-కొన్ని ప్రాంతాలకే ఇసుక ర్యాంపులు పరిమితం
- ఐదు నియోజకవర్గాల్లో ఒక్కటీ లేదు
- ఫలితంగా నిర్మాణ రంగంలో సంక్షోభం
- దూరాభారం, రవాణా చార్జీలు తడిసిమోపెడు
- కొత్త ఇసుక విధానం పూర్తిగా విఫలం
- సర్కారుకు కాసులు.. ప్రజలకు కష్టాలు
శ్రీకాకుళం పాతబస్టాండ్: జిల్లాలో ఇసుక బంగారంగా మారింది. కొత్త ఇసుక విధానం అమల్లోకి వచ్చిన తర్వాత ధర పెరిగిపోవడంతోపాటు ఇసుక లభించడమే గగనం కావడంతో నిర్మాణరంగం సంక్షోభంలో కూరుకుపోయింది. ప్రభుత్వం అనుమతించిన ఇసుక రీచులు కొన్ని ప్రాంతాలకే పరిమితం కావడం దీనికి ప్రధాన కారణం.
ఫలితంగా మిగిలిన ప్రాంతాలవారు ఇసుక కోసం నానా అవస్థలు పడాల్సి వస్తోంది. అధిక ధర చెల్లించి కొనుగోలు చేయాల్సి వస్తోంది. జిల్లాలో పది నియోజకవర్గాలు ఉండగా.. ఐదు నియోజకవర్గాల్లో అసలు రీచులే లేకపోవడం ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలకు దర్పణం పడుతోంది. ఎచ్చెర్ల నియోజకవర్గ పరిధిలోని ఎచ్చెర్ల మండలం ముద్దాడలో రీచ్ ఏర్పాటు చేసినా నియోజకవర్గంలోని మిగిలిన మండలాలకు అది చాలా దూరంలో ఉంది. ఆమదావలవస నియోజకవర్గంలో ఇసుక రిచ్‌ల ఏర్పాటులో నిబంధనలు పాటించకపోవడం, రిచ్‌లు ఏర్పాటు చేసిన ప్రాంతాలు వంతెనలు, తాగునీటి పథకాల సమీపంలో ఉండటంతో వాటిని న్యాయస్థానం నిలిపివేసింది. టెక్కలి, పలాస, రాజాం, పాతపట్నం నియోజకవర్గాల్లో అసలు రీచులే లేవు.
ఈ నియోజవర్గాల ప్రజలు సూదూర ప్రాంతాల నుంచి అధిక రవాణా చార్జీలు భరించి ఇసుక కొనుగోలు చేయాల్సిన దుస్థితి నెలకొంది. పాలకుల రాజకీయ స్వార్థం, ఆధికారుల వైఫల్యం ఈ పరిస్థితికి కారణమని ప్రజలు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ప్రస్తుతం జిల్లాలో ఇసుక క్యూబిక్ మీటరు ధర *500 ఉంది, అయితే రవాణా చార్జీలతోపాటు రీచుల వద్ద అధిక మొత్తాలు వసూలు చేస్తుండటంతో ఆ భారం కూడా తమ పైనే పడుతోందని నిర్మాణదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నూతన విదానంలో జిల్లాలో ఈ ఏడాది ఇప్పటివరకు 5.95 లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుక అమ్మకాలు జరగ్గా.. దీని ద్వారా ప్రభుత్వానికి రూ. 54.48 కోట్ల ఆదాయం వచ్చింది. ఆదాయం వచ్చిందని మురిసిపోతున్న ప్రభుత్వం.. ఈ విధానం వల్ల ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను పట్టించుకోవడం లేదు.
జిల్లా ప్రస్తుతం ఉన్న రీచ్‌లు
జిల్లాలో ప్రస్తుతం పది ఇసుక రీచ్‌లు ఉన్నాయి. మండలాల వారీగా ఎచ్చెర్లలో ముద్దాడ, నరసన్నపేటలో గోపాలపెంట, చెన్నులవలస, బుచ్చిపేట, శ్రీకాకుళం రూరల్‌లో బట్టేరు, కిల్లిపాలేం, పోలాకి మండంలో మబగాం, జలుమూరు మండలంలో దంపాక, పర్లాం, ఇచ్ఛాపురం మండలం బిర్లంగిలో ఇవి నడుస్తున్నాయి.
ప్రతిపాదనలో 24
కొత్తగా మరో 24 రీచుల ఏర్పాటుకు ప్రతిపాదనలు ఉన్నాయి. హిరమండలం, గార, ఎల్‌ఎన్‌పేట మండలాల్లోని వంశధార తీర ప్రాంతాల్లో ఏర్పాటు చేయనున్న వీటికి వివిధ శాఖల నుంచి అనుమతులు రావాల్సి ఉంది.
న్యాయస్థానంలో ఉన్నవి
ఆమదాలవలస నియోజకవర్గంలో తోటాడ, అక్కివరం, దూసి, ముద్దాడపేట రిచ్‌లను అక్రమంగా అనుమతించారని ఫిర్యాదులు అందడంతో న్యాయస్థానం వీటిని నిలిపివేసింది.
పరిధిలోని ఎచ్చెర్ల మండలం ముద్దాడలో రీచ్ ఏర్పాటు చేసినా నియోజకవర్గంలోని మిగిలిన మండలాలకు అది చాలా దూరంలో ఉంది. ఆమదావలవస నియోజకవర్గంలో ఇసుక రిచ్‌ల ఏర్పాటులో నిబంధనలు పాటించకపోవడం, రిచ్‌లు ఏర్పాటు చేసిన ప్రాంతాలు వంతెనలు, తాగునీటి పథకాల సమీపంలో ఉండటంతో వాటిని న్యాయస్థానం నిలిపివేసింది. టెక్కలి, పలాస, రాజాం, పాతపట్నం నియోజకవర్గాల్లో అసలు రీచులే లేవు. ఈ నియోజవర్గాల ప్రజలు సూదూర ప్రాంతాల నుంచి అధిక రవాణా చార్జీలు భరించి ఇసుక కొనుగోలు చేయాల్సిన దుస్థితి నెలకొంది. పాలకుల రాజకీయ స్వార్థం, ఆధికారుల వైఫల్యం ఈ పరిస్థితికి కారణమని ప్రజలు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ప్రస్తుతం జిల్లాలో ఇసుక క్యూబిక్ మీటరు ధర *500 ఉంది, అయితే రవాణా చార్జీలతోపాటు రీచుల వద్ద అధిక మొత్తాలు వసూలు చేస్తుండటంతో ఆ భారం కూడా తమ పైనే పడుతోందని నిర్మాణదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నూతన విదానంలో జిల్లాలో ఈ ఏడాది ఇప్పటివరకు 5.95 లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుక అమ్మకాలు జరగ్గా.. దీని ద్వారా ప్రభుత్వానికి రూ. 54.48 కోట్ల ఆదాయం వచ్చింది. ఆదాయం వచ్చిందని మురిసిపోతున్న ప్రభుత్వం.. ఈ విధానం వల్ల ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను పట్టించుకోవడం లేదు.
జిల్లా ప్రస్తుతం ఉన్న రీచ్‌లు
జిల్లాలో ప్రస్తుతం పది ఇసుక రీచ్‌లు ఉన్నాయి. మండలాల వారీగా ఎచ్చెర్లలో ముద్దాడ, నరసన్నపేటలో గోపాలపెంట, చెన్నులవలస, బుచ్చిపేట, శ్రీకాకుళం రూరల్‌లో బట్టేరు, కిల్లిపాలేం, పోలాకి మండంలో మబగాం, జలుమూరు మండలంలో దంపాక, పర్లాం, ఇచ్ఛాపురం మండలం బిర్లంగిలో ఇవి నడుస్తున్నాయి.
ప్రతిపాదనలో 24
కొత్తగా మరో 24 రీచుల ఏర్పాటుకు ప్రతిపాదనలు ఉన్నాయి. హిరమండలం, గార, ఎల్‌ఎన్‌పేట మండలాల్లోని వంశధార తీర ప్రాంతాల్లో ఏర్పాటు చేయనున్న వీటికి వివిధ శాఖల నుంచి అనుమతులు రావాల్సి ఉంది.
న్యాయస్థానంలో ఉన్నవి
ఆమదాలవలస నియోజకవర్గంలో తోటాడ, అక్కివరం, దూసి, ముద్దాడపేట రిచ్‌లను అక్రమంగా అనుమతించారని ఫిర్యాదులు అందడంతో న్యాయస్థానం వీటిని నిలిపివేసింది.