
భారతదేశం వివిధ సంస్కృతులు, సంప్రదాయాలకు నిలయం. ఇక్కడ ఉండే కళలకు అంతే స్థాయిలో ప్రాముఖ్యత, చరిత్ర ఉంటుంది. ఒక్కో కళ ఆయా సందర్భానుసారం పుట్టికొచ్చి..దృఢంగా అల్లుకుపోయినవే. అలాంటి కోవకు చెందిందే ఈ పురాత ఖోబార్ కళ కూడా. దీన్ని మైథిలి వివాహ పెయింటింగ్, మధుబని ఆర్ట్ వంటి పేర్లతో పిలుస్తారు. అయితే ప్రస్తుతం ఈ కళ కనుమరగయ్యే పరిస్థితిలో ఉంది. ఈ నేపథ్యంలో ఈ కళ గొప్పతనం, ఎక్కడ ఆవిర్భవించింది వంటి వాటి గురించి చూద్దామా..!.
బీహార్, నేపాల్‌కు చెందిన మధుబని పెయింటింగ్, పండుగలు, వివాహాలు లేదా ఇతర ఆనందకరమైన సందర్భాలలో దీన్ని ఇంటి గోడలపై వేస్తారు. ఎక్కడైన వివాహం జరగుతుందంటే తప్పనిసరిగా మిధిలా ప్రాంతాలైని బిహార్‌లోని కొన్ని గ్రామాల ప్రజలు దీన్ని తప్పనిసరిగా వేస్తారట. ఈ పెయింటింగ్ వేస్తున్నారంటే..అక్కడ ఎవరిదో వివాహ జరగునుందని అర్థమైపోతుందట. మిధిలా ప్రాంతంగా చెప్పే బీహార్, జార్ఖండ్, నేపాల్‌లో ఈ ఆర్ట్ ఎక్కువగా కనిపిస్తుందట.
ఈ కళ ఆవిర్భవించింది ఇలా..
ఈ కళ రామాయణ కాలం నాటిదిగా చెబుతుంటారు చరిత్రకారులు. పురాణాల్లో మిథిలా పాలకుడు జనకమహారాజు తన కుమార్తె సీత ప్రస్తుత నేపాల్‌లో ఉన్న జనక్‌పూర్‌లో రాముడిని వివాహం చేసుకున్నప్పుడు ఈ ఖోబార్ డిజైన్‌లను వేసిందని చెబుతుంటారు.
మిధిలా ప్రాంతాలుగా చెప్పే.. బిహార్‌లో దర్భంగా, మధుబని, పూర్ణియా, సహర్స, సీతామర్హి, సుపాల్ వంటి గ్రామాల్లోని కర్ణ కాయస్థ, బ్రాహ్మణ వర్గాలకు చెందిన మహిళలకు ఈ కళ బాగా సుపరిచితం. వివాహం కుదిరిన వెంటనే వధువు కుటుంబంలోని మహిళలు గోడలపై ఈ ఖోబార్ ఆర్ట్‌ని వేయడం ప్రారంభింస్తారు. పూర్వం మట్టి గోడలపై అందంగా వేసేవారు. వివాహం అయిన తర్వాత వధువరులు ఈ డిజైన్‌తో వేసిన గదిలో గడపటం అక్కడి ఆచారం. అలా పుట్టుకొచ్చిందో ఈ ఖోబార్ కళ.
ఈ ఆర్ట్ వేసే విధానం
ఖోబార్ ప్రాథమిక రూపకల్పన మధ్యలో కమలం ఉంటుంది. దాని నుంచి వెదురు కాండం ఉద్భవిస్తుంది. కమలం వికసించే ఇరువైపులా, ఒకదానికొకటి అనుసంధానించబడిన ఏడు గుండ్రని ఆకులు ఉంటాయి. వెదురు రెమ్మ పైభాగంలో, మానవ ముఖం ఉండి ఆపైభాగంలో సూర్యుడు, చంద్రుడు, గ్రహాల మూలాంశాలతో పాటు శివుడు, పార్వతి చిత్రాలు వేస్తారు.
వీటి తోపాటు పనస, అరటి చెట్లు, చేపలు జంటగా, తాబేళ్లు, పాములు, చిలుకలు, నెమళ్ళు, వెదురు తోటలు వంటివి కూడా చిత్రిస్తారు. వివాహ సందర్భానుసారం మాత్రం సీతా స్వయం వరం, గౌరీపూజ, శివుని పూజా, బిదాయి(వీడ్కోలు) వంటి చిత్రాలను వేస్తారు. ఈ కళలో వివాహా ఘట్టాన్ని కళ్లకు కట్టినట్లు చూపినట్టుగా ముగ్ధమనోహరంగా వేస్తారు.
అయితే ఇప్పడు మట్టి ఇళ్లు లేకపోవడం, వివాహా ఆచారాలు కూడా మారిపోవడంతో వేసే విధానంలో కూడా మార్పులు వచ్చాయి. ప్రస్తుతం దీన్ని గోడలపై కాకుండా చేతితో తయారు చేసిన కాగితంపై పత్తి లేదా పట్టుముక్కలపై డిజైన్ చేస్తున్నారు. అలా కర్టన్లు, కాన్వాస్‌పై కూడా ఆ ఆర్ట్‌ని వేయడం ప్రారంభించారు.
మిథిలకు చెందిన కళకారులు మాత్రం ఖోబార్ పెయింటింగ్‌లో వస్తున్న మార్పులను ఆందోళన చెందుతున్నారు. ఎందుకంటే ఇప్పుడు వివాహాలు, హోటళ్లు, వివాహ మందిరాల్లో జరుగుతున్నాయి. దీంతో ఈ ఆర్ట్‌ని కాన్వాస్ లేదా వస్త్రంపై వేయడం జరగుతోంది. అది కూడా ఈ సంప్రదాయన్ని ఎన్నాళ్లు కొనసాగిస్తారనే సందేహం మెదులుతోంది. నాటి కాలంలో పెళ్లికి ముందు వధువరులు కలవకూడదనే నియమనిబంధనలుండేవి.
ఆ నేపథ్యంలోనే వధువు మనసు చెదరకుండా ఉండేలా వివాహం నిశ్చయం అయిన వెంటనే ఆమె చేత ఈ పెయింటింగ్‌ని వేయించేవారు. ఆమె తోపాటు ఇతర స్త్రీలు కూడా సాయంగా ఈ ఆర్ట్ పనిలో చేరేవారు. అయితే ఇప్పడు స్మార్ట్ ఫోన్‌ల యుగం..అన్ని ఫాస్ట్‌గా జరిగిపోవాల్సిందే అలాంటప్పడు ఈ సంప్రదాయ కళకు ఎక్కడ చోటు ఉంటుందని స్థానిక కళాకారులు ఆవేదనగా చెబుతున్నారు.
అందువల్ల తాము ఈ కళను బావితరాలకు తెలిసేలా ఆ కళఖండాలన్నింటిని పొందుపరస్తున్నామని అన్నారు. అదీగాక మైథిలి ప్రాంతంలోని కొన్ని వర్గాలకు చెందిందే కావడంతో ప్రభుత్వం నుంచి మద్దతు కూడా అంతగా లేదనే చెప్పాలి. అందువల్ల చాలామంది కళకారులు ఈ ఆర్ట్ గురించి అందరికీ తెలిసేలా తమవంతు కృషి చేస్తున్నారు. ఆ కళా నైపుణ్యం గురించి పుస్తకాలు సైతం రాస్తుండటం విశేషం.
(చదవండి: ఝుమైర్ నృత్యం అంటే..? ఈ వేడుకకు ప్రధాని మోదీ, జైశంకర్‌లు..)
Comments
Please login to add a commentAdd a comment