How a 'Gold Mafia' is looting Southern Africa? - Sakshi
Sakshi News home page

Life in City of Gold: బంగారు నగరంలో చీకటి సామ్రాజ్యం... జనజీవనం సాగుతుందిలా..

Published Sat, Jun 17 2023 8:49 AM | Last Updated on Sat, Jun 17 2023 1:07 PM

gold mafia looting southern africa - Sakshi

ఆ నగరంలో ఎటుచూసినా బంగారమే. ప్రపంచంలోనే గోల్డ్‌సిటీగాపేరొందిన ఆ ప్రాంతంలోని ప్రజల జీవితాలు ‘అంధకారం’, హింస, క్రిమినల్‌ సిండికేట్‌ల వివాదాల మధ్య నలిగిపోతూ కనిపిస్తాయి.  ఈ బంగారు గనుల మెరుపుల వెనుక ఇక్కడివారి జీవితంలోని మరో కోణం ఎలా ఉంటుంది? ఇక్కడి సాధారణ ప్రజల జీవితం ఎలా కొనసాగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. 

ప్రపంచంలో బంగారం మెరుపు ముందు మరేదీ సాటిరాదు.  అలాగే బంగారాన్ని మించినది మరేదీ లేదని చెబుతుంటారు. బంగారం మాయ ప్రపంచాన్నంతటికీ ఒకే విధంగా కమ్మేసింది.  చరిత్రకారులు తెలిపిన వివరాల  ప్రకారం ఆ నగరం.. ప్రపంచంలోనే అత్యంత పురాతన బంగారు గనులు కలిగిన ప్రాంతం. 

ఇక్కడ బంగారం తవ్వకాలు 5 వేల ఏళ్ల క్రితం నుంచి జరుగుతున్నాయి. నాటి నుంచి నేటి వరకూ అంటే మహారాజుల కాలం నుంచి ప్రస్తుత యుగం వరకూ ఇక్కడ బంగారం తవ్వకాలు సాగుతూనే ఉన్నాయి. అయినా ఇక్కడి బంగారు వన్నె ఏమాత్రం తగ్గనేలేదు. భవిష్యత్‌లోనూ ఇది కొనసాగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. 

ఇది కూడా చదవండి: రూ. 500 చొప్పున 22 మంది పిల్లల కొనుగోలు.. 18 గంటల వెట్టి చాకిరీ..

అమెరికా, చైనా, భారత్‌, ఆస్ట్రేలియాతో పాటు ప్రపంచంలోని పలు దేశాల్లో పెద్దపెద్ద బంగారు గనులున్నాయి. కానీ ‘గోల్డ్‌ సిటీ ఆఫ్‌ వరల్డ్‌’ అని ఏప్రాంతాన్ని అంటారో తెలుసా?  అదే దక్షిణాఫ్రికాలోని జోహెన్స్‌ బర్గ్‌. ఇక్కడే అత్యంత భారీగా బంగారు నిల్వలు కలిగిన విట్‌వాటర్‌శాండ్‌ మైన్స్‌ ఉన్నాయి. ఈ విట్‌వాటర్‌ శాండ్‌ గనులు దక్షిణాఫ్రికాలోని గౌటెంగ్‌ ప్రాంతంలో ఉన్నాయి.  ఈ సువిశాల బంగారు గనుల నుంచి ఉత్పత్తి అ‍య్యే బంగారం ప్రపంచం మొత్తం మీద ఉత్పత్తి అయ్యే బంగారంలో 40 శాతం మేరకు ఉంటుంది. అందుకే జోహెన్స్‌ బర్గ్‌ పేరు బంగారంలా వెలిగిపోతుంటుంది. 

ఎంత బంగారం ఉందంటే...
విట్‌వాటర్‌శాండ్‌కు చెందిన గోల్డ్‌ మైన్స్‌ భూమిలోపల  మూడు వేల మీటర్ల లోతున ఉన్నాయి. ఇక్కడ 82 మిలియన్‌ ఔన్సుల బంగారం ఉందనే అంచానాలున్నాయి.  ఇక్కడ గడచిన 61 ఏళ్లుగా బంగారం తవ్వకాలు జరుగుతున్నాయి. 1961 నుంచి ఇక్కడి గనుల్లో మొదలైన తవ్వకాలు రాబోయే 70 ఏళ్ల వరకూ అంటే 2092 వరకూ కొనసాగే అవకాశాలున్నాయి. 2017లో ఇక్కడ 281,300  ఔన్స్‌లు, 2018లో 157,100 ఔన్సుల బంగారం ఉత్పత్తి జరిగింది.  ఇక్కడ యురేనియం గునులు కూడా భారీగానే ఉన్నాయి.  ఇక్కడ ప్రత్యేకంగా చెప్పకోదగిన ఐదు బంగారు గనులు ఉన్నాయి. అవి కూల్ప్‌ గోల్డ్‌మైన్‌, డ్రిఫోంటైన్‌ గోల్డ్‌ మైన్‌, సౌత్‌ డీప్‌ గోల్డ్‌ మైన్‌, ఇంపాలా మైన్‌, షిపాంగ్‌​ మైన్‌. 

సామాన్యుల జీవితం ఇలా..
ఇక్కడి బంగారం మెరుపుల మధ్య సామాన్యుల జీవితం ఎంతో భిన్నంగా ఉంటుంది. జోహెన్స్‌ బర్గ్‌లోని గౌంటెడ్‌ ప్రాంతం దక్షిణాఫ్రికాలో అతి చిన్న భూభాగం. అంటే కేవలం 1.5 శాతం భూభాగం. అయితే ఇక్కడ అత్యధిక జనాభా నివసిస్తున్నారు.  దేశంలోని 26 శాతం జనాభా అంటే ఒక కోటీ 60 లక్షల మంది ఇక్కడే ఉంటున్నారు.  

ఇది కూడా చదవండి: ప్రపంచంలో ఐదు అతిపెద్ద మారణహోమాలివే..

గౌంటెడ్‌ ప్రాంతం.. వాల్‌ నదీ తీరంలో ఉంటుంది.  పలు పర్వాతాలతో పాటు ఇక్కడి విభిన్న వాతారణం ఇక్కడి ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తుంటుంది.  అయితే ఇక్కడి బంగారుల గనుల తవ్వకాలకు సంబంధించిన ఉపాధి పనులు, వ్యాపార వ్యవహారాలు  మొదలైనవి ప్రజలను ఇక్కడ ఉండేలా చేస్తున్నాయి. సముద్రమట్టానికి 1700 మీటర్ల ఎత్తున ఉన్న జోహెన్స్‌ బర్గ్‌ పట్టణ వాతావరణం ఎంతో చల్లగా ఉంటుంది. తరచుగా ఇక్కడ మంచు కురుస్తుంటుంది.

గోల్డ్‌సిటీగా మారడం వెనుక..
జోహెన్స్‌ బర్గ్‌ గోల్డ్‌సిటీగా మారడం వెనుక ఆసక్తికర కథనం ఉంది. 19వ శతాబ్ధపు చివరినాళ్ల  నుంచి ఇక్కడ బంగారం తవ్వకాలు మొదలయ్యాయి. నదీ తీరంలో ఉన్న ప్రాంతమైనందున ఈ ప్రాంతం త్వరగా అభివృద్ధి చెందింది. ప్రస్తుతం జోహెన్స్‌ బర్గ్‌ జనాభా 50 లక్షలు దాటింది.  బంగారు గనుల్లో పనిచేసేందుకు ప్రపంచవ్యాప్తంగా పలువురు ఇక్కడికి వస్తుంటారు. ఫలితంగా ఇక్కడి సంస్కృతి ఎంతో విభిన్నంగా ఉంటుంది. 

ఇక్కడి రోడ్లపై ఆఫ్రికా వంటలు మొదలుకొని ఆసియాతోపాటు అన్ని రకాల యూరోపియన్‌ ఆహార పదార్థాలు లభ్యమవుతాయి.  ఇక్కడి ప్రభుత్వం ఈ ప్రాంతంలో 60 లక్షల చెట్లను నాటి ఫారెస్ట్‌సిటీగా రూపమిచ్చింది. ఈ కారణంగా ఈ ప్రాంతాన్ని ప్రపంచంలోనే అత్యధిక చెట్లతో కూడా సిటీగానూ అబివర్ణిస్తుంటారు. ఇక్కడి గోల్డ్‌మైన్స్‌పై మొదట యూరప్‌ వ్యాపారవేత్తల హవా ఉండేది. తరువాతి కాలంలో అరబ్బుల ప్రభావం వేగంగా వ్యాప్తి చెందింది. 

క్రిమినల్‌ సిండికేట్లకు నిలయంగా..
ఇక్కడి అడవులు, పర్వతశ్రేణులలో అక్రమంగా తవ్వకాలు జరిపేందుకు ఆసియా- ఆఫ్రికా దేశాల నుంచి అనైతికంగా కూలీలను తీసుకువస్తుంటారు. చీకటితో కూడిన సొరంగాలలో బంగారం పొందవచ్చంటూ ఆశ చూపించి ఇక్కడ జరిగే పనుల్లో కూలీలను నియమిస్తారు.  కిలోమీటర్ల పొడవున క్రిమినల్‌ సిండికేట్‌ అక్రమ తవ్వకాలు సాగిస్తుంటుంది.  ఈ నేధ్యంలో అప్పుడప్పుడూ హింసాయుత ఘటనలు, తూటాల కాల్పులు చోటుచేసుకుంటాయి. 

ఈ ప్రాంతంలో 6 వేలకు పైగా బంగారు గనులు ఉన్నట్లు అంచనా. ఈ గనుల్లో తవ్వకాలు పూర్తయ్యాక వాటిని అలానే వదిలేస్తుంటారు. ఇక్కడి గనులను ఆక్రమించుకునేందుకు క్రిమినల్‌ సిండికేట్స్‌ మధ్య వివాదాలు జరుగుతుంటాయి.  ఇంతటి భయావహ పరిస్థితుల మధ్య ఇక్కడ 50 లక్షల జనాభా నివసిస్తోంది. వీరంతా గోల్డ్‌మైన్స్‌ పనులపైననే ఆధారపడి జీవిస్తున్నారు. అయితే భారీ సంఖ్యలో జనం ఇక్కడికి తరలి వస్తున్నందున హౌసింగ్‌ సెక్టార్‌లో షార్టేజీ కనిపిస్తోంది. అలాగే నిరుద్యోగిత కూడా 29 శాతం మేరకు పెరిగింది. 

సౌత్‌ ఆఫ్రికన్‌ హ్యూమన్‌ రైట్స్‌ కమిషన్‌ వెలువరించి న ఒక రిపోర్టు ప్రకారం 2015 నాటికి ఇక్కడ 30 వేలకు మించిన ఆక్రమణదారుల ఇక్కడ తమ కార్యకలాపాలు యధేచ్ఛగా కొనసాగిస్తున్నారు.  వీరిలో అత్యధికులు జోహెన్స్‌ బర్గ్‌ పట్టణ సమీప ప్రాంతాల్లోని గోల్డ్‌మైన్స్‌లో యాక్టివ్‌గా ఉన్నారు. వీరిలో 75 శాతం మంది ఇతర ప్రాంతాల నుంచి వచ్చినవారే కావడం విశేషం. వీరంతా ఈ ప్రాంతంలో అక్రమంగా నివసిస్తున్నారు. 

భారత్‌లో బంగారు గనుల విషయానికొస్తే..
బంగారు గనులనేవి కేవలం పర్వతప్రాంతాలు, పీఠభూములలోనే కాదు.. సముద్రపు లోతుల్లోని ప్రాంతాల్లోనూ వ్యాప్తిచెంది, ప్రపంచవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో  కనిపిస్తాయి. భారత్‌లో కేజీఎఫ్‌ అంటే కోలార్‌ గోల్డ్‌ ఫీల్డ్స్‌ ఎంతో పేరొందిన ప్రాంతం. దేశంలో అత్యధక స్థాయిలో బంగారు ఉత్పాదన కర్నాటకలో జరుగుతుంది. ఇక్కడ కోలార్‌, హుట్టీ, ఉటీ పేర్లతో బంగారు గనులు ఉన్నాయి. 

ఇది కూడా చదవండి: బాధితులకు వైద్య సేవలు అందించే ఎక్స్‌ప్రెస్‌ రైలు

కర్నాటకలో సుమారు 17 టన్నుల బంగారం నిల్వలు కలిగిన గనులు ఉన్నాయని భావిస్తున్నారు. అంధ్రప్రదేశ్‌, జార్ఖండ్‌, కేరళ, మధ్యప్రదేశ్‌లలోనూ బంగారు, వజ్రాల నిక్షేపాలు ఉన్నాయి. ఈ విధంగా చూసుకుంటే భారత్‌లోనూ బంగారు నిక్షేపాలు గుర్తించదగని రీతిలోనే ఉన్నాయని చెబుతుంటారు.  చాలాదేశాల్లో బంగారు గనుల్లో అక్రమ తవ్వకాలు, తరలింపు చర్యలను అక్కడి ప్రభుత్వాలు సమ‍ర్ధవంతంగా అడ్డుకోవడం లేదనే విమర్శలు తరచూ వినిపిస్తున్నాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement