artificial
-
PROBA-3: అభినవ రాహు కేతువులు!
సూర్యగ్రహణం వేళ భానుడిని రాహువు అమాంతం మింగేస్తాడని, చంద్రగ్రహణం కాలంలో నెలరేడును కేతువు కబళిస్తాడని జ్యోతిషం చెబుతుంది. కానీ సూర్యుడికి, భూమికి నడుమ చంద్రుడు అడ్డొస్తే సూర్యగ్రహణం; సూర్యుడికి, చంద్రుడికి మధ్య భూమి అడ్డొస్తే చంద్రగ్రహణం ఏర్పడతాయని సైన్స్ వివరిస్తుంది. తాజాగా శాస్త్రవేత్తలు మాత్రం కృత్రిమ రాహు కేతువుల సాయంతో కావాల్సినప్పుడల్లా సంపూర్ణ సూర్యగ్రహణాలు సృష్టించే పనిలో పడ్డారు. ఎవరా రాహుకేతువులు అనుకుంటున్నారా? యూరోపియన్ అంతరిక్ష సంస్థ (ఈఎస్ఏ) త్వరలో ప్రయోగించనున్న జంట ఉపగ్రహాలు! ఈ స్పేస్ మిషన్ పేరు ‘ప్రాజెక్ట్ ఫర్ ఆన్–బోర్డ్ అటానమీ–3 (ప్రోబా–3). ఇందులో రెండు ఉపగ్రహాలుంటాయి. ఇవి కక్ష్యలో పరస్పరం అతి దగ్గరగా మోహరిస్తాయి. మొదటి ఉపగ్రహం సూర్యుడిని పూర్తిగా అడ్డుకుంటుంది. తద్వారా రెండో ఉపగ్రహం నుంచి సూర్యుడు కనబడకుండా చేస్తుంది. అలా కొన్ని గంటలపాటు కృత్రిమ సూర్యగ్రహణాలను ఏర్పరచడం ఈ స్పేస్ మిషన్ లక్ష్యం. రెండు ఉపగ్రహాలు... ఒకటిగా! ‘ప్రోబా–3’ రెండేళ్లు పనిచేసే జంట శాటిలైట్ల వ్యవస్థ. ఇది అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానంతో కూడుకున్న మిషన్ అని యూనివర్సిటీ కాలేజీ లండన్ సౌర భౌతిక శాస్త్రవేత్త ఫ్రాన్సిస్కో డీగో తెలిపారు. మిషన్ ప్రణాళికకు పదేళ్లకు పైగా వ్యవధి పట్టిందన్నారు. భూమి చుట్టూ కక్ష్యలో పరిభ్రమించేటప్పుడు ప్రోబా–3లోని జంట ఉపగ్రహాలు ఒకదానికొకటి కేవలం 144 మీటర్లు ఎడంగా ఉంటాయి. మిల్లీమీటరు కూడా తేడా రానంత కచి్చతత్వంతో వాటిని అతి దగ్గరగా లాక్ చేసేందుకు కాంప్లెక్స్ సెన్సర్ల శ్రేణిని అభివృద్ధి చేశారు. ఇవి రెండూ వేర్వేరు ఉపగ్రహాలైనా 144 మీటర్ల పొడవుండే ఒకే అబ్జర్వేటరీలా పనిచేయడం ఈ ప్రయోగంలోని విశేషం. ఇందులో సౌరగోళాకృతితో సూర్యకాంతిని అడ్డుకునే 200 కిలోల బరువైన ‘అకల్టర్’ ఉపగ్రహం, కరోనాపై అధ్యయనం చేసే 340 కిలోల బరువైన ‘కరోనాగ్రాఫ్’ ఉపగ్రహం ఉంటాయి. అవి రెండూ భూమి చుట్టూ అతి దీర్ఘవృత్తాకార కక్ష్యలో సరైన ప్రదేశంలోకి వచి్చనప్పుడు అకల్టర్ తన ముందు భాగంలో 1.4 మీటర్ల వ్యాసంలో ఉండే ఓ గోళం లాంటి పరికరాన్ని ఆవిష్కరిస్తుంది. కరోనాగ్రాఫ్ నుంచి చూసినప్పుడు సూర్యుడు కనిపించకుండా ఆ పరికరం సూర్యున్ని పూర్తిగా కప్పేస్తుంది. అంటే కరోనాగ్రాఫ్లోని టెలిస్కోప్ మీద సూర్యకాంతి నేరుగా పడదు. అలా రోజులో ఆరు గంటలపాటు కృత్రిమ సూర్యగ్రహణం ఆవిష్కృతమవుతుంది. అప్పుడు అకల్టర్ ఛాయలో సూర్యుడి కరోనాను కరోనాగ్రాఫ్ నిశితంగా పరిశీలిస్తుంది. ఈ విశేషాలతో బ్రిటన్ పత్రిక ‘ది అబ్జర్వర్’ తాజాగా ఓ కథనం ప్రచురించింది. ఎందుకీ ప్రయోగం? సంపూర్ణ సూర్యగ్రహణాలు భూమిపై సగటున రెండేళ్లకోసారి మాత్రమే వస్తాయి. వాటి అధ్యయనానికి పరిశోధకులు చాలా దూరం ప్రయాణించాల్సి ఉంటుంది. ‘‘అంత కష్టపడినా వాతావరణం అనుకూలించకుంటే ప్రయత్నాలన్నీ వృథాయే. అనుకూలించినా కొద్ది నిమిషాలు మాత్రమే సంపూర్ణ సూర్యగ్రహణాన్ని అధ్యయనం చేసే అవకాశం లభిస్తుంది. కూలంకషమైన పరిశోధనలకు అది చాలదు. సూర్యగ్రహణాలను అనుకరించేలా టెలిస్కోపులకు కరోనాగ్రాఫ్స్ అమర్చి సౌర కరోనాను అధ్యయనం చేస్తుంటారు. కానీ అంతర కరోనాను అవి క్షుణ్నంగా అధ్యయనం చేయలేవు’’ అని ‘ప్రోబా–3’ ప్రాజెక్టు మేనేజర్ డేమియన్ గలీనో వివరించారు. సూర్యుడి ఉపరితలంపై ఉష్ణోగ్రత 6 వేల డిగ్రీల సెల్సియస్ కాగా బాహ్య పొర అయిన కరోనా ఉష్ణోగ్రత పది లక్షల డిగ్రీల దాకా ఉంటుంది. ‘‘సూర్యుడి నుంచి దూరంగా వెళ్లేకొద్దీ ఉష్ణోగ్రత తగ్గాలి. కానీ కరోనా విషయంలో అలా జరగదు. దీనికి కారణాలు తెలుసుకోవడానికి అంతర కరోనాను దీర్ఘకాలం సవివరంగా పరిశోధిస్తాం’’ అని ‘ప్రోబా–3’ కరోనా ప్రయోగ ప్రధాన పరిశోధకుడు ఆండ్రూ జుకోవ్ తెలిపారు. కొన్ని గంటలపాటు సూర్యగ్రహణాలను సృష్టించడం ద్వారా శాస్త్రవేత్తలు ఈ మిస్టరీని ఛేదించేందుకు అవసరమైన డేటాను ఇది అందిస్తుందని చెప్పారు.ఉపయోగాలేమిటి? → సూర్యుడిని లోతుగా అధ్యయనం చేయడానికి ప్రోబా–3 ప్రయోగం ఎంతగానో దోహదపడుతుందని పరిశోధకులు అంటున్నారు. → విద్యుత్ లైన్లు, గ్లోబల్ పొజిషనింగ్ వ్యవస్థ ఉపగ్రహాలు, ఇతరత్రా భూ సంబంధ టెక్నాలజీకి సూర్యు డు కలిగించే సమస్యలు, అంతరాయాలపై అవగాహన పెంచడానికి ఉపకరిస్తుందని భావిస్తున్నారు. → గురుత్వ తరంగాలు, కృష్ణబిలాలు, సౌరకుటుంబం వెలుపలి నక్షత్ర వ్యవస్థల్లో గ్రహాలకు సంబంధించి భవిష్యత్తులో చేపట్టే అధ్యయనాలకు ప్రోబా–3 మిషన్ మార్గదర్శి కాగలదని ఈఎస్ఏ శాస్త్రవేత్తలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. → కరోనల్ మాస్ ఎజెక్షన్ (సీఎంఈ) ప్రక్రియలో సూర్యుడు అంతరిక్షంలోకి భారీగా ప్లాస్మాను వెదజల్లుతాడు. ఆ విద్యుదావేశిత కణాలతో కూడిన ప్లాస్మా భూ ఎగువ వాతావరణాన్ని ఢీకొని ధ్రువకాంతులైన అరోరాలను సృష్టించడంతో పాటు భూమిపై విద్యుత్ ప్రసారాలకు అవాంతరాలు కలిగిస్తుంది. వీటిపై ప్రోబా–3 అవగాహనను పెంచుతుందని, అది పంపే ఫలితాలు సౌర భౌతికశా్రస్తాన్ని సమూలంగా మార్చేస్తాయని భావిస్తున్నారు. త్వరలో శ్రీహరికోట నుంచి ప్రయోగం! ‘ప్రోబా–3 జంట శాటిలైట్ల ప్రయోగం త్వరలో శ్రీహరికోటలోని షార్ వేదిక నుంచి జరగనుంది. పీఎస్ఎల్వీ (ఎక్స్ఎల్) వెర్షన్ రాకెట్ సాయంతో ఇస్రో ఈ ప్రయోగం చేపట్టనుంది. ప్రతి 19.7 గంటలకోసారి భూమి చుట్టూ పరిభ్రమించే ఈ ఉపగ్రహాలను భూమికి 600 గీ 60,530 కిలోమీటర్ల అతి దీర్ఘవృత్తాకార కక్ష్యలో ప్రవేశపెట్టాల్సి ఉంటుంది. యూరోపియన్ అంతరిక్ష సంస్థకు చెందిన ‘వేగా–సి’ రాకెట్‌కు అంత సామర్థ్యం లేకపోవడం, ఏరియన్–6 రాకెట్ ఖర్చు ఎక్కువగా ఉండటంతో ప్రయోగానికి ఇస్రోను ఈఎస్ఏ ఎంచుకుంది. ప్రయోగ తేదీలను ఖరారు చేయాల్సి ఉంది. – జమ్ముల శ్రీకాంత్ -
హార్ట్ఫీషియల్గా అమ్మానాన్నలుగా..
ఇటీవల మనదేశం వ్యంధ్యత్వ సంక్షోభం (ఇన్ఫెర్టిలిటీ) దిశగా వెళుతోంది. ఈ సమస్య తీవ్రత ఎంత ఎక్కువగా ఉందంటే... ప్రతి ఆరు వివాహిత జంటల్లో ఒకరు సంతానలేమితో బాధపడుతున్నారు. సంతానలేమి అన్నది కేవలం పిల్లలు కలగకపోవడం మాత్రమే కాదు... ఇది మరిన్ని సంక్షోభాలకు... అంటే ఉదాహరణకు జనాభాలో యువత శాతం తగ్గిపోవడం, వృద్ధుల సంఖ్య పెరగడం వంటి అనర్థాలకు దారితీయవచ్చు. దీనివల్ల దేశ ఆర్థిక సంపద తగ్గడంతోపాటు అనేక విధాలా నష్టం జరుగుతుంది. ఈ నెల 25న ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్ (ఐవీఎఫ్) డే సందర్భంగా సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్న దంపతులకు కృత్రిమ గర్భధారణకు సంబంధించిన కొన్ని అంశాలపై అవగాహన కోసం కొన్ని ప్రశ్నలకు ఇన్ఫెర్టిలిటీ నిపుణురాలు డాక్టర్ కట్టా శిల్ప సమాధానాలు.ఇటీవల మనదేశంలో సంతానలేమి సమస్యతో బాధపడుతున్నవారి సంఖ్య క్రమంగా పెరగడానికి కారణాలేమిటి?జ: దీనికి రెండు ప్రధాన కారణాలున్నాయి. మొదటిది సామాజికం, రెండు ఆరోగ్యపరమైన కారణాలు. సామాజిక అంశాల విషయానికి వస్తే... ఇటీవల యువత పై చదువులు, మంచి ఉద్యోగాలంటూ కెరియర్ కోసం ఎక్కువ కాలం కేటాయించడం, పెద్ద పెద్ద లక్ష్యాలను ఏర్పరచుకోవడం, వాటిని నెరవేర్చుకోవడం కోసం ఆలస్యంగా పెళ్లిళ్లు చేసుకోవడం, ఉద్యోగాల్లో ఒత్తిడి, ఆహార అలవాట్లు, క్రమంగా లేని పనివేళలు, శారీరక శ్రమ ఎక్కువగా లేకపోవడం, అధిక బరువు, మద్యపానం, పొగతాగడం, డ్రగ్స్ వంటి అనారోగ్యకర అలవాట్లు, వ్యసనాలు వంటివి సంతాన లేమికి దారితీస్తున్నాయి. ఇవన్నీ సామాజిక సమస్యలు.ఇక ఆరోగ్య సమస్యల విషయానికి వస్తే... మహిళల్లో కనిపించే హార్మోన్లలో అసమతౌల్యత, ఇన్ఫెక్షన్లు, మానసిక ఒత్తిడులు వంటివి సంతానలేమికి కారణమవుతున్నాయి. ఉదాహరణకు అండం తయారీలో, ఫలదీకరణలో, పిండం ఇం΄్లాంటేషన్లో ఇబ్బందుల వంటివి మహిళలకు ప్రత్యేకంగా వచ్చే సమస్యల్లో కొన్ని. ఇక మగవారిలోనైతే... శుక్రకణాల సంఖ్య, కదలిక, నాణ్యత తగ్గడం సంతానం కలగడానికి అవరోధంగా నిలుస్తున్నాయి.సాధారణంగా దంపతుల్లో సంతానలేమి ఉంటే ప్రధానంగా మహిళనే నిందిస్తారు. ఇదెంతవరకు సమంజసం?జ: ఇది మళ్లీ మరో సామాజిక సమస్య. వాస్తవానికి గర్భం రాకపోతే అందులో తప్పెవరిదీ ఉండదు. కానీ మన సమాజంలో మహిళ గర్భం దాల్చకపోతే, ఆమెనే తప్పుబడుతుంటారు. నిజానికి గర్భధారణ జరగకపోవడానికి లోపాలు 40% మహిళల్లో ఉంటే, మరో 40% శాతం పురుషుల్లోనూ ఉండవచ్చు. ఇద్దరిలోనూ లోపాలున్న కేసులు మరో 10% మందిలో ఉంటాయి. అయితే ఎంతకూ కారణాలు తెలియని కేసులు మరో 10% ఉంటాయి. అందుకే ఒక జంటకు సంతానం కలగకపోతే... ఎవరినెవరూ నిందించుకోకుండా, శాస్త్రీయపద్ధతుల్లో అవసరమైన పరీక్షలన్నీ క్రమంగా చేయించుకోవాలి.ఫలానా దంపతులకు సంతానలేమి అనే నిర్ధారణ ఎలా? జవాబు: ఆరోగ్యంగా ఉన్న భార్యాభర్తలు వివాహం అయ్యాక ఎలాంటి కుటుంబనియంత్రణ పద్ధతులనుపాటించకుండా, కలిసి ఉంటూ ఏడాదిపాటు గర్భధారణ కోసం ప్రయత్నించినా గర్భం రాకపోతే అప్పుడు ఆ దంపతులకు సంతానలేమి సమస్య ఉండే అవకాశాలున్నాయని చెప్పవచ్చు. ఈ సమస్యను ప్రైమరీ ఇన్ఫెర్టిలిటీ అంటారు.రెండో రకమైన సంతానలేమి ఏమిటంటే... మొదటిసారి గర్భధారణ తర్వాత, రెండోసారి గర్భధారణ కోసం కోరుకున్నప్పుడు ఏడాదిపాటు ప్రయత్నించినా గర్భం దాల్చకపోతే దాన్ని సెకండరీ ఇన్ఫెర్టిలిటీ అంటారు.ఇప్పుడున్న సాంకేతిక పురోగతితో కృత్రిమ గర్భధారణ ఎలా?జ: స్త్రీ, పురుషుల లోపాలు, వాటిని అధిగమించాల్సిన పద్ధతులన్నీ ప్రయత్నించాక కూడా గర్భం రాకపోతే అప్పుడు కొన్ని అత్యాధునిక పద్ధతుల్లో సంతాన సాఫల్యాన్ని సాధించవచ్చు. అవి...ఇంట్రా యుటెరైన్ ఇన్సెమినేషన్ (ఐయూఐ): అండం విడుదలలో లోపాలు,ఎండోమెట్రియాసిస్, పురుషుల వీర్యకణాల సంఖ్య, కదలికల్లో లోపాలు ఉన్నప్పుడు ఐయూఐ అనే పద్ధతి ద్వారా డాక్టర్లు వీర్యకణాలను నేరుగా యోని నుంచి సర్విక్స్ ద్వారా గర్భాశయంలోకి పంపుతారు.ఐవీఎఫ్: స్త్రీ, పురుషులిద్దరిలోనూ ఫలదీకరణ సమస్యలు ఉన్నప్పుడు డాక్టర్లు ఐవీఎఫ్ అనే మార్గాన్ని సూచిస్తారు. ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్ అనే మాటకు సంక్షిప్త రూపమే ఐవీఎఫ్. దీనికే ‘టెస్ట్‌ట్యూబ్ బేబీ’ అనే పేరు. ఇందులో తొలుత మహిళలో అండాలు బాగా పెరిగేందుకు మందులిస్తారు. వాటిల్లోంచి ఆరోగ్యకరమైన కొన్ని అండాలను సేకరించి, పురుషుడి శుక్రకణాలతో ప్రయోగశాలలోని ‘టెస్ట్‌ట్యూబ్’లో ఫలదీకరణం చేస్తారు.ఈ ప్రక్రియలో ఒకటి కంటే ఎక్కువ పిండాలు వృద్ధి చెందుతాయి. (అందుకే టెస్ట్‌ట్యూబ్ బేబీ ప్రక్రియను అనుసరించిన చాలామందిలో ట్విన్స్ పుట్టడం సాధారణం.) ఇందులోని ఆరోగ్యకరమైన పిండాలను మహిళ గర్భాశయంలోకి ప్రవేశపెడతారు. రెండు వారాలకు నిర్ధారణ పరీక్షలూ, నాలుగు వారాల తర్వాత అల్ట్రాసౌండ్ పరీక్ష చేసి గర్భం నిలిచిందా లేదా నిర్ధారణ చేసుకుంటారు. ఒకవేళ గర్భం నిలవకపోతే కారణాలను విశ్లేషించి, మళ్లీ ΄్లాన్ చేస్తారు.ఐసీఎస్ఐ: ఇంట్రా సైటో΄్లాస్మిక్ స్పెర్మ్ ఇంజెక్షన్ (ఐసీఎస్ఐ) అనే ఈ ప్రక్రియ పురుషుల్లో సమస్య ఉన్నప్పుడు అనుసరిస్తారు. ఇది కూడా ఐవీఎఫ్ లాంటిదే. ఇందులో ఎంపిక చేసుకున్న శుక్రకణాన్ని నేరుగా అండంలోకి ప్రవేశపెడతారు. ఇందులోనూ మహిళల అండాల్లో లోపాలు ఉంటే మహిళా దాత నుంచి అండాన్ని సేకరించడం (ఐవీఎఫ్ విత్ డోనార్ ఎగ్), పురుషుని వీర్యకణాల్లో లోపాలుంటే దాత నుంచి సేకరించిన శుక్రకణంతో ఫలదీకరణ చేయడం (ఐవీఎఫ్ విత్ డోనార్ స్పెర్మ్), దంపతుల్లోని స్త్రీ, పురుషులిద్దరిలోనూ లోపాలు ఉంటే మరో మహిళ, మరో పురుషుడి నుంచి అండం, శుక్రకణాలు సేకరించి ఫలదీకరించి దంపతుల్లోని మహిళ గర్భంలోకి ప్రవేశపెట్టడం (ఐవీఎఫ్ విత్ డోనార్ ఎంబ్రియో) అనే పద్ధతుల్లో సంతాన సాఫల్యం కలిగించడానికి డాక్టర్లు ప్రయత్నిస్తారు.– డాక్టర్ కట్టా శిల్ప, కన్సల్టెంట్, ఇన్ఫెర్టిలిటీ స్పెషలిస్ట్ -
‘దివ్యాంగులకూ సమానావకాశాలు కల్పించాలి’
సాక్షి, హైదరాబాద్: దివ్యాంగులు కూడా మన సమాజంలో అందరితోపాటు సమానావకాశాలు పొందాలని, అందుకోసం వారిని ఆదుకునేందుకు సహృదయులు ముందుకు వస్తే దివ్యాంగులు ఎన్నో అద్భుతాలు సృష్టించగలరని టీసీపీ వేవ్ సంస్థ యాజమాన్య ప్రతినిధి పవన్ గాది తెలిపారు. టెక్నాలజీని ఉపయోగించి దివ్యాంగుల జీవితాల్లో మార్పు తేవాలన్నది తమ లక్ష్యమని ఆయన అన్నారు. కృత్రిమ అవయవాల ద్వారా ఇక్కడికొచ్చిన దివ్యాంగులు పూర్తిస్థాయి ఆత్మవిశ్వాసాన్ని పొందగలిగారని, ఇక్కడ అమర్చిన ప్రతి ఒక్క అవయవం వాళ్లందరి సామర్థ్యాలను మరింతగా వెలికితీసేలా ఉందని చెప్పారు. ఈ కార్యక్రమం అందించిన స్ఫూర్తితో మరింతమంది దివ్యాంగుల జీవితాలను మార్చగలమన్న నమ్మకం తమకు కుదిరిందని ఆయన అన్నారు. శ్రీ భగవాన్ మహావీర్ వికలాంగ సహాయతా సమితి ఆధ్వర్యంలో గుర్తించిన 50 మంది దివ్యాంగులకు కృత్రిమ కాళ్లు, వీల్ఛైర్లు, మూడుచక్రాల సైకిళ్లు, హ్యాండ్ కిట్లు, కాలిపర్స్, వాకర్ల లాంటివాటిని టీసీపీ వేవ్ సంస్థ సీఎస్ఆర్ కార్యక్రమంలో భాగంగా అందించారు. కింగ్ కోఠిలోని ప్రభుత్వాసుపత్రిలో ఆదివారం ఉదయం జరిగిన ఈ కార్యక్రమంలో సంస్థ బిజినెస్ డెవలప్మెంట్ మేనేజర్ స్వప్న వాయువేగుల మాట్లాడుతూ, పారాలింపిక్స్ లాంటి క్రీడల్లో భారతీయులు ఎంతో ప్రతిభ చూపిస్తున్నారని.. దివ్యాంగులకు కొంత సాయం అందించగలిగితే వాళ్లు సమాజంలో అందరితో సమానంగా ముందుకొచ్చి, గౌరవప్రదమైన జీవితం గడపగలరని అన్నారు. నిరుపేద నేపథ్యం నుంచి వచ్చిన ఈ 50 మంది సొంతంగా పరికరాలు సమకూర్చుకునే స్థితిలో లేనందున వారిని ఆదుకోవాలని శ్రీ భగవాన్ మహావీర్ వికలాంగ సహాయతా సమితి తమను సంప్రదించగానే వెంటనే ముందుకు వచ్చామని ఆమె తెలిపారు. సమితివారే స్వయంగా ఈ కృత్రిమ అవయవాలను తయారుచేసి ఇవ్వడం సంతోషకరమని చెప్పారు. రాబోయే రోజుల్లో 500 మంది దివ్యాంగులకు ఈ తరహా కృత్రిమ అవయవాలు, వీల్ ఛైర్లు, వాకర్లు అందజేస్తామని తెలిపారు. శ్రీ భగవాన్ మహావీర్ వికలాంగ సహాయతా సమితి సహకారంతోనే తాము ఇదంతా చేయగలుగుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇంకా ఫిక్కి ఐటీ ఛైర్మన్ మోహన్ రాయుడు, సీనియర్ పాత్రికేయుడు, రాజకీయ విశ్లేషకుడు డాక్టర్ సూరావఝల రాము, డీసీఎస్ఐ సీఈఓ డాక్టర్ శ్రీరామ్, సలహాదారు బుచ్చిబాబు తదితరులు పాల్గొన్నారు. -
ఇవి మార్జాల పుష్పాలనుకుంటున్నారా!
ఫొటోలో కనిపిస్తున్న పువ్వులను చూశారు కదా, అచ్చంగా పిల్లిపిల్లల్లా ఉన్నాయి కదూ! ఈ మార్జాల పుష్పాలు ఎక్కడివనేగా మీ అనుమానం? ఈ మార్జల పుష్పాలు దేవతా వస్త్రాల్లాంటివే! భూప్రపంచంలో ఎక్కడా కనిపించవు. మరి ఈ ఫొటో ఏమిటి అనుకుంటున్నారా? ఇదంతా కృత్రిమ మేధ మాయాజాలం.చైనాకు చెందిన కొందరు సైబర్ మోసగాళ్లు ఈ మార్జాల పుష్పాల ఫొటోలను కృత్రిమ మేధతో సృష్టించి, బహుళజాతి ఈ–కామర్స్ సంస్థ ‘ఈబే’లో అమ్మకానికి పెట్టారు. ఇవి పూర్తిగా సేంద్రియ పద్ధతులతో పెంచిన తోటల్లో పూసినవని, ఈ పూలు అత్యంత అరుదైనవని, జన్యుమార్పిడి పద్ధతులేవీ లేకుండా సహజంగా పూసిన తాజా పూలు అని నమ్మబలుకుతూ, ఒక్కో పూలగుత్తిని 45 డాలర్లకు (రూ.3,757) అమ్ముతున్నట్లు ప్రకటించారు.ఫొటోలోని పూలు ఎక్కడా చూడనివి కావడమే కాకుండా, చూడటానికి ముద్దొచ్చే పిల్లిపిల్లల్లా ఆకర్షణీయంగా ఉండటంతో కొందరు ఔత్సాహికులు వాటిని కొనడానికి డబ్బులు కూడా పంపారు. ఫేస్బుక్, ఎక్స్ (ట్విటర్) వంటి సోషల్ మీడియా సైట్లలోనూ ఈ ఫొటోలను జనాలు విరివిగా షేర్ చేశారు కూడా. కొందరు ఆశాజీవులు ఈ పూలమొక్కల విత్తనాలు కావాలంటూ కూడా కామెంట్లు పెట్టారు. కొద్దిరోజుల్లోనే ఇదంతా ఆన్లైన్ మోసమని బయటపడటంతో డబ్బులు పంపి చేతులు కాల్చుకున్న జనాలు లబలబలాడుతున్నారు.ఇవి చదవండి: అవును.. అది నిజంగా మృత్యుగుహే! -
కృత్రిమ రంగులపై కొరడా: భారీ జరిమానా, జైలు
కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.అనేక ఆనారోగ్య సమస్యల కారణంగా కాటన్ క్యాండీలు, గోబీ మంచూరియన్లో వాడే ఫుడ్ కలరింగ్ ఏజెంట్లపై నిషేధం విధించింది. ఈ మేరకు కర్ణాటక ఆరోగ్య శాఖ మంత్రి దినేష్ గుండూరావు ఉత్తర్వులు జారీ చేశారు. గోబీ మంచూరియా, కాటన్ క్యాండీ శాంపిల్స్‌లో హానికరమైన రసాయనాలను వాడినట్లు గుర్తించడంతో ఈ ఉత్తర్వులు జారీ అయ్యాయి. అయితే గోబీ మంచూరియా, కాటన్ క్యాండీ విక్రయాలను పూర్తిగా నిషేధించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. దీంతో ఫుడ్ కలరింగ్ ఏజెంట్లపై కొరడా ఝళిపించిన రాష్ట్రాల జాబితాలో తాజాగా కర్ణాటక చేరింది. రోడమైన్-బి , కార్మోయిసిన్ వంటి కలరింగ్ ఏజెంట్ల వాడకం హానికరమైందని తెలిపింది. కృత్రిమ రంగులను ఉపయోగించి తయారు చేసే ఆహార పదార్థాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఈ మేరకు మంత్రి దినేష్ గుండూరావు ప్రకటించారు. హానికరమైన కలర్స్‌ను ఉపయోగిస్తున్నట్లు తేలితే, ఆహార భద్రతా చట్టం కింద వారిపై కఠిన చర్యలు తీసు కుంటామని ఆయన హెచ్చరించారు. నేరం రుజువైతే కనీసం ఏడేళ్ల జైలు శిక్ష, రూ.10 లక్షల జరిమానా విధించేలా ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా సేకరించిన 171 నమూనాలలో 107 టార్ట్రాజైన్, సన్‌సెట్ ఎల్లో, రోడమైన్-బీ, కార్మోయిసిన్ లాంటి హానికర రసాయనాలను ఉపయోగించి తయారు చేసినట్లు అధికారులు గర్తించారు. 64 సురక్షితంగా ఉన్నట్టు తేలింది. అలాగే 25 కాటన్ క్యాండీ నమూనాలను సేకరించగా, వాటిలో 10 సురక్షితమైనవిగానూ, 15 హానికరమైనవిగా తేలాయి. -
కృత్రిమ దీవిలో వివాదాస్పద భవంతి
పోలండ్‌లోని నోటెకా అభయారణ్యంలో ఈ భవంతి నిర్మాణం వివాదాస్పదంగా మారింది. నదిలో కృత్రిమ దీవిని ఏర్పాటు చేసుకుని, దానిపై మధ్యయుగాల శైలిలో దాదాపు ఎనిమిదేళ్లుగా నిర్మిస్తున్న ఈ భవంతి గురించిన వివరాలు ఇప్పటికీ పూర్తిగా ఎవరికీ తెలియవు. ఎవరు ఎందుకు ఈ భవంతిని నిర్మిస్తున్నారనే దానిపై అనేక వదంతులు ప్రచారంలో ఉన్నాయి. ఈ భవంతి నిర్మాణాన్ని 2015లో ప్రారంభించారు. దీని నిర్మాణం దాదాపు పూర్తయ్యే దశలో ఉంది. ఇది 2025 నాటికి పూర్తి కాగలదని అంచనా. అభయారణ్యంలో నిబంధనలకు విరుద్ధంగా నిర్మిస్తున్న ఈ భవంతి గురించి జనాలకు కొంత ఆలస్యంగా తెలిసింది. దీనిపై స్థానిక పర్యావరణవేత్తలు గగ్గోలు చేయడంతో 2020లో ఏడుగురు కార్మికులను అదుపులోకి తీసుకున్నారు. ఏళ్ల తరబడి నిర్మాణం సాగుతున్నా, దీనిపై పట్టించుకోనందుకు స్థానిక గవర్నర్‌కు పదవి ఊడింది. అయినా, ఈ భవంతి నిర్మాణం వెనుక ఎవరు ఉన్నారనేది మాత్రం స్పష్టంగా బయటపడలేదు. ఈ పరిణామాల తర్వాత కూడా ఈ భవంతి నిర్మాణం యథా ప్రకారం కొనసాగుతూనే ఉంది. ఈ భవంతి నిర్మాణానికి దాదాపు 75 మిలియన్ పౌండ్లు (రూ.78.94 కోట్లు) ఖర్చవుతుందని ఒక అంచనా. ఈ భవంతి నిర్మాణం వెనుక జాన్ కుల్సిక్ అనే పోలిష్ కోటీశ్వరుడు ఉన్నట్లు ఒక వదంతి ప్రచారంలో ఉంది. నిజానికి అతడు ఈ నిర్మాణం ప్రారంభించే నాటికే 2015లో మరణించాడు. అయితే, తాను జీవించి ఉండగానే, మరణించినట్లు ప్రచారం చేసుకుని, తెరవెనుక ఉండి ఈ నిర్మాణం కొనసాగిస్తున్నాడనే ప్రచారం బలంగా ఉంది. పర్యావరణ నిబంధనలకు విరుద్ధంగా సాగుతున్న ఈ నిర్మాణాన్ని నిలిపివేయడానికి పోలిష్ అధికారులు ఎన్ని ప్రయత్నాలు చేసినా, అవేవీ నెరవేరలేదు. అలాగే ఈ నిర్మాణం వెనుక ఎవరున్నారో, దీనిని ఏ ఉద్దేశంతో నిర్మిస్తున్నారో ఇప్పటి వరకు బయటపడకపోవడమే ఆశ్చర్యకరం. -
కృత్రిమ ఆకులతో మంచినీటిని తయారు చేయొచ్చు.. సైంటిస్టుల వెల్లడి
ఇప్పుడున్న టెక్నాలజీ యుగంలో అసాధ్యాన్ని కూడా సుసాధ్యమని నిరూపిస్తున్నారు మన సైంటిస్టులు. ఇప్పటికే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో ఎన్నో విప్లవాత్మక మార్పులు వచ్చాయి. ఇప్పుడు ఎడారి ప్రాంతంలోనూ మంచినీళ్లు తయారు చేయొచ్చని నిరూపిస్తున్నారు కేంబ్రిడ్జి యూనివర్సిటీకి చెందిన సైంటిస్టులు. కృత్రిమ ఆకులతో స్వచ్చమైన తాగునీటితో పాటు హైడ్రోజన్ ఇంధనాన్ని కూడా ఉత్పత్తి చేయొచ్చట. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం. ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న తాగునీరు, ఇంధనం వంటి సంక్లిష్ట ఇబ్బందులకు ఆర్టిఫిషియల్ లీఫ్ పద్దతి మంచి పరిష్కారమని కేంబ్రిడ్జి యూనివర్సిటీ సైంటిస్టులు వివరించారు. ఆ సరికొత్త ఆవిష్కరణ ఎడారి వంటి ప్రాంతాల్లో సరైన పరిష్కారణమని వారు తెలిపారు. మొక్కలకు నీరు, సూర్యరశ్మే ప్రధాన ఆహారం. గాలిలోని కార్భన్ డై ఆక్సైడ్‌ను పీల్చుకొని మొక్కలు మనకు ఆక్సిజన్‌ను అందిస్తాయి. అచ్చం ఇదే పద్దతిలో ఇప్పుడు(Artificial Leaf) ఆర్టిఫిషియల్ ఆకులను సృష్టించారు. ఇవి నిజమైన వాటి మాదిరిగానే ఆకుల్లా పనిచేసే గాడ్జెట్లు (కృత్రిమ ఆకులు). ఇవి నీరు, సూర్యరశ్మిని తీసుకొని ఇంధనంతో పాటు స్వచ్చమైన మంచినీటిని అందిస్తుంది. ప్రపంచంలో సుమారు 1.8 బిలియన్ల మందికి ఇప్పటికి తాగునీరు అందుబాటులో లేదు. ఆర్టిఫిషియల్ లీఫ్స్ టెక్నాలజీ ద్వారా నీటి సంక్షోభం నుంచి ఉపశమనం పొందొచ్చు.ఇది విభిన్న వాతావరణ పరిస్థితుల్లోనూ సమర్థవంతంగా పనిచేస్తుందని సైంటిస్టులు వెల్లడించారు. ఆర్టిఫిషియల్ లీఫ్‌పై ఉన్న చతురస్రాకారపు గ్రీన్ ఫొటోనోడ్.. సన్‌లైట్‌ను కలెక్ట్ చేస్తుంది. సూర్యుడికి ఎక్స్పోజ్ అయినప్పుడు ఈ కృత్రిమ ఆకుల్లోని కనెక్టెడ్ సిలిండర్స్ సాధారణ మొక్కల థియరీ కిరణజన్య సంయోగ క్రియ తరహాలోనే ఇది కూడా పనిచేస్తుంది.ఆర్టిఫిషియల్ లీఫ్స్ ద్వారా సౌరశక్తిని ఉపయోగించి ఏకకాలంలో స్వచ్చమైన మంచినీటితో పాటు ఇంధనాన్ని ఉత్పత్తి చేయవచ్చు. అంతేకాకుండా గాలి కూడా శుభ్రమవుతుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ అందించిన వివరాల ప్రకారం.. సంవత్సరానికి మూడు మిలియన్ల మరణాలకు కాలుష్యమే కారణమని తేలింది. ఈ నేపథ్యంలో అటు గాలిని శుభ్రం చేస్తూనే ఇటు ఇంధనాల ఉత్పత్తి చేసుకోవచ్చని ప్రొఫెసర్ ఎర్విన్ రీస్నర్ అన్నారు.వాతావరణంలో పెరిగిపోతున్న కార్బన్‌డయాక్సైడ్‌ను తొలగించడంతోపాటు ప్రయోజనకరంగా మార్చుకోగలగడం ఈ టెక్నాలజీ ప్రత్యేకత.. -
ఔరా! అవుట్ ఆఫ్ ది బాక్స్.. చిత్రరంగానికి ఏఐ హంగులు!
రామ్‌గోపాల్‌వర్మ ‘కథ–స్క్రీన్‌ప్లే–దర్శకత్వం: అప్పల్రాజు’ సినిమాలో రాఖీ డైలాగు...‘డైరెక్టర్ కావాలంటే ఊరకే కథలు మాత్రమే రాస్తే సరిపోదయ్యా’ కట్ చేస్తే... సినీ కలల యువతరం ఇప్పుడు ఊరకే కథలు రాస్తూ, కలలు కంటూ మాత్రమే కూర్చోవడం లేదు. చిత్రరంగంలో ఎప్పటికప్పుడు వస్తున్న సాంకేతికతను అధ్యయనం చేస్తోంది. ఇంటర్నెట్నే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్గా చేసుకొని ‘స్క్రిప్ట్ బుక్’ ‘ఐవా’ ‘మాజిస్టో’లాంటి ఎన్నో ఏఐ టూల్స్‌పై అవగాహన పెంచుకొని వినూత్నంగా ఆలోచిస్తోంది... పుణెకు చెందిన నైనా పాటిల్ పేరుకు ఇంజనీరింగ్ చదువుతుందిగానీ ఆమె కలలన్నీ చిత్రసీమ వైపే. ఇంట్లో చెబితే ఒప్పుకోరని తెలుసు. అయితే ఆ భయమేమీ తన కలలకు అడ్డుగోడ కావడం లేదు. తీరిక వేళల్లో అత్యాధునిక సినీ సాంకేతికతకు సంబంధించిన విషయాలు, విశేషాలు తెలుసుకోవడం తనకు ఇష్టం. కోయంబత్తూరుకు చెందిన నిఖిల్ తేజను ఒక్కసారి కదిపి చూడండి. ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించి లేటెస్ట్, గ్రేటెస్ట్ విశేషాలను గుక్కతిప్పుకోకుండా చెబుతాడు. సినీ సాంకేతికతపై అతని పట్టు చూస్తే ‘రాబోయే రోజుల్లో కాబోయే డైరెక్టర్’ అని ఢంకా బజాయించి చెప్పవచ్చు. ఒక సినిమా హిట్ కావాలంటే కథ బాగుండాలి. బాగున్న కథను బాగా చెప్పగలగాలి. బాగా చెప్పడానికి మాటల నైపుణ్యంతో పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ రూపంలో సాంకేతిక నైపుణ్యాన్ని కూడా తోడుగా తెచ్చుకుంటుంది సినిమా కలల యువతరం. ఏఐ టూల్స్ వల్ల కథ వినే వారికి గంటల కొద్ది సమయం వృథా కాకపోవడం ప్లస్ పాయింట్. సినిమాలకు సంబంధించి యువతరం ఆసక్తి చూపుతున్న కొన్ని ఏఐ టూల్స్...పెద్దగా సాంకేతిక పరిజ్ఞానం లేకపోయినా ఏఐ టూల్ ‘స్క్రిప్ట్ బుక్’ను సులభంగా ఉపయోగించవచ్చు. సినిమాలు, టీవీ షోలకు స్క్రిప్ట్ క్రియేట్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. క్యాస్టింగ్, జానర్, స్టోరీ స్ట్రక్చర్‌కు సంబంధించి విశ్లేషణ చేయవచ్చు. ‘డెమోక్రటైజింగ్ స్టోరీటెల్లింగ్ త్రూ ది ఆర్ట్ ఆఫ్ ఏఐ’ అంటూ తనను పరిచయం చేసుకుంటుంది స్క్రిప్ట్‌బుక్. ఇది సినిమా జయాపజయాలను కూడా అంచనా వేయగలదు అంటున్నారు గానీ ఎంతవరకు నిజమో తెలియదు. డిఫరెంట్ యూజర్లను దృష్టిలో పెట్టుకొని స్క్రిప్ట్బుక్లో రకరకాల ప్యాకేజీలు ఉన్నాయి. ఇండివిడ్యువల్ రైటర్లు, చిన్న ప్రొడక్షన్ హౌజ్‌ల కోసం ది బేసిక్ ప్యాకేజ్, మల్టిపుల్ ప్రాజెక్ట్‌లకు సంబంధించి స్క్రిప్ట్ ఎనాలసిస్ చేయడానికి ది స్టాండర్డ్ ప్యాకేజీ, ప్రముఖ ప్రొడక్షన్ హౌజ్‌లు, స్టూడియోల కోసం ది ప్రీమియం, నిర్దిష్టమైన అవసరాల కోసం ది ఎంటర్ప్రైజ్లాంటి ప్యాకేజ్‌లు ఉన్నాయి. స్టోరీ టెల్లింగ్ ఏఐ టూల్స్‌లో ప్లాట్‌గన్ ఒకటి. దీనితో యానిమేటెడ్ ఫిల్మ్ సులభంగా రూపొందించవచ్చు. యూజర్–ఫ్రెండ్లీ అడ్వాన్స్డ్ ఫీచర్లతో సినీ కథకులకు, కంటెంట్ క్రియేటర్లకు ప్లాట్‌గన్ దగ్గరైంది. ‘ప్లాట్‌గన్’ను ఉపయోగించడానికి డ్రాయింగ్ స్కిల్క్స్ అవసరం లేదు. ఎన్నో క్యారెక్టర్లతో కూడిన లైబ్రరీ, ఎక్స్‌ప్రెసివ్ యానిమేషన్స్, టైమ్–సేవింగ్ యానిమేషన్, కస్టమ్ వాయిస్ వోవర్స్ అండ్ సౌండ్‌ట్రాక్స్... దీని ప్రత్యేకత. ఏఐ ప్లాట్‌ఫామ్ ‘అడోబ్ సెన్సే’ వీడియో ఎడిటింగ్, ఆటోమేటెడ్ కలర్ కరక్షన్స్, ఆడియో ఎన్హాన్స్మెంట్ \కు సంబంధించి రకరకాల టూల్స్‌ను అందిస్తోంది. ‘ఎమోషన్ ఏఐ’ టూల్స్‌తో ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్, బాడీ లాంగ్వేజ్‌ను ఎనలైజ్ చేయవచ్చు. ‘మాజిస్టో’ అనేది ఎడిటింగ్ విధానాన్ని సరళం చేసే ఏఐ పవర్డ్ వీడియో ఎడిటింగ్ టూల్. ఫుటేజీలోని ‘బెస్ట్ మూమెంట్స్’ ఆటోమేటిక్‌గా ఈ టూల్ సెలెక్ట్ చేస్తుంది. మ్యూజిక్‌ను యాడ్ చేస్తుంది. విజువల్ క్వాలిటీ విషయంలో తనవంతు పాత్ర పోషిస్తుంది. ఐవా (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వర్చువల్ ఆర్టిస్ట్) అనేది ఏఐ–పవర్డ్ మ్యూజిక్ కంపోజిషన్ టూల్. మోడ్రన్ సినిమాటిక్, ఎలక్ట్రానిక్, పాప్, రాక్, జాజ్... ఇలా రకరకాలుగా మ్యూజిక్ క్రియేట్ చేసుకోవచ్చు. స్టోరీలైన్స్, వీటితోపాటు ప్లాట్ ఐడియాలు జెనరేట్ చేయాలనుకునే వారికి ఉపయోగపడే ఏఐ టూల్స్ కూడా ఉన్నాయి. ‘స్క్రిప్ట్‌బుక్’ నుంచి ‘ఐవా’ వరకు సినిమాలకు సంబంధించి సకల సాంకేతిక విషయాలను తెలుసుకోవడానికి ఏ ఫిల్మ్ ఇనిస్టిట్యూట్‌లోనూ శిక్షణ అక్కర్లేదు. ఇంటర్నెట్ ఉంటే చాలు! ఏఐ జెనరేట్ సోరీలైన్లు, డైలాగులు, స్క్రిప్ట్‌లు త్వరలో మన ఫిల్మ్ ఇండస్ట్రీలోకి కూడా రావచ్చు. ఏఐ జెనరేట్ చేసిన స్టోరీలైన్లు, స్క్రిప్ట్‌లను నమ్ముకోవడమా, తమలోని క్రియేటివిటీని మాత్రమే నమ్ముకోవడమా.. అనే రెండు దారులు కనిపించవచ్చు. ‘ఏఐ సాంకేతికత అందరికీ అందుబాటులోకి వచ్చాక ప్రత్యేకత అంటూ ఉండకపోవచ్చు. స్టోరీలైన్లను క్రియేట్ చేయడంలో సహజత్వం మిస్ కావచ్చు. దీన్ని దృష్టిలో పెట్టుకొని సాంకేతికత కంటే సహజత్వానికే ప్రాధాన్యత ఇవ్వాలి. సాంకేతికతపై అవగాహన ఉండడం ముఖ్యమే కాని అది మాత్రమే ముఖ్యం కాదు. సమాజాన్ని అధ్యయనం చేయడం ద్వారా మాత్రమే కొత్త కథలు పుడతాయి’ అంటుంది దిల్లీకి చెందిన మాస్ కమ్యూనికేషన్ స్టూడెంట్ వర్షిణి. (చదవండి: సరికొత్త ఆలోచన!..ఎవ్వరికీ తట్టనది..రెస్టారెంట్లన్నీ..) -
విద్యుత్ షాక్ నుంచి అమ్మాయిని కాపాడిన ఆర్టిఫిషియల్ గోళ్లు
సాధారణంగా విద్యుత్ షాక్ తగిలినవారు తీవ్రంగా గాయాలపాలు కావడమో లేదా మృతి చెందడమో జరుగుతుండటాన్ని మనం చూసేవుంటాం. అయితే ఇటీవల ఒక కాలేజీ యువతికి విద్యుత్ షాక్ తగిలి 4 అడుగుల దూరం ఎగిరిపడంది. అయితే ఇంత జరిగినా ఆమెకు చిన్నపాటి గాయం కూడా కాకపోవడం విశేషం. ఈ విచిత్ర ఉదంతం ఇంగ్లండ్‌లో చోటుచేసుకుంది. తనకు ఎదురైన అనుభవం గురించి బాధితురాలు మాట్లాడుతూ తాను నకిలీ గోళ్లు పెట్టుకున్నకారణంగా విద్యుత్ షాక్ నుంచి బయటపడ్డానని తెలిపింది. 21 ఏళ్ల నికోల్ ఫోర్‌మ్యాన్ అనే యువతి ఇంటిలోని బాయిలర్ సరిచేసేందుకు ప్రయత్నిస్తుండగా కరెంట్ షాక్‌కు గురయ్యింది. బాయిలర్‌ను బంద్ చేయకుండానే నీటిని వేడి చేసి, స్నానం చేసేందుకు ఆ నీటిలో కాలు మోపింది. వెంటనే ఆమె షాక్‌నకు గురయ్యింది. ఎడిన్బర్గ్ క్వీన్ మార్గరిట్ యూనివర్శిటీలో చదువుకుంటున్న ఆ యువతి..‘షాక్ తగిలిన వెంటనే నాలుగు అడుగుల దూరం ఎగిరిపడ్డాను. తరువాత స్పృహ కోల్పోయానని’ తెలిపింది. ఇంటిలోని వారు ఆమెను గమనించి వెంటనే బాధితురాలని ఆసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యులు ఆమెను పరీక్షించి, ఆమె పెట్టుకున్న నకిలీ గోళ్ల కారణంగానే ఎంతో ప్రమాదకరమైన విద్యుత్ షాక్ నుంచి బయటపడిందని తెలిపారు. ప్రమాదం నుంచి బయటపడిన నికోల్..‘మా అమ్మ నా ఆర్టిఫిషిల్ గోళ్లను చూసి నన్ను తెగ మందలించేది. అయితే ఇప్పుడు ఆ గోళ్లే తనను కాపాడాయని తెలుసుకుని సంతోషపడుతోందని’ తెలిపింది. ఇది కూడా చదవండి: భూమిపై ఎలియన్స్?.. ప్రకంపనలు పుట్టిస్తున్న నిఘా విభాగం మాజీ అధికారి వాదన! -
షాకింగ్.. ఇదే జరిగితే కోకాకోల కథ కంచికే!
ప్రపంచ వ్యాప్తంగా కోకాకోలా గురించి తెలియని వారు ఉండరు అంటే ఏ మాత్రమే అతిశయోక్తి కాదు. ఎందుకంటే చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవారి వరకు కోక్ అంటే చాలు ఎగబడిపోతారు. గతంలో ఈ శీతల పానీయాలు చాలా ప్రమాదమంటూ కొన్ని వార్తలు తెరకెక్కాయి, కానీ అవన్నీ బలంగా నిలువలేకపోయాయి. అయితే ఇప్పుడు ఈ సంస్థకు ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) గట్టి షాక్ ఇవ్వడానికి సిద్ధమైంది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. నివేదికల ప్రకారం, కోకాకోలా (CocaCola)లో ఉపయోగించే కృత్రిమ స్వీటెనర్ ఆస్పర్టేమ్ క్యాన్సర్ కారకమని ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్దారించనుంది. ఆస్పర్టేమ్ అనే స్వీటెనర్ ప్రపంచ వ్యాప్తంగా చాలా ఉత్పత్తులలో విరివిగా ఉపయోగిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ స్వీటెనర్ వల్ల భవిష్యత్తులో క్యానర్ వచ్చే అవకాశాలు ఉన్నట్లు వాదనలు వినిపిస్తూనే ఉన్నాయి. తాజాగా.. ప్రపంచ ఆరోగ్య సంస్థకు చెందిన క్యాన్సర్ పరిశోధనల విభాగం ‘ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ రీసెర్చ్ ఆన్ క్యాన్సర్ (IARC) ఈ స్వీటెనర్ వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని నిర్దారించింది. ఈ కారణంగా కోకాకోలా క్యాన్సర్ కారకం అవుతుందని త్వరలోనే ప్రకటించే అవకాశం ఉందని సంబంధిత వర్గాల సమాచారం. (ఇదీ చదవండి: దంపతులిద్దరికీ అదే సమస్య.. వారికొచ్చిన ఐడియా ధనవంతులను చేసిందిలా!) వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఈ అధికారిక ప్రకటన జులై నెలలో వెల్లడించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇదే జరిగితే ప్రపంచంలోని చాలా దేశాలు దీని వినియోగాన్ని నిషేధిస్తాయి, మరికొన్ని దేశాలు ఆంక్షలు విధించే అవకాశం ఉంది. అయితే ఐఏఆర్సీ ఈ ఆస్పర్టేమ్ ఎంత మోతాదులో తీసుకుంటే మంచిది, ఎంత మోతాదు దాటితే ప్రమాదం అనే దానికి సంబంధించిన వివరణ ఇవ్వలేదు. 1984లో వెలువడిన కొన్ని నివేదికలు ఆస్పర్టేమ్ తక్కువ మోతాదులో ప్రతి రోజూ తీసుకున్న ఎటువంటి ప్రమాదం లేదని వెల్లడించాయి. ఇన్ని రోజులూ వీటినే అనేక దేశాలు ఉదాహరణలుగా చెబుతూ ముందుకు సాగాయి. అయితే ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇది క్యాసర్ కారకం అని ప్రకటిస్తే.. ఆ తరువాత పరిణామాలు ఊహాతీతంగా ఉంటాయి. -
సంచలనం రేపుతున్న AI ఉద్యోగాలు ఉంటాయా, ఉడతాయా ..!
-
Desert Of Maine: ముచ్చటైన ఎడారి
ఎడారి అనగానే.. ఎటు చూసినా ఇసుక తెన్నెలు, అక్కడక్కడా బ్రహ్మజెముడు, నాగజెముడు పొదలు అనే తలపే వస్తుంది కదా! కానీ, అమెరికాలోని ఫ్రీపోర్ట్ పట్టణానికి సమీపంలో ఉన్న ‘మైనె డెజర్ట్’లో మాత్రం ఇసుక, నీరు, చెట్లు.. అన్నీ పుష్కలంగా ఉంటాయి. పైగా నిత్యం వందలాది పర్యాటకులతో కిటకిటలాడుతుంటుంది. ఎందుకంటే, ఇది నిజమైన ఎడారి కాదు. మనిషి నిర్మించిన కృత్రిమ ఎడారి. నిజానికి శతాబ్దం కిందట ఇదొక వ్యవసాయ భూమి. గోధుమ, వరి పండించే పంటపొలం. పర్యావరణ మార్పుల కారణంగా భూసారం కోల్పోయి, ఇసుక మేట వేసింది. దీంతో చాలామంది భూమిని అమ్ముకుని ఊరు విడిచి వెళ్లిపోయారు. ఇందులో ఎక్కువ భాగాన్ని అంటే 40 ఎకరాలను కొన్న టటిల్ అనే వ్యక్తి , కొంతకాలం గొర్రెలు మేపడంతో అక్కడ అసలు గడ్డి అనేదే లేకుండా పోయింది. తర్వాత ఆ నలభై ఎకరాలను 1919లో హెన్రీ గోల్డ్రప్ కొనుగోలు చేసి, నిజంగానే ఆ ప్రాంతాన్ని ఓ ఎడారిలా మార్చాలని నిర్ణయించుకున్నాడు. మరికొంత ఇసుకను తెప్పించి 2.5 మీటర్ల ఎత్తుమేర మొత్తం చల్లించి, అందమైన ఎడారిలా మార్చాడు. సందర్శకుల కోసం అక్కడక్కడ చెట్లు కూడా పెంచాడు. పిల్లలు ఆడుకోవడానికి ఓ ప్రత్యేక ఆటస్థలం, మ్యూజియం కూడా ఉన్నాయి. బాగుంది కదా ఈ కృత్రిమ ఎడారి! -
కృత్రిమ మొసలి అనుకుని సెల్ఫీకి యత్నం... ఇక అంతే చివరికి
ఇటీవలకాలంలో ఈ స్మార్ట్ ఫోన్లు వచ్చాక ఈ సెల్ఫీ మోజు మాములుగా లేదు. వేగంగా వెళ్లుతున్న బస్సు లేక రైలు పక్కన సెల్ఫీలు దిగడం వంటివి చేస్తున్నారు. అయితే ఈ పిచ్చి ఎంత దారుణంగా ఉందంటే అత్యంత ప్రమాదకరమైన పరిస్థితుల్లో కూడా సెల్ఫీలు తీసుకుంటున్నారంటే ఏమని అనాలో కూడా అర్థంకాదు. అచ్చం అలానే ఇక్కడొక వ్యక్తి సెల్ఫీ మోజుతో ఎంత పిచ్చి పని చేశాడో చూడండి. (చదవండి: ఏడాదిగా షాప్‌కు వస్తున్న ప్రమాదకరమైన పక్షి!) అసలు విషయంలోకెళ్లితే...ఫిలిప్పీన్స్‌లోని నెహెమియాస్ చిపాడా అనే 60 ఏళ్ల వ్యక్తి తన కుటుంబంతో సహా కాగయన్ డి ఓరో సిటీలోని అమయా వ్యూ అమ్యూజ్మెంట్ పార్క్‌ను సందర్శించడానికి వెళ్లాడు. అయితే ఆ వ్యక్తి ఆ కొలనులో కృత్రిమ మొసళ్లు ఉంటాయనుకుని వాటితో సెల్ఫీకోసం అక్కడ ఉన్న థీమ్ పార్క్‌లోని కొలనులోనికి దిగిపోయాడు. ఇక అంతే అతను ఒక చేత్తో ఫోన్ పట్టుకుని మొసలితో సెల్ఫీ తీసేందుకు ప్రయత్నిస్తుండగా వెంటనే ఆ మొసలి అతని పై దాడి చేసి గట్టిగా ఎడమచేయి పట్టుకుని లాగుతుంది. అయితే చిపాడ పాపం ఏదోరకంగా ఆ చెయ్యిని విడిపించుకుని బయటపడతాడు. దీంతో చిప్పాడను అతని కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించడంతో డాక్టర్లు అతని ఎడమ చేతికి శస్త్రచికిత్స కూడా చేశారు. ప్రస్తుతం అతను బాగానే కోలుకుంటున్నాడు. అంతేకాదు అతను కుటుంబసభ్యులు ఆ కొలనులోని దిగవద్దని హెచ్చరిక బోర్డులు లేవు అందువల్ల అతను దిగాడంటూ ఆ పార్క్వాళ్లపై ఆరోపణలు చేయడం మొదలుపెట్టారు . ఈ మేరకు అమయా వ్యూ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ కాండీ ఉనాబియా ఈ ఆరోపణలను ఖండించారు. అంతేకాదు మొసలి కూడా కృత్రిమమైనదని వారు భావించడం వల్లే ఇలా జరిగిందని అన్నారు. పైగా తాము తమ పార్క్ టూర్ గైడ్లో ముందుగానే ఆ ప్రాంతాన్ని పరిమితులకు లోబడే సందర్శించాలనే విషయాలను పర్యాటకులకు చెబుతామని అన్నారు. అయితే చివరికి అమయా వ్యూ పార్క్ అధికారులు చిపడా వైద్యా ఖర్చుల నిమిత్తం ఆర్థిక సహాయం చేస్తామని చెప్పడం గమనార్హం. (చదవండి: ఘోర బస్సు ప్రమాదం...19 మంది దుర్మరణం) -
పువ్వుల్లొ దాగున్న ఇల్లు... కానీ అవి మొక్కలకు పూయని పూలు!
న్యూయార్క్: చాలామంది ప్లాస్టిక్ వస్తువులను పడేయకుండా వాటిని ఏదో విధంగా వినియోగంలోకి తీసుకువస్తారు. ఇదే తరహాలో ఒకామె కొన్ని రీసైకిల్ చేసిన ప్లాస్టిక్ బాటిళ్లను సేకరించి పువ్వులను తయారు చేసింది. పైగా వాటిని తన ఇంటి టెర్రస్ పై నుంచి కింద వరకు ఒక సన్న జాజి తీగ లత మాదిరిగా పూలన్ని పరుచుకుంటూ కింద నేలవరకు ఉంటాయి. అది ఎంత ఆకర్షణీయంగా ఉండటమే మనం మన దృష్టిని మరల్చకుండా అలా చూస్తుండేపోయేలా అందంగా ఉంటాయి. ఇంతకీ ఆమె ఎవరు, ఎక్కడ జరిగిందో చూద్దాం రండి. (చదవండి: చేతల్లో చూపించగలగేవాడికి చేతులతో పని ఏమి ?) అసలు విషయంలోకెళ్లితే...అమరికాకు చెందిన ఫియోనా అనే 53 ఏళ్ల మహిళ క్రిస్మస్ సందర్భంగా తన ఇంటిని అలంరకరించే నిమిత్తం తన ఇరుగు పొరుగు వారి దగ్గర్నుంచి బాటిల్స్ సేకరిస్తోంది. ఆ తర్వాత ఆమె బాటిల్స్ అడుగు భాగన కత్తిరించి యాక్రిటిక్ పేయింటింగ్‌తో పువ్వుల్లా తయారు చేస్తుంది. చూడటానికి గుండ్రని విత్తన గుళికలతో కూడిన గుల్మకాండ మొక్కలు మాదిరి గసగసాల పువ్వుల్లా ఆకర్షణీయంగా ఉంటాయి. నిజానికి అవి నిజమైన పూవులు మాదిరిగా ఉంటాయి. ఈ మెరకు ఫియోనా ఈ క్రాఫ్ట్‌ని 2014లో వేవ్ డిస్ ప్లే ప్రేరణతో తయారు చేసినట్టు చెప్పింది.పైగా అవి 12 అడుగులు పొడవుతో తన ఇంటి మొదటి అంతస్థు కిటికి నుండి కింద నేల వరకు పరుచుకుని అందమైన పూల లతలా ఉంటుంది. ఈ విధంగా రీసైకిల్ చేసిన ప్లాస్టిక్ పూలతో తన ఇంటిని మొత్తం అందంగా అలంకరించింది. (చదవండి: దీపావళి పండుగ ముగింపు... ఒక వింతైన ఆచారం) -
కృత్రిమ మాంసం, రక్తం, పాలు, పెరుగు తయారీ!
మాయాబజార్ సినిమాలో ‘చిన్నమయ’ ఒక్క మంత్రమేస్తే.. ఖాళీ అయిన గంగాళాలు గారెలు,అరిసెలతో నిండిపోతాయి. నిజజీవితంలోనూ ఇలా జరిగితే ఎంతబాగుండు కదా..కాకపోతే మంత్రాలకు చింతకాయలు రాలుతాయా ఏంటీ.. నిజమే.. కాకపోతే సైన్స్ మంత్రానికి టెక్నాలజీ యంత్రాన్ని జోడిస్తే అసాధ్యమేమీ కాదు.. ఓ మంత్రం.. లేదా యంత్రంతో మనిషి తనకు కావాల్సినవన్నీ సృష్టించుకోవడం కల్పన కావొచ్చు. స్టార్‌ట్రెక్ లాంటి సినిమాల్లోనూ ‘రెప్లికేటర్’అనే యంత్రం అక్షయ పాత్ర లాగా ఏది కావాలంటే అది తయారు చేసి పెడుతుంది. ఇలాంటిది తయారయ్యేందుకు ఇంకో వందేళ్లు పట్టొచ్చేమో కానీ, ఈ దిశగా శాస్త్రవేత్తలు అడుగులు వేస్తున్నారు. ప్రకృతితో సంబంధం లేకుండా.. మానవ శ్రమ, కాలుష్యాలకు దూరంగా పాలు, మాంసం మాత్రమే కాదు.. ఏకంగా కార్లనే ముద్రించి తయారు చేసేందుకు సిద్ధమవుతోంది శాస్త్ర ప్రపంచం. వైఢూర్యాలు కాదు.. వజ్రాలే! భూమి లోపలి పొరల్లో నిక్షిప్తమై ఉండే వజ్రాలు కార్బన్‌తో తయారవుతాయి. ఈ విషయం చాలావరకు తెలిసిందే. అయితే ఒక్కో వజ్రం వెనుక కోట్ల ఏళ్ల చరిత్ర ఉంటుంది. అన్నేళ్లు విపరీతమైన ఒత్తిడి, ఉష్ణోగ్రతల్లో నలిగితే గానీ.. కార్బన్ కాస్తా వజ్రంగా మారదు. అయితే భూమి లోపలి పొరల్లాంటి పరిస్థితులను కృత్రిమంగా సృష్టించి వజ్రాలను చౌకగా తయారుచేయాలన్న ప్రయత్నం సాగుతోంది. జిర్కోన్ వంటి మూలకాల సాయంతో తయారు చేయగలిగారు. సహజమైన వజ్రాలతో అన్ని రకాలుగా సరిపోలినా కానీ వీటిపై ఆదరణ మాత్రం పెద్దగా పెరగలేదు. ఇదే సమయంలో సహజ వజ్రాల మైనింగ్‌లో ఇమిడి ఉన్న అనేక నైతిక అంశాల కారణంగా ఇప్పుడు డీబీర్స్ వంటి కంపెనీలు గనులను నిలిపేయాలని నిర్ణయించాయి. 2018లోనే డిబీర్స్ పూర్తిగా కృత్రిమ వజ్రాలతోనే ఆభరణాలను తయారు చేయాలని తీర్మానించింది. ప్రపంచంలోనే అతిపెద్ద ఆభరణాల తయారీ సంస్థ పండోరా కూడా ఈ ఏడాది ఇకపై తాము గనుల్లోంచి వెలికితీసిన వజ్రాలను వాడబోమని ప్రకటించనుంది. పాలు, పెరుగు కూడా.. పాలలో ఏముంటాయి? కొవ్వులు, కొన్ని విటమిన్లు, ఖనిజాలు, నీళ్లు అంతేనా? ఒకట్రెండు ప్రోటీన్లు ఉంటాయనుకున్నా వీటన్నింటినీ తగుమోతాదులో కలిపేస్తే పాలు తయారు కావా? అన్న ప్రశ్న వస్తుంది. ఇంత పనికి.. ఆవుల్ని, గేదెలను మేపడం, వాటి వ్యర్థాలను ఎత్తి పారేసి శుభ్రం చేసుకోవడం, పితికిన పాలను ఫ్యాక్టరీల్లో శుద్ధి చేసి ప్యాకెట్లలోకి చేర్చి ఇంటింటికీ పంపిణీ చేయడం అవసరమా? అంటున్నారు ఈ కాలపు శాస్త్రవేత్తలు కొందరు. జంతువులతో ఏమాత్రం సంబంధం లేకుండానే పాలను పోలిన పాలను తయారుచేయడం పెద్ద కష్టమేమీ కాదన్నది వీరి అంచనా. పెర్ఫెక్ట్ డే అనే కంపెనీ కొన్ని రకాల శిలీంద్రాల్లో మార్పులు చేయడం ద్వారా అవి పాల లాంటి ద్రవాలను ఉత్పత్తి చేసేలా చేయగలిగారు. ఇమాజిన్ డెయిరీ కూడా పశువుల అవసరం లేని పాల ఉత్పత్తుల తయారీకి ప్రయత్నిస్తోంది. కాకపోతే ఈ కంపెనీ మనం బ్రెడ్ లాంటివాటిని తయారు చేసేందుకు వాడే ఈస్ట్ సాయం తీసుకుంటోంది. ఈ కృత్రిమ పాలను ఐస్‌క్రీమ్‌గా మార్చి అందరికీ అందించేందుకు పెర్ఫెక్ట్ డెయిరీ ఇప్పటికే కంపెనీలతో చర్చలు జరుపుతోంది. అంతెందుకు అమెరికాలోని కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే ఈ రకమైన కొత్త రకం పాలు, పాల ఉత్పత్తులు అందుబాటులో ఉన్నాయి కూడా! కృత్రిమ మాంసం.. భూమ్మీద ఉన్న వ్యవసాయ భూమిలో సగం భూమిని మాంసం ఉత్పత్తి కోసం వినియోగిస్తున్నారు. పశువులకు అవసరమైన దాణా, గింజలు, వాటి పోషణకు అవసరమైన నీరు తదితర ఇతర వనరుల కోసం ఇంత భూమిని వాడుకుంటున్నాం. ఇవేవీ లేకుండా ఒక ఫ్యాక్టరీ, పెరుగుదలకు ఉపయోగపడే ఎంజైమ్స్‌తో కావాల్సినంత మాంసం సృష్టించేందుకు చాలాకాలంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇటీవలే ఓ మోస్తరు విజయం సాధించాం. పదేళ్ల కిందటే ఖైమా కొట్టిన మాంసం లాంటి పదార్థాన్ని తయారు చేయగలిగినా కొన్ని ఇబ్బందులతో ఆ టెక్నాలజీ ముందుకు సాగలేదు. తాజాగా 2018లో ఇజ్రాయెల్ కంపెనీ ఆలెఫ్ ఫామ్స్ తొలిసారి ల్యాబ్‌లోనే స్టీక్ (మాంసపు ముక్క)ను తయారు చేసింది. మరింకేం అలెఫ్ ఫామ్స్ లాంటివి ఊరుకొకటి పెట్టేస్తే సరిపోతుంది కదా అంటే.. దానికి ఇంకొంచెం సమయం ఉంది. ఎందుకంటే ప్రస్తుతానికి ల్యాబ్‌లో పెంచిన మాంసం ఖరీదు చాలా ఎక్కువ. 2011తో పోలిస్తే రేటు గణనీయంగా తగ్గినా మరింత తగ్గితే గానీ అందరికీ అందుబాటులోకి రాదు. ఇదిలా ఉంటే ఇజ్రాయెల్‌లోనే ఇంకో కంపెనీ వాణిజ్యస్థాయిలో చికెన్ ముక్కలను తయారు చేసి దుకాణాలకు సరఫరా చేస్తోంది. ఆఖరికి రక్తం కూడా.. మన శరీరపు ఆరోగ్యం గురించి ఠక్కున చెప్పేయగల శక్తి రక్తానికి ఉందంటారు. అవయవాలన్నింటికీ శక్తినిచ్చే ఆక్సిజన్‌ను సరఫరా చేయడంతో పాటు మలినాలు, వ్యర్థాలను బయటకు పంపేందుకు సాయపడుతుంది రక్తం. యుద్ధంలో లేదా ప్రమాద సమయాల్లో కోల్పోయే రక్తాన్ని దాతల రక్తంతో భర్తీ చేసేందుకు అవకాశం ఉన్నా అది స్వచ్ఛమైన వ్యవహారం కాదు. పైగా మన సొంత రక్తం పనిచేసినట్లు ఇతరుల రక్తం పనిచేస్తుందన్న గ్యారంటీ కూడా లేదు. ఈ నేపథ్యంలోనే అన్నీ మంచి లక్షణాలు ఉన్న కృత్రిమ రక్తాన్ని తయారు చేసేందుకు 50 ఏళ్లుగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే ఈ మధ్య కాలంలో జరిగిన రెండు వేర్వేరు పరిశోధనల పుణ్యమా అని 50 ఏళ్లుగా సాధ్యం కాని కృత్రిమ రక్తం తయారీ త్వరలో వీలయ్యే అవకాశం ఏర్పడింది. 2017లో మానవ మూలకణాలను రక్త కణాలుగా మార్చే పద్ధతులను రెండు బృందాలు సమర్పించాయి. ఈ రెండు సక్రమంగా పనిచేస్తాయని రుజువైతే.. త్వరలోనే కృత్రిమ రక్తం అందుబాటులోకి వస్తుందని శాస్త్రవేత్తల అంచనా. ఫ్యాక్టరీల్లో ఫర్నిచర్ కలప.. గ్రామీణ ప్రాంతాల్లో వంటకు మొదలుకొని కాగితం, ఫర్నిచర్ తయారీల వరకు కలప వినియోగం విస్తృతంగా జరుగుతోంది. కానీ దీనికోసం రోజూ వందల ఎకరాల అటవీభూమి నాశనమవుతోంది. ఇలా కాకుండా.. దృఢమైన కలపను పరిశోధనశాలలోనే తయారు చేయగలిగితే? అమెరికాలోని టెక్సాస్‌లో ఉన్న మసాచూసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ శాస్త్రవేత్తలు ఈ అద్భుతం సాధ్యమే అంటున్నారు. మొక్కల కణాలను గ్రోత్మీడియంలో ఉంచి పెంచడమే కాకుండా.. అవి కలప మాదిరిగా అతుక్కునేలా చేయగలిగారు. మొక్కల హార్మోన్లు కనీసం రెండు కణాల్లో లిగ్నిన్ (కలపకు దృఢత్వాన్ని ఇచ్చేది) పెరుగుదలను ప్రోత్సహిస్తున్నట్లు గుర్తించారు. ఈ హార్మోన్లను నియంత్రించడం ద్వారా ఉత్పత్తి చేసే కలప లక్షణాలను నిర్ణయించొచ్చు. అంతా బాగానే ఉంది కానీ.. ప్రస్తుతానికి ఈ ఆలోచన చాలా ప్రాథమిక దశలోనే ఉంది. ఇంకొన్నేళ్ల తర్వాతే కృత్రిమ కలపతో టేబుళ్లు, కుర్చీలు, తలుపులు తయారవుతాయి! -
కృత్రిమ కుజుడిపై నివాసానికి సిద్ధమా?.. నాసా అప్లికేషన్లు
మానవ జ్ఞానం అవధుల్లేకుండా పెరుగుతున్న కొద్దీ అంతరిక్షానికి ఆవల ఏముందో చూడాలన్న ఆతృత పెరిగిపోతోంది. అంతరిక్ష యానం, ఇతర గ్రహాలపై నివాసం మనిషి మేథస్సుకు విసిరిన సవాళ్లు కాగా, క్రమంగా వీటిని జయిస్తూ వస్తున్నాడు మానవుడు. ఈ క్రమంలో చంద్రుడితో మొదలెట్టిన గ్రహాంతర యానాలు ఇతర గ్రహాలకు విస్తరిస్తున్నాయి. ప్రస్తుతానికి చంద్రుడిపైకి మాత్రమే మనిషి వెళ్లగలిగాడు. కానీ త్వరలో ఇతర గ్రహాలపై పాదం మోపే ప్రయోగాలు వేగవంతం అవుతున్నాయి. ఇదే జోరు కొనసాగితే కొన్ని తరాల అనంతరం మనిషి ఇతర గ్రహాలపై నివాసం ఏర్పరుచుకోవడం ఖాయమన్నది సైంటిస్టుల అభిప్రాయం. గ్రహాంతర నివాసం కల సాకారం చేసుకునే క్రమంలో పలు దేశాలు పలు ప్రయోగాలు చేపడుతున్నాయి. ఈ తరహాలోనే అమెరికాకు చెందిన నాసా ఒక ప్రయోగాన్ని చేపట్టింది. అంగారకుడిపై ఉండే వాతావరణాన్ని మనిషి తట్టుకుండాలో లేదో అధ్యయనం చేసేందుకు భూమిపైనే కృత్రిమంగా అంగారక వాతావరణాన్ని సిద్ధం చేస్తోంది. ఇందులో సంవత్సరం పాటు ఉండి ప్రయోగాలు చేసేందుకు ఉత్సాహం చూపే ఔత్సాహికుల నుంచి అప్లికేషన్లు ఆహ్వానిస్తోంది. వచ్చిన దరఖాస్తుల్లో నాసా ఎంపిక చేసుకున్నవారు ఈ కృత్రిమ అంగారక వాతావరణంలో ఉంటూ ఎలాంటి సవాళ్లు ఎదురవుతాయో, వాటికి ఎలా సిద్ధమవ్వాలో అధ్యయనం చేస్తారు. డ్యూన్ ఆల్ఫా మార్స్ డ్యూన్ ఆల్ఫాగా పిలిచే 1700 చదరపు అడుగుల ఈ కృత్రిమ నివాస స్థలాన్ని అంగారకుడి వాతావరణాన్ని అనుసరించి 3డీ ప్రింటింగ్ ద్వారా సృష్టిస్తున్నారు. హూస్టన్‌లోని జాన్సన్ స్పేస్ సెంటర్లో ఈ కృత్రిమ కుజ నివాసం సిద్ధం చేస్తున్నారు. కుజుడిపై ఉండేలాగానే పరిమిత వనరులు, పరికరాలు ఫెయిల్‌కావడం, కమ్యూనికేషన్ తెగిపోవడం, ఇతర సహజసిద్ధ ప్రమాదాలు ఆల్ఫాలో ఉంటాయి. వీటన్నింటిని తట్టుకుంటూ అందులో ఉన్నవారు స్పేస్ వాక్ చేయడం, పరిశోధనలు చేయడం, వీఆర్ మరియు రోబోటిక్ కంట్రోల్స్ చేయడం వంటివి చేయాల్సిఉంటుంది. ఈ ప్రయోగంతో లభించే వివరాలు నిజమైన అంగారకుడిపైకి మనిషిని పంపేందుకు ఉపకరిస్తాయని నాసా భావిస్తోంది. అయితే ఇందులో ఒక చిన్న తిరకాసు ఉందండోయ్! కేవలం అమెరికా పౌరులకు మాత్రమే దరఖాస్తు చేసేందుకు అర్హులు. అది కూడా 30–55 సంవత్సరాల్లోపు వారు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. ధూమపానం అలవాటు లేకపోవడం, ఆరోగ్యవంతంగా ఉండడం, ఇంగ్లీష్ బాగా తెలిసిఉండడం వంటి అదనపు నిబంధనలు కూడా ఉన్నాయి. స్టెమ్ ఫీల్డ్‌లో మాస్టర్స్ డిగ్రీ చేసిఉండాలి. నాలుగేళ్లపాటు అనుభవం ఉంటే మంచిది. మనకు అవకాశం లేదని బాధపడాల్సిన పనిలేదు. త్వరలో మన ఇస్రో కూడా ఇటువైపుగా అడుగులు వేయవచ్చు. గతంలో రష్యా కూడా ఇలాంటి మార్స్ మిషన్ ఒకటి చేపట్టింది, కానీ సక్సెస్‌కాలేదు. మరి నాసా యత్నాలు ఎలాంటి ఫలితాలిస్తాయో చూడాల్సిందే! – సాక్షి, నేషనల్ డెస్క్ -
సేంద్రియ బ్యూటీ
తీవ్రమైన చర్మ సంబంధ సమస్యలతో తల్లి చనిపోయింది. తల్లికి అన్నీ తానై సేవలందించిన కృతికకు తల్లి చనిపోయాక ఏం చేయాలో తోచలేదు. దీంతో తన తల్లిపడిన కష్టం మరెవరూ పడకూడదన్న ఉద్దేశ్యంతో చర్మానికి హానికరం కానీ కూరగాయలు, మేకపాలతో సబ్బులు, బ్యూటీ ఉత్పత్తులను తయారు చేసింది. వాటిని విల్వా పేరుతో విక్రయిస్తోంది తమిళనాడుకు చెందిన కృతిక. తల్లిదండ్రులది వ్యవసాయ కుటుంబం కావడంతో కృతిక కుమరన్ పచ్చని పంటపొలాల మధ్య పెరిగింది. 21 ఏళ్ల వయసులో పెళ్లి అయ్యింది. దీంతో ఎçప్పుడూ రాష్ట్రం దాటి బయటకు వెళ్లింది లేదు. చిన్నప్పటినుంచి అమ్మ మంజులాదేవితో అనుబంధం ఎక్కువ. మంజులా దేవికి చర్మ సంబంధ సమస్య వచ్చింది. అది తగ్గడానికి వివిధ రకాల స్టెరాయిడ్స్ వాడడంతో అవి చర్మసమస్యను తగ్గించకపోగా కిడ్నీలు పాడయేలా చేశాయి. దీంతో మంజులాదేవి 2016లో మరణించారు. ఎప్పుడూ తనతో ఉండే అమ్మ దూరం కావడాన్ని కృతిక తట్టుకోలేకపోయింది. నిరాశానిస్పృహలకు గురవుతుండేది. ఎలాగైనా వీటి నుంచి బయటపడాలనుకుంది. ఈ క్రమంలోనే... వివిధరకాల సబ్బులు, బ్యూటీ ఉత్పత్తుల వల్ల చర్మసంబంధ సమస్యలు ఎదురవుతున్నాయి. వాటి వల్ల ఎంత ఇబ్బంది కలుగుతుందో అమ్మను దగ్గరనుంచి చూసిన కృతికకు మార్కెట్లో దొరికే వాటికి ప్రత్యామ్నాయంగా ఇంట్లోనే సేంద్రియ పద్ధతిలో వాటిని తయారు చేయాలనుకుంది. కానీ వాటిని ఎలా రూపొందించాలో తెలిసేది కాదు. మేకపాలతో సబ్బు.. వివిధ రకాల పదార్థాలతో సహజసిద్ధంగా సబ్బులు తయారు చేసేందుకు ప్రయత్నిస్తూనే.. నేచురల్ కాస్మటాలజీ కోర్సు చేసింది. మేకపాలకు కొన్ని ఇతర రకాల పదార్థాలు కలిపి సబ్బులు తయారు చేసి తెలిసిన వారికి, స్నేహితులకు ఇచ్చేది. ఆ సబ్బులు తామరవ్యాధితో బాధపడేవారికి బాగా ఉపయోగపడుతున్నట్లు చెప్పడంతో కృతికకు మంచి ప్రోత్సాహంగా అనిపించింది. ఈ ప్రోత్సాహంతో మరిన్ని ఉత్పత్తులను తయారు చేసేది. విల్వా.. అమ్మ చనిపోయిన ఏడాది తరువాత 2017లో ‘విల్వా’ పేరుతో స్టోర్‌ను ప్రారంభించింది. బిల్వపత్రం పేరుమీదగా ఈ పేరుపెట్టింది. ప్రారంభంలో కృతిక తయారు చేసే ఉత్పత్తులను ఫేస్బుక్ పేజిలో పోస్టు చేసి అందరికీ తెలిసేలా చేసింది. సబ్బులతోపాటు, స్కిన్‌కేర్, బ్యూటీ ఉత్పత్తులను సహజసిద్ధ పదార్థాలు, ఎసెన్షియల్ ఆయిల్స్, వెన్నను ఉపయోగించి తయారు చేసేది. క్లెన్సర్స్, టోనర్స్, ఫేస్‌మాస్క్‌లు, సీరమ్స్, కండీషనర్లు, మాయిశ్చరైజర్, జెల్, పెదవులు, కళ్లకు సంబంధించిన ఉత్పత్తులతోపాటు, షాంపులు, హెయిర్ ఆయిల్స్‌ను తయారు చేసి విక్రయిస్తోంది. మహిళలకేగాక, పురుషులకు సైతం బ్యూటీ ఉత్పత్తులను అందించడం విశేషం. ఇండియాలోనేగాక, యూకే, యూఎస్, మలేసియా, సింగపూర్, గల్ఫ్‌దేశాలకు సైతం కృతిక తన విల్వా ఉత్పత్తులను ఎగుమతి చేస్తోంది. వివిధ ఆన్లైన్ వేదికలపై విల్వా ఉత్పత్తులు లభ్యమవుతున్నాయి. -
సీవో2.. హాంఫట్!
ఇంట్లో రోజంతా కరెంటు ఉంటే గొప్ప కాకపోవచ్చు. కానీ... నెల తిరిగినా బిల్లు రాకపోతే అదీ గొప్ప! బాగానే ఉందిగానీ.. ఇదేమీ అయ్యే పని కాదు అనుకుంటున్నారా? సాధ్యం చేసేస్తున్నారు శాస్త్రవేత్తలు... కృత్రిమంగా తయారు చేసిన ఆకుల శక్తిని పదింతలు పెంచేశారు! కృత్రిమ ఆకులేమిటి? వాటి సామర్థ్యం పెంచేయడం ఏమిటి? ఇవేనా మీ ప్రశ్నలు. ఒక్కసారి చిన్నప్పటి సైన్స్ పుస్తకాల్లో చదువుకున్న ‘కిరణజన్య సంయోగక్రియ’ను నెమరేసుకుందాం. మొక్కల ఆకుల్లోని పత్రహరితం సూర్య కిరణాల సాయంతో శక్తిని తయారు చేసుకుంటుందని.. దీన్ని మొక్క పెరుగుదలకు వాడుకుంటుందని మనం చదివే ఉంటాం. ఈ క్రమంలో మనం వదిలేసే కార్బన్డయాక్సైడ్ (సీఓ2)ను పీల్చేసుకుని మొక్కలు ఆక్సిజన్ ఇస్తాయన్నది మనకు తెలిసిన విషయమే. అచ్చం ఇదే పద్ధతిలో పనిచేసే కొన్ని పరికరాలను శాస్త్రవేత్తలు ఇప్పటికే కొన్నింటిని తయారు చేశారుగానీ.. వాటి సామర్థ్యం తక్కువ.. ఖర్చు బోలెడంత ఎక్కువ. ఈ నేపథ్యంలో ఇల్లినాయి యూనివర్సిటీ శాస్త్రవేత్తలు మినీశ్ సింగ్, చేసిన తాజా పరిశోధనలు.. వాటి ఫలితాలకు ప్రాధాన్యం ఏర్పడింది. ఆకుల్లా పనిచేసే గాడ్జెట్లు (కృత్రిమ ఆకులు) పదింతలు ఎక్కువ విద్యుత్‌ను లేదా శక్తిని ఉత్పత్తి చేసేందుకు వినూత్నమైన డిజైన్‌ను సూచిస్తున్నారు. నమూనాలను కూడా రూపొందించి ఈ విషయాన్ని నిరూపించారు కూడా.. సమస్య ఏమిటి? శాస్త్రవేత్తలు ఇప్పటివరకూ తయారు చేసిన కృత్రిమ ఆకులు ఒత్తిడితో కూడిన కార్బన్‌డయాక్సైడ్‌ను వాడుకుంటాయి. ఇది వాస్తవ పరిస్థితుల్లో అసాధ్యం. ఎందుకంటే.. గాల్లోంచి వాడుకోవాలంటే.. కార్బన్‌డయాక్సైడ్‌ను వేరు చేయాలి.. ఒత్తిడికి గురి చేసి ట్యాంకుల్లో భద్రపరచాలి. ఆ తర్వాతగానీ ఇంధనం తయారు కాదన్నమాట. ఇదంతా వ్యయప్రయాసలతో కూడుకున్న విషయం. మినీశ్ సింగ్ ఈ సమస్యలకు ఓ చక్కటి పరిష్కారాన్ని సిద్ధం చేశారు. కృత్రిమ ఆకులను నీటితో నిండిన ఓ పెట్టెలో పెట్టడం.. ప్రత్యేకమైన లక్షణాలున్న పదార్థాన్ని కృత్రిమ ఆకు చుట్టూ ఏర్పాటు చేయడం ఇందులో కీలకం. సూర్యరశ్మి తాకిడికి నీరు వేడెక్కి ఆవిరైనప్పుడు అదికాస్తా.. ప్రత్యేక లక్షణాలున్న కవచం గుండా బయటకు వెళ్లిపోతూంటుంది. అదే సమయంలో గాల్లోని కార్బన్‌డయాక్సైడ్‌ను లోపలికి పీల్చుకునేలా ఈ ప్రత్యేక పదార్థంపై సూక్ష్మస్థాయి రంధ్రాలు ఉంటాయి. కృత్రిమ ఆకుపైన పూసిన పూత కారణంగా కార్బన్డయాక్సైడ్ కాస్తా కార్బన్ మోనాక్సైడ్గా మారిపోతుంది. కొంత మోతాదులో ఆక్సిజన్ కూడా విడుదల అవుతుంది. కార్బన్ మోనాక్సైడ్‌ను పెట్రోలు, డీజిల్ వంటి ఇంధనాల తయారీకి ముడిసరుకుగా పనిచేస్తుందన్నది తెలిసిందే. గాలినీ శుభ్రం చేస్తాయి.. మినీశ్ సింగ్ బృందం సిద్ధం చేసిన డిజైన్‌తో కొత్త తరం కృత్రిమ ఆకులను వాడటం వల్ల గాలి కూడా శుభ్రమవుతుంది. ఒక్కోటి 1.7 మీటర్ల పొడవు, 0.2 మీటర్ల వెడల్పు ఉండే కొత్త కృత్రిమ ఆకులను 500 చదరపు మీటర్ల వైశాల్యంలో అమర్చి చూసినప్పుడు చుట్టుపక్కల ఉన్న గాల్లోని కార్బన్డయాక్సైడ్ 10 శాతం వరకూ తగ్గిందని రుజువైంది. భవనాల పైకప్పులు మొదలుకొని అన్ని ప్రదేశాల్లోనూ వీటిని ఏర్పాటు చేసుకునే అవకాశం ఉండటం వల్ల అటు గాలిని శుభ్రం చేస్తూనే ఇటు ఇంధనాల ఉత్పత్తి చేసుకోవచ్చని ఈ ప్రయోగాల్లో పాల్గొన్న శాస్త్రవేత్త ఆదిత్య ప్రజాపతి అంటున్నారు. దాదాపు 360 కృత్రిమ ఆకులతో ఉత్పత్తి అయ్యే కార్బన్‌మోనాక్సైడ్ 500 కిలోల వరకూ ఉంటుందని.. చౌకైన, అందుబాటులో ఉన్న పదార్థాలతోనే తయారు చేస్తుండటం వల్ల ఇంధన ఉత్పత్తి ఖర్చు కూడా చాలా తక్కువగా ఉంటుందని ఆదిత్య చెబుతున్నారు. వాతావరణంలో ఎప్పటికప్పుడు పెరిగిపోతున్న కార్బన్‌డయాక్సైడ్‌ను నిరపాయకరంగా తొలగించడంతోపాటు ప్రయోజనకరంగా మార్చుకోగలగడం ఈ టెక్నాలజీ ప్రత్యేకత.. – సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
చైనాలో కృత్రిమ చందమామలు
-
కృత్రిమ రసాయనాలకు చెల్లు!
తినుబండారాలు, పానీయాలు ఎక్కువ కాలం నిల్వ ఉండేందుకు కృత్రిమ రసాయనాలను వాడతారన్నది అందరికీ తెలిసిందే. రెడీమేడ్ ఫుడ్‌ను తింటే జబ్బులొస్తాయని అనేదీ ఇందుకే. అయితే నాన్యాంగ్ టెక్నలాజికల్ యూనివఉఇటీ శాస్త్రవేత్తల పరిశోధనల పుణ్యమా అని ఇకపై కృత్రిమ ప్రిజర్వేటివ్స్ వాడాల్సిన అవసరం లేదు. వీటికంటే మెరుగైన, సహజసిద్ధమైన పదార్థాలతో తయారైన ప్రిజర్వేటివ్స్‌ను తాము అభివృద్ధి చేశామని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్తలవిలియం ఛెన్ తెలిపారు. కాయగూరలు, పండ్లలో ఉండే ఫైటో న్యూట్రియంట్స్, ఫ్లేవనాయిడ్లు ఆహారాన్ని నిల్వ చేసేందుకు వాడుకోవచ్చునని వీరు నిరూపించారు. అంతేకాదు.. ఫ్లేవనాయిడ్లతో బ్యాక్టీరియాను నాశనం చేసేందుకు కూడా వీరు ఒక పద్ధతిని అభివృద్ధి చేశారు. పండ్ల రసాలు, మాంసం ఉత్పత్తుల్లో ఈ కొత్త రకం ప్రిజర్వేటివ్స్‌ను వాడి మెరుగైన ఫలితాలు సాధించామని కృత్రిమ ప్రిజర్వేటివ్స్‌తో కూడిన ఆహార పదార్థంలో ఆరు గంటల్లోనే బ్యాక్టీరియా కనిపిస్తే సహజ ప్రిజర్వేటివ్స్ రెండు రోజులపాటు ఆహారాన్ని తాజాగా ఉంచగలిగాయని ఛెన్ వివరించారు. ఈ కొత్త ప్రిజర్వేటివ్స్‌ను మార్కెట్లోకి ప్రవేశపెట్టేందుకు తాము పారిశ్రామికవేత్తలతో మాట్లాడుతున్నామని చెప్పారు. పరిశోధన వివరాలు ఫుడ్ కెమిస్ట్రీ జర్నల్ తాజా సంచికలో ప్రచురితమయ్యాయి. -
చైనాలో ఆకట్టుకుంటున్న కృత్రిమ జలపాతం
-
చైనాలో కుత్రిమ జలపాతం
-
పట్టుదారం గుట్టు తెలిసింది..
పట్టు వస్త్రాలు కట్టుకుంటే వచ్చే లాభమేమిటి? అందంగా కనిపించడం కాసేపు పక్కనబెడితే.. పట్టు వస్త్రాలు శరీరాన్ని చలికాలంలో వెచ్చగా.. ఎండాకాలంలో చల్లగానూ ఉంచుతాయి. అయితే ఏంటి? అనొద్దు.. ఇలాంటివే అనేక మంచి లక్షణాలున్న పట్టు సూపర్ మెటా మెటీరియల్ అంటున్నారు పర్డ్యూ శాస్త్రవేత్తలు. పది నుంచి 20 మైక్రాన్ల మందం ఉండే పట్టుపోగుల్లో అతిసూక్ష్మమైన పోగులు మరిన్ని ఉంటాయని.. నానో స్థాయిలో ఉండే నిర్మాణాల కారణంగా దీనికి అనేక అద్భుత లక్షణాలు చేకూరుతున్నాయని యంగ్ కిమ్ అనే శాస్త్రవేత్త ప్రయోగపూర్వకంగా తెలుసుకున్నారు. ఈ లక్షణాలను పూర్తిగా అర్థం చేసుకుని అచ్చం ఇలాంటి నిర్మాణాలతో కృత్రిమ పదార్థాలను తయారు చేయవచ్చునని కిమ్ తెలిపారు. వైద్యరంగంతోపాటు బయోసెన్సింగ్లోనూ ఈ మెటా మెటీరియల్స్ ఎంతో ఉపయోగపడతాయని చెప్పారు. కాంతి కణాలను దాదాపుగా నిలువరించగల మెటామెటీరియల్స్ను ఇప్పటికే కృత్రిమంగా తయారు చేసినప్పటికీ వాణిజ్యస్థాయిలో.. చౌకగా ఉత్పత్తి చేయడం మాత్రం సాధ్యం కాలేదు. ఈ నేపథ్యంలో పట్టు వంటి సాధారణ పదార్థం ద్వారా మెటా మెటీరియల్ లక్షణాలను సాధించగలిగితే ఎన్నో ప్రయోజనాలు ఉంటాయని అంచనా. అంతే కాకుండా పట్టు దారాలు ఒకచోట ఉండే వేడిని ఇంకోచోటికి తరలించేందుకు, అది కూడా అతితక్కువ నష్టంతో జరిగేందుకు ఉపయోగపడతాయని కిమ్ చెబుతున్నారు. -
ఆర్టిఫిషియల్ ఆక్టో‘పట్టు’
సియోల్: అక్టోపస్ ఏ ప్రాణినైనా పట్టుకుందంటే దాని ఊపిరి తీసేంతవరకు వదలదు. అంతటి గట్టిపట్టునే శాస్త్రవేత్తలు కృత్రిమంగా సృష్టించారు. దీనిని ఎలక్ట్రానిక్, మెడికిల్ రంగాలలో వినియోగించనున్నారు. దక్షిణ కొరియాలోని సంగ్క్యున్క్వాన్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు పాలిమర్ షీట్లను ఉపయోగించి ఈ కృత్రిమ పట్టును సృష్టించారు. మృధువైన గోళాలవంటి నిర్మాణాలను కలిగి, 50 మైక్రో మీటర్ల సైజులో ఉన్న పాలిమర్ షీట్లతో ఈ పట్టును సాధించారు. ఆక్టోపస్ పట్టుత్వాన్ని సూక్ష్యదర్శినిలో పరిశీలించిన మీదట శాస్త్రవేత్తలు దీనిని తయారు చేశారు. ఇవి నీటిలో సమర్దవంతంగా పనిచేస్తాయి. ఈ గోళము వంటి నిర్మాణంలో ఖాళీ ప్రదేశం ఉండి అధిక పీడనాన్ని కలిగి ఉండడమే ఇందుకు కారణమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ ప్యాచ్‌లను వెయ్యిసార్లు ఉపయోగించవచ్చని, ఆ తర్వాత ఇవి కొంత పట్టును కోల్పోతాయని, మరింత పట్టుకోసం వీటిని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు.