యాపిల్ రీటైల్ స్టోర్లకు గ్రీన్ సిగ్నల్
న్యూఢిల్లీ: వాల్డ్ వైడ్ ఫేమస్ యాపిల్ ఫోన్లకు భారతదేశంలో కష్టాలు ఇక తగ్గనున్నట్టే కనిపిస్తోంది. ఇక స్వదేశీ స్టోర్లలో త్వరలోనే ఈ క్రేజీ ఫోన్లు లభ్యం కానున్నాయి. యాపిల్ సీఈవో టిమ్ కుక్ భారత పర్యటన నేపథ్యంలో ఈ ముఖ్యమైన పరిణామం చేసుకుంది. పూర్తిగా సొంతమైన రీటైల్ స్టోర్ల ఏర్పాటుకోసం యాపిల్ పెట్టుకున్న ప్రతిపాదనకు కండిషన్లతో కూడిన ఆమోదం లభించింది. ఈ మేరకు ఫారిన్ ఇన్వెస్ట్ మెంట్ అండ్ ప్రమోషన్ బోర్డ్ (ఎఫ్ఐపీబీ) గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పూర్తిగా సొంతమైన రీటైల్ స్టోర్ల ఏర్పాటుకోసం చేసిన ఆపిల్ ప్రతిపాదనను అంగీకరించిన విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు కచ్చితమైన షరతులతో ఆమోదం తెలిపింది. ఈ వార్తలను ప్రభుత్వ అధికారి ఒకరు మీడియాకు ధృవీకరించారు. లోకల్ సోర్సింగ్ సంస్థలకు 30 శాతం భాగస్వామ్యం కల్పించాలనే షరతు పెట్టిందని ప్రభుత్వ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. దీనికి సంబంధించిన ప్రకటన మరో రెండు రోజుల్లో వెలువడనుందని కూడా ఆయన ధృవీకరించారు.
ప్రస్తుత డీఐపీనీ నియమాల ప్రకారం సింగిల్ బ్రాండ్ రిటైలింగ్ కోసం, స్థానిక ఉత్పత్తులకు 30 శాతం చోటు కల్పించాలనే నిబంధన ఉంది. అలాగు మల్టీ బ్రాండ్ రిటైల్ రంగంలో 51 శాతం, ప్రత్యేక పరిస్థితుల్లో కనీసం 30 శాతం భాగస్వామ్యం కల్పించాల్సి ఉంటుంది. వరకు అనుమతి ఉంది. ఈ మేరకు యాపిల్ మినహాయింపు నిచ్చిన ప్యానెల్ యాపిల్ స్టోర్ల ప్రతిపాదనకు అంగీకారం తెలిపింది.
కాగా గత వారం ఆపిల్ ను ఇండియాలో ముందుకు తీసుకుపోవడమే లక్ష్యం ఆపిల్ సీఈఓ టిమ్ కుక్ ఇండియాలో పర్యటించారు. భారత్‌లో దీర్ఘకాలంపాటు వ్యాపార కార్యకలాపాలను కొనసాగించాలనుకుంటున్నామనీ, వచ్చే వెయ్యేండ్లపాటు సంస్థ సేవలందించనున్నామని ప్రకటించారు. రిటైల్ విక్రయాల విషయంలో యాపిల్‌కు మెరుగైన భవిష్యత్ ఉందనే ఆశాభావాన్ని వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.