ప్రపంచ వ్యాప్తంగా కోకాకోలా గురించి తెలియని వారు ఉండరు అంటే ఏ మాత్రమే అతిశయోక్తి కాదు. ఎందుకంటే చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవారి వరకు కోక్ అంటే చాలు ఎగబడిపోతారు. గతంలో ఈ శీతల పానీయాలు చాలా ప్రమాదమంటూ కొన్ని వార్తలు తెరకెక్కాయి, కానీ అవన్నీ బలంగా నిలువలేకపోయాయి. అయితే ఇప్పుడు ఈ సంస్థకు ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) గట్టి షాక్ ఇవ్వడానికి సిద్ధమైంది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
నివేదికల ప్రకారం, కోకాకోలా (CocaCola)లో ఉపయోగించే కృత్రిమ స్వీటెనర్ ఆస్పర్టేమ్ క్యాన్సర్ కారకమని ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్దారించనుంది. ఆస్పర్టేమ్ అనే స్వీటెనర్ ప్రపంచ వ్యాప్తంగా చాలా ఉత్పత్తులలో విరివిగా ఉపయోగిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ స్వీటెనర్ వల్ల భవిష్యత్తులో క్యానర్ వచ్చే అవకాశాలు ఉన్నట్లు వాదనలు వినిపిస్తూనే ఉన్నాయి.
తాజాగా.. ప్రపంచ ఆరోగ్య సంస్థకు చెందిన క్యాన్సర్ పరిశోధనల విభాగం ‘ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ రీసెర్చ్ ఆన్ క్యాన్సర్ (IARC) ఈ స్వీటెనర్ వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని నిర్దారించింది. ఈ కారణంగా కోకాకోలా క్యాన్సర్ కారకం అవుతుందని త్వరలోనే ప్రకటించే అవకాశం ఉందని సంబంధిత వర్గాల సమాచారం.
(ఇదీ చదవండి: దంపతులిద్దరికీ అదే సమస్య.. వారికొచ్చిన ఐడియా ధనవంతులను చేసిందిలా!)
వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఈ అధికారిక ప్రకటన జులై నెలలో వెల్లడించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇదే జరిగితే ప్రపంచంలోని చాలా దేశాలు దీని వినియోగాన్ని నిషేధిస్తాయి, మరికొన్ని దేశాలు ఆంక్షలు విధించే అవకాశం ఉంది. అయితే ఐఏఆర్‌సీ ఈ ఆస్పర్టేమ్ ఎంత మోతాదులో తీసుకుంటే మంచిది, ఎంత మోతాదు దాటితే ప్రమాదం అనే దానికి సంబంధించిన వివరణ ఇవ్వలేదు.
1984లో వెలువడిన కొన్ని నివేదికలు ఆస్పర్టేమ్ తక్కువ మోతాదులో ప్రతి రోజూ తీసుకున్న ఎటువంటి ప్రమాదం లేదని వెల్లడించాయి. ఇన్ని రోజులూ వీటినే అనేక దేశాలు ఉదాహరణలుగా చెబుతూ ముందుకు సాగాయి. అయితే ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇది క్యాసర్ కారకం అని ప్రకటిస్తే.. ఆ తరువాత పరిణామాలు ఊహాతీతంగా ఉంటాయి.
Comments
Please login to add a commentAdd a comment