ఆర్టిఫిషియల్‌ ఆక్టో‘పట్టు’ | With artificial 'octopus skin,' robots can bend and stretch while | Sakshi
Sakshi News home page

ఆర్టిఫిషియల్‌ ఆక్టో‘పట్టు’

Published Fri, Jun 16 2017 10:55 PM | Last Updated on Tue, Sep 5 2017 1:47 PM

ఆర్టిఫిషియల్‌ ఆక్టో‘పట్టు’

ఆర్టిఫిషియల్‌ ఆక్టో‘పట్టు’

సియోల్‌: అక్టోపస్‌ ఏ ప్రాణినైనా పట్టుకుందంటే దాని ఊపిరి తీసేంతవరకు వదలదు. అంతటి గట్టిపట్టునే శాస్త్రవేత్తలు కృత్రిమంగా సృష్టించారు. దీనిని ఎలక్ట్రానిక్, మెడికిల్‌ రంగాలలో వినియోగించనున్నారు. దక్షిణ కొరియాలోని సంగ్‌క్యున్‌క్వాన్‌ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు పాలిమర్‌ షీట్లను ఉపయోగించి ఈ కృత్రిమ పట్టును సృష్టించారు. మృధువైన గోళాలవంటి నిర్మాణాలను కలిగి, 50 మైక్రో మీటర్ల సైజులో ఉన్న పాలిమర్‌ షీట్లతో ఈ పట్టును సాధించారు.

ఆక్టోపస్‌ పట్టుత్వాన్ని సూక్ష్యదర్శినిలో పరిశీలించిన మీదట శాస్త్రవేత్తలు దీనిని తయారు చేశారు. ఇవి నీటిలో సమర్దవంతంగా పనిచేస్తాయి. ఈ గోళము వంటి నిర్మాణంలో ఖాళీ ప్రదేశం ఉండి అధిక పీడనాన్ని కలిగి ఉండడమే ఇందుకు కారణమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ ప్యాచ్‌లను వెయ్యిసార్లు ఉపయోగించవచ్చని, ఆ తర్వాత ఇవి కొంత పట్టును కోల్పోతాయని, మరింత పట్టుకోసం వీటిని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement