
ఎన్నో కారణాల వల్ల ఇంటా బయటా ఒత్తిడితో జీవనం సాగించే రోజులివి. ఒత్తిడి నుంచి ఉపశమనానికి ఎవరికి తోచిన సలహాలు వాళ్లు చెబుతుంటారు. కాని, ఇంట్లోనే సానుకూల వాతావరణం ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటే ప్రశాంతతతో పాటు ధ్యాన సాధనకూ అనుకూలంగా ఉంటుంది. చిన్న చిన్న మార్పులతో ధ్యానానికి అనువుగా ఇంట్లోనే ఆహ్లాదభరిత వాతావరణాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు.
ఇంటి గదుల్లో ఏదైనా ఒక మూలన బుద్ధ ప్రతిమ లేదా క్యాండిల్స్, ఆర్టిఫియల్ ట్రీ లేలా ఇండోర్ ప్లాంట్ తీగలనూ డిజైన్ చేసుకోవచ్చు. ప్రశాంతతను కలిగించే సంగీతం వింటూ రోజూ ఈ ప్లేస్‌లో కాసేపు సేద దీరితే మనసు, శరీరం విశ్రాంతి పొందుతాయి.
మట్టి కుండలు లేదా రాళ్లతో డిజైన్ చేసిన ఇండోర్ వాటర్ ఫౌంటైన్స్ లభిస్తాయి. వాటి అలంకరణతో జలపాతపు ఆహ్లాదాన్ని పొందవచ్చు.
ధ్యానం చేయడానికి అనువైన ప్లేస్ అలంకరణకు బేబీ మాంక్స్ బొమ్మలు, బోన్సాయ్ మొక్కలు, స్టోన్ వర్క్‌తో డిజైన్ చేసిన వస్తువులను ఎంచుకోవచ్చు. వీటిని చూసినప్పుడు చికాకుగా ఉన్న మనసు కొంత కుదుటపడుతుంది.
మనలోని ఏడు చక్రాలకు గుర్తుగా ఏడు రంగులు సూచికగా ఉంటాయి. వాటిని తలపించేలా కలర్ కాన్సెప్ట్‌తో చక్రా షెల్ఫ్ డిజైన్ చేసుకోవచ్చు. రెడీమేడ్‌గా లభించే వాటినీ అమర్చుకోవచ్చు. ఈ కలర్ చక్రా షెల్ఫ్‌ల రంగులను బట్టి ధ్యానాన్ని ఏకాగ్రతతో సాధన చేయవచ్చు.
అలంకరణలో చక్రా షెల్ఫ్, వాల్ హ్యాంగింగ్, ఫొటో ఫ్రేమ్స్‌తో లివింగ్ రూమ్‌నీ అందంగా అలంకరించవచ్చు.
(చదవండి: ఝుమైర్ నృత్యం అంటే..? ఈ వేడుకకు ప్రధాని మోదీ, జైశంకర్‌లు..)
Comments
Please login to add a commentAdd a comment