ముంబై: ఎక్స్‌ప్రెస్ ఎయిర్, ట్రాన్స్‌పోర్టేషన్, లాజిస్టిక్స్ సేవల్లోని బ్లూడార్ట్ విస్తరణపై దృష్టి సారించింది. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా 76 పిన్‌కోడ్‌లకు తన కార్యకలాపాలను కొత్తగా విస్తరించినట్టు ప్రకటించింది. అలాగే, దేశవ్యాప్తంగా కంపెనీ ఆధీనంలో 15 కొత్త రిటైల్ స్టోర్లను ప్రారంభించింది. అలాగే 15 ఫ్రాంచైజీ కలెక్షన్ సెంటర్లు, 15 ఎక్స్‌ప్రెస్ ఏజెంట్లు, 15 ప్రాంతీయ సరీ్వస్ ప్రొడైడైర్ ఫ్రాంచైజీలను నియమించుకున్నట్టు ప్రకటించింది. తద్వారా దేశంలోని ప్రతి పాంతానికీ సేవలు అందించగలమని తెలిపింది.
దేశ ప్రజలకు సేవలు అందించే విషయంలో తమ అంకిత భావానికి ఈ సేవల విస్తరణ నిదర్శనంగా కంపెనీ పేర్కొంది. విజయవాడ, సికింద్రాబాద్, మధురై, భువనేశ్వర్, లుధియానా, కోల్‌కతా తదితర పట్టణాల్లోని వ్యూహాత్మకంగా కీలకమైన ప్రాంతాల్లో కొత్త రిటైల్ స్టోర్లు తెరిచినట్టు తెలిపింది. తాజా విస్తరణతో దేశవ్యాప్తంగా 55వేలకు పైగా ప్రాంతాలకు తమ సేవలు చేరువ అయినట్టు వివరించింది. మారుతున్న కస్టమర్ల ప్రాధాన్యతలకు అనుగుణంగా సేవలు అందించడంపై తమ దృష్టి ఉంటుందని బ్లూడార్ట్ చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ కేతన్ కులకర్ణి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment