'కోకా-కోలా' (Coca-Cola) అనగానే అందరికి గుర్తొచ్చేది కూల్ డ్రింక్స్. ఈ సంస్థ ఇప్పుడు కొత్త విభాగంలో ప్రవేశించడానికి సిద్దమైనట్లు తాజాగా వెల్లడించింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
కూల్ డ్రింక్స్ విభాగంలో పాపులర్ బ్రాండ్‌గా ఎదిగిన కోకా కోలా ఇండియా టీ పానీయాల విభాగంలోకి ప్రవేశించడానికి సన్నద్ధమైంది. హానెస్ట్ టీ పేరుతో కొత్త ప్రొడక్ట్స్‌ను తీసుకురానున్నట్లు కోకాకోలా ఇండియా ఇటీవల వెల్లడించింది. ఈ ఉత్పత్తిని కోకా కోలా అనుబంధ సంస్థ 'హానెస్ట్' తీసుకురానున్నట్లు సమాచారం.
కోకా-కోలా టీ ఉత్పత్తి కోసం కంపెనీ లక్ష్మీ టీ ప్రైవేట్ లిమిటెడ్‌కు చెందిన మకైబారి టీ ఎస్టేట్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. దీంతో సంస్థ త్వరలోనే 'ఆర్గానిక్ ఐస్‌డ్ గ్రీన్ టీ'ని తీసుకురానుంది. కోల్‌కతాలో జరిగిన బెంగాల్ గ్లోబల్ బిజినెస్ సమ్మిట్ ఏడవ ఎడిషన్‌లో రెండు కంపెనీల మధ్య ఈ ఒప్పందం జరిగింది.
ఇదీ చదవండి: చిన్న గదిలో మొదలైన వ్యాపారం.. నేడు రూ.4000 కోట్ల సామ్రాజ్యంగా..!!
తమ కస్టమర్లకు టీ పానీయాలను అందించడంలో భాగంగానే కోకా-కోలా ఇండియా ఈ ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. కంపెనీ ఈ టీని ఐస్‌డ్ గ్రీన్ టీ లెమన్-తులసి, మ్యాంగో ఫ్లేవర్స్‌లో తీసుకురానున్నట్లు సమాచారం. దీని కోసం పూర్తిగా ఆర్గానిక్ పద్దతిలో ప్రత్యేకంగా లక్ష్మీ గ్రూప్ మకైబారి ఎస్టేట్ నుంచి సేకరించనున్నారు. త్వరలోనే కంపెనీ ఈ ఉత్పత్తులను మార్కెట్లో విడుదల చేయనున్నట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment