transportation
-
పీసీలకు ఫుల్ డిమాండ్
న్యూఢిల్లీ: పర్సనల్ కంప్యూటర్ల (పీసీ)కు 2024లోనూ బలమైన డిమాండ్ కొనసాగింది. వీటి షిప్మెంట్ (మార్కెట్‌కు రవాణా) 3.8 శాతం మేర పెరిగింది. మొత్తం 14.4 మిలియన్ యూనిట్ల పీసీల రవాణా జరిగినట్టు మార్కెట్ పరిశోధనా సంస్థ ఐడీసీ ప్రకటించింది. గేమింగ్, ఏఐ ఆధారిత పీసీలకు అధిక డిమాండ్ నెలకొన్నట్టు తెలిపింది. 2025లో పీసీ మార్కెట్ తక్కువ స్థాయి సింగిల్ డిజిట్ వృద్ధిని నమోదు చేసే అవకాశం ఉందని ఐడీసీ అంచనా వేసింది. ఈ మేరకు త్రైమాసిక వారీ పీసీ డివైజ్ ట్రాక్ రిపోర్ట్‌ను విడుదల చేసింది. ‘‘రూపాయి బలహీనపడడం పీసీల ధరలు పెరగడానికి దారితీసింది. ఇది చిన్న, మధ్యస్థాయి వ్యాపార సంస్థలతోపాటు, వినియోగ విభాగంపై ప్రభావం చూపించింది’’అని ఐడీసీ ఇండియా, దక్షిణాసియా అసోసియేస్ వైస్ ప్రెసిడెంట్ (డివైజెస్ రీసెర్చ్) నవకేందర్ సింగ్ ప్రకటించారు. అగ్రస్థానంలో హెచ్‌పీ ⇒ హెచ్‌పీ గతేడాది 30.1 శాతం పీసీల రవాణాతో (మార్కెట్‌కు) అగ్రస్థానంలో నిలిచింది. గతేడాది డిసెంబర్‌తో ముగిసిన మూడు నెలల కాలంలో ఈ సంస్థ మార్కెట్ వాటా 30 శాతంగా నమోదైంది. వార్షికంగా చూస్తే 1 శాతం, త్రైమాసికం వారీగా చూస్తే 1.8 శాతం చొప్పున రవాణా తగ్గింది. ⇒ లెనోవో సంస్థ 17.2 శాతం పీసీలను రవాణా చేసింది. అంతకుముందు ఏడాదితో పోలి్చతే 7.3 శాతం వృద్ధిని నమోదు చేసింది. ⇒ డెల్ 16.1 శాతంతో తర్వాతి స్థానంలో ఉంది. 8.1 శాతం వృద్ధిని చూపించింది. . ⇒ ప్రీమియం నోట్‌బుక్‌ల షిప్మెంట్ (1,000 డా లర్లకు పైన ధరలోనివి) గతేడాది 13.8% పెరిగింది. ⇒ అంతర్జాతీయ సంస్థలు, ప్రభుత్వ విభాగాల నుంచి పీసీలకు డిమాండ్ 10.6% మేర పెరిగింది. ⇒ 2024 చివరి మూడు నెలల కాలంలో (అక్టోబర్–డిసెంబర్) మొత్తం పీసీల మార్కెట్ 6.9 శాతం, నోట్‌బుక్ విభాగం 9.6 శాతం మేర వృద్ధి చెందాయి. ⇒ తైవాన్ కంపెనీ ఏసర్ 2024లో 27.7 శాతం మేర షిప్మెంట్లో వృద్ధిని చూపించింది. 15.1 శాతం మార్కెట్ వాటాను సొంతం చేసుకుంది. ⇒ ఆసుస్ 38.4 శాతం వృద్ధిని డిసెంబర్ త్రైమాసికంలో సాధించింది. అదే కాలంలో లెనోవో 13.5 శాతం అధికంగా షిప్మెంట్ చేసి 18.5 శాతం మార్కెట్ వాటాను కలిగి ఉంది. ⇒ డెల్ సంస్థ డిసెంబర్ త్రైమాసికంలో 18.1 శాతం మార్కెట్ వాటా కలిగి ఉంది. 5.8 శాతం వృద్ధిని చూపించింది. ఏసర్ కూడా డిసెంబర్ క్వార్టర్లో 20% వృద్ధిని నమోదు చేసి, 15.7 శాతం మార్కెట్ వాటాను సొంతం చేసుకుంది. వర్క్స్టేషన్లకు మరింత డిమాండ్. ‘‘సంప్రదాయ పీసీ మార్కెట్ (డెస్క్ టాప్‌లు, నోట్బుక్లు, వర్క్స్టేషన్లు) 2024లో 14.4 మిలియన్ యూనిట్లను షిప్మెంట్ చేసింది. వార్షికంగా 3.8 శాతం వృద్ధి నమోదైంది. విభాగాల వారీగా చూస్తే నోట్‌బుక్‌ల షిప్మెంట్ 4.5 శాతం మేర, డెస్క్ టాప్ల షిప్మెంట్ 1.8 శాతం మేర అధికంగా జరిగాయి. వర్క్స్టేషన్ల షిప్మెంట్ రికార్డు స్థాయిలో 10.9 శాతం పెరిగింది. నోట్‌బుక్‌లకు డిమాండ్ బలంగా ఉంది. వాణిజ్య పీసీ మార్కెట్ సైతం తాజా ఆర్డర్లతో పుంజుకుంది’’అని ఐడీసీ నివేదిక వెల్లడించింది. -
అరగంటలో 350 కిలోమీటర్ల జర్నీ!
న్యూఢిల్లీ: ఢిల్లీ నుంచి జైపూర్(రాజస్థాన్) మధ్య దూరం 300 కిలోమీటర్లు ఉంటుంది. అంతటి దూరాన్ని నిమిషాల్లో చేరుకోగలిగితే ఎలా ఉంటుంది?.. ఇలాంటి హైస్పీడ్ ప్రయాణం కోసం కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ తొలి అడుగు వేసింది. ఐఐటీ మద్రాస్ ఆలోచనతో భారత తొలి హైపర్‌లూప్ టెస్ట్ ట్రాక్ సిద్ధమైంది. హైపర్‌లూప్(Hyperloop) అనేది అత్యంత అధునాతనమైన రవాణా వ్యవస్థ. గంటకు వెయ్యి కిలోమీటర్ల ప్రయాణం ఈ రవాణా వ్యవస్థ లక్ష్యం. సుదుర గమ్యాలను నిమిషాల వ్యవధిలో చేరుకునేలా చేయడమే దీని ఉద్దేశం. అందుకే దీన్ని రవాణా వ్యవస్థలో హైపర్‌లూప్‌ను గేమ్ ఛేంజర్‌గా భావిస్తున్నారు. వందేభారత్ తర్వాత బుల్లెట్ రైల్ మీద దృష్టిసారించిన భారతీయ రైల్వే(Indian Railways) ఇప్పుడు మరో ఘనత వైపు అడుగులేస్తోంది. భారత తొలి హైపర్‌లూప్ టెస్ట్ ట్రాక్ వివరాలను కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్(Ashwini Vaishnaw) మీడియాకు తెలియజేశారు. ఐఐటీ మద్రాస్ సహకారంతో 422 మీటర్ల దూరం ఉన్న ట్రాక్‌ను రూపొందించారు. ఈ హైపర్‌లూప్ ప్రాజెక్టు వాస్తవరూపం దాలిస్తే అరగంటలోపే ఢిల్లీ నుంచి జైపూర్‌కు చేరుకోవచ్చన్నమాట. The hyperloop project at @iitmadras; Government-academia collaboration is driving innovation in futuristic transportation. pic.twitter.com/S1r1wirK5o— Ashwini Vaishnaw (@AshwiniVaishnaw) February 24, 2025రోడ్డు, రైలు, నీరు, వాయు రవాణా మార్గాల తర్వాత ఫిఫ్త్ ట్రాన్స్‌పోర్టేషన్‌గా హైపర్లూర్ను చెబుతుంటారు. వాక్యూమ్ ట్యూబ్స్‌లో పాడ్స్ ద్వారా ప్రయాణమే హైపర్‌లూప్. గొట్టాల్లాంటి ఆ నిర్మాణాల్లో గాలి నిరోధకత.. పాడ్లను అధిక వేగంతో ప్రయాణించేలా చేస్తుంది. 2013లో ఇలాన్ మస్క్ ప్రచారంతో దీని గురించి ఎక్కువ చర్చ నడిచింది. అమెరికా, చైనా ఇలా చాలా దేశాలు ఈ వ్యవస్థను అందుబాటులోకి తెచ్చే ప్రయత్నాల్లో ఉన్నాయి. ప్రధాన నగరాలను అనుసంధానించడం కోసమైనా హైపర్‌లూప్ టెక్నాలజీ వినియోగంలోకి తేవాలని యూఏఈ సైతం భావిస్తోంది. -
Interim Budget 2024: ఎలక్ట్రిక్.. ఇక ఫుల్ చార్జ్!
న్యూఢిల్లీ: చార్జింగ్, తయారీ మౌలిక సదుపాయాల కల్పన ద్వారా ఎలక్ట్రిక్ వాహనాల వ్యవస్థను బలోపేతం చేయడంపై ప్రభుత్వం దృష్టి పెట్టనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ప్రజా రవాణా వ్యవస్థలో ఎలక్ట్రిక్ బస్సుల వినియోగాన్ని మరింతగా ప్రోత్సహించనున్నట్లు వివరించారు. రవాణా కోసం ఉపయోగించే సీఎన్‌జీలోనూ, పైపుల ద్వారా సరఫరా చేసే సహజ వాయువులోను కంప్రెస్డ్ బయోగ్యాస్‌ను కలపడం తప్పనిసరని ఆమె పేర్కొన్నారు. మరోవైపు మధ్యంతర బడ్జెట్లో చర్యలను స్వాగతించిన క్వాంటమ్ ఎనర్జీ ఎండీ సి. చక్రవర్తి .. కొన్ని ఆకాంక్షలు మాత్రం నెరవేరలేదని పేర్కొన్నారు. 2024 మార్చితో ముగిసిపోనున్న ఫేమ్ 2 సబ్సిడీ ప్రోగ్రామ్‌ను పొడిగిస్తారని ఆశలు నెలకొన్నప్పటికీ ఆ దిశగా ప్రతిపాదనలు లేవని ఆయన తెలిపారు. గడువు పొడిగించి ఉంటే ఎలక్ట్రిక్ వాహనాల పరిశ్రమకు గట్టి మద్దతు లభించి ఉండేదన్నారు. అలాగే లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్‌లు, సెల్స్‌పై జీఎస్టీని 18 శాతం నుంచి 5 శాతానికి తగ్గించి ఉంటే ఈవీల ధరలు మరింత అందుబాటు స్థాయిలోకి వచ్చేందుకు ఆస్కారం లభించేందని చక్రవర్తి తెలిపారు. సోలార్ రూఫ్‌టాప్ స్కీములు.. స్వచ్ఛ విద్యుత్ లక్ష్యాల సాధనకు తోడ్పడగలవని సీఫండ్ సహ వ్యవస్థాపకుడు మయూరేష్ రౌత్ తెలిపారు. మరోవైపు, ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు ఉద్దేశించిన ఫేమ్ స్కీముకు కేటాయింపులను బడ్జెట్లో కేంద్రం రూ. 2,671 కోట్లుగా ప్రతిపాదించారు. 2023–24 ఆర్థిక సంవత్సరానికి గాను సవరించిన అంచనాల (రూ. 4,807 కోట్లు) కన్నా ఇది 44 శాతం తక్కువ. ప్రస్తుతమున్న ఫేమ్ 2 ప్లాన్‌ను మరోసారి పొడిగిస్తారా లేదా అనే దానిపై స్పష్టత లేని పరిస్థితుల్లో ఇది ప్రాధాన్యం సంతరించుకుంది. ఆటోమొబైల్‌కు పీఎల్ఐ బూస్ట్ .. వాహన పరిశ్రమకు ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకం (పీఎల్ఐ) స్కీము కింద బడ్జెట్లో కేటాయింపులను కేంద్రం ఏకంగా 7 రెట్లు పెంచి రూ. 3,500 కోట్లుగా ప్రతిపాదించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సవరించిన అంచనా ప్రకారం ఇది రూ. 484 కోట్లు. కాగా, అడ్వాన్స్డ్ కెమిస్ట్రీ సెల్, బ్యాటరీ స్టోరేజీకి కేటాయింపులను రూ. 12 కోట్ల నుంచి రూ. 250 కోట్లకు పెంచారు. ఈవీల షేర్లు అప్ .. బడ్జెట్లో సానుకూల ప్రతిపాదనల నేపథ్యంలో ఎలక్ట్రిక్ వాహనాల సంస్థల షేర్లు పెరిగాయి. బీఎస్ఈలో జేబీఎం ఆటో 2.48 శాతం పెరిగి రూ. 1,963 వద్ద, గ్రీవ్స్ కాటన్ సుమారు 1 శాతం పెరిగి రూ. 165 వద్ద ముగిశాయి. ఒలెక్ట్రా గ్రీన్‌టెక్ మాత్రం లాభాల స్వీకరణతో 0.69 శాతం క్షీణించి రూ. 1,729 వద్ద ముగిసింది. అయితే, ఒక దశలో 6 శాతం ఎగిసి 52 వారాల గరిష్టమైన రూ. 1,849 స్థాయిని తాకింది. -
రేషన్ బియ్యం అక్రమ రవాణా ఆటకట్టు
సాక్షి, అమరావతి: పేదల బియ్యాన్ని బొక్కే అక్రమార్కులపై వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కఠిన చర్యలు చేపడుతోంది. పటిష్ట చర్యలతో బియ్యం అక్రమ రవాణాకు చెక్ పెడుతోంది. ప్రజా పంపిణీ వ్యవస్థను మరింత సమర్ధవంతంగా నిర్వహిస్తోంది. చౌక ధరల దుకాణాల ద్వారా పేదలకు పంపిణీ చేసే నిత్యావసరాలను దారిమళ్లించడం, దుర్వినియోగానికి పాల్పడిన వారిపై 6ఏ కేసులతో పాటు క్రిమినల్ కేసులు కూడా నమోదు చేస్తోంది. ఇప్పుడు దీర్ఘకాలికంగా బియ్యాన్ని బ్లాక్ మార్కెటింగ్ చేస్తూ, తరచూ పట్టుబడిన వ్యక్తులపై పీడీ యాక్టును ప్రయోగిస్తోంది. ప్రత్యేక కార్యాచరణతో సత్ఫలితాలు గతంలో రేషన్ బియ్యం విచ్చలవిడిగా అక్రమ రవాణా జరిగేది. వందల టన్నుల బియ్యం సరిహద్దులు దాటేసేది. మరోపక్క పేదలు తినే బియ్యంపై కొందరు అసత్య ప్రచారం చేసి, వాటిని తక్కువ రేటుకు కొని, తిరిగి పాలిష్ పట్టి మార్కెట్లోకి తెచ్చి అధిక ధరలకు అమ్మి సొమ్ము చేసుకునేవారు. లారీలతో లోడ్లు తరలిపోతున్నా కేసులే నమోదయ్యేవి కావు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇటువంటి అక్రమార్కుల ఆట కట్టిస్తోంది. రేషన్ బియ్యం రవాణాపై నిఘాను పటిష్టం చేసింది. అంతర్రాష్ట్ర సరిహద్దులు, మండల నిల్వ పాయింట్లు, చౌక దుకాణాలు, ఎండీయూ వాహనాలపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ నిరంతర నిఘా పెట్టడంతో చాలా వరకు అక్రమ రవాణా తగ్గింది. రాష్ట్రవ్యాప్తంగా ఈ ఏడాది ఏప్రిల్ వరకు 743 మందిని అరెస్టు చేసింది. నిత్యావసర వస్తువుల చట్టం – 1955 సెక్షన్ 6ఏ ప్రకారం అక్రమ రవాణాలో పట్టుబడిన సరకులు, వాహనాలను స్వాధీనం చేసుకొని, కేసులు నమోదు చేస్తోంది. ఈ కేసులు సత్వరం పరిష్కారమయ్యేలా చర్యలు తీసుకొని, అక్రమార్కులకు త్వరితగతిన శిక్షలు పడేలా చేస్తోంది. పట్టుబడిన బియ్యాన్ని వెంటనే తిరిగి పీడీఎస్, మార్కెట్లోకి తెస్తోంది. ఇందుకోసం ప్రత్యేక కార్యాచరణ రూపొందించింది. జిల్లాల్లో బియ్యం అక్రమరవాణాలో పట్టుబడ్డ సరుకు నిల్వల విలువ రూ.50 లక్షల లోపు ఉంటే జేసీలు, అంతకు పైబడి ఉంటే కలెక్టర్లకు కేసుల పరిష్కార బాధ్యతలను అప్పగించింది. ఫలితంగా ఏళ్లు తరబడి సీజ్ చేసిన సరుకు ముక్కిపోయి, పురుగులు పట్టి పాడవకుండా బహిరంగ వేలం ద్వారా వెంటనే తిరిగి మార్కెట్లోకి తెస్తోంది. ఇలా గడిచిన నాలుగేళ్లలో 6ఏ కేసులు 8,696 నమోదు చేస్తే, వాటిల్లో 4,565 కేసులను పరిష్కరించింది. మొత్తం 4.70లక్షల క్వింటాళ్ల స్టాక్‌ను స్వాధీనం చేసుకోగా, 2.82 లక్షల క్వింటాళ్ల బియ్యాన్ని తిరిగి పీడీఎస్, మార్కెట్లోకి తీసుకొచ్చింది. రియల్ టైం మానిటరింగ్ 6ఏ కేసుల స్థితిగతులను ఎప్పటికప్పుడు ఆన్లైన్లో పర్యవేక్షించేందుకు పౌర సరఫరాల శాఖ ప్రత్యేక యాప్‌ను అభివృద్ధి చేసింది. కేసు నమోదు చేసిన వెంటనే సీజ్ చేసిన స్టాక్ వివరాలను ఇందులో అప్లోడ్ చేస్తారు. జిల్లాలు, తేదీలు, నెలలవారీగా నమోదైన కేసులు, పరిష్కరించినవి, సీజ్ చేసిన స్టాకు, బయటకు విడుదల చేసిన స్టాక్ వివరాలను రియల్ టైమ్ మానిటరింగ్ చేసేలా ప్రత్యేక వ్యవస్థను రూపొందించారు. పీడీఎస్ బియ్యాన్ని దారి మళ్లించి, వాటిని రీసైక్లింగ్ చేసి కస్టమ్ మిల్లింగ్ రైస్ కింద చూపించడం, పాలిష్ పట్టి కొత్త ప్యాకింగ్‌లో మార్కెట్లో విక్రయించడాన్ని సంపూర్ణంగా నిరోధించే ప్రయత్నం చేస్తోంది. పటిష్ట నిఘాతో అక్రమ రవాణా కట్టడి ఇప్పటి వరకు అక్రమ రవాణా చేస్తూ పట్టుబడ్డ బియ్యాన్ని సీజ్ చేసి పక్కన పెట్టేవారు. వాటిని పట్టించుకోకపోవడంతో తినడానికి పనికిరాకుండా పాడయ్యేవి. ఈ క్రమంలోనే మేము 6ఏ కేసుల పరిష్కారంపై దృష్టి పెట్టాం. కేసులు వేగంగా పరిష్కారమయ్యేలా పర్యవేక్షిస్తున్నాం. దీనికి తోడు బ్లాక్ మార్కెట్ దందాకు పాల్పడే వారిని పీడీ యాక్టులో పెడుతున్నాం. పటిష్ట నిఘా ఉంది కాబట్టే కేసులు నమోదవుతున్నాయి. అంతేగానీ అక్రమ రవాణా జరిగిపోతున్నట్టు కాదు. – హెచ్.అరుణ్ కుమార్, కమిషనర్, పౌరసరఫరాల శాఖ -
బ్లూడార్ట్ సేవల విస్తరణ
ముంబై: ఎక్స్‌ప్రెస్ ఎయిర్, ట్రాన్స్‌పోర్టేషన్, లాజిస్టిక్స్ సేవల్లోని బ్లూడార్ట్ విస్తరణపై దృష్టి సారించింది. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా 76 పిన్కోడ్లకు తన కార్యకలాపాలను కొత్తగా విస్తరించినట్టు ప్రకటించింది. అలాగే, దేశవ్యాప్తంగా కంపెనీ ఆధీనంలో 15 కొత్త రిటైల్ స్టోర్లను ప్రారంభించింది. అలాగే 15 ఫ్రాంచైజీ కలెక్షన్ సెంటర్లు, 15 ఎక్స్‌ప్రెస్ ఏజెంట్లు, 15 ప్రాంతీయ సరీ్వస్ ప్రొడైడైర్ ఫ్రాంచైజీలను నియమించుకున్నట్టు ప్రకటించింది. తద్వారా దేశంలోని ప్రతి పాంతానికీ సేవలు అందించగలమని తెలిపింది. దేశ ప్రజలకు సేవలు అందించే విషయంలో తమ అంకిత భావానికి ఈ సేవల విస్తరణ నిదర్శనంగా కంపెనీ పేర్కొంది. విజయవాడ, సికింద్రాబాద్, మధురై, భువనేశ్వర్, లుధియానా, కోల్‌కతా తదితర పట్టణాల్లోని వ్యూహాత్మకంగా కీలకమైన ప్రాంతాల్లో కొత్త రిటైల్ స్టోర్లు తెరిచినట్టు తెలిపింది. తాజా విస్తరణతో దేశవ్యాప్తంగా 55వేలకు పైగా ప్రాంతాలకు తమ సేవలు చేరువ అయినట్టు వివరించింది. మారుతున్న కస్టమర్ల ప్రాధాన్యతలకు అనుగుణంగా సేవలు అందించడంపై తమ దృష్టి ఉంటుందని బ్లూడార్ట్ చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ కేతన్ కులకర్ణి తెలిపారు. -
ఖరముకదిలితేనే..రైతుల బతుకుబండి నడిచేది
‘‘ఎవరైనా ఎక్కువగా కష్టపడి పనిచేస్తే గాడిద చాకిరీ చేస్తున్నాడు’’ ‘‘వసుదేవుడంతటి వాడు గాడిద కాళ్లు పట్టుకున్నాడు’’ ఇది ఉపమానం అయినా, సామెత అయినా..పని, అవసరం విశిష్టత చెప్పడమే. అవి కర్ణాటక, మహారాష్ట్ర సరిహద్దు సంగారెడ్డి జిల్లాలోని మారుమూల గ్రామాలు. పొలాలకు వెళ్లేందుకు వీలుగా ఎడ్లబండ్లు తీసుకెళ్లడానికి మట్టిబాటలు కూడా లేవు. ఎరువులు, విత్తనాలు తీసుకెళ్లాలన్నా, పండిన పంట ఇంటికి చేరాలన్నా రైతులకు ఎన్నో వ్యయప్రయాసలే. అలాంటి వారి పాలిట గాడిదలే కార్గో విమానాలు, ట్రాక్టర్లు. – సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి గాడిదల వినియోగం ఎక్కడంటే.. కర్ణాటక, మహారాష్ట్రలకు సరిహద్దులో ఉంటే సంగారెడ్డి జిల్లాలోని మారుమూల మండలాలైన సిర్గాపూర్, కంగి్ట, కల్హేర్, మనూరు మండలాల్లో రైతుల పంట రవాణాకు గాడిదల వినియోగం ఎక్కువ. ఆయా మండలాల్లోని చీమలపాడు, వాసర్, వంగ్దాల్, తడకల్, రాసోల్, జంగి, గాజుర్పాడు, దామరగిద్దలో ఆయా వ్యవసాయ సీజన్లకు అనుగుణంగా వీటి వినియోగం చూడొచ్చు. అంగడి.. శూన్య అమావాస్య రోజున గాడిదల అంగడి మహారాష్ట్రలోని మాలేగాంలో జరుగుతుంది. ఏడాదికోసారి వచ్చే శూన్య అమావాస్య రోజు (సంక్రాంతి పండుగకు ముందు) జరిగే ఈ అంగడిలో గాడిదల క్రయవిక్రయాలు జరుగుతాయి. ఈ అంగట్లో తమకు అవసరమైన గాడిదలు కొనుగోలు చేస్తారు. ఒక్కో గాడిద ఖరీదు రూ.20 వేల నుంచి రూ.30 వేల వరకు ఉంటుంది. సీజన్లో మహారాష్ట్ర నుంచి.. ఆయా పంట సీజన్‌కు అనుగుణంగా మహారాష్ట్ర నుంచి గాడిదలు సంగారెడ్డి జిల్లా సరిహద్దు గ్రామాలకు తీసుకొచ్చి సరుకు రవాణా చేయిస్తారు. నెల, రెండు నెలలు ఇక్కడ ఉండి సీజన్ ముగిశాక వెళ్లిపోతారు. కిరాయి... వస్తు బదిలీ రూపంలోనే వ్యవసాయ ఉత్పత్తులు తరలించినందుకు గాడిదల యజమానులకు కిరాయి డబ్బురూపంలో కాకుండా, వస్తురూపంలో ఉంటుంది. ఇది పాత పద్ధతే అయినా ఇప్పటికీ ఆయా ప్రాంతాల్లో అమలులో ఉంది. 60 నుంచి 70 కిలోల వ్యవసాయ ఉత్పత్తుల బస్తా తరలిస్తే అడ్డెడు సరుకుల చొప్పున ఇస్తున్నారు. పెసర, మినుము, సోయా వంటి పంటలను తరలిస్తే రెండు, మూడు బస్తాలకు ఒక అడ్డ చొప్పున ఇస్తున్నారు. పంట చేను నుంచి తరలించే ఇంటి దూరాన్ని బట్టి కిరాయి పెరుగుతుంది. ఒకఅడ్డ అంటే ఐదు కిలోలతో సమానం. వడ్లు అయితే కాస్త తక్కువగా ఉంటుంది. సీజన్లో కొందరు రైతులు తమ ధాన్యాన్ని విక్రయించేందుకు సమీప మండల కేంద్రాలకు తెచ్చేందుకు కూడా గాడిదలను వినియోగిస్తారు. ఎరువులు, విత్తనాల బస్తాలను ఇంటి నుంచి పొలాలకు తరలిస్తే బస్తాకు రూ.30 నుంచి రూ.50 వరకు దూరాన్ని బట్టి తీసుకుంటారు. వేరే ప్రత్యామ్నాయం లేకనే... నాకున్న భూమిలో నాలుగు ఎకరాల వరకు సరిగ్గా దారి లేదు. దీంతో ఏటా నేను ఆ పొలం నుంచి వడ్లు, సోయా, కందులు, పెసర్లు ఇంటికి తెచ్చేందుకు గాడిదలనే కిరాయికి పెట్టుకుంటాను. తూము(16 అడ్డల)కు ఒక అడ్డెడు కిరాయి కింద గాడిదల యజమానికి చెల్లిస్తా. అంటే సుమారు 20 క్వింటాళ్ల సరుకు తరలిస్తే క్వింటాలు వరకు కిరాయి ఇస్తా. ఈ పొలాల నుంచి పంటను తరలించేందుకు ప్రస్తుతానికి వేరే మార్గం లేదు. ఆ పొలం వరకు ట్రాక్టర్ వెళ్లదు. – దేవుకతే యాదవరావు, రైతు, సిర్గాపూర్ రెండు గాడిదలతో కనిపిస్తున్న ఈ వ్యక్తి కుమ్మరి పండరి. సిర్గాపూర్ మండలం చీమలపాడు గ్రామం. కర్ణాటక సరిహద్దుల్లో ఉన్న ఈ గ్రామంలో పండరికి ఎనిమిది గాడిదలు ఉన్నాయి. రోజూ ఉదయం ఆరు గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, తిరిగి మధ్యాహ్నం 3 గంటల నుంచి చీకటిపడే వరకు గాడిదలను మేపేందుకు తీసుకెళ్లాడు. పంటలు వేసుకునే సమయంలో ఎరువులు, విత్తనాల బస్తాలు తరలించేందుకు సీజన్ మొత్తంలో రూ.8వేల నుంచి 10 వేల వరకు వస్తాయని, పంట ఇంటికి చేరే సీజన్లో తన కుటుంబం ఏడాదంతా తినేందుకు సరిపడా పప్పుదినుసులు, ఏడెనిమిది క్వింటాళ్ల వరకు సోయాలు వస్తాయని చెబుతున్నాడు. వీటిని అమ్ముకుంటే రూ.20 వేల నుంచి రూ.30 వేల వరకు చేతికందుతుందని పండరి చెప్పుకొచ్చాడు. -
పైన ఎల్లిగడ్డలు.. కింద పశువులు.. ట్రక్కులో కుక్కి...
సాక్షి, ఎడపల్లి (నిజామాబాద్): ఎవ్వరికీ అనుమానం రాకుండా పైన ఎల్లిగడ్డ సంచులు, కింద అరలో పశువులను ఉంచి తరలిస్తున్న ట్రక్కును నిజామాబాద్ జిల్లా ఎడపల్లి పోలీసులు పట్టుకున్నారు. ట్రక్కులోపల 50 పశువులను కుక్కి కుక్కి పెట్టడంతో అవి తీవ్ర గాయాల పాలయ్యాయి. మహారాష్ట్రలోని నాగ్‌పూర్ నుంచి ఎడపల్లి మండలంలోని జానకంపేట గ్రామానికి ఈ పశువులను తీసుకొచ్చారు. సమాచారం అందుకున్న ఎడపల్లి ఎస్సై పాండేరావు ట్రక్కును, పశువులను స్వా«దీనం చేసుకున్నారు. పశువులను బోధన్ గోశాలకు తరలించారు. కాగా, పశువులతోపాటు ఆవులు ఉన్నాయేమోనన్న అనుమానంతో స్థానిక బీజేపీ నేతలు పోలీస్‌స్టేషన్‌కు చేరుకున్నారు. పరిశీలించగా ఆవులు కనిపించకపోవడంతో వెనుదిరిగారు.ఎడపల్లి (బోధన్): ఎవ్వరికీ అనుమానం రాకుండా పైన ఎల్లిగడ్డ సంచులు, కింద అరలో పశువులను ఉంచి తరలిస్తున్న ట్రక్కును నిజామాబాద్ జిల్లా ఎడపల్లి పోలీసులు పట్టుకున్నారు. ట్రక్కులోపల 50 పశువులను కుక్కి కుక్కి పెట్టడంతో అవి తీవ్ర గాయాల పాలయ్యాయి. మహారాష్ట్రలోని నాగ్‌పూర్ నుంచి ఎడపల్లి మండలంలోని జానకంపేట గ్రామానికి ఈ పశువులను తీసుకొచ్చారు. గాయపడిన ఎద్దు సమాచారం అందుకున్న ఎడపల్లి ఎస్సై పాండేరావు ట్రక్కును, పశువులను స్వా«దీనం చేసుకున్నారు. పశువులను బోధన్ గోశాలకు తరలించారు. కాగా, పశువులతోపాటు ఆవులు ఉన్నాయేమోనన్న అనుమానంతో స్థానిక బీజేపీ నేతలు పోలీస్‌స్టేషన్‌కు చేరుకున్నారు. పరిశీలించగా ఆవులు కనిపించకపోవడంతో వెనుదిరిగారు. చదవండి: అందం హిందోళం.. అధరం తాంబూలం -
బెంగళూరును వణికిస్తున్న భారీ వర్షాలు
బెంగళూరు/బనశంకరి: భారీ వర్షాల ధాటికి బెంగళూరు చిగురుటాకులా వణికిపోయింది. ఆదివారం రాత్రి 8 నుంచి సోమవారం ఉదయం ఐదింటి దాకా 13 సెంటీమీటర్ల మేర కుండపోతగా కురిసిన వర్షాలతో అతలాకుతలమైంది. చాలా ప్రాంతాలు నీట మునిగాయి. రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. చెరువులు, కాలువలు పొంగిపొర్లుతున్నాయి. సహాయక చర్యల కోసం ప్రభుత్వ అధికారులు పడవలు, ట్రాక్టర్లను రంగంలోకి దించారు. నగరంలో పలు ప్రాంతాల్లో సోమవారం ఉదయం విద్యార్థులు, ఉద్యోగులు పడవల్లో విద్యాసంస్థలు, కార్యాలయాలకు చేరుకున్నారు. అపార్టుమెంట్లు, భారీ భవనాల బేస్మెంట్లలో, ఇళ్ల ముందు పార్కు చేసిన వాహనాలు నీటిలో మునిగిపోయాయి. ప్రధానంగా వైట్‌ఫీల్డ్, ఇందిరానగర్, కాంగేరి, ఆర్ఆర్ నగర్, బొమ్మనహళ్లి, మారథాళ్లి, మహాదేవపురాలో వరదల తీవ్రత అధికంగా ఉంది. #WATCH | Karnataka: Water logging, following heavy rainfall, in different parts of Bengaluru continues to cause traffic snarls. Visuals from today. pic.twitter.com/3a2HB25eFs — ANI (@ANI) September 6, 2022 బెల్లందూర్‌లో వర్షపునీటితో మునిగిపోయిన రహదారి స్తంభించిన ప్రజా రవాణా వ్యవస్థ ఐటీ కంపెనీలుండే ఔటర్ రింగ్‌రోడ్డు ప్రాంతం జలమయమైంది. రవాణా వ్యవస్థ స్తంభించిపోయింది. రోడ్లపై వరదలు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో వాహనాలు ఎక్కడికక్కడే ఆగిపోయాయి. ఆస్పత్రుల్లోకి నీరు చేరింది. సహాయక చర్యల కోసం ఎస్డీఆర్ఎఫ్ బృందాలను పంపించినట్లు ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై చెప్పారు. బెంగళూరులో 48 గంటల్లో తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. అంతర్జాతీయ విమానాశ్రయంలోకి నీరు చేరడంతో ఎయిర్‌పోర్టు రోడ్డు మునిగిపోయింది. ఎయిర్‌పోర్టుకు బయలుదేరిన ప్రయాణికులు మోకాలి నీటి లోతులో నడుస్తూ వీడియోలను చిత్రీకరించి, సోషల్ మీడియాలో పోస్టు చేశారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
ఆటో రంగంలో పెట్టుబడులా!
సాక్షి, హైదరాబాద్: థీమ్యాటిక్ ఫండ్స్ అన్నవి ఫలానా రంగాలకే పెట్టుబడులను పరిమితం చేసేవి. గత కొన్నేళ్లుగా ఆటోమొబైల్ రంగం ఎన్నో సవాళ్లను, సంస్కరణలను చవిచూసింది. తదుపరి వృద్ధికి ఈ రంగం సిద్ధంగా ఉందని ఎక్కువ మంది విశ్లేషకులు భావిస్తున్నారు. కనుక రిస్క్ ఎక్కువ ఉన్నా ఫర్వాలేదు, మంచి రాబడులు కావాలని కోరుకునే వారు ఆటోమొబైల్ రంగాన్ని పెట్టుబడులకు పరిశీలించొచ్చు. ఈ విభాగంలో యూటీఐ ట్రాన్స్పోర్ట్ అండ్ లాజిస్టిక్స్ ఫండ్‌ను పరిశీలించొచ్చు. ప్రస్తుత ట్రెండ్.. నిఫ్టీ ఆటో ఇండెక్స్ ఈ ఏడాది ఇప్పటి వరకు మంచి పనితీరు చూపించిన వాటిల్లో ఒకటి. 2021 అక్టోబర్ తర్వాత నుంచి చూస్తే ఆటోమొబైల్ రంగం నుంచి 171 లిస్టెడ్ కంపెనీలు ఉంటే, అందులో 50 స్టాక్స్ ఇప్పటికే గరిష్టాలకు చేరాయి. దీంతో స్టాక్స్ వ్యాల్యూషన్లను కొంత విస్తరించాయని అర్థం చేసుకోవాలి. కానీ, సాధారణంగా ఆటోమొబైల్ రంగంలో సైకిల్ మొదలైందంటే కనీసం రెండు నుంచి మూడేళ్లపాటు కొనసాగుతుందని నిపుణుల అంచనా. కనుక పెట్టుబడులకు ఇంకా మంచి అవకాశాలున్నట్టుగానే భావించాలి. ఆటోమొబైల్ రంగానికి సంబంధించి ఎన్నో పథకాలు అందుబాటులో ఉన్నప్పటికీ యాక్టివ్ ఫండ్ ఇదొక్కటే. ఈ విభాగంలో ప్యాసివ్ ఫండ్‌ను కోరుకునే వారు నిఫ్టీ ఆటో ఈటీఎఫ్‌ను సైతం పరిశీలించొచ్చు. రాబడులు.. యూటీఐ ట్రాన్స్పోర్ట్ పథకం ఏడాది, మూడేళ్లు, ఐదేళ్లు, పదేళ్ల కాలంలో అటు నిఫ్టీ టోటల్ రిటర్న్ ఇండెక్స్, నిఫ్టీ టీఆర్ఐ500 టీఆర్ఐ, నిఫ్టీ ఆటో టీఆర్ఐ కంటే మెరుగైన రాబడులు అందించడం గమనించాలి. అంటే చూడ్డానికి సైక్లికల్ రంగానికి సంబంధించిన పథకమే అయినా రాబడుల విషయంలో దీర్ఘకాలంలో మెరుగ్గా పనిచేయడాన్ని విస్మరించకూడదు. ఈ పథకం గడిచిన ఏడాది కాలంలో 29 శాతం రాబడినిచ్చింది. మూడేళ్లలో వార్షిక రాబడి రేటు 24 శాతంగా ఉంది. ఐదేళ్లలో ఏటా 18 శాతానికి పైనే రాబడినిచ్చింది. 2004లో ఈ పథకం ప్రారంభం కాగా, 16 శాతం వార్షిక రాబడినిచ్చింది. పోర్ట్‌ఫోలియో ఈ పథకం నిర్వహణలో ప్రస్తుతం రూ.1,886 కోట్ల పెట్టుబడులున్నాయి. 96.42 శాతం పెట్టుబడులను ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేసింది. మిగిలిన పెట్టుబడులను నగదు, ఇతర రూపాల్లో కలిగి ఉంది. పెట్టుబడుల్లో లార్జ్‌క్యాప్ స్టాక్స్‌కు 73 శాతానికి పైగా కేటాయింపులు చేసింది. మిడ్‌క్యాప్ విభాగానికి 20 శాతం, స్మాల్‌క్యాప్ విభాగానికి 7 శాతం వరకు కేటాయించింది. పెట్టుబడుల ప్రాధాన్యాన్ని గమనించినట్టయితే నూరు శాతం తీసుకెళ్లి ఆటోమొబైల్ స్టాక్స్‌లో పెట్టలేదు. ఈ రంగానికి 80 శాతాన్ని కేటాయించింది. సేవల రంగ కంపెనీలకు 12.34 శాతం, క్యాపిటల్ గూడ్స్ స్టాక్స్‌కు 2.45 శాతం చొప్పున కేటాయింపులు చేసింది. -
రవాణా ఆదాయం రయ్
సాక్షి, అమరావతి: కోవిడ్ సంక్షోభం నుంచి కోలుకోవడంతో రాష్ట్రంలో రవాణా ఆదాయం క్రమంగా పెరుగుతోంది. 2021–22 తొలి త్రైమాసికంతో పోల్చి చూస్తే ఈ ఆర్థిక ఏడాది అదే సమయంలో రవాణా ఆదాయంలో 58.70 శాతం వృద్ధి నమోదైంది. కోవిడ్‌కు ముందు అంటే 2019–20తో పోల్చితే 37.95 శాతం వృద్ధి నమోదైంది. వాహన విక్రయాలు పెరగడంతో జీవిత పన్ను, త్రైమాసిక పన్ను, ఎన్ఫోర్స్మెంట్ ద్వారా వచ్చే ఆదాయంలో పెరుగుదల నమోదైంది. గత ఐదేళ్లలో ఎప్పుడూ లేనంత వృద్ధి ఈ ఆర్థిక ఏడాది తొలి త్రైమాసికంలో నమోదు కావడం గమనార్హం. ద్విచక్రవాహనాలు మినహా మిగతా అన్ని రకాల వాహనాల విక్రయాల్లో వృద్ధి నమోదైంది. కార్ల జోరు.. ఈ ఆర్థిక ఏడాది తొలి త్రైమాసికంలో కార్ల విక్రయాల్లో 5.11 శాతం వృద్ధి నమోదైంది. ఆటోలు, ప్యాసింజర్ వాహనాలు, గూడ్స్ వాహనాల విక్రయాలు గణనీయంగా పెరిగాయి. ఆటోల విక్రయాల్లో 69.7 శాతం, ప్యాసింజర్ వాహనాలు 57.87 శాతం, గూడ్స్ వాహనాల విక్రయాల్లో 37.28 శాతం వృద్ధి నమోదైంది. ద్విచక్ర వాహనాల విక్రయాల్లో మాత్రం –3.75 శాతం వృద్ధి నమోదైంది. కోవిడ్‌కు ముందు 2019–20 తొలి త్రైమాసికంలో రూ.749.75 కోట్లు ఆదాయం రాగా ఈ ఆర్థిక ఏడాది తొలి త్రైమాసికంలో రూ.1,034.25 కోట్ల ఆదాయం సమకూరింది. జాతీయ స్థాయిలో అన్ని రకాల వాహనాల విక్రయాల్లో ఈ ఆర్థిక ఏడాది తొలి త్రైమాసికంలో భారీగా వృద్ధి నమోదైంది. కోవిడ్ సంక్షోభంలో ప్యాసింజర్ వాహనాలు కొనుగోళ్లు భారీగా పడిపోగా ఇప్పుడు పెరుగుతున్నాయి. -
కళ్ళు ఉండి చూడలేని కబోది రాతలు
-
మామిడితో కాసులు.. ఆర్టీసీకి ఏ దిల్ ‘మ్యాంగో’ మోర్
సాక్షి, అమరావతి బ్యూరో: ఆర్టీసీకి మామిడి కాసులు తెచ్చి పెడుతోంది. విజయవాడ నుంచి వివిధ ప్రాంతాలకు మామిడి కాయలు/పండ్లను పార్శిల్ ద్వారా పంపే వారి సంఖ్య పెరుగుతోంది. ఆర్టీసీ కార్గో, కొరియర్ సర్వీసులను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. వీటికి డోర్ డెలివరీ సదుపాయాన్ని కూడా కల్పించడంతో మంచి ఆదరణ లభిస్తోంది. పార్శిల్ బుక్ చేసిన 24 గంటల్లో తెలుగు రాష్ట్రాల్లోని నిర్దేశిత ప్రాంతాలకు సరకును అందజేస్తోంది. ఇది వినియోగదారులకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటోంది. చదవండి: కేశినేని కుటుంబంలో కుంపటి! మామిడికి ప్రత్యేక కౌంటర్.. విజయవాడ పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ (పీఎన్బీఎస్)లో కార్గో బుకింగ్ కౌంటర్ అందుబాటులో ఉంది. రెండు నెలల క్రితం నుంచి మామిడి సీజను మొదలైంది. మామిడిని పార్శిల్ ద్వారా పంపే వారి కోసం ప్రత్యేకంగా పీఎన్ బస్టాండులోని 60వ నంబరు ప్లాట్‌ఫాం వద్ద కౌంటర్‌ను ఏర్పాటు చేశారు. అక్కడ ప్రత్యేక ర్యాక్‌లను కూడా అమర్చారు. అలాగే ఇతర ప్రాంతాల నుంచి విజయవాడ వచ్చే మ్యాంగో బాక్సుల డెలివరీకి 57వ నంబరు ప్లాట్‌ఫాం వద్ద మరో ప్రత్యేక కౌంటర్‌ను అందుబాటులోకి తెచ్చారు. దీనివల్ల కార్గో బుకింగ్ కౌంటర్ వద్ద రద్దీ తగ్గడంతో పాటు వేగంగా పార్శిళ్లను బుక్ చేసుకునే వీలుంటోంది. ఇలా ఈ మ్యాంగో బుకింగ్ కౌంటర్లో నెలకు 600 నుంచి 800 వరకు బాక్సులు/పార్శిళ్లు బుక్ అవుతున్నాయి. గతేడాది కంటే మిన్నగా.. గత ఏడాది ఏప్రిల్‌లో 400 మ్యాంగో పార్శిళ్లు, మే నెలలో 600, జూన్‌లో 600 చొప్పున పీఎన్ బస్టాండు నుంచి వేర్వేరు ప్రాంతాలకు బుక్ అయ్యాయి. ఈ ఏడాది ఏప్రిల్‌లో 600, మే నెలలో ఇప్పటివరకు 800 వరకు పార్శిళ్లను పంపించారు. అంటే గత ఏడాదికంటే ఈ సీజనులో మామిడి పండ్ల/కాయల పార్శిళ్ల సంఖ్య పెరిగినట్టు స్పష్టమవుతోంది. ఆర్టీసీ ఒక్కో బాక్సుకు (5–15 కిలోల బరువు వరకు) రూ.100–120 వరకు రవాణా చార్జీ వసూలు చేస్తోంది. ఈ లెక్కన మామిడి రవాణా ద్వారా ఏప్రిల్‌లో రూ.60 వేలు, మే నెలలో (ఇప్పటి దాకా) రూ.80 వేల వరకు కార్గో ఆదాయం సమకూరింది. జూన్‌లోనూ 800 వరకు మ్యాంగో పార్శిళ్లు బుక్ అవుతాయని ఆర్టీసీ అధికారులు అంచనా వేస్తున్నారు. హైదరాబాద్, విశాఖలకు అధికం.. విజయవాడ నుంచి హైదరాబాద్, విశాఖపట్నంలకు అధికంగా మ్యాంగో పార్శిళ్లు బుక్ చేస్తున్నారు. ఆ తర్వాత తిరుపతి, రాజమండ్రిలకు బుక్ అవుతున్నాయని ఆర్టీసీ కార్గో విభాగం అధికారులు చెబుతున్నారు. ఒకే వినియోగదారుడు నాలుగైదుసార్లు పార్శిళ్లను పంపుతున్న వారు కూడా ఉంటున్నారని వివరిస్తున్నారు. మామిడి తర్వాత.. విజయవాడ నుంచి వివిధ ప్రాంతాలకు కార్గో రవాణాలో మామిడి తర్వాత మందులు, ఫ్యాన్సీ సరుకులు, వ్రస్తాలు, ఎలక్ట్రికల్ వస్తువులు, పుస్తకాలు వంటివి ఉంటున్నాయి. ఇలా వీటి ద్వారా విజయవాడ కార్గో కౌంటర్‌కు రోజుకు రూ.2.50 నుంచి 3 లక్షల వరకు ఆదాయం సమకూరుతోందని ఆర్టీసీ కార్గో విభాగం డెప్యూటీ సీటీఎం (కమర్షియల్) రాజశేఖర్ ‘సాక్షి’కి చెప్పారు. డోర్ డెలివరీ కూడా.. మరోవైపు పది కిలోమీటర్లలోపు డోర్ డెలివరీకి రూ.50 వరకు వసూలు చేస్తున్నారు. ఇది కూడా వినియోగదారులకు వెసులుబాటుగా ఉంటోంది. బుక్ చేసిన సరకును వెళ్లి తీసుకురావడానికి సమయాన్ని వెచ్చించడంతో పాటు ఆటో, బస్సు, వాహన చార్జీలను చెల్లించాల్సి వస్తోంది. డోర్ డెలివరీ వెసులుబాటు ఉండడం వల్ల వీరికి డబ్బుతో పాటు సమయం కూడా ఆదా అవుతోంది. దీంతో పలువురు ఈ డోర్ డెలివరీ సదుపాయాన్ని వినియోగించుకుంటున్నారు. విడిపించని సరకులకు నేడు వేలం.. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన పార్శిళ్లను కొంతమంది విడిపించుకోరు. అలాంటి వాటిని ఆర్టీసీ అధికారులు కొన్నాళ్ల పాటు వేచి చూసి ఎవరూ రాకపోతే వేలం వేస్తుంటారు. ఇలా పీఎన్ బస్టాండులో 2–3 నెలలుగా విడిపించుకోని 80 వరకు పార్శిళ్లు ఉన్నాయి. వీటిలో మందులు, దుస్తులు, స్టేషనరీ, స్పేర్ పార్టులు వంటివి ఉన్నట్టు గుర్తించారు. వీటికి శనివారం ఉదయం 11 గంటల నుంచి వేలం వేస్తామని పార్శిల్ విభాగం అధికారులు తెలిపారు. -
Hyderabad: సొంత బండి సో బెటర్!
సాక్షి, హైదరాబాద్: సాధారణంగా పెరుగుతున్న జనాభా అవసరాలకు అనుగుణంగా మౌలిక, రవాణా సదుపాయాలు విస్తరిస్తాయి. కానీ గ్రేటర్లో అందుకు విరుద్ధమైన పరిస్థితి నెలకొంది. ఏటేటా జనాభా పెరుగుతోంది. నలువైపులా నగరం విస్తరిస్తోంది. కానీ ప్రజారవాణా సదుపాయాలు మాత్రం పరిమితంగానే విస్తరించాయి. కొత్తగా మెట్రో రైలు సదుపాయం మినహా అదనంగా ప్రజారవాణా ఏ మాత్రం మెరుగుపడకపోవడం గమనార్హం. అదే సమయంలో వ్యక్తిగత వాహనాలు భారీగా రోడ్డెక్కాయి. నగర జనాభా ప్రస్తుతం ఇంచుమించు కోటిన్నరకు చేరుకుంది. పెరుగుతున్న జనాభాకు తగ్గట్లుగానే వాహనాల సంఖ్య 70 లక్షలు దాటింది. ఈ పదేళ్లలో ప్రజారవాణా విస్తరణకు నోచకపోవడం వల్లనే వ్యక్తిగత వాహనాల సంఖ్య భారీగా పెరిగినట్లు రవాణా రంగానికి చెందిన నిపుణులు అంచనా వేస్తున్నారు. బెంగళూరు వంటి మెట్రోపాలిటన్ నగరాల్లో ప్రజా రవాణా గణనీయంగా అభివృద్ధి చెందితే హైదరాబాద్‌లో మాత్రం తగ్గుముఖం పట్టడం గమనార్హం. కిక్కిరిసిపోతున్న రహదారులు.. గ్రేటర్లో ఏటా సుమారు 2.5 లక్షల వాహనాలు కొత్తగా వచ్చి చేరుతున్నాయి. వీటిలో మూడొంతులకు పైగా వ్యక్తిగత వాహనాలే. ప్రజారవాణా వాహనాల విస్తరణ కనీసం 15 శాతం కూడా లేకపోవడం గమనార్హం. కోటిన్నర జనాభా ఉన్న నగరంలో వాహనాల సంఖ్య ప్రస్తుతం 71 లక్షలు దాటింది. రోజు రోజుకు వేల సంఖ్యలో రోడ్డెక్కుతున్న వాహనాలతో రహదారులు కిక్కిరిసిపోతున్నాయి. కోవిడ్ దృష్ట్యా వ్యక్తిగత వాహనాల వినియోగం భారీగా పెరిగింది. ఈ రెండేళ్లలోనే 5 లక్షలకు పైగా కొత్త వాహనాలు రోడ్డుపైకి వచ్చాయి. 2020లో 65 లక్షల వాహనాలు ఉంటే ఇప్పుడు 71 లక్షలు దాటాయి. యువతలో 80 శాతం మందికి బైక్ తప్పనిసరిగా మారింది. చదువు, ఉద్యోగ,వ్యాపార అవసరాలతో నిమిత్తం లేకుండా ఒక వయస్సుకు రాగానే పిల్లలకు బండి కొనివ్వడాన్ని తల్లిదండ్రులు గొప్పగా భావిస్తున్నారు. రవాణాశాఖలో నమోదైన 71 లక్షల వాహనాల్లో సుమారు 47 లక్షల వరకు బైక్‌లే కావడం గమనార్హం. మరో 20 లక్షల వరకు కార్లు ఉన్నాయి. మిగతా 5 లక్షల వాహనాల్లో ఆటోరిక్షాలు, క్యాబ్‌లు, సరుకు రవాణా వాహనాలు, స్కూల్ బస్సులు, ఆర్టీసీ, ప్రైవేట్ బస్సులు తదితర కేటగిరీలకు చెందిన వాహనాలు ఉన్నాయి. పదేళ్లలో రెట్టింపు... పదేళ్లలో జనాభా పెరిగింది. 2011 నాటి లెక్కల ప్రకారం 75 లక్షలు ఉంటే ఇప్పుడు కోటిన్నరకు చేరింది. సొంత వాహనాలు సైతం ఇంచుమించు జనాభాకు సమాంతరంగా పెరిగాయి. కానీ ప్రజారవాణా సదుపాయాలు మాత్రం ఈ పదేళ్లలో చాలా వరకు తగ్గుముఖం పట్టాయి. 2012 నాటి లెక్కల ప్రకారం నగరంలోని 28 డిపోల పరిధిలో 3850 సిటీ బస్సులు ఉండేవి. ప్రతిరోజు సుమారు 32 లక్షల మంది ప్రయాణికులు ఈ బస్సుల్లో రాకపోకలు సాగించారు. మరో 8 లక్షల మంది ఆటోలను వినియోగించుకున్నారు. లక్ష మంది ఎంఎంటీఎస్ రైళ్లలో ప్రయాణం చేశారు. అంటే 75 లక్షల జనాభాలో కనీసం సగం మందికి ప్రజా రవాణా అందుబాటులో ఉంది. ఆర్టీఏ లెక్కల ప్రకారం పదేళ్ల క్రితం నగరంలో వ్యక్తిగత 33 లక్షల వరకు ఉంటే ఇప్పుడు వాటి సంఖ్య 71 లక్షలు దాటింది. ఇప్పు‘ఢీ’లా... రోజుకు 3.5 లక్షల మంది ప్రయాణికులకు రవాణా సదుపాయాన్ని అందజేసే మెట్రో రైలు తప్ప ఈ పదేళ్లలో ఇతర రవాణా సదుపాయాలు ఏ మాత్రం మెరుగుపడలేదు. సిటీ బస్సుల సంఖ్య ఇంచుమించు సగానికి పడిపోయింది. 2550 బస్సులు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. 16 లక్షల మంది మాత్రమే ప్రయాణం చేస్తున్నారు. కోవిడ్ దృష్ట్యా ఆటోలు, క్యాబ్‌ల వినియోగం బాగా తగ్గింది. ప్రస్తుతం ఈ రెండు కేటగిరీ వాహనాల్లో ప్రతిరోజు 5 లక్షల మంది మాత్రమే ప్రయాణం చేస్తున్నట్లు అంచనా. కోవిడ్‌తో ఎంఎంటీఎస్‌ల వినియోగం దారుణంగా పడిపోయింది. గతంలో రోజుకు 121 సర్వీసులు నడిస్తే ఇప్పుడు 75 మాత్రమే ఉన్నాయి. అప్పుడు లక్ష మంది ప్రయాణం చేశారు. ఇప్పుడు 25 వేల నుంచి 30 వేల మంది మాత్రమే ఎంఎంటీఎస్‌లను వినియోగించుకుంటున్నారు. ప్రభుత్వ,ప్రైవేట్ రంగాలకు చెందిన ఉద్యోగులు, ఐటీ నిపుణులు, విద్యార్ధులు తదితర అన్ని వర్గాలకు మెట్రో రైలును ఏకైక పరిష్కారంగా భావించారు. కానీ ఈ ఐదేళ్లలో మెట్రో ప్రయాణికుల సంఖ్య ఏ మాత్రం మెరుగుపడలేదు. (చదవండి: టాఫిక్ సిగ్నల్.. ఇక ఆటోమేటిక్!) -
రైల్వే–ఆర్టీసీ కలసి సరుకు రవాణా!
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ–రైల్వేలు కలసి సరుకు రవాణా దిశగా అడుగులు వేస్తున్నాయి. టీఎస్ఆర్టీసీ కార్గో, పార్శిల్ విభాగం ఏర్పడ్డా, ఇంతకాలం పెద్దగా ఆదాయాన్ని సాధించలేకపోయింది. ఇప్పుడు దాన్ని పూర్తిస్థాయిలో మార్చి ఆదాయాన్ని పెంచేలా ఎండీ సజ్జనార్ చర్యలు తీసుకుంటున్నారు. ఇటీవలే కార్గో విభాగానికి జీవన్‌ప్రసాద్ అధికారిని బిజెనెస్ హెడ్‌గా నియమించారు. ఇటీవలే కర్ణాటకలో, అక్కడి ఆర్టీసీ కార్గో విభాగం పని తీరును పరిశీలించి వచ్చిన ఆయన, తాజాగా రైల్వేతో అనుసంధానంపై కసరత్తు ప్రారంభించారు. దక్షిణ మధ్య రైల్వే అసిస్టెంట్ కమర్షియల్ మేనేజర్ విద్యాధర్‌రావుతో బస్‌భవన్‌లో ఆర్టీసీ ఎండీ సజ్జనార్, కార్గో బిజినెస్ హెడ్ జీవన్‌ప్రసాద్‌లు భేటీ అయ్యారు. ఈ మేరకు రైల్వే–ఆర్టీసీ సరుకు రవాణా అనుసంధానం సాధ్యాసాధ్యాలపై చర్చించారు. ఏంటీ ఆలోచన...: కొంతకాలంగా సరుకు రవాణాను మరింత పటిష్టం చేసే దిశలో దక్షిణ మధ్య రైల్వే పకడ్బందీగా వ్యవహరిస్తోంది. ఈమేరకు వివిధ సం స్థలతో ఒప్పందాలు చేసుకుంటోంది. ఈ క్రమంలో టీఎస్ఆర్టీసీతో కూడా ఒప్పందంపై యోచిస్తోంది. ప్రస్తుతం నిర్ధారిత స్టేషన్ల నుంచి సరుకు రవాణా అవుతోంది. ఆయా స్టేషన్ల వరకు సరుకును బుక్ చేసినవారే తెచ్చి రైల్వేకు అప్పగించాల్సి ఉంది. ఇది పెద్ద లోటుగా ఉంది. దీనిని ఆర్టీసీ భర్తీ చేసేందుకు ముందుకొచ్చింది. పార్శిల్స్ బుక్ చేసుకున్న వారి ఇళ్లు, వ్యాపారకేంద్రాల వద్దకు ఆర్టీసీ కార్గో సిబ్బంది వెళ్లి సరుకును సేకరిస్తారు. అందుకయ్యే ఖర్చును వసూలు చేస్తారు. సరుకును నిర్ధారిత రైల్వే స్టేషన్‌కు తీసుకెళ్లి రైల్వే సిబ్బందికి అప్పగిస్తారు. దీనివల్ల సరుకు బుక్ చేసుకున్న వారికి దాన్ని స్టేషన్ వరకు తరలించే భారం తప్పుతుంది. ఆ బాధ్యతను తీసుకున్నందుకు ఆర్టీసీ తన వంతు చార్జీలు తీసుకుంటుంది. దీనివల్ల రైల్వేకు సరుకు రవాణా పార్శిళ్ల సంఖ్య పెరిగి వ్యాపారం వృద్ధి చెందుతుందని, ఆర్టీసీకి కూడా భారీ డిమాండ్ వస్తుందని అభిప్రాయపడ్డారు. -
అడవికి రాచబాట!
► విశాఖ జిల్లా పెదబయలు మండలంలోని నివాసిత ప్రాంతం కొండ్రుకు స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు రోడ్డు సౌకర్యం లేదు. కొండలు, గుట్టలు ఎక్కి వెళ్లాల్సిందే. ఇప్పుడు ఆ దుస్థితి తొలగనుంది. గుల్లేలు నుంచి కొండ్రుకు రూ.15.93 కోట్లతో 18.40 కిలోమీటర్ల మేర రోడ్డు నిర్మాణ పనులు చకచకా జరుగుతున్నాయి. ► డుంబ్రిగుడ మండలం సోవ్వ నుంచి చెమడపొడు వరకు 22 కిలోమీటర్ల మేర రోడ్డు పనులకు ప్రభుత్వం రూ.11.42 కోట్లను వెచ్చిస్తోంది. ఇప్పటిదాకా అక్కడ రోడ్డు సదుపాయం లేదు. ► పెదబయలు మండలం రుద్రకోట నుంచి కుమడ పంచాయతీ కిందుగూడ మీదుగా ఒడిశా సరిహద్దు వరకు రహదారి పనులు జరుగుతున్నాయి. కిందుగూడకు ఇన్నేళ్లుగా కేవలం మట్టి రోడ్డు మాత్రమే ఉంది. వర్షాకాలం అక్కడకు వెళ్లాలంటే అసాధ్యమే. ఇప్పుడు అక్కడ 25.60 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణానికి రూ.16 కోట్లతో పనులు ప్రారంభమయ్యాయి. ► ముంచంగిపుట్టు మండలం బుంగపుట్ ఏజెన్సీ గ్రామానికి 25 కిలోమీటర్ల మేర రోడ్డు నిర్మాణ పనులకు ప్రభుత్వం రూ.14 కోట్లు ఖర్చు చేస్తోంది. సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: స్వాతంత్య్రం సిద్ధించి దశాబ్దాలు గడుస్తున్నా మారుమూల గిరిజన ప్రాంతాలకు మౌలిక వసతులు కరువయ్యాయి. విశాఖ ఏజెన్సీలోని పలు నివాసిత ప్రాంతాలకు రహదారుల సదుపాయం లేక అడవి బిడ్డలు అవస్థలు ఎదుర్కొంటున్నారు. తప్పనిసరైతే కొండకోనల్లో ప్రయాసలతో వెళ్లాల్సిందే. మట్టి రోడ్లున్నా వర్షాకాలంలో అడుగుతీసి అడుగు వేయలేని దుస్థితి. ఇక అనారోగ్య సమస్యలు తలెత్తితే దేవుడిపై భారం వేయాల్సిందే. ఈ దుస్థితిని తొలగించి ఏజెన్సీ గ్రామాలకు మట్టి రోడ్లు కాకుండా మెటల్, బీటీ రోడ్లను నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించి చకచకా పనులు జరుగుతున్నాయి. విడతలవారీగా ఏజెన్సీ గ్రామాలకు రోడ్ల సదుపాయాన్ని కల్పిస్తున్నారు. తద్వారా రవాణా సదుపాయం పెరిగి రాకపోకలకు ఇబ్బందులు తొలగిపోనున్నాయి. 548.91 కిలోమీటర్లు... రూ.308.98 కోట్లు విశాఖ ఏజెన్సీ ప్రాంతంలో మొత్తం 11 మండలాలున్నాయి. ఇందులో 3,789 నివాసిత ప్రాంతాల్లో (ఆవాసాలు) 6,58,354 మంది జీవనం సాగిస్తున్నారు. వీటిల్లో 1,610 నివాసిత ప్రాంతాలు, గ్రామాలకు మాత్రమే రోడ్డు కనెక్టివిటీ ఉంది. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఏజెన్సీ గ్రామాలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంది. రూ.308.98 కోట్లతో గత రెండేళ్లలో 340 నివాసిత ప్రాంతాలకు 548.91 కిలోమీటర్ల మేర రోడ్డు సదుపాయం కల్పించేలా చర్యలు చేపట్టడంతో మొత్తం 1,950 ప్రాంతాలకు రోడ్డు కనెక్టివిటీ అందుబాటులోకి వస్తోంది. ఇంకా 1,839 నివాసిత ప్రాంతాలకు రోడ్డు సదుపాయాన్ని కల్పించాల్సి ఉంది. ఇందుకోసం రూ.714 కోట్ల మేర నిధులు అవసరమని అంచనా వేశారు. సాగు హక్కులు.. పథకాల ప్రయోజనం ఇప్పటికే గిరిజనులకు ఆర్ఓఎఫ్ఆర్ పట్టాల ద్వారా భూ పంపిణీ చేపట్టి సాగు హక్కులు కల్పించి ప్రభుత్వ పథకాల ప్రయోజనాన్ని అందజేస్తున్న విషయం తెలిసిందే. గిరిజన గ్రామాల్లో కూడా గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాల (ఆర్బీకే) సేవలతో పాటు హెల్త్ క్లినిక్‌ల నిర్మాణాన్ని ప్రభుత్వం చేపడుతోంది. గిరిజనులకు వైద్యం అందించేందుకు ప్రత్యేకంగా డాక్టర్లు, వైద్య సిబ్బందిని నియమించింది. ఈ క్రమంలో రానున్న రోజుల్లో ఏజెన్సీలోని అన్ని నివాసిత ప్రాంతాలకు రోడ్ల సదుపాయాన్ని కల్పించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఏజెన్సీ గ్రామాలపై ప్రత్యేక శ్రద్ధ ఏజెన్సీ గ్రామాలపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహించి సర్వే చేపట్టింది. ‘కనెక్ట్ పాడేరు’ పేరుతో అన్ని వివరాలను సేకరిస్తున్నాం. రోడ్డు సౌకర్యం లేక గర్భిణులు బాగా ఇబ్బంది పడుతున్నారు. గత రెండేళ్లుగా 340 నివాసిత ప్రాంతాలకు కనెక్టివిటీ కల్పించేలా పనులు జరుగుతున్నాయి. –ఆర్.గోపాలకృష్ణ, ఐటీడీఏ పీవో దశాబ్దాల కల సాకారం గుల్లేల గ్రామం నుంచి కొండ్రు వరకు దశాబ్దాల తర్వాత రహదారి సౌకర్యం అందుబాటులోకి వస్తోంది. ఈ రహదారి నిర్మాణం పూర్తయితే పెదబయలు, ముంచంగిపుట్టు, జి.మాడుగుల మండలాలకు చెందిన గిరిజనుల రవాణా కష్టాలు తీరతాయి. రహదారి సమస్యను గతంలో ఎన్నోసార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లాం. ఇన్నాళ్లకు మా కల నెరవేరుతోంది. – వరద నాగేశ్వరరావు, ఇంజిరి పంచాయతీ, పెదబయలు మండలం డోలి కష్టాలకు తెర... సోవ్వ నుంచి ఒడిశా బోర్డర్ వరకు రహదారి నిర్మాణం జరుగుతుండడం శుభపరిణామం. సరైన రవాణా వ్యవస్థ లేక అత్యవసర పరిస్థితుల్లో మేం పడుతున్న కష్టాలు ఆ దేవుడికే తెలుసు. రోగులు, గర్భిణులను డోలిలో మోసుకుంటూ ఆస్పత్రులకు తరలించే కష్టాలు తీరనున్నాయి. ఈ రోడ్డు పూర్తయితే పలు గ్రామాలకు ఉపయోగం. ఒడిశా వాసులకు సైతం రవాణా సౌకర్యం కలుగుతుంది. – తిరుమలరావు, సోవ్వ గ్రామం, డుంబ్రిగుడ మండలం -
ఎలక్ట్రిక్ బైక్ ఐడియా.. భలే ఉంది కదూ!
ఒంటెద్దు బళ్లు చూశాం గాని, ఒంటిచక్రం బండేమిటి? ఇదేదో సర్కస్ వ్యవహారం కాబోలనుకుంటున్నారా? ఇక్కడ ఫొటోలో కనిపిస్తున్న వాహనం అచ్చంగా ఒంటిచక్రం బండి. ఇది మోనోవీల్ ఎలక్ట్రిక్ బైక్. హోండా కంపెనీకి చెందిన డిజైనర్ నాషో ఆల్ఫోన్సో గార్షియా దీనికి రూపకల్పన చేశాడు. ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉండే నగరాల్లో ఇరుకిరుకు సందుల్లో కూడా తేలికగా ప్రయాణాలు సాగించడానికి ఈ వాహనం భేషుగ్గా ఉపయోగపడుతుందని గార్షియా చెబుతున్నాడు. దీనిని నడపడం పెద్దకష్టమేమీ కాదు. ఇందులో కాళ్లు మోపడానికి ఉండేచోటులో నిలుచుని, స్టార్ట్ చేస్తే చాలు. పడిపోతుందేమోననే భయం అక్కర్లేదు. ఇది పూర్తిగా సెల్ఫ్బ్యాలెన్సింగ్ వాహనం. హోండా సంస్థ ప్రస్తుతానికి దీనిని నమూనాగా మాత్రమే తయారు చేసింది. దీనిపై మరిన్ని పరీక్షలు విజయవంతమైతే, పూర్తిస్థాయి ఉత్పాదన ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి. -
చెన్నై నుంచి గాడిదల రవాణా.. ఆందోళనలో ప్రజలు
సాక్షి, ఒంగోలు: చెన్నై నుంచి మండలానికి పశువుల రవాణా జరుగుతుండటంతో స్థానిక ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇటీవల కాలంలో చెన్నై నుంచి వస్తున్న వారితో కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుండటంతో ఇక్కడి అధికారులు చెన్నై నుంచి వచ్చిన వారిని గుర్తించి క్వారంటైన్లో ఉంచుతున్నారు. కానీ ఆదివారం చెన్నై నుంచి గాడిదలను లారీలో తీసుకుని కందుకూరు జంక్షన్ ఫ్లైఓవర్ వద్ద కొంతమంది వ్యక్తులు వాటిని లారీ లోంచి దింపారు. అయితే వారు మాత్రం ఈ గాడిదలను ఆటోలో కనిగిరి ప్రాంతానికి తరలిస్తామని చెబుతుండగా, ఇది అవాస్తవమని ఇటీవల కాలంలో గాడిద మాంసం అమ్మకాలు మండల కేంద్రంలో జోరుగా జరుగుతున్నాయని ప్రజలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు ప్రత్యేక పెట్రోలింగ్ ఏర్పాటు చేసి ఇటువంటి పశువుల రవాణాను అడ్డుకుని, కరోనా వైరస్ ప్రబలకుండా చూడాలని ప్రజలు కోరుతున్నారు. చదవండి: మాతృదేవతా మన్నించు! -
అయ్యో ‘గోవిందా’.. ఇలా వెళ్లిపోయావా!
సాక్షి, హైదరాబాద్: లాక్డౌన్ కారణంగా రవాణా సౌకర్యాలు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇలాగే ఓ వ్యక్తి ఏకంగా ప్రాణాలు కోల్పోయాడు. అనారోగ్యం కారణంగా ఆస్పత్రికి వెళ్లేందుకు రవాణా లేక.. ఆరోగ్యం క్షీణించి ఆఖరుకు నడి రోడ్డుపైనే ప్రాణాలు విడిచిన హృదయ విదారక సంఘటన భాగ్యనగరం నడిబొడ్డున జరిగింది. బహదూర్ (75) అనే మద్యం దుకాణం ఉద్యోగి ఇదే రీతిలో మృత్యువాత పడిన సంఘటన మరువక ముందే ఈ ఉదంతం చోటుచేసుకోవడం నగరవాసులను కలవరపరుస్తోంది. బీదర్‌లోని బాల్కీ గ్రామానికి చెందిన గోవిందు (45) ట్రాక్టర్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. అతడికి భార్య పూజ, ఇద్దరు కుమార్తెలు, నెలన్నర వయసున్న కుమారుడు ఉన్నారు. బోడుప్పల్ పరిధి రాజశేఖర్ కాలనీలో నివాసముంటున్న గోవింద్.. ఏప్రిల్ రెండో వారంలో అనారోగ్యానికి గురయ్యాడు. తీవ్రమైన దగ్గు, జలుబు, ఆయాసంతో బాధపడుతుండటంతో ఇరుగు పొరుగు వారు గమనించి మేడిపల్లి పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు అతడిని ఏప్రిల్ 24న 108 సాయంతో కింగ్‌కోఠి ఆస్పత్రికి తరలించారు. అక్కడ పరీక్షించిన వైద్యులు.. కరోనా పరీక్షలు అవసరం లేదని, చెస్ట్ ఆస్పత్రికి వెళ్లాలని సిఫారసు లేఖ రాసి పంపారు. అక్కడికి వెళ్లేందుకు ఎలాంటి రవాణా దొరకలేదు. దీంతో చెస్ట్ ఆస్పత్రికి నడిచి వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. బొగ్గులకుంట చౌరస్తాలో గురువారం రాత్రి గోవిందు రోడ్డుపై పడిపోయాడు. గమనించిన ఓ వ్యక్తి సమాచారం ఇవ్వడంతో అక్కడికి చేరుకున్న నారాయణగూడ పోలీసులు గోవిందును పరీక్షించగా, మృతి చెందినట్లు గుర్తించారు. గోవిందు వద్ద ఉన్న కాగితాలను పరిశీలించి, బంధువులకు సమాచారం అందించడంతో కుటుంబసభ్యులు అక్కడికి చేరుకున్నారు. చదవండి: 17దాకా లాక్డౌన్.. సడలింపులివే..! పప్పా వెళ్లిపోతున్నాడు.. విగతజీవిగా పడి ఉన్న గోవిందును చూసి భార్య పూజ కన్నీరు మున్నీరయ్యింది. గోవిందు మృతదేహాన్ని అంబులెన్స్‌లో తీసుకెళ్తుండగా, ‘పప్పా..వెళ్లిపోతున్నాడు’అంటూ పిల్లలు రోదించడం అక్కడున్న వారిని కంటతడిపెట్టించింది. కాగా, తాను గత వారం రోజులుగా మేడిపల్లి పోలీసులకు ఫోన్ చేస్తూనే ఉన్నానని.. వారు తన భర్తకు కింగ్‌కోఠిలో చికిత్స అందిస్తున్నారనే చెప్పారని.. గురువారం ఉదయం కూడా వారి నుంచి అదే సమాధానం వచ్చిందని పూజ పేర్కొంది. -
ఏపీ: చకచకా పర్మిట్లు
సాక్షి, అమరావతి: నిత్యావసర వస్తువులు, పండ్లు, కూరగాయల రవాణాకు ఎటువంటి ఆటంకాలు లేకుండా అధికార యంత్రాంగం పూర్తిగా సహకరించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశించడంతో రాష్ట్రంలో ఉద్యాన పంటల ఎగుమతులకు మార్గం సుగమమైంది. రాష్ట్రం నుంచి ఏయే ప్రాంతాలకు పండ్లు, కూరగాయలు రవాణా అవుతాయో గుర్తించి ఇప్పటికే ఆయా రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో సీఎం సంప్రదింపులు జరపడంతో మంగళవారం నుంచి పెద్దఎత్తున పండ్లు, కూరగాయల ఎగుమతులు ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా.. ► నిల్వ ఉంచితే పాడైపోయే పచ్చి సరుకును గుర్తించి ఉద్యాన శాఖాధికారులు రైతులకు వెంటవెంటనే పర్మిట్లు ఇప్పిస్తున్నారు. ► అలాగే, మార్కెటింగ్, రెవెన్యూ శాఖాధికారుల సహకారంతో త్వరితగతిన వాహనాలను ఏర్పాటుచేస్తున్నారు. ► ఫలితంగా ఉద్యాన పంటలు పొలం నుంచి వినియోగదారుల దరికి చేరుతున్నాయి. ► రాయలసీమ జిల్లాల నుంచి అరటి, బత్తాయి, పుచ్చ, టమాటా, ద్రాక్ష.. కోస్తా జిల్లాల నుంచి మామిడి, నిమ్మ, బొప్పాయితో పాటు ఇతర జిల్లాల నుంచి కూరగాయలు వివిధ ప్రాంతాలకు రవాణా అవుతున్నట్లు ఉద్యాన శాఖ తెలిపింది. పండ్లు, కూరగాయలకు ప్రాధాన్యత ఇదిలా ఉంటే.. దళారీ వ్యవస్థను రూపుమాపే క్రమంలో ప్రభుత్వం పండ్లు, కూరగాయల వంటి వాటి రవాణాకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఆ శాఖాధికారులు చెబుతున్నారు. విపత్కర పరిస్థితుల్లో రైతులకు అండగా నిలవాలన్న ఉద్దేశంతో శక్తి వంచన లేకుండా కృషిచేస్తున్నామని ఉద్యాన శాఖ అధికారి రత్నకుమార్ చెప్పారు. అంతేకాక.. ► అనంతపురం జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి డీఆర్డీఏ సహకారంతో పెద్దఎత్తున అరటిని ఎగుమతి చేశామన్నారు. ► నూజివీడు నుంచి మామిడిని, మదనపల్లె నుంచి టమాటాను, నెల్లూరు నుంచి పుచ్చ, విజయనగరం, శ్రీకాకుళం నుంచి అరటి తదితర పంటలను ఇరుగు పొరుగు రాష్ట్రాలకు తరలించారు. ► ఇందుకు వ్యవసాయం, అనుబంధ రంగాలతో పాటు మార్కెటింగ్, రెవెన్యూ శాఖ కూడా ఎంతో తోడ్పడుతోందని హార్టికల్చర్ ఆఫీసర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు పి.హనుమంతరావు వివరించారు. ► పర్మిట్లు ఇప్పించడంలో, వాహనాలను సమకూర్చడంలో, సరుకును ఏయే ప్రాంతాలకు పంపవచ్చో విశ్లేషించడంలో ఉద్యాన శాఖ గ్రామ సహాయకులు, ఏడీఓలు, జేడీలు, డీడీ స్థాయి అధికారులు శక్తివంచన లేకుండా పనిచేస్తున్నారని చెప్పారు. ► కమిషనర్ చిరంజీవి చౌధురి కూడా ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ రైతుల ఇక్కట్లను తొలగించేలా సూచనలు ఇస్తున్నారన్నారు. ఎక్కడికక్కడ మిర్చి కొనుగోళ్లు కరోనా కేసులు వెలుగులోకి రావడం, రెడ్‌జోన్‌లో ఉన్న నేపథ్యంలో మిర్చి విక్రయాలను గుంటూరు యార్డుకు బదులుగా ఇతర ప్రాంతాల్లో నిర్వహించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. రోజుకు సగటున లక్ష టిక్కీల వరకు విక్రయాలు జరిగే గుంటూరు మార్కెట్ యార్డుకు రైతులు, వ్యాపారులు, హమాలీలు 10వేల మంది వస్తారు. భౌతిక దూరం పాటించే అవకాశాలు ఇక్కడ లేనందున ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తోంది. ► రైతులకు ఇబ్బంది లేకుండా కోల్డు స్టోరేజి ప్లాంట్లు, జిన్నింగ్ మిల్లులు, మార్కెట్ యార్డులు, గ్రామాల్లో మిర్చి విక్రయాలు జరిపేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మార్కెటింగ్‌శాఖ ప్రత్యేక కమిషనర్ ప్రద్యుమ్న వ్యాపారులు, ఎగుమతిదారులతో చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నారు. ► రాష్ట్రంలో 410 కోల్డు స్టోరేజి ప్లాంట్లు ఉండగా ఒక్క గుంటూరు జిల్లాలోనే 220 వరకు ఉన్నాయి. వీటితోపాటు జిన్నింగ్ మిల్లులు, మార్కెట్ యార్డుల్లో మిర్చి అమ్మకాలు చేపట్టనున్నారు. వ్యాపారులు, ఎగుమతిదారులు అక్కడే కొనుగోళ్లు చేపడతారు. ► ప్రస్తుతం దాదాపు 80 వేల టిక్కీలు రైతుల వద్దనే ఉన్నాయి. ► గత నెల మూడో వారం నుంచి మిర్చి అమ్మకాలు జరగకపోయినా ధరలో మార్పు లేకపోవటం రైతులకు కొంత ఊరట కలిగిస్తోంది. -
ప్రైవేటు రవాణావైపే మొగ్గు
సాక్షి, హైదరాబాద్: లాక్‌డౌన్‌తో ఉద్యోగ, ఉపాధి అవసరాల కోసం రోజూవారీగా రాకపోకలు సాగించే వారిపై కరోనా ప్రమాద తీవ్రత తగ్గిందని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నిర్వహించిన ఆన్లైన్ సర్వేలో వెల్లడైంది. దేశవ్యాప్తంగా లాక్డౌన్ ప్రకటించడానికి ముందు మార్చి మూడో వారంలో ప్రయాణికులు రాకపోకలు సాగించిన తీరుపై ఐఐటీ హైదరాబాద్, ఐఐటీ బాంబే సంయుక్త సర్వే నిర్వహించాయి. కరోనా లక్షణాలు బయటపడుతున్న సమయంలో ప్రయాణికులు తమ రాకపోకల్లో చేసుకున్న మార్పులకు ఈ సర్వే ఫలితాలు అద్దం పడుతున్నాయి. ఆన్లైన్ ప్రశ్నావళి ద్వారా దేశవ్యాప్తంగా 1,900 మందిని సర్వే చేసినట్లు ఐఐటీ విద్యార్థి బృందం ప్రకటించింది. ఇక ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలతో పోలిస్తే ప్రథమ శ్రేణి నగరాల్లో కరోనాపై ఎక్కువ అవగాహన ఉన్నట్లు సర్వేలో తేలింది. నిరుపేదలకు కరోనాపై అవగాహన కల్పించాల్సిన అవసరాన్ని కూడా సర్వే నొక్కి చెప్పింది.. సర్వేలో వెల్లడైన విషయాలు.. ► దేశంలో కరోనా లక్షణాలు బయట పడుతున్న సందర్భంలో మార్చి మూడో వారంలో రెగ్యులర్‌గా రాకపోకలు సాగించే ప్రయాణికులు చాలా మంది ప్రజారవాణా వ్యవస్థకు బదులుగా ప్రైవేటు రవాణా వ్యవస్థ వైపు మొగ్గు చూపారు. ప్రథమ శ్రేణి పట్టణాల్లో 12 శాతం, ద్వితీయ శ్రేణి పట్టణాల్లో 9 శాతం, తృతీయ శ్రేణి పట్టణాల్లో 7 శాతం మంది ప్రజా రవాణా వ్యవస్థను వదిలేసి ప్రైవేటు రవాణా వ్యవస్థలో ప్రయాణించారు. ► లాక్డౌన్ ప్రకటనకు ముందు మార్చి మూడో వారంలో 48 శాతం మంది ఉద్యోగాలకు వెళ్లకుండా ఇంటికే పరిమితం కాగా, 28 శాతం మంది మాత్రం ఎప్పటిలాగానే తమ విధులకు హాజరయ్యారు. మరో 24 శాతం మంది మాత్రం వారానికి రెండు, మూడు మార్లు మాత్రమే విధులకు వెళ్లి వచ్చారు. ► కరోనా భయంతో మార్చి మూడో వారంలో 18 శాతం మంది విమాన ప్రయాణాలను రద్దు చేసుకున్నారు. మరో 20.2 శాతం రైలు ప్రయాణాలు, 11.6 శాతం మంది బస్సు ప్రయాణాలు రద్దు చేసుకున్నట్లు సర్వేలో తేలింది. ► ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజా రవాణా వ్యవస్థ కంటే ప్రైవేటు వాహనాల్లో ప్రయాణం సురక్షితం అని 93 శాతం మంది అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇటు లాక్‌డౌన్‌కు ముందు ఏ తరహా వాహనాల్లో రాకపోకలు ఎక్కువగా సాగాయి. ట్రాఫిక్ రద్దీపై ప్రభావం వంటి అంశాలపైనా వివరాలు సేకరించినట్లు సర్వే బృందం వెల్లడించింది. -
కరోనా కిట్ల రవాణాకు ఎయిరిండియా విమానాలు
న్యూఢిల్లీ: లాక్డౌన్ నేపథ్యంలో రవాణావ్యవస్థ పూర్తిగా నిలిచిపోవడంతో కరోనా కిట్లను అత్యవసర ప్రాతిపదికన ఎయిరిండియా విమానాల ద్వారా ఆస్పత్రులకు అందిస్తున్నట్లు పౌర విమానయాన శాఖ మంత్రి హర్దీప్సింగ్ పూరి వెల్లడించారు. ఐసీఎంఆర్(ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్) రూపొందించిన కరోనా కిట్లను ఢిల్లీ నుంచి ఐజ్వాల్, కోల్‌కతా, హైదరాబాద్‌లకు ఇప్పటికే పంపాం. ముంబై నుంచి పుణే, బెంగళూరు, తిరువనంతపురంలకు .. కోల్‌కతా నుంచి దిబ్రూగర్‌కుకు పంపనున్నాం’అని ట్విట్టర్లో వివరించారు. -
బండి.. జోరు తగ్గిందండి!
సాక్షి, అమరావతి: ఆర్థిక మందగమనంతో దేశవ్యాప్తంగా వాహనాల విక్రయాలు భారీగా పడిపోయినా రాష్ట్రంలో కాస్త మెరుగ్గా ఉన్నట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. మొత్తం మీద వాహనాల విక్రయాలు తగ్గడంతో ఆ ప్రభావం రవాణా రంగం రాబడిపై పడింది. తొలి అర్థ సంవత్సరం అంటే ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు రవాణా రంగం ఆదాయం భారీగా తగ్గింది. తొలి త్రైమాసికం (ఏప్రిల్ – జూన్)లో సమకూరిన రాబడి గత ఏడాదితో పోల్చి చూస్తే 11.81 శాతం మేర తగ్గింది. రెండో త్రైమాసికం (జూలై – సెప్టెంబర్)లో రాబడి గత ఏడాదితో పోలిస్తే 12.42 శాతం తగ్గింది. అక్టోబర్‌లో కొంత పుంజుకున్నా గత ఏడాదితో పోల్చి చూస్తే మాత్రం 6.83 శాతం తగ్గింది. ‘వాహనమిత్ర’తో జోరుగా ఆటోల విక్రయాలు! ఆర్థిక మాంద్యంలోనూ రాష్ట్రంలో ఆటోల విక్రయాలు పెరగడం గమనార్హం. గత ఏడాది ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు విక్రయాలను పోల్చి చూస్తే ఈ ఏడాది ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు రాష్ట్రంలో ఆటోల అమ్మకాలు 19.32 శాతం మేర పెరిగాయి. ఇదే సమయంలో దేశవ్యాప్తంగా ఆటోల అమ్మకాలు 6.37 శాతం మేర తగ్గాయి. సొంతంగా ఆటో నడుపుకొనే వారికి ఏటా రూ.పది వేల చొప్పున ఆర్థిక సాయం అందిస్తామని ముఖ్యమంత్రి జగన్ ప్రకటించిన నేపథ్యంలో ఇప్పటికే ‘వైఎస్సార్ వాహనమిత్ర’ పథకం ద్వారా ఆర్థ్ధిక సాయాన్ని లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశారు. స్వయం ఉపాధి కోసం రాష్ట్రంలో పేద, దిగువ మధ్య తరగతి వారు ఎక్కువ మంది ఆటోలను కొనుగోలు చేసినట్లు అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. ఆర్థిక మందగమనమే కారణం గత ఆరేడు నెలలుగా ద్విచక్ర వాహనాల విక్రయాలు బాగా తగ్గాయి. దీనికి ప్రధాన కారణం ఆర్థిక మంద గమనమే. దేశవ్యాప్తంగా పోలిస్తే రాష్ట్రంలో పరిస్థితి కొంత మెరుగ్గా ఉంది. ఈసారి అక్టోబర్‌లో పండగ సీజన్లో కూడా కార్ల అమ్మకాలు పెరగలేదు. డిసెంబర్లో కూడా పరిస్థితి ఇలాగే ఉండవచ్చని భావిస్తున్నాం. ఇక ఆశలన్నీ కొత్త ఏడాదిపైనే. ఆటోల విక్రయాలు ప్రతి మూడు నాలుగేళ్లకు ఒక వలయం మాదిరిగా ఉంటాయి. మావద్ద బజాజ్ ఆటోల విక్రయాలు వంద శాతం పెరిగాయి. రాష్ట్ర ప్రభుత్వం వైఎస్సార్ వాహనమిత్ర పథకం ద్వారా ఆర్థిక సాయం అందిస్తుండటం కూడా విక్రయాలు పెరగడానికి కారణం. డౌన్ పేమెంట్ కింద రూ.25 వేలు చెల్లించాల్సి ఉండగా వాహన మిత్ర ద్వారా ప్రభుత్వం రూ.10 వేలు చొప్పున సాయం అందిస్తుండటంతో స్వయం ఉపాధి కోసం ఎక్కువ మంది కొనుగోలు చేస్తున్నారు – సత్యనారాయణ (డైరెక్టర్, వరుణ్ మోటార్స్) -
ఇసుక తవ్వకాలు, రవాణాపై సీఎం జగన్ సమీక్ష
సాక్షి, అమరావతి: ఇసుక వినియోగదారులు తమ వ్యక్తిగత అవసరాలకు మించి ఇసుకను నిల్వచేయడానికి వీల్లేదని.. నిల్వచేసే వ్యక్తులపై గ్రామ సచివాలయమే తగిన చర్యలు తీసుకుంటుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. ఇసుక కొరతపై సచివాలయంలో బుధవారం జరిగిన సమీక్షా సమావేశంలో ఈ మేరకు సీఎం వ్యాఖ్యానించారు. 3 నెలల కాలానికి ఇసుక తవ్వకాలు, రవాణాపై సీఎం కీలక ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా ఇసుక లభ్యత, డిమాండ్‌పై అధికారుల నుంచి సీఎం వివరాలు తెలుసుకున్నారు. నదుల్లో ప్రవాహాలు తగ్గకపోవడం వల్ల ఇసుక కొరత ఏర్పడిందన్న అధికారులు 55 రోజలు నుంచి గోదావరి, 71 రోజుల నుంచి కృష్ణానది పొంగి ప్రవహిస్తున్నాయని సీఎం దృష్టికి తీసుకువచ్చారు. తుంగభద్ర పరీవాహక ప్రాంతాల్లో రికార్డు స్థాయిలో 400–500 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయిందని, వంశధార, పెన్నా నదుల్లో కూడా కొనసాగుతున్న వరద ప్రవాహం, మరోవైపు భారీవర్షాలు కురుస్తూనే ఉన్నాయిని తెలిపారు. ఫలితంగా ఇసుక లభ్యత ఉండే ప్రాంతాల నుంచి తవ్వకాలు చేయలేకపోతున్నామని సీఎంకు తెలియజేశారు. ఇసుక రీచ్‌ల వద్దకు వాహనాలు కూడా వెళ్లలేని పరిస్థితి ఉందని నివేదించిన అధికారులు 200కుపైగా రీచ్‌లను గుర్తిస్తే ప్రస్తుతం 69 చోట్లనుంచే వెలికి తీయగలుగుతున్నామని అధికారులు పేర్కొన్నారు. దీంతో ప్రధాన నదుల్లో ప్రవాహాలు తగ్గకుంటే.. ఎక్కడ సాధ్యమవుతుందో, ఆయా ప్రాంతాలను గుర్తించాలని ముఖ్యమంత్రి సూచించారు. గ్రామ సెక్రటేరియట్ల ద్వారా జరిగితే... అవినీతికి ఆస్కారం లేకుండా ఉంటుందని సీఎం అన్నారు. ఈ విషయంలో గ్రామసచివాలయాలను సమర్థవంతంగా వాడుకోవాలన్న సీఎం.. 3 నెలల కాలానికి ఎలాంటి విధానాలు అనుసరించాలన్న దానిపై సమావేశంలో విస్తృతంగా చర్చించారు. అవినీతి లేకుండా, పర్యావరణానికి నష్టం రాకుండా చూడాలని అధికారులకు ముఖ్యమంత్రి ఆదేశాలు జారీచేశారు. 3 నెలల కాలానికి ఇసుక తవ్వకాలు, రవాణాపై తాజా మార్గదర్శకాలు: ఇసుక లభ్యతను పెంచేందుకు ప్రభుత్వం తాజాగా ఆదేశాలు జారీ చేసింది. ప్రధాన నదుల్లో ప్రవాహాలు తగ్గకపోవడంతో అందుబాటులో ఉన్న వాగులూ, వంకలూ, నదుల్లో ఇసుక లభ్యతను గుర్తించాలని ఆదేశించారు. ఈ మేరకు గ్రామాల వారీగా గుర్తించాలని కలెక్టర్లకు సూచించారు. కీలక మార్గదర్శకాలు.. ‘రీచ్‌ల్లో పర్యవేక్షణ గ్రామవాలంటీర్‌కు అప్పగించనున్న గ్రామ సచివాలయం. రవాణా చేస్తున్న వాహనాలు, తరలిస్తున్న పరిమాణంపై రికార్డు చేయనున్న వాలంటీర్. ఏపీ వాల్టా చట్టానికి అనుగుణంగా తవ్వకాలు జరిగేలా సమన్వయపరచనున్న ఏపీఎండీసీ. రవాణా చేస్తున్న వాహనానికి ఎస్–3 ఫాంను జారీచేయనున్న గ్రామ సెక్రటేరియట్ ఇన్‌ఛార్జి, డూప్లికేట్ రశీదు మాత్రమే ఇవ్వనున్న గ్రామ సచివాలయ ఇన్‌ఛార్జి. ఈ ఫాంను వాడినా, వాడకున్నా కాలపరిమితి 48 గంటలే ఉంటుంది. వాడకపోయినా డబ్బు తిరిగి చెల్లించరు. తిరిగి వాడుకునేందుకూ వీలుకాదు. ఇసుక రవాణాచేస్తున్న ట్రాక్టర్లకు 20 కి.మీ వరకే అనుమతి ఉంటుంది. వాణిజ్య అవసరాలకు కాకుండా స్థానిక అవసరాలకు ఈ ఇసుక వినియోగించాలని షరతు విధిస్తారు. ఏపీ వాల్టా చట్టం ప్రకారం ఇసుక తవ్వకాల్లో ఎలాంటి యంత్రాలను వినియోగించరాదు. కేవలం మానవ వనరులను మాత్రమే వినియోగించాలి. సరఫరా చేస్తున్న ఇసుకకు సంబంధించి వినియోగాన్ని గ్రామ సచివాలయమే పరిశీలించాలి. ఇసుక లభ్యత కోసం తీసుకున్న పై తాజా నిర్ణయాలు 3 నెలల కాలం వరకే అమలవుతాయి. తర్వాత సమీక్షించి తదుపరి నిర్ణయం ప్రభుత్వం తీసుకుంటుంది. ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయాలను ఆయా జిల్లా కలెక్టర్లు విస్తృతంగా ప్రచారం చేయాలి’ అంటూ కీలక మార్గదర్శకాలను జారీచేశారు. -
మౌలిక పెట్టుబడులపై భారీ నజర్
న్యూఢిల్లీ: ప్రపంచంలో బలమైన ఆర్థిక శక్తుల సరసన నిలిచే బలమైన లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించింది. ఇందుకోసం దేశంలో మౌలిక వసతులను ప్రపంచస్థాయికి తీసుకురావడంపై ప్రత్యేక దృష్టి సారించింది. మౌలిక వసతులు, డిజిటల్ ఎకానమీ, ఉద్యోగ కల్పన ద్వారా ఈ లక్ష్యాన్ని సాధించేదిశగా దూసుకెళ్తున్నామని మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. గ్రామాలు–పట్టణాల మధ్య నెలకొన్న దూరాన్ని చెరిపేస్తూ.. వీటిని కలిపే కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇస్తామని ఆమె తెలిపారు. ‘సరైన అనుసంధానతే ఆర్థిక వ్యవస్థకు జీవనాడి. అందుకే మౌలికవసతుల కల్పనకు ఏడాదికి రూ.20లక్షలకోట్లు ఖర్చు అవుతాయని అంచనా వేస్తున్నాం. ఈ దిశగా ఆర్థిక సహకారం కోసం క్రెడిట్ గ్యారెంటీ ఎన్హాన్స్మెంట్ కార్పొరేషన్‌ను ఏర్పాటుచేస్తాం. ఇందుకు సంబంధించి ఆర్బీఐ నియమ నిబంధనలు రూపొందిస్తోంది’అని మంత్రి స్పష్టం చేశారు. ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన కింద రూ.80,250కోట్ల వ్యయంతో 1.25 లక్షల కిలోమీటర్ల గ్రామీణ రోడ్లను నిర్మించనున్నట్లు తెలిపారు. పీఎంజీఎస్‌వైతో అనుసంధానత గ్రామీణ ప్రాంతాల్లో సామాజిక–ఆర్థికపరమైన సానుకూలమార్పులు తీసుకురావడంతోపాటు అన్నిరకాల వాతావరణాల్లోనూ పట్టణ ప్రాంతాలతో అనుసంధానత విషయంలో ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన ద్వారా ఎన్నో మార్పులు తీసుకొచ్చామన్నారు. జాతీయ రహదారుల గ్రిడ్‌ను ఏర్పాటుచేసే యోచనలోనూ ఉన్నట్లు చెప్పారు. 2018–19లో మొత్తం 300 కిలోమీటర్ల మేర మెట్రోలైన్లకోసం అనుమతులు ఇచ్చామన్న మంత్రి.. దేశవ్యాప్తంగా 657 కిలోమీటర్ల మెట్రోరైల్ నెట్వర్క్ వినియోగంలోకి వచ్చిందన్నారు. నేషనల్ కామన్ మొబిలిటీ కార్డు (ఎన్సీఎమ్సీ) ప్రమాణాలతో అందుబాటులోకి తీసుకొచ్చిన చెల్లింపుల వ్యవస్థ ద్వారా 2019 నుంచి మెట్రో సేవలు, టోల్ టాక్స్‌ల వద్ద వినియోగదారులకు సౌకర్యవంతంగా ఉంటుందన్నారు. రైల్వేలకు రూ.50 లక్షల కోట్లు! 2018–30 మధ్య రైల్వేల్లో మౌలిక వసతులకల్పనకు రూ.50లక్షల కోట్ల పెట్టుబడుల అవసరముందని సీతారామన్ పేర్కొన్నారు. వివిధ కేంద్ర మంత్రిత్వ శాఖలు, కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలకున్న స్థలాల్లో.. ప్రజలకు అవసరమైన వసతుల నిర్మాణాలను చేపట్టే యోచన ఉందని ఆమె తెలిపారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులకు ఆర్థికసాయం విషయంలో వినూత్నంగా ముందుకెళ్లాల్సిన అవసరం ఉందన్న మంత్రి.. పూర్తయిన ప్రాజెక్టులను విక్రయించుకోవడం (బ్రౌన్‌ఫీల్డ్ అసెట్ మానిటైజేషన్) ద్వారా ఆర్థిక సమస్యలనుంచి బయటపడే విషయంలో భారత్ సానుకూల ఫలితాలను సాధించిందని వెల్లడించారు. విమానయానానికీ ఊతం పౌరవిమానయాన రంగాన్ని ప్రోత్సహించడంతోపాటుగా.. రోడ్లు, జలమార్గాలు, మెట్రో, రైలు రవాణా వ్యవస్థను మరింతగా ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. పీఎం గ్రామ సడక్ యోజన, పారిశ్రామిక కారిడార్లు, సరుకుల రవాణాకు ప్రత్యేక కారిడార్లు, భారత్‌మాల, సాగరమాల, జల్‌మార్గ్ వికాస్, ఉడాన్ వంటి పథకాను తీసుకొచ్చామని నిర్మల గుర్తుచేశారు. ‘సామాన్యులకు సేవలందించేందుకు భారీ మౌలికవసతుల సంస్కరణలను తీసుకొచ్చాం. ఈ సంస్కరణలు కొనసాగేందుకు నిర్మాణ, మౌలికవసతుల రంగంతోపాటు, డిజిటల్ ఎకానమీ, చిన్న–మధ్యతరహా సంస్థల్లో ఉద్యోగ కల్పన కోసం మరిన్ని పెట్టుబడులు పెట్టాల్సిన అవసరం ఉంది’అని మంత్రి వెల్లడించారు. భారత్‌మాల,సాగరమాలతో.. భారత్‌మాల కార్యక్రమం ద్వారా జాతీయ రహదారుల కారిడార్లు, హైవేలను కలుపుతుండగా.. సాగరమాల ప్రాజెక్టు ద్వారా పోర్టుల మధ్య అనుసంధానత పెరుగడంతోపాటు.. పోర్టు ఆధారిత పారిశ్రామికీకరణ ఆధునీకరించబడుతోంది. జల్‌మార్గ్ వికాస్ ప్రాజెక్టు ద్వారా జాతీయ జలమార్గాలను నిర్మించడంతోపాటు జల రవాణాను మరింతగా ప్రోత్సహించే కార్యక్రమాలను కేంద్రం చేపట్టింది. రైలు, రోడ్డుమార్గాలకంటే అంతర్గత జలరవాణా ద్వారానే రవాణా వ్యయం తగ్గుతుంది. తద్వారా దేశీయంగా తయారైన వస్తువుల మధ్య తీవ్రమైన పోటీ ఉంటుందని కేంద్రం భావిస్తోంది. 2018 నవంబర్‌లో వారణాసిలో గంగానదిపై జలరవాణా టెర్మినల్ ప్రారంభం వినియోగంలోకి వచ్చింది. 2019–20ల్లోగా షాహిబ్‌గంజ్, హల్దియాల్లో టెర్మినల్స్ పూర్తవుతాయని మంత్రి వెల్లడించారు. వచ్చే నాలుగేళ్లలో గంగానదిపై కార్గోల ద్వారా రవాణా నాలుగురెట్లు పెరుగుతుందని ఆమె అభిప్రాయపడ్డారు. ఉడాన్ పథకం ద్వారా గ్రామీణ–పట్టణ తేడాలను కలిపేసే ప్రయత్నం జరుగుతోందని మంత్రి తెలిపారు. ప్రపంచంలోనే మూడో అతిపెద్ద విమానయాన మార్కెట్‌గా ఉన్న భారత్.. విమాన కొనుగోలుకు ఆర్థికసాయం అందించడంతోపాటు భారత గడ్డపైనుంచి విమానసేవలను ప్రారంభించేందుకు అవసరమైన ‘లీజింగ్’కార్యకలాపాలకు ప్రోత్సాహం అందించనున్నట్లు నిర్మల తెలిపారు. -
అది నిరుద్యోగ మహిళలకు కేజ్రివాల్ వరం
సాక్షి, న్యూఢిల్లీ : 23 ఏళ్ల డేటా ఎంట్రీ ఎగ్జిక్యూటివ్ షీలా ఓ రోజు కొంచెం ఆలస్యంగా ఆఫీసుకు బయల్దేరింది. తానెక్కిని మినీ బస్సు ఆఫీసుకు సమీపంలోకి రాగానే ముందు వైపున్న ఫుట్‌బోర్డు పైకి వెళ్లింది. కొంచెం బస్సును స్లో చేస్తే తాను ఆఫీసు ముందు దిగిపోతానని డ్రైవర్‌ను కోరింది. అదేమి వినిపించుకోని డ్రైవర్ అలాగే బస్టాప్ వైపు బస్సును తీసుకెళుతున్నారు. అక్కడి నుంచి మళ్లీ వెనక్కి రావాలంటే పదిహేను నిమిషాలు పడుతుంది. బస్సు ఈ లోగా కొంచెం స్లోకాగానే ఆమె ఏమీ ఆలోచించకుండా అందులో నుంచి దూకేసింది. అదుపు తప్పి కింద పడిపోయింది. కుడి మోచేతి, ఎడమ మోకాలు కొట్టుకు పోయాయి. అలాగే ఆఫీసుకు వెళ్లి ప్రథమ చికిత్స అనంతరం సెలవు పెట్టి ఇంటికి వెళ్లింది. దక్షిణ్పురిలోని తన ఇంటి నుంచి దక్షిణ ఢిల్లీలోని ఓఖ్లా ఫేస్ వన్‌లోని ఆఫీసుకు షీలా ప్రతి రోజు గ్రామీణ సేవా మినీ బస్సు ఎక్కి వెళ్లాల్సి వస్తోంది. ఇందుకు ఆమెకు పోను ఐదు రూపాయలు, రాను ఐదు రూపాయలు బస్సు ఛార్జీలు అవుతున్నాయి. అదే ఆటోలో వెళ్లాలంటే పోను, రాను 20 రూపాయలు సమర్పించుకోవాలి. ఢిల్లీ నగరంలో 3,900 బస్సులు ఉన్నప్పటికీ, 373 కిలోమీటర్ల మెట్రో రైలు నెట్వర్క్ ఉన్నప్పటికీ షీలాకు అందుబాటులో ఉన్న బస్సు సౌకర్యం ఇదే. అంటే అంతకన్నా ఆమె ఎక్కువ డబ్బులు ప్రయాణానికి ఖర్చు పెట్టలేదు. షీలా లాంటి వాళ్లు నగరంలో చాలా మంది ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లోనే రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ నగరంలోని బస్సుల్లో, మెట్రో రైళ్లలో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు. మహిళలు విద్యాలయాలు, ఆఫీసులకు, మార్కెట్లకు వెళ్లేందుకు ఈ నిర్ణయం ఎంతో తోడ్పడుతోందన్న ఉద్దేశంతో కేజ్రివాల్ ఈ నిర్ణయం తీసుకున్నారు. కానీ ఉద్యోగాల కోసం ఆఫీసుల చుట్టూ తిరిగేందుకు ఈ ఉచిత ప్రయాణ సౌకర్యం ఎక్కువగా ఉపయోగపడేలా ఉంది. పట్టణాల్లోనే మహిళలకు ఎక్కువ ఉద్యోగావకాశాలు ఉంటాయని మనకు తెలుసు. కానీ ఆశ్చర్యంగా గ్రామీణ ప్రాంతాల్లోనే ఎక్కువ మంది మహిళలు ఏదో ఒక పనికి వెళుతున్నారు. ఢిల్లీ కూడా అందుకు విరుద్ధం ఏమీ కాదు. ఢిల్లీలో దాదాపు రెండు కోట్ల మంది ప్రజలు నివసిస్తున్నారు. ఎత్తయిన బహుళ అంతస్తు కార్యాలయాలు, మాల్స్, హోటళ్లు, కేఫ్‌లు ఎప్పుడు కిక్కిరిసి కనిపిస్తుంటాయి. కానీ 15 ఏళ్లు దాటిన 11.7 శాతం స్త్రీలు మాత్రమే ఉద్యోగం చేస్తున్నారు. జాతీయంగా మహిళలు సరాసరి 27 శాతం మంది పనిచేస్తుండగా అందులో ఢిల్లీలో పనిచేస్తున్న మహిళల సంఖ్య సగం కూడా లేక పోవడం ఆశ్చర్యం కల్పిస్తోంది. ఇంటిపట్టున ఉంటున్న చాలా మంది మహిళలను ఉద్యోగం విషయంలో కదిలించగా, ఉద్యోగాలకు అప్లై చేయడానికి డబ్బులు లేవని, అప్లై చేసినా అంతంత దూరం ఇంటర్వ్యూలకు వెళ్లేందుకు ఇట్లో డబ్బులివ్వరని చెప్పారు. ముఖ్యంగా పెళ్లి చేసుకొని ఉద్యోగం చేయాలనుకుంటున్న మహిళల బాధ మరోలా ఉంది. చాలీ చాలీ జీతాలు అందుకుంటున్న భర్తలు డబ్బులివ్వలేరని, ఉండి ఇద్దామనుకున్న భర్తలను అత్తామామలు వారిస్తున్నారని, వారికి తాము ఉద్యోగం చేయడం ఇష్టంలేకేనని చెప్పారు. కేజ్రివాల్ తీసుకున్న నిర్ణయం వల్ల తాము ఇప్పుడు ఎక్కడికైనా స్వతంత్రంగా వెళ్లి ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేందుకు మంచి అవకాశం వచ్చిందిన షీలా, సుషా, రాధ తదితరులు తెలిపారు. -
అప్రెంటీస్‌లే ఆయువు!
సాక్షి, హైదరాబాద్: కండిషన్లో ఉంటేనే ఆర్టీసీ బస్సు రోడ్డుపై సరిగ్గా పరుగుపెడుతుంది, క్షేమంగా ప్రయాణికులను గమ్యాలకు చేరుస్తుంది. కీలకమైన ఆర్టీసీ బస్సుల భద్రతా ప్రమాణాలు ఇప్పుడు ఐటీఐ విద్యార్థులపై ఆధారపడి ఉన్నాయి. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా, ఆర్టీసీలో పరిస్థితి ఇలాగే ఉంది. బస్సు ఎక్కి కూర్చుంటే మనకు అంతాడ్రైవర్ చేతిలోనే ఉన్నట్టు అనిపిస్తుంది. కానీ బస్సు డ్రైవర్ చేతికి వచ్చేముందు దాన్ని సిద్ధం చేసేది డిపో గ్యారేజీ కార్మికులే. బస్సు ఇంజన్ మొదలు, బ్రేకులు, బాడీ, సీట్లు.. ఇలా అన్నింటిని పరీక్షించేది ఈ కార్మికులే. వీరు పచ్చజెండా ఊపిన తర్వాతనే బస్సు డిపో నుంచి బయటకు వస్తుంది. వీరు లేకుంటే బస్సు డిపోకు పరిమితం కావాల్సిందే. కానీ చాలా డిపోల్లో ఈ కేటగిరీ కార్మికుల సంఖ్య తక్కువగా ఉంది. దాదాపు ఏడేళ్లుగా ఆర్టీసీలో నియామకాలు లేకపోవటంతో ఖాళీలు ఏర్పడి క్రమంగా వాటి సంఖ్య భారీగా పెరుగుతూ వస్తోంది. ఇప్పుడు ఆర్టీసీలో దాదాపు వేయికి పైగా ఇలాంటి కార్మికుల కొరత ఉంది. మరి వీరి సంఖ్య ఇంత తక్కువగా ఉంటే బస్సులు కండిషన్లో ఎలా ఉంటున్నాయన్న సందేహం వస్తుంది. కానీ బస్సులు కండీషన్ తప్పకుండా వాటిని కాపాడటంలో ఐటీఐ విద్యార్థులు కీలక భూమిక పోషిస్తున్నారు. అప్రెంటిస్ షిప్‌తో ఆదుకుంటున్నారు ఐటీఐలో చేరుతున్న విద్యార్థుల్లో డీజిల్ మెకానిక్ ట్రేడ్‌పై ఆసక్తి చూపే వారు ఎక్కువ. దీంతోపాటు మోటార్ మెకానిక్, ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, డ్రాఫ్ట్‌మన్, వెల్డర్ లాంటి ట్రేడ్స్లోనూ చాలామంది చేరతారు. ఇవన్నీ ఆర్టీసీ డిపో గ్యారేజీల్లో అవసరమైనవే. ఆ కోర్సుల్లో భాగంగా చివరలో రెండేళ్లపాటు విద్యార్థులు ఏదైనా నిర్ధారిత సంస్థలో అప్రెంటిస్ షిప్ చేయాల్సి ఉంటుంది. బీహెచ్ఈఎల్, హెచ్ఎల్ లాంటి సంస్థలతో పాటు ఆర్టీసీ కూడా ఆ జాబితాలో ఉంది. కోర్సులో భాగంగా అప్రెంటిస్‌షిప్ ఎక్కడ చేయాలను కుంటు న్నారో విద్యార్థులు ఎంచుకునే వెసులుబాటు ఉంటుంది. ఇందులో భాగంగా ఇంజన్ మెకానిక్కు సంబంధించి చాలామంది ఆర్టీసీలో అప్రెంటిస్‌షిప్ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇక్కడ చేస్తే భవిష్యత్తులో అందులో ఉద్యోగావకాశం ఉంటుందన్న ఆశనే దానికి కారణం. ప్రస్తుతం అలా ఆర్టీసీలో మూడున్నరవేల మంది ఐటీఐ విద్యార్థులు అప్రెంటిస్‌షిప్ చేస్తున్నారు. వీరికి విడతలవారీగా పరీక్షలు నిర్వహిస్తే కేంద్ర ప్రభుత్వ అదీనంలోని స్కిల్ డెవలప్మెంట్ సంస్థ సర్టిఫికెట్లు అందజేస్తుంది. ఆ తర్వాత వారు ఉద్యోగాన్వేషణ ప్రారంభిస్తారు. ఇలా అప్రెంటిస్‌షిప్ కోసం రెండేళ్ల కాలపరిమితితో ఆర్టీసీలో పనిచేసేవారు బస్సులు కండిషన్లో ఉంచటంలో కీలకంగా మారారు. కొన్ని డిపోల్లో బస్సులను సకాలంలో సిద్ధం చేయటం కుదరనంత ఇబ్బంది ఉంది. ఈ సమస్యకు ఐటీఐ విద్యార్థులు చెక్ పెడుతున్నారు. ఆర్టీసీ కార్మికులకు వీరు ప్రధాన సహాయకులుగా మారి కొన్ని నెలల్లోనే మెకానిక్‌ల స్థాయిలో పనిచేస్తున్నారు. రెండేళ్లపాటు పనిచేయాల్సి ఉన్నందున ఈలోపు పూర్తి పని నేర్చుకుంటున్నారు. సిబ్బంది లేక ఇబ్బంది పడుతున్న ఆర్టీసీని వీరు ఆదుకుంటున్నారు. వీరు లేకుంటే బస్సులు కదిలే పరిస్థితి లేదు. కేవలం ఏడు వేల స్టైఫండ్‌తో వారు పని చేస్తుండటం ఆర్టీసీకి కూడా భారంగా లేకపోవటంతో సిబ్బంది నియామకం లేకుండానే వీరి పుణ్యంతో ఆర్టీసీ నెట్టుకొస్తోంది. ఇంతా చేస్తే ఉద్యోగం రాదు.. ఆర్టీసీలో ఉద్యోగం దక్కుతుందన్న ఆశతో ఇక్కడ అప్రెంటిస్‌షిప్ చేసేందుకు వచ్చే ఐటీఐ విద్యార్థులకు చివరకు నిరాశే మిగులుతోంది. ఇక్కడ ఖాళీలున్నా.. సిబ్బంది నియా మకానికి ప్రభుత్వం ఆమోదం లేకపోవటంతో భర్తీ ప్రక్రియ ఉండటం లేదు. అప్రెంటిస్‌షిప్ పూర్తయ్యాక సర్టిఫికెట్ తీసుకుని వెళ్లిపోవటం తప్ప ప్రయోజనం ఉండటం లేదు. భవిష్యత్తులో భర్తీ ప్రక్రియ ఉంటే వీరికి 10% వెయిటేజీ ఉంటుంది. కానీ ఏడేళ్లుగా నియామకాలు లేనందున ఆ అవకాశం ఎప్పు డొస్తుందో తెలియక వారు నిరాశగా వెనుదిరుగుతు న్నారు. వీరికి ఉద్యోగం కావాలి.. ఆర్టీసీకి ఉద్యోగులు కావాలి... ఇలా 2 అవకాశాలు ఉన్నా ప్రభుత్వం దృష్టి పెట్టడం లేదు. ప్రస్తుతం వీరికి స్టైఫండ్‌గా చెల్లిస్తున్న 7 వేలను రెట్టింపు చేస్తే వారి జీతాలు చెల్లించొచ్చు. ఆ మొత్తాన్ని ప్రభుత్వం సమ కూర్చగలిగితే సరి పోతుంది. ఇదే విషయాన్ని ఆర్టీసీ అధికారు లు కోరుతున్నా ఇప్పటి వరకు ప్రభుత్వం అవకాశం కల్పించ టం లేదు. వీరి బదులు దాదాపు అంతే మొత్తం చెల్లించి ఔట్ సోర్సింగ్ కింద సిబ్బందిని అడపాదడపా తీసుకుంటున్నా రు. కానీ సంబంధిత కాంట్రాక్టర్ సిబ్బందికి కేవలం 9 వేలే చెల్లిస్తున్నాడు. ఆ డబ్బులు సరిపోక ఆ సిబ్బంది సరిగా పని చేయటం లేదు. దీని వల్ల కాంట్రాక్టర్ లబ్ది పొందటం తప్ప ఇటు ఆర్టీసీ, అటు ఉద్యోగులకు ఉపయోగం ఉండటం లేదు. ప్రస్తుతం 3 రోజులుగా దాదాపు వెయ్యి మంది ఐటీఐ విద్యార్థులు అప్రెంటిస్‌షిప్ పూర్తిచేసుకుని పరీక్షలు రాస్తున్నారు. వీరిలో చాలా మంది తమకు ఉద్యోగావకాశం కల్పించాలని కనిపించిన అధికారినల్లా కోరుతున్నారు. -
నదీజల మార్గాలపై దృష్టి
సాక్షి, హైదరాబాద్: కేంద్రంలో కొత్తగా ఏర్పాటయ్యే ప్రభుత్వం నదీజల మార్గాలపై దృష్టి సారించాలని టీఆర్ఎస్ కార్య నిర్వాహక అధ్యక్షులు కేటీఆర్ సూచించారు. రోడ్డు, రైలు, వాయు మార్గాలతో పోలిస్తే నదీ జలమార్గాల ద్వారా తక్కువ ఖర్చుతో సరుకుల రవాణా చేయవచ్చన్నారు. తెలంగాణ వంటి రాష్ట్రాలకు నదీజల రవాణా ఎంతో మేలు చేస్తుందని పేర్కొన్నారు. మంగళవారం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు హోటల్లో ఒడిస్సీ లాజిస్టిక్స్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతి థిగా కేటీఆర్ పాల్గొన్నారు. 1952–2014 మధ్యకాలంలో తెలంగాణలో 2,600 కి.మీ పొడవైన రహదారులు ఉండగా, గత ఐదేళ్లలో మరో 2,800 కి.మీ మేర జాతీయ రహదారులను కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి సాధించామన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉత్పత్తి రంగంలో క్రమంగా వ్యయం పెరుగుతోందని, రాబోయే రోజుల్లో ఉత్పత్తి రంగంలో భారత్‌కు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని కేటీఆర్ అన్నారు. ప్రపంచవ్యాప్తంగా వినియోగిస్తున్న మానవ వ్యాక్సి న్లలో మూడోవంతు హైదరాబాద్‌లోనే తయారు చేస్తున్నారన్నారు. రాబోయే రోజుల్లో ఫార్మా, వ్యాక్సిన్, వైద్య ఉపకరణాలు తదితర రంగాలకు సంబంధించి హైదరాబాద్ నుంచి ఎగుమతులు పెరగనున్నట్లు కేటీఆర్ వెల్లడించారు. ఫార్మాసిటీ పనులు వేగవంతం చేస్తాం.. రాష్ట్రంలో ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే 19వేల ఎకరాల్లో ఏర్పాటు చేయనున్న హైదరాబాద్ ఫార్మాసిటీ పనులు వేగవంతం చేస్తామని కేటీఆర్ తెలిపా రు. ఫార్మాసిటీకి అనుబంధంగా ఏర్పాటయ్యే పరిశ్రమలతో లాజిస్టిక్స్ రంగానికి మరింత ఊపు వస్తుందన్నారు. తద్వారా రాష్ట్రంలో ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయన్నారు. హైదరాబాద్ పరిసరాల్లో ఇప్పటికే హెచ్ఎండీఏ 2 లాజిస్టిక్స్ పార్కులను నిర్మిస్తోందని, మరో 6 లాజిస్టిక్స్ పార్కులను ఔటర్‌రింగు సమీపంలో నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు కేటీఆర్ ప్రకటించారు. కార్యక్రమంలో వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి వేణుగోపాలాచారి, పరిశ్రమలశాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్, శ్రీనివాస్ గుప్తా, అభిషేక్ ఠాకూర్, విఘ్నేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
డ్రోన్ల శక్తి పెరిగింది....
శాన్ఫ్రాన్సిస్కో కేంద్రంగా పనిచేస్తున్న స్టార్టప్ కంపెనీ ఎల్రాయ్.. ఏకంగా 250 కిలోల బరువును మోసుకెళ్లగలిగే డ్రోన్లను సిద్ధం చేసింది. వస్తువుల రవాణాకు ఉపయోగపడే డ్రోన్లు ఇప్పటికే కొన్ని అందుబాటులో ఉన్నప్పటికీ అవన్నీ కేవలం పది, ఇరవై కిలోల బరువు మాత్రమే మోసుకెళ్లగలవు. పైగా ఇవి ప్రయాణించే దూరం కూడా చాలా తక్కువ. ఈ నేపథ్యంలో ఎల్రాయ్ 250 కిలోల బరువును మోసుకెళ్లగలిగే డ్రోన్లను సిద్ధం చేయడం.. అది కూడా ఏకంగా 300 మైళ్ల దూరం ప్రయాణించేలా సిద్ధం చేయడం విశేషం. ఆరు రోటర్లతో కూడిన ఈ డ్రోన్లు నిట్టనిలువుగా పైకి ఎగురుతాయి. నేలకు దిగగలవు కూడా. వీటితోపాటు వెనుకభాగంలో ఏర్పాటు చేసిన ఇంకో రోటర్ కారణంగా వేగంగా ముందుకెళ్లగలదని కంపెనీ సీఈవో డేవిడ్ మెరిల్ తెలిపారు. ఎలక్ట్రిక్ ఛార్జింగ్ స్టేషన్ అవసరం కూడా లేకుండా ఇది హైబ్రిడ్ వపర్ ట్రెయిన్ టెక్నాలజీతో పనిచేస్తుంది. విపత్తుల సందర్భంలో సరుకులు రవాణా చేసేందుకు ఈ డ్రోన్లు బాగా ఉపయోగపడుతాయని.. భవిష్యత్తులో ట్రక్కులకు బదులుగా ఈ డ్రోన్లను వాడాలన్నది తమ లక్ష్యమని మెరిల్ వివరించారు. ఇప్పటికే దాదాపు 70 కోట్ల రూపాయల నిధులు సేకరించిన తాము మరిన్ని నిధుల కోసం ఎదురు చూస్తున్నామని చెప్పారు. -
‘రికార్డు స్థాయిలో సరుకు రవాణా’
సాక్షి,హైదరాబాద్: దక్షిణ మధ్య రైల్వే ఈ ఆర్థిక ఏడాది 100 మిలియన్ టన్నుల సరుకు రవాణా చేసి సరికొత్త రికార్డు నెలకొల్పింది. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్(జీఎం) ఆర్.కె కుల్‌శ్రేష్ట గురువారం మీడియాకు తెలిపారు. రికార్డు స్థాయిలో సరుకు రవాణాకు కృషి చేసిన అధికారులను ఈ సందర్భంగా ఆయన అభినందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..సరుకు రవాణాలో అత్యధిక రికార్డు సాధించడానికి దక్షిణ మధ్య రైల్వే పనితీరు, సామర్థ్యమే కారణమన్నారు. మొత్తం 100.052 మిలియన్ టన్నుల సరుకు రవాణా చేసి గణనీయమైన ప్రగతి సాధించామన్నారు. రవాణా అయిన వాటిలో బొగ్గు 53.555 టన్నులు, సిమెంట్ 22.948, ఎరువులు 5.374, ఇనుప ఖనిజం 5.183, ఆహార ధాన్యాలు 3.925, స్టీల్ ప్లాంట్ల ముడి సరుకు 2.275, ఇతర సరుకు రవాణా 5.07 టన్నులుగా నమోదైనట్లు తెలిపారు. గతేడాది ఆదాయంతో పోలిస్తే 26% పెరిగి రూ.1764 కోట్ల అధికంగా ఆదాయ వృద్ధి సాధించిందన్నారు. ప్రిన్సిపల్ చీఫ్ ఆపరేషన్స్ మేనేజర్ ఎన్. మధుసూదన్‌రావు మాట్లాడుతూ...సింగరేణి సంస్థ అందించిన సహకారం వల్లనే పెద్ద ఎత్తున బొగ్గు రవాణా సాధ్యమైందన్నారు. ఈ సందర్భంగా చీఫ్ ఫ్రైట్ ట్రాఫిక్ మేనేజర్ బి.నాగ్యా, దక్షిణ మధ్య రైల్వే అధికారులు, ఉద్యోగులను ఆయన ప్రశంసించారు. -
మిల్లింగ్.. తిరకాసు!
కోరుట్ల: ధాన్యం మిల్లింగ్‌లో అధికారులు..ప్రజాప్రతినిధులు ఆడిందే ఆటగా సాగుతోంది. ఖరీఫ్ సీజన్లో జిల్లాలో ఉత్పత్తి అయిన ధాన్యం కస్టమ్ మిల్లింగ్ కోసం పొరుగు జిల్లాలకు తరలిపోవడం వివాదాస్పదంగా మారుతోంది. ఏటా స్థానిక మిల్లర్లు అభ్యంతరాలు తెలుపుతున్నా.. పట్టించుకునేవారు లేకుండా పోయారు. ఎప్పటిలాగే ఈ ఖరీఫ్ సీజన్లో మిల్లింగ్ కోసం పొరుగు జిల్లాలకు ధాన్యం తరలించేందుకు అధికారులు ఉత్తర్వులు జారీ చేయడం చర్చనీయంగా మారింది. ఇదీ..తిరకాసు ఈ ఖరీఫ్ సీజన్లో జిల్లావ్యాప్తంగా సుమారు 2.50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి అవుతుందని సివిల్ సప్లయ్ అధికారులు అంచనా వేశారు. జిల్లాలో 35 బాయిల్డ్ రైస్‌మిల్లులు, 60 పారా బాయిల్డ్ రైస్ మిల్లులు ఉన్నాయి. ఒక్క సీజన్లో జిల్లాలోని అన్ని రైస్‌మిల్లుల మిల్లింగ్ సామర్థ్యం పరిగణనలోకి తీసుకుంటే మూడు లక్షల మెట్రిక్ టన్నులపైగానే ఉంటుంది. అయినప్పటికీ జిల్లాలోని రైస్‌మిల్లులకు ఉత్పత్తి అయిన ధాన్యంలో కేవలం 1,35,100 మెట్రిక్ టన్నులు మాత్రమే మిల్లింగ్‌కు కేటాయించారు. మిగిలిన 1,15,250 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కరీంనగర్, పెద్దపల్లి జిల్లాలకు తరలించాలని నిర్ణయించారు. స్థానికంగా రైస్ మిల్లులకు మిల్లింగ్ కెపాసిటీ ఉన్నప్పటికి పొరుగు జిల్లాలకు ధాన్యం తరలించేందుకు అధికారులు తీసుకున్న నిర్ణయం వెనక ఏదో తిరకాసు ఉందని స్థానిక రైస్‌మిల్లర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రూ.17కోట్ల భారం మిల్లర్ల విషయాన్ని పక్కన బెడితే ఒక్కో క్వింటాలుకు రూ.15 చొప్పున ప్రభుత్వం రవాణా చార్జీలు ఇస్తుంది. 1,15,250 మెట్రిక్ టన్నుల ధా న్యం జిల్లా నుంచి కరీంనగర్, పెద్దపల్లి పరిసరాల కు తరలించడానికి ఎంత తక్కువ అనుకున్నా రూ. 17 కోట్లకు మించిన రవాణా భారం పడుతుంది. జిల్లాలోని దాదాపు 100 రైస్మిల్లుల్ల పనిచేసే సు మారు 5వేల మంది కార్మికులు ఉపాధి కోల్పోతున్నారు. స్థానిక ప్రజాప్రతినిధులు జిల్లాలో ఉత్పత్తి అయిన ధాన్యాన్ని స్థానికంగానే మిల్లింగ్ చేసేం దుకు అనుమతి వచ్చేలా ఒత్తిడి తెస్తే ఎంతోకొంత మేలు జరుగుతుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ దిశలో అధికారులు..ప్రజాప్రతినిధులు అవసరమైన చర్యలు తీసుకోవాల్సి ఉంది. మిల్లింగ్ సామర్థ్యం తక్కువ జిల్లాలోని రైస్ మిల్లుల్లో మన దగ్గర ఉత్పత్తి అయిన ధాన్యం మిల్లింగ్ చేసే సామర్థ్యం లే దు. ఈ కారణంగా పొరుగు జిల్లాల్లోని రైస్ మిల్లులకు పంపాల్సి వస్తోంది. ఇందులో ఏలాంటి సందేహాలకూ తావు లేదు. మిల్లింగ్ సామర్థ్యం పెరిగితే స్థానికంగా మిల్లర్లకు ధాన్యం కేటాయించడానికి ఇబ్బంది లేదు. – చందన్‌కుమార్, ఏఎస్వో, సివిల్ సప్లయిస్ -
హైదరాబాద్ మెట్రోలో ఎంతమంది ప్రయాణించారో తెలుసా?
సాక్షి, హైదరాబాద్: ప్రతిష్టాత్మక హైదరాబాద్ మెట్రో రైలు ఎంతమందిని చేరవేసిందో తెలుసా? జంట నగర వాసుల ఆదరణతో ఇప్పటివరకు 20 మిలియన్ల (రెండు కోట్ల మంది) ప్రయాణికులను గమ్య స్థానాలకు చేర్చింది. ఈ మేరకు హైదరాబాద్ మెట్రో రైలు యాజమాన్యం ట్విటర్లో వెల్లడించింది. ఈ సందర్భంగా ప్రయాణికులకు కృతజ్ఞతలు తెలుపుతూ ఒక వీడియోను షేర్ చేసింది. 2017, నవంబర్ 28న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతులు మీదుగా మెట్రో రైలు ప్రారంభమైంది. ప్రధాని స్వయంగా ఇందులో ప్రయాణించారు. నాగోల్-మియాపూర్ మధ్య మెట్రో తన పరుగును ఆరంభించింది. మెట్రో రైలుపై నగర వాసుల భారీ ఆసక్తితో ఆరంభంలోనే భారీ ఆదరణను దక్కించుకుంది. కిక్కిరిసిన జనంతో మెట్రో రైలు పెద్ద విశేషంగా నిలిచిన విషయం తెలిసిందే. కాగా, ఎల్బీనగర్-అమీర్‌పేట మార్గంలో మెట్రో రైలు సేవలు ఈ నెలాఖరుకు అందుబాటులోకి వచ్చే అవకాశముంది. Hyderabad Metro Rail is a convenient mode of transportation for 20 million riders. Reaching here would not be possible without you. Thank you for trusting and travelling with us. #MeeMetro #20MillionPassengers #ManaMetro pic.twitter.com/GxCpqnGrs1 — L&T HydMetroRail (@ltmhyd) September 5, 2018 -
రాష్ట్రంలో ఆపరేషన్ ‘అభయ’
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రజారవాణా వ్యవస్థ ఇక నిఘా నీడలోకి వెళ్లనుంది. ప్రయాణాల్లో యువతులు, మహిళల పట్ల అసభ్యంగా వ్యవహరించడం, వెకిలిచేష్టలు లాంటి ఘటనలు నిత్యం ఏదో ఒకచోట వెలుగు చూస్తున్నాయి. వీటిని నివారించి మహిళలు, బాలికలకు రక్షణ కల్పించేందుకు రవాణాశాఖ ఆపరేషన్ ‘అభయ’ అనే కార్యక్రమానికి రూపకల్పన చేసింది. దీనిద్వారా ద్వారా క్యాబ్, ఆటో, టూరిస్ట్ బస్, ప్రైవేట్ ట్రావెల్స్, విద్యా సంస్థల బస్సులు ఇలా ఒకటేమిటి.. చివరకు ఆర్టీసీ బస్సు కూడా ఎక్కడెక్కడ తిరుగుతుందో.. ఏ ప్రాంతానికి వెళ్లనుందో.. ట్రాక్ అండ్ ట్రేస్ ద్వారా రవాణా శాఖ ఇట్టే పసిగడుతుంది. ఈమేరకు రవాణా వాహనాలన్నింటికీ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐవోటీ) పరికరాలను తప్పనిసరి చేస్తూ అతి త్వరలో అధికారిక ఉత్తర్వులు జారీ కానున్నాయి. రెండేళ్ల క్రితమే రవాణా శాఖ ‘అభయ’ ప్రాజెక్టు రూపొందించింది. నీతి ఆయోగ్ ఆమోదంతో ఈ ప్రాజెక్టుకు కేంద్రం రూ.138 కోట్లను విడుదల చేసింది. తొలుత ఆటోలు, క్యాబ్‌లకు... ఏపీలో 12.15 లక్షల వరకు రవాణా వాహనాలున్నాయి. వీటికి దశలవారీగా ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ పరికరాలు అమర్చేందుకు రవాణాశాఖ ఇప్పటికే ఐటీ కంపెనీల నుంచి ఆసక్తి వ్యక్తీకరణ దరఖాస్తులు కోరింది. ఈనెల 20న దీనికి సంబంధించిన టెండర్లను ఖరారు చేయనుంది. తొలిదశలో అక్టోబరు నుంచి క్యాబ్‌లు, ఆటోలకు ఐవోటీ పరికరాల్ని బిగించనున్నారు. ఆపరేషన్ ‘అభయ’ అంటే..? మహిళల భద్రత కోసం ‘అభయ’ ప్రాజెక్టును చేపట్టనున్నట్లు కేంద్ర ఉపరితల రవాణాశాఖకు ఏపీ రెండేళ్ల క్రితమే నివేదిక సమర్పించింది. ప్రయాణంలో అవాంఛనీయ సంఘటనలు ఎదురైతే ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐవోటీ) ఆధారంగా పోలీస్, రవాణాశాఖలకు సమాచారం చేరవేసేలా దీన్ని రూపొందించారు. కేంద్రం కేటాయించిన నిధులతో పోలీస్‌శాఖకు అత్యాధునిక టెక్నాలజీతోపాటు రవాణాశాఖలో కంట్రోల్ రూంలు ఏర్పాటు చేస్తారు. ఆర్టీసీ బస్సులు, ఆటోలు, క్యాబ్‌లు, ట్యాక్సీల్లో మహిళలు స్వేచ్ఛగా ప్రయాణించేలా ఐవోటీ పరికరాలు అమరుస్తారు. జీపీఎస్ పరికరాలు కలిగిన ఈ బాక్సుపై ‘పానిక్’ బటన్ ఉంటుంది. వేధింపులు ఎదుర్కొనే మహిళలు దీన్ని నొక్కిన వెంటనే కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు సమాచారం చేరవేసి అప్రమత్తం చేస్తుంది. వాహనం ఎక్కడ ప్రయాణిస్తుందనే సమాచారాన్ని చేరవేస్తుంది. పానిక్ బటన్ నొక్కకున్నా ప్రతి 20 సెకన్లకు వాహనం కదలికలు కంట్రోల్ రూంకు చేరతాయి. ఐవోటీ బాక్స్ పక్కన క్యూఆర్ కోడ్ షీటు కూడా ఉంటుంది. అభయ యాప్‌ను డౌన్లోడ్ చేసుకుని ఐవోటీ బాక్స్ పక్కన ఉండే క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసినా ప్రయాణించే వాహనం ఎటు వైపు వెళుతుందో, ఎక్కడుందో తెలుస్తుంది. విజయవాడ, విశాఖలో ప్రయోగాత్మక పరీక్ష ‘అభయ’ ప్రాజెక్టు ద్వారా మహిళలకు పూర్తి భద్రత కల్పిస్తాం. 22 ఐటీ కంపెనీలు ఆసక్తి వ్యక్తీకరణ టెండర్లలో పాల్గొన్నాయి. ఈనెల 20న టెండర్లు ఖరారు చేస్తాం. ఎంపికైన సంస్ధ విజయవాడ, విశాఖపట్టణంలలో ఆటోలపై ప్రయోగాత్మకంగా అమలు చేసి చూపాలి. – ఎం.పురేంద్ర (రవాణాశాఖ ఐటీ విభాగం డిప్యూటీ కమిషనర్) -
మోసాలు.. మోపెడు
అధికార పార్టీ అండ ఉంది. ఏంచేసినా చెల్లుతుందనే నమ్మకముంది. ఇంకేముంది మోపెడ్‌పై సైతం వందలాది క్వింటాళ్ల ధాన్యం తరలించేసినట్లు బిల్లులు సృష్టించి దోచేసుకునే ధైర్యం వారికుంది. పౌర సరఫరాల శాఖలో తప్పుడు రవాణా బిల్లులు సైతం ‘పాస్’ చేయించుకొనే ‘ప్రసన్నాంజనేయుడి’ పవర్ అది. నందిగామ మార్కెట్‌యార్డులో ధాన్యం దోపిడీ తీరు ఇది. సాక్షి, అమరావతిబ్యూరో : టీవీఎస్–ఎక్స్ఎల్ మోపెడ్ వాహనంపై ఎన్ని బస్తాలు తీసుకెళ్లవచ్చు? మహా అయితే 10 బస్తాల వరకు సాధ్యపడవచ్చు. అదే ఆటో రిక్షాలో ఓ 20 బస్తాలు.. ఇక ఇండికా కారు అనుకోండి 30 బస్తాలు సరే. కానీ.. నందిగామ మార్కెట్‌యార్డు నుంచి ఓ టీవీఎస్ మోపెడ్ వాహనంపై ఏకంగా 713 బస్తాలు, టాటా ఇండికా కారులో 463 బస్తాలు, ఆటో రిక్షాలో 537 బస్తాలు సరఫరా చేసినట్లు నిసిగ్గుగా రికార్డులు రాసేశారు. ఇదొక్కటే కాదు ఒక లారీలో ఏకంగా 1203 బస్తాలు సరఫరా చేయడం ఒక్క ‘ప్రసన్నాంజనేయ’ గ్రామైక్య సంఘానికే చెల్లింది. అధికార పార్టీ నాయకుల అండదండలతో పీపీసీ కమిటీ సభ్యురాలు ధాన్యం రవాణా పేరిట చేసిన అడ్డగోలు దోపిడీని చూస్తే ఎవరైనా నివ్వెరపోవాల్సిందే. ఇంత జరిగినా, ప్రభుత్వ సొమ్మును అక్రమంగా లూటీ చేసినా పౌరసరఫరాల శాఖాధికారులు మాత్రం నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తుండటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వివరాల్లో వెళితే.. రవాణా చేశారిలా.. మార్కెట్ యార్డుల్లో పీపీసీ కమిటీల ద్వారా సేకరించిన చేసిన ధాన్యాన్ని సాధారణంగా పౌరసరఫరాల సంస్థ టెండర్ల ద్వారా కాంట్రాక్టు దక్కించుకున్న ట్రాన్స్పోర్టర్లు సరఫరా చేస్తుంటారు. కాగా, నందిగామ మార్కెట్‌యార్డులో ప్రసన్నాంజనేయ గ్రామైక్య సంఘం పేరిట సేకరించిన ధాన్యాన్ని కూడా టెండరు దక్కించుకున్న అన్నపూర్ణ లారీ ట్రాన్స్‌పోర్టు సరఫరా చేసినట్లు రికార్డుల్లో చూపెట్టారు. కానీ ఇక్కడ ధాన్యం సరఫరా చేసేందుకు లారీలను ఉపయోగించకపోగా నిబంధనలకు విరుద్ధంగా టీవీఎస్ మోపెడ్, ఆటో రిక్షాలు, ఇండికా కారు, రవాణాశాఖ కార్యాలయ చరిత్రలో లేని సీరిస్ నంబర్ల పేరిట ఉన్న లారీల్లో సరఫరా చేసేశారు. ఆ వాహనాల నంబర్ల మీదే బిల్లులురూపొందించారు. లారీల్లో సరఫరా చేసిన ధాన్యం కన్నా ఇతర వాహనాల్లో సరఫరా చేసిన ధాన్యమే ఎక్కువగా ఉండటం గమనార్హం. అయితే ఇవేవీ పౌరసరఫరాల సంస్థ అధికారులకు పట్టలేదు. పైగా వారు రూపొందించిన తప్పుడు రవాణా బిల్లులకు ఆమోదం తెలిపి పరోక్షంగా ప్రభుత్వ ఖజానాను దోచుకోవడానికి సహకరించారు. రూ. 33.81లక్షల దోపిడీ ప్రభుత్వం మద్దతు ధర చెల్లించి రైతుల వద్ద కొనుగోలు చేసిన ధాన్యాన్ని భద్రపరిచేందుకు స్థానికంగా ఉండే పౌరసరఫరాల గోదాములకు తరలిస్తారు. ఈ ప్రక్రియ మొత్తం లారీల ద్వారానే జరుగుతుంది. కానీ నందిగామ మార్కెట్ యార్డు నుంచి తరలించిన ధాన్యం మాత్రం అధిక భాగం లారీల్లో కాకుండా సాధారణ వాహనాల్లో అది కూడా టీవీఎస్–50, ఆటో రిక్షా, టాటా ఇండికా కారు, ట్రాక్టర్ లాంటి వాటిపై వేలాది బస్తాలను తరలించినట్లు చూపెట్టారు. 1992 మోడల్‌కు చెందిన టీవీఎస్–50ఎక్స్ఎల్( అ్క07 8544) పై 13 ్ర టిప్పులు చొప్పున ∙Ðð ¬త ్తం 7000 బస్తాలను సరఫరా చే సిన ట్లు రి కారు ్డల్లో ^è ప గా.. రవాణా శా ఖ రి కారు ్డల్లో లేని అ్క20 6770 నంబరు గల లారీ ద్వారా 15 ట్రిప్పులు చొప్పున సుమారు 9వేల బస్తాలు, ఏపీఎస్టీ 1234 లారీ ద్వారా 2,500 బస్తాలు సరఫరా చేసినట్లు ప్రసన్నాంజనేయ సంఘం రికార్డుల్లో చూపింది. ఈ రెండు లారీల నంబర్లు రవాణా శాఖ రికార్డుల్లోనే లేకపోవడం విశేషం. ఇలా లేని లారీలు ఉన్నట్లుగా.. రైతుల వద్ద సేకరించని ధాన్యాన్ని సరఫరా చేసినట్లు రికార్డులు సృష్టించి నాలుగేళ్ల వ్యవధిలో రవాణా చార్జీల పేరిట రూ. 33.81 లక్షలు దోచుకున్నారు. గన్నీ బ్యాగ్‌ల డబ్బును వదల్లేదు నందిగామ మార్కెట్‌యార్డు కమిటీలో నాలుగేళ్ల కాలంలో ‘ప్రసన్నాంజనేయ’ పరపతి సంఘం చెబుతున్నవన్నీ దొంగ లెక్కలేనని తేలింది. వారు ధాన్యాన్ని సరఫరా చేసినట్లు చూపుతున్న వాహనాలు కొన్ని లేకపోవడం.కొన్నింటిలో సరఫరా చేయడానికి సాధ్యం కాని వాహనాలు ఉండటం చూస్తే 90 శాతం వరకు ధాన్యాన్ని రైతుల వద్ద కొనుగోలు చేయనేలేదని సుస్పష్టమవుతోంది. అయితే వారు ధాన్యం సేకరించినట్లుగా.. వాటికి కొత్త బ్యాగుల్లో నింపినట్లుగా చూపెట్టారు. ఇందుకోసం ప్రభుత్వం నుంచి ఒక్కో బ్యాగ్‌కు రూ. 15ల చొప్పున వసూలు చేశారు. వారు చెబుతున్న లెక్కల ప్రకారం మొత్తం 1.53,705.6 క్వింటాళ్లకు గానూ 3,84,262 బ్యాగులు(50 కేజీల బస్తా బ్యాగులు) కొనుగోలు చేయడానికి రూ. 57.63 లక్షల వరకు ఖర్చు చేసినట్లు లెక్కల్లో చూపారు. కానీ వారు ఎలాంటి బ్యాగులు కొనకుండా ఆ డబ్బునూ నిసిగ్గుగా నొక్కేశారు. -
పశువుల దొంగలు అరెస్టు
చిలకలగూడ రంగారెడ్డి : ఆవుల దొంగతనానికి అంబులెన్స్‌ను వినియోగించిన నిందితులను పోలీసులు సీసీ కెమెరాల ఫుటేజీ ఆధారంగా పట్టుకున్నారు. వీరి నుంచి రూ.7.5 లక్షల నగదు, ఒక ఆవు, అంబులెన్స్ వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. చిలకలగూడ ఠాణాలో సోమవారం జరిగిన మీడియా సమావేశంలో ఉత్తరమండలం డీసీపీ సుమతి, గోపాలపురం ఏసీపీ శ్రీనివాసరావు, చిలకలగూడ డీఐ నర్సింహారాజు, డీఎస్ఐ వెంకటాద్రిలు వివరాలు వెల్లడించారు. మేడిబావికి చెందిన మల్లేష్‌యాదవ్, రాజుయాదవ్‌లు మేతకు వెళ్లిన రెండు ఆవులు మాయమయ్యాయని ఫిర్యాదు చేశారు. అదే తరహాలో మరో రెండు సంఘటనలు జరగడంతో డిటెక్టివ్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల కుత్‌బుద్దీన్‌గూడకు చెందిన మహ్మద్ అయూబ్ అలియాస్ బడాఅయూబ్ (57) కుటుంబంతో సహా నగరానికి వలస వచ్చి పాతబస్తీ బార్కస్‌లోని నెబీల్ కాలనీలో నివసిస్తున్నాడు. వృతిరీత్యా ఆటో డ్రైవరైన ఆయూబ్ ప్రవృత్తి దొంగతనాలు. హైదరాబాద్, రాచకొండ కమిషనరేట్లు, మెదక్ జిల్లాలో 150 కేసుల్లో అయూబ్ నిందితుడు. లారీ దొంగతనం కేసులో అరెస్ట్ అయి ఈ ఏడాది ఫిబ్రవరి 16న విడుదలయ్యాడు. తన సోదరుడు బాబా, తలాబ్‌కట్టకు చెందిన మహ్మద్ సద్దామ్ ఖురేషీ (27)తో జత కట్టాడు. మేతకు వదిలిన పశువులను దొంగిలించి అమ్ముకుంటూ జల్సాలు చేస్తున్నారు. ఈ విధంగా నగరంలోని పలు ఠాణాల పరిధిలో మొత్తం 39 పశువులను దొంగిలించారు. ఓఎల్ఎక్స్లో అంబులెన్స్ కొనుగోలు... పశువుల దొంగతనానికి అంబులెన్స్ అయితే ఎవరికీ అనుమానం రాదని, ఫుట్‌బోర్డు కిందికి ఉండడంతో వాటిని సులభంగా ఎక్కించొచ్చని భావించారు. యశోద ఆస్పత్రికి చెందిన ఓ అంబులెన్స్‌ను ఓలెక్స్ వెబ్సైట్లో కొనుగోలు చేసిన వ్యక్తిని గుర్తించిన ఈ గ్యాంగ్... అధిక మొత్తం చెల్లించి దాన్ని కొనుగోలు చేసింది. ఆరెంజ్ రంగుతో చిక్కారు.. సీసీ ఫుటేజీల ఆధారంగా పోలీసులు దర్యాప్తు ప్రారంభించగా, అంబులెన్స్ నంబర్ ఏపీ 29గా మాత్రమే ఉంది. నగరంలో ఆ నెంబర్ అంబులెన్స్‌లు 200లకు పైగా ఉన్నట్లు తేలింది. ఓ దృశ్యం లో అంబులెన్స్ అరెంజ్ కలర్లో కనిపించింది. ఆ రంగు అంబులెన్స్‌లు కేవలం యశోద ఆస్పత్రి మాత్రమే వినియోగిస్తున్నట్లు గుర్తించారు. అలా దొంగలను పోలీసులు పట్టుకున్నారు. -
చిన్నాచితకా ఉద్యోగాలతో సరి
మనదేశంలోని నగరాల్లో నివసిస్తోన్న మహిళల ఉద్యోగాలపై రవాణా సదుపాయాల లేమి ప్రభావం చూపుతోందని ముంబైలో జరిపిన తాజా పరిశోధనలు తేల్చి చెప్పాయి. సరైన రవాణా సదుపాయాలు లేకపోవడం వల్ల వారు మెరుగైన ఉద్యోగావకాశాలను కోల్పోవాల్సి వస్తోందని ఈ పరిశీలనలో వెల్లడైంది. దూరప్రయాణాలకు అనువైన రవాణా సౌకర్యాలు కరువై, తాము నివసిస్తోన్న ప్రాంతాల్లోనే తక్కువ వేతనాలు వచ్చే చిన్నా చితకా ఉద్యోగాలతో మహిళలు సరిపెట్టుకుంటున్నారని ఇనిస్టిట్యూట్ ఫర్ ట్రాన్స్‌పోర్టేషన్ అండ్ డెవలప్మెంట్ పాలసీ(ఐటిడిఎస్) సంస్థ అధ్యయనంలో తేలింది. గత రెండు దశాబ్దాలతో పోలిస్తే 2013లో శ్రామిక మహిళల భాగస్వామ్యం కూడా 34.8 శాతం నుంచి 27 శాతానికి దిగజారినట్టు ఇండియా స్పెండ్ నివేదిక ఇటీవల వెల్లడించింది. వ్యాపార, ఆర్థిక పరిశోధనా సంస్థ మెకెన్సీ గ్లోబల్ ఇనిస్టిట్యూట్ 2015 నివేదిక ప్రకారం హిమాచల్ ప్రదేశ్‌లో 63 శాతం మంది శ్రామిక మహిళలు ఉంటే, బీహార్‌కి వచ్చేసరికి అది 9 శాతానికి పడిపోయింది. 2017 ప్రపంచ బ్యాంకు నివేదిక ప్రకారం 2004 నుంచి 2011–12 లోపల 19.2 మిలియన్ల మంది శ్రామిక మహిళలు తగ్గిపోయారు. ఎఫ్ఐఏ ఫౌండేషన్ గతంలో నిర్వహించిన çసర్వే ప్రకారం పురుషుల కంటే మహిళలే అధికంగా ప్రభుత్వ రవాణా వ్యవస్థపై ఆధారపడుతున్నట్టు తేలింది. ప్రధానంగా ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉండి, నగర ప్రాంతాల్లో నివసిస్తోన్న కుటుంబాల్లో పురుషులు 27 శాతం మంది, స్త్రీలు 37 శాతం మంది పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌నే ఎంచుకుంటున్నట్టు ఓ రిపోర్టు వెల్లడించింది. అయితే తక్కువ ఖర్చు, భద్రత కారణాల రీత్యా మహిళలు ప్రభుత్వ రవాణావైపు మొగ్గుచూపుతున్నారని కూడా ఇందులో వెల్లడైంది. 2010 లో జగోరి అనే మహిళా రీసోర్స్ సెంటర్ యుఎన్ వుమన్, స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఢిల్లీలో సంయుక్తంగా నిర్వహించిన పరిశోధనలో దాదాపు 90 శాతం మంది స్త్రీలు ఏదో రకమైన వేధింపులకు గురైనట్టు పేర్కొన్నారు. ప్రభుత్వ వాహనాల్లో ప్రయాణిస్తున్నప్పుడు 51 శాతం మంది వేధింపులకు గురయ్యామనీ, బస్సుల కోసమో, లేక రైళ్ళకోసమో వేచిచూస్తున్న సమయంలో 42 శాతం మంది వేధింపులకు గురైనట్టు వెల్లడించారు. -
ప్రజలు చనిపోతున్నా మీకు పట్టదా?
-
ప్రజలు చనిపోతున్నా మీకు పట్టదా?
సాక్షి, హైదరాబాద్: ఉభయ రాష్ట్రాల్లోని ప్రైవేటు రవాణా సంస్థల ఉల్లంఘనలపై తాము కోరిన వివరాలను సమర్పించే విషయంలో నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్న రెండు రాష్ట్ర ప్రభుత్వాలపై ఉమ్మడి హైకోర్టు తీవ్ర స్థాయిలో మండిపడింది. ప్రైవేటు రవాణా సంస్థలను కాపాడేందుకే కాలయాపన చేస్తున్నట్లుందని ఘాటుగా వ్యాఖ్యానించింది. రవాణా సంస్థల తీరు వల్ల ప్రజలు మరణిస్తున్నా మీకు పట్టదా? అంటూ నిలదీసింది. మోటారు రవాణా కార్మికుల చట్టం ప్రకారం నమోదు చేసుకోకుండా, డ్రైవర్ల పని గంటల విషయంలో నిబంధనలు పాటించకుండా ఉల్లంఘనలకు పాల్పడుతున్న రవాణా సంస్థలను, వాటిపై తీసుకున్న చర్యలు తదితర వివరాలను తమ ముందుంచాల్సిందేనని ఉభయ రాష్ట్రాల రవాణా శాఖల కమిషనర్లకు స్పష్టం చేసింది. వచ్చే విచారణ నాటికి ఈ వివరాలను ముందుంచని పక్షంలో స్వయంగా కోర్టుకు హాజరై వివరణ ఇవ్వాల్సి ఉంటుందని హెచ్చరించింది. తదుపరి విచారణను ఈ నెల 7కి వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ అభినంద్‌కుమార్ షావిలిలతో కూడిన ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. మోటారు వాహన చట్టం నిబంధనలకు విరుద్ధంగా ఉభయ రాష్ట్రాల్లో ఆపరేటర్లు బస్సులు నడుపుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని, ఈ నేపథ్యంలోనే ముండ్లపాడు వద్ద దివాకర్ ట్రావెల్స్ బస్సు ప్రమాదం జరిగిందంటూ న్యాయవాది కె.వి.సుబ్బారెడ్డి హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై ఇప్పటికే పలుమార్లు విచారణ జరిపిన ఏసీజే నేతృత్వంలోని ధర్మాసనం మరోసారి విచారణ జరిపింది. ఈ సందర్భంగా ఏపీ ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది కృష్ణప్రకాశ్ వాదనలు వినిపిస్తూ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఇప్పటికే కోర్టు ముందు ఓ నివేదికను ఉంచారని తెలిపారు. దీనికి ధర్మాసనం స్పందిస్తూ నిబంధనలను ఉల్లంఘించినవారిపై కఠిన చర్యలు తీసుకోకుండా జరిమానాలతో సరిపెట్టడమేనా? మీరు చేస్తుంది అంటూ అసహనం వ్యక్తం చేసింది. లైసెన్సులు రద్దు చేయకుండా చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారంది. తెలంగాణ ప్రభుత్వం ఇప్పటివరకు ఎటువంటి నివేదిక దాఖలు చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏపీ ప్రభుత్వం కనీసం ఏదో ఒక నివేదిక అయినా ఇచ్చింది.. మీరు మాత్రం అది కూడా చేయలేదంటూ అసహనం వ్యక్తం చేసింది. -
‘మిలియన్’ మార్చ్
-
‘మిలియన్’ మార్చ్
సాక్షి, హైదరాబాద్: బస్సులు.. రైళ్లు.. ప్రైవేటు ట్రావెల్స్.. ఎక్కడ చూసినా జనమే జనం.. చిన్నాపెద్ద, పిల్లాజెల్లా.. అంతా కదులుతున్నారు.. ముఖంలో పండుగ సంబురం నింపుకొని పల్లెకు తరలుతున్నారు! సద్దుల బతుకమ్మ, దసరా పండుగల నేపథ్యంలో నగరవాసులు పెద్ద ఎత్తున సొంతూళ్లకు తరలి వెళ్తున్నారు. వారం రోజులుగా సుమారు 12 లక్షల మంది ఇరు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాలకు బయల్దేరి వెళ్లారు. ఏపీ కంటే తెలంగాణ జిల్లాలకు వెళ్లే ప్రయాణికుల సంఖ్యే ఎక్కువగా ఉంది. ఈ నెల 20 నుంచి పిల్లలకు స్కూలు సెలవులు ప్రకటించడంతో నగరవాసుల పల్లెబాట మొదలైంది. రైళ్లు, ఆర్టీసీ, ప్రైవేట్ బస్సులు కిటకిటలాడుతున్నాయి. మరో రెండ్రోజులు ఇదేస్థాయిలో రద్దీ కొనసాగే అవకాశం ఉంది. హైదరాబాద్, సికింద్రాబాద్, కాచిగూడ రైల్వేస్టేషన్ల నుంచే కాకుండా ఎంజీబీఎస్, జేబీఎస్, దిల్సుఖ్నగర్, ఎల్బీనగర్, ఉప్పల్, మియాపూర్, కేపీహెచ్‌బీ, ఎస్సార్‌నగర్, అమీర్‌పేట, లక్డీకాపూల్ తదితర చోట్ల నుంచి కూడా ప్రయాణికులు భారీ సంఖ్యలో తరలివెళ్లారు. ప్రతిరోజు వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగించే సుమారు 3,500 బస్సులతోపాటు గత నాలుగు రోజులుగా ఆర్టీసీ సుమారు 1000 ప్రత్యేక బస్సులను నడిపింది. ఖమ్మం, కరీంనగర్, వరంగల్, నల్లగొండ, సూర్యాపేట, మహబూబ్‌నగర్, కర్నూలు, విజయవాడ, విశాఖపట్నం, కాకినాడ, తదితర ప్రాంతాల వైపు వెళ్లే బస్సుల్లో రద్దీ ఎక్కువగా ఉంది. రైళ్లల్లో రిజర్వేషన్లు లభించకపోవడంతో పలువురు దూరప్రాంతాలకు సైతం ప్యాసింజర్ రైళ్లను ఆశ్రయించాల్సి వచ్చింది. రైళ్లపై ఆశలు వదులుకున్న వాళ్లు ఆర్టీసీ బస్సులను ఆశ్రయించారు. అయితే ప్రత్యేక బస్సులపై 50 శాతం చొప్పున ఆర్టీసీ అదనపు వసూళ్లకు పాల్పడింది. ప్రైవేట్ బస్సులు ఏకంగా డబుల్ చార్జీలు వసూలు చేశాయి. రోజువారీగా బయల్దేరే 80 ఎక్స్‌ప్రెస్ రైళ్లు కాకుండా, వివిధ ప్రాంతాల మధ్య దసరా సందర్భంగా దక్షిణ మధ్య రైల్వే మరో 50 రైళ్లను అదనంగా ఏర్పాటు చేసింది. రద్దీ అధికంగా ఉన్న మార్గాల్లో ప్రధాన రైళ్లకు అదనపు బోగీలను ఏర్పాటు చేశారు. అయినా రద్దీ తగ్గడం లేదు. -
అక్రమ రవాణాకు చెక్
నూతన జీఎస్టీ విధానంతో జరిగిన మేలు పప్పులు, నూనెలపై ఏకీకృత పన్ను విధింపు ఇంత వరకూ ఐదు శాతం పన్ను ఎగవేతకు వ్యాపారుల ఆపసోపాలు యానాం నుంచి నిలిచిన అక్రమ సరుకు దిగుమతులు చెక్‌పోస్టు ఎత్తివేత అమలాపురం టౌన్ : దేశ వ్యాప్త జీఎస్టీ విధానంతో రాష్ట్రాల మధ్య పన్నుల వత్యాసాలు చెరిగిపోయాయి. ఒక రాష్ట్రంలో పన్నులు లేని కొన్ని వస్తువులను ఇతర రాష్ట్రాల వ్యాపారులు దిగుమతి చేసుకునే అక్రమ రవాణాలు ఆగిపోయాయి. దీంతో మన జిల్లాలో అంతర్భాగమై ఉన్న కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరి రాష్ట్ర పరిధిలోని ఫ్రెంచి యానాం నుంచి నిత్యం జరిగే వివిధ ఆహార దినుసులు, అపరాల తదితర వస్తువుల అక్రమ రవాణాకు సైతం అడ్డుకట్ట పడింది. పుదిచ్ఛేరి రాష్ట్రానికి పన్నుల పరంగా కొన్ని వెసులబాట్లు ఉండేవి. దాంతో అక్కడి నుంచి జిల్లాలోని పలు ప్రాంతాలకు భారీ ఎత్తున సరుకు అక్రమంగా రవాణా అయ్యి జిల్లాలో పన్నుల ఎగవేత జరిగేది. ఇప్పుడు జీఎస్టీతో ముఖ్యంగా పప్పు ధాన్యాలు, వంట నూనెలు, చక్కెర తదితర ఆహార వస్తువులపై సమాంతర పన్నులు విధించటంతో ఒక విధంగా అక్రమ రవాణా నిలిచిపోయింది 5 శాతం పన్ను ఎగవేత కోసం.. ఫ్రెంచి యానాంలో అన్ని రకాల పప్పు ధాన్యాలు, వంట నూనెలు తదితర ఆహార వస్తువులపై 0 శాతం పన్ను అమలయ్యేది. అదే మన రాష్ట్రంలో వాటిపై 5 శాతం పన్ను ఉండేది. ఈ పన్ను ఎగవేతకు కొందరు వ్యాపారులు అక్కడి నుంచి పప్పులు, నూనెలను జిల్లాలోకి అక్రమంగా రవాణా చేసి కాకినాడ, రాజమహేంద్రవరం, అమలాపురం ప్రాంతాలకు తరలించేవారు. దీని వల్ల జిల్లా వాణిజ్య పన్నుల శాఖకు రోజుకు రూ.పది లక్షల చొప్పున, నెలకు రూ.మూడు కోట్ల నష్టం వాటిల్లేది. ఒడిషా నుంచి వంట నూనె పీపాల లారీలు, ఇతర రాష్ట్రాల నుంచి పప్పుల లారీల సరుకు ఫ్రెంచి యానానికి దిగుమతి అవుతున్నట్లు బిల్లులు ఉండేవి. అవి మన జిల్లాలోని బడా హోల్‌సేల్ వ్యాపారాలకు చేరేవి. ఇదంతా ఓ రాకెట్లా సాగేది. అమలాపురానికి రెండు రోజులకోసారి ఫ్రెంచి యానాం బిల్లుతో వచ్చిన పప్పులు, వంట నూనెల లారీలు అక్రమ రవాణాతో వచ్చి రహస్యంగా దిగుమతి అయ్యేవి. చెక్ పోస్టు ఎత్తివేత : పన్నుల వ్యత్యాసం, సరిహద్దు సమస్యతో జిల్లా వాణిజ్య పన్నుల శాఖ ఫ్రెంచి యానాం నుంచి అక్రమ రవాణాలను అరికట్టేందుకు కొన్నేళ్ల కిందట యానాం సమీపంలోనే ఓ చెక్‌పోస్టు పెట్టింది. యానాం నుంచి 0 శాతం పన్నుల సరుకులను జిల్లాలోకి ప్రవేశించకుండా ఈ దీనిని ఏర్పాటు చేసినప్పటికీ జీఎస్టీ అమలు తరువాత ఎత్తివేశారు. అయితే జీఎస్టీ నుంచి మద్యం, డీజిల్, పెట్రోలులకు మినాహాయింపు ఉండటంతో యానంలో వాటికి ఉన్న తక్కువ ధరల వెసులబాటు అలానే కొనసాగుతోంది. -
నేటి నుంచి హెల్మెట్ తప్పనిసరి!
శ్రీకాకుళం సిటీ : జిల్లాలో గురువారం నుంచి హెల్మెట్ వాడకాన్ని తప్పనిసరి చేస్తూ జిల్లాస్థాయి ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకున్నారు. కలెక్టర్, ఎస్పీ ఆదేశాల మేరకు రవాణాశాఖతోపాటు పలు శాఖల అధికారులు క్షేత్రస్థాయిలో కార్యాచరణ ప్రణాళికను ఇప్పటికే సిద్ధం చేశారు. హెల్మెట్ లేకుండా వాహనం నడుపుతూ పోలీసులకు పట్టుబడితే వెయ్యి రూపాయలు జరిమానా విధించే అవకాశం ఉంది. హెల్మెట్ వాడకం అమలుపై రాష్ట్రస్థాయి ఉన్నతాధికారులు గతంలోనే ఆదేశాలు జారీ చేసినప్పటికీ క్షేత్రస్థాయిలో అంతగా అమలుకు నోచుకోలేదు. అయినప్పటికీ ప్రమాదాల స్థాయి అధికంగా ఉండడంతో పోలీసు, రెవెన్యూ అధికారులు హెల్మెట్ వాడక ఆవశ్యకతపై ప్రజల్లో అవగాహన కల్పిస్తూ వచ్చారు. తొలుత జాతీయ రహదారులపై ప్రయాణించేవారు హెల్మెట్ వాడకాన్ని తప్పనిసరి చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు అన్ని మండలాల్లో పాఠశాల స్థాయి నుంచి కళాశాల స్థాయి వరకూ అన్ని తరగతుల విద్యార్థులకు అవగాహన కల్పించారు. జిల్లాలో ఏటా అనేక మంది హెల్మెట్ లేకపోవడంతో ప్రయాణ సమయాల్లో ప్రమాదాలకు గురై మృత్యువాత పడుతుండగా.. మరికొందరు క్షతగాత్రులు అవుతున్నారు. జిల్లాలో 2.32 లక్షల ద్విచక్ర వాహనదారులు, 2.84 లక్షల మంది నాలుగు టైర్ల వాహనదారులు ఉన్నారు. ఈ పరిస్థితిలో ద్విచక్ర వాహనదారులంతా హెల్మెట్ వాడకం తప్పనిసరి చేస్తూ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. అలాగే నాలుగు టైర్ల వాహనదారులు సైతం సీట్‌బెల్ట్ పెట్టుకోవడాన్ని తప్పనిసరి చేశారు. జాతీయ రహదారి అయినా, గ్రామాలైనా ప్రమాదాల తీరుతెన్నులు ఒకేలా ఉన్నాయని చెబుతున్న ఆయా శాఖల అధికారులు సురక్షిత ప్రయాణానికి హెల్మెట్ వాడకాన్ని తప్పనిసరి అంటూ హితబోధ చేస్తున్నారు. హెల్మెట్ ధరించని పక్షంలో రూ.వెయ్యి జరిమానాను విధిస్తామని హెచ్చరిస్తున్నారు. దీంతోపాటు మైనర్లు వాహనాన్ని నడిపితే వారితోపాటు వారి తల్లిదండ్రులపై కూడా చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని స్పష్టం చేస్తున్నారు. -
రవాణా భవిష్యత్తంతా ఎలక్ట్రిక్ వాహనాలదే
న్యూఢిల్లీ: భారతదేశ రవాణా వ్వవస్థ భవిష్యత్తు ఎలక్ట్రిక్ వాహనాలదేనని నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్ పేర్కొన్నారు. ప్రతి అయిదు సంవత్సరాలకు బ్యాటరీల ఖర్చు దాదాపు సగం తగ్గుతోందని దీంతో రాబోయే 4-5 సంవత్సరాలలో, ఎలక్ట్రిక్ వాహనాలు పెట్రోలు లేదా డీజిల్ వాహనాల కంటే చాలా చవగ్గా లభిస్తాయని చెప్పారు. అలాగే నిర్వహరణ ఖర్చు కేవలం 20 శాతం మాత్రమేనని చెప్పారు. నీతిఆయోగ్, రాక్ మౌంటైన్ ఇన్సిస్టిట్యూట్ నిర్వహించిన విడుదల చేసిన ఒక ఉమ్మడి నివేదిక ను బుధవారం వెల్లడించింది. 2030 నాటికి భారతదేశం కోసం కార్బన్ ఉద్గారాలను 1 గిగాటోన్ (జిటి) గా తగ్గనుందనీ, డీజిల్, పెట్రోల్ ఖర్చుల్లో 60 బిలియన్ డాలర్లను ఆదా చేయగలమని నివేదించింది. అయితే ప్రయివేట వాహనాలయాజమాన్యం ద్వారా దేశం సవాళ్లు ఎదుర్కోనుందని తెలిపింది. ఈ సందర్భంగా కాంత్ మాట్లాడుతూ ఎలక్ట్రిక్ వాహనాల నిర్వహణకు ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని ఆయన మరో ఉద్ఘాటించారు. రాబోయే దశాబ్దకాలంలో ఇవి భారీ ఎత్తున మార్కెట్లోకి రానున్నాయన్నారు. అయిదే ఈ ప్రక్రియలో ఆలస్యమైతే.. చమురుకు బదులుగా బ్యాటరీలను దిగుమతి చేసుకోక తప్పని పరిస్థితి వస్తుందని..ఇది పెద సవాలని తెలిపారు. దీంతో మార్కెట్లో వెనుకబడిపోతామని హెచ్చరించారు. అందుకే ఈ వాహనాల తయారీలో ముందుండాలన్నారు. పెద్ద స్థాయిలో గిరాకీని పెంచడం ముఖ్యమనీ, ప్రభుత్వ వాహనాలపై, ప్రజా వాహనాలపై దృష్టి పెట్టడం ద్వారా ప్రభుత్వం దానిని నడపడం చాలా ముఖ్యమని కాంత్ అన్నారు. ఈ నివేదిక ప్రకారం, వార్షిక డీజిల్ , పెట్రోల్ వినియోగం 2030 నాటికి 156 మిలియన్ టన్నుల దాకా తగ్గనుంది. తద్వారా సంవత్సరానికి 3.9 లక్షల కోట్ల రూపాయల ($ 60 బిలియన్) ఆదాయాన్ని పొదుపు చేయగలుగుతుంది. పాసెంజర్ మొబిలిటీ సంబంధిత డిమాండ్64 శాతం తగ్గడంతోపాటు, 2030 నాటికి 37శాతం కార్బన్ ఉద్గారాలను నిరోధించకలుగుతుందని నివేదిక అంచనా వేసింది. '2030 నాటికి వార్షిక డీజిల్, పెట్రోల్ తగ్గింపు 156 మిలియన్ టన్నుల చమురుతో సమానమవుతుందని నివేదించింది. -
దేశంలోనే పొడవైన సొరంగ మార్గం ఇదే
-
ఇక ఏడాది పొడవునా రవాణా
జమ్మూ కశ్మీర్ సొరంగ మార్గంతో తప్పనున్న కొండచరియల ముప్పు జమ్మూ నుంచి శ్రీనగర్‌కు 295 కిలో మీటర్ల దూరం. కశ్మీర్లో ప్రయాణం హిమాలయ పర్వతశ్రేణుల గుండా సాగుతుంది. పట్నిటాప్–కుడ్–బటోటే పర్వత శ్రేణుల గుండా ప్రయాణం అత్యంత కఠినమైనది. మంచు కురవడం, కొండచరియలు విరిగిపడటం కారణంగా ఇక్కడ రోజుల తరబడి ట్రక్కులు నిలిచిపోతుంటాయి. దీనిని నివారించి, ఏడాది పొడవునా అంతరాయం లేకుండా రవాణా సాగాలనే ఉద్దేశంతో నిర్మించినదే చెనాని–నాష్రి సొరంగమార్గం. ఏప్రిల్ 2న ప్రధాని నరేంద్ర మోదీ ఈ మార్గాన్ని ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో సొరంగమార్గం ప్రత్యేకతలు... ► 9.2 కిలోమీటర్ల చెనాని–నాష్రి సొరంగ మార్గం దేశంలోనే అత్యంత పొడవైనది. ప్రపంచంలో అత్యంత పొడవైన సొరంగమార్గం నార్వేలో (24.51 కిలోమీటర్లు) ఉంది. ► దిగువ హిమాలయ పర్వతశ్రేణుల్లో... సముద్ర మట్టా నికి 1,200 మీటర్ల ఎత్తులో సొరంగమార్గం తొలిచారు. ► ఈ సొరంగమార్గంతో జమ్మూ– శ్రీనగర్‌ల మధ్య దూరం 30 కి.మీ, ప్రయాణ సమయం రెండు గంటలు తగ్గుతుంది. ► రోజుకు రూ. 27 లక్షల రూపాయల విలువైన ఇంధనం ఆదా అవుతుందని అంచనా. ► 2011 మే 23న పనులు ప్రారంభ మయ్యాయి. ► ప్రారంభంలో అంచనా వ్యయం రూ.2,519 కోట్లు కాగా దీని నిర్మాణానికి మొత్తం రూ. 3,720 కోట్ల రూపాయలు ఖర్చయ్యాయి. ► 13 మీటర్ల వ్యాసార్ధం కలిగిన ప్రధాన సొరంగ మార్గానికి సమాంతరంగా ఆరు మీటర్ల వ్యాసార్ధంతో అత్యవసర మార్గాన్ని కూడా నిర్మించారు. ఏదైనా ప్రమాదాలు జరిగినపుడు ప్రధాన మార్గం నుంచి అత్యవసర మార్గానికి మళ్లడానికి ప్రతి 300 మీటర్ల దూరానికి ఒకటి చొప్పున మొత్తం 29 పాసేజ్‌లు ఉన్నాయి. ► ఈ సొరంగంలో 124 సీసీ కెమెరాలను అమర్చారు. నిరంతరం లైట్లు వెలుగుతూ ఉంటాయి. తాజా గాలిని లోపలికి పంపే ఏర్పాట్లున్నాయి. ► ఎయిర్టెల్, ఐడియా, బీఎస్ఎన్ఎల్ సంస్థలు సొరంగం లోపల తమ సిగ్నల్స్ అందే ఏర్పాట్లు చేశాయి. అలాగే ఎఫ్ఎం రేడియో సిగ్నల్స్‌ను ప్రసారం చేసే రిపీటర్స్ కూడా ఉన్నాయి. ► గరిష్ట వేగపరిమితి 50 కిలోమీటర్లు. హెడ్‌లైట్స్ లోబీమ్‌లో ఉంచి ప్రయాణించాలి. ► శ్రీనగర్‌లో ప్రారంభమై కన్యాకుమారి దాకా సాగే జాతీయ రహదారి 44పై ఈ టన్నెల్ ఉంది. మొత్తం 3,745 కిలోమీటర్ల పొడవుండే ఈ రహదారి తెలం గాణ, ఆంధ్రప్రదేశ్‌లు సహా 11 రాష్ట్రాల గుండా వెళ్తుం ది. భారత్‌లో అత్యంత పొడవైన జాతీయ రహదారి ఇదే. – సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
మాదకద్రవ్యాల అక్రమ రవాణాను అరికట్టాలి
పెడదోవ పడుతున్న కళాశాలల యువత గంజాయి నియంత్రణకు వివిధ శాఖలకు ప్రత్యేక నిధులు రాష్ట్ర పోలీస్ ఉన్నతాధికారులు, వివిధ శాఖల అధికారుల సమావేశంలో డీజీపీ సాంబశివరావు రాజమహేంద్రవరం క్రైం :దేశాన్ని టెర్రరిజంలా పట్టిపీడిస్తున్న మాదకద్రవ్యాల అక్రమ రవాణాను అరికట్టాలని రాష్ట్ర డీజీపీ ఎన్.సాంబశివరావు పేర్కొన్నారు. గురువారం రాజమహేంద్రవరంలోని లాహస్పిన్ హోటల్లో గంజాయి, ఇతర మాదకద్రవ్యాల సాగు, అక్రమ రవాణాను అరికట్టేందుకు తీసుకోవలసిన చర్యలపై రాష్ట్రంలోని అన్ని శాఖల ఉన్నతాధికారులతో సమీక్షించారు. రాష్ట్రంలో వివిధ ఇంజనీరింగ్ కళాశాలల్లో గంజాయి, ఇతర మాదకద్రవ్యాలు వినియోగించిన యువత పెడదోవ పడుతోందన్నారు. అన్ని శాఖలు సమన్వయంతో మారకద్రవ్యాల సాగు, అక్రమ రవాణాపై సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకోవాలని సూచించారు. విశాఖ రూరల్ ఏజెన్సీ ప్రాంతాల నుంచి ఎక్కువ శాతం గంజాయి అక్రమ సాగు, రవాణా జరుగుతోందని దీనిని అరికట్టేందుకు రైళ్లలో కట్టుదిట్టమైన గస్తీ ఏర్పాటు చేయాలన్నారు. ఏజన్సీలో గంజాయి సాగు గుర్తించేందుకు ఆధునిక పరిశోధన సంస్థ ద్వారా శాటిలైట్ చిత్రాల ఆధారంగా గంజాయి సాగుపై చర్యలు చేపట్టాలన్నారు. మాదక ద్రవ్యాలకు అలవాటు పడిన విద్యార్థుల తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇవ్వాలన్నారు. సీఐడీ అడిషనల్ డీజీపీ సీహెచ్ ద్వారాకా తిరుమల రావు, అడిషనల్ డీజీపీ రైల్వేస్ కె.ఆర్.ఎం కిషోర్ కుమార్, అడిషినల్ డీజీపీ లా అండ్ ఆర్డర్ హరీష్ కుమార్ గుప్త, నార్త్ కోస్టల్ జోన్ ఐజీపీ కుమార్ విశ్వజిత్, ఐజీపీ సీఐడి (ఇఓడబ్లు్య) అమిత్ గార్గ్, విశాఖ సీపీ టి.యోగానంద్, ఎన్ఫోర్స్మెంట్ ఎక్సైజ్ డైరెక్టర్ కె. వెంకటేశ్వరరావు, డీఐజీ విశాఖ రేంజ్ సిహెచ్ శ్రీకాంత్, డీఐజీ ఏలూరు రేంజ్ పీవీఎస్ రామకృష్ణ, రాజమహేంద్రవరం ఎస్పీ బి.రాజకుమారి, తూర్పు గోదావరి జిల్లా ఎస్పీ ఎం.రవి ప్రకాష్, పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ భాస్కర భూషణ్, విజయవాడ రైల్వే ఎస్పీ సిముషిబాజ్పై, గుంతకల్లు రైల్వే ఎస్పీ ఎం.సుబ్బారావు, విశాఖపట్నం రూరల్ ఎస్పీ రాహుల్ దేవ్‌శర్మ, విజయనగరం ఎస్పీ ఎల్.కె.వి.రంగారావు, శ్రీకాకుళం ఎస్పీ జె.బ్రహ్మారెడ్డి, కృష్ణా జిల్లా ఎస్పీ కె. విజయ్ కుమార్, ఇతర శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
నేడు భారత్ బంద్
-
నేడు భారత్ బంద్
♦ బ్యాంకింగ్, రవాణా, టెలికం సేవలకు తీవ్ర అంతరాయం ♦ సమ్మెలో పాల్గొంటున్న 10 కేంద్ర కార్మిక సంఘాలు ♦ 12 డిమాండ్లపై కేంద్రం వైఖరికి నిరసనగా బంద్: కార్మిక సంఘాలు ♦ కనీస వేతనం రూ. 18 వేలు, పెన్షన్ రూ. 3 వేలు చేయాలని డిమాండ్ న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా నేడు కేంద్ర కార్మిక సంఘాల బంద్‌తో ప్రభుత్వ కార్యాకలాపాలు స్తంభించనున్నాయి. బ్యాంకింగ్, ప్రజా రవాణా, టెలికం వంటి కీలక సేవలకు తీవ్ర ఆటంకం కలిగే అవకాశాలున్నాయి. తమ డిమాండ్లపై కేంద్రం ఉదాసీనత, కార్మిక వ్యతిరేక చట్ట సవరణలకు నిరసనగా 10 కేంద్ర కార్మిక సంఘాలు బంద్‌కు పిలుపునిచ్చాయి. ఆర్ఎస్ఎస్ అనుబంధ బీఎంఎస్(భారతీయ మజ్దూర్ సంఘ్) మినహా అన్ని ప్రధాన సంఘాలు బంద్‌లో పాల్గొంటున్నాయి. సమ్మెలో 18 కోట్ల మంది ఉద్యోగులు, కార్మికులు పాల్గొంటారని అంచనా. తమ డిమాండ్ల పరిశీలనకు కేంద్రం హామీ, రెండేళ్ల బోనస్, కనీస వేతనం రూ.350కి పెంపు చర్యలు సరిపోవ ంటూ కార్మిక సంఘాలు సమ్మెకు దిగాయి. నెలకు కనీస వేతనం రూ. 18 వేలు చేయాలని, నెలకు రూ. 3 వేల కనీస పెన్షన్ వంటి 12 డిమాండ్లు పరిష్కరించాలన్నాయి. ‘12 అంశాలతో కూడిన డిమాండ్ల పరిష్కారంపై ప్రభుత్వ నిర్లక్ష్యం, ఏకపక్ష కార్మిక వ్యతిరేక చట్ట సవరణల్ని నిరసిస్తూ సంఘటిత, అసంఘటిత రంగ కార్మికులు రోడ్లపై నిరసన తెలుపుతారు’ అని కార్మిక సంఘాల సమన్వయ కమిటీ ప్రధాన కార్యదర్శి తివారీ చెప్పారు. కార్మికులతో ఘర్షణ పడాలని తమ ప్రభుత్వం కోరుకోవడం లేదని, వారి సహకారం, మద్దతు కావాలని కార్మిక మంత్రి దత్తాత్రేయ అన్నారు. మొత్తం 12 డిమాండ్లలో ఎనిమిది కార్మిక శాఖకు సంబంధించినవి కాగా వాటిలో ఏడింటిని అంగీకరించామని చెప్పారు. కనీస వేతనం రూ. 18 వేలు సహేతుకమే: సమ్మెతో ఓడరేవులు, పౌరవిమానయానం, రవాణా, టెలికం, బ్యాంకింగ్ రంగాలు స్తంభిస్తాయని టీయూసీసీ ప్రకటించింది. ఆస్పత్రులు, విద్యుదుత్పత్తి కేంద్రాల్లో సిబ్బంది బంద్‌లో పాల్గొంటారని, రోజువారీ విధులకు భంగం కలగకుండా నిరసన తెలుపుతారంది. కోల్ ఇండియా, గెయిల్, ఓఎన్జీసీ, ఎన్టీపీసీ, ఓఐఎల్, హెచ్ఏఎల్, బీహెచ్ఈఎల్ సిబ్బంది కూడా సమ్మెలో పాల్గొంటారని తివారీ చెప్పారు. తాము ఎక్కువ అడగడం లేదని, ఏడో వేతన సంఘం సిఫార్సుల మేరకు నెలవారీ కనీస వేతనం రూ. 18 వేలు చేయాలని కోరుతున్నామన్నారు. ధరల పెరుగుదల నేపథ్యంలో ఈ పెంపు సరైనదేనంటూ సమర్ధించుకున్నారు. నేటి సమ్మెలో రైల్వే, ఇతర కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పాల్గొనడం లేదు. 7వ వేతన సంఘం సిఫార్సుల మేరకు నెలవారీ వేతనం రూ. 18 వేల నుంచి దాదాపు రూ. 26 వేలకు పెంచాలన్న వారి డిమాండ్ పరిశీలనకు ఇప్పటికే కమిటీ ఏర్పాటు చేశారు. 11 రాష్ట్రాల్లో రాస్తారోకోలు: ఏఐటీయూసీ సంఘటిత, అసంఘటిత రంగాలకు సంబంధించిన పారిశ్రామిక ప్రాంతాలు, పలు విభాగాల్లో పెద్ద ఎత్తున నిరసనలు తెలుపుతామని ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్(ఏఐటీయూసీ) తెలిపింది. ఢిల్లీలోని ఓక్లా, కీర్తినగర్, మయపురి ఏరియా, వజీర్పూర్, మంగోల్‌పూరి, పత్పర్గంజ్ సహా అన్ని పారిశ్రామిక ప్రాంతాల్లో ర్యాలీ నిర్వహిస్తామని వెల్లడించింది. బ్యాంకులు, బీమా, యూనివర్సిటీ, తపాలా, టెలికం, రక్షణ, ఇంధన రంగాలకు చెందిన కార్మికులు, ఉద్యోగులు జంతర్‌మంతర్ నుంచి పార్లమెంట్ వరకు ర్యాలీ నిర్వహిస్తారని, అలాగే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, బిహార్, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, కర్నాటక సహా 11 రాష్ట్రాల్లో రాస్తారోకోలు చేస్తామని ఏఐటీయూసీ పేర్కొంది. ఆగస్టు 31న కేంద్ర కార్మిక శాఖ మంత్రి మాట్లాడారని, కార్మికులకు సరైన వేతనం, సాంఘిక భద్రతకు ఎన్డీఏ ప్రభుత్వం కట్టుబడి ఉందంటూ ఆగస్టు 31న మంత్రి దత్తాత్రేయ చెప్పారని తెలిపింది. రేడియాలజిస్టుల సమ్మె.. తమ సమస్యలపై కేంద్ర ప్రభుత్వం నుంచి సరైన హామీ రాకపోవడంతో రేడియాలజిస్టులు నేటి నుంచి నిరవధిక సమ్మె చేయనున్నారు. దీంతో రేడియాలజీ , అల్ట్రాసోనోగ్రఫీ, ఇతర స్కానింగ్ సేవలు తీవ్రంగా ప్రభావితం కానున్నాయి. స్తంభించనున్న బ్యాంకింగ్ రంగం ఆరు ప్రభుత్వ రంగ బ్యాంకు సంఘాల ఉద్యోగులు సమ్మెలో పాల్గొనాలని నిర్ణయించడంతో నేటి సమ్మెతో ఆ రంగం కార్యకలాపాలు ప్రభావితం కానున్నాయి. ఇప్పటికే వినియోగదారులకు బ్యాంకులు ఆ విషయాన్ని వెల్లడించాయి. ఆలిండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోషియేషన్(ఏఐబీఈఏ), బ్యాంకు ఎంప్లాయీస్ ఫెడెరేషన్ ఆఫ్ ఇండియా(బీఈఎఫ్ఐ), ఆలిండియా బ్యాంకు ఆఫీసర్స్ అసోషియేషన్(ఏఐబీఓఏ), ఆలిండియా ఆఫీసర్స్ కాన్ఫడరేషన్(ఎఐబీఓసీ), ఇండియన్ నేషనల్ బ్యాంకు ఆఫీసర్స్ కాంగ్రెస్‌లు బంద్‌కు నోటీసులిచ్చాయి. -
ఎస్సార్ వైజాగ్ టెర్మినల్ రికార్డు స్థాయి రవాణా
న్యూఢిల్లీ: ఎస్సార్ వైజాగ్ టెర్మినల్స్ లిమిటెడ్ (ఈవీటీఎల్) జూన్ త్రైమాసికంలో రికార్డు స్థాయిలో ఏడురెట్ల అధికంగా 2.19 మిలియన్ టన్నుల (ఎంటీ) ఐరన్ ఓర్ రవాణా చేసింది. గతేడాది ఇదే త్రైమాసికంలో ఇది కేవలం 0.31 ఎంటీలుగానే ఉంది. స్టీల్ రంగంలో పరిస్థితులు మెరుగు పడడంతోపాటు ప్రాజెక్ట్ మెరుగునకు చర్యలు తీసుకోవడమే అధిక వృద్ధికి తోడ్పడిందని కంపెనీ తెలిపింది. ఎస్సార్ పోర్ట్స్ అనుబంధ కంపెనీయే ఈవీటీఎల్. ప్రస్తుతం సగటున గంటకు 3వేల టన్నుల లోడింగ్ రేటు ఉండగా... జూలై - సెప్టెంబర్ త్రైమాసికంలో 4వేల టన్నుల లక్ష్యాన్ని కంపెనీ నిర్దేశించుకుంది. -
విశాఖ నుంచి నేపాల్‌కు కార్గో రైళ్లు
బాక్స్ రైళ్లు నడపనున్న పోర్టు విశాఖపట్నం: నేపాల్‌కు సరకు రవాణా పెరుగుతుండటంతో దానికి విశాఖ పోర్టు నుంచి ట్రాన్షిప్మెంట్ అవసరాలు కూడా అధికమవుతున్నాయి. ఈ నేపథ్యంలో అక్కడికి సరకు పంపేందుకు బాక్స్ రైళ్లు నడపాలని విశాఖ పోర్టు భావిస్తోంది. తగిన ఏర్పాట్లు కోసం రైల్వే శాఖతో సంప్రతింపులు మొదలెట్టింది. కోల్‌కతా పోర్టుతో ఇబ్బందులు పడుతున్న నేపాల్ వాణిజ్య రంగం... విశాఖ పోర్టును ప్రత్యామ్నాయంగా తీసుకుంటుండటడమే దీనిక్కారణం. ప్రస్తుతం నేపాల్‌కు ట్రాన్షిప్మెంట్ పోర్టుగా కోల్‌కతాను వాడుతున్నారు. అంటే సరకులు అక్కడికి నౌకల్లో వచ్చి... అక్కడి నుంచి నేపాల్‌కు భూ మార్గంలో వెళతాయన్న మాట. అయితే కోల్‌కతాలో చిన్న చిన్న వెసల్స్‌లో రవాణా చేస్తుండటంతో టర్నరౌండ్కు రెండున్నర రోజులు పడుతోంది. విశాఖ పోర్టు కేవలం ఒక్క పూటలోనే మదర్షిప్ నుంచి సరుకు దిగుమతి చేస్తోంది. దీంతో ప్రతి కంటైనర్‌పై రెండు వందల డాలర్ల లగేజీ ఖర్చు మిగులుతుంది. దీన్ని కూడా నేపాల్ పరిగనలోకి తీసుకుంటోంది. 1400 కిలోమీటర్లు..17 రోజులు: విశాఖ పోర్టు నుంచి నేపాల్‌లోని బీర్‌గంజ్‌కు మధ్యనున్న దూరం1400 కిలోమీటర్లు. గంటకు 100 కి.మీ. వేగంతో ప్రయాణించే రైళ్లను 90 బాక్స్‌లతో నడపడానికి ప్రత్నిస్తున్నట్లు విశాఖ పోర్టు అధికారులు చెప్పారు. కోల్‌కతా పోర్టు నుంచి నేపాల్‌కు దూరం సగమే. కానీ తాము కోల్‌కతా కన్నా త్వరగా సరకును గమ్యానికి చేరుస్తామని, అదే తమకు అనుకూలమని పోర్టు డిప్యూటీ చైర్మన్ ఎల్.హరనాధ్ నేపాల్‌కు ఇప్పటికే చెప్పారు. -
నత్తనడకన హవేళి ఘణాపూర్ రోడ్డు మరమ్మతులు
రోడ్డుపై నుండి విద్యుత్ స్థంభాలు తొలగించని వైనం అవస్థల్లో ప్రయాణికులు మెదక్‌రూరల్: గ్రామాలు అభివృద్ధి చెందాలంటే రవాణా సౌకర్యం అత్యవసరం. దీన్ని గుర్తించి ప్రభుత్వం కొన్ని మేజర్ గ్రామాలకు కొత్తరోడ్లు వేసేందుకు నిధులు మంజూరు చేసింది. కాని అధికారుల అలసత్వం...కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతో ఓ రోడ్డు పనులు నత్త నడకన సాగుతున్నాయి. దీంతో ప్రయాణీకులు, వాహనదారులు దుమ్ము,ధూళితో నరక యాతన అనుభవిస్తున్నారు. మెదక్ మండల పరిధిలోని రామాయంపేట ఆర్అండ్బి రోడ్డు నుండి హవేళి ఘణాపూర్ వరకు సుమారు 3కిలోమీటర్ల సింగిల్‌రోడ్డును డబుల్‌రోడ్డుగా నిర్మించేందుకు గత 8 నెలల క్రితం రూ.3.50కోట్లు ప్రభుత్వం మంజూరు చేసింది. పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతో పనులు చురుకుగా సాగడం లేదు. పనులు నత్తనడకన కొనసాగుతుండటంతో రోడ్డుపైన వేసిన కంకరతో వాహనదారులు, ప్రజలు ప్రయాణించలేక నానా పాట్లు పడుతున్నారు. కాగా ఈ రహదారిలోనే జిల్లాలోని ఏకైక డైట్ కళాశాల ఉంది. అలాగే మండలంలోని లింగ్సాన్‌పల్లి, తిమ్మాయిపల్లి గ్రామాలతోపాటు వైపీఆర్ ఇంజనీర్ కళాశాలకు ఇదే దారి కావడంతో విద్యార్థులతోపాటు ఆయా గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అంతేకాకుండా ఈముఖ్యంగా రామాయంపేట నుండి వయా హవేళిఘణాపూర్ మీదుగా నాగాపూర్ సబ్‌స్టేషన్‌కు 33కేవి హైటెన్షన్ విద్యుత్‌లైన్ వేశారు. ఈ స్థంభాలు తొలగిస్తే తప్ప రోడ్డు నిర్మాణ పనులు ముందుకు సాగవు. వాటిని తొలగించడంలో ట్రాన్స్‌కో అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. ఆర్అండ్బి, ట్రాన్స్‌కో శాఖల మధ్య సమన్వయంలేక రోడ్డు నిర్మాణ పనుల్లో తీవ్ర జాప్యం జరుగుతుందని గ్రామస్తులు భావిస్తున్నారు. పనులు ప్రారంభమై 8నెలలు గడుస్తున్నా వీటిని తొలగించడంలో అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తుందిఈ విషయంపై ఇప్పటికైన జిల్లా ఉన్నతాధికారులు స్పందించి రోడ్డుకు ఇరువైపుల ఉన్న స్థంభాలను తొలగించడంతో రోడ్డు పనులు త్వరితగతిన పూర్తి చేయాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు. -
ఇందూరు టు మహారాష్ట్రకు కల్తీకల్లు!
♦ సరిహద్దులో తిష్టవేసిన ‘బాసర బ్యాచ్’ ♦ ‘మిషన్ బాసర’తో జిల్లాకు ‘మాఫియా’ ♦ యంచలో రూ.12 లక్షలకు డిపో కొనుగోలు ♦ రైలుమార్గంలో భారీగా కల్తీ కల్లు రవాణా ♦ ఫకీరాబాద్, నాగేపూర్‌ల నుంచి సరఫరా ♦ ఎక్సైజ్, పోలీసుశాఖల మౌనం జిల్లాలో కల్తీ కల్లు ఏరులై పారుతోంది.. జిల్లాలో విక్రయాలు చాలవన్నట్లు మహారాష్ర్ట నుంచి రైళ్లలో కల్లు ముడిసరుకులు తెప్పించుకుంటూ.. మళ్లీ మహారాష్ర్టకు కల్లు సరఫరా చేస్తున్నారు. బాసర బ్యాచ్‌గా పిలవబడే ఈ కల్లు మాఫియాను పోలీసులు, ఎక్సైజ్ అధికారులు చూసీచూడనట్లు వదిలేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఏకంగా యంచలో రూ.12 లక్షలతో డిపోను కొనుగోలు చేశారంటే అర్థం చేసుకోవచ్చు. ప్రధానంగా ఫకీరాబాద్, నాగేపూర్‌ల నుంచి కల్లీ కల్లు సరఫరా అవుతోంది.. సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : కల్తీ కల్లు చిమ్ముతున్న విషానికి పదుల సంఖ్యలో ప్రాణాలు గాలిలో కలుస్తున్నా.. అధికారులు కళ్లు తెరవడం లేదు. కల్తీకల్లు రహిత జిల్లాగా మారుస్తామంటున్న ఎక్సైజ్‌శాఖ తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దులో నవీపేట మండలం యంచ, ఫకీరాబాద్, నాగేపూర్లలో యథేచ్ఛగా సాగుతున్న కల్తీకల్లు తయారీని పట్టించుకోవడం లేదు. ‘మిషన్ బాసర’తో అక్కడ దందాను వదిలి.. కల్లు దందాలో ఆరితేరిన ‘బాసర బ్యాచ్’ రూ.12 లక్షలకు యంచలో డిపోను కొనుగోలు చేసింది. యంచ కల్లు డిపో కేంద్రంగా నిషేధిత మత్తు పదార్థాలతో కల్లు తయారు చేసి ప్యాకెట్ల రూపేణా రోజుకు వేల లీటర్లు మహారాష్ట్రకు తరలిస్తున్నారు. యంచతోపాటు ఫకీరాబాద్, నాగేపూర్‌ల నుంచి తరలుతున్న కల్లీ కల్లు ఫకీరాబాద్ తోపాటు ఆదిలాబాద్ జిల్లా పరిధిలోకి వచ్చే బాసర రైల్వేస్టేషన్ నుంచి మహారాష్ర్టకు తరలుతుంది. యంచ డిపోను కొనుగోలు చేసి దందా నడిపిస్తున్న నిర్వాహకుని తండ్రిని ఐదు కిలోల క్లోరల్ హైడ్రేడ్, 25 కిలోల కల్లు తయారీకి ఉపయోగించే ఇతర ముడి సరుకులను పట్టుకున్న ఆబ్కారీశాఖ అధికారులు.. ఆ తర్వాత అటువైపు చూడటం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. నాలుగు నెలలుగా జిల్లాకు చెందిన మరో ఇద్దరిని కలుపుకుని ‘బాసర బ్యాచ్’ కొనసాగిస్తున్న కల్లుదందా రూ.లక్షలు కురిపిస్తుండగా.. పోలీసు, ఎక్సైజ్‌శాఖలు మౌనం వహించడం చర్చనీయాంశం అవుతోంది. ‘మిషన్ బాసర’తోజిల్లాలో కల్లు మాఫియా తిష్ట ఆదిలాబాద్ జిల్లా బాసర కేంద్రంగా కల్తీకల్లు దందా నిర్వహించి రూ.కోట్లు గడించిన కల్లు మాఫియా జిల్లాలో మకాం వేసింది. సుమారు ఐదు మాసాల క్రితం బాసరకు చెందిన యువత, సామాజిక కార్యకర్తలు సరస్వతి దేవి కొలువున్న చోట కల్తీ కల్లు, మద్యం విక్రయాలు చేయరాదంటూ ‘మిషన్ బాసర’కు శ్రీకారం చుట్టాయి. కల్తీకల్లు దందా సర్వస్వంగా మారిన ‘బాసర బ్యాచ్’ జిల్లాలోని నవీపేట మండలం యంచ డిపోను రూ.12 లక్షలు స్థానిక నిర్వాహకులకు చెల్లించి హస్తగతం చేసుకుంది. పాత పద్ధతిలోనే మహారాష్ట్రలోని ధర్మాబాద్ నుంచి నవీపేట మండలం యంచ, ఫకీరాబాద్లకు కల్లు తయారీకి ఉపయోగించే మత్తు పదార్థాలు తెచ్చుకుంటున్నా పోలీసులు, ఎకై ్సజ్ అధికారులు పట్టించుకోవడం లేదు. క్రిమి సంహారక మందుల తయారీకి ఉపయోగించే రసాయనాలను ధర్మాబాద్ నుంచి కొనుగోలు చేసి కల్తీ కల్లు తయారు చేస్తూ.. తిరిగి ప్రాంతాలకే సరఫరా చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటం అడుతున్నారు. డైజోఫాం, క్లోరల్ హైడ్రేడ్, క్లోరోఫాంలు (మత్తుకోసం), శక్రీన్ (రుచి కోసం), తెల్లపౌడర్ (చిక్కదనం కోసం), కుంకుడు కాయల రసం(నురుగు కోసం)లు కలిపి కల్లు తయారు చేస్తున్నారు. ఈ ప్రాంతాల్లో ఇంతగా కల్తీకల్లు తయారీ, విక్రయాల దందా సాగుతుంటే ఎకై ్సజ్ అధికారులు మాత్రం గోల్లుగిల్లుకుంటున్నారు. పేదల పాలిట కాలయముల్లా తయారైన కల్తీ కల్లు వ్యాపారులంటే అధికార యంత్రాంగానికి అపారమైన ప్రేమ ఉంటుంది. ‘‘ఒత్తిడి ఎక్కువైతే అప్పుడప్పుడు కల్లును ఒలకబోస్తారే తప్పా.. వారిపై ప్రేమ ఒలకబోయకుండా ఉండరన్న’’ విమర్శలు ఉన్నాయి. ఇదిలా వుంటే ధర్మాబాద్ నుంచి మత్తు పదార్థాలు తెచ్చి యంచ, ఫకీరాబాద్, నాగేపూర్లు కేంద్రంగా కల్తీ కల్లు తయారు చేస్తున్న నిర్వాహకులు రైలుమార్గం ద్వారా మహారాష్ర్టలోని పల్లెలకు సరఫరా చేస్తున్నా ఎకై ్సజ్, పోలీసులు పట్టించుకోవడం లేదన్న విమర్శలు కూడా ఉన్నాయి. కల్లు మాఫియాకు వరంగా రైలుమార్గం బాసరలో కల్లు దందా జోరుగా నిర్వహించిన కల్లు మాఫియా ఇప్పుడు జిల్లా సరిహద్దులో మకాం వేయగా.. అప్పుడు, ఇప్పుడు మహారాష్ట్ర పేద మహిళలే ‘బాసర బ్యాచ్’కు టార్గెట్. ‘తక్కువ ధర’ పేరిట కల్లు ప్యాకెట్లను తయారు చేసి మహిళలతో ఈ ప్యాకెట్లను మహారాష్ట్రకు సరఫరా చేస్తున్నారు. రైలుమార్గం ఈ కల్లు మాఫియాగా వరంగా మారింది. యంచతోపాటు ఫకీరాబాద్, నాగేపూర్ గ్రామాలలోని కల్లు బట్టీల నుంచి మహారాష్ట్రలోని ధర్మాబాద్, నాందేడ్, ముద్కెడ్, జల్నా తదితర ప్రాంతాలకు కల్లు సరఫరా అవుతుంది. ఫకీరాబాద్ రైల్వే స్టేషన్లో ప్యాసింజర్ రైలు ఆగుతుంది. ఈ రైళ్లలోనే సరఫరా ముఠాలు కల్లును సరఫరా చేస్తున్నాయి. యువకులు, మహిళలు, పిల్లలు, వృద్ధులు రైళ్లలో ఇక్కడ దిగి, ప్యాకెట్లలో కల్లును నింపుకుని మళ్లీ మరొక రైలులో వెళ్తున్నారు. ఈ స్టేషన్ మీదుగా అయిదు ప్యాసింజర్ రైళ్లు రాకపోకలు సాగిస్తాయి. వీరి కోసం కల్లు బట్టీలలో ప్రత్యేక గదులను ఏర్పాటు చేశారు. రైలు ఆగిందంటే వీరి రాక కోసం కల్లు బట్టీల నిర్వాహకులు ఎదురుచూస్తారు. ఒక్కో వ్యక్తికి 30 నుంచి 50 ప్యాకెట్లను ఇచ్చి వారికి ఒక్కొక్కరికీ రోజుకు రూ.300 నుంచి రూ.500 వరకు గిట్టుబాటు కలిగేలా వ్యాపారులు చూసుకుంటున్నారు. ‘బాసర బ్యాచ్’కు అందరినీ కలుపుకుని ఈ దందా సాగిస్తుండగా యంచ, ఫకీరాబాద్, నాగేపూర్‌ల నుంచి రోజుకు పెద్ద ఎత్తున మహారాష్ర్టకు కల్తీ కల్లు రవాణా అవుతోంది. కల్లు డిపోలపై ప్రత్యేక బృందాల దాడి శాంపిల్స్ సేకరించిన అధికారులు నిజామాబాద్ క్రైం : నిజామాబాద్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలోని కల్లు డిపోలపై ఎక్సైజ్ శాఖ ప్రత్యేక బృందాలు బుధవారం దాడులు నిర్వహిం చాయి. డిపోలో తయారైన కల్లు శాంపిళ్లను సేకరించాయి. కల్తీ కల్లు నివారణ చర్యల్లో భాగంగా ఎక్సైజ్ శాఖ జిల్లా ఇన్చార్జి డిప్యూటీ కమిషనర్ డేవిడ్ రవికాంత్ ఆదేశాల మేరకు ఈఎస్ టాస్క్‌ఫోర్స్, ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఆకస్మిక దాడులు చేశా రు. నిజామాబాద్‌కు చెందిన సిబ్బంది కా ్జజీండా ఆర్మూర్, మోర్తాడ్ స్టేషన్లకు చెందిన ఎక్సైజ్ సిబ్బందితో ఈ దాడులు చేయిం చడం విశేషం. నిజామాబాద్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో గల నిజామాబాద్ మండలం గూపన్పల్లి, మాధవనగర్, బోర్గాం (పీ) కల్లు డిపోలపై ఈ దాడులు జరిగాయి. ఆయా డిపోల్లో తయారైన కల్లు శాంపిల్స్‌ను అధికారులు సేకరించారు. నిజామాబాద్ నగరంలో ఒకటి, రెండో కల్లు డిపోల లెసైన్స్‌లు రద్దు కావటంతో కల్లు ప్రియులు నిజామాబాద్ నగర ం చుట్టు పక్కల గ్రామాలకు వెళ్లి కల్లు సేవించడమే కాకుండా, ఇంటికి ప్యాకెట్లలో తెచ్చుకుంటున్నారు. దాంతో ఆయా కల్లు డిపోలు అధికంగా లాభాలు ఆర్జిస్తున్నాయి. దీనిని దృష్టిలో పెట్టుకుని, డిపో నిర్వాహకులు కల్లును మరింత ఎక్కువ తయారు చేసి విక్రయించేందుకు కల్లులో ఏమైనా మత్తుపదార్థాలు కలుపుతున్నారా అన్న అనుమానంతో ఇన్చార్జి డీసీ టాస్క్‌ఫోర్స్, ఎన్ఫోర్స్మెంట్ బృందాలతో తనిఖీలు చేయించారు. డిపోలలో తయారైన కల్లు శాంపిల్స్‌ను సేకరించి వాటిని ల్యాబ్‌కు పంపారు. కల్లులో ఏమైనా మత్తు పదార్థా లు కలిపినట్లుగా పరీక్షల్లో తేలితే నిర్వాహకులపై చర్యలు తీసుకోనున్నారు. -
రైట్.. రైట్
♦ జోరుగా కాల్షియం కార్బైడ్ రవాణా ♦ చర్యలు తీసుకోవాలని హైకోర్టు ఆదేశం ♦ స్పందించని అధికారులు ప్రొద్దుటూరు టౌన్: పండ్లను మాగబెట్టేందుకు వినియోగిస్తున్న కాల్షియం కార్బైడ్ జిల్లాలో జోరుగా రవాణా అవుతోంది. అక్రమంగా రవాణా చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఈ నెల 6న ఆదేశించింది. ఈ నేపథ్యంలో జిల్లా పరిస్థితిని పరిశీలిస్తే.. ఆ దిశగా అధికారులు చర్యలు తీసుకోవడం లేదు. జిల్లాలో కడప, ప్రొద్దుటూరు, రైల్వే కోడూరు, రాజంపేట, రాయచోటి, తదితర ప్రాంతాల్లో ఉన్న కొందరు వ్యాపారులు ప్రైవేటు ట్రాన్స్‌పోర్టు ద్వారా పెద్ద ఎత్తున తెప్పిస్తున్నారు. కాల్షియం కార్బైడ్‌ను బీరువాల తయారీకి వినియోగిస్తున్నారు. దీనిని సాకుగా చూపుతూ తెప్పించుకుంటున్నారు. తర్వాత కొందరు వ్యాపారులు పండ్లను మాగబెట్టే వారికి కిలోల ప్రకారం విక్రయిస్తున్నారు. గృహాలే గోడన్లుగా... పండ్లను మాగబెట్టేందుకు కాల్షియం కార్బైడ్‌ను వినియోగిస్తుండటంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేయడంతో పండ్ల మార్కెట్లపై అధికారులు దాడులు చేసి కేసులు నమోదు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కొందరు గృహాలను గోడౌన్లగా చేసుకుని మామిడి, సపోట పండ్లను మాగబెడుతున్నారు. వీటిని మార్కెట్లోకి తెచ్చి విక్రయిస్తున్నారు. ఈ విషయాన్ని అధికారులు గుర్తించడం లేదు. ప్రొద్దుటూరులో కొందరు వ్యాపారులు కాల్షియం కార్బైడ్ డబ్బాలను హైదరాబాద్, విజయవాడ తదితర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున తెప్పిస్తున్నారు. పట్టణంలోని కోనేటి కాలువ వీధి, మైదుకూరు రోడ్డులో ఉన్న కొందరు వ్యాపారులు కాల్షియం కార్బైడ్‌ను తెప్పించి విక్రయిస్తున్న విషయం అధికారులకు తెలిసినా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. కాల్షియం కార్బైడ్ అమ్మకాలు, పండ్లను నిల్వ చేసేందుకు తీసుకోవాల్సిన అనుమతుల గురించి అధికారులు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. గతంలో ప్రొద్దుటూరు, కోడూరు, కడప తదితర ప్రాంతాల్లో ఫుడ్ సేఫ్టి, మున్సిపల్ అధికారులు కాల్షియం కార్బైడ్ నిల్వలను స్వాధీనం చేసుకున్నారు. అయినా వ్యాపారులు తర్వాత నిల్వ ఉంచుతున్నారు. లెసైన్స్‌లు తప్పనిసరి కాల్షియం కార్బైడ్ పేలుడు పదార్థం కాబట్టి లెసైన్స్‌లు తప్పనిసరిగా తీసుకోవాలి. ఎవరికి విక్రయిస్తున్నారు, ఎంత మోతాదులో విక్రయిస్తున్నారు, ఏ అవసరానికి దాన్ని వాడుతున్నారు అనే వివరాలు కూడా దుకాణదారులు నమోదు చేయాల్సి ఉంది. అలాగే ఎక్కువ నిల్వ ఉంచకూడదు. కాల్షియం కార్బైడ్ విక్రయిస్తున్న వ్యాపారుల ట్రేడ్ లెసైన్స్‌లను మున్సిపల్ అధికారులు రద్దు చేసి, వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉన్నా అధికారులు ఆ దిశగా చర్యలు చేపట్టలేదు. ప్రైవేటు ట్రాన్స్‌పోర్టులపై కూడా అధికారులు తూతూమంత్రంగా నిఘా ఉంచుతున్నారు. దీంతో ప్రొద్దుటూరులోని పోలీస్స్టేషన్ల సమీపంలో ఉన్న ట్రాన్స్‌పోర్టుల ద్వారానే రవాణా చేస్తున్నారు. దీంతో అధికారులు ప్రధానంగా రవాణాపై దృష్టి సారించాల్సి ఉంది. ఇప్పటికైనా పోలీసు, మున్సిపల్, ట్రాన్స్‌పోర్టు, ఫుడ్ సేఫ్టి అధికారులు సమన్వయంగా వ్యవహరించి అరికట్టాలని ప్రజలు కోరుతున్నారు. -
అమరావతిలో భారీగా ఇంటి అద్దెలు
♦ రవాణా సౌకర్యం అస్తవ్యస్తంగా ఉంది ♦ సచివాలయ మహిళా ఉద్యోగుల అసంతృప్తి ♦ తాత్కాలిక సచివాలయ సందర్శన తుళ్లూరు రూరల్: రాజధాని ప్రాంతంలో ఇంటి అద్దెలు భారీగా ఉన్నాయని, రవాణా సౌకర్యాలు కూడా అస్తవ్యస్తంగా ఉన్నాయని సచివాలయ మహిళా ఉద్యోగులు అసంతృప్తి వ్యక్తం చేశారు. వెలగపూడిలో నిర్మిస్తున్న తాత్కాలిక సచివాలయాన్ని బుధవారం ఏపీ సచివాలయ మహిళా ఉద్యోగులు సందర్శించారు. వారిని సచివాలయ ప్రాంగణంలో గుంటూరు జేసీ చెరుకూరి శ్రీధర్ ఆహ్వానించారు. అనంతరం వారితో ఏర్పాటు చేసిన సమావేశంలో జేసీ మాట్లాడుతూ.. విభజన కారణంగా ఎన్నో ఇబ్బందులు ఉన్నప్పటికీ, ఉత్సాహంతో జూన్ నెలాఖరుకు అమరావతికి వచ్చేందుకు ముందుకు రావడంపై వారిని అభినందించారు. ఈ సందర్భంగా ప్రభుత్వం చేయాలనుకున్న అభివృద్ధి గురించి వారికి వివరించారు. మహిళా ఉద్యోగులను తమ అభిప్రాయాలు చెప్పాలని జేసీ కోరడంతో ఇక్కడ ఇంటి అద్దెలు రూ.10-15 వేలకు పైగా ఉన్నాయని తెలిసిందని, రవాణా సౌకర్యం అస్తవ్యస్తంగా ఉందని, ఇది ఇబ్బందికరమని పేర్కొన్నారు. ఆప్సా అధ్యక్షురాలు సత్య సులోచన మాట్లాడుతూ మహిళలుగా తమకు చాలా ఇబ్బందులు ఉన్నప్పటికీ ఏపీ అభివృద్ధిని కాంక్షిస్తూ జూన్ నెలాఖరుకు వచ్చేందుకు సిద్ధమన్నారు. అయితే సౌకర్యాలు, నిర్మాణాలు అసంతృప్తిగా ఉన్నాయన్నారు. ఇంతవరకు కనీసం డ్రైనేజీ, విద్యుత్తు, తాగునీరు, మరుగుదొడ్లు వంటి కనీస సౌకర్యాలు కల్పించలేకపోయారని,గడువు నెల రోజులే ఉన్నందున వసతులు లేక ఇబ్బంది కలుగుతుందన్నారు. ఆప్సా రాష్ట్ర కార్యదర్శి ప్రశాం తి, తహసీల్దార్ సుధీర్‌బాబు, సీఆర్డీఏ ఐటీ సోషల్ డెరైక్టర్ ప్రభాకరరెడ్డి, ల్యాండ్ డెరైక్టర్ చెన్నకేశవులు తదితరులు పాల్గొన్నారు. -
విమానం కన్నా వేగంగా రైలులో...
లాస్ వెగాస్: విమానంకన్నా వేగంగా రైల్లో ప్రయాణించడానికి సిద్ధంగా ఉన్నారా? ఎలాంటి ట్రాఫిక్ సమస్యా లేకుండా గమ్య స్థానాలకు చేరుకోవాలనుకుంటున్నారా? వినూత్న ఆవిష్కారంతో హైపర్ లూప్ మార్గం.. ఇప్పుడు మీకు అందుబాటులోకి రానుంది. గంటకు పదకొండు వందల కిలోమీటర్ల వేగంతో.. విస్మయపరిచే ప్రయాణ అనుభవాన్ని మీకు అందిచనుంది. శాన్ ఫ్రాన్సిస్కో నుంచి లాస్ ఏంజిల్స్ కు కేవలం 35 నిమిషాల్లో చేరేందుకు హైపర్ లూప్ మార్గం అందుబాటులోకి వస్తోంది. 1100 కిలోమీటర్ల విమానానికి మించిన వేగంతో ప్రయాణీకులకు కొత్త అనుభవాన్ని అందించనుంది. హైపర్ లూప్ సంస్థ దీనికి సంబంధించి తాజాగా ప్రయోగాలు జరిపింది. ప్రముఖ హైబ్రిడ్ కార్ల తయారీ సంస్థ టెస్లా వ్యవస్థాపకుడు ఎలన్ మస్క్స్ తన హైపర్ లూప్ ఆలోచనను విజయవంతంగా ఆచరణలో పెట్టారు. ఈ నేపథ్యంలో ఇటీవల లాస్ వెగాస్ ఎడారి ప్రాంతంలో హైపర్ లూప్ టెక్నాలజీస్ కి సంబంధించిన హైపర్ లూప్ వన్ మొదటిసారి తమ కొత్త రవాణా సిస్టమ్ పై పూర్తి స్థాయి పరీక్షలు నిర్వహించింది. హైపర్ లూప్ ట్రాన్స్‌పోర్టేషన్ టెక్నాలజీస్... లారెన్స్ లివేర్మోర్ నేషనల్ లాబొరేటరీ నుంచి ఇండక్ ట్రాక్ పేరిట తన నూతన ఆవిష్కారానికి సాంకేతిక లైసెన్సును కూడ పొందింది. అనుకున్నట్లుగా అన్నీ జరిగితే హైపర్ లూప్ స్వంత ఆవిష్కారం త్వరలో మనముందు సాక్షాత్కరించి, అత్యంత వేగవంతమైన మార్గాన్ని సుగమం చేయనుంది. -
పాడేరు ఘాట్‌రోడ్డులో రాకపోకలకు విఘాతం
పాడేరు: విశాఖ జిల్లా పాడేరు ఘాట్‌రోడ్డులో పాడేరు - వడ్డాది ప్రధాన రహదారిపై వంట్లమామిడి వద్ద ఓ భారీ వృక్షం కూలిపోయింది. గురువారం తెల్లవారుజామున వచ్చిన భారీ గాలివానతో ఈ ఘటన చోటు చేసుకోగా ఆ మార్గంలో రెండు గంటలకు పైగా వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. పోలీసులు రంగంలోకి దిగి కూలిన వృక్షాన్ని తొలగించారు. -
లింకు తెగింది
► భూపాలపల్లిలో బొగ్గు ఉన్నా ► రామగుండం నుంచి రవాణా ► బొగ్గు దిగుమతిలో అడ్డదారులు ► జెన్కోకు కోట్లలో రవాణా భారం కోల్‌బెల్ట్(వరంగల్) : భూపాలపల్లి ఏరియా గనులలో ఉత్పత్తి అవుతున్న బొగ్గును సమీపంలోని కాకతీయ థర్మల్ పవర్ ప్రాజెక్టులో విద్యుత్ ఉత్పత్తి కోసం తీసుకోవడానికి టీఎస్ జెన్కో సింగరేణి యాజమాన్యంతో లింకేజీ కుదుర్చుంది. ఒప్పం ద నియమాలకు విరుద్ధంగా కేటీపీపీ అధికారులు వ్యవహరించడంతో జెన్కోపై సుమారు రూ.34కోట్లు అదనపు భారం పడింది. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు వివరాలు ఇలా ఉన్నారు. బొగ్గు, నీటి వనరులు అందుబాటులో ఉండడంతో తక్కువ ఖర్చుతో విద్యుత్ ఉత్పతి చేయవచ్చని వరంగల్ జిల్లా చెల్పూర్ సమీపంలో ప్రభుత్వ రంగంలో థర్మల్ పవర్ ప్రాజెక్టును ఏర్పాటు చేశారు. ఇందుకు భూపాపల్లి ఏరియూ గనుల నుంచి ఉత్పత్తి అరుున బొగ్గు తీసుకోవడానికి టీఎస్ జెన్కో, సింగరేణి మధ్య కోల్ లిం కేజీ ఒప్పందం జరిగింది. దాని ప్రకారం జి-11 గ్రేడ్ బొగ్గును టన్నుకు రూ.1300 చొప్పున ఇస్తున్నారు. 2015-16 ఆర్థిక సంవత్సరంలో రోజుకు సుమారు 10వేల టన్నుల చొప్పున మొత్తం 22లక్షల టన్నులు తీసుకోవాల్సి ఉంది. కేటీపీపీ ఇప్పటి వరకు 16,91,831 టన్నులు దిగుమతి చేసుకుంది. ఆర్థిక సంవత్సరం ముగి యడానికి 13 రోజులు మాత్రమే ఉంది. ఇంకా సుమారు 5లక్షల టన్నులు తీసుకోవాలి. ఏరి యాలోని గనుల వద్ద 1.1 మిలియన్ టన్నుల బొగ్గు ఉంది. అయినా కేటీపీపీ అధికారులు అదే గ్రేడ్ బొగ్గును రామగుండం ఏరియా జీడీకే-1 సీహెచ్‌పీ నుంచి 3,66,658 టన్నులు దిగుమతి చేసుకున్నారు. భూపాలపల్లి గనుల నుంచి కేటీపీపీకి 14 కిలోమీటర్ల దూరం ఉంది. ఇక్కడి నుంచి బొగ్గు దిగుమతి చేసుకుంటే రవా ణా ఖర్చు టన్నుకు రూ.5.85 పైసలు మాత్రమే అవుతుంది. జీడీకే సీహెచ్‌పీ నుంచి రైలు వ్యాగన్ల ద్వారా ఉప్పల్ వరకు రవాణా చేసిన బొగ్గు ను అక్కడ డంప్ చేసి తిరిగి రోడ్డు మార్గంలో 60కిలోమీటర్ల దూరంలోని కేటీపీపీకి తరలిం చారు. ఇలా చేయడం వల్ల లోడింగ్ అన్లోడింగ్ చార్జీలతో కలుపుకుని టన్నుకు రూ.900 చొప్పున సుమారు రూ.34కోట్ల రవాణా భారం అదనంగా పడినట్లు సమాచారం. అందుబాటులో ఉన్నా.. భూపాలపల్లిలో నిల్వలు పెరిగి పోవడంతో ఓపెన్మార్కెట్లో విక్రరుుంచడానికి మూడు నెలల క్రితం టెండర్ ద్వారా రామగుండం ఓసీపీ-3 సీహెచ్‌పీకి 3,78,229 టన్నులు రవాణా చేశారు. అదే బొగ్గు ఈ ఏడాది జనవరి 10న 4067 టన్నులు కేటీపీపీకి పంపించారు. రామగుండం, మణుగూరు నుంచి జీ-5గ్రేడ్ బొగ్గును సైతం దిగుమతి చేసుకుంటున్నారు. జీ-5 గ్రేడ్ భూపాలపల్లిలోనూ ఉత్పత్తి అవుతోంది. దగ్గరలో ఉన్న బొగ్గును తీసుకోకుండా దూర ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకోవడాన్ని బట్టి చూస్తే బొగ్గు రవాణాలో అధికారుల తీరు స్పష్టమవుతోంది. ఇదిలా ఉండగా భూపాలపల్లి నుంచి రామగుండంకు బొగ్గు రవాణా చేసే కాంట్రాక్టర్, ఉప్పల్ నుంచి కేటీపీపీ బొగ్గు రవాణా చేసే కాంట్రాక్టర్ ఒక్కరే కావటం గమనార్హం. అంతా కుమ్మకై అక్రమాలకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. కేటీపీపీ వారే తీసుకుపోవడం లేదు ఏరియా గనుల నుంచి జి-11 గ్రేడ్ బొగ్గు రోజుకు 7వేల టన్నులు ఉత్పత్తి అవుతోంది. ఇప్పటికే 9 లక్షల టన్నులు నిల్వ ఉంది. లింకేజీ ప్రకారం కేటీపీపీకి సరఫరా చేయటానికి ఎటువంటి ఇబ్బందులు లేదు. సత్వర రవాణాకు అత్యాధునిక వేరుుంగ్ బ్రిడ్జిలతోపాటు షావల్, డంపర్, లోడర్ యంత్రాలను సైతం సమకూర్చాం. అరుునా వారు తీసుకుపోవడం లేదు. - పి.సత్తయ్య, సింగరేణి ఏరియూ జీఎం, భూపాలపలి -
సరుకు రవాణా ఆదాయంపై డీజిల్ దెబ్బ
రవాణా చార్జీల పెంపు లేదు.. రైళ్లను వదిలి లారీలను ఆశ్రయిస్తున్న వ్యాపారులు బెంగళూరు: డీజిల్ ధరలు తగ్గడం రైల్వే శాఖకు ప్రతికూలంగా మారింది. సరుకు రవాణా కోసం ఇన్నాళ్లూ రైళ్లపై ఆధారపడిన వ్యాపారులు ఇప్పుడు లారీలు, ఇతర వాహనాలను ఆశ్రయిస్తున్నారు. రైళ్ల కంటే లారీల్లోనే వ్యయం తక్కువ కావడం ఇందుకు కారణం. డీజిల్ ధరలు క్రమంగా దిగివస్తుండడంతో రవాణా వ్యయం కూడా తగ్గుముఖం పడుతోంది. అందుకే సరుకు రవాణా ఆదాయంపై రైల్వేశాఖ పెద్దగా ఆశలు పెట్టుకోలేదు. పార్లమెంట్లో గురువారం ప్రవేశపెట్టిన 2016-17 రైల్వే బడ్జెట్‌ను పరిశీలిస్తే ఈ విషయం స్పష్టమవుతోంది. రైల్వేశాఖ సరుకు రవాణా చార్జీల్లో ఎలాంటి మార్పులు చేర్పులు చేయలేదు. గతేడాది 1,098 మిలియన్ టన్నుల సరకును రవాణా చేయగా.. ఈ ఏడాది కూడా అంతేమొత్తాన్ని రవాణా చేయాలని లక్ష్యంగా పెట్టుకుం ది. సరుకు రవాణాలో ప్రతిఏటా 10 వృద్ధిని లక్ష్యంగా పెట్టుకోవడం ఆనవాయితీగా వస్తోంది. కానీ, ఈసారి ఆ ఆనవాయితీ తప్పినట్లు కనిపిస్తోంది. రైల్వేశాఖకు సరుకు రవాణా ద్వారానే అత్యధిక ఆదాయం లభిస్తోంది. 2014-15లో మొత్తం ఆదాయంలో సరుకు రవాణా ద్వారా వచ్చిన ఆదాయం 67.4 శాతం కావడం గమనార్హం. సిమెంట్, ఇనుము, ఉక్కు వంటి వాటి రవాణా తగ్గడం వల్ల తమ సరుకు రవాణా ఆదాయం క్షీణిస్తోందని రైల్వే వర్గాలు తెలిపాయి. -
చెరుకు రైతుకు చేటు కాలం!
దిగుబడికి రవాణా దెబ్బ! దక్కన్ షుగర్స్ ఫ్యాక్టరీల మూసివేత ఫలితం కోరుట్ల : షుగర్ ఫ్యాక్టరీలను స్వాధీనం చేసుకునే అంశంపై నెలకొన్న సందిగ్ధత రైతులను నష్టాలపాలు చేస్తోంది. గత సీజన్లో చెరకు క్రషింగ్ నిర్వహించిన నిజాం దక్కన్ షుగర్స్ లిమిటెడ్ ఫ్యాక్టరీలు ఈ ఏడాది చేతులెత్తేశాయి. దక్కన్ షుగర్స్ నిర్వహణ కింద ఉన్న కరీంనగర్ జిల్లా ముత్యంపేట, నిజామాబాద్ జిల్లా బోధన్, మెదక్ ప్యాక్టరీల పరిధిలో చెరుకు సాగు చేసిన రైతులు క్రషింగ్ కోసం పంటను ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఇప్పటికే 80 శాతానికి మించి చెరకు తరలింపు.. క్రషింగ్ పూర్తయింది. స్థానికంగా ఉన్న ఫ్యాక్టరీలు మూత పడటంతో ఇతర ప్రాంతాలకు చెరకును తరలించక తప్పని పరిస్థితుల్లో రైతులు పెద్ద మొత్తంలో నష్టపాలయ్యారు. దక్కన్ షుగర్స్‌కు చెందిన మూడు ఫ్యాక్టరీలు మూత పడడంతో ఆయా ఫ్యాక్టరీల పరిధిలోని చెరకును ఇతర ఫ్యాక్టరీలకు తరలించినందుకు అయిన రవాణా ఖర్చులు ప్రస్తుతానికి రైతులే భరించాల్సి వచ్చింది. రవాణా ఖర్చులు ఇస్తామని చెప్పిన ప్రభుత్వం ఆ ఖర్చులు ఎప్పుడు ఇస్తుందోననే ఆందోళన ప్రజల్లో నెలకొంది. ఈ ఏడాది చెరుకు క్రషింగ్ కోసం కరీంనగర్ జిల్లా ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీ పరిధిలోని రైతులు నిజామాబాద్ జిల్లా కామారెడ్డి గాయత్రి ఫ్యాక్టరీ, మాఘీ ఫ్యాక్టరీకి చెరకు తరలించారు. ఈ రెండు ఫ్యాక్టరీలు ముత్యంపేటకు 100 నుంచి 150 కిలోమీటర్లు దూరంలో ఉన్నాయి. బోధన్ షుగర్ ఫ్యాక్టరీ పరిధిలో రైతుల్లో కొందరు మహారాష్ట్రలోని చెరకు ఫ్యాక్టరీలకు 120 కిలోమీటర్ల పైగా దూరం క్రషింగ్ కోసం తీసుకెళ్లగా మరికొందరు నిజామాబాద్ జిల్లా కామారెడ్డిలోని గాయత్రి ఫ్యాక్టరీకి చెరకు తరలించారు. మెదక్ జిల్లాలోని దక్కన్ షుగర్ ఫ్యాక్టరీ పరిధిలో రైతులు సంగారెడ్డి, జహీరాబాద్ ఫ్యాక్టరీలతోపాటు కామారెడ్డి గాయత్రి ఫ్యాక్టరీకి తరలించారు. రవాణాభారం సుదూర ప్రాంతాలకు చెరకును క్రషింగ్ కోసం తరలించిన రైతులకు రవాణా భారం మీద పడడంతోపాటు దిగుబడి నష్టపోయినట్లయింది. ముత్యంపేట, బోధన్, మెదక్ ఫ్యాక్టరీల పరిధి నుంచి 100 కిలోమీటర్ల దూరానికి మించి చెరకును తరలించిన రైతులు కనీసం పది శాతం చెరకు బరువు తగ్గిపోయి నష్టాలు ఎదుర్కొన్నారు. క్రషింగ్ చేస్తున్న ఫ్యాక్టరీకి చెరకును చేర్చినప్పటికీ అక్కడ రెండు రోజులకు మించి వెయిటింగ్లో ఉండాల్సి రావడంతో పంట ఎండిపోయి బరువు తగ్గిపోతోంది. స్థానికంగా ఉన్న ఫ్యాక్టరీలకు చెరకును తరలించిన సమయంలో ఓ లారీకి 20 టన్నుల బరువు తూగేది. ప్రస్తుతం దూరప్రాంతాలకు తరలిస్తే లారీ చెరకు కేవలం 18 టన్నులు మాత్రమే తూగుతోందని రైతులు వాపోతున్నారు. ఈ లెక్కన రైతులు ఒక్కో లారీకి రెండు టన్నులు అంటే రూ.5 వేలు నష్టపోతున్నారు. ఎకరానికి దిగుబడి 35 నుంచి 40 టన్నులు లెక్కన రవాణా ఫలితంగా రూ.10 వేలు నష్టం జరుగుతోంది. ఈ లెక్కన ఒక్క ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీ పరిధిలో 3 వేల ఎకరాల్లో చెరకు సాగు చేసిన రైతులు రూ.3 కోట్లు నష్టపోయారు. మూతపడ్డ మూడు దక్కన్ షుగర్స్ ఫ్యాక్టరీలను లెక్కలోకి తీసుకుంటే ఈ నష్టం రూ.10 కోట్లపై మాటే. ఈ సీజన్లో రైతులకు ఎదురైన కష్టాలు దృష్టిలో ఉంచుకుని కనీసం వచ్చే ఏడాదైనా ప్రభుత్వం దక్కన్ షుగర్స్ ఫ్యాక్టరీలను తెరిపించాలని రైతులు కోరుతున్నారు. -
గుదిబండ
గ్యాస్ బండలు వినియోగదారుల పాలిట గుదిబండల్లా మారుతున్నాయి. సిలిండర్ డెలివరీ చేసినందుకు 15 కిలోమీటర్ల మేరకు ఏజెన్సీలకు వినియోగదారులు రూపాయి కూడా చెల్లించాల్సినఅవసరంలేదు.. దీనిని దాచిపెట్టి ఏజెన్సీలు వినియోగదారుల నుంచి దండుకుంటున్నాయి.. అదేమని ప్రశ్నిస్తే.. సర్వీస్ చార్జ్ అని డెలివరీ బాయ్స్ సమాధానం చెబుతున్నారు... రవాణా పేరిట అదనపు వసూళ్లు గ్యాస్ ఏజెన్సీల ఘరానా దోపిడీ జిల్లాలో నెలకు సామాన్యుడిపై రూ.రెండు కోట్లపైనే భారం బాపట్లటౌన్ పట్టణంలోని రామకృష్ణాపురం కాలనీ.. గ్యాస్ ఏజెన్సీ ఉన్న ప్రాంతం నుంచి రెండు కిలోమీటర్ల లోపే ఉంటుంది. కాలనీకి చెందిన వి.శ్రీలతకు గ్యాస్ కంపెనీ నుంచి ఇటీవల సిలిండర్ వచ్చింది. బిల్లుపై రూ.642 ఉంటే డెలివరీ బాయ్ రూ.680 తీసుకున్నాడు. అదేంటని ప్రశ్నిస్తే అది అంతే.. సర్వీస్ ట్యాక్స్ అంటూ వెళ్లిపోయాడు. పట్టణంలోని ఇందిరానగర్ కాలనీకి చెందిన రాములమ్మకు గ్యాస్ వచ్చింది. ఆమె సిలిండర్‌కు సరిపడా రూ.645 ఇచ్చింది. ఇదేంటి సర్వీస్ చేసినందుకు రూ.50 ఇవ్వాలి.. లేదంటే సిలిండర్ వెనక్కు తీసుకుపోతా.. అని డెలీవరీ బాయ్ వసూలు చేశాడు. మరుప్రోలువారిపాలేనికి చెందిన మస్తానమ్మ గృహం గ్యాస్ ఏజెన్సీ నుంచి రెండు కి.మీ దూరంలో ఉంటుంది. ఆమెకు సిలిండర్ సరఫరా చేసినందుకు గ్యాస్ రేటు కంటే రూ.30 అదనంగా వసూలు చేశారు.. దండుకుంటున్న ఏజెన్సీలు కంపెనీ బిల్లుపై ఒక్క రూపాయి కూడా గ్యాస్ సిలిండర్ కోసం అదనంగా చెల్లించాల్సిన అవసరం లేదు. అయినా ఒక్కో సిలిండర్‌కు రవాణా చార్జీల కింద రూ.30 నుంచి 50 వరకూ వసూలు చేస్తున్నారు. ఇలా నెలకు సుమారు జిల్లా వ్యాప్తంగా రూ.రెండు కోట్లపైనే వినియోగదారుల నుంచి గ్యాస్ ఏజెన్సీలు దండుకుంటున్నాయి. ఆ అక్రమార్జనలో మాముళ్లు చేతులు మారుతుండటంతో మండల స్థాయి, జిల్లా స్థాయి అధికారులు పట్టించుకోవడంలేదన్న ఆరోపణలున్నాయి. నిబంధనలు.. గ్యాస్ ఏజెన్సీ ఉన్న ప్రాంతం నుంచి 15 కిలోమీటర్లలోపు ఉన్న వినియోగదారులకు కంపెనీ ధరకే సిలిండర్ అందజేయాల్సి ఉంది. ఆ తర్వాత కిలోమీటరకు రూ.5 చొప్పున వినియోగదారుల నుంచి వసూలు చేస్తారు. క్షేత్రస్థాయిలో ఇది ఎక్కడా అమలు జరగడంలేదు. ఏజెన్సీలకు కూతవేటు దూరంలో ఉన్న గృహాలకు సిలిండర్ వచ్చినా అదనంగా వసూలు చేస్తున్నారు. జిల్లా అధికారులకు తెలిసినా.. తెలియనట్టు! జిల్లా వ్యాప్తంగా సుమారు 70 ఏజెన్సీలు ఉన్నాయి. వీటి నుంచి నెలకు సరాసరి సుమారు 8.50 లక్షల సిలిండర్లు వినియోగదారులకు సరఫరా అవుతున్నాయి. ఒక్కో సిలిండర్‌కు రూ.30 చొప్పున చూస్తేనే 8.50 లక్షల సిలిండర్లకు రూ.2.55 కోట్లు వినియోగదారుల నుంచి దండుకుంటున్నారు. ఈ విషయం మండల స్థాయి జిల్లా స్థాయి అధికారుల దృష్టికి అనేకమంది తీసుకెళ్లినా ఫలితంలేకుండా పోతోంది. ఇప్పటికైనా అధికారులు స్పందించాల్సి ఉంది. బిల్లు కంటే అదనంగా రూపాయి కూడా చెల్లించొద్దు.. గ్యాస్ సిలిండర్ పై ఉన్న బిల్లు కంటే 15 కి.మీ లోపు డెలివరీ చేస్తే ఒక్కరూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. అదనంగా వసూలు చేస్తున్న ఏజెన్సీలపై ఫిర్యాదు చేస్తే సత్వరమే చర్యలు తీసుకుంటాం. - డీఎస్వో చిట్టిబాబు -
రిజిస్ట్రేషన్ మేడీజీ..
కొత్త రిజిస్ట్రేషన్ల చట్టం అమలుకు గ్రీన్ సిగ్నల్ వచ్చే నెల నుంచి అమలుకు కసరత్తు తాత్కాలిక రిజిస్ట్రేషన్లకు స్వస్తి వాహన యజమానులకు ఊరట మర్రిపాలెం: ‘రవాణా’లో కొత్త రిజిస్ట్రేషన్ల చట్టం అమలుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. వచ్చే నెల నుంచే కొత్త విధానం అందుబాటులోకి రానుంది. తాత్కాలిక రిజిస్ట్రేషన్లకు స్వస్తి చెబుతూ వాహనం కొనుగోలు సమయంలో శాశ్వత రిజిస్ట్రేషన్ అందించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. కొత్త వాహనాల రిజిస్ట్రేషన్ విధానంలో రవాణా శాఖ మార్పుకు సిద్ధపడింది. రాష్ట్రవ్యాప్తంగా ఫిబ్రవరి తొలి లేదా రెండో వారంలో కొత్త రిజిస్ట్రేషన్ల చట్టం అమలులోకి రానున్నట్టు కమిషనర్ ఇటీవల ప్రకటించారు. వాహనం కొనుగోలు తర్వాత రిజిస్ట్రేషన్ కోసం యజమానులు పడుడున్న ఇబ్బందులు గుర్తించి పరిష్కారం చూపించారు. ఇటీవల కాలంలో రిజిస్ట్రేషన్ల కోసం కౌంటర్లు కిక్కిరిసిపోతున్నాయి. వాహన యజమానుల నుంచి వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. రిజిస్ట్రేషన్ల ప్రక్రియలో దళారులు జేబులు నింపుకుంటున్నట్టు పరిశీలనలో తేలింది. షోరూమ్‌లతో దళారులు కుమ్మక్కై దోచుకుంటున్నారని రుజువైంది. దళారులతో పనిలేకుండా వాహన యజమాని నేరుగా రిజిస్ట్రేషన్ చేసుకునే విధంగా రవాణా శాఖ నిమగ్నమైంది. వాహన యజమాని రవాణా కార్యాలయానికి రాకుండా రిజిస్ట్రేషన్ జరుపుకోవడానికి నిర్ణయించింది. షోరూమ్‌లలో రిజిస్ట్రేషన్ ప్రక్రియ... వాహనాలు విక్రయించే షోరూమ్‌లలో రిజిస్ట్రేషన్ జరపాలని అధికారులు సిద్ధపడుతున్నారు. ప్రస్తుతం తాత్కాలిక రిజిస్ట్రేషన్ అందచేస్తున్నట్టుగా శాశ్వత రిజిస్ట్రేషన్ నంబర్ కేటాయిస్తారు. షోరూమ్‌లలో నిర్వాహకులు వాహనం, యజమాని వివరాలు ఆన్లైన్లో పొందుపరుస్తారు. ఇంకా వాహనం ఫోటోలు వివిధ కోణాలలో తీసి అప్లోడ్ చేస్తారు. ప్రతీ వాహనం ఇంజన్, చాసిస్ నంబర్ల ఆధారంగా రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తిచేస్తారు. యజమాని చిరునామా, గుర్తింపు, ఆధార్ పత్రాలు షోరూమ్‌లో స్వీకరిస్తారు. అక్కడే యజమాని సంతకం కంప్యూటర్ ప్యాడ్‌లో ఫీడ్ చేస్తారు. ఆయా షోరూమ్‌లలో పొందుపరిచిన వాహనాలను ఆన్లైన్లో రవాణా ఉద్యోగులు స్వీకరిస్తారు. యజమాని వివరాలు, పత్రాలు సరిపోల్చి రిజిస్ట్రేషన్ కార్డ్‌ను స్పీడ్ పోస్ట్‌లో చేరవేస్తారు. ఒకవేళ యజమాని పేరుతో మరో వాహన అదనంగా ఉన్నట్టుగా తేలితే షోరూమ్‌లలో టాక్స్ చెల్లించే విధంగా ఇప్పటికే ఉత్తర్వులు అమలులో ఉన్నాయి. యజమానులకు ఊరట షోరూమ్‌లలో శాశ్వత రిజిస్ట్రేషన్ మంజూరుతో వాహన యజమానులకు ఊరట లభించనుంది. దళారులు, రవాణా కార్యాలయానికి రాకుండా రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తవుతుంది. రవాణా శాఖ తెలియజేసిన చలానా ధరలు షోరూమ్‌లలో చెల్లించడంతో ఖర్చు తగ్గనుంది. శాశ్వత రిజిస్ట్రేషన్ల బాధ్యత షోరూమ్‌లకు అప్పగించడంతో రవాణా కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సిన అవసరం ఉండదని తెలుస్తోంది. ఫ్యాన్సీ నంబర్లకు ఈ-టెండరింగ్ విధానం ఫ్యాన్సీ నంబర్ల మంజూరుకు ఈ-టెండరింగ్ విధానం అమలు చేయాలని రవాణా శాఖ భావిస్తోంది. రిజిస్ట్రేషన్‌కు ముందుగా ఫ్యాన్సీ నంబర్లకు ఆన్లైన్లో బుకింగ్ జరుపుకోవచ్చు. ఆయా నంబర్లకు ఉంటున్న డిమాండ్‌ను బట్టి ఈ-టెండరింగ్‌లో పోటీపడాలి. ఎక్కువ బిడ్ దాఖలు చేసిన యజమానికి నంబర్ కేటాయిస్తున్నారు. ఇప్పటి వరకు కనీస ధర నిర్ణయించడం పోటీని బట్టి సీల్ టెండర్లు కోరడం జరిగేది. ఇకపై కనీస ధరతోపాటు పోటీ వాతావరణం కల్పించి ఆదాయం రాబట్టడానికి రవాణా శాఖ ఆలోచిస్తోంది. ఇక సాధారణ నంబర్లు వాహనం కొనుగోలు సమయంలో వరుస క్రమం ప్రకారం ఆన్లైన్లో కేటాయిస్తారు. -
ఇసుక అక్రమ రవాణా వాహనాల సీజ్
మహబూబ్‌నగర్: పాలమూరు జిల్లాలో ఇసుక అక్రమ రవాణాను రెవెన్యూ అధికారులు శుక్రవారం అడ్డుకున్నారు. పేబ్బేరు మండలంలోని వై శాఖాపూర్ గ్రామంలోని కృష్ణా తీరం నుంచి ఇసుకను అక్రమంగా తరలిస్తున్నట్టు అధికారులకు సమాచారం అందింది. దీంతో తహశీల్దార్ బాణప్ప ఆధ్వర్యంలో సిబ్బంది దాడులు నిర్వహించి అనుమతుల్లేకుండా ఇసుకను తరలిస్తున్న మూడు ట్రాక్టర్లు, ఒక డీసీఎం వాహనాన్ని సీజ్ చేశారు. ఇసుక అక్రమ రవాణాపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. -
నిస్సాన్‌తో ఓలా ఒప్పందం
హైదరాబాద్: వ్యక్తిగత రవాణా యాప్ ఓలా, నిస్సాన్ కంపెనీతో వ్యూహాత్మక ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందంలో భాగంగా నిస్సాన్ కంపెనీ కార్లను తమ అనుబంధ సంస్థ ఓలా ఫ్లీట్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెట్ కొనుగోలు చేస్తుందని ఓలా ఒక ప్రకటనలో తెలిపింది. ఇలా కొనుగోలు చేసిన కార్లను తమ డ్రైవర్-భాగస్వాములకు లీజ్‌కు ఇస్తామని ఓలా వైస్ ప్రెసిడెంట్ (స్ట్రాటజిక్ సప్లై ఇనీషియేటివ్స్) రాహుల్ మరోలి పేర్కొన్నారు. ఈ తరహా ఒప్పందాలను మరిన్ని కార్ల కంపెనీలతో కుదుర్చుకోనున్నామని తెలిపారు. -
పెద్దలకు మాత్రమే
పొరుగు జిల్లాల నుంచి ప్రారంభమైన ఇసుక రవాణా సిఫారసు లేఖలతో అధికారులపై ఒత్తిడి పెద్ద పారిశ్రామిక వేత్తలకే కేటాయింపులు సామాన్యులకు నో స్టాక్ క్యూ.మీ.ఇసుక రూ.2వేలపైటే ఇసుక రీచ్‌లు మూతపడి నాలుగు నెలలైంది. డిపోల్లో అమ్మకాలు నిలిచి మూడు నెలలు కావస్తోంది. సాక్షి వరుస కథనాలతో కదిలిన ప్రభుత్వం పొరుగు జిల్లాల నుంచి ఇసుకను రప్పించాలని నిర్ణయించిం ది. సుదీర్ఘ విరామం తర్వాత ఎట్టకేలకు జిల్లాకొస్తున్న ఇసుక కోసం పైరవీలు జోరు మొదలైంది. పెండింగ్ ఆర్డర్లను కాదని..సిఫార్సులకు అధికారులు పెద్ద పీట వేస్తున్నారు. విశాఖపట్నం: జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ వద్ద 3 లక్షల క్యూ.మీ ఇసుక కోసం చాంతాడంత ఆర్డర్ల జాబితా పెండింగ్‌లో ఉంది. ఈ జాబితాలో ఉన్న వారంతా దాదాపుగా బిల్డర్స్... బడా బాబులే. కేంద్ర ప్రభుత్వ రంగసంస్థలైన డాక్‌యార్డు, నావీ, డీఆర్‌డీఒ, స్టీల్ ప్లాంట్, ఎన్టీపీసీ వంటి సంస్థల్లో విస్తరణ పనులకు మరో 3లక్షల క్యూ.మీ.ఇసుక అవసరం ఉంది. రాష్ర్ట ప్రభుత్వంతో పాటు స్థానికసంస్థల ఆధ్వర్యంలో అభివృద్ధి పనులకు కనీసం 2.50లక్షల క్యూ.మీ.వరకు అవసరమవుతుంది. ఇతర చిన్నా చితకా ప్రైవేటు నిర్మాణాల కోసం మరో 3లక్షల క్యూ.మీ. వరకు అవసరం. ఇప్పటికిప్పుడు జిల్లా అవసరాలకు 12 లక్షల క్యూ.మీ ఇసుక అవసరమని అధికారుల అంచనా. సాక్షి కధనాలతో కదిలిక ఇసుక మాఫియా ఆగడాలపై ‘సాక్షి’లో వచ్చిన వరుస కథనాలపై ప్రభుత్వం స్పందించింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు సమక్షంలో గతనెల 22న సమీక్షించి శ్రీకాకుళం జిల్లా నుంచి తొమ్మిదిలక్షల , విజయనగరం నుంచి 2లక్షల, తూర్పుగోదావరి నుంచి రోజుకు ఐదువేల క్యూబిక్ మీటర్ల చొప్పున ఇసుక సరఫరా చేయాలని ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలో ఈనెల 1నుంచి జిల్లాకు ఇసుక రవాణా ప్రారంభమైంది. ముందుగా పెండింగ్ ఆర్డర్లకు సరఫరా చేసిన తర్వాతే కొత్తవి తీసుకోవాలని జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ నిర్ణయించింది. గృహావసరాలకు తప్ప బల్క్ ఆర్డర్స్‌ను అసలు అనుమతించడం లేదు. అయితే బడాబాబులు మాత్రం వడ్డించే వాడు మనవాడేతే..అన్నట్టుగా మంత్రులు.. ప్రజాప్రతినిధుల సిఫార్సులతో అడ్డదారుల్లో ఇసుకను ఎగరేసుకు పోయేందుకు పావులు కదుపుతున్నారు. ఎక్కువగా మంత్రి గంటా సిఫార్సులే: మంత్రి గంటా శ్రీనివాసరావు సిఫార్సులతో నగరంలోని బిల్డర్లు, బడాబాబులు ఎక్కువగా అధికారులపై ఒత్తిడి తీసుకొస్తున్నారు. దీంతో ఏం చేయాలో అధికారులకు పాలుపోవడం లేదు. మంత్రుల సిఫార్సులంటే కాదన లేక సర్దుబాటు చేయాల్సి వస్తుందని చెబుతున్నారు. డిపోల వద్ద కాకుండా వీరికి నేరుగా ఆయా రీచ్‌ల నుంచే సరఫరా చేసేలా ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలుస్తోంది. మరో పక్క జిల్లాలో కొత్తగా గుర్తించిన మూడు రీచ్‌ల్లో 80వేల క్యూ.మీ ఇసుక అందుబాటులో ఉందని ప్రకటించారు. ప్రవాహం తగ్గడంతో శారద, వరాహ, పెద్దేరు నదితీరం వెంబడి అక్రమ తవ్వకాలు జోరందుకున్నాయి. మొన్నటి వరకు క్యూ.మీ.ఇసుక రూ.500లకు విక్రయించే వారు. ప్రస్తుతం పొరుగు జిల్లాల నుంచి రప్పిస్తున్నామనే సాకుతో అమాంతం రూ.1300లకు పెంచేశారు. రవాణాతో కలుపుకుని క్యూ.మీ. ఇసుక రూ.2వేలు దాటిపోతుంది. ఈ లెక్కన మూడు యూనిట్ల లారీ రూ. 18వేలకు పైగానే ఉంది.ఆర్డర్స్కనుగుణంగా సరఫరా జరిగితే..అదే బ్లాక్మార్కెట్లో మాత్రం రూ.25 వేలపైనే ఉంది. -
‘బండంత నిర్లక్ష్యం..!
మోటర్ సైకిల్‌పై ముగ్గురు ఎక్కితే బ్రేక్ ఇన్స్పెక్టర్, పోలీసులు అస్సలు ఒప్పుకోరు. హెల్మెట్ లేకుండా ప్రయాణం ప్రమాదం కదా అంటూ బండి ఆపి మరీ ఫైన్ మీద ఫైన్లు వేస్తుంటారు. టన్నుల కొద్దీ గ్రానైట్ రాళ్లు వాహన సామర్ధ్యానికి మించి రెండు రెట్లు తీసుకుపోతున్నా అధికారులు చోద్యం చూస్తున్నారే తప్ప సంబంధిత యజమానులపై చర్యలు తీసుకోవడం లేదని స్థానికులు విమర్శిస్తున్నారు. - గ్రానైట్ రాళ్లతో అడ్డగోలు రవాణా - రోజుకు వంద నుంచి 120 లారీల్లో గ్రానైట్ రాళ్ల రవాణా - నిబంధనల మేరకు 50 టన్నులకు మించకూడదు.. - కానీ 80-100 టన్నుల వరకు తీసుకు వస్తున్న వైనం - చోద్యం చూస్తున్న అధికారులు చీమకుర్తి: గ్రానైట్ రాళ్లను సామర్ధ్యానికి మించి చీమకుర్తి, బల్లికురవ నుంచి ఒంగోలులోని సూరారెడ్డిపాలెం, చెన్నై వైపు రోజుకు 100-120 లారీలు సామర్ధ్యానికి మించిన రాళ్లతో రవాణా చేస్తున్నారు. గరిష్టంగా 50 టన్నులకు మించి రవాణా చేయకూడదని రవాణాశాఖాధికారుల నిబంధనలు తెలియజేస్తున్నా, బాడుగకు ముఖం వాచిన లారీ యజమానులు వాహన సామర్ధ్యానికి మించి 80-100 టన్నుల వరకు రవాణా చేస్తున్నారు. అదే సమయంలో వాలు వంక లేని గ్రానైట్ రాళ్లను లారీ ప్లాట్ఫారం బయటకు పొడుచు కొచ్చే విధంగా లోడు చేసుకుని రోడ్డుపక్కల ప్రయాణం సాగిస్తూ ఇతర వాహనదారులకు ఆందోళన కలిగిస్తున్నారు. ఒక క్యూబిక్ మీటరు రాయి నాణ్యతను బట్టి 3-5 టన్నుల బరువు ఉంటుంది. ఇటీవల ఎస్ఎస్ఎన్ కాలేజీ వద్ద జారిపడ్డ గ్రానైట్ రాయి సుమారు 10-12 టన్నుల బరువు ఉండవచ్చు. అంత బరువు ఉన్న గ్రానైట్ రాయి కాలేజీ ముందున్న స్పీడ్ బ్రేకర్ వద్ద లారీకి బ్రేక్ వేయడంతో లారీ నుంచి జర్రన జారి రోడ్డు మార్జిన్లో పడింది. ఆ సమయంలో సమీపంలో ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఇక గ్రానైట్ క్వారీలలో ఒక ప్రదేశం నుంచి మరో ప్రదేశానికి కర్నూల్‌రోడ్డు మీదుగానే పట్టపగలు 20-30 టన్నుల బరువు ఉండే రాళ్లను రవాణా చేస్తున్నారు. ఒక వేళ కంటైనర్‌లో లోడు చేసినా అతివేగంతో నడిపితే అనుకోకుండా బ్రేకులు వేయాల్సి వస్తే గ్రానైట్ రాళ్లు ఉన్న కంటైనర్ జారీ కిందపడిన సంఘటనలు ఉన్నాయి. రోజూ పత్రికల్లో ఇలాంటి కథనాలు వచ్చినా రెండు, మూడు రోజులు బ్రేక్ ఇన్స్పెక్టర్లు కాస్త హడావుడి చేస్తున్నారే తప్ప పరిస్థితుల్లో మార్పు రావడం లేదు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని కఠినంగా నిబంధనలు అమలు చేయాలని స్థానికులు కోరుతున్నారు. యాక్షన్‌ప్లాన్ రూపొందిస్తున్నాం - ఆర్టీవో రాంప్రసాద్ గ్రానైట్ వాహనాల రవాణాపై త్వరలో యాక్షన్‌ప్లాన్ రూపొందిస్తున్నాం. ట్రాన్స్‌పోర్ట్‌కి ఒంగోలుకి డిప్యూటీ కమిషనర్ కూడా కొత్తగా రానున్నారు. ఆయన రాగానే రవాణాపై ఎలాంటి నిబంధనలు పాటించాలనే దానిపై మార్గదర్శకాలను రూపొందిస్తాం. -
గంజాయి తరలిస్తున్న ఆరుగురి అరెస్టు
కోటవురట్ల, కొత్తకోట ప్రాంతాల్లో గంజాయి తరలిస్తున్న ఆరుగురు వ్యక్తులను ఆయా ప్రాంతాల పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి గంజాయి, తరలించేందుకు ఉపయోగించిన ఆటోను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను కోర్టుకు తరలించినట్టు పోలీసులు తెలిపారు. కోటవురట్ల : గంజాయి తరలిస్తూ నలుగురు వ్యక్తులు స్థానిక పోలీసులకు పట్టుబడినట్టు ఎస్ఐ తెలిపారు. ఆయన కథనం ప్రకారం ఏజెన్సీ నుంచి కోటవురట్ల మీదుగా గంజాయి రవాణా చేస్తున్నారన్న సమాచారంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. పాతరోడ్డు సమీపంలో ఆటోలో గంజాయిని తరలిస్తున్న నలుగురు వ్యక్తులను శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి 30 కిలోల గంజాయి, రవాణాకు ఉపయోగించిన ఆటోను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన వారిలో రోలుగుంట మండలం కన్నంపేటకు చెందిన పిల్లి కళ్యాణం, పిల్లి నూకరత్నం, ఎర్రి ప్రసాద్, బీబీపట్నానికి చెందిన కె.కృష్ణ ఉన్నట్టు ఎస్ఐ తెలిపారు. వీరిపై కేసు నమోదు చేసి కోర్టుకు తరలిస్తున్నట్టు ఆయన వివరించారు. కొత్తకోటలో... కొత్తకోట(రావికమతం): కొత్తకోట గ్రామం నుంచి గంజాయిని తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను, రూ.30వేల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్టు కొత్తకోట పోలీసులు తెలిపారు. హెచ్‌సీ సూరిబాబు కథనం మేరకు వివరాలిలావున్నాయి. గురువారంరాత్రి పెట్రోలింగ్ చేస్తుండగా కొత్తకోట శివారు వాటర్ ప్లాంట్ వద్ద తమిళనాడుకు చెందిన శేఖర్ ప్రియస్వామి(44), ఆతని భార్య శకుంతల శేఖర్(40) అనుమానాస్పదంగా సంచరిస్తూ కన్పించారన్నారు. దీంతో వారిద్దరినీ అదుపులోకి తీసుకుని, రూ.30 వేల విలువైన 12 కిలోల గంజాయి ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. వీటిని రోలుగుంట మండలం దిబ్బలపాలెం గ్రామంలో కొనుగోలు చేసినట్టు ఆయన తెలిపారు. నిందితులను కోర్టులో హాజరుపర్చామని ఆయన వివరించారు. -
పుష్కరాలా.. అమ్మబాబోయ్!
పన్నెండేళ్లకోసారి వచ్చే పుష్కరాలు.. అందులోనూ ఈసారి 144 ఏళ్లకు వస్తున్న మహాపుష్కరాలు.. పుణ్యస్నానం చేయకపోతే మహాపాపం అని అందరూ అనడంతో సకుటుంబ సపరివార సమేతంగా పాలకొల్లు వెళ్లా. అక్కడికి వెళ్లడం వరకు బాగానే ఉంది గానీ, తిరిగి వచ్చేటప్పుడే.. చుక్కలు కనిపించాయి. ఏలూరు వరకు వస్తే.. అక్కడ కారు ఉంది. కానీ, ఏలూరు చేరుకోవడమే పెద్ద తపస్సులా అనిపించింది. పాలకొల్లు నుంచి భీమవరం ప్రయాణం.. మహా అయితే ముప్పావు గంట. కానీ, అప్పటికి దాదాపు రెండు గంటల నుంచి వెయిటింగ్. మామూలుగా అయితే ఐదు నిమిషాలకు ఓ బస్సు వచ్చి వెళ్లేది, ఆ రెండు గంటల్లో వచ్చినవి రెండే బస్సులు. అవికూడా ఫుల్లుగా ఉండటంతో అస్సలు ఆగలేదు. షేర్ ఆటోలు ఉన్నా.. ఒక్కోదాంట్లో అప్పటికే 20 మంది వరకు కుక్కి.. ఇక ఆపలేను బాబోయ్ అంటూ వెళ్లిపోతున్నారు. ఎట్టకేలకు ఒక్క బస్సు ఆగింది. హమ్మయ్య అంటూ కుటుంబంతో కలిసి బస్సు ఎక్కాను. ఆర్టీసీ బస్సులో కూర్చోవడం మాట దేవుడెరుగు.. కాలు పెట్టడానికి కాసింత జాగా దొరికింది.. అదే పదివేలు అనుకున్నాం. పావుగంట గడిచింది.. ఇంతలో ఎక్కడో సీటులోంచి ఓ ఆడగొంతు.. కండక్టర్‌తో గొడవ పడుతోంది. ఏంటా అని చెవులు రిక్కించి విన్నా. ''నిల్చున్నవాళ్లను అర్జంటుగా దించెయ్యండి.. మాకు గాలి ఆడట్లేదు. అలా తలుపు దగ్గరే అడ్డంగా నిలబడిపోతే మేం గాలి పీల్చుకోవక్కర్లేదా?'' అంటూ కండక్టర్‌ను గద్దిస్తోంది ఆవిడ. 'అంతమందిని ఎలా దించుతామమ్మా.. కావాలంటే మీరు దిగిపోయి కారులో రండి' అని కండక్టర్ ఆమెకు సమాధానం ఇచ్చాడు. సీట్లో కూర్చున్నవాళ్లను దించుతారా.. ఎంత ధైర్యం.. అంటూ మళ్లీ సదరు మహిళామణి ఒంటికాలి మీద లేచింది. ఎలాగోలా బస్సు కదిలింది. భీమవరానికి రెండు కిలోమీటర్ల దూరం ఉందనగా ఉన్నట్టుండి బస్సు ఆగిపోయింది. అలా ఆగడం.. ఆగడం.. దాదాపు ముప్పావు గంట సేపు అలాగే ఉండిపోయింది. ఏంటా అని దిగి బయటకు వెళ్లి చూస్తే, కనుచూపు మేర అంతా ట్రాఫిక్ జామే. పక్కన పెట్రోలు బంకు ఉంటే.. అక్కడున్న ఓ పెద్దమనిషిని బస్టాండు ఎంత దూరం ఉంటుందని అడిగా. ఆ, ఎంత.. రెండు ఫర్లాంగుల లోపే. నడిచి వెళ్లపోవచ్చని చెప్పారు. తీరా నడక మొదలుపెడితే.. రెండు కిలోమీటర్ల వరకు నడవాల్సి వచ్చింది. అక్కడ ఏలూరు బస్సు కోసం మరో గంటన్నర వెయిటింగ్.. అదీ దొరక్కపోవడంతో తాడేపల్లిగూడెం బస్సు కనిపించింది. మహాప్రసాదం అనుకుంటూ ఎక్కేసి, గూడెంలో ఉన్న స్నేహితుడికి ఫోన్ చేశా. అప్పటికి సమయం రాత్రి 9.45. ఓ గంటలో ఇంటికి వస్తానని చెప్పా. 11 గంటల సమయంలో గూడెం చేరుకుని, వాళ్ల ఇంటికి వెళ్లేసరికి వాళ్ల భార్య అన్నపూర్ణమ్మలా వేడివేడిగా వంట చేసి పెట్టింది. తినేసి ఏసీలో పడుకుని.. తెల్లారే లేచి ఫస్టు బస్సుకే ఏలూరు వెళ్లడం.. అక్కడ కారు తీసుకుని హైదరాబాద్ బయల్దేరి, మళ్లీ హనుమాన్ జంక్షన్ దగ్గర మూడు గంటల ట్రాఫిక్ జాంలో ఇరుక్కుని.. సాయంత్రం లోపు రావాల్సింది రాత్రి 7 గంటలకు ఇంటికి చేరుకున్నాం. అంతకుముందు 'డాడీ.. మళ్లీ పన్నెండేళ్లకు గానీ రావట కదా.. నేను పుష్కరాలు చూడాల్సిందే' అంటూ పట్టుబట్టిన నా పదిహేనేళ్ల కూతురు.. మళ్లీ పుష్కరాలు అన్న మాట ఎత్తితే ఒట్టు!! -కామేశ్వరరావు పువ్వాడ -
రైళ్లలో సరుకుల అక్రమ రవాణా!
* పరాకాష్టకు చేరిన జీరో దందా * బిల్లులు లేకుండా రాష్ట్రానికి చేరుతున్న రూ.కోట్ల విలువైన సరుకులు * రైల్వే రిసీట్ ఉంటే చాలు పన్నుల గురించి పట్టించుకోని రైల్వేశాఖ * వాణిజ్యపన్నుల శాఖ తనిఖీల్లో బయటపడ్డ బండారం * కేసుల నమోదుకు సహకరించని రైల్వే అధికారులు సాక్షి, హైదరాబాద్: అమ్మకం బిల్లు, డెలివరీ చలాన్, వే బిల్లు... ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి సరుకులు రవాణా చేసేటప్పుడు ఉండాల్సిన కనీస రసీదులివి. కానీ రైళ్లలో సరుకులు రాష్ట్రాలు దాటివస్తున్నా ఈ బిల్లులేవీ కనిపించట్లేదు. కేవలం రైల్వే రిసీట్(ఆర్.ఆర్)తో లక్షల రూపాయల విలువైన వస్తు సామ గ్రి రైళ్లలో యథేచ్ఛగా నిత్యం రవాణా అవుతోంది. సరుకు రవాణా ద్వారా వచ్చే ఆదాయాన్ని మాత్రమే పరిగణనలోకి తీసుకుంటున్న రైల్వేశాఖ ఇతర రసీదుల గురించి పట్టించుకోకపోవడంతో ఈ పరిస్థితి ఎదురవుతోంది. శుక్రవారం వాణిజ్యపన్నుల శాఖ రాష్ట్రవ్యాప్తంగా రైల్వే గోడౌన్లు, స్టేషన్లలో జరిపిన తనిఖీల్లో వెలుగు చూసిన నిజాలివి. వాణిజ్యపన్నుల శాఖ కమిషనర్ వి.అనిల్‌కుమార్ ఆదేశాల మేరకు సంయుక్త కమిషనర్ (ఎన్ఫోర్స్మెంట్) రేవతి రోహిణి నేతృత్వంలో సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడల్లోని రైల్వే గోడౌన్లతోపాటు నిజామాబాద్, ఖమ్మం, కరీంనగర్, కాజీపేట, వరంగల్ తదితర 10 రైల్వే గోడౌన్లలో అధికారులు తనిఖీ చేశారు. గుజరాత్, మహారాష్ట్ర, ఢిల్లీ, కేరళ నుంచి విలువైన సరుకులు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు రైళ్ల ద్వారా రవాణా అవుతున్న విషయాన్ని గుర్తించారు. రైల్వే గోడౌన్లలో కోట్ల రూపాయల విలువైన వస్తుసామగ్రి ఉన్నా, వాటిని పరిశీలించడమే తప్ప సీజ్ చేసేందుకు గానీ, కేసులు నమోదు చేసేందుకు గానీ వాణిజ్యపన్నుల శాఖను రైల్వే శాఖ అనుమతించకపోవడం గమనార్హం. అహ్మదాబాద్, నాగ్‌పూర్, ముంబై, ఢిల్లీ, కోల్‌కతా, త్రివేండ్రం తదితర నగరాల నుంచి రోజూ కోట్ల విలువైన సామగ్రి పన్నులు చెల్లించకుండా హైదరాబాద్‌తోపాటు వివిధ నగరాలకు చేరుతోంది. రైల్వే గూడ్స్ ట్రాన్స్‌పోర్టులో వస్తువు విలువ, దాని బరువును బట్టి చార్జి చేసి రైల్వే రిసీట్(ఆర్.ఆర్) ఇస్తారు. ఆర్ఆర్ చూపిం చి సదరు వ్యాపారి సరుకును తీసుకెళతారు. రెండు నెలల క్రితం కంటైనర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు చెందిన కంటైనర్లలో కోటి రూపాయల విలువైన బాస్మతి బియ్యం కూడా మెదక్ జిల్లా నాగులపల్లి వద్ద వాణిజ్యపన్నుల శాఖ అధికారుల తనిఖీల్లో దొరికాయి. ఈ సంస్థ కూడా రైల్వేకు అనుబంధంగా సాగుతున్నదే కావడం గమనార్హం. -
బోట్ తయారీ కేంద్రంగా బందరు
గిలకలదిండిలో బోట్ తయారీ నిపుణులు వంద సంవత్సరాలుగా ఈ రంగంలోనే.. ఈ సంవత్సరం మూడు బోట్ల తయారీ పోర్టు నేపథ్యంలో మత్స్యకారుల్లో ఆశలు సరకుల రవాణా పెరుగుతుందన్న అంచనా బోట్ల తయారీ రంగంలోనే ఉన్నారు. కొన్ని కుటుంబాలు వారసత్వంగా ఈ వృత్తినే నమ్ముకుని జీవిస్తున్నాయి. గతంలో బోల్టులు లేనందున రివిట్మెంట్ ద్వారా బోట్లను నిర్మించేవారు. రివిట్మెంట్ రంగంలో స్థానికులు ఆరితేరిన వారు. ప్రస్తుతం బోల్టులతో బోట్లు తయారుచేస్తున్నారు. ప్రస్తుతం గిలకలదిండికి ఇతర జిల్లాలవారు వచ్చి చెక్క బోట్లు తయారు చేయించుకుంటున్నారు. ఈ సంవత్సరంలో 14 బోట్లు ఇక్కడ తయారయ్యాయి. ఒక్క బోటు తయారు చేయాలంటే 50 మంది నిపుణులు మూడు నెలలపాటు కష్టపడాల్సి ఉంటుంది. బోటు తయారీకి చెక్కతో పాటు ఫైబర్, రజన, మ్యాట్‌ను ఉపయోగిస్తారు. కాకినాడ ప్రాంతంలో చేపల వేట చేసే మత్స్యకారులు కూడా గిలకలదిండిలోనే బోట్లు చేయించుకుంటారు. బోట్లు రెండు రకాలు బోట్లను ఫైబర్, చెక్కతో రెండు రకాలుగా తయారుచేస్తారు. ఫైబర్ బోట్లు తక్కువ ఖర్చుతో పూర్తవుతాయి. రూ.5 లక్షల నుంచి రూ.25 లక్షలకే (వలలు కలుపుకొని) ఈ బోటు తయారవుతుంది. చెక్క బోటు కంటే ఇది చిన్నది. ఈ బోటు ద్వారా చేపల వేట చేసేవారు తెల్లవారు జామున మూడు గంటలకు సముద్రంలోకి వెళ్లి మధ్యాహ్నం ఒంటి గంటకు వస్తారు. చెక్కబోటు తయారీకి ఉపయోగించే పాచి కర్ర (కలప)ను శ్రీకాకుళం నుంచి, ఇతర వస్తువులను కేరళ నుంచి తెప్పిస్తారు. అప్పుడప్పుడు సముద్రంలో కొట్టుకువచ్చే గుగ్గిలం కర్రను కూడా వాడతారు. పాచి కర్ర వెల అడుగు రూ.300 వరకు ఉంటుంది. ఈ కలప తేలికగా, మంచి నాణ్యతతో ఉంటుంది. గుగ్గిలం కర్ర మరింత నాణ్యంగా ఉన్నా ఆంధ్రప్రదేశ్‌లో దొరకదు. ఒక్క బోటు తయారీకి కనీసంగా వెయ్యి అడుగుల కర్ర కావాలి. బోటు సముద్రంలోకి వెళ్లేందుకు సిద్ధం కావాలంటే మొత్తం రూ.80 లక్షల వరకు ఖర్చవుతుంది. బోటు తయారీలోనే వలల ఖర్చు కలుపుతున్నారు. వలలు రూ.20 లక్షల నుంచి రూ.40 లక్షల వరకు ధర పలుకుతాయి. చెక్కబోటులో చేపల వేటకు వెళ్లేవారు నాలుగు నుంచి పది రోజుల పాటు సముద్రంలోనే ఉంటారు. బోటులోనే వంట చేసుకునే సదుపాయం ఉంటుంది. తయారు చేయించేది వ్యాపారులే... సముద్రంలో చేపల వేట చేసే బోట్లను తయారు చేయించేది వ్యాపారులే. అన్ని హంగులతో తయారైన బోటును మత్స్యకారులకు అద్దెకు ఇస్తారు. నాలుగు నుంచి ఎనిమిది మంది ఒక బోటులో వేటకు వెళ్లొచ్చు. ఈ ఏడాది తమ గ్రామంలో మత్స్యకారులకు 14 బోట్లు తయారు చేసి ఇచ్చామని బోటు తయారుదారు కొక్కిలిగడ్డ నాగాంజనేయులు తెలిపారు. రోజు కూలీ రూ.500 వస్తుందని వివరించారు. పోలాటితిప్ప కాలువను మరమ్మతు చేయాలి ప్రస్తుతం మత్స్యకారులు బోట్లను పోలాటితిప్ప కాలువలో లంగరేస్తున్నారు. కాలువకు ఇరువైపులా మంచి రివిట్మెంట్ కట్టిస్తే బోట్ల నుంచి సరకును దించుకునేందుకు కూడా వీలుగా ఉంటుందని, స్థానికులు కూడా ఇక్కడికొచ్చి చేపలు కొనుగోలు చేసేందుకు వీలుగా ఉంటుందని వారు పేర్కొంటున్నారు. ఎగుమతి దారుల కంపెనీలు ఈ దారిలోనే ఉన్నాయని, వారి గోడౌన్లు సమీపంలోనే ఉన్నందున కాలువను బాగుచేసి ఆదుకోవాలని మత్స్యకారులు కోరుతున్నారు. -
కదలని చక్రం
సమ్మె ఉధృతం.. తొలి రోజు సక్సెస్ స్తంభించిన రవాణా.. ప్రయూణికుల అవస్థలు డిపోలకే పరిమితమైన బస్సులు బోసిపోరుున బస్స్టేషన్లు {పత్యామ్నాయ ఏర్పాట్లలో అధికారులు తరలివచ్చిన తాత్కాలిక నిరుద్యోగులు అభ్యర్థులు, కార్మికుల మధ్య ఘర్షణ హన్మకొండ బస్టాండ్‌లో 144 సెక్షన్ హన్మకొండ : జిల్లావ్యాప్తంగా ఆర్టీసీ కార్మికుల సమ్మెతో రవాణా స్తంభించింది. బస్సులు ఎక్కడికక్కడే నిలిచారుు. వేతన సవరణ చేయూలని ఆర్టీసీ కార్మికులు, కార్మిక సంఘాల నాయకులు ఆందోళన చేసినా ఫలితం లేకపోవడంతో సమ్మె అస్త్రాన్ని ప్రయోగించారుు. బస్సులు డిపోలకే పరిమితం కావడంతో బస్స్టేషన్లు బోసి పోయాయి. సమ్మె విషయం తెలియక వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. బస్సుల నిలిచిపోవడంతో ప్రైవేట్ వాహనాల జోరు పెరిగింది. ఇష్టానుసారంగా చార్జీలు వసూలు చేశారు. కార్మిక సంఘాల మండిపాటు ప్రభుత్వం నష్టాల సాకుతో వేతన సవరణ చేయకుండా తప్పించుకుంటుందని కార్మికులు మండిపడుతున్నారు. నష్టాలను పూడ్చుకోవడానికి అవకాశాలున్నా.. వాటిని వదిలేసి కార్మికులు పొట్ట కొడుతుందని నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వచ్చే వేతనాలు సరిపోక, వడ్డీ వ్యాపారుల వద్ద ఏటీఎం కార్డులు కుదువ పెట్టి అప్పులు తీసుకొచ్చి కుటుంబాలను పోషించాల్సి వస్తుందని కార్మిక సంఘాల నాయకులు వాపోయారు. మార్కెట్లో నిత్యావసర వస్తువుల ధరలు భగ్గుమంటున్నా ఆర్టీసీ యాజమాన్యం కార్మికులకు పెరిగిన ధరలకు అనుగుణంగా వేతనాలు చెల్లించడం లేదన్నారు. తమకు ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు ఇస్తామని చెప్పిన సీఎం కేసీఆర్ ఆర్టీసీ కార్మిక వర్గాన్ని మోసం చేశారని ఆరోపించారు. దీంతో ఆర్టీసీ కార్మిక సంఘాలు, సూపర్వైజర్ల సంఘాలు, మెకానిక్‌లు, ఇతర సిబ్బంది సమ్మెబాట పట్టామని కార్మికులు చెప్పారు. ఆర్ఎం డిప్యూటీ సీటీఎం, డిప్యూటీ సీఎం, పర్సనల్ ఆఫీసర్, అకౌంట్స్ ఆఫీసర్, డీఎంలు, సెక్యూరిటీ సిబ్బంది మినహా కార్మికులు, ఉద్యోగులందరూ సమ్మెలో ఉన్నారు. ప్రత్యామ్నాయ మార్గాల్లో ఆర్టీసీ జిల్లాలో తొమ్మిది డిపోలలో 965 బస్సులు నిలిచాయి. ఇందులో 758 సంస్థ, 207 అద్దె బస్సులున్నాయి. వరంగల్ రీజియన్‌లో 4,539 మంది కార్మికులు, ఉద్యోగులు, సూపర్వైజర్లు, మెకానిక్‌లు సమ్మెలో పాల్గొన్నారు. ఇందులో కండక్టర్లు, డ్రైవర్లు 3,605 మంది ఉండగా.. మిగతా వారు సూపర్ వైజర్లు, మెకానిక్‌లు, డీసీలు, ఏడీసీలు, ఇతర ఉద్యోగులు ఉన్నారు. ఆర్టీసీ అద్దె బస్సులను నడిపించాలని చూసినా కార్మికులు అడ్డుకోవడంతో అద్దె బస్సులు కదలలేదు. అధికారులు 34 బస్సులు తిరిగాయని చెపుతున్నా ఎక్కడా కనిపించ లేదు. దీంతో సమ్మె ప్రభావంతో మొదటి రోజు దాదాపు రూ.కోటి వరకు ఆదాయాన్ని ఆర్టీసీ కోల్పోయింది. కార్మికుల సమ్మెతో ఆర్టీసీ అధికారులు ప్రత్యమ్నాయ ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. కాంట్రాక్ట్ కార్మికులతో పని చేయించాలనే ఆలోచనతోపాటు, హెవీ డ్రైవింగ్ లెసైన్స్ ఉన్న డ్రైవర్లకు బుధవారం డ్రైవింగ్ పరీక్ష నిర్వహించారు. డ్రైవింగ్‌లో నైపుణ్యం కనబరిచిన వారిని విధుల్లోకి తీసుకుని బస్సులు నడుపాలని అధికారులు చూస్తున్నారు. కాంట్రాక్ట్ కార్మికులు సమ్మెలోకి వెళ్తె ఉద్యోగం నుంచి తొలగిస్తామని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. వీరితోపాటు 60 ఏళ్ల లోపు వయసు ఉన్న రిటైర్డ్ డ్రైవర్లను కూడా విధుల్లోకి తీసుకోవాలని చూస్తున్నారు. తాత్కాలిక కండక్టర్లను తీసుకోవడానికి అభ్యర్థుల సర్టిఫికేట్లు పరిశీలించారు. అయినా ప్రయాణికులకు పూర్తి స్థాయిలో సేవలందించడం కష్టమైన పనే. సమ్మెతో ఉద్రిక్తత ఆర్టీసీ కార్మికుల సమ్మెతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నారుు. యాజమాన్యం తాత్యాలిక నియామకాలు చేపట్టింది. డ్రైవర్లకు రోజుకు రూ.1000, కండక్టర్లకు రూ.800 ఇస్తామని యూజమాన్యం ప్రకటించడంతో వందల సంఖ్యలో నిరుద్యోగులు బుధవారం హన్మకొండ ఆర్టీసీ వరంగల్ రీజియన్ కార్యాలయానికి చేరుకున్నారు. తాత్కాలిక విధులు నిర్వహించడానికి వచ్చిన అభ్యర్థులను ఆర్టీసీ కార్మికులు అడ్డుకున్నారు. ఖమ్మం జిల్లాకు చెందిన మదిర డిపో, కరీంనగర్ డిపోకు చెందిన అద్దె బస్సులు రావడంతో అడ్డుకున్నారు. మదిర డిపోకు చెందిన బస్సు అద్దం పగిలింది. తాత్కాలిక ఉద్యోగాలకై వచ్చిన అభ్యర్థులు, బయటి నుంచి వచ్చిన అద్దె బస్సులు అడ్డుకోవడంతో హన్మకొండ బస్‌స్టేషన్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఘర్షణ వాతావరణం నెలకొంది. 144 సెక్షన్ విధించారు. హన్మకొండ సీఐ కిరణ్‌కుమార్, కేయూ సీఐ ఎస్ఎం అలీ నేతృత్వంలో ఎస్సైలు, పెద్ద ఎత్తున పోలీసు బలగాలతో బందోబస్తు చేపట్టారు. డిపో మేనేజర్ల ఆధ్వర్యంలో అధికారులు సర్టిఫికేట్లు పరిశీలించి ఫోన్ నంబర్లు తీసుకొని సమాచారం ఇస్తామని పంపించారు. డ్రైవింగ్ విధులకై వచ్చిన అభ్యర్థులకు వరంగల్ రీజియన్ కార్యాలయంలో డ్రైవింగ్ లెసైన్స్, సర్టిఫికేట్లు పరిశీలించి అనంతరం డ్రైవింగ్ టెస్ట్ నిర్వహించారు. -
కకావికలం
రవాణా కార్మికుల బంద్‌తో జనజీవనం అస్తవ్యస్తం బస్సులు లేక ప్రయాణికులకు ఇక్కట్లు పలు ప్రాంతాల్లో ప్రైవేట్ బస్సులపై దాడి బెంగళూరు : రోడ్డు ప్రమాదాల నివారణకు గాను కేంద్ర ప్రభుత్వం రూపొందించిన రోడ్డు రవాణా సురక్షతా ముసాయిదా బిల్లును వ్యతిరేకిస్తూ రవాణా రంగంలోని ఉద్యోగులు, కార్మికులు గురువారం తలపెట్టిన బంద్ రాష్ట్ర వ్యాప్తంగా విజయవంతమైంది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లోనూ కేఎస్ఆర్టీసీ బస్‌లు డిపోలకే పరిమితం కాగా, బెంగళూరు నగరంలో సైతం బీఎంటీసీ బస్‌లు నిలిచిపోయాయి. బస్‌లన్నీ డిపోలకే పరిమితం కావడంతో టికెట్ కౌంటర్లన్నీ ఖాళీగా కనిపించాయి. రవాణా బంద్ కారణంగా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఉద్యాననగరిలో ఆటోరిక్షాల డ్రైవర్లు సైతం బంద్‌లో పాల్గొనడంతో ఐటీ, గార్మెంట్ సంస్థల్లో పనిచేసే ఉద్యోగులు ట్యాక్సీలను ఆశ్రయించక తప్పలేదు. ఇక ఈ బంద్‌లో అపశృతులు సైతం చోటుచేసుకున్నాయి. రాష్ట్రం లోని వివిధ ప్రాంతాల్లో దాదాపు 75 బస్‌లపై ఆందోళన కారులు రాళ్లదాడి చేశారు. ఈ దాడిలో కొంతమంది డ్రైవర్లు గాయాలపాలు కాగా, బస్‌లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. బీఎంటీసీ, కేఎస్ఆర్టీసీకి చెందిన దాదాపు లక్ష మంది ఉద్యోగులు ఈ బంద్‌లో పాల్గొన్నారు. రాష్ట్రంలోని చిక్కబళ్లాపుర, మండ్య, బెళగావి, మంగళూరు, గదగ్, హుబ్లీ-ధార్వాడ, మైసూరు తదితర ప్రాంతాలన్నింటిలో బస్‌లు డిపోలకే పరిమితం కావడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు. ఇక ఇదే అదునుగా చేసుకొని ప్రైవేటు బస్‌ల యాజమాన్యాలు ప్రయాణికుల నుంచి ఎక్కువ చార్జీలను దండుకున్నాయి. బంద్ సందర్భంగా నగరంలో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు శాఖ చర్యలు తీసుకుంది. నగర అదనపు పోలీస్ కమిషనర్ అలోక్‌కుమార్ నగరంలోని వివిధ బీఎంటీసీ డిపోలను సందర్శించారు. ఈ సందర్భంగా అలోక్‌కుమార్ మాట్లాడుతూ బలవంతంగా బంద్‌లో పాల్గొనాల్సిందిగా ఒత్తిడి తెచ్చే వారిపై కఠిన చర్యలకు ఆదేశించినట్లు తెలిపారు. బంద్ సందర్భంగా ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా 50 మందిని అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. అంతేకాక కామాక్షిపాళ్య ప్రాంతంలో ఓ ఆటోలో కూర్చొని తిరుగుతూ బస్‌ల పై రాళ్లదాడికి దిగిన ఇద్దరు ఆటో డ్రైవర్లను సైతం అదుపులోకి తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఇక గురువారం సాయంత్రం 5 గంటల నుంచి బెంగళూరుతో పాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో బస్‌ల సంచారం ప్రారంభమైంది. -
దోపిడీ దందా! జోరుగా నీటి అక్రమ వ్యాపారం
- పొలాల బోర్ల నుంచి 24 గంటలూ తోడుతూ.. - పట్టణాలు, పరిశ్రమలకు అక్రమ రవాణా - నిత్యం 50 లక్షల లీటర్ల నీటి తరలింపు - నెలకు రూ.3 కోట్ల వ్యాపారం - ‘వాల్టా’కు తూట్లు నీటి దోపిడీ దందా జోరుగా సాగుతోంది. దోపిడీదారులు రైతుల పంట పొలాలను అక్రమంగా వాడుకుంటున్నారు. డబ్బు ఆశ చూపి వారి పొలాల్లోని బోర్ల నుంచి నిత్యం లక్షల లీటర్ల నీటిని తోడుతున్నారు. పట్టణాలు, పరిశ్రమలకు రవాణా చేస్తున్నారు. ఈ బోర్లకు ఉచిత కరెంటును వినియోగించుకుంటున్నారు. 24 గంటలూ నీటిని ఇష్టారీతిగా తోడడం వల్ల భూగర్భ జలాలు మరింత లోతుకు పడిపోతున్నాయి. ‘వాల్టా’కు తూట్లు పొడుస్తున్నారు. అక్రమ దందా యథేచ్ఛగా సాగుతోన్నా పట్టించుకునే వారే లేకుండా పోయారు. ఈ వ్యాపారం ఇలాగే సాగితే ఇక్కడి బోర్లన్నీ ఎండిపోయి ఎడారిగా మారే ప్రమాదం పొంచి ఉంది. జిన్నారం : జిన్నారం మండలంలోని గడ్డపోతారం, బొల్లారం, బొంతపల్లి, ఖాజీపల్లి పారిశ్రామిక వాడల్లో సుమారు 400 వరకు వివిధ రకాల పరిశ్రమలు ఉన్నాయి. వీటికి నీటి వినియోగం ఎక్కువగా ఉంటుంది. దీన్ని ఆసరా చేసుకొని స్థానిక ప్రజాప్రతినిధులు, వారి బంధువులు నీటి దందా నిర్వహిస్తున్నారు. దశాబ్ద కాలంగా ఈ అక్రమ వ్యాపారాన్ని యథేచ్ఛగా కొనసాగిస్తున్నారు. ఫలితంగా పారిశ్రామిక వాడల్లోని గ్రామాల్లో భూగర్భ జలాలు పూర్తిగా అడుగంటాయి. సదరు వ్యాపారులు ఈ దందాను కొనసాగించేందుకు సమీప గ్రామాలను ఎంచుకున్నారు. రైతులకు డబ్బు ఆశ చూపి వారి పొలాల వద్ద ఉన్న బోర్ల నుంచి నీటిని పరిశ్రమలకు తరలిస్తున్నారు. మరో ఏడాదిపాటు ఇదే విధంగా కొనసాగితే భూగర్భ జలాలు పూర్తిగా అడుగంటిపోయి రైతులు రోడ్డున పడే పరిస్థితులు ఏర్పడతాయి. ఈ గ్రామాల నుంచి... పారిశ్రామిక శివారు గ్రామాలైన కిష్టాయిపల్లి, కొర్లకుంట, నల్తూర్, బొంతపల్లి, దోమడుగు, అన్నారం తదితర గ్రామాల నుంచి నీటిని అక్రమంగా తరలిస్తున్నారు. అన్నా రం శివారులోని పొలాల నుంచి రంగారెడ్డి జిల్లాకు చెందిన కొంతమంది నిత్యం వందలాది ట్యాంకర్ల ద్వారా నీటిని రవాణా చేస్తున్నారు. మెదక్ జిల్లా సరిహద్దులోని రంగారెడ్డి జిల్లా గ్రామాలైన ప్రగతినగర్, దుండిగల్, గాగిల్లాపూర్, గండిమైసమ్మ, కూకట్పల్లి వరకు ఉండే అపార్ట్మెంట్లకు కూడా ఇక్కడి నుంచే నీటిని తరలిస్తున్నారంటే వ్యాపారం ఎలా జరుగుతుందో అర్థం చేసుకోవచ్చు. జిన్నారం మండలంలోని ఆయా గ్రామాల నుంచి నిత్యం సుమారు 400 వరకు పెద్ద ట్యాంకర్లు, 500 వరకు ట్రాక్టర్ ట్యాంకర్ల ద్వారా నీటిని తరలిస్తున్నారు. పెద్ద ట్యాంకర్ నీటిని రూ.1,500 నుంచి రూ.2,000 వరకు, చిన్న ట్యాంకర్ నీటిని రూ.500 నుంచి రూ.1,000 వరకు విక్రయిస్తుంటారని సమాచారం. అంటే మండల వ్యాప్తంగా రోజుకు సుమారు రూ.10 లక్షలు, నెలకు సుమారు రూ.3 కోట్ల మేర నీటి వ్యాపారం సాగుతోంది. దీంతో మండల వ్యాప్తంగా రోజుకు సుమారు 50 లక్షల లీటర్ల నీటిని బోర్ల ద్వారా తోడి ఇతర ప్రాంతాలకు, పరిశ్రమలకు, అపార్ట్మెంట్లకు తరలిస్తున్నారు. ఉచిత కరెంటు దుర్వినియోగం.. ప్రభుత్వం వ్యవసాయానికి ఉచిత కరెంట్ సదుపాయాన్ని కల్పిస్తోంది. కొందరు వ్యక్తులు పంట పొలాల్లోని బోర్ల నుంచి నీటిని తోడేందుకు ఉచిత కరెంటును వినియోగిస్తున్నారు. ఫలితంగా ఈ పథకం దుర్వినియోగమవుతోంది. విద్యుత్ సరఫరా లేని సమయంలో ఎక్కువ సామర్థ్యం గల జనరేటర్లను వాడుతూ 24 గంటలూ నీటిని తోడుతూనే ఉన్నారు. పెద్ద పెద్ద గుంతలను తీసి వీటిలో ప్లాస్టిక్ కవర్లను వేసి నీటిని నిల్వ చేస్తున్నారు. ఇంత పెద్ద ఎత్తున నీటి వ్యాపారం కొనసాగుతోన్నా సంబంధిత అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు. కలెక్టర్‌తోపాటు ఉన్నతాధికారులు స్పందించి నీటి అక్రమ వ్యాపారాన్ని అడ్డుకోవాలని లేనిపక్షంలో భూగర్భ జలాలు పూర్తిగా అడుగంటుతాయని రైతులు, ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
ఇసుకే బంగారమాయె..!
-కొన్ని ప్రాంతాలకే ఇసుక ర్యాంపులు పరిమితం - ఐదు నియోజకవర్గాల్లో ఒక్కటీ లేదు - ఫలితంగా నిర్మాణ రంగంలో సంక్షోభం - దూరాభారం, రవాణా చార్జీలు తడిసిమోపెడు - కొత్త ఇసుక విధానం పూర్తిగా విఫలం - సర్కారుకు కాసులు.. ప్రజలకు కష్టాలు శ్రీకాకుళం పాతబస్టాండ్: జిల్లాలో ఇసుక బంగారంగా మారింది. కొత్త ఇసుక విధానం అమల్లోకి వచ్చిన తర్వాత ధర పెరిగిపోవడంతోపాటు ఇసుక లభించడమే గగనం కావడంతో నిర్మాణరంగం సంక్షోభంలో కూరుకుపోయింది. ప్రభుత్వం అనుమతించిన ఇసుక రీచులు కొన్ని ప్రాంతాలకే పరిమితం కావడం దీనికి ప్రధాన కారణం. ఫలితంగా మిగిలిన ప్రాంతాలవారు ఇసుక కోసం నానా అవస్థలు పడాల్సి వస్తోంది. అధిక ధర చెల్లించి కొనుగోలు చేయాల్సి వస్తోంది. జిల్లాలో పది నియోజకవర్గాలు ఉండగా.. ఐదు నియోజకవర్గాల్లో అసలు రీచులే లేకపోవడం ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలకు దర్పణం పడుతోంది. ఎచ్చెర్ల నియోజకవర్గ పరిధిలోని ఎచ్చెర్ల మండలం ముద్దాడలో రీచ్ ఏర్పాటు చేసినా నియోజకవర్గంలోని మిగిలిన మండలాలకు అది చాలా దూరంలో ఉంది. ఆమదావలవస నియోజకవర్గంలో ఇసుక రిచ్‌ల ఏర్పాటులో నిబంధనలు పాటించకపోవడం, రిచ్‌లు ఏర్పాటు చేసిన ప్రాంతాలు వంతెనలు, తాగునీటి పథకాల సమీపంలో ఉండటంతో వాటిని న్యాయస్థానం నిలిపివేసింది. టెక్కలి, పలాస, రాజాం, పాతపట్నం నియోజకవర్గాల్లో అసలు రీచులే లేవు. ఈ నియోజవర్గాల ప్రజలు సూదూర ప్రాంతాల నుంచి అధిక రవాణా చార్జీలు భరించి ఇసుక కొనుగోలు చేయాల్సిన దుస్థితి నెలకొంది. పాలకుల రాజకీయ స్వార్థం, ఆధికారుల వైఫల్యం ఈ పరిస్థితికి కారణమని ప్రజలు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ప్రస్తుతం జిల్లాలో ఇసుక క్యూబిక్ మీటరు ధర *500 ఉంది, అయితే రవాణా చార్జీలతోపాటు రీచుల వద్ద అధిక మొత్తాలు వసూలు చేస్తుండటంతో ఆ భారం కూడా తమ పైనే పడుతోందని నిర్మాణదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నూతన విదానంలో జిల్లాలో ఈ ఏడాది ఇప్పటివరకు 5.95 లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుక అమ్మకాలు జరగ్గా.. దీని ద్వారా ప్రభుత్వానికి రూ. 54.48 కోట్ల ఆదాయం వచ్చింది. ఆదాయం వచ్చిందని మురిసిపోతున్న ప్రభుత్వం.. ఈ విధానం వల్ల ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను పట్టించుకోవడం లేదు. జిల్లా ప్రస్తుతం ఉన్న రీచ్‌లు జిల్లాలో ప్రస్తుతం పది ఇసుక రీచ్‌లు ఉన్నాయి. మండలాల వారీగా ఎచ్చెర్లలో ముద్దాడ, నరసన్నపేటలో గోపాలపెంట, చెన్నులవలస, బుచ్చిపేట, శ్రీకాకుళం రూరల్‌లో బట్టేరు, కిల్లిపాలేం, పోలాకి మండంలో మబగాం, జలుమూరు మండలంలో దంపాక, పర్లాం, ఇచ్ఛాపురం మండలం బిర్లంగిలో ఇవి నడుస్తున్నాయి. ప్రతిపాదనలో 24 కొత్తగా మరో 24 రీచుల ఏర్పాటుకు ప్రతిపాదనలు ఉన్నాయి. హిరమండలం, గార, ఎల్‌ఎన్‌పేట మండలాల్లోని వంశధార తీర ప్రాంతాల్లో ఏర్పాటు చేయనున్న వీటికి వివిధ శాఖల నుంచి అనుమతులు రావాల్సి ఉంది. న్యాయస్థానంలో ఉన్నవి ఆమదాలవలస నియోజకవర్గంలో తోటాడ, అక్కివరం, దూసి, ముద్దాడపేట రిచ్‌లను అక్రమంగా అనుమతించారని ఫిర్యాదులు అందడంతో న్యాయస్థానం వీటిని నిలిపివేసింది. పరిధిలోని ఎచ్చెర్ల మండలం ముద్దాడలో రీచ్ ఏర్పాటు చేసినా నియోజకవర్గంలోని మిగిలిన మండలాలకు అది చాలా దూరంలో ఉంది. ఆమదావలవస నియోజకవర్గంలో ఇసుక రిచ్‌ల ఏర్పాటులో నిబంధనలు పాటించకపోవడం, రిచ్‌లు ఏర్పాటు చేసిన ప్రాంతాలు వంతెనలు, తాగునీటి పథకాల సమీపంలో ఉండటంతో వాటిని న్యాయస్థానం నిలిపివేసింది. టెక్కలి, పలాస, రాజాం, పాతపట్నం నియోజకవర్గాల్లో అసలు రీచులే లేవు. ఈ నియోజవర్గాల ప్రజలు సూదూర ప్రాంతాల నుంచి అధిక రవాణా చార్జీలు భరించి ఇసుక కొనుగోలు చేయాల్సిన దుస్థితి నెలకొంది. పాలకుల రాజకీయ స్వార్థం, ఆధికారుల వైఫల్యం ఈ పరిస్థితికి కారణమని ప్రజలు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ప్రస్తుతం జిల్లాలో ఇసుక క్యూబిక్ మీటరు ధర *500 ఉంది, అయితే రవాణా చార్జీలతోపాటు రీచుల వద్ద అధిక మొత్తాలు వసూలు చేస్తుండటంతో ఆ భారం కూడా తమ పైనే పడుతోందని నిర్మాణదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నూతన విదానంలో జిల్లాలో ఈ ఏడాది ఇప్పటివరకు 5.95 లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుక అమ్మకాలు జరగ్గా.. దీని ద్వారా ప్రభుత్వానికి రూ. 54.48 కోట్ల ఆదాయం వచ్చింది. ఆదాయం వచ్చిందని మురిసిపోతున్న ప్రభుత్వం.. ఈ విధానం వల్ల ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను పట్టించుకోవడం లేదు. జిల్లా ప్రస్తుతం ఉన్న రీచ్‌లు జిల్లాలో ప్రస్తుతం పది ఇసుక రీచ్‌లు ఉన్నాయి. మండలాల వారీగా ఎచ్చెర్లలో ముద్దాడ, నరసన్నపేటలో గోపాలపెంట, చెన్నులవలస, బుచ్చిపేట, శ్రీకాకుళం రూరల్‌లో బట్టేరు, కిల్లిపాలేం, పోలాకి మండంలో మబగాం, జలుమూరు మండలంలో దంపాక, పర్లాం, ఇచ్ఛాపురం మండలం బిర్లంగిలో ఇవి నడుస్తున్నాయి. ప్రతిపాదనలో 24 కొత్తగా మరో 24 రీచుల ఏర్పాటుకు ప్రతిపాదనలు ఉన్నాయి. హిరమండలం, గార, ఎల్‌ఎన్‌పేట మండలాల్లోని వంశధార తీర ప్రాంతాల్లో ఏర్పాటు చేయనున్న వీటికి వివిధ శాఖల నుంచి అనుమతులు రావాల్సి ఉంది. న్యాయస్థానంలో ఉన్నవి ఆమదాలవలస నియోజకవర్గంలో తోటాడ, అక్కివరం, దూసి, ముద్దాడపేట రిచ్‌లను అక్రమంగా అనుమతించారని ఫిర్యాదులు అందడంతో న్యాయస్థానం వీటిని నిలిపివేసింది. -
రవాణా మ్యూజియం!
మనదేశంలో మనిషి మొట్టమొదటగా ఉపయోగించిన రవాణా సాధనం రూపు రేఖలు... ఎలా ఉండేవి? ఆ తర్వాత పరిణామ క్రమంలో ఎలాంటి సాధనాలను రవాణాకోసం మనిషి ఉపయోగించాడు? ఎడ్ల బండి నుంచి ఎరోప్లేన్ వరకు.. మానవప్రయాణంలో చోటుచేసుకున్న రవాణా సాధనాలన్నింటినీ చూడాలని, వాటి గురించి తెలుసుకోవాలని, వాటిని పిల్లలకూ చూపాలని ఉందా? అయితే, రండి ‘హెరిటేజ్ ట్రాన్స్పోర్ట్ మ్యూజియం’కి వెళ్లొద్దాం.. హర్యానా రాష్ట్రం, బిలాస్పూర్ చౌక్, టారు రోడ్లో ఉంది హెరిటేజ్ ట్రాన్స్పోర్ట్ మ్యూజియం. ఢిల్లీ నుంచి సోహ్నా-గుర్గావ్ రోడ్డు మార్గాన 8వ జాతీయరహదారి మీదుగా వెళితే దాదాపు 63 కిలోమీటర్ల దూరంలో ఉంటుందీ మ్యూజియం. భారతదేశంలో మొట్టమొదటి చారిత్రక రవాణా మ్యూజియం ఇదే! 90,000 చదరపు అడుగుల్లో నాలుగు అంతస్తులుగా ఉన్న ఈ మ్యూజియమ్ ఉదయం 10 గం॥నుంచి రాత్రి 7 గం॥వరకు (సోమవారం సెలవు) తెరిచే ఉంటుంది. ఇందులో సందర్శన గ్యాలరీలు, గ్రంథాలయం, పరిశోధనా కేంద్రం, సమావేశపు గదులు, మినీ ఆడిటోరియం, షాప్‌లు, రెస్టారెంట్ వసతులు కూడా ఉన్నాయి. మొదటగా షికారుకు వెళ్లిన కారు... మోటారు వాహనాల సందర్శన గ్యాలరీలో భారతదేశ కార్ల పరిశ్రమకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవడమే కాదు, అందులో 75 పాత కార్లనూ వీక్షించవచ్చు. భారతీయ రోడ్లకు అనుగుణంగా తయారైన నాటి కార్లతో పాటు, క్షణంలో కళ్లముందు మెరిసి, మాయమయ్యే స్పోర్ట్ కార్లను కూడా ఇక్కడ తిలకించవచ్చు. వాహనాల విడిభాగాల విభాగంలో పాతకాలపు నాటి పెట్రోల్ పంపు, బాలీవుడ్ సినిమాల్లో ప్రముఖంగా కనిపించిన కార్లనూ తిలకించవచ్చు. మినీ ఆడిటోరియమ్ పై భాగంలో సినిమాలో రవాణా ప్రాముఖ్యంగా ఉండే చిత్ర సన్నివేశాలను వీక్షించడానికి స్క్రీన్ కూడా ఏర్పాటు చేశారు. బస్సులు-వ్యాన్లు... పెద్ద పెద్ద వాహన పరికరాలు గల బస్ డిపో ఏ విధంగా ఉంటుంది, రోడ్డు రవాణాలో బస్సు పాత్ర... ఈ వివరాలన్నీ తెలియజెప్పే గ్యాలరీలో ప్రదర్శన ఉంటుంది. పూర్వకాలపు వ్యాన్లు, బస్సుల గురించి కూడా ఈ ప్రదర్శనలో తెలుసుకోవచ్చు. చుక్.. చుక్.. రైలు... మన దేశంలో రవాణాకు రైలు మార్గం ఎప్పుడు ఏర్పాటు చేశారు, ఎంత సమయం పట్టింది? వివరాలతో పాటు 1930ల నాటి రైల్వే స్టేషన్ ప్లాట్‌ఫామ్ నమూనా, సెలూన్‌ను ఇక్కడ చూసి తెలుసుకోవచ్చు. నాటి వాస్తవ ఛాయా చిత్రాలు, ట్రెయిన్ టికెట్లు, కరెంట్ దీపాలు, రైల్వే మ్యాపులను కూడా ఇక్కడ చూడవచ్చు. విమానయాన వివరాలు... భారతదేశ విమాయాన పరిశ్రమకు ఉన్న ఘనచరిత్ర గురించి విపులంగా తెలుసుకోవాలంటే ఈ హెరిటేజ్ ట్రాన్స్పోర్ట్ మ్యూజియం ఒక చక్కని వేదిక. విమానయానం మన దగ్గర ఎలా అభివృద్ధి చెందిందీ దశలవారీగా తెలియజెప్పే విశేషాలు ఇందులో ఉంటాయి. ఆసక్తి, ఉత్సాహం, పరిశోధన... నలుగురిలో ప్రత్యేకంగా నిలుపుతాయి. ఇదే తరుణ్ థక్రల్ విషయంలోనూ జరిగింది. ఢిల్లీ వాస్తవ్యులైన తరుణ్‌కి పాతకాలం నాటి వస్తువులను సేకరించడం ఒక అలవాటుగా ఉండేది. గ్రామ్‌ఫోన్‌ల నుంచి ల్యాంప్స్ వరకు రాజస్థాన్, గుజరాత్ చుట్టుపక్కల గ్రామాలను తిరిగి మరీ సేకరించేవారు. అందులో భాగంగా పాత కార్లను సేకరించడం ఒక అలవాటుగా మారింది. అదే ఈ హెరిటేజ్ ట్రాన్స్పోర్ట్ మ్యూజియం ఏర్పాటుకు దోహదం చేసింది. 20 ఏళ్ల అతని కృషి ఫలితంగా డిసెంబర్, 2013లో ఈ చారిత్రాత్మక వాహనశాల ఏర్పాటైంది. అంతేకాదు 1940ల నాటి జె3సి సియుబి విమానాన్నీ ఇక్కడ తిలకించవచ్చు. ద్విచక్రవాహనాలు... నాటి కాలంలో అత్యంత ప్రాచుర్యంలో ఉన్న ద్విచక్రవాహనాలు సైకిల్, స్కూటర్, మోటార్‌సైకిల్, మోపెడ్స్... వీటితో పాటు భారతదేశ రవాణాసాధనాల నమూనాను పోలిన బొమ్మలూ ఎంతో కనువిందుచేస్తాయి. వీటన్నింటినీ చూడముచ్చటగా తీర్చిదిద్దారు. ఈ బొమ్మలన్నీ మనల్ని బాల్యంలోకి తీసుకెళతాయి. జల మార్గంలో... మన దేశంలో జలమార్గంలో ఉపయోగించిన అన్ని రకాల బోట్లు, ఓడలు.. వాటి వివరాలు, చిత్రాలు, మ్యాపులను ఒక గ్యాలరీలో పొందుపరిచారు. అంతేకాదు మారుమూల గ్రామాల్లోనూ, కొండకోనల్లో ఉండే గిరిపుత్రులు ఒక ప్రదేశం నుంచి మరో ప్రదేశం చేరుకోవడానికి ఉపయోగించిన రవాణా సాధనాలు, వారి జీవనశైలిలో భాగమైన విధానాన్ని ఇందులో చూడవచ్చు. భారతదేశంలో రవాణాకు ఉపయోగపడిన పూర్తి చారిత్రక సేకరణ ఇది. మొత్తం రవాణా చరిత్రకు సంబంధించి 10,000 అంశాలను ఒకే దగ్గర తెలుసుకునే మహాదావకాశంగా ఈ మ్యూజియంను చెప్పుకోవచ్చు. గుర్రపు స్వారీల నుంచి మానవ పరిణామక్రమ ఎన్నిదశలుగా అభివృద్ధి చెందుతూ వచ్చిందో ఈ ట్రాన్స్పోర్ట్ మ్యూజియమ్ కళ్లకు కడుతుంది. మ్యూజియం సందర్శనకు టికెట్ ధర పెద్దలకు (ఒకరికి) రూ.300/-; పిల్లలకు (ఒకరికి ) రూ.150/- 50 మందికి పైగా పిల్లలు ఒకేసారి సందర్శిస్తే వారికి టికెట్ రేటులో 10 శాతం రాయితీ లభిస్తుంది. ఇందులో పుట్టినరోజు ప్యాకేజీలు కూడా ఉన్నాయి. ఫుడ్ ప్యాకేజీ ఒకరికి (శాకాహారం) రూ.1100/-, మాంసాహారం రూ.1200/-, అల్పాహార ప్యాకేజీలో భాగంగా ఒకరికి రూ. 600/- (వెన్యూకు చార్జీ లేదు) ఎవరికి వారే ఆహారం తెచ్చుకునేటట్టయితే వెన్యూ చార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. వెన్యూ చార్జీ రోజుకు రూ.50,000, సగం రోజుకు రూ.25,000/- ఫొటోగ్రాఫ్స్ తీసుకునే సౌలభ్యం ఉంది. మరిన్ని వివరాలకు: ఫోన్ నెం. +911123718100 Email ID: info@heritagetransportmuseum.org ఆసక్తి, ఉత్సాహం, పరిశోధన... నలుగురిలో ప్రత్యేకంగా నిలుపుతాయి. ఇదే తరుణ్ థక్రల్ విషయంలోనూ జరిగింది. ఢిల్లీ వాస్తవ్యులైన తరుణ్‌కి పాతకాలం నాటి వస్తువులను సేకరించడం ఒక అలవాటుగా ఉండేది. గ్రామ్‌ఫోన్‌ల నుంచి ల్యాంప్స్ వరకు రాజస్థాన్, గుజరాత్ చుట్టుపక్కల గ్రామాలను తిరిగి మరీ సేకరించేవారు. అందులో భాగంగా పాత కార్లను సేకరించడం ఒక అలవాటుగా మారింది. అదే ఈ హెరిటేజ్ ట్రాన్స్పోర్ట్ మ్యూజియం ఏర్పాటుకు దోహదం చేసింది. 20 ఏళ్ల అతని కృషి ఫలితంగా డిసెంబర్, 2013లో ఈ చారిత్రాత్మక వాహనశాల ఏర్పాటైంది. -
ప్రయాణ టెన్షన్ !
ప్రత్తిపాడు : పదవ తరగతి పరీక్ష కేంద్రాల్లో మాత్రమే వసతులపై శ్రద్ధ చూపిన అధికారులు విద్యార్థుల రవాణా సౌకర్యంపై దృష్టి సారించలేకపోతున్నారు. ఫలితంగా విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు ప్రైవేట్ వాహనాలను ఆశ్రయించక తప్పని పరిస్థితులు చోటు చేసుకున్నాయి. దీంతో టెన్త్ విద్యార్థులకు ప్రయాణ కష్టాలు తప్పడం లేదు. ఒక పక్క విద్యార్థులకు పరీక్షల టెన్షన్...మరో పక్క పరీక్ష కేంద్రానికి పిల్లలను ఎలా తీసుకు వెళ్లాలా అని తల్లిదండ్రులకు కంగారు. సమయానికి ఆర్టీసీ బస్సులు లేవు. పై గ్రామాల నుంచి వచ్చే ఆటోలు ప్రయాణికులతో కిక్కిరిసిపోతున్నాయి. దీంతో కొందరు తల్లిదండ్రులు వారివారి అత్యవసర పనులను సైతం పక్కనపెట్టి తమ తమ బైక్‌లపై పిల్లలను కేంద్రాల వద్దకు తీసుకెళుతున్నారు. ఏ అవకాశం లేని విద్యార్థులు కిక్కిరిసిన ఆటోల్లో ఓ మూలన కూర్చునో లేక వేలాడబడుతూనో వ్యయ ప్రయాసలకోర్చి పరీక్ష కేంద్రాలకు రాకపోకలు సాగిస్తున్నారు. పరీక్షలు ఉదయం తొమ్మిది గంటలకు ప్రారంభమవుతుండగా విద్యార్థులు గంట ముందే కేంద్రాలకు చేరుకోవలసి ఉన్న నేపథ్యంలో ఇక్కట్లు తప్పడం లేదు. సమయానికి రాని ఆర్టీసీ బస్సులు... అనేక గ్రామాల నుంచి పరీక్ష కేంద్రాలకు వెళ్లేందుకు ఆర్టీసీ సర్వీసులు లేవు. దీంతో ప్రైవేట్ వాహనాలే దిక్కయ్యాయి. ప్రత్తిపాడు పరీక్ష కేంద్రంలో గొట్టిపాడు, ప్రత్తిపాడు, తిక్కిరెడ్డిపాలెం, కోయవారిపాలెం గ్రామాల విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు. కోయవారిపాలెం నుంచి వచ్చే విద్యార్థులకు మినహా మిగిలిన వారికి తగిన సమయాల్లో ఆర్టీసీ బస్సు సౌకర్యం ఉండదు. అదేవిధంగా చినకోండ్రుపాడు సెంటరులో యనమదల, చినకోండ్రుపాడు, పొత్తూరు విద్యార్థులు పరీక్షలకు హాజరవుతారు. ఈ రెండు గ్రామాల నుంచి కేంద్రానికి రావాలంటే కచ్చితంగా ఆటోలు, ప్రైవేట్ వాహనాలనే ఆశ్రయించాల్సిన దుస్థితి. ఆటోలలో ప్రయాణం ప్రమాదమే... విద్యార్థులను పరీక్ష కేంద్రాలకు పంపే హడావుడిలో తల్లిదండ్రులు, విద్యార్థులు ఆటోలను ఆశ్రయించక తప్పడం లేదు. ఆటో డ్రైవర్లు ఆటోలను పుష్పక విమానంలా ఉపయోగిస్తున్నారు. ప్రమాదకర స్థితిలో ఆటోలో 20 నుంచి 25 మంది వరకు ఎక్కిస్తున్నారు. పొరపాటున ఏదైనా జరగరానిది జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారు. ఇప్పటికైనా అధికారులు దృష్టిసారించాలి. -
నల్లబెల్లం విక్రయిస్తే రౌడీషీట్
వరంగల్ క్రైం : జిల్లాలో ఇకపై నల్లబెల్లం విక్రయించినా, రవాణా చేసినా అటువంటి వారిపై రౌడీషీట్ నమోదు చేస్తామని వరంగల్ రూరల్ ఎస్పీ అంబర్ కిషోర్ ఝా హెచ్చరించారు. వరంగల్ రూరల్, అర్బన్ పరిధిలో నిరుపేద కుటుంబాలను వీధిపాలు చేస్తూ వారి జీవితాలపై తీవ్ర ప్రభావం చూపిస్తున్న గుడుంబాను నియంత్రించే ఉద్దేశంతో ఆదివారం వరంగల్ రూరల్ ఎస్పీ ఓ ప్రకటన విడుదల చేశారు. ఇకపై గుడుంబా తయారీకి ఉపయోగించే ముడి సరుకులైన నల్లబెల్లం, పటికను అమ్మిన, రవాణా చేసిన వారిపట్ల కఠినంగా వ్యవహరించడంతోపాటు స్థానిక పోలీస్స్టేషన్లలో వారిపై రౌడీ షీట్ తెరుస్తామన్నారు. రూరల్ పరిధిలోని పరకాల, రేగొండ, ఏటూరునాగారం మండలాలకు చెందిన బెల్లం శివుడు, పోరుళ్ల సంతోష్, వలీబాబాతో పాటు అర్బన్ జిల్లా మిల్స్‌కాలనీ పోలీసు స్టేషన్ పరిధిలోని మహేందర్‌పై ఆయా పోలీస్‌స్టేషన్ పరిధిలో కేసులు నమోదు చేయడంతోపాటు వారిపై రౌడీషీట్ తెరిచినట్టు పేర్కొన్నారు. నల్లబెల్లం నియంత్రణ కోసం పోలీసు శాఖ తరపున ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. గతంలో ఇటువంటి చర్యలకు పాల్పడిన వారిపై నిఘా పెట్టడంతోపాటు గ్రామాల్లో గుడుంబా త యారీ కేంద్రాలపై దాడులు నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు. ప్రజలు కూడా తమవంతు సహకారం అందించాలని కోరారు. ఎవరైనా నల్లబెల్లం విక్రయిస్తున్నా, రవాణా చేస్తున్నా ఆ విషయాన్ని సమీప పోలీస్ స్టేషన్లో తెలియజేయాల్సిన బాధ్యత పోలీసులపై ఉందన్నారు. 100 నంబరుకు ఫోన్ చేసి సమాచారం అందించాలని, వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని ఎస్పీ పేర్కొన్నారు. -
మరింత భారం
= ప్రభుత్వం గుర్తించిన వాహనాలకే అనుమతి = సొంత వాహనాల్లో ఇసుక రవాణాకు చెల్లుచీటీ = అమల్లోకి వచ్చిన కొత్త నిబంధనలు = పెరిగిన రవాణా చార్జీలు = ఇప్పటికే ఇసుక ధర పెంపు.. రవాణా పేరుతో అదనపు మోత నెల్లూరు(బారకాసు): ఇసుక పేరుతో ప్రభుత్వం ప్రజలను నిలువుదోపిడీ చేసేందుకు శ్రీకారం చుట్టింది. పాలకులు తీసుకుంటున్న విపరీత నిర్ణయాలే ఇందుకు నిదర్శనం. సర్కారు తీరుతో ఇసుక మరింత భారం కానుంది.. ఇప్పటికే పెరిగిన రేట్లతో గృహ నిర్మాణదారులు, పేదలు ఇబ్బందులు పడుతున్నారు.. ఈనేపథ్యంలో రీచ్‌ల నుంచి ఇసుక రవాణాకు సంబంధించి ప్రభుత్వం వారం క్రితం తాజా ఉత్తర్వులు విడుదల చేసింది.. ఈ ఉత్తర్వుల ప్రకారం రవాణా చార్జీల భారం గృహనిర్మాణదారులపై పడనుంది.. ఇప్పటికే ఇసుక రవాణా చేస్తున్న ట్రాక్టర్, లారీల యజమానుల పరిస్థితి దయనీయంగా మారింది.. రిజిస్టర్ చేయించుకున్న వాహనాల ద్వారానే ఇసుక రవాణా చేయాలనే నిబంధన ఇందుకు కారణం. కొత్తగా అమల్లోకి వచ్చిన నిబంధనల ప్రకారం రీచ్‌ల నుంచి ఇసుక తరలించేందుకు వినియోగదారులు ఇంతకు ముందులా సొంత లేదా తమకు నచ్చిన అద్దె వాహనాలను వినియోగించే పరిస్థితి లేదు. ప్రభుత్వం వద్ద నమోదైన వాహనాల్లోనే.. అదీ ఇసుక ధరతో పాటు రవాణా ఖర్చులను ముందుగానే చెల్లించి మరింత భారం ఇసుక తీసుకెళ్లాలని ప్రభుత్వం తాజా ఉత్తర్వుల్లో ఆదేశించడంతో జిల్లాలోని మొత్తం 42 రీచ్‌లలో ఈనెల 22 నుంచి అమలు చేశారు. ఈమేరకు అధికారులు ఆయా రీచ్‌ల పరిధిలో ఇసుక రవాణ చేసేందుకు ట్రాక్టర్ల, టిప్పర్ల(లారీ) వాహనాల యజమానుల నుంచి రిజిస్ట్రేషన్ చేయించుకుంటున్నారు. నిబంధనలు ఇవే... = ఇసుక రీచ్‌ల నిర్వహణను డ్వాక్రా సం ఘాలకు అప్పగించిన ప్రభుత్వం ఇప్పు డు రవాణాను కూడా వారికే కట్టబెట్టింది. = ఇసుక రవాణ చేయదలచుకున్న వారు సంబంధిత వెలుగు కార్యాలయల్లో తమ వాహనాల రిజిస్ట్రేషన్ నంబర్లను నమోదు చేయించుకోవాలి. = ఇసుక కొనుగోలుదారుల సొంత వాహనాలతో సహా ఇతరత్రా ఏవాహనాలను రవాణాకు అనుమతించరు. = ఇసుక కావాల్సిన వారు ఇసుక ధరతో పాటు వాహనం అద్దెను ముందుగానే మీ-సేవా కేంద్రంలో చెల్లించి రసీదు తీసుకొస్తేనే సంబంధిత రీచ్‌ల నిర్వాహకులు ఇసుక లోడింగ్‌కు అనుమతిస్తారు. = దూరాన్ని బట్టి రవాణాచార్జీలను సర్కా రే నిర్ణయించింది. దాని ప్రకారం ట్రాక్టర్లకైతే 5 కి.మీ వరకు రూ.400, 5 నుంచి 10కి.మీ వరకైతే రూ.600 ఆపైన ప్రతి కిలోమీటర్‌కు రూ.30 చొప్పున చెల్లించా లి. అదేవిధంగా పదిటన్నుల ఇసుకను నింపిన టిప్పరు(లారీ)కు 5నుంచి 10 కి.మీ వరకు రూ.800 ఆపైన ప్రతి కిలోమీటరకు రూ.80 చొప్పున చెల్లించాలి. అలాగే 25 టన్నుల ఇసుక నింపిన టిప్పరు(లారీ)కి అయితే 5నుంచి10 కి.మీ వర కు రూ.1,200 ఆపైన ప్రతి కిలోమీటరకు రూ.100 చొప్పున వసూలు చేస్తారు. కొనుగోలుదారులకు భారం... ఈవిధానం ఇసుక కొనుగోలుదారులకు భారంగా మారడంతో పాటు ఇసుక రవాణానే ఉపాధిగా చేసుకున్న వందలాది ట్రాక్టర్లు, లారీల యజమానుల పొట్టకొట్టనుంది. ఇప్పటివరకు ఇసుక రవాణాకు వాహనదారులతో బేరమాడి నచ్చిన చార్జీ చెల్లించే వెసులుబాటు ఉండేది. తాజా ఉత్తర్వులతో తప్పనిసరిగా నిర్ణీత ధర చెల్లించాల్సిందే. ఉదాహరణకు పొట్టేపాళెం, దేవరపాళెం రీచ్‌ల నుంచి నగరంలోకి ట్రాక్టర్ ఇసుక రవాణా చేయాలంటే ప్రభుత్వ ధర ప్రకారం రూ.2,650 చెల్లించాలి. దూరాన్ని బట్టి ఈమొత్తం పెరుగుతుంది. ఇదే ట్రాక్టరు ఇసుక ధర రూ1,850లే. అంటే ఇసుక కంటే రవాణా చార్జీలే తడిసిమోపెడన్నమాట. కచ్చితంగా అమలు వాస్తవంగా ఈ నిబంధనలు రీచ్‌లు ప్రారంభించనప్పటి నుంచే ఉన్నాయి. అయితే ఈనిబంధనలను ఈ నెల 22 నుంచే కచ్చితంగా పాటించాలని ఉన్నతాధికారుల ఆదేశించారు. దీంతో జిల్లాలో ఆరోజు నుంచే ప్రభుత్వం ఆదేశించిన నిబంధనలు అమలుచేస్తున్నాం. ఆమేరకు ఇసుక ధర, రవాణా చార్జీలు కలిపి వినియోగదారుడు మీ-సేవలో చెల్లించి ఆయా రీచ్‌లలో రసీదు అందచేస్తేనే ఇసుక సరఫరా చేస్తాం. - డీఆర్డీఏ పీడీ చంద్రమౌళి -
గంజాయిపై ఉమ్మడి దెబ్బ
ఏజెన్సీలో విస్తృత దాడులకు ఎక్సైజ్, పోలీసుశాఖల శ్రీకారం తొలి ప్రయత్నం విజయవంతం గంజాయి సాగుపై ఎట్టకేలకు అధికారులు ఉక్కుపాదం మోపారు. గంజాయి సాగుకు, రవాణాకు ఏజెన్సీ పెట్టింది పేరు. ఏటా కోట్లాది రూపాయల వ్యాపారం ఇక్కడ జరుగుతూ ఉంటుంది. ఇదంతా అధికారులకు తెలిసినా వివిధ శాఖల మధ్య సమన్వయ లోపం, సిబ్బంది కొరత కారణంగా ఇంతవరకు గంజాయి వ్యాపారులదే పైచేయిగా ఉంది. ఈ నేపధ్యంలో జిల్లా కలెక్టర్ స్వయంగా దృష్టి సారించారు. ఎక్సైజ్, పోలీస్, అటవీ, రెవెన్యూ శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. ఏజెన్సీలో శనివారం ఎక్సైజ్, పోలీస్‌ల ఉమ్మడి ఆపరేషన్ సక్సెస్ అయింది. మరిన్ని దాడులకు సిద్ధమవుతున్నారు. పాడేరు: విశాఖ ఏజెన్సీ, ఆంధ్రా-ఒడిశా సరి హద్దు ప్రాంతంలో విస్తారంగా సాగవుతు న్న గంజాయి తోటలను పూర్తిగా ధ్వంసం చేసేందుకు ఎక్సైజ్, పోలీసు శాఖలు శ్రీకారం చుట్టాయి. జీకేవీధి, చిం తపల్లి, జి.మాడుగుల, పాడేరు, పెదబ యలు, ముంచంగిపుట్టు మండలాల్లోని మారుమూల ప్రాంతాలతో పాటు సీలేరు నదీ పరివాహక ప్రాంతం, ఒడిశా సరిహద్దులోని అటవీ ప్రాంతాల్లో ఏటా వేలాది ఎకరాల్లో గంజాయి సాగు చేస్తున్నారు. గిరిజనులకు డబ్బు ఆశ చూపి కేరళ, తమిళనాడు, ఒడిశా రాష్ట్రాలకు చెందిన వ్యాపారులు గంజాయి సాగును ప్రోత్సహిస్తున్నారు. దీంతో మారుమూల గిరిజనులంతా నీటి నిల్వలు అందుబాటులో ఉన్న రిజర్వు ఫారెస్టు, బంజరు భూముల్లో గంజాయి సాగును ఆధునిక పద్ధతుల్లో సాగు చేస్తున్నారు. ఇక్కడ సాగైన గంజాయిని ఒడిశా, తమిళనాడు, కేరళ, గోవా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలకు తరలించి రూ.కోట్లలో గంజాయి వ్యాపారం చేపడుతున్నారు. ఎరువులు, క్రిమి సంహారక మందులు ఉపయోగిస్తూ నాణ్యమైన శీలవతి రకం గంజాయిని ఏజెన్సీలో సాగు చేస్తున్నారు. ఏటా అక్టోబరు నెలలో గంజాయి సాగును చేపడుతుండటగా జనవరి, ఫిబ్రవరి నెలలు నాటికి దిగుబడి దశకు చేరుకుంటుంది. ఈ గంజాయి తోటలకు రోజువారీ సంరక్షణ కూడా భారీగానే సొమ్ము ఖర్చు పెడుతుంటారు. ఎరువులు ఉపయోగించడంతోపాటు నీరు సమృద్ధిగా అందిస్తుండటంతో ఒక్కో గంజాయి మొక్క 6 నుంచి 8 అడుగుల మధ్య ఏపుగా పెరుగుతు కిలో బరువు గంజాయి దిగుబడి ఇస్తుంది. నాణ్యమైన గంజాయి ఏజెన్సీలో సాగవుతుండటంతో జాతీయ స్థాయిలో అక్రమ వ్యాపారులంతా ఏజెన్సీలో గంజాయినే కొనుగోలు చేస్తున్నారు. రూ.కోట్లలో వ్యాపారం జరుగుతున్నప్పటికి ఎక్సైజ్, పోలీసు అధికారులు దీని సాగును పూర్తిగా నిర్మూలించ లేకపోతున్నారు. గంజాయి సాగు నిర్మూలనలో అటవీ, రెవెన్యూశాఖలకు కూడా సర్వహక్కులు ఉన్నప్పటికి వారు పట్టించుకోవడం లేదు. ఈ నేపధ్యంలో ఇటీవల జిల్లా కలెక్టర్ గంజాయి నిర్మూలనకు బాధ్యత ఉన్న అన్ని శాఖలను సమాయత్త పరిచారు. ఎక్సైజ్‌శాఖ వద్ద ఆయుధాలు లేకపోవడంతో ఒంటరిగా గంజాయి తోటలను ధ్వంసం చేయలేకపోతున్నారు. గతంలో జి.మాడుగుల మండలం కిల్లంకోట వద్ద గంజాయి తోటలు ధ్వంసానికి వెళ్ళిన ఎక్సైజ్ అధికారులపై అక్కడ స్థానిక గిరిజనులు ఎదురుదాడి చేసి తీవ్రంగా గాయపర్చారు. అప్పటి నుంచి మారుమూల ప్రాంతాల్లో గంజాయి దాడులకు ఎక్సైజ్‌శాఖ దూరంగానే ఉంది. ఎక్సైజ్‌శాఖ పోలీసుశాఖ సహకారాన్ని తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆదేశించడంతో ఈ ఏడాది గంజాయి సాగుకు ఈ రెండు శాఖలు సమన్వయంతో గంజాయి తోటలు ధ్వంసానికి శ్రీకారం చుట్టాయి. రెవెన్యూ యంత్రాంగం కూడా గంజాయి తోటల ధ్వంసానికి తప్పనిసరిగా వెళ్లాలని జిల్లా కలెక్టర్ ఆదేశాలు ఇచ్చారు. పోలీసు కూంబింగ్ పార్టీలు, సీఆర్పీఎఫ్ బలగాలు బందోబస్తు మధ్య ఎక్సైజ్‌శాఖ దాడులకు సిద్ధమైంది. శనివారం తొలిరోజే ఎక్సైజ్, పోలీసుశాఖల ఉమ్మడి దాడులు విజయవంతమయ్యాయి. పాడేరు మండలం మారుమూల బొడ్డాపుట్టు ప్రాంతంలో 22 ఎకరాల విస్తీర్ణంలోని 6 అడుగుల ఎత్తుకు ఎదిగిన గంజాయి తోటలను ఎక్సైజ్, పోలీసు అధికారులు పూర్తిగా ధ్వంసం చేశారు. రెవెన్యూ అధికారులు కూడా ఈ గంజాయి తోటల ధ్వంసంలో పాల్గొన్నారు. ఇకపై అన్ని ప్రాంతాల్లోను గంజాయి తోటల ధ్వంసానికి ఎక్సైజ్, పోలీసుశాఖలు రంగం సిద్ధం చేస్తున్నాయి. -
అన్ని గ్రామాలకు రోడ్లతో... దేశంలోనే మేటిగా తెలంగాణ
సాక్షి, హైదరాబాద్: అత్యుత్తమ గ్రామీణ రహదారి సౌకర్యాలు కలిగిన రాష్ట్రాల్లో తెలంగాణను దేశంలోనే అగ్రగామిగా నిలబెట్టేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి కె.తారకరామారావు చెప్పారు. గురువారంనాడిక్కడ ఆయన విలేకరులతో మాట్లాడారు. గ్రామ రహదారులను పటిష్టం చేసే బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టినట్టు తెలిపారు. చక్కని ప్రమాణాలతో రహదారులను తీర్చిదిద్దడంతో తెలంగాణలో పల్లెలకు, పట్టణాలకు మధ్య రవాణాసదుపాయాలు ఏర్పడతాయని ఆయన చెప్పారు. దశలవారీగా రోడ్ల అభివృద్ధి: గ్రామాల రహదారుల్లో మొదటి దశలో, ఐదేళ్ల కిత్రం వేసిన 12వేల కిలోమీటర్ల తారురోడ్లను రూ.1,767 కోట్లతో పునరుద్ధరిస్తామన్నారు. ప్రతి కిలోమీటర్‌కు రూ.3లక్షల చొప్పున, సుమారు రూ.600 కోట్లతో 20వేల కిలోమీటర్ల మట్టిరోడ్లను మెరుగుపరుస్తామన్నారు. 250 కోట్లతో వంతెనల, కల్వర్టుల నిర్మాణం చేపడతామన్నారు. వివరాలన్నీ వెబ్సైట్లో..: రహదారుల అభివృద్ధికి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడిస్తున్నామని మంత్రి తెలిపారు. రహదారులను సర్వే చే యించి, డేటాబేస్ సిద్ధం చేశామన్నారు. జాతీ య రహదారుల మాదిరిగా గ్రామీణ దారులకూ కోడ్నంబర్లను ఇస్తామన్నారు. ఈ వివరాలను వెబ్సైట్లో ఉంచడం ద్వారా పాతరోడ్లకు బిల్లులు తీసుకునే అక్రమాలకు తావుండదన్నారు. జాతీ య ప్రమాణాలకు అనుగుణంగా రహదారుల నిర్మాణం చేపట్టాలని అధికారులకు సూచించామన్నారు. కాగా పంచాయతీరాజ్ విభాగంలో ఖాళీగా ఉన్న 198 ఇంజనీర్ పోస్టులను పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా భర్తీ చేస్తామన్నారు. -
ఆదాయం పెంచండి: మంత్రి ఈటెల
సాక్షి, హైదరాబాద్: నిర్దేశించిన లక్ష్యాల మేరకు ఆదాయాన్ని ఖజానాకు సమకూర్చాల్సిందేనని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి ఈటెల రాజేందర్ స్పష్టం చేశారు. రవాణా, భూగర్భ గనుల శాఖలు ఆశించిన మేరకు ఆదాయాన్ని రాబట్టలేకపోవడంపై ఆయన అసంతృప్తి వ్యక్తంచేశారు. ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను అందుకోడానికి మరింత కష్టపడి పనిచేయాలని మంత్రి ఆదేశించారు. కొత్తగా తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వంపై ప్రజలు భారీ ఆశలు పెంచుకున్నారని, వీటిని నెరవేర్చడానికి ప్రధాన ఆదాయ వనరుల శాఖలు కీలక పాత్ర పోషించాల్సి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. ప్రభుత్వానికి ఆదాయాన్ని సమకూర్చే వాణిజ్య పన్నులు, ఎక్సైజ్, రవాణా, స్టాంపులు రిజిస్ట్రేషన్లు, భూగర్భ గనుల శాఖల ఉన్నతాధికారులతో శనివారం సచివాలయంలో మంత్రి ఈటెల సమీక్ష జరిపారు. -
పల్లె ముంగిట్లో సాంకేతిక సౌరభాలు
దోమ: ఒకప్పుడు పట్టణాలకు, ఉన్నత కుటుంబాలకే పరిమితమైన టెక్నాలజీ వినియోగం నేడు పల్లెలకు కూడా పాకింది. విద్య, వైద్యం, ఆరోగ్యం, రవాణా, కమ్యూనికేషన్, వినోదం, ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లోనూ టెక్నాలజీ నిత్య నూతనమైంది. ఆయా రంగాల్లో సాంకేతికాభివృద్ధి ఫలితంగా అందుబాటులోకి వచ్చిన అత్యాధునిక సౌకర్యాలన్నీ మానవ జీవితాన్ని అత్యంత సుఖవంతం చేశాయి. అదే సమయంలో వాటిని దుర్వినియోగం చేస్తే తీవ్ర పరిణామాలు ఎదురవుతున్నాయి. ఈ కారణంగా శాస్త్ర, సాంకేతికాభివృద్ధి ఫలితంగా అందుబాటులోకి వచ్చిన సౌకర్యాలను ఎలా సద్వినియోగం చేసుకోవాలి, వాటిని దుర్వినియోగం చేస్తే ఎదురయ్యే పరిస్థితులపై ప్రజలకు అవగాహన కల్పించేందుకై ప్రతి ఏటా నవంబర్ మాసంలో 2వ గురువారాన్ని ప్రపంచ యూజబిలిటీ డేగా పాటిస్తున్నారు. ప్రపంచ యూజబిలిటీ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏటా ఈ రోజు పలు ప్రత్యేక కార్యక్రమాలను చేపడుతూ ప్రజలను చైతన్యవంతం చేయడానికి ప్రయత్నాలు సాగుతున్నాయి. పల్లె జీవన శైలి మార్చిన టెక్నాలజీ గత కొన్నేళ్ల క్రితం వరకు పట్టణాలు,నగరాలకే పరిమితమైన టెక్నాలజీ వినియోగం నేడు పల్లెలకు కూడా పాకింది. కొన్నేళ్ల క్రితం వరకు సెల్‌ఫోన్ ఎవరిచేతిలోనైనా కనబడితే అందరూ ఆశ్చర్యంగా చూసేవారు. నేడు పల్లెల్లో సెల్‌ఫోన్ లేనిదే క్షణం గడవని పరిస్థితి. అంతేకాకుండా ప్రస్తుతం పల్లెల్లో ఇంటర్నెట్ వినియోగం కూడా గణనీయంగా పెరిగింది. పరిగి ప్రాంతాన్ని తీసుకుంటే మూడేళ్ల క్రితం కేవలం 2 ఇంటర్నెట్ కేంద్రాలు మాత్రమే అందుబాటులో ఉండేవి. కానీ ప్రస్తుతం పరిస్థితి మారింది. పరిగిలోనే కాకుండా దోమ, కుల్కచర్ల, గండేడ్ మండలాల్లో పెద్ద ఎత్తున ఇంటర్నెట్ కేంద్రాలు వెలిశాయి. అన్ని చోట్లా కలిపి ప్రస్తుతం 20 ఇంటర్నెట్ కేంద్రాలు కొనసాగుతున్నాయి. ఇక ఇళ్లల్లో దాదాపు 200 మంది వరకు బ్రాడ్ బ్యాండ్ సేవలను వినియోగిస్తున్నారు. నిర్మాణ రంగంలోనూ అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. శారీరక శ్రమ తగ్గిపోయి బేస్మెంట్ దగ్గర నుంచి చెత్తు వేసే వరకు కూడా అత్యాధునిక యంత్రాలు అందుబాటులోకి వచ్చాయి. విద్యా సంస్థల విషయానికొస్తే బ్లాక్‌బోర్డులకు బదులుగా ప్రస్తుతం కొన్ని చోట్ల ప్రొజెక్టర్ సౌకర్యాన్ని వినియోగిస్తున్నారు. అలాగే ఒకప్పుడు ధనవంతులకే పరిమితమైన కార్లు ప్రస్తుతం మధ్యతరగతి వారికి కూడా అందుబాటులోకి వచ్చాయి. అంతేకాకుండా పల్లెల్లో ద్విచక్రవాహనం లేని ఇళ్లు లేదని చెప్పడానికి ఎలాంటి అతిశయోక్తి అవసరం లేదు. ఇక వ్యవసాయంలోనూ కూలీల అవసరం తగ్గి మి షన్లతోనే పనులు జరుగుతున్నాయి. గతంలో వారాలు పట్టే పనిని యంత్రాలతో గంటల్లోనే ముగిస్తున్నారు. వినియోగంలో లోపిస్తున్న విచక్షణ.... విజ్ఞాన శాస్త్రం అనేక సమస్యలు పరిష్కరించి మానవ జీవితాన్ని సుఖమయం చేసింది. కానీ మనిషి విచక్షణా లోపం వల్ల ఆ విజ్ఞానమే పర్యావరణ అసమతుల్యత, పరిసరాల కాలుష్యానికి దారి తీస్తోంది. ఉదాహరణకు సోషల్నెట్వర్కింగ్తో పరిచయాలు పాత స్నేహితులను కలుసుకోవచ్చు. అదే సోషల్నెట్వర్క్ను కొందరు దుర్వినియోగం చేస్తుండటంతో వస్తున్న పెద్ద పెద్ద సమస్యల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. అదే విధంగా సెల్ఫక్షన్ సిగ్నల్స్‌తో కొన్ని రకాల పక్షులు ఇప్పుడు పల్లెల్లో కూడా కనుమరుగవుతున్నాయి. ఇక ఆండ్రాయిడ్ ఫోన్లు వచ్చినప్పటి నుంచి సహచరులతో మాట్లాడటం తగ్గించి ఫోన్లతోనే కాలక్షేపం చేస్తుండటంతో సంబంధబాంధవ్యాలు దెబ్బతింటున్నాయి. మానవుడు తన పరిజ్ఞానాన్ని సరైన మార్గంలో వినియోగించి సృష్టి ఔన్నత్యానికి పాటు పడాలే గానీ సృష్టి వినాశనానికి కాదని గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. -
బాధితుల పరేషన్
శ్రీకాకుళం పాతబస్టాండ్: సర్కారు వైఫల్యం, అధికారుల ప్రణాళిక లోపం కలిసి తుపాను, వరద బాధితులను మరిన్ని కష్టాల్లోకి నెడుతున్నాయి. తుపాను వచ్చి 12 రోజులైంది. ఆ వెంటనే నాగావళి వరదలతో జిల్లాలో 11 మండలాల్లోని పలు గ్రామాలు ముంపునకు గురయ్యాయి. ప్రభుత్వం ఆర్భాటంగా సహాయం ప్రకటించినా.. సరైన వసతి, రవాణా సదుపాయాలు కల్పించకుండా పంపిణీ వేగవంతం చేయాలని ఒత్తిళ్లు పెంచుతున్నారు. తీరప్రాం తాలకు సరుకులు అందుతున్నా మైదాన ప్రాంతాలను పట్టించుకోవడం లేదని బాధితులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికీ తీర మండలాలు మినహా మిగిలిన మండలాల్లో బియ్యం, ఉల్లి, బంగాళాదుంపలు, పామాయిల్, కారం, ఉప్పు వంటి సరుకులు అందడంలేదు. పంపిణీ జరుగుతున్న ప్రాంతాల్లోనూ పూర్తి స్థాయిలో లేకపోవడంతో రేషన్ షాపుల వద్ద బాధితులు బారులుతీరి సరుకుల కోసం ఎగబడుతున్నారు. గంటల తరబడి క్యూల్లో నిరీక్షిస్తున్నారు. కమిటీలకు పంపిణీ బాధ్యతలు సరుకుల పంపిణీ బాధ్యతను జన్మభూమి-మాఊరు గ్రామ కమిటీలకు అప్పగించడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. రాజకీయ ప్రాబల్యంతో ఏర్పడిన ఈ కమిటీలపై పింఛన్లు, రేషన్ కార్డుల తొలగింపు విషయంలో పక్షపాతం చూపారన్న ఆరోపణలు ఇప్పటికే ఉన్నాయి. ఈ కమిటీలకు సరుకుల పంపిణీని కూడా అప్పగించడాన్ని స్థానికులు వ్యతిరేకిస్తున్నారు. జిల్లాలో సుమారు 8.40 లక్షల రేషన్ కార్డులు(తెలుపు, గులాబీ, ఆంత్యోదయా, అన్నపూర్ణ) ఉన్నాయి. కాగా తుపాన్, అనంతరం వచ్చిన నాగావళి, వంశధార వరదల కారణంగా 22 మండలాల్లో 196 గ్రామాలు, ఆరు మున్సిపాలిటీల పరిధిలో 13 వార్డుల్లోనూ కలిపి మొత్తం 57,127 కుటుంబాలు నష్టపోయినట్లు గుర్తించారు. ఇందులో మత్య్సకార కుటుంబాలు 33 వేలు ఉన్నాయి. తుపాను సాయం, సరుకులు మత్స్యకారులకు చాలా వరకు అందగా, మిగిలిన బాధితులకు మాత్రం అరకొరగానే అందింది. మత్య్సకారులకు, చేనేత కార్మికులకు {పత్యేక ప్యాకేజీ తుపాన్, వరదల్లో నష్టపోయిన మత్స్యకారులు, చేనేత కార్మిక కుటుంబాలకు ప్రభుత్వం ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించింది. కుటుంబానికి 50 కిలోల బియ్యం, 5 లీటర్ల కిరోసిన్, లీటరు పామాయిల్, కందిపప్పు, పంచదార, కారం, ఉప్పు, ఇతర సరుకులతోపాటు ఉల్లిపాయలు, దుంపలు అంద జేయాలి. వీరు కాకుండా మిగిలిన బాధితులకు కుటుంబానికి 25 కేజీల బియ్యం, పామాయిల్, పంచదార, కారం, ఉప్పు కందిపప్పు, తదితర సరుకులు అందజేయాలి. మిగిలిన 7.80 లక్షల కార్డుదారులకు పింక్, తెలుపు అన్న తేడా లేకుండా కార్డుకు 10 కిలోల బియ్యం, పంచదార, పామాయిల్, కారంతోపాటుగా ఉల్లిపాయలు, బంగాళాదుంపలు అందజేయాలని ప్రభుత్వం ఆదేశాలు చేసింది. సరఫరాలో జాప్యం ఇప్పటివరకు జిల్లాకు 30 లారీల్లో సుబారు 480 మెట్రిక్ టన్నుల సరుకలు వచ్చాయి. ఇందులో ప్రధానంగా ఉల్లిపాయలు, బంగాళా దుంపలు ఉన్నాయి. అయితే వీటిని మండలాలకు చేరవేయడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. కలాసీలు, రవాణా సదుపాయం లేకపోవడం కారణంగా చెబుతున్నారు. ఆదే విధంగా ఎంఎల్ఎస్ పాయింట్ల వద్ద సరిపడినంతగా బియ్యం నిల్వలు లేవు. దీంతో తహశీల్దార్లు మంజూరు చేసిన ఆర్ఓలు పట్టుకొని ఎంఎల్ఎస్ పాయింట్ల వద్ద పడిగాపులు కాస్తున్నారు. -
గొల్లపూడి రేవు నుంచి ఇసుక అక్రమ తరలింపు
గొల్లపూడి (విజయవాడ రూరల్) : సూరాయిపాలెం రేవు నుంచి టీడీపీ నాయకులు ఇసుకను అక్రమంగా తరలిస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం గొల్లపూడి(సూరాయిపాలెం) ఇసుకరేవు నిర్వహణను డ్వాక్రా గ్రూపుకు కేటాయించింది. అయితే అక్కడ స్థానిక టీడీపీనాయకులు డ్వాక్రాగ్రూపు మహిళలను, డీఆర్డీఏ అధికారులను కూడా లెక్కచేయకుండా ఇష్టారీతిగా వ్యవహరిస్తున్నట్లు విమర్శలు వస్తున్నాయి. వేబిల్లులు లేకపోవడంతో శుక్రవారం మధ్యాహ్నం వరకు ఇసుక రవాణా ఆగిపోయిందని డ్వాక్రా మహిళలు చెబుతుండగా ఉదయం నుంచి ఇసుక రవాణా జరిగిందని గ్రామస్తులు అంటున్నారు. నదినుంచి బోట్ల ద్వారా ఇసుకను తీసుకొచ్చే విషయంలో టీడీపీలోని రెండు వర్గాలకు చెందిన వారు గొడవ పడగా, గ్రామపంచాయతీ పాలకవర్గంలో కీలకపాత్ర పోషిస్తున్న ఓ వ్యక్తి కలగ జేసుకొని ఒక్కొక్కరూ పదేసి రోజులపాటు నదినుంచి ఇసుకను తెచ్చేవిధంగా ఇరువర్గాల మధ్య సయోధ్య కుదిర్చినట్లు తెలిసింది. వేబిల్లు లేకుండా తీసుకెళుతున్న ఇసుకను లారీ 15వేల రూపాయలకు బహిరంగంగా విక్రయిస్తున్నట్టు స్థానికులు చెబుతున్నారు. ప్రజలు మీసేవా కేంద్రంలో ఇసుక కొనుగోలు కోసం క్యూబిక్ మీటర్‌కు రూ.526, ట్రాన్స్‌పోర్టు చార్జీలకుగాను లారీకి రూ.800 చెల్లిస్తున్నారు. ప్రభుత్వ నిబంధన మేరకు లారి కిరాయి డబ్బు తిరిగి ఇసుక కొనుగోలుదార్లకు చెల్లించాల్సివుండగా అలా జరగడం లేదు. శనివారం మధ్యాహ్నానికి ప్రభుత్వ లెక్కల ప్రకారం 28లారీలకు, రెండుట్రాక్టర్లకు ఇసుకను విక్రయించినట్టు డీఆర్డీఏ ఏపీఎం శ్రీరామ్ తెలిపారు. లారి కిరాయిలు కొనుగోలుదారులే చెల్లిస్తున్నారని, తిరిగి వారికి చెల్లించాల్సి ఉందన్నారు. ఇసుక అక్రమ రవాణాపై అధికారులకు ఫిర్యాదులు ఇసుక అక్రమరవాణాపై డీఆర్డీఏ కార్యాలయానికి ఫోన్ల ద్వారా ఫిర్యాదులు రావడంతో ఏపీడీ కాళికాదేవి శనివారం సూరాయిపాలెం ఇసుకరేవును పరిశీలించారు. తాను వెళ్లిన సమయంలో బయటవ్యక్తులు ఎవరూ లేరని ఆమె తెలిపారు. ఇసుకరేవు వద్ద వెబ్ కెమేరాలు ఏర్పాటు చేయకపోవడం, డ్వాక్రా మహిళలకు ఐప్యాడ్లను అందించకపోవడంపై ఏపీడీ ని వివరణ కోరగా, ప్రభుత్వం నుంచి రావాల్సి ఉందన్నారు. ఇసుకరేవు వద్ద ఇసుకను నిల్వచేయడానికి ఐదెకరాల స్థలాన్ని సేకరించాల్సి ఉందని తెలిపారు. -
ట్రావెల్స్ సంస్థపై ముప్పేట దాడి
అఫ్జల్‌గంజ్: ఆదాయ పన్ను చెల్లించకుండా అక్రమంగా పొగాకు ఉత్పత్తులను రవాణా చేస్తున్న ఓ ట్రావెల్స్ సంస్థపై ఆదాయ పన్ను శాఖ, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్, ఫుడ్ కంట్రోల్ విభాగం అధికారులు సంయుక్తంగా దాడి చేశారు. రవాణాకు సిద్ధంగా ఉంచిన సుమారు 800 గోనె సంచులలోని పొగాకును స్వాధీనం చేసుకుని, పంచనామా నిర్వహించారు. నమూనాలను ల్యాబ్‌కు పంపించారు. వివరాల్లోకి వెళితే... ఢిల్లీకి చెందిన ఒకారా ట్రాన్స్పోర్ట్స్ నుంచి అఫ్జల్‌గంజ్‌లోని స్టేట్ సెంట్రల్ లైబ్రరీ పక్కన గల ఒకారా ట్రాన్స్పోర్ట్ కార్యాలయానికి రెండు లారీల్లో (హెచ్ఆర్ 55కె7774, ఆర్జె 09జిబి0245) సరుకు దిగుమతయింది. విశ్వసనీయ సమాచారం మేరకు ఆదాయపు పన్ను శాఖ డీ సీపీ సునీతారెడ్డి, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డీఎస్పీ వేణుగోపాల్‌రెడ్డి, ఇన్స్పెక్టర్ సంతోష్ కుమార్, ఫుడ్ కంట్రోల్ విభాగం అధికారి దామోధర్ రావుల నేతృత్వంలో సిబ్బంది ఒకారా ట్రావెల్స్‌పై బుధవారం రాత్రి దాడి చేశారు. 800 గోనె సంచుల్లో గల ముడి సరుకును స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించి బిల్లులు లేవని అధికారులు తెలిపారు. ట్రాన్స్‌పోర్టు మేనేజర్ తిలక్‌రాజ్‌ను విచారించగా సరుకును ఎక్కడికి పంపుతున్నారన్న విషయం తనకు తెలియదని, ఢిల్లీలోని తమ మెయిన్ బ్రాంచ్ నుంచి వచ్చిందని అధికారులకు తెలిపారు. మేనేజర్ పొంతనలేని సమాధానాలు చెబుతున్నారని అధికారులు పేర్కొన్నారు. ల్యాబ్‌లో స్వాధీనం చేసుకున్న పొగాకు నిషేధిత గుట్కాల తయారీకి వినియోగించేదిగా తేలితే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని వారు స్పష్టం చేశారు. -
వాహనాలకు రెట్టింపు పోటు
అరసవల్లి: రాష్ట్ర విభజన ప్రభావం రవాణా రంగంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. పన్ను భారం రెట్టింపు కావడంతో వాహన యజమానులతోపాటు ప్రయాణికులు, సరుకు రవాణాపై పెను భారం పడుతోంది. రాష్ట్రం విడిపోయిన రోజు.. అంటే జూన్ రెండో తేదీకి ముందు రిజిస్ట్రేషన్ చే యించుకున్న వాహనాలకు రెండు రాష్ట్రాల్లో నూ ఒకే పన్నుతో తిరిగే వెసులుబాటు ఉన్నా.. ఆ తర్వాత రిజిస్ట్రేషన్ చేయించుకున్న వాహనాలకు మాత్రం ఆంధ్ర, తెలంగాణల్లో తిరగాలంటే రెండు రాష్ట్రాల్లోనూ వేర్వేరుగా పన్ను చెల్లించాల్సిందే. ఉమ్మడి రాష్ట్రంలోని 23 జిల్లాల్లో ఎక్కడికెళ్లాలన్నా ఒకే పన్ను చలానాతో సరి పోయేది. ఇప్పుడు అదే చలానాతో కొత్త ఆంధ్రప్రదేశ్‌లోని 13 జిల్లాల్లోనే తిరిగేం దుకు అనుమతి ఉంది. తెలంగాణ భూభాగంలోకి ప్రవేశించాలంటే ఆ రాష్ట్ర ప్రభుత్వానికి మళ్లీ పన్ను కట్టాల్సిందే. అలాగే జూన్ రెండో తేదీ తర్వాత కొనుగోలు చేసిన ఏ వాహనాన్నయినా ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి బదిలీ చేయాలంటే పోలీస్ క్లియరెన్స్ తప్పని సరి. ఉదాహరణకు గతంలోశ్రీకాకుళం జిల్లాలో కొన్న వాహనాన్ని ఏదైనా తెలంగాణ జిల్లాకు బదిలీ చేయాలంటే ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్ సరిపోయేది. కొత్త నిబంధనల ప్రకారం ఆ సర్టిఫికెట్‌తోపాటు వాహనంపై ఏ విధమైన కేసులు లేవని ధ్రువీకరిస్తూ పోలీసులు ఇచ్చే క్లియరెన్స్ సరిఫికెట్ జత చేయాల్సి ఉంటుంది. జూన్ 2వ తేదీకి ముందు కొన్న వాహనాలకు ఈ కొత్త నిబంధన వర్తించదు. సొంత వాహనదారులకు ఇబ్బందులు ఈ ఏడాది జూన్ రెండు తర్వాత మోటారు సైకిళ్లు, కార్లు తదితర వ్యక్తిగత వాహనాలను ఏ రాష్ట్రంలో కొంటే అక్కడే లైఫ్ ట్యాక్స్ చెల్లిం చాలి. అయితే ఆ వాహనాలు రెండో రాష్ట్రంలోకి వెళ్లి, అక్కడ నెల రోజులకు మించి ఉంటే మాత్రం అక్కడ మళ్లీ లైఫ్ ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుంది. ఈ నిబంధన పాటించకుండా తిరిగే వాహనాలపై భారీగా జరిమానాలు వడ్డిస్తారు. మోటారు సైకిల్‌పై 9 శాతం, కార్లు ఇతర తేలికపాటి వాహనాలపై 12 శాతం జరి మానా వసూలు చేస్తారు. ప్రైవేటు బస్సులకు భారం రాష్ట్ర విభజన తో రవాణా శాఖ కూడా రెం డుగా విడిపోయింది. ఈ ప్రభావం వాణి జ్య వాహనాలు, ప్రైవేటు బస్సులపై తీవ్రం గా పడింది. రాష్ట్ర పర్మిట్‌పై తిరిగే ప్రైవేట్ బస్సుల యజమానులు ఇంతకు ముందు ప్రతి మూడు నెలలకు ఒక్కో సీటుకు రూ.3,675 చొప్పున పన్ను చెల్లించేవారు. ఇప్పుడు రెండు రాష్ట్రాల్లోనూ అంతే మొత్తం చొప్పున కట్టాల్సి వస్తోంది. అంటే ఒక్కో సీటుకు మూడు నెలలకు రూ.7,350 చెల్లించాల్సి ఉంటుంది. ఈ భారాన్నంతా ప్రైవేట్ ఆపరేటర్లు సహజంగా ప్రయాణికులపైనే మోపుతారు. ఆర్టీసీ బస్సులకు ఏడాదిపాటు ఇప్పుడున్న పర్మిట్లతో రాష్ట్రాల్లో తిరిగే వెసులుబాటు కల్పించినా.. వాటి కాలపరిమితి తీరిన తర్వాత రెండు రాష్ట్రాల్లో తిరగాలంటే వేర్వేరుగా పర్మిట్లు తీసుకోకతప్పదు. వాణిజ్య వాహనాలదీ ఇదే పరిస్థితి జూన్ రెండో తేదీకి ముందు పర్మిట్ తీసుకున్న వాణిజ్య వాహనాలకు పర్మిట్ కాలపరిమితి పూర్తియ్యేవరకు రెండు రాష్ట్రాలోనూ తిరిగే అవశాం కల్పిం చారు. ఆ తర్వాత మాత్రం రెండు రాష్ట్రాల్లో తిరగాలం టే వేర్వేరు పర్మిట్లు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ విధానాన్ని లారీ యజమానులు వ్యతిరేకిస్తున్నారు. రవాణా రంగం సంక్షోభంలో ఉన్నందున రెండు చోట్లా పన్న చెల్లించడం భారమవుతుందని వాహన యజమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
తక్కువ చార్జీలు.. మెరుగైన సేవలు
పోస్టల్ ట్రాన్స్‌పోర్టు సేవలు ప్రారంభం వస్తువులతో పాటు కూరగాయల రవాణా హైదరాబాద్: పోస్టల్ ట్రాన్స్‌పోర్టు ద్వారా వస్తువులతో పాటు కూరగాయల రవాణాకూ వెసులుబాటు కల్పించామని ఆంధ్రప్రదేశ్ సర్కిల్ చీఫ్ పోస్టుమాస్టర్ జనరల్ బీవీ సుధాకర్ వెల్లడించారు. సోమవారం హైదరాబాద్‌లోని జనరల్ పోస్టు కార్యాలయంలో పోస్టల్ ట్రాన్స్‌పోర్టు వాహనాలను ప్రారంభించారు. అనంతరం విలేకరులతో మాట్లాడు తూ, ప్రైవేటు రవాణా సంస్థల కంటే తక్కువ చార్జీలతోపాటు డోర్ డెలివరీతో మెరుైగె న సేవలందిస్తామన్నారు. ప్రాథమికంగా ఈ సేవలను నాలుగు ప్రధాన రూట్లలో ప్రారంభిస్తున్నామని, డిమాండ్‌ను బట్టి త్వరలో గ్రామీణ ప్రాంతాలకూ విస్తరిస్తామని చెప్పారు. రోజూ హైదరాబాద్ నుంచి మూడు రూట్లు, విజయవాడ నుంచి ఒక రూట్లో పోస్టల్ రవాణా సేవలు అందించేలా అప్ అండ్ డౌన్‌కు ప్రత్యేకంగా ఎనిమిది కార్గో వాహనాలను వినియోగిస్తున్నట్లు ఆయన తెలిపారు. ప్రతి రూట్ మార్గమధ్యలో సైతం ట్రాన్స్‌పోర్టు గూడ్స్ సేకరణ, డెలివరీ సేవలు ఉంటాయని వివరించారు. వస్తువు బరువును బట్టి కిలోమీటరు చొప్పున చార్జీలు ఉంటాయన్నారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో పోస్టల్ శాఖను తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ సర్కిళ్లుగా విభజించేందుకు కేంద్రశాఖకు ప్రతిపాదనలు పంపించామన్నారు. పోస్టల్ శాఖను విభజిస్తే తెలంగాణలో 7 వేల పోస్టాఫీసులు, ఆంధ్రప్రదేశ్ సర్కిల్లో 9 వేల పోస్టాఫీసులు ఉంటాయన్నారు. రాష్ర్టంలో మరో 11 కొత్త పోస్టాఫీసులను త్వరలో ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు. -
రవాణా, వాణిజ్య శాఖల సేవలు నేడు, రేపు బంద్
చిత్తూరు (జిల్లాపరిషత్), న్యూస్‌లైన్ : జిల్లాలో ప్రభుత్వ ప్రధానశాఖలైన రవాణా, వాణిజ్య విభాగాలకు సంబంధించిన ప్రజాసేవలు రెండు రోజుల పాటు బంద్ అవుతున్నారుు. నూతన రాష్ట్రం ఏర్పడనున్న సందర్భంగా ఈ రెండు శాఖలు కొత్త సర్వర్ల ద్వారా సోమవారం నుంచి సేవలను నిర్వహించనున్నాయి. ట్రెజరీ అకౌంట్స్‌కు సంబంధించి పాతపద్ధతుల్లోనే సేవలు అందిస్తారని సమాచారం. రాష్ట్ర విభజన నేపథ్యంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు విడివిడిగా సర్వర్లు రూపొందించి ఉన్నందున మే 31న (శనివారం) ఆన్లైన్ సేవలన్నింటినీ నిలిపివేయాలని రాష్ట్ర రవాణాశాఖ కమిషనర్ గతంలోనే ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో శనివారం నూతన వాహనాల రిజిస్ట్రేషన్లు, పర్మిట్లు, ఎఫ్‌సీలు చేయబోరని జిల్లా రవాణాశాఖ ఉపకమిషనర్ ఎం.బసిరెడ్డి తెలిపారు. జూన్ 1వ తేదీ ఆదివారం సెలవు కావడంతో ఆ రోజు కూడా సర్వర్లు పనిచేయవని, ఆదివారం అర్ధ రాత్రి నుంచి నూతన సర్వర్ ఓపెన్ అవుతుందని, సోమవారం యథావిథిగా రవాణా శాఖ సేవలు అందుతాయని చెప్పారు. జూన్ 2వ తేదీ సోమవారమే వాణిజ్య పన్నుల శాఖకు సంబంధించిన నూతన సర్వర్ ప్రారంభమవుతుందని, ఇందుకు అనుగుణంగానే జిల్లాలోని వస్త్ర దుకాణాలు, ఇతర వ్యాపార సంస్థల యజమానులు, వారికి కేటాయించిన టిన్ నెంబర్ల ద్వారా లావాదేవీలను జరపాలని చిత్తూరు వాణిజ్య పన్నుల శాఖాధికారులు సూచించారు. ఖజానా శాఖ సేవలను యథావిథిగా అందిస్తుందని ఆ శాఖ ఉపసంచాలకులు పాలేశ్వరరావు పేర్కొన్నారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఇప్పటివరకు తమకు ఎలాంటి సూచనలు అందలేదని, ఉత్తర్వులు అందేంతవరకు సేవలు యథావిథిగా కొనసాగిస్తామని తెలిపారు. ఉద్యోగులకు జూన్ 1వ తేదీ చెల్లించాల్సిన మే నెల జీతాన్ని ఈ నెల 24వతేదీ నాటికే వారి ఖాతాల్లో జమ చేశామన్నారు. పెన్షన్‌దారులకు పెన్షన్ కూడా అదే రోజుకే వారి ఖాతాల్లో జమచేశామని తెలిపారు. ఇతర లావాదేవీలకు సంబంధించి తమకు ఎలాంటి సమాచారం రాలేదని పేర్కొన్నారు. -
పాత లారీ.. ఇక ఖాళీ
తాడేపల్లిగూడెం, న్యూస్‌లైన్ : ‘కొత్త రాష్ట్రం.. కొత్త హద్దులు.. అదిరిందయ్యూ చంద్రం’ అనుకోకండి... ‘కొత్త రాష్ట్రం.. బెదురేనయ్యూ చంద్రం’ అనక తప్పని పరిస్థితులు తలెత్తనున్నాయి. రాష్ట్ర విభజన ప్రభావం రవాణా, వ్యాపార, వాణిజ్య రంగాలపై తీవ్రంగా ఉండబోతోంది. జూన్ 2 అపాయింటెడ్ డే ముంచుకొస్తోంది. రాష్ట్రం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌గా విడిపోయేందుకు ఇక మూడు రోజులే గడువు ఉంది. అపాయింటెడ్ డే రోజున రెండు రాష్ట్రాలకు సరిహద్దులు ఏర్పడనున్నాయి. ఆయా ప్రాంతాలలో చెక్ పోస్టులు ఏర్పాటవుతున్నాయి. కొత్త నిబంధనల కారణంగా రవాణా రంగంపై పర్మిట్ల రూపంలో అదనపు భారం పడనుంది. నేషనల్ పర్మిట్ (జాతీయ అనుమతి) గల రవాణా వాహనాలను మాత్రమే తెలంగాణ రాష్ట్రంలోకి అనుమతిస్తారు. దీనివల్ల వస్తు రవాణాతోపాటు ఎరువులు, ధాన్యం రవాణా భారంగా మారనుంది. పాత లారీల కథ కంచికే... ఇప్పటివరకూ ఉమ్మడి రాష్ట్రంలోని పాత లారీలు 10 టన్నుల సరుకుతో ఒడిశా, మహారాష్ట్ర, తమిళనాడు సరిహద్దుల మధ్య ఏ మూలకైనా వెళ్లివచ్చేవి. ఇకపై అలాంటి అవకాశం ఉండదు. సీమాంధ్ర సరిహద్దుల్ని దాటి తెలంగాణ ప్రాంతంలోకి వెళ్లాలంటే లారీల వంటి భారీ వాహనాలకు నేషనల్ పర్మిట్ ఉండి తీరాల్సిం దే. ఉదాహరణకు మన జిల్లాలోని జీలుగుమిల్లి, చింతలపూడి వంటి ప్రాంతాల నుంచి కూతవేటు దూరంలో గల అశ్వారావుపేటకు సరుకులు తీసుకువెళ్లాలంటే నేషనల్ పర్మిట్ తీసుకోవాలి. లేదంటే.. కనీసం వారం రోజులలోపు మనుగడలో ఉండే తాత్కాలిక పర్మిట్‌ను రూ.వెయికి పైగా వెచ్చించి తీసుకోవాలి. ఎలాంటి ఇబ్బంది లేకుండా లారీలు రెండు రాష్ట్రాల మధ్య తిరగాలంటే లారీలకు నేషనల్ పర్మిట్ తీసుకోవాలి. నేషనల్ పర్మిట్ ఇవ్వాలంటే వాహనం వయసు 10 నుంచి 12 ఏళ్లలోపు మాత్రమే ఉండాలి. ఇలాంటి లారీకి సంవత్సరానికి రూ.25 వేలు వర కు పర్మిట్ చార్జీలు చెల్లించాలి. ఇంత మొత్తం చెల్లించడమంటే లారీ యజమానుల్లో అందరివల్లా అయ్యే పనికాదు. మరోవైపు 12 ఏళ్ల వయసు దాటిన పాత లారీలు ఇకపై ఖమ్మం జిల్లా వైపు కన్నెత్తి చూసే అవకాశం కూడా ఉండదు. అవి కొత్తగా ఏర్పాటయ్యే ఆంధ్రప్రదేశ్ పరిధిలోని సీమాంధ్ర జిల్లాలకే పరిమితం కావాలి. దీనివల్ల వాటికి కిరాయిలు దొరకని పరిస్థితి ఏర్పడుతుంది. జిల్లాలో 10వేలకు పైగా లారీలు ఉండగా, వాటిలో 75 నుంచి 80 శాతం లారీలు 12 ఏళ్లకు ముందు కొన్నవే. అందువల్ల వీటిలో చాలా లారీలు ఖాళీగా ఉండాల్సిందే. ఎరువుల రవాణా మరింత భారం యూరియా, కాంప్లెక్సు ఎరువులు ర్యాక్ పాయింట్ ఉన్న తాడేపల్లిగూడెం రైల్వే స్టేషన్‌కు గూడ్స్ వ్యాగన్లలో వస్తుంటారుు. వాటిని ఇక్కడి నుంచి ఖమ్మం, వరంగల్, కరీంనగర్ తదితర ప్రాంతాలకు లారీల్లో పంపిస్తున్నారు. తిరుగు ప్రయాణంలో బొగ్గు, ధాన్యం వంటి వాటిని తీసుకొస్తుం టారు. తెలంగాణలో కొత్త చెక్ పోస్టులు ఏర్పాటైతే రెండు రాష్ట్రాల చెక్ పోస్టుల వద్ద అటు తెలంగాణ, ఇటు ఆంధ్రప్రదేశ్ లారీల యజమానులపై అధిక భారం పడుతుంది. ఈ పరిస్థితి మూలిగే నక్కపై తాటిపండు పడినట్టుగా అసలే అంతంతమాత్రంగా ఉన్న రవాణా రంగంపై మోయలేని భారం పడనుంది. ఫలితంగా ఈ రంగం మరింత నష్టాల్లో కూరుకుపోయే ప్రమా దం పొంచివుంది. రవాణా రంగం చితికిపోతుంది టైర్లు, లూబ్రికెంట్లు, పెట్రోలు, డీజిల్ ధరల పెరుగుదల, టోల్గేట్ ఫీజుల వడ్డింపు కారణంగా రవాణా రంగం ఇప్పటికే సంక్షోభంలో కూరుకుపోయింది. వీటికి తోడు రాష్ట్ర విభజన నేపథ్యంలో కొత్త చెక్ పోస్టుల వద్ద చెల్లింపులు ఈ రంగాన్ని మరింత నష్టాల్లోకి తోసే పరిస్థితి నెలకొంది. రాష్ట్రంలో విజయవాడ తర్వాత ఎక్కువ లారీలు తాడేపల్లిగూడెం ప్రాంతంలోనే ఉన్నాయి. వేలాది కుటుంబాలు ఈ పరిశ్రమపైనే ఆధారపడి జీవిస్తున్నాయి. యజమానులే డ్రైవర్‌గా మారి బతుకు బండిని ఈడుస్తున్నారు. ఇలాంటి సమయంలో రాష్ట్ర విభజన వల్ల రవాణా రంగం పూర్తిగా చితికిపోతుంది. దీనిపై ఉభయ ప్రభుత్వాలు ఏదైనా ఒప్పందం చేసుకోవాలి. - గురుజు సూరిబాబు, కార్యదర్శి, తాడేపల్లిగూడెం లారీ ఓనర్స్ అసోసియేషన్ -
ముందుగానే పాఠ్యపుస్తకాల రాక
విద్యారణ్యపురి, న్యూస్‌లైన్ : వచ్చే విద్యా సంవత్సరానికి సంబంధించిన పాఠ్యపుస్తకాలు ఈసారి ముందుగానే జిల్లాకు వచ్చాయి. ఇప్పటివరకు జిల్లాకు 80 శాతం పాఠ్యపుస్తకాలు చేరుకున్నాయి. జిల్లా గోదాం నుంచి సోమవారం వరకు 51 మండలాలకు 70 శాతం పాఠ్యపుస్తకాలను పంపిణీ చేశారు. జిల్లాకు 27,41,000 పాఠ్యపుస్తకాలు అవసరమని జిల్లా విద్యాశాఖ సంబంధిత ఉన్నతాధికారులకు ప్రతిపాదించింది. అందులో ఇప్పటివరకు 24 లక్షల 54వేల 9 పాఠ్యపుస్తకాలు జిల్లా కేంద్రంలోని పాఠ్యపుస్తకాల గోదాంనకు చేరుకున్నాయి. వీటిలో 21,87,845 పాఠ్యపుస్తకాలను మండల కేంద్రాలకు పంపిణీ చేశారు. జిల్లా కేంద్రం నుంచి మండల కేంద్రాలకు పుస్తకాలను రవాణా చేయడానికి జిల్లా విద్యాశాఖ టెండర్లు ఆహ్వానిస్తే కాంట్రాక్టర్లు ఎవరూ ముందుకు రాలేదు. దీంతో రవాణా బాధ్యతలను ఎంఈఓలకే అప్పగించారు. జిల్లా కేంద్రంలోని గోదాం నుంచి మండల విద్యాశాఖాధికారులు రెండు దశలుగా ఇప్పటికే ఎంఆర్సీ భవనాలకు పుస్తకాలు తరలించారు. మూడో దశలో కూడా పుస్తకాలను తీసుకెళ్తున్నారు. ఎంఆర్సీ భవనాల నుంచి పాఠశాలల హెచ్ఎంలు పాఠ్యపుస్తకాలను తీసుకెళ్లి విద్యార్థులకు ఇవ్వాలి. రవాణాకు సంబంధించిన వ్యయాన్ని జిల్లా విద్యాశాఖ చెల్లించనుంది. మిగిలిన పుస్తకాలు కూడా కొద్దిరోజుల్లోనే రానున్నాయి. ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు 123 టైటిల్ పాఠ్యపుస్తకాల్లో 122 టైటిల్స్ వచ్చాయి. కేవలం ఉర్దూ మీడి యానికి సంబంధించిన ఒక టైటిల్ పాఠ్యపుస్తకాలు రావాల్సి ఉంది. ఏది ఏమైనా వచ్చే విద్యాసంవత్సరంలో పాఠ్యపుస్తకాల కోసం విద్యార్థులు నిరీక్షించనవ సరం లేదు. 6 నుంచి 10 తరగతుల విద్యార్థులకు రేపే అందించాలి.. 6,7,8,9,10 తరగతుల విద్యార్థులకు విద్యాసంవత్సరం ముగింపు రోజు బుధవారం పాఠ్యపుస్తకాలు అందించాలని పాఠశాల విద్యాశాఖ డెరైక్టరేట్ నుంచి జిల్లా విద్యాశాఖకు ఆదేశాలు అందాయి. దీంతో జిల్లా విద్యాశాఖాధికారులు కూడా ఎంఈఓలను ఆదేశించారు. మండల కేంద్రాలకు చేరుకున్న పాఠ్యపుస్తకాలను హెడ్మాస్టర్లు తమ స్కూల్ పాయింట్లకు తీసుకెళ్లి విద్యార్థులకు ఇవ్వాలి. దీంతో విద్యార్థులు వేసవిలో ఇంటివద్ద చదువుకునే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. ఒకటి నుంచి ఐదో తరగతి విద్యార్థులకు మాత్రం జూన్ 12న అందించాలని ఆదేశాలు అందాయి. -
ఇసుక స్థావరాలపై దాడులు
లారీ, డీసీఎం, జేసీబీ పట్టివేత అడ్డాకుల, న్యూస్‌లైన్ : అక్రమంగా నిల్వ ఉంచుతున్న, రవాణా చేస్తున్న ఇసుక స్థావరాలపై పోలీసులు కొరడా ఝులిపించారు. మండలంలోని పెద్దవాగు నుంచి గుట్టుగా సాగుతున్న ఇసుక అక్రమ రవాణాను కొత్తకోట సీఐ రమేష్‌బాబు అడ్డుకున్నారు. పక్కా సమాచారంతో ఆదివారం రాత్రి వాగు వద్ద ఇసుకాసురులపై మెరుపు దాడి చేశారు. దుబ్బపల్లి సమీపంలోని పెద్దవాగు వద్ద కొన్నాళ్ల నుంచి రాత్రి వేళ అక్రమంగా ఇసుక రవాణా సాగుతోంది. రాత్రి వేళ యంత్రాలను వినియోగించి లారీలు, చిన్న డీసీఎంలతో వాగులోంచి నేరుగా అక్రమ రవాణా చేస్తున్నారనే సమాచారంతో సీఐ తన సిబ్బందితో కలిసి దాడులకు దిగారు. ఆ సమయంలో ఇసుకను తవ్వుతున్న, రవాణా అవుతున్న లారీ, మినీ డీసీఎం, జేసీబీని పట్టుకుని అడ్డాకుల పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చే యాలని ఎస్ఐ ముత్తినేని వెంకటేశ్వర్లుకు ఆదేశించారు. మూడు ట్రాక్టర్ల పట్టివేత పెద్దకొత్తపల్లి : మండలంలోని యాపట్ల వాగు నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్న మూడు ట్రాక్టర్లను పట్టుకున్నట్టు ఎస్ఐ సైదులు తెలిపారు. భాస్కర్‌రెడ్డికి చెంది న ట్రాక్టర్ ఏపీ 22 ఏఎన్1529, యాదగిరికి చెందిన ట్రాక్టర్ ఏపీ 22 1047, హన్మంతురెడ్డి ఏపీ 28 2189 ట్రాక్టర్ల ద్వారా ఆదివారం రాత్రి యాపట్ల వాగు నుంచి ఇసుక తరలిస్తుండగా పెద్దకారుపాముల వద్ద పట్టుకున్నట్టు చెప్పారు. అనంతరం ఇసుక ట్రాక్టర్లను పోలీసుస్టేషన్‌కు తరలించి యజమానులపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. -
పాతబస్తీ సమస్యలతో కుస్తీ
పాతనగరాభివృద్ధి పట్టదా..? నిజాం నాటి మంచినీటి, డ్రైనేజి వ్యవస్థ కనీస సదుపాయలూ కరువు అంతా అపరిశుభ్రతే.. రవాణా సౌకర్యం అంతంతే సాక్షి, సిటీబ్యూరో/ఓల్డ్‌సిటీ, న్యూస్‌లైన్ : ఒకవైపు నాలుగు వందల ఏళ్లకు పైగా చరిత్ర.. చారిత్రాత్మక కట్టడాలతో ప్రసిద్ధి.. మరోవైపు అధ్వాన రోడ్లు.. పారిశుధ్య లేమి.. పురాతన డ్రైనేజీ వ్యవస్థ.. అంతంత మాత్రంగా ఉన్న విద్య, వైద్య, రవాణా సదుపాయాలు.. వెరసి ఇదీ హైదరాబాద్ పాతనగరం. నిజాం పరిపాలన పరిసమాప్తమైన తర్వాత పాలకులు కొత్త నగరాన్ని అందంగా తీర్చిదిద్దడానికి ఎంత శ్రద్ధ వహించారో .. పాతనగర అభివృద్ధిని అంత నిర్లక్ష్యం చేశారు. ఫలితం.. పాతబస్తీ వెనకబాటుతనంతో కునారిల్లుతోంది. ఇప్పటికీ ఇక్కడ నిజాం కాలం నాటి మంచినీరు, డ్రైనేజీ వ్యవస్థే కొనసాగుతోంది. ఆసుపత్రులు, విద్యా సంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు సైతం నిజాం నిర్మించిన భవనాల్లోనే కొనసాగుతుండటం విశేషం. కనీసం పాతనగరవాసుల జీవనవిధానం, ఆర్థిక పరిస్థితిలో సైతం మార్పు రాలేదు. రెక్కాడితే కాని.. డొక్కాడని పరిస్థితులు.. ఉపాధి కోసం ఖండాంతరాలు దాటి పోవాల్సిన దుస్థితి.. పేదరికంతో ఆడ పిల్లలకు కట్నాలు ఇవ్వలేక గల్ఫ్ షేక్‌లకు అంటగడుతున్న దైన్య స్థితి తాండవిస్తుంది. ఁఎన్నాళ్లీ నిర్లక్ష్యం..? ఇంకెన్నాళ్లీ వెనకబాటుతనం..?* అంటూ పాతబస్తీ వాసులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ఇదే ఈసారి ఎన్నికల్లో ఓల్ట్ సిటీజనుల ప్రధాన ఎజెండా కానుంది. ఓట్లు అడిగేందుకు వచ్చేవారిని గ ట్టిగా నిలదీసేందుకు వారంతా సిద్ధమవుతున్నారు. పడకేసిన అభివృద్ధి దేశంలోని అనేక పాత నగరాలు అభివృద్ధి వైపు పరుగులు తీస్తున్నా.. పాతబస్తీలో మాత్రం అభివృద్ధి పడకేసింది. ఇప్పటికీ నిజాం కాలంలో జరిగినా పనులు తప్ప కొత్తవి ఇక్కడ కానరావడం లేదు. పాతబస్తీలో ప్రభుత్వ ఆసుపత్రులు ఉన్నప్పటికీ.. సిబ్బంది కొరత. అందుబాటులో లేని మందులు, రోగులకు కనీస సౌకర్యాలు కూడా ఉండవు. పలు ఆసుపత్రి భవనాలు శిథిలావస్థకు చేరుకున్నాయి. దాదాపు ఐదు నియోజకవర్గాల పరిధిలో గల పాతబస్తీలో కేవలం రెండే పెద్దాసుపత్రులు ఉన్నాయి. అయినా ఇక్కడ అధునాతన పరికరాలు అందుబాటులో ఉండవు. పలు సందర్భాల్లో సమయానికి వైద్యం అందక గర్భిణులు, వృద్ధులు, చిన్నారులు, ప్రమాదాల్లో గాయపడిన వారు మరణించిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. రవాణా సౌకర్యం కూడా అంతంతే...పాతబస్తీలో లక్షల మంది ప్రతి రోజు ఒక ప్రాంతం మరో ప్రాంతానికి ఉద్యోగం, వైద్య, విద్య, వ్యాపారం కోసం ప్రయాణాలు కొనసాగిస్తుంటారు. కానీ పాతబస్తీలో కేవలం ఒకే ఒక బస్సు డిపో ఉంది. ఈ వివక్షపై ఇక్కడివారు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత నాలుగేళ్లలో మరింత వెనక్కి.. పాతబస్తీ అభివృద్ధి కంటూ ప్రతిపాదనలెన్నున్నా అవి ఆచరణకు నోచుకోవడం లేదు. గత నాలుగేళ్లుగా ఆశించిన స్థాయిలో నిధులు విడుదల కాకపోవడంతో పాతబస్తీ అభివృద్ధి అటకెక్కింది. గత ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కులీకుతుబ్‌షా నగరాభివృద్ధి సంస్థ (కుడా) అభివృద్ధికి రూ.15 కోట్ల నిధులను మంజూరు చేస్తున్నట్లు ప్రకటించి గాలికి వదిలేశారు. ఆశించిన స్థాయిలో ఇప్పటి వరకు నిధులు మంజూరు కాకపోవడంతో ఁకుడా* భవిష్యత్తు ప్రశ్నార్థకమైంది. పాతబస్తీలోని మలక్‌పేట్, చార్మినార్, చాంద్రాయణగుట్ట, యాకుత్‌పురా, బహదూర్‌పురా తదితర నియోజకవర్గాల్లోని అభివృద్ధి కార్యక్రమాలు అటకెక్కాయి. పేదరికంపై వడ్డీవ్యాపారుల స్వారీ పాతబస్తీ పేదలు వడ్డీ వ్యాపారుల కబంధ హస్తాల్లో చిక్కుకుపోయి నలిగిపోతున్నారు. వీరు పేదల అవసరాలను వడ్డీ వ్యాపారంతో సొమ్ము చేసుకుంటున్నారు. ఏ రోజుకారోజు వ్యాపారానికి కాస్త పెట్టుబడి అవసరం. కుటుంబంలో శుభకార్యానికైనా, ఆపద వచ్చినా.. అనారోగ్యం పాలైనా ప్రయివేటు ఫైనాన్సర్ల(వడ్డీ వ్యాపారులు)ను ఆశ్రయించాల్సిందే. బ్యాంకుల ద్వారా రుణాలు తీసుకోవాలంటే హామీ పెట్టేందుకు ఆస్తులు ఉండవు. ప్రైవేటు బ్యాంకుల నుంచి రుణం తీసుకోవాలన్నా ప్రభుత్వ ఉద్యోగుల హామీ దొరికే అవకాశం లేదు. ప్రజల అవసర అవసరాన్ని బట్టి వడ్డీ శాతాన్ని పెంచి డబ్బునిస్తారు. అవసరానికి పది వేల రూపాయలు తీసుకుంటే ఆ తర్వాత సంవత్సరాలు గడిచినా అసలు మాత్రం తీరదు. ఆ అప్పు చివరకు వడ్డీపై వడ్డీ పెరిగి అదో విషవలయంలా మారుతుంది. బ్యాంకులు ఇక్కడివారికి ఎప్పుడు సహకరిస్తాయి. వడ్డీవ్యాపారుల నుంచి విముక్తి ఎప్పుడు లభిస్తోంది. వీడని నిరక్షరాస్యత పాతనగరంలో నిరక్ష్యరాస్యత తాండవిస్తోంది. మొత్తం జనాభాలో 72 శాతం మంది దారిద్య్రరేఖకు దిగువనే జీవిస్తున్నారు. దీనికి ముఖ్య కారణం అవిద్యే. 5-9 ఏళ్ల పిల్లల్లో 68 శాతం మాత్రమే పాఠశాలలకు వెళుతున్నారు. మధ్యలో విద్యను మానేస్తున్న పిల్లల జాబితాల్లో కూడా పాతబస్తీ పిల్లలే అధికం. తమ పిల్లలను ఉన్నత చదువులు చదివించుకోలేకపోవడానికి ఆర్థిక వెనుకబాటే కారణం. ప్రభుత్వ పాఠశాలల్లో అంతంత మాత్రం చదువులు. కార్పొరేట్ పాఠశాలల్లో పిల్లలను చదివించేందుకు తల్లిదండ్రల స్తోమత సరిపోదు. ఈ నేపథ్యంలో ప్రతి రోజు 10 ఏళ్ల చిన్నారుల నుంచి వృద్ధుల వరకు లక్షల సంఖ్యలో కొత్త నగరానికి వెళ్లి చిన్న చితాకా ఉద్యోగాలు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు. ఇక్కడ చెప్పుకోదగిన పరిశ్రమలు, కంపెనీలు, మాల్స్, పెద్ద ఆసుపత్రులు, కార్పొరేట్ కంపెనీలు, ప్రైవేటు సంస్థలు లేవు. అందుకే ప్రజలు ఉపాధి కోసం కొత్త నగరానికి వెళ్లాల్సి వస్తోంది. ఈ పరిస్థితిలో మార్పు రాదా అని ఇక్కడి వారు ప్రశ్నిస్తున్నారు. అభివృద్ధి వైఎస్సార్ చలువే నిజాం కాలం తర్వాత పాతబస్తీ అభివృద్ధిపై శ్రద్ధ చూపించింది దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డే. వైఎస్సార్ తన హయాంలో హైదరాబాద్‌లోని పాతబస్తీ అభివృద్ధికి ప్రత్యేక ప్యాకేజీ కింద సుమారు రూ.2024.65 కోట్లను మంజూరు చేశారు. పాతబస్తీలో మౌలిక సదుపాయల కల్పనతో పాటు రోడ్లు, నీటిసరఫరా, డైనేజీ వ్యవస్థ, స్ట్రీట్ లైట్లు, స్కూల్లు, కమ్యూనిటీ హాళ్లు, నీటి ట్యాంకులు, షాదీఖానాలు, మసీదులు, ఆషూర్ ఖానాల మరమ్మతులతో పాటు నిజాంకాలం వ్యవస్థను పూర్తిగా రీమోడలింగ్ చేయించారు. ఫలితంగా మీరాలం సీవరేజ్ ప్లాంట్ నిర్మాణం, చందులాల్ బారాదరి, కాటేదాన్, రియాసత్ నగర్, మిధానిల్లో స్పోర్ట్స్ కాంపెక్ల్స్, ఇమ్లీబన్ పార్క్, ఫలక్‌నుమా సిటీ బస్ టెర్మినల్, చాంద్రాయణ గుట్ట ఫ్లై ఓవర్ తదితర నిర్మాణాలు పూర్తయ్యాయి. ముస్లిం విద్యార్థుల కోసం సీబీఎస్ఈ సిలబస్‌తో దక్షణ భారత దేశంలోనే ప్రప్రథమంగా మౌలానా ఆజాద్ మోడల్ స్కూల్‌ను ఏర్పాటు చేశారు. మసీదుల ఇమామ్‌లుగా సేవలందిస్తున్న వారికి నెలవారీగా వేతనాలిచ్చే ప్రక్రియను ప్రారంభించారు. మాజీ సైనికుల నివాస గృహాలు, 40 ఏళ్ల నుంచి పెండింగ్‌లో ఉన్న కొల్ట్స్టోరేజీ, స్లాటర్ హౌస్ సమస్యలను వైఎస్సార్ పరిష్కరించగలిగారు. ముఖ్యంగా మైనార్టీ వర్గాలకు సంక్షేమ పథకాల వర్తింపుతో ఆర్ధిక స్థితిగతుల్లో కాస్త మార్పు వచ్చింది. అభివృద్ధి ప్రదాత వైఎస్సార్ మరణాన ంతరం ఆయన మంజూరు చేసిన నిధులు నిలిచిపోవడంతో పాతబస్తీ అభివృద్ధితోపాటు సంక్షేమ పథకాలపై నీలినీడలు కమ్ముకున్నాయి. రిజర్వేషన్లు ఇచ్చిన ఘనతా ఆయనదే.. పాతబస్తీలోని ముస్లిం మైనార్టీలు అంతో ఇంతో ఉన్నత చదువులు చదివి ఆర్థికంగా నిలదొక్కుకున్నారంటే.. ఆ ఘనత దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్‌దే. ముస్లింలకు విద్యా, ఉద్యోగ రంగాల్లో నాలుగు శాతం రిజర్వేషన్లు కల్పించిన ఘనత కూడా వైఎస్ రాజశేఖర్‌రెడ్డికే దక్కుతుంది. ముస్లిం మాతృభాష ఉర్దూను రెండో అధికార భాషగా ప్రకటించడం, ఉర్దూ భాషాభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించడం, ఉర్దూఘర్ నిర్మాణం తదితర కార్యక్రమాలన్నీ ఆయన చలవే. మైనార్టీ విద్యార్థులకు స్కాలర్షిప్స్, ఫీజు రియంబర్స్మెంట్ వర్తింపజేయడంతో పేద విద్యార్థులు సైతం ఉన్నత విద్యను అభ్యసించడానికి అవకాశం ఏర్పడింది. అదేవిధంగా పేద ముస్లిం యువతుల సామూహిక వివాహాలకు వైఎస్ శ్రీకారం చుట్టారు. ముస్లిం వితంతువులకు పెన్షన్ సౌకర్యం కల్పించారు. మైనార్టీ విద్యార్ధుల కోసం ప్రత్యేకంగా ఇంగ్లిష్ మీడియం గురుకుల విద్యాలయాలు ఏర్పాటు చేశారు. -
రవాణా స్పెషల్ డ్రైవ్
అరసవల్లి, న్యూస్‌లైన్: నిబంధనలు పాటించని వాహనాలపై రవాణా శాఖాధికారులు కొరడా ఝుళిపించారు. స్పెషల్ డ్రైవ్ పేరుతో మంగళవారం రవాణా శాఖాధికారులు జిల్లావ్యాప్తంగా తనిఖీలు నిర్వహించి 337 వాహనాలపై కేసులు నమోదు చేశారు. వీటిలో 43 స్కూల్ బస్సులు ఉన్నాయి. సెల్‌ఫోన్ డ్రైవింగ్, రాంగ్‌రూట్, అధిక మోతాదులో ప్రయాణికులను తరలించడం, లెసైన్స్, ఫిట్నెస్, లెసైన్స్ లేకుండా నడపడం తదితర అంశాలపై కేసులు నమోదు చేశారు. పరిమితికి మించి విద్యార్థులను ఎక్కించడం, అత్యవసర ద్వారాలు పని చేయకపోవడం, అనుభవం లేని వారు డ్రైవర్లుగా ఉండడం, ఫైర్ సేఫ్టీలేకపోవడం తది తర అంశాలను గుర్తించి 43 పాఠశాలల బస్సులపై కేసులు నమోదుచేశారు. సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు జరిపిన దాడుల్లో ఏరియల్ స్టిక్కర్లు, లైటింగ్ తదితర అంశాలపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఈ సందర్భంగా రవాణా శాఖ డెప్యూటీ కమిషనర్ ఎస్.వెంకటేశ్వరరావు మాట్లాడుతూ మంగళవారం ఉదయం జిల్లాలో ఏడు బృందాలుగా జాతీయ రహదారిపై దాడులు చేపట్టామన్నారు. ఉదయం 208 వాహనాలు, సాయంత్రం 129 వాహనాలపై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. వాహన చోదకుల నుంచి సుమారు రూ.7 లక్షల రూపాయల ఆదాయం సమకూరిందన్నారు. ఎచ్చెర్ల క్యాంపస్, న్యూస్‌లైన్: జిల్లాలో పలు ప్రాంతాల్లో ఆర్టీఏ అధికారులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించి నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న వాహనాలను గుర్తించి కేసులు నమోదు చేశారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించని వాహన చోదకులపై కూడా కేసులు నమోదు చేశారు. ఎచ్చెర్ల సమీపంలో జాతీయ రహదారిపై టోల్‌ప్లాజా సమీపంలో ఆర్టీఏ ఎంవీఐలు డి.సంజీవరావు, శివరాం గోపాల్, గణేష్ రెడ్డితో కూడిన బృందం మంగళవారం ఉదయం నుంచి రాత్రి 9 గంటల వరకు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. స్కూల్,కళాశాల బస్సులలను తనిఖీ చేశారు. అనధికారంగా తిరుగుతున్న 12 వాహనాలను గుర్తించి కేసు నమోదు చేశారు. నిబంధనలు పాటించకపోతే చర్యలు మందస : నిబంధనలు పాటించని ప్రైవేట్, వివిధ పాఠశాలల వాహనాలపై చర్యలు తీసుకుంటామని పలాస, ఇచ్ఛాపురం మోటారు వాహనాల తనిఖీ అధికారులు బి.బాలాజీరావు, జి.సత్యంనాయుడు అన్నారు. జిల్లా డిప్యూటీ ట్రాఫిక్ కమిషనర్ ఆదేశాల మేరకు రహదారి భద్రత వారోత్సవాలలో భాగంగా మంగళవారం కొర్రాయిగేటు సమీపంలో గల జాతీయ రహదారిపై వాహనాల ఆకస్మిక తనిఖీ చేపట్టారు. నిబంధనలు అతిక్రమించిన వాహనచోదకుల నుంచి రూ.13300 అపరాాధ రుసుం వసూలు చేసినట్లు తెలిపారు. -
ఇసుక అక్రమ రవాణాపై దాడులు
కర్నూలు రూరల్, న్యూస్‌లైన్: ఇసుక అక్రమ రావాణాపై దాడులు చేసిన అధికారులు గురువారం తెల్లవారుజామున కర్నూలు మండలం మునగాలపాడు సమీపంలో నాలుగు లారీలను సీజ్ చేశారు. గుర్తు తెలియని వ్యక్తులిచ్చిన సమాచారం మేరకు తహశీల్దారు బాలగణేశయ్య సిబ్బందిని అప్రమత్తం చేసి దాడులు చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను తహశీల్దార్ విలేకరుల సమావేశంలో వెల్లడించారు. అక్టోబరు 21వతేదీన మునగాలపాడు సమీపంలో రెవెన్యూ అధికారులు సీజ్ చేసిన ఇసుక డంప్‌పై కన్నేసినపంచలింగాలకు చెందిన ఓ ప్రజాప్రతినిధి దాన్ని హైదరాబాద్‌కు తరలించి సొమ్ము చేసుకోవాలనుకున్నాడు. ఈ మేరకు బుధవారం రాత్రి 11 గంటల సమయంలో హైదరాబాదుకు చెందిన లారీల యాజమానులతో మాట్లాడి మెహిదీపట్నం ప్రాంతానికి ఇసుక తరలించేందుకు ఒప్పందం చేసుకున్నారు. లారీ ఇసుక రూ.35 వేల ప్రకారం రేటు కుదుర్చుకున్నాడు. కర్నూలు-కడప కాలువ దగ్గర అక్రమంగా డంపు చేసిన ఇసుకను జేసీబీ సాయంతో లారీల్లో నింపి తరలించేందుకు సిద్ధమయ్యారు. అయితే ఇదే గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు ఇచ్చిన సమాచారం మేరకు తహశీల్దారు సిబ్బందితో దాడులు చేశారు. ఈ సమయంలో లారీల డ్రైవర్లు తీవ్ర వాగ్వాదానికి దిగడంతో తహశీల్దారు పోలీసులను రప్పించి నాలుగు లారీలను సీజ్ చేసి తాలూకా ఆఫీస్‌కు తరలించారు. సమైక్యాంధ్ర సమ్మె అనంతరం దాడులు ముమ్మరం చేశామని చెప్పిన తహశీల్దార్ ఇప్పటి వరకు 12 ట్రాక్టర్లను సీజ్ చేశామన్నారు. ఇసుక మాఫీయాకు రాజకీయ అండ ఉన్నట్లు తెలుస్తోందని, అయితే ఎంతటి వారినైనా వదలబోమని హెచ్చరించారు. -
శ్రీశైలం - మహబూబ్ నగర్ల మధ్య రాకపోకలు బంద్