రాజస్థాన్‌లోని కోటా నగరంలో చంబల్ రివర్ ఫ్రంట్‌లో ప్రపంచంలోనే అతిపెద్ద గంటను ఏర్పాటు చేస్తున్నారు. అయితే దానిని బిగిస్తున్న సమయంలో పెను ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒక ఇంజినీరుతో పాటు మరో కార్మికుడు మృతి చెందారు. మరికొందరు గాయపడినట్లు సమాచారం.
ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. కోటా జిల్లా యంత్రాంగం, రివర్ ఫ్రంట్ అధికారులు సంఘటనా స్థలంలో సహాయక చర్యలు చేపడుతున్నారు. గాయపడినవారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. రాజస్థాన్‌లోని కోటాలోని చంబల్ నది ఒడ్డున 80 వేల కిలోల బరువున్న గంటను ఏర్పాటు చేస్తున్నారు. ఈ గంట చేసే శబ్దం 8 కిలోమీటర్ల దూరం వరకు వినిపిస్తుంది. ఈ గంట ప్రపంచంలోనే అతిపెద్ద గంటగా గుర్తింపు పొందింది.
ఈ గంట ఐదువేల సంవత్సరాల వరకు నిలిచివుంటుందని అధికారులు చెబుతున్నారు. ఈ గంటను రివర్ ఫ్రంట్‌కు తీసుకువచ్చేందుకు ఎంతో శ్రమించారు. ఈ గంటను నిర్దేశిత స్థానంలో అమరుస్తుండగా ఇంజనీర్ దేవేంద్ర ఆర్య, మరో కార్మికుడు 35 అడుగుల ఎత్తునుంచి కింద పడిపోయారు. ఈ ప్రమాదంలో ఆ కార్మికుడు అక్కడికక్కడే మృతి చెందాడు. తీవ్రంగా గాయపడి, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ దేవేంద్ర కన్నుమూశారని వైద్యులు తెలిపారు.
ఇది కూడా చదవండి: ఢిల్లీలో తెరుచుకున్న విద్యాసంస్థలు
Comments
Please login to add a commentAdd a comment