హైదరాబాద్‌లో కొత్త పెయింట్‌ ఉత్పత్తులు | Birla Opus expanded by its stores opening in Hyderabad | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌లో కొత్త పెయింట్‌ ఉత్పత్తులు

Sep 9 2024 12:35 PM | Updated on Sep 9 2024 12:35 PM

Birla Opus expanded by its stores opening in Hyderabad

గ్రాసిమ్‌ ఇండస్ట్రీస్‌ ఆధ్వర్యంలోని బిర్లా ఓపస్‌ పెయింట్స్‌ హైదరాబాద్‌లో విస్తరిస్తోంది. స్థానికంగా రెండు స్టోర్లను ప్రారంభించినట్లు కంపెనీ ప్రతినిధి మహ్మద్ తబ్రుద్దీన్ తెలిపారు. దేశవ్యాప్తంగా కంపెనీ 50కుపైగా ఫ్రాంఛైజీ స్టోర్‌లను కలిగి ఉన్నట్లు పేర్కొన్నారు.

దేశవ్యాప్తంగా రియల్‌ ఎస్టేట్‌ రంగం వేగంగా విస్తరిస్తోంది. స్టీల్‌, సిమెంట్‌ పరిశ్రమతోపాటు ఈ రంగం వృద్ధిలో పెయింట్‌ పరిశ్రమ కీలకపాత్ర పోషిస్తుంది. ఈ పెయింట్‌ పరిశ్రమలో ఇప్పటికే చాలాకంపెనీలు సేవలందిస్తున్నాయి. అయితే బిర్లా ఓపస్‌ మాత్రం తన వినియోగదారులకు ఏఐ సాయంతో విభిన్న రంగులు ఎంచుకునేలా తోడ్పడుతుందని కంపెనీ ప్రతినిధి నకుల్ వ్యాస్  పేర్కొన్నారు. పెయింట్‌ తయారీలో వెలువడే వ్యర్థాలను తగ్గించేలా కొత్త సాంకేతికతలను వాడుతున్నట్లు చెప్పారు. ఇటీవల హైదారబాద్‌లో ప్రారంభించిన బిర్లా ఓపస్‌ స్టోర్‌లు హఫీజ్ బాబా నగర్, పొప్పల్‌గూడ విలేజ్‌లో ఉన్నట్లు తెలిపారు.

ఇదీ చదవండి: ఉచితాలు.. శాపాలు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement