ప్రపంచంలో అనేక చిత్రవిచిత్రాలు కనిపిస్తాయి. అలాంటి వాటి గురించి విన్నప్పుడు,చూసినప్పుడు ఎంతో ఆశ్చర్యం కలుగుతుంది. అలాంటిదే న్యూజిలాండ్‌లోని ఒక పట్టణం పేరు. ఇది ఎంతపెద్దగా ఉంటుందంటే, దానిని పూర్తిగా చదవాలంటే పెద్ద జీనియస్ అయి ఉండాలి. ఆ పొడవైన పేరుగల పట్టణం గురించి, దాని వెనుకగల చరిత్ర గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ పట్టణం ఎక్కడుంది?
ఈ విచిత్రమైన పేరు గల పట్టణం న్యూజిలాండ్‌కి దక్షిణాన గల Porangahau పర్వత శ్రేణుల సమీపంలో ఉంది. ఈ పట్టణం పేరు Taumatawhakatangihangako auauotamateaturipukakapikikungungororukupokaiaienuakitanatahu. ఈ అక్షరాలను చూస్తే.. ఎవరో కీబోర్డును అడ్డదిడ్డంగా ఒకేసారి టైప్ చేశారేమోనని ఎవరికైనా అనిపిస్తుంది. కానీ అది నిజం కాదు. ఇది ఎంతో ఓపికతో చేసిన టైపింగ్ పదమే. ఇది ఎప్పటిదో అనుకుంటున్నారేమో..నేడు కూడా ఆ పట్టణం పేరు ఇదే. అయితే ఈ పట్టణం పేరును సులభంగా పలికేందుకు Taumata అని పిలుస్తారు. ఈ పట్టణం పేరులో మొత్తం 85 అక్షరాలున్నాయి. ఈ పట్టణం పేరు ప్రపంచంలోనే అతిపెద్దది. ఈ కారణంగానే ఈ పట్టణం పేరు గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో నమోదయ్యింది.
ఈ పేరు అర్థం ఏమిటంటే..
Taumatawhakatangihangakoauauotamateaturipukakapikiku
ngungororukupokaiaienuakitanatahu.. ఇంత పెద్ద పేరు చూడగానే ఎవరికైనా దీని అర్థం ఏమిటని మనసులో సందేహం తలెత్తుతుంది. ఈ పదానికి అర్థం ఏమిటంటే..‘ఇది ఎటువంటి ప్రాంతమంటే పెద్ద పెద్ద అడుగులు వేస్తూ, పర్వతాలు అధిరోహించేవారు, ప్రపంచాన్నంతా కలియతిరిగేవారు, సుందరమైన Koauau ఫ్లూట్ వాయించే Tamatea ప్రజలు ఉండే ప్రాంతం’.
అత్యంత పొడవైన పేరు కలిగిన యువతి..
ఇప్పుడు ప్రపంచంలో అత్యంత పొడవైన పేరు కలిగిన యువతి గురించి తెలుసుకుందాం. అత్యంత పొడవైన పేరు కలిగినందున యువతి పేరు గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో నమోదయ్యింది. ఈ యువతి పేరు 1000 అక్షరాలకు మించి ఉంటుంది. ఈ పేరు పూర్తిగా చదవాలంటే ఎవరికైనా చెమటలు పడతాయి. ఇంత పెద్ద పేరు కలిగిన ఈ యువతి బర్త్ సర్టిఫికెట్ రెండు అడుగుల పొడవు ఉంటుంది. ఈ యువతి పూర్తి పేరు..
Rhoshandiatellyneshiaunneveshenkescianneshaimondrischlyndasaccarnae renquellenendrasamecashaunettethalemeicoleshiwhalhinive'onchellecaundenesh eaalausondrilynnejeanetrimyranaekuesaundrilynnezekeriakenvaunetradevonneya vondalatarneskcaevontaepreonkeinesceellaviavelzadawnefriendsettajessicanneles ciajoyvaelloydietteyvettesparklenesceaundrieaquenttaekatilyaevea'shauwneorali aevaekizzieshiyjuanewandalecciannereneitheliapreciousnesceverroneccalovelia tyronevekacarrionnehenriettaescecleonpatrarutheliacharsalynnmeokcamonaeloies alynnecsiannemerciadellesciaustillaparissalondonveshadenequamonecaalexetiozetia quaniaenglaundneshiafrancethosharomeshaunnehawaineakowethauandavernellchishankcarl inaaddoneillesciachristondrafawndrealaotrelleoctavionnemiariasarahtashabnequcka gailenaxeteshiataharadaponsadeloriakoentescacraigneckadellanierstellavonnemyiat angoneshiadianacorvettinagodtawndrashirlenescekilokoneyasharrontannamyantoniaaquin ettesequioadaurilessiaquatandamerceddiamaebellecescajamesauwnneltomecapolotyoajohny aetheodoradilcyana.
ఇది కూడా చదవండి: 56 కి.మీ మేర నిలువునా చీలిపోయిన భూమి.. ప్రళయానికి చిహ్నమంటూ..
Comments
Please login to add a commentAdd a comment