కృత్రిమ దీవిలో అతిపెద్ద విమానాశ్రయం! | World largest artificial island airport taking shape in China | Sakshi
Sakshi News home page

కృత్రిమ దీవిలో అతిపెద్ద విమానాశ్రయం!

Published Sun, Jan 19 2025 9:40 AM | Last Updated on Sun, Jan 19 2025 9:40 AM

World largest artificial island airport taking shape in China

చైనా ప్రభుత్వం సముద్రంలో అద్భుతాన్ని ఆవిష్కరించబోతోంది. కృత్రిమ దీవిలో ప్రపంచంలోనే అతిపెద్ద విమానాశ్రయాన్ని నిర్మిస్తోంది. లియోనింగ్‌ ప్రావిన్స్‌లోని డాలియన్‌ నగరాన్ని ఆనుకుని ఉన్న సముద్రాన్ని పూడ్చి ఏకంగా ఓ సరికొత్త దీవిని నిర్మిస్తోంది. ఇక్కడే మొత్తం 20.9 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ‘డాలియన్‌ జి¯Œ జౌవాన్‌’ పేరుతో అతిపెద్ద విమానాశ్రయాన్ని నిర్మిస్తోంది. 

అత్యాధునిక సాంకేతికత ఉపయోగించి, ఏటా 5 లక్షలకు పైగా విమానాలు, 8 కోట్ల మంది ప్రయాణికుల సామర్థ్యంతో పనిచేయనుంది. ఇందులో నాలుగు అతిపెద్ద రన్‌ వేలు, 9 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో పాసెంజర్‌ టెర్మినల్స్‌ కూడా ఏర్పాటవుతున్నాయి. వీటి ద్వారా ఏడాదికి 10 లక్షల టన్నుల సరుకు రవాణా జరుగుతుందని అంచనా. 

ఈ నిర్మాణం పూర్తయితే, ఇప్పటి వరకు ప్రపంచంలోనే అతిపెద్ద విమానాశ్రయంగా కొనసాగుతున్న హాంకాంగ్‌ అంతర్జాతీయ విమానాశ్రయం (12.48 చ.కి.మీ) రెండో స్థానానికి పడిపోతుంది. అయితే, ఈ రెండు విమానాశ్రయాలు కూడా కృత్రిమ దీవుల్లో ఏర్పాటైనవే కావడం విశేషం. ఈ విమానాశ్రయాన్ని 2035 నాటికి అందుబాటులోకి తీసుకురానున్నట్లు చైనా ప్రభుత్వం తెలిపింది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement