ్యంలో చట్టప్రకారం ప్రమోటర్లతో పాటు డైరెక్టర్లకు కూడా జైలు శిక్షలు తప్పవని హెచ్చరించింది. ఫ్యూచర్ గ్రూప్‌లో భాగమైన ఫ్యూచర్ కూపన్స్‌లో వాటాల ద్వారా రిటైల్ వ్యాపారమైన ఎఫ్‌ఆర్‌ఎల్‌లో అమెజాన్‌కు స్వల్ప వాటాలు ఉన్నాయి. తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోవడంతో రిటైల్ వ్యాపారాలను రిలయన్స్ రిటైల్‌కు రూ. 24,713 కోట్లకు విక్రయించేందుకు ఫ్యూచర్ గ్రూప్ ఒప్పం దం కుదుర్చుకుంది. అయితే, ఇది తన ప్రయోజనాలకు విరుద్ధమంటూ అమెజాన్ న్యాయస్థానాలు, ఆర్బిట్రేషన్ ట్రిబ్యునల్స్‌ను ఆశ్రయించగా పలు చోట్ల దానికి అనుకూలంగా ఉత్తర్వులు వచ్చాయి. ప్రస్తుతం దీనిపై ఇంకా న్యాయపోరాటం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఎఫ్ఆర్ఎల్ డీల్‌ను రిలయన్స్ రద్దు చేసుకుంది. రిటైల్ స్టోర్స్ లీజు బకాయిలు తమకు కట్టనందున వాటిని స్వాధీనం చేసుకుంటున్నట్లు ప్రకటించింది. -
ఫోన్‌పే, ఫ్లిప్‌కార్ట్‌లు చాలు.. వాటిపై ఆసక్తి లేదు.. వాల్‌మార్ట్ సంచలన ప్రకటన
ముంబై: భారత్‌లో రిటైల్ స్టోర్ల ఏర్పాటు పట్ల ఆసక్తి లేదని అమెరికాకు చెందిన రిటైల్ దిగ్గజం వాల్‌మార్ట్ ప్రకటించింది. కాకపోతే ఈ కామర్స్ ప్లాట్‌ఫామ్ ఫ్లిప్‌కార్ట్, పేమెంట్స్ సేవల సంస్థ ఫోన్‌పే బలోపేతానికి కొనుగోళ్ల పట్ల ఆసక్తిగా ఉన్నట్టు తెలిపింది. కొన్నేళ్ల క్రితం 16 బిలియన్ డాలర్లు (రూ.1.20 లక్షల కోట్లు) వెచ్చించి ఫ్లిప్‌కార్ట్, ఫోన్‌పే సంస్థలను వాల్‌మార్ట్ సొంతం చేసుకోవడం గమనార్హం. ‘‘మాకు ఓమ్నిచానల్ (ఆన్లైన్, ఆఫ్‌లైన్) వ్యూహం ఉంది. ఈ రెండూ ఉన్నప్పుడు కస్టమర్ల అనుభవం అవరోధాల్లేకుండా ఉంటుంది. కోరుకున్నప్పుడు స్టోర్‌కు వెళ్లి తీసుకునే సౌలభ్యం ఉంటుంది. కానీ, ప్రస్తుత దశలో మేము దానిపై దృష్టి సారించడం లేదు. ఫ్లిప్‌కార్ట్, ఫోన్‌పే విజయవంతానికే కృషి చేస్తున్నాం’’ అని వాల్‌మార్ట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ డగ్ మెక్‌మిల్లన్ ముంబైలో అంతర్జాతీయ వ్యాపార సదస్సు సందర్భంగా చెప్పారు. ఫ్లిప్‌కార్ట్‌లో పెట్టుబడుల పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. ఐపీవో అంతిమ లక్ష్యం ఫ్లిప్‌కార్ట్ ఐపీవో అన్నది అంతిమ లక్ష్యమంటూ, ఎప్పుడు దీన్ని తీసుకొచ్చేది ఆయన స్పష్టం చేయలేదు. ‘‘ఏదో ఒక సమయంలో ఐపీవో సరైన నిర్ణయం అని ఆరంభం నుంచి అనుకుంటూనే ఉన్నాం. కానీ, బలమైన పునాదిని మేం నిర్మించాల్సి ఉంది. సన్నద్ధత ఆధారంగా నిర్వహణ టీమ్ ఆ నిర్ణయం తీసుకోవాలని అనుకుంటున్నాం. ఐపీవోకు సంబంధించి వ్యూహాత్మక నిర్ణయాలను ఫ్లిప్‌కార్ట్, ఫోన్‌పేకు సంబంధించి స్థానిక నాయకత్వాలే తీసుకుంటాయి’’ అని మెక్‌మిల్లన్ తెలిపారు. -
3,500 స్టోర్లు, ఇండియాలో భారీ ఎత్తున ఐఫోన్ 13 అమ్మకాలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: యాపిల్ ఐఫోన్ 13 స్మార్ట్‌ఫోన్ దేశవ్యాప్తంగా 3,500 ప్రాంతాల్లో అందుబాటులో ఉంటుందని రెడింగ్టన్ ప్రకటించింది. అలాగే వినియోగదార్లకు క్యాష్ బ్యాక్ అందించేందుకు హెచ్డీఎఫ్సీ బ్యాంక్‌తో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్టు వెల్లడించింది. ఐఫోన్ 13, 13 మినీ, 13 ప్రో, 13 ప్రో మ్యాక్స్ మోడళ్లను కంపెనీ ఇటీవల ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. భారత్‌తోసహా 30 కిపైగా దేశాల్లో శుశ్రవారం (సెప్టెంబర్ 17) నుంచి ప్రీ–ఆర్డర్స్ ప్రారంభం అయ్యాయి. ముందస్తుగా బుక్ చేసుకున్న వినియోగదార్లకు ఈ స్మార్ట్‌ఫోన్ కొనుగోలు కోసం సమయాన్ని నిర్ధేశిస్తున్నట్టు కంపెనీ తెలిపింది. సెప్టెంబర్ 24 నుంచి స్మార్ట్ఫోన్లు కస్టమర్ల చేతుల్లో తళుక్కుమంటాయి. ధరల శ్రేణి మోడల్‌నుబట్టి రూ.69,900 నుంచి రూ.1,79,900 వరకు ఉంది. చదవండి: ఐఫోన్ లవర్స్‌కు గుడ్ న్యూస్ : తగ్గిన ధరలు -
వ్యాపారంపై ‘సెకండ్’ దెబ్బ
సాక్షి, అమరావతి: లాక్డౌన్ నుంచి మెల్లగా కోలుకుంటున్న రిటైల్ వాణిజ్య రంగంపై సెకండ్ వేవ్ గట్టి దెబ్బకొట్టింది. గత వారం రోజులుగా షాపులకు వచ్చే వారి సంఖ్య 50 శాతం వరకు పడిపోయిందని రిటైలర్లు వాపోతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న తమ షోరూంలకు రోజుకు సగటున 50 నుంచి 60 మంది వరకు వినియోగదారులు వచ్చే వారని.. ఇప్పుడు ఆ సంఖ్య 30 దాటడం లేదని విజయ్ సేల్స్ (పాత టీఎంసీ) ప్రతినిధి చంద్రశేఖర్ ‘సాక్షి’కి తెలిపారు. వేసవిలో ఎలక్ట్రానిక్స్ షాపులు కళకళలాడుతుంటాయని, కానీ ఇప్పుడా పరిస్థితి లేదని సోనోవిజన్ అధినేత భాస్కరమూర్తి పేర్కొన్నారు. ఏసీలు, కూలర్లు, రిఫ్రిజిరేటర్ల కోసం కొద్ది మంది వినియోగదారులు వస్తున్నారని.. టీవీలు, వాషింగ్ మిషన్లు తదితర గృహోపకరణ వస్తువుల అమ్మకాలు పూర్తిస్థాయిలో నిలిచిపోయాయని చెప్పారు. గతేడాది లాక్డౌన్ వల్ల వేసవి అమ్మకాలు తుడిచిపెట్టుకుపోయాయని వివరించారు. ఇప్పుడు ఉగాది, శ్రీరామనవమి, రంజాన్ పండుగలు వచ్చినా కూడా పరిస్థితిలో మార్పు రాలేదన్నారు. మార్చి చివరి వారంతో పోలిస్తే వ్యాపారం విలువ 30 శాతం పడిపోయిందని తెలిపారు. మరో రెండు నెలలు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నట్లు వీరు చెబుతున్నారు. షాపులకు వచ్చే వారి సంఖ్య తగ్గుతుండటంతో.. రిటైల్ సంస్థలు ఆన్లైన్ అమ్మకాలపై దృష్టి సారిస్తున్నాయి. దుస్తుల దుకాణాలు వెలవెల.. సెకండ్ వేవ్ మొదలైనప్పటి నుంచి మహిళలు షాపింగ్‌కు రావడం తగ్గించారని.. దీంతో దుస్తుల దుకాణాలు వెలవెలబోతున్నాయని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏప్రిల్ 10 వరకు బాగానే ఉన్న వ్యాపారం.. ఆ తర్వాత 40 శాతం పడిపోయిందని కళానికేతన్ ఎండీ నాగభూషణం తెలిపారు. సెకండ్ వేవ్ వల్ల షాపింగ్‌కు రావడానికే వినియోగదారులు వెనుకంజ వేస్తున్నారని.. నష్టమైనా కోవిడ్ నియంత్రణ చర్యలు పాటిస్తూ షాపులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కాగా, జనవరి నుంచి బంగారం ధరలు దిగొస్తుండటంతో కొంతకాలంగా ఆభరణాల షాపులు కళకళలాడుతున్నాయి. రూ.52,000 దాటిన పది గ్రాముల బంగారం ధర.. పది వేల రూపాయల వరకు దిగి రావడంతో ప్రజలు కొనుగోళ్లకు ముందుకు వచ్చారని ఎంబీఎస్ జువెల్లరీ పార్టనర్ ప్రశాంత్ జైన్ తెలిపారు. గత వారం రోజులుగా కస్టమర్ల సంఖ్య తగ్గిందని వివరించారు. కేసుల ఉధృతి తగ్గే వరకు తమకు కష్టాలు తప్పేలా లేవని ఆవేదన వ్యక్తం చేశారు. -
మరో రంగంలోకి ఎంట్రీ ఇచ్చిన ఎయిర్టెల్
న్యూఢిల్లీ: టెలికం రంగ కంపెనీ భారతీ ఎయిర్టెల్ ప్రకటనల విభాగంలోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ మేరకు ఎయిర్టెల్ యాడ్స్‌ను ప్రారంభించింది. అభివృద్ధి చెందుతున్న భారతీయ ప్రకటనల పరిశ్రమలో పట్టు సాధించడానికి ఎయిర్టెల్ చేస్తున్న ప్రయత్నమని కంపెనీ తెలిపింది. కంపెనీ డేటా సైన్స్ సామర్థ్యాలను ప్రభావితం చేస్తుంది. కాన్సెంట్ బేస్డ్, ప్రైవసీ సేఫ్ క్యాంపెయిన్ అందించేందుకు బ్రాండ్లకు అనుమతిస్తుంది. ఇది కేవలం తమ కస్టమర్లకు అత్యంత విశ్వసనీయమైన బ్రాండ్ల ప్రకటనలను మాత్రమే అందిస్తుందని, అవాంచిత స్పామ్‌లను కాదని భారతీ ఎయిర్టెల్ చీఫ్ ప్రోడక్ట్ ఆఫీసర్ ఆదర్శ్ నాయర్ తెలిపారు. తాము క్వాంటిటీ కోసం కాక క్వాలిటీకి ప్రాధాన్యత ఇస్తామని పేర్కొన్నారు. దీంతో ప్రకటనల వ్యాల్యూమ్స్ తక్కువగా ఉన్నప్పటికీ.. నాణ్యత ఎక్కువగా ఉంటుందని తెలిపారు. కస్టమర్ల ప్రాధాన్యత, బ్రాండ్ల మధ్య సంబంధాలను ఏర్పరుచుకోవాలని కంపెనీ చూస్తుందని.. అంతేగానీ అర్థవంతం కానీ ప్రకటనలతో కస్టమర్లను కోల్పోదని లేదా వినియోగదారుల ప్రొఫైల్స్‌ను కోల్పోమని ఆయన పేర్కొన్నారు. ఎయిర్‌టెల్‌కి ప్రస్తుతం మొబైల్, డీటీహెచ్, హోమ్స్ వంటి వివిధ వ్యాపారాలకు సంబంధించి 320 మిలియన్ల మంది వినియోగదారులున్నారు. రిటైల్ స్టోర్లలో డిజిటల్ యాడ్స్.. ప్రస్తుతం ఎయిర్‌టెల్‌కు దేశవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో రిటైల్, స్టోర్లున్నాయి. డిజిటల్ అవగాహన లేని వినియోగదారుల కోసం ఆయా ప్రాంతాలలో హెల్త్ కవరేజ్, వీడియో సబ్స్క్రిప్షన్ వంటి ప్రకటనలు ఏమైనా చేయగలమా? లేదా? అనే టెస్టింగ్స్ జరుగుతున్నాయని.. త్వరలోనే రిటైల్, స్టోర్లలో ఈ ప్రకటనల యూనిట్లు కనిపించే అవకాశముందని నాయర్ తెలిపారు. పెప్సికో, జొమాటో, క్రెడ్, టాటా ఏఐజీ, అపోలో, లెన్స్‌కార్ట్, కార్స్24, గేమ్స్క్రాఫ్ట్, హార్లీడేవిడ్సన్ వంటి సుమారు వంద బ్రాండ్ల ప్రచారాలు బీటా దశలో కొనసాగుతున్నాయి. చదవండి: (తెలుగు రాష్ట్రాల్లో భారీ ఇథనాల్ కేంద్రాలు) -
ఫ్లిప్‌కార్ట్ సరికొత్త ఆవిష్కరణ!
ముంబై: ఈ–కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ ఎప్పటికప్పుడు సరికొత్త ఆవిష్కరణలతో తమ కస్టమర్లకు చేరువ కావడానికి ప్రయత్నిస్తుంటుంది. తాజాగా ఈ కామెర్స్ రంగంలో విపరీతమైన పోటీ నెలకొనడంతో ఫ్లిప్‌కార్ట్ కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు సంస్థ వర్గాలు తెలిపాయి. ఇది వరకు నిత్యావసర వస్తువులు ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉండేవి కావని, కానీ తాజాగా స్థానిక స్టోర్స్‌ల సహాయంతో కేవలం 90 నిమిషాల్లోనే నిత్వావసర వస్తువులను డెలివరీ చేయనున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ఈ కామర్స్‌లో జియో మార్ట్, అమెజాన్ సంస్థల రూపంలో ఫ్లిప్‌కార్ట్ తీవ్ర పోటీని ఎదుర్కొంటుంది. ఈ క్రమంలో పోటీ సంస్థలకు దీటుగా ఎదుర్కొవడానికి ఫ్లిక్‌కార్ట్ ప్రణాళికలు రూపొందించినట్లు నిపుణులు విశ్లేషిస్తున్నారు. కాగా వినియోగదరులకు మెరుగైన సేవలందించేందుకు లాజిస్టిక్స్ సంస్థ షాడోఫాక్స్‌తో ఫ్లిప్‌కార్ట్ ఒప్పందం కుదుర్చుకున్న విషయం తెలిసిందే. మొదటగా అత్యున్నత ప్రమాణాలు కలిగిన గిడ్డంగులు, స్టోర్లతో ఒప్పందం కుదుర్చుకోనున్నట్లు సంస్థ వర్గాలు తెలిపాయి. ఈ ప్రాజెక్ట్ మొదటగా బెంగుళూరులో ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నట్లు నిపుణులు అభిపప్రాయపడుతున్నారు. (చదవండి: అపుడు లాక్డౌన్ పరిస్థితి వచ్చి వుంటే..) -
హైదరాబాద్ ప్రజలకు ఎయిర్టెల్ శుభవార్త
హైదరాబాద్: కరోనా వైరస్, లాక్డౌన్ నేపథ్యంలో ప్రజలందరు ఇళ్లకే పరిమితమయ్యారు. ఈ నేపథ్యంలో మొబైల్ దిగ్గజం ఎయిర్టెల్ వినుత్న అలోచనకు అంకురార్పణ చేసింది. హైదరాబాద్‌లో నివసిస్తున్న ఎయిర్టెల్ వినియోగదారుల శ్రేయస్సు దృష్ట్యా సిమ్ కార్డులను హోమ్ డెలివరీ చేయనున్నట్లు తెలిపింది. అదే విధంగా ఇంటర్నెట్, డీటీఎచ్(టీవీ రీచార్జ్) తదితర సేవలను వినియోగదారులు ఇంటి నుంచే పొందవచ్చని పేర్కొంది. తాజా సేవలపై ఎయిర్టెల్ సీఈఓ గోపాల్ విట్టల్ స్పందిస్తూ.. వినియోగదారులకు మెరుగైన సేవలందించేందుకు సంస్థ ఎప్పుడు ముందుంటుందని తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. సిమ్‌కార్డు జారీ, ఇంటర్నెట్, డీటీఎచ్ తదితర సేవలను కస్టమర్లకు అందించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. హోమ్ డెలివరీ చేసే ఉద్యోగులకు ప్రుభుత్వ నియమాల ప్రకారం శిక్షణ ఇచ్చామని అన్నారు. ఈ సంక్షోభ పరిస్థితుల్లో వినియోగదారులకు అత్యుత్తమ సేవలందించేందుకు ప్రయత్నించామని.. విస్తృత సేవలందిస్తున్న ఎయిర్టెల్ ఉద్యోగుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ద తీసుకుంటున్నట్లు తెలిపారు. దేశ వ్యాప్తంగా అన్ని పట్టణాలలో ఎయిర్టెల్ రిటైల్ స్టోర్స్‌ను ప్రారంభించామని తెలిపారు. ప్రస్తుత కష్ట కాలంలో రీచార్జ్ చేసుకోలేనివారి కోసం ‘సూపర్ హీరోస్’ అనే ప్రోగ్రామ్‌ను రూపకల్పన చేసినట్లు తెలిపారు. రీచార్జ్ చేసుకోలేని వారికి ఈ కార్యక్రమం ఎంతో ఉపయోగపడుతుందన్నారు. ఇప్పటికే 10 లక్షల మంది కస్టమర్లు ఈ ప్రోగ్రామ్‌లో భాగస్వామ్యం కావడంతో పాటు అవసరమైన వారికి రీచార్జ్ చేశారని గోపాల్ విట్టల్ కొనియాడారు. చదవండి: డిస్నీ+హాట్‌స్టార్ విఐపీ ఫ్రీ: ఎయిర్టెల్ కొత్త ప్యాక్ -
కరోనా : యాపిల్ రీటైల్ స్టోర్లు బంద్
కోవిడ్-19 (కరోనా వైరస్) విలయంతో టెక్దిగ్గజం యాపిల్ కూడా కీలక నిర్ణయం తీసుకోక తప్పలేదు. మార్చి 27 వరకు తన ఆఫ్‌లైన్ రిటైల్ దుకాణాలన్నీ తాత్కాలికంగా మూసివేస్తున్నట్టు ఒక ప్రకటించింది.అయితే కరోనా వైరస్ మొదలైన చైనాలో పరిస్థితి కాస్త కుదుటు పడ్డంతో, అక్కడ యాపిల్‌స్టోర్‌ను తిరిగి ప్రారంభించింది. అయితే ప్రపంచదేశాల్లో ఈ మహమ్మారి విజృంభిస్తుండటం, ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా కీలక ప్రకటన చేసిన నేపథ్యంలో ఈ వైరస్ వ్యాప్తిని అడ్డుకునే చర్యల్లో భాగంగా స్టోర్లను తాత్కాలిగా మూసివేస్తున్నామని ఒక ప్రకటనలో పేర్కొంది. యాపిల్ కార్యాలయాలు, ఉద్యోగుల్లో, కరోనా వ్యాప్తిని నివారించడానికి చేయగలిగినదంతా చేయాలి. ఈ నేపథ్యంలోనే మార్చి 27వరకు గ్రేటర్ చైనా వెలుపల అన్ని దుకాణాలను తాత్కాలికంగా మూసివేస్తున్నాం. ప్రపంచవ్యాప్తంగా 15 మిలియన్ల డాలర్ల సహాయాన్ని అందిస్తున్నట్టు యాపిల్ సీఈవో ట్విటర్లో వెల్లడించారు. అయితే యాపిల్ అధికారిక వెబ్సైట్ (www.apple.com) యాప్ స్టోర్ ద్వారా ఆన్లైన్లో వినియోగదారులకు అందుబాటులోవుంది. ఏవైనా సందేహాలుంటే వినియోగదారులు ఆన్లైన్ ఆపిల్ కస్టమర్ కేర్‌ను సందర్శించవచ్చు. అంతేకాదు కోవిడ్-19కు సంబంధించిన తాజా సమాచారాన్ని అందించేందుకు ఒకవిభాగాన్ని కూడా ప్రారంభించింది. కరోనావైరస్ మహమ్మారి కారణంగా, ఆపిల్ తన డెవలపర్ కాన్ఫరెన్స్ కు సంబంధించి ఆన్లైన్ ఫార్మాట్‌ను ఆశ్రయిస్తోంది. ఈ ఏడాది జూన్‌లో జరగనున్న ఆపిల్ వరల్డ్‌వైడ్ డెవలపర్స్ కాన్ఫరెన్స్-2020 ఆన్లైన్ కీనోట్, సెషన్లు ఆన్లైన్లోనే వుంటాయని గ్లోబల్ మార్కెటింగ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్, ఫిల్ షిల్లర్ తెలిపారు. రానున్న వారాల్లో మరింత సమాచారాన్ని అందిస్తామని తెలిపారు. కాగా ప్రస్తుతానికి, కరోనా వైరస్ ప్రపంచవ్యాప్తంగా 1,45,000 మందికి పైగా సోకింది. 5400 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. భారత దేశంలో ఈ కోరన్ కోరలకు చిక్కిన వారి సంఖ్య శనివారం నాటికి 84కు చేరింది. జాతీయ విపత్తుగా భారత ప్రభుత్వం ప్రకటించగా, దేశంలోని దాదాపు అన్ని రాష్ట్రాలు అన్ని విద్యాలయాలు, సినిమా థియేటర్లను, షాపింగ్‌మాల్స్‌ను మూసివేస్తున్నట్టు ప్రకటిచాయి. In our workplaces and communities, we must do all we can to prevent the spread of COVID-19. Apple will be temporarily closing all stores outside of Greater China until March 27 and committing $15M to help with worldwide recovery. https://t.co/ArdMA43cFJ — Tim Cook (@tim_cook) March 14, 2020 -
భారత్ ప్లాస్టిక్ కప్పులకు డబ్బు వాపస్: ఐకియా
న్యూఢిల్లీ: భారత్‌లో తయారయ్యే ప్లాస్టిక్ కప్పుల తయారీదారులకు రిటైల్ దిగ్గజం ఐకియా స్టోర్స్ షాకిచ్చింది. కేవలం భారత్‌లోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా 400 స్టోర్లలో ప్లాస్టిక్ కప్పులను సమీక్షించనున్నట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి. కప్పులలో అత్యధిక స్థాయిలో కెమికల్స్ ఉన్నట్లు వస్తున్న వార్తల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నామని కంపెనీ వర్గాలు తెలిపాయి. దీనిపై ఓ కంపెనీ అధికారి స్పందిస్తూ ఇప్పటి వరకు ఆరోగ్యానికి హానికరమైన అంశాలను గుర్తించలేదని.. కేవలం వినియోగదారుల శ్రేయస్సు దృష్యా సమీక్షిస్తున్నామని తెలిపారు. వ్యాపార వర్గాలు మాత్రం కప్పులలో కెమికల్స్ స్థాయిని తెలుసుకోవడానికి ఐకియా స్టోర్స్ యాజమాన్యం పరీక్షలకు పంపించిందని.. ఈ పరీక్షల అనంతరం కప్పుల్లో డై బ్యుటైల్ తాలేట్ అనే కెమికల్ అధిక స్థాయిలో ఉన్నట్లు గుర్తించారని వ్యాపార వర్గాలు తెలిపాయి. ఐకియా స్టోర్లలో ప్లాస్టిక్ కప్పులను కొనుగోలు చేసిన వినియాగదారులకు డబ్బులు తిరిగి చెల్లించనున్నట్లు తెలిపింది. వినియాగదారులు ఏ రకంగా కోనుగోళ్లు చేసినా డబ్బులను తిరిగి ఇవ్వనున్నట్లు తెలిపింది. ఆన్లైన్లో చెల్లించినా, రశీదు లేకపోయినా కప్పులను స్టోర్స్‌కు తీసుకురాగలిగితే చెల్లించిన డబ్బు తిరిగి ఇస్తామని కంపెనీ వర్గాలు తెలిపాయి. ప్రపంచవ్యాప్తంగా 50 దేశాలలో 400 ఐకియా రిటైల్ స్టోర్స్ ఉన్న విషయం తెలిసిందే. చదవండి: ఐకియా బంపర్ ఆఫర్ -
కీలక నిర్ణయం తీసుకున్న ఎలక్ట్రానిక్స్ దిగ్గజం..
న్యూయార్క్: అమెరికాకు చెందిన ఎలక్ట్రానిక్స్ దిగ్గజం బోస్ రిటైల్ స్టోర్స్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రపంచ వ్యాప్తంగా ఉత్తర అమెరికా, యూరప్, జపాన్, ఆస్ట్రేలియా తదితర దేశాలలో 119 రిటైల్ దుకాణాలను మూసివేస్తున్నట్లు ప్రకటించింది. ప్రజలు ఆన్లైన్ షాపింగ్‌కు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నందున ఈ నిర్ణయం తీసుకున్నామని పేర్కొంది. ఆడియో, స్పీకర్లు, హెడ్‌ఫోన్స్ తదితర ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తులతో బోస్ రిటైలర్స్ తనకంటూ ప్రత్యేకమైన బ్రాండ్‌ను సృష్టించుకుంది. తమ ఉత్పత్తులను దిగ్గజ కంపెనీలైన బెస్ట్ బై, అమెజాన్లు ఎక్కువ శాతం కొనుగోళ్లు చేశాయని కంపెనీ తెలిపింది. కాగా ప్రస్తుతం ప్రజలు ఆన్లైన్ షాపింగ్ వైపే మొగ్గు చూపుతున్నందున ఈ నిర్ణయం తీసుకున్నామని కంపెనీ వర్గాలు పేర్కొంటున్నాయి. దీనివల్ల ఎంత మంది ఉద్యోగులు ప్రభావితమవుతారన్న విషయాన్ని కంపెనీ వర్గాలు వెల్లడించలేదు. బోస్ వైస్ ప్రెసిడెంట్ కోలెట్ బ్రూక్ స్పందిస్తూ.. కంపెనీ తీసుకున్న నిర్ణయం చాలా కష్టమైనదని, అంతిమంగా వినియోగదారుల అవసరాలకు తగ్గట్టుగానే నిర్ణయం తీసుకున్నామన్నారు. ఇన్నాళ్లు సహకరించిన తమ ఉద్యోగులకు కృతజ్ఞతలు తెలిపారు. వినియోగదారుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఎక్కువగా సీడీ, డీవీడీ, వినోద వ్యవస్థలకు సంబంధించిన ఉత్పత్తులకు కంపెనీ ప్రాధాన్యత ఇచ్చిందని తెలిపారు. కాగా గతేడాది 2019లో యుఎస్ రిటైలర్లు 9,302 స్టోర్లు మూసివేశారని వ్యాపార వర్గాలు తెలిపాయి. కోర్‌సైట్ రీసెర్చ్ విడుదల చేసిన నివేదికలో 59శాతం రిటైల్ స్టోర్స్‌ను 2018లో మూసివేస్తున్నట్లు తెలిపింది. ఇక ప్రస్తుతం 16శాతం ఉన్న ఆన్లైన్ అమ్మకాలు 2026 నాటికి 25% కి పెరుగుతాయని యుబీఎస్ విశ్లేషకులు తమ పరిశోధనలో అంచనా వేశారు. చదవండి: అమెజాన్ డెలివరీ బాయ్ అఘాయిత్యం కేసులో కొత్త ట్విస్ట్! -
రిలయన్స్ రిటైల్... @ 2.4 లక్షల కోట్లు!
న్యూఢిల్లీ: రిలయన్స్ గ్రూప్‌నకు చెందిన రిలయన్స్ రిటైల్ విలువ రూ.2.4 లక్షల కోట్లు(3,400 కోట్ల డాలర్లు) అని అంచనా. రిలయన్స్ రిటైల్ వాటాదారుల కోసం రిలయన్స్ గ్రూప్ ప్రతిపాదించిన షేర్ల మార్పిడి స్కీమ్ ఆధారంగా చూస్తే, రిలయన్స్ రిటైల్ విలువ రూ.2.4 లక్షల కోట్లుగా తేలుతుంది. దేశంలో అతి పెద్ద సూపర్ మార్కెట్ చెయిన్, డిమార్ట్‌ను ను నిర్వహించే అవెన్యూ సూపర్ మార్ట్స్ మార్కెట్ విలువ(రూ.1.20 లక్షల కోట్లు)కు ఇది దాదాపు రెట్టింపు విలువ. ఇంగ్లాండ్‌లో అతి పెద్ద సూపర్ మార్కెట్ చెయిన్ టెస్కో విలువ (3,200 కోట్ల డాలర్లు)కంటే కూడా అధికం కావడం విశేషం. షేర్ల మార్పిడి స్కీమ్‌లో భాగంగా ప్రతి నాలుగు రిలయన్స్ రిటైల్ షేర్లకు గాను ఒక రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్‌ను పొందవచ్చని రిలయన్స్ రిటైల్ వెబ్సైట్ వెల్లడించింది. షేర్ల మార్పిడి స్కీమ్ ఎందుకంటే.., రిలయన్స్ రిటైల్ కంపెనీ తన ఉద్యోగులకు 2006, 2007 సంవత్సరాల్లో స్టాక్ ఆప్షన్స్ ఇచ్చింది. కొంతమంది ఉద్యోగులు ఈ ఆర్ఎస్యూ(రిస్ట్రిక్టెడ్ స్టాక్ యూనిట్లు)ను ఈక్విటీ షేర్లుగా మార్చుకున్నారు. ఈక్విటీ షేర్లు పొందిన ఉద్యోగులు వీటిని నగదుగా మార్చుకునే అవకాశం కల్పించాలని కోరుతున్నారని రిలయన్స్ రిటైల్ వివరించింది. ఈ కంపెనీని ఇప్పటికిప్పుడు స్టాక్ మార్కెట్లో లిస్టింగ్ చేసే ఆలోచన ఏదీ లేదని, అందుకే ఈ షేర్ల మార్పిడి స్కీమ్‌ను అందుబాటులోకి తెచ్చామని వివరించింది. రిలయన్స్ రిటైల్‌లో 99.95% వాటా రిలయన్స్ రిటైల్ వెంచర్‌కు ఉందని, మిగిలిన 0.05 శాతం వాటా ఉద్యోగుల వద్ద ఉందని వివరించింది. ఈ షేర్ల మార్పిడి స్కీమ్‌కు ఆమోదం పొందడం కోసం వచ్చే నెల 23న ఈక్విటీ వాటాదారుల సమావేశం నిర్వహిస్తున్నామని తెలిపింది. పదివేలకు పైగా రిటైల్ స్టోర్స్... దేశవ్యాప్తంగా 10,901 స్టోర్స్‌ను నిర్వహిస్తున్న రిలయన్స్ రిటైల్ కంపెనీ ఆదాయం ఈ ఏడాది మార్చితో ముగిసిన సంవత్సరానికి 89% వృద్ధితో రూ.1.3 లక్షల కోట్లకు పెరిగింది. నిర్వహణ లాభం 169 శాతం ఎగసి రూ.5,550 కోట్లకు చేరింది. రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు పరోక్ష అనుబంధ సంస్థగా రిలయన్స్ రిటైల్ వ్యవహరిస్తోంది. గురువారం రిలయన్స్ షేర్ రూ.1,516 వద్ద ముగిసింది. ఈ ధర వద్ద కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.9.6 లక్షల కోట్లు. రిలయన్స్ రిటైల్ కంపెనీని ఐదేళ్లలోపు స్టాక్ మార్కెట్లో లిస్ట్ చేస్తామని ఈ ఏడాది ఆగస్టులోనే రిలయన్స్ ఇండస్ట్రీస్ తెలిపింది. -
పతంజలికి పోటీగా ఆధ్యాత్మిక గురు స్టోర్స్
ముంబై : యోగా గురు రాందేవ్ బాబా పతంజలి స్టోర్లపై మరో ఆధ్యాత్మిక గురు పోటీకి వస్తున్నారు. ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్ ఫౌండర్ శ్రీశ్రీ రవిశంకర్, ఆయుర్వేదిక్ టూత్‌పేస్టులు, సబ్బులు విక్రయించడానికి 1,000 రిటైల్ స్టోర్లను త్వరలోనే ప్రారంభించబోతున్నారు. భారత్‌లో హెర్బల్ ఉత్పత్తులకు డిమాండ్ విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో రవిశంకర్ కూడా ఆయుర్వేదిక్ ఉత్పత్తుల స్టోర్లను లాంచ్ చేయబోతున్నట్టు తెలిసింది. దేశంలో రెండో అత్యంత ప్రతిష్టాతకమైన పౌర సత్కారం పొందిన శ్రీశ్రీ రవిశంకర్, క్లినిక్స్, ట్రీమెంట్మెంట్ సెంటర్లను కూడా లాంచ్చేయబోతున్నారు. దేశీయ కన్జ్యూమర్ ఇండస్ట్రిలో ఆధిపత్య స్థానంలో ఉన్న బహుళ జాతీయ కంపెనీలకు ఇక పతంజలి నుంచి మాత్రమేకాక, శ్రీశ్రీ రిటైల్ స్టోర్ల నుంచి గట్టిపోటీ నెలకొనబోతుంది. ప్రజలు తమ రోజువారీ జీవనంలో ఆయుర్వేద ఉత్పత్తులను ఎక్కువగా వాడుతున్నారని, ప్రస్తుతం మార్కెట్ ప్లేయర్స్ అందిస్తున్న వాటికంటే భిన్నంగా తమ బ్రాండ్ ఉత్పత్తులను ఆఫర్ చేయనున్నట్టు శ్రీశ్రీ ఆయుర్వేద ట్రస్ట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ తేజ్ కట్పిటియా చెప్పారు. ''శ్రీశ్రీ తత్త్వ'' బ్రాండెడ్ స్టోర్లను ప్రారంభించబోతున్నట్టు ఆయన తెలిపారు. ఇప్పటికే ఈ కంపెనీ మోడరన్ రిటైల్ స్టోర్లు, ఆన్లైన్ ద్వారా హెల్త్ డ్రింక్స్, సబ్బులు, సుగంధాలు, సుగంధద్రవ్యాలును 2003 నుంచి విక్రయిస్తోంది. కానీ ప్రస్తుతం పలు ఆహార, గృహ కేటగిరీల్లో 300కు పైగా ఉత్పత్తులతో తమ పోర్ట్‌ఫోలియోను విస్తరిస్తున్నారు. ఈ ఉత్పత్తులను కూడా భారత్‌లో మూడు తయారీ యూనిట్లలో ఇన్-హౌజ్గానే ఉత్పత్తిచేస్తున్నారు. మరోవైపు ఎఫ్ఎంసీజీ దిగ్గజం హిందూస్తాన్ యూనిలివర్ కూడా ఆయుష్ బ్రాండులో ఆయుర్వేదిక్ పర్సనల్ కేర్ ఉత్పత్తులను రీలాంచ్ చేసింది. డాబర్ కూడా తన తొలి ఆయుర్వేదిక్ జెల్ టూత్‌పేస్ట్‌ను డాబర్ రెడ్ ప్రాంచైజ్ కింద ఆవిష్కరించింది. -
జియో ఫోన్ బుక్ చేసుకోండిలా..
హైదరాబాద్ : మార్కెట్లో సంచలనం సృష్టిస్తోన్న జియో ఫోన్ కోసం వినియోగదారులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. టెలికాం రంగంలో ఫీచర్ ఫోన్ హ్యాండ్సెంట్లకు కొత్త ఊపిరినిచ్చే జియో ఫోన్ ఫ్రీ-బుకింగ్‌లు ఆగస్టు 24 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ విషయాన్ని రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీనే స్వయంగా ప్రకటించారు. అయితే ఈ ఫోన్‌ను ఎలా బుక్ చేసుకోవాలనే విషయంలో చాలా మందికి స్పష్టత లేదు. ఈ విషయంపై రిలయన్స్ జియో క్లారిటీ ఇచ్చింది. జియో ఫోన్ బుకింగ్‌ను వినియోగదారులు మై జియో యాప్ ద్వారా కానీ, ఆన్లైన్లో కానీ, రిలయన్స్ జియో రిటైల్ స్టోర్ల ద్వారా కానీ బుక్ చేసుకోవచ్చని బుధవారం చెప్పింది. రూ.1500 రీఫండబుల్ డిపాజిట్ చెల్లించి బుకింగ్ చేసుకున్న కస్టమర్లకు సెప్టెంబర్ నుంచి జియో ఫోన్ అందుబాటులోకి వస్తుందని తెలిపింది. జియో ఫోన్‌పై మరిన్ని తాజా అప్డేట్ల కోసం www.jio.com వెబ్సైట్లను సందర్శించాలని పేర్కొంది. అయితే జియో ఫోన్‌పై మార్కెట్లో ఉన్న అమితాసక్తిని దృష్టిలో పెట్టుకుని కొన్ని అనధికారిక వెబ్సైట్లు, రిటైల్ సంస్థలు, అడ్వాన్స్ బుకింగ్‌ల పేరిట పాల్పడే మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని వినియోగదారులకు కంపెనీ సూచించింది. -
రిటైల్ స్టోర్ల ఏర్పాటుకు యాపిల్ తాజా దరఖాస్తు!
న్యూఢిల్లీ: దేశంలో సింగిల్ బ్రాండ్ రిటైల్ స్టోర్ల ఏర్పాటుకు సంబంధించి అమెరికా టెక్నాలజీ దిగ్గజం ‘యాపిల్’కు మార్గం సుగమం అయ్యింది. ఎఫ్‌డీఐ పాలసీలో మార్పుల నేపథ్యంలో దేశంలో రిటైల్ స్టోర్ల ఏర్పాటుకు యాపిల్ కొత్తగా మళ్లీ దరఖాస్తు చేసుకోవలసి ఉందని అధికారి ఒకరు తెలిపారు. కాగా స్టోర్ల ఏర్పాటు కోసం యాపిల్ కంపెనీ లోకల్ సోర్సింగ్ నిబంధనల నుంచి మినహాయింపు కోరుకుంటోన్న విషయం తెలిసిందే. సింగిల్ రిటైల్ బ్రాండ్ ఎఫ్‌డీఐ పాలసీలోని తాజా మార్పుల ప్రకారం.. కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీ ఉపకరణాలను తయారుచేసే కంపెనీలు లోకల్ సోర్సింగ్ నిబంధనల నుంచి తొలి మూడేళ్ల పాటు మినహాయింపు పొందే అవకాశముందన్నారు. ఇక కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీ సంబంధిత సమస్యల పరిష్కారానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు. -
యాపిల్ రీటైల్ స్టోర్లకు గ్రీన్ సిగ్నల్
న్యూఢిల్లీ: వాల్డ్ వైడ్ ఫేమస్ యాపిల్ ఫోన్లకు భారతదేశంలో కష్టాలు ఇక తగ్గనున్నట్టే కనిపిస్తోంది. ఇక స్వదేశీ స్టోర్లలో త్వరలోనే ఈ క్రేజీ ఫోన్లు లభ్యం కానున్నాయి. యాపిల్ సీఈవో టిమ్ కుక్ భారత పర్యటన నేపథ్యంలో ఈ ముఖ్యమైన పరిణామం చేసుకుంది. పూర్తిగా సొంతమైన రీటైల్ స్టోర్ల ఏర్పాటుకోసం యాపిల్ పెట్టుకున్న ప్రతిపాదనకు కండిషన్లతో కూడిన ఆమోదం లభించింది. ఈ మేరకు ఫారిన్ ఇన్వెస్ట్ మెంట్ అండ్ ప్రమోషన్ బోర్డ్ (ఎఫ్ఐపీబీ) గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పూర్తిగా సొంతమైన రీటైల్ స్టోర్ల ఏర్పాటుకోసం చేసిన ఆపిల్ ప్రతిపాదనను అంగీకరించిన విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు కచ్చితమైన షరతులతో ఆమోదం తెలిపింది. ఈ వార్తలను ప్రభుత్వ అధికారి ఒకరు మీడియాకు ధృవీకరించారు. లోకల్ సోర్సింగ్ సంస్థలకు 30 శాతం భాగస్వామ్యం కల్పించాలనే షరతు పెట్టిందని ప్రభుత్వ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. దీనికి సంబంధించిన ప్రకటన మరో రెండు రోజుల్లో వెలువడనుందని కూడా ఆయన ధృవీకరించారు. ప్రస్తుత డీఐపీనీ నియమాల ప్రకారం సింగిల్ బ్రాండ్ రిటైలింగ్ కోసం, స్థానిక ఉత్పత్తులకు 30 శాతం చోటు కల్పించాలనే నిబంధన ఉంది. అలాగు మల్టీ బ్రాండ్ రిటైల్ రంగంలో 51 శాతం, ప్రత్యేక పరిస్థితుల్లో కనీసం 30 శాతం భాగస్వామ్యం కల్పించాల్సి ఉంటుంది. వరకు అనుమతి ఉంది. ఈ మేరకు యాపిల్ మినహాయింపు నిచ్చిన ప్యానెల్ యాపిల్ స్టోర్ల ప్రతిపాదనకు అంగీకారం తెలిపింది. కాగా గత వారం ఆపిల్ ను ఇండియాలో ముందుకు తీసుకుపోవడమే లక్ష్యం ఆపిల్ సీఈఓ టిమ్ కుక్ ఇండియాలో పర్యటించారు. భారత్‌లో దీర్ఘకాలంపాటు వ్యాపార కార్యకలాపాలను కొనసాగించాలనుకుంటున్నామనీ, వచ్చే వెయ్యేండ్లపాటు సంస్థ సేవలందించనున్నామని ప్రకటించారు. రిటైల్ విక్రయాల విషయంలో యాపిల్‌కు మెరుగైన భవిష్యత్ ఉందనే ఆశాభావాన్ని వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. -
ఆఫ్‌లైన్ విపణిలోకి మోటరోలా..
♦ తక్కువ లాభం తీసుకునే వ్యాపారులతో జోడి ♦ మోటరోలా మొబిలిటీ జీఎం అమిత్ బోని హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఇప్పటి వరకు ఆన్‌లైన్‌కే పరిమితమైన మోటరోలా ఫోన్లు రిటైల్ దుకాణాల్లో కూడా దర్శనమీయనున్నాయి. భారత్‌లో 2014 మార్చి నుంచి డిసెంబర్ మధ్య కంపెనీ 30 లక్షల ఫోన్లను విక్రయించింది. 2015లో కూడా అంచనాలను మించి అమ్మకాలు నమోదు చేస్తోంది. ఇదే ఊపుతో ఇప్పుడు కొత్త విక్రయ వేదికలనూ వెతుకుతోంది. ప్రస్తుతం ఈ-కామర్స్ కంపెనీ ఫ్లిప్‌కార్ట్ ద్వారా భారత్‌లో తన ఉత్పత్తులను అమ్ముతోంది. తక్కువ లాభం తీసుకుని ఫోన్లను విక్రయించే రిటైల్ వ్యాపారులతో భాగస్వామ్యానికి సిద్ధమని మోటరోలా ఇండియా మొబిలిటీ జీఎం అమిత్ బోని సాక్షి బిజినెస్ బ్యూరోకు సోమవారమిక్కడ తెలిపారు. ‘కస్టమర్లకు ఆధునిక ఫోన్లు అందుబాటు ధరలో లభించాలన్నది మా ల క్ష్యం. ఆన్‌లైన్‌తో పోలిస్తే రిటైల్‌లో ఒక ఫోన్ ధర రూ.3 వేల దాకా అధికంగా ఉంటోంది. అందుకే ఆన్‌లైన్‌కు పరిమితమయ్యాం’ అని తెలిపారు. ఒక మోడల్‌కు దేశవ్యాప్తంగా ఒకే ధర ఉండాలన్నది తమ ధ్యేయమని చెప్పారు. ఇంటి వద్దకే సర్వీసు.. మోటరోలా కేర్ ఆన్ వీల్స్ పేరుతో ఢిల్లీలో ప్రయోగాత్మకంగా సేవలను ప్రారంభించింది. ఫోన్లో సాంకేతిక సమస్య తలెత్తితే కంపెనీకి ఫోన్ చేస్తే చాలు. కస్టమర్ వద్దకే వచ్చి రిపేర్ చేస్తారు. హైదరాబాద్‌తోసహా 10 నగరాల్లో కేర్ ఆన్ వీల్స్‌ను అందుబాటులోకి తీసుకురానున్నారు. కంపెనీ దేశవ్యాప్తంగా 160 సర్వీసు కేంద్రాలను నిర్వహిస్తోంది. ఇందులో 4 హైదరాబాద్‌లో ఉన్నాయి. అయితే గతేడాది విక్రయించిన 30 లక్షల యూనిట్లలో మోటో-ఇ, మోటో-జి మోడళ్ల వాటా 80 శాతం ఉంది. మోటో-ఇ మోడల్‌ను ప్రపంచంలో తొలిసారిగా భారత్‌లో ఆవిష్కరించారు. కంపెనీకి అత్యంత ప్రాధాన్య మార్కెట్లలో భారత్ కూడా ఉండడంతో రాబోయే రోజుల్లో మరిన్ని మోడళ్లు తొలిసారిగా ఇక్కడ అడుగు పెట్టే అవకాశం ఉంది. చెన్నై ప్లాంటు పునరుద్ధరణ.. కంపెనీ 2013లో చెన్నై ప్లాంటును మూసివేసింది. దేశీయంగా మొబైల్స్ తయారీని కేంద్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తుండడంతో ప్లాంటు పునరుద్ధరణ విషయం ఇప్పుడు తెరపైకి వచ్చింది. మోటరోలాను కొనుగోలు చేసిన లెనోవో ఇందుకు సంసిద్ధంగా ఉంది. అయితే ఎప్పుడు పునరుద్ధరణ చేస్తారో తానిప్పుడే చెప్పలేనని అమిత్ తెలిపారు. ఉత్పత్తుల ధర పెరగకుండా ఉండేందుకు ఏ విధానం ఉత్తమంగా ఉంటోందో దానిని అనుసరిస్తామని చెప్పారు. కాగా, ఎయిర్‌టెల్‌తో కలసి కొద్ది రోజుల్లో ప్రత్యేక ఆఫర్‌ను కంపెనీ ప్రకటించనుంది. -
జోరుగా యూనినార్ రిటైల్ స్టోర్ల విస్తరణ
న్యూఢిల్లీ: మొబైల్ సర్వీసులందజేసే యూనినార్ సంస్థ ఒక్క రోజులో 367 ఎక్స్‌క్లూజివ్ రిటైల్ స్టోర్లను ప్రారంభించింది. దీంతో తమ రిటైల్ స్టోర్ల సంఖ్య 1,480కు పెరిగిందని యూనినార్ సీఈవో మోర్టెన్ కార్ల్సన్ సోర్బీ మంగళవారం వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, గోవా, తూర్పు, పశ్చిమ ఉత్తరప్రదేశ్, గుజరాత్... ఈ ఆరు సర్కిళ్లలో ఈ కంపెనీ మొబైల్ సర్వీసులందజేస్తోంది. ఈ ఆరు సర్కిళ్లలో అత్యధిక ఎక్స్‌క్లూజివ్ స్టోర్స్ ఉన్న రెండో అతి పెద్ద మొబైల్ సర్వీసుల కంపెనీ తమదేనని సోర్బీ పేర్కొన్నారు. ఈ స్టోర్స్‌ల్లో కొత్త కనెక్షన్లు ఇవ్వడంతో పాటు రీచార్జ్ చేస్తామని, వినియోగదారుల సమస్యలను తక్షణం పరిష్కరిస్తామని, పోస్ట్, ప్రి పెయిడ్.. అన్ని తరహా వినియోగదారులందరికీ పూర్తి స్థాయిలో సర్వీసులందజేస్తామని వివరించారు. గతంలో నెట్‌వర్క్‌ను విస్తరించామని, ఇప్పుడు రిటైల్ స్టోర్లను విస్తరించామని, దీంతో వినియోగదారుల సంఖ్య మరింతగా పెరుగుతుందని అంచనా వేస్తున్నామని చెప్పారు. ఈ ఏడాది తమ ఇంటర్నెట్ వినియోగదారుల సంఖ్య రెట్టింపవగలదని పేర్కొన్నారు.