coca cola company
-
పెట్టుబడులకు స్వర్గధామం తెలంగాణ
సాక్షి, సిద్దిపేట: తెలంగాణ రాష్ట్రం ప్రపంచ పారిశ్రామిక పెట్టుబడులకు స్వర్గధామంగా నిలుస్తోందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చెప్పారు. వ్యాపార వృద్ధికి అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించడానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. సిద్దిపేట జిల్లా ములుగు మండలం బండ తిమ్మాపూర్‌లో హిందూస్థాన్ కోకాకోలా బెవరేజెస్ (హెచ్‌సీసీబీ) అత్యాధునిక గ్రీన్ ఫీల్డ్ ఫ్యాక్టరీని సీఎం రేవంత్ సోమవారం ప్రారంభించారు. పరిశ్రమలో కలియతిరిగి పరిశీలించారు. అనంతరం మాట్లాడారు. పరిశ్రమ ద్వారా వచ్చే ఉద్యోగాలతోపాటు పరోక్ష ఉపాధితో ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని చెప్పారు. పారిశ్రామిక వృద్ధి దిశగా చర్యలుహెచ్సీసీబీ పెట్టుబడులు ఈ ప్రాంతంలో పారిశ్రామిక వృద్ధి, పర్యావరణ పరిరక్షణ కలిసి సాగుతాయనే దానికి ఉదాహరణ అని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు చెప్పారు. బీసీ సంక్షేమ మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. ఉద్యోగ, ఉపాధి కల్పన ద్వారా రాష్ట్రంలో అన్ని వర్గాల సమ్మిళిత వృద్ధికి దోహదం చేస్తుందని పేర్కొన్నారు. అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ.. పర్యావరణ అనుకూల పారిశ్రామిక వృద్ధికి ఈ గ్రీన్ ఫీల్డ్ ఫ్యాక్టరీ ఉదాహరణ అని చెప్పారు. కగా.. హిందుస్థాన్ కోకాకోలా బెవరేజెస్ సీఈవో జువాన్ పాబ్లో రోడ్రిగ్జ్ మాట్లాడుతూ... రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుని నీటి పైప్‌లైన్‌ను త్వరగా పూర్తి చేసిందని, తెలంగాణ పట్ల తమ నిబద్ధతను చాటుకుంటామని చెప్పారు. హెచ్‌సీసీబీ తెలంగాణలో రూ.3,798 కోట్ల పెట్టుబడితో వెయ్యి మందికిపైగా ఉపాధి అవకాశాలను కల్పించిందని పేర్కొన్నారు. -
కోకాకోలా ఫ్యాక్టరీ ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి
సిద్దిపేట(తెలంగాణ)లోని బండ తిమ్మాపూర్‌లో 'హిందూస్థాన్ కోకాకోలా బెవరేజెస్' (HCCB) గ్రీన్‌ఫీల్డ్ ఫ్యాక్టరీని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, కొండా సురేఖతో పాటు.. హెచ్‌సీసీబీ సీఈఓ జువాన్ పాబ్లో రోడ్రిగ్జ్ మొదలైనవారు పాల్గొన్నారు.49 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ ఫ్యాక్టరీ నిర్మాణానికి మొత్తం రూ.2,091 కోట్లు పెట్టుబడి పెట్టారు. ఇందులో రూ.1,409 కోట్లు ఇప్పటికే ఉపయోగించినట్లు తెలుస్తోంది. ఇది పూర్తయిన తరువాత 410 మందికి ఉద్యోగావకాశాలు లభిస్తాయి. ఇప్పటికే సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లో కూడా ఓ హెచ్‌సీసీబీ కర్మాగారం ఉంది. మొత్తం మీద రాష్ట్రంలో హెచ్‌సీసీబీ తన ఉనికిని వేగంగా విస్తరిస్తోంది.హెచ్‌సీసీబీ ప్రారంభోత్సవం సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో వ్యాపార వృద్ధికి అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించడానికి మేము కట్టుబడి ఉన్నాము. ప్రపంచ పారిశ్రామిక పెట్టుబడులకు తెలంగాణ కేంద్రంగా నిలుస్తోందనటానికి హెచ్‌సీసీబీ పెట్టుబడులు ఓ ఉదాహరణ. హెచ్‌సీసీబీని మేము అభినందిస్తున్నాము. తెలంగాణ ఆర్థిక అభివృద్ధికి ఈ సంస్థ దోహదపడమే కాకుండా ఉద్యోగాలను కూడా సృష్టిస్తుందని అన్నారు.హిందుస్థాన్ కోకా కోలా బెవరేజెస్ సీఈఓ జువాన్ పాబ్లో రోడ్రిగ్జ్ పెట్టుబడుల గురించి మాట్లాడుతూ.. కంపెనీ వృద్ధి చెందే ప్రయాణంలో ఇది ఒక ముఖ్యమైన అడుగు. ఫ్యాక్టరీ కార్యకలాపాలకు కావలసిన సహాయ సహకారాలను రాష్ట్ర ప్రభుత్వం అందించిందని అన్నారు. -
రాష్ట్రంలో పెట్టుబడులకు డెల్టా ఎయిర్‌లైన్స్ ఆసక్తి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పెట్టుబడులకు డెల్టా ఎయిర్‌లైన్స్ సంస్థ ఆసక్తితో ఉందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి డి.శ్రీధర్‌బాబు తెలిపారు. శుక్రవారం అట్లాంటాలోని డెల్టా ఎయిర్‌లైన్స్ కార్యాలయంలో ఆ సంస్థ వైస్ ప్రెసిడెంట్ అండ్ సీటీఓ నారాయణన్ కృష్ణకుమార్‌తో తెలంగాణ మంత్రుల బృందం సమావేశమైంది. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు విస్తృత అవకాశాలు ఉన్నాయని, రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాలుగా సౌకర్యాలు కలి్పస్తుందని శ్రీధర్‌బాబు ఈ సందర్భంగా కంపెనీ ప్రతినిధులకు వివరించారు.ఏవియేషన్ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు హైదరాబాద్ గమ్యస్థానంగా మారిందని చెప్పారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు సుముఖంగా ఉన్నట్లు డెల్టా టీమ్ తెలిపిందని శ్రీధర్‌బాబు వెల్లడించారు. ఇలావుండగా శ్రీధర్‌బాబుతో పాటు పర్యటనలో పాల్గొన్న మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి.. హైదరాబాద్ నుంచి అట్లాంటాకు నేరుగా విమానం నడపాలని కృష్ణకుమార్‌ను కోరారు.నేరుగా విమాన సర్వీసులు లేకపోవడం వలన అమెరికాలో విద్యాభ్యాసం కోసం వచ్చే విద్యార్ధులు, ఇతర ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. దీనిపై సానుకూలంగా స్పందించిన కృష్ణకుమార్.. డెల్టా ఎయిర్‌లైన్స్ యాజమాన్యం ఈ దిశగా తక్షణం చర్యలు తీసుకుంటుందని హామీ ఇచ్చారు. ‘కోకో కోలా’ సానుకూల స్పందన అట్లాంటాలోని కోకో కోలా హెడ్ క్వార్టర్స్‌లో కంపెనీ అంతర్జాతీయ ప్రభుత్వ సంబంధాల విభాగ గ్రూప్ డైరెక్టర్ జోనాథాన్ రీఫ్‌తో కూడా మంత్రులు సమావేశమయ్యారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టాల్సిందిగా ఆహా్వనించారు. దాదాపు గంటన్నర పాటు జరిగిన సమావేశం సందర్భంగా తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు అనువైన పరిస్థితులను విజువల్ ప్రజెంటేషన్ ద్వారా మంత్రులు వివరించారు. రాష్ట్రంలో ఎక్కడ ప్లాంట్ స్థాపించినా అందుకు ప్రభుత్వం తరఫున సంపూర్ణ సహకారం అందేలా చర్యలు తీసుకుంటామని శ్రీధర్‌బాబు, కోమటిరెడ్డి హామీ ఇచ్చారు.పెట్టుబడులకు తెలంగాణ స్వర్గధామంగా మారిందని, రెండు దశాబ్దాలుగా హైదరాబాద్‌లో అంతర్జాతీయ కంపెనీల పెట్టుబడులు పెరిగాయని వివరించారు. సానుకూలంగా స్పందించిన జోనాథాన్ హైదరాబాద్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తిగా ఉన్నట్లు తెలిపారు. ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్, పెట్టుబడుల శాఖ ప్రత్యేక కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి మంత్రులతో ఉన్నారు. -
టీ ఉత్పత్తికి సిద్ధమైన పాపులర్ కూల్ డ్రింక్ బ్రాండ్
'కోకా-కోలా' (Coca-Cola) అనగానే అందరికి గుర్తొచ్చేది కూల్ డ్రింక్స్. ఈ సంస్థ ఇప్పుడు కొత్త విభాగంలో ప్రవేశించడానికి సిద్దమైనట్లు తాజాగా వెల్లడించింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. కూల్ డ్రింక్స్ విభాగంలో పాపులర్ బ్రాండ్‌గా ఎదిగిన కోకా కోలా ఇండియా టీ పానీయాల విభాగంలోకి ప్రవేశించడానికి సన్నద్ధమైంది. హానెస్ట్ టీ పేరుతో కొత్త ప్రొడక్ట్స్‌ను తీసుకురానున్నట్లు కోకాకోలా ఇండియా ఇటీవల వెల్లడించింది. ఈ ఉత్పత్తిని కోకా కోలా అనుబంధ సంస్థ 'హానెస్ట్' తీసుకురానున్నట్లు సమాచారం. కోకా-కోలా టీ ఉత్పత్తి కోసం కంపెనీ లక్ష్మీ టీ ప్రైవేట్ లిమిటెడ్‌కు చెందిన మకైబారి టీ ఎస్టేట్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. దీంతో సంస్థ త్వరలోనే 'ఆర్గానిక్ ఐస్డ్ గ్రీన్ టీ'ని తీసుకురానుంది. కోల్‌కతాలో జరిగిన బెంగాల్ గ్లోబల్ బిజినెస్ సమ్మిట్ ఏడవ ఎడిషన్‌లో రెండు కంపెనీల మధ్య ఈ ఒప్పందం జరిగింది. ఇదీ చదవండి: చిన్న గదిలో మొదలైన వ్యాపారం.. నేడు రూ.4000 కోట్ల సామ్రాజ్యంగా..!! తమ కస్టమర్లకు టీ పానీయాలను అందించడంలో భాగంగానే కోకా-కోలా ఇండియా ఈ ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. కంపెనీ ఈ టీని ఐస్డ్ గ్రీన్ టీ లెమన్-తులసి, మ్యాంగో ఫ్లేవర్స్‌లో తీసుకురానున్నట్లు సమాచారం. దీని కోసం పూర్తిగా ఆర్గానిక్ పద్దతిలో ప్రత్యేకంగా లక్ష్మీ గ్రూప్ మకైబారి ఎస్టేట్ నుంచి సేకరించనున్నారు. త్వరలోనే కంపెనీ ఈ ఉత్పత్తులను మార్కెట్లో విడుదల చేయనున్నట్లు సమాచారం. -
గాజా గాయాలు.. పార్లమెంట్ మెనూ నుంచి వాటి తొలగింపు!
ఇజ్రాయెల్-హమాస్ గ్రూప్ మధ్య జరుగుతున్న యుద్ధం ఒకవైపు భారీ ప్రాణ నష్టం.. మరోవైపు భారీ మానవతా సంక్షోభం దిశగా ముందుకెళ్తోంది. గాజాలో పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకోవాలని ప్రపంచ దేశాలు కోరుకుంటున్నాయి. అదే సమయంలో పాశ్చాత్య, మిడిల్ ఈస్ట్ దేశాల నడుమ రాజకీయ ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఇదిలా ఉండగా.. తుర్కియే(పూర్వపు టర్కీ) ప్రభుత్వం మంగళవారం కీలక నిర్ణయం తీసుకుంది. పార్లమెంట్ మెనూ నుంచి కోకాకోలా, నెస్లే ఉత్పత్తులను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. హమాస్‌తో జరుగుతున్న పోరులో ఇజ్రాయెల్‌కు ఆ కంపెనీలు మద్దతు ప్రకటించాయని, అందుకే వాటిని తమ పార్లమెంట్ క్యాంటీన్ నుంచి తొలగిస్తున్నట్లు రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్ నేతృత్వంలోని ప్రభుత్వం ప్రకటించింది. పార్లమెంట్ ప్రాంగణంలోని రెస్టారెంట్లలో, కఫేటేరియాల్లో, టీ హౌజ్‌లలో ఇకపై ఆయా ఉత్పత్తులను అమ్మకూడదని పార్లమెంట్ స్పీకర్ నుమాన్ కుర్తుల్మస్ పేరిట ఒక ప్రకటన వెలువడింది. మరోవైపు ఈ పరిణామంపై ఆ కంపెనీలు స్పందించాల్సి ఉంది. గాజాకు సంఘీభావంగా.. తమ దేశ ప్రజల డిమాండ్ మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పీకర్ ఆ ప్రకటనలో వెల్లడించారు. మరోవైపు గాజా దాడుల నేపథ్యంగా.. సోషల్ మీడియాలోనూ ఇజ్రాయెల్ ఉత్పత్తులను, పాశ్చాత్య దేశాల కంపెనీలను బహిష్కరించాలనే డిమాండ్ నానాటికీ పెరిగిపోతోంది. యుద్ధ వాతావరణ నేపథ్యంలో టర్కీ-ఇజ్రాయెల్ మధ్య వ్యాపార, వాణిజ్య సంబంధాలు ఇప్పటికే తీవ్రంగా దెబ్బ తిన్నాయి. -
ఈ చెట్టు లేకపోతే ప్రపంచంలో కూల్‌డ్రింక్స్ తయారీ కంపెనీల పరిస్థితి ఏంటో?
హాట్‌గా ఉన్న సమ్మర్లో ఏదైనా తాగాలి అంటే మనకు ముందుగా గుర్తొచ్చేది పెప్సీ, కోకో కోలా లాంటి సాఫ్ట్ డింక్సే. ఇప్పుడు ఈ శీతల పానియాల్ని తయారు చేస్తున్న కంపెనీలను ప్రపంచంలోని అతి పేద దేశాల్లో ఒకటైన సూడాన్ అంతర్యుద్ధం ఉక్కిరిబిక్కిరి చేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకు కారణం పెప్సీ, కోకోకోలా, ఫీజీ కూల్ డ్రింక్స్‌తో పాటు క్యాండీ (స్వీట్స్)లలో ఉపయోగించే ఓ పదార్ధం సుడాన్లో మాత్రమే లభ్యమవుతుంది. ఇప్పుడు ఆ పదార్ధం కొరత తయారీ కంపెనీలను తీవ్రంగా వేధిస్తోంది. సూడాన్‌లో కొనసాగుతున్న ఆధిపత్య పోరు ప్రపంచ దేశాలే కాదు.. అంతర్జాతీయ కంపెనీలను సైతం ఆందోళనకు గురిచేస్తోంది. ప్రొడక్ట్‌ల తయారీకి అంతరాయం కలగకుండా ఉండేలా సుడాన్లో దొరికే పదార్ధాన్ని సమకూర్చుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నాయి. పెప్సీ, కోకో కోలాలో ఉపయోగించే పదార్ధం పెప్సీ, కోకో కోలాలో సాధారణంగా ఉపయోగించే ముఖ్యమైన పదార్థం 'గమ్ అరబిక్'. పెప్సీ, కోకో కోలా కంపెనీలు తయారు చేసే సాఫ్ట్ డ్రింక్స్‌లో ఈ గమ్ అరబిక్‌ను కలుపుతారు. దీన్ని కలపడం వల్ల కూల్ డ్రింక్‌ను తయారీ కోసం వినియోగించే ఇంగ్రీడియంట్స్ విడిపోకుండా ఉంటాయి. లేదంటే ఇంగ్రీడియంట్స్ విడిపోయి రుచి, పచి ఉండవు. కాబట్టే తయారీ సంస్థలు ఈ గమ్ అరబిక్‌ను ఉపయోగిస్తాయి. ఇక ఆ పదార్ధం సుడాన్‌లోని అకాసియా చెట్టు నుంచి పూసే జిగురు తరహాలో ఉంటుంది. ఈ జిగురు ప్రపంచ దేశాలకు సూడాన్ నుండే రవాణా అవుతుంది. ప్రపంచంలో 70 శాతం గమ్ అరబిక్ సరఫరా ఆఫ్రికాలోని సూడాన్ గుండా ప్రవహించే సాహెల్ ప్రాంతం నుండి ఎగుమతి అవుతుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. వచ్చే 5-6 నెలల్లో గమ్ అరబిక్‌తో తయారు చేసిన ఉత్పత్తులు అయిపోవచ్చని ప్రధాన ఆహార, పానీయాల కంపెనీలకు గమ్ అరబిక్ సరఫరా చేసే కెర్రీ గ్రూప్ ప్రొక్యూర్మెంట్ మేనేజర్ రిచర్డ్ ఫిన్నెగన్ను ఉటంకిస్తూ రాయిటర్స్‌లోని ఓ నివేదిక పేర్కొంది. డచ్ సప్లయర్ ఫోగా గమ్ భాగస్వామి మార్టిజెన్ బెర్గ్కాంప్ ఇదే తరహా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చదవండి👉 బ్యాంక్ ఉద్యోగులకు కేంద్రం గుడ్‌న్యూస్.. వారానికి 5 రోజులే పని దినాలు! 'గమ్ అరబిక్' ఉత్పత్తి ఏటా ప్రపంచవ్యాప్తంగా 120.000 బిలియన్ డాలర్ల విలువైన 1,1,500 టన్నుల గమ్ అరబిక్ ఉత్పత్తి అవుతుందని కెర్రీ గ్రూప్ అంచనా వేసింది. తూర్పు నుండి పశ్చిమ ఆఫ్రికా వరకు 500 మైళ్ళలో విస్తరించి ఉన్న ప్రాంతం నుండి ఈ గమ్‌ను సేకరిస్తారు. గమ్ అరబిక్ లేకపోతే పెప్సీ, కోకాకోలా వంటి దిగ్గజాలు తమ ఉత్పత్తులలో గమ్ అరబిక్ లేకుండా తమ ఉనికిని కాపాడుకోవడం సాధ్యం కాదని అగ్రిగమ్ మార్కెటింగ్ డైరెక్టర్ డాని హద్దాద్ చెప్పారు. ఫిజీ డ్రింక్స్ వంటి ఉత్పత్తుల్లో గమ్ అరబిక్కు ప్రత్యామ్నాయం లేదని నిపుణులు చెబుతుండగా.. సూడాన్ అంతర్యుర్ధం ముగింపుపై ప్రపంచ దేశాలకు చెందిన దిగ్గజ కంపెనీలు సైతం ఐక్యారాజ్య సమితి వేదికగా తమ గొంతుకను వినిపిస్తున్నాయి. 500 మందికి పైగా మృతి సాయుధ బలగాల నడుమ జరుగుతున్న ఆ ఆధిపత్య పోరులో నార్త్ ఆఫ్రీకా దేశమైన సూడాన్ అతలాకుతలమవుతోంది. పారామిలిటరీ ర్యాపిడ్ ఫోర్స్‌ను ఆర్మీలో విలీనం చేయాలనే ప్రతిపాదన.. ఈ రెండు వర్గాల నడుమ ఘర్షణలకు దారి తీసింది. సూడాన్ రాజధాని ఖార్తోమ్తో పాటు దేశంలో పలు చోట్ల ఈ ఘర్షణలు కొనసాగుతుండగా.. సాధారణ పౌరులు ఇబ్బంది పడుతున్నారు. ఘర్షణలు మొదలైన ఏప్రిల్ 15 నుంచి ఇప్పటివరకు (మే1) లక్ష మందికిపైగా పౌరులు సూడాన్‌ను వీడినట్లు ఐక్యరాజ్య సమితి వెల్లడించింది. మరో 3.30 లక్షల మంది నిరాశ్రయులయ్యారని తెలిపింది. మరోవైపు, ఈ హింసాత్మక ఘర్షణల్లో ఇప్పటివరకు 500 మందికిపైగా మృతిచెందగా.. నాలుగు వేల మందికి పైగా గాయపడ్డారు. చదవండి👉 ‘ఆఫీస్‌కి వస్తారా.. లేదంటే!’, వర్క్ ప్రమ్ హోం ఉద్యోగులకు దిగ్గజ టెక్ కంపెనీల వార్నింగ్ -
తెలంగాణకు మరో భారీ ప్రాజెక్టు.. రూ.1000 కోట్ల పెట్టుబడులు
దేశీ దిగ్గజ కంపెనీ విప్రోతో పాటు మల్టీ నేషనల్ ఫార్మా సంస్థ జాంప్ల తర్వాత మరో భారీ ప్రాజెక్టు తెలంగాణకు వచ్చింది. హిందూస్థాన్ కోకకోలా బేవరేజేస్ సంస్థ రూ. 1000 కోట్ల పెట్టుబడి పెడుతోంది. ఈ విషయాన్ని గురువారం మంత్రి కేటీఆర్ ట్విట్టర్ ద్వారా తెలిపారు. సిద్ధిపేట సమీపంలో భారీ ప్లాంటు నిర్మాణం జరుపుకోబోతుంది. తెలంగాణలో భారీ బేవరేజెస్ ప్లాంటు నిర్మించడంతో పాటు సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్, వేస్ట్ వాటర్ మేనేజ్మెంట్ అండ్ స్కిలింగ్ విభాగంలో తెలంగాణ కలిసి పని చేసేందుకు ప్రభుత్వంతో హిందూస్థాన్ కోకకోల సంస్థ ఒప్పందం చేసుకుంది. ఈ సందర్భంగా తెలంగాణలో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్ కూడా పెట్టాలంటూ హిందూస్థాన్ బేవరేజెస్‌ని మంత్రి కేటీఆర్ కోరారు. హిందూస్థాన్ కోకకోల బేవరేజేస్ కంపెనీతో ఎంవోయూ కుదరిన సందర్బంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ... సిద్ధిపేట సమీపంలోని బండ తిమ్మాపూర్ దగ్గరున్న ఫుడ్ పార్క్‌లో ఈ ప్లాంటు నిర్మాణం జరగబోతుందని తెలిపారు. మొదటి దశలో రూ. 600 కోట్లతో ప్లాంట్ నిర్మాణం చేపట్టి రెండో దశలో రూ. 400 కోట్లతో ప్లాంట్‌ను విస్తరిస్తారని తెలిపారు. ఈ ప్లాంట్‌లో 50 శాతం ఉద్యోగాలు మహిళలకే కేటాయిస్తారని తెలిపారు. జగిత్యాలలో ఉన్న మామిడి పండ్లు, నల్గొండ దగ్గరున్న నిమ్మ ఉత్పత్తులు ఉపయోగించుకునేలా ప్రణాళిక రూపాందించుకోవాలంటూ హెచ్‌సీసీబీ ప్రతినిధులకు మంత్రి కేటీఆర్ సూచించారు. ఇండియాలో ఉన్న ప్రముఖ ఎఫ్ఎంసీజీ కంపెనీల్లో హిందూస్థాన్ బేవరేజ్ సంస్థ ఒకటి. మాన్యుఫ్యాక్చరింగ్, ప్యాకేజింగ్, సెల్లింగ్, డిస్ట్రిబ్యూషన్ రంగాల్లో ఈ సంస్థ సేవలు అందిస్తోంది. మినిట్ మైడ్, స్ప్రైట్, మోన్స్టర్, థమ్సప్, లిమ్కా వంటి ప్రముఖ బ్రాండు ఈ సంస్థకు చెందినవిగా ఉన్నాయి. Delighted to announce that @HCCB_Official will be setting up a state of the art new plant in Telangana with an investment of ₹1,000 Cr Have also entered into MoU with Telangana Govt on solid waste, waste water management & Skilling. Also urged them to consider tech R&D center pic.twitter.com/SZV2GvCP4M — KTR (@KTRTRS) April 7, 2022 చదవండి: Jamp Pharma: కెనడా వెలుపల తొలి ఎక్స్‌లెన్స్ సెంటర్ హైదరాబాద్‌లో.. -
Thums Up: ఎట్టకేలకు ఆ ఘనత సాధించిన శీతల పానీయ సంస్థ
నిదానమే ప్రధానం అనే నానుడి శీతల పానీయ బ్రాండ్ థమ్స్ అప్‌కు సరిగ్గా సరిపోతుంది. ప్యాకేజ్డ్ డ్రింక్స్ మార్కెట్లో నెమ్మదిగా.. స్థిరంగా వ్యాపారవృద్ధిని సాధించుకుంటూ వస్తున్న థమ్స్ అప్ ఇప్పుడు అరుదైన ఫీట్ సాధించింది. ఎప్పటి నుంచో ఊరిస్తూ వస్తున్న ‘బిలియన్ డాలర్ల బ్రాండ్’ ఘనత ఎట్టకేలకు దక్కింది. 1977లో కోలా కింగ్ రమేష్ చౌహాన్ థమ్స్ అప్ శీతల పానీయ బ్రాండ్‌ను ప్రారంబించిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి భారత బేవరేజెస్ మార్కెట్లో దీని హవా కొనసాగుతోంది. స్వదేశీ బ్రాండే అయినప్పటికీ ప్రస్తుతం ఇది కోకా కోలా కింద ఉంది. అయితే కిందటి ఏడాది అమ్మకాల్లో (2021)లో బిలియన్ డాలర్ మార్క్‌ను(7,500 కోట్ల రూపాయలకు పైగా బిజినెస్) దాటేసింది థమ్స్ అప్. గ్లోబల్ బేవరేజెస్ మార్కెట్లో బిలియన్ డాలర్ల మార్కెట్ ఉన్న కంపెనీలు చాలా ఉన్నా.. థమ్స్ అప్ ఈ మార్క్‌ను స్వదేశీ ట్యాగ్‌తో అందుకోవడమే ఇక్కడ కొసమెరుపు. ‘‘మా స్థానిక థమ్స్ అప్ బ్రాండ్ మార్కెటింగ్ ప్రణాళిక, సరైన ఐడియాలతో భారతదేశంలో బిలియన్-డాలర్ల బ్రాండ్‌గా అవతరించింది. థమ్స్ అప్ ఇప్పుడు భారతదేశంలో బిలియన్ డాలర్ల బ్రాండ్” అని కోకా కోలా కంపెనీ CEO జేమ్స్ క్విన్సీ గర్వంగా ప్రకటించుకున్నారు. స్వదేశీ తయారీ కూల్ డ్రింక్ అయిన థమ్స్ అప్ను 1993లో కోకాకోలా సొంతం చేసుకుంది. పార్లే బిస్లరీ వ్యవస్థాపకుడు, ఇండియన్ కోలా కింగ్ రమేష్ చౌహాన్ నుంచి ఈ బ్రాండ్‌ను కొనుగోలు చేసింది కోకా కోలా. థమ్స్ అప్‌తో పాటు మాజా, ఆ టైంలో సూపర్ హిట్ అయిన కూల్ డ్రింక్ బ్రాండ్ గోల్డ్ స్పాట్‌ను సైతం కొనుగోలు చేసేసింది. -
కోకాకోలా ఇప్పుడు సరికొత్తగా ...!
ప్రముఖ మల్టీనేషనల్ బెవెరేజస్ కంపెనీ కోకాకోలా కీలక నిర్ణయం తీసుకుంది. కొత్త గ్లోబల్ బ్రాండ్ ఫిలాసఫీ, ప్లాట్‌ఫాంను కోకాకోలా ఆవిష్కరించింది. కౌగిలింతలాగా చుట్టి ఉన్న కోకాకోలా పేరు రియల్ మ్యాజిక్ అనే ట్యాగ్‌తో కొత్త లోగోను లాంచ్ చేసింది. ఈ కొత్త లోగో కాన్సెప్ట్‌ను వీడెన్+కెన్నెడీ రూపకల్పన చేసినట్లు తెలుస్తోంది. కాగా ఇన్విజిబుల్ బాటిల్ లో బెవెరేజస్ డ్రింక్‌ను కోకాకోలా అందించనున్నట్లు తెలుస్తోంది. అందుకు సంబంధించిన వీడియోను కోకాకోలా రిలీజ్ చేసింది. కోకాకోలా బ్రాండ్ చరిత్రలో అత్యంత విభిన్న దృశ్య ప్రాతినిధ్యమని కోకాకోలా కంపెనీ గ్లోబల్ వైస్ ప్రెసిడెంట్, రఫా అబ్రూ అన్నారు. చదవండి: బుకింగ్‌లో మహీంద్రా ఎక్స్యువి 700 ఎస్యూవి సరికొత్త రికార్డు కోకాకోలాకు అదొక చీకటి రోజు...! 2021 జూన్ 18 నెలలో యూరో ఛాంపియన్షిప్ ప్రెస్ మీట్ సందర్భంగా పోర్చుగల్ స్టార్ ప్లేయర్ రొనాల్డో.. తనకు ఎదురుగా ఉన్న కోక్ బాటిళ్లను చిరాకుగా పక్కనపెట్టి, మంచి నీళ్లకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించిన విషయం తెలిసిందే. రొనాల్డో ప్రెస్మీట్లో.. వాటర్ బాటిల్ పైకెత్తి ‘అగ్వా’(పోర్చుగ్రీసు భాషలో మంచినీళ్లు అని అర్థం) అని కామెంట్ చేయగా అప్పట్లో ఈ వీడియో తెగ సంచలనమైంది. కోకాకోలాకు చీకటి రోజైంది. రొనాల్డో కామెంట్ ఎఫెక్ట్ మార్కెట్‌పై దారుణంగా చూపెట్టింది. కోకా కోలా స్టాక్ ధరలు 1.6 శాతానికి పడిపోయి.. 238 బిలియన్ల అమెరికన్ డాలర్లకు చేరింది. అంతకు ముందు కోకా కోలా విలువ 248 బిలియన్ల డాలర్లు ఉండింది. దీంతో 4 బిలియన్ల డాలర్లు(మన కరెన్సీలో 29 వేల కోట్ల దాకా) నష్టం వాటిల్లింది. కోకాకోలా లోగో ఏం చెప్తుదంటే...! కోకాకోలా లోగోలో రెడ్ కలర్.. అభిరుచి, బలం,లవ్‌ను సూచిస్తుంది. వైట్ కలర్...అమాయకత్వం, యువత, శాంతి, స్వచ్ఛత, వినయాలను సూచిస్తోంది. చదవండి: RRR Actress Invests: ఆ కంపెనీలో భారీగా ఇన్వెస్ట్ చేసిన ఆర్ఆర్ఆర్ బ్యూటీ..! -
దిగ్గజ కంపెనీలు.. ఒక్క నిమిషపు ఆదాయమెంతో తెలుసా?
సాక్షి, వెబ్‌డెస్క్: అమెజాన్, గూగుల్, యాపిల్, మైక్రోసాఫ్ట్, ఫేస్బుక్, నెట్‌ఫ్లిక్స్.. దిగ్గజ కంపెనీలుగా ఒక వెలుగు వెలుగుతున్నాయి. రకరకాల సర్వీసులతో ఈ బడా బడా కంపెనీలు ప్రజలకు చేరువ అయ్యాయి.. ఇంకా అవుతూనే ఉన్నాయి. వాటి ద్వారా వెళ్తున్న ఆదాయం బిలియన్ల డాలర్లలో ఉంటుందన్నది ఊహించిందే. కానీ, ఆ కంపెనీలు నిమిషానికి ఎంత సంపాదిస్తాయో ఊహించగలరా? ఈ క్యూరియాసిటీని గుర్తించిన టెక్ నిపుణుడు..జర్నలిస్ట్ జోన్ ఎర్లిచ్‌మన్ ఒక అంచనాతో ఈ విషయంపై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. అమెజాన్ కంపెనీ నిమిషం రెవెన్యూ 8,37,000 అమెరికన్ డాలర్లు(మన కరెన్సీలో ఆరున్నర కోట్ల రూపాయల దాకా ఉండొచ్చు)!, ఆ తర్వాతి ప్లేస్‌లో యాపిల్ 6,92,000 డాలర్లు(ఐదు కోట్లుపైనే) ఉంది. గూగుల్ 4,23,000 డాలర్లు(మూడు కోట్ల రూపాయలపైనే), మైక్రోసాఫ్ట్ 3,22,000 డాలర్లు, ఫేస్బుక్ రెవెన్యూ నిమిషానికి 2,02,000 డాలర్లు, డిస్నీ కంపెనీ లక్షా ఇరవై వేల డాలర్లు, టెస్లా ఎనభై వేల డాలర్లు, కోకా కోలా 70,000 డాలర్లు, నెట్‌ఫ్లిక్స్ 55 వేల డాలర్లు, కాఫీ స్టోర్ల ఫ్రాంఛైజీ స్టార్‌బక్స్ 52,000 డాలర్లు, మెక్ డొనాల్డ్స్ 40 వేలడాలర్లుగా నిమిషపు రెవెన్యూ ఉందని, ఇంటర్నేషనల్ మార్కెట్ లెక్కల ప్రకారం(జులై రెండోవారం).. ఇది ఒక అంచనా మాత్రమేనని ఎర్లిచ్‌మన్ స్పష్టం చేశాడు. ఇక రోజూ వారీ లాభం సుమారు యాపిల్ ఒక్కరోజు లాభం 240 మిలియన్ అమెరికన్ డాలర్లు(సుమారు 1,700 కోట్లు)గా ఉంది. గూగుల్ 182 మిలియన్ డాలర్లు, మైక్రోసాఫ్ట్ 162 మిలియన్ డాలర్లు, ఫేస్బుక్ 109 మిలియన్ డాలర్లు, అమెజాన్ 102 అమెరికన్ డాలర్లుగా ఉంది. మొత్తంగా వీటి రోజూవారీ లాభం అంతా కలిసి 795 మిలియన్ అమెరికన్ డాలర్లుగా ఉండొచ్చని తెలుస్తోంది. బిలియన్ సంపాదనకు.. 1994లో ప్రారంభమైన అమెజాన్ ఐదేళ్లలో బిలియన్ సంపాదన మార్క్‌ను చేరుకోగా, గూగుల్ ఐదేళ్లలో, యాపిల్ ఆరేళ్లలో, ఉబెర్ ఆరేళ్లలో, పేపాల్ ఏడేళ్లలో, ట్విటర్ ఎనిమిదేళ్లలో, నెట్‌ఫ్లిక్స్ తొమిదేళ్లలో బిలియన్ రెవెన్యూను ఖాతాలో వేసుకోగలిగాయి. -
కోకా కోలా వివాదం: ఫెవికాల్ అదిరిపోయే యాడ్, నెటిజన్లు ఫిదా!
యూరో ఫుట్‌బాల్ ఛాంపియన్షిప్ ప్రెస్ మీట్ సందర్భంగా పోర్చుగల్ స్టార్ ప్లేయర్ రొనాల్డో.. తనకు ఎదురుగా ఉన్న కోక్ బాటిళ్లను చిరాకుగా పక్కనపెట్టి, మంచి నీళ్లకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించిన విషయం తెలిసిందే. కొద్దిసేపటికే ఈ వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. రొనాల్డో చేసిన ఈ చర్యతో కోకా కోలా కంపెనీ షేర్లు బోరుమన్నాయి. ఒక్కసారిగా కోకా కోలా షేర్లకు సుమారు 4 మిలియన్ల డాలర్ల నష్టం వాటిల్లింది. ఆసక్తికరమైన ప్రకటనల విషయానికి వస్తే తనకంటూ ఒక సముచిత స్థానాన్ని ఏర్పరచుకున్న ఫెవికాల్, తాజాగా ఒక పోస్ట్‌ను ట్విటర్లో షేర్ చేసింది. రోనాల్డో కోకాకోలా బాటిళ్లను తొలగించే విషయంపై ఫెవికోల్ కంపెనీ ఇన్‌డైరక్ట్‌గా కోకాకోలాకు అదిరిపోయే సూచన చేసింది. ఫెవికాల్ తన ట్విటర్ పోస్ట్‌లో.. రొనాల్డో హజరైన ప్రెస్‌మీట్‌ను పోలి ఉన్న ఫోటోలో, కోకాకోలా బాటిళ్లకు బదులు ఫెవికోల్ డబ్బాలను ఏర్పాటు చేసింది. వీటిని ఎవరూ అక్కడి నుంచి తీయలేరు. అంతేకాకుండా కంపెనీ షేర్ విలువ కూడా పడిపోయేది (నా బాటిల్ హేటేగీ, నా వాల్యుయేషన్ ఘటేగి)కాదని.. సూచిస్తూ వ్యంగ్యంగా కోకాకోలాకు సూచించింది. కోకాకోలా బాటిళ్లు అక్కడి నుంచి తీయకుండా ఉండేందుకు ఫెవికాల్ అంటించి ఉంటే కోకాకోలాకు ఈ పరిస్ధితి వచ్చేదికాదని పేర్కొంది. కాగా ప్రస్తుతం ఈ పోస్ట్‌ను చూసి నెటిజన్లు ఫిదా అయ్యారు. ఫెవికాల్ మార్కెట్ స్ట్రాటజీను చూసి నెటిజన్లు ఔరా..! అంటూ రిట్వీట్ చేస్తున్నారు. కాగా అప్పుడప్పుడు కొన్ని సందర్బాల్లో ప్రపంచవ్యాప్తంగా జరిగే సంఘటనలపై ఫెవికోల్ వ్యంగ్యంగా జవాబిస్తూ తన మార్కెట్‌ను పెంచుకుంటుంది. Haye ni mera Coka Coka Coka Coka Coka#Euro2020 #Ronaldo #MazbootJod #FevicolKaJod pic.twitter.com/lv6YWrgfxB — Fevicol (@StuckByFevicol) June 17, 2021 Cristiano Ronaldo was angry because they put Coca Cola in front of him at the Portugal press conference, instead of water! 😂 He moved them and said "Drink water" 😆pic.twitter.com/U1aJg9PcXq — FutbolBible (@FutbolBible) June 14, 2021 చదవండి: బాటిల్సే కాదు.. ఏం ముట్టుకున్నా మోతే ఇక! -
కోకా కోలా.. ఆల్కాహాల్ డ్రింక్
సాక్షి, హైదరాబాద్ : కోకాకోలా కంపెనీ తొందర్లోనే ఆల్కహాలిక్ డ్రింక్‌ను లాంచ్ చేయబోతుంది. 125 సంవత్సరాల చరిత్ర కలిగిన తమ కంపెనీ జపాన్‌లో ఈ డ్రింక్‌ను విడుదల చేయబోతున్నట్టు కోకా కోలా జపాన్ విభాగం అధ్యక్షుడు జార్జ్ గార్డునూ తెలిపారు. ‘ఇది మద్యంతో కూడిన ఒక పానీయం. సాంప్రదాయకంగా షాచ్, మెరిసే నీరు, అదనంగా ప్రత్యేక రుచిని కలిగి ఉన్న పానీయంతో తయారు చేస్తార’ని ఆయన వెల్లడించారు. ఇది జపాన్‌లో ప్రాచుర్యం పొందిన చు-హాయ్ పానీయాలను పోలి ఉంటుందని.. దీన్ని ద్రాక్ష, స్ట్రాబెర్రీ, తెల్ల పీచు, కివి షాచ్ వంటి పలు రుచులు వోడ్కాతో తయారుచేస్తామని కోకాకోలా ప్రకటించింది. ఇందులో 3 నుంచి 8 శాతం ఆల్కహాల్ పరిమాణం ఉంటుందని తెలిపింది. ప్రజలు మద్యపానాన్ని, కూల్ డ్రింక్‌ను కలిపి తాగుతున్నారని.. వేర్వేరు బాటిల్స్ అక్కర్లేకుండా రెండు కలిపి ఒకే సీసాలో తామే తయారు చేస్తున్నట్టు వెల్లడించింది. ఈ డ్రింక్ జపాన్ సాంప్రదాయానికి దగ్గరగా ఉంటుందని వివరించింది. -
తొందరలో కోకా కోలా కొత్త బీర్
కోకా కోలా(125 ఏళ్ల చరిత్రలో) కంపెనీ మొదటిసారిగా అల్కాహాలిక్ డ్రింక్‌ను ప్రవేశపెట్టే ఆలోచనలో ఉంది. జపాన్‌లో స్థానికంగా లభించే 'షోచు' అనే స్పిరిట్‌తో తయారు చేసే చు-హి అనే క్యాన్డ్ ఫ్లేవర్డ్ డ్రింక్స్ బాగా అమ్ముడుపోతున్నాయి. ఈ నేపథ్యంలో కోకా కోలా ఈ నిర్ణయం తీసుకుంది. ఈ డ్రింక్‌లో 3 నుంచి 8 శాతం అల్కాహాల్ ఉండే అవకాశం ఉంది. వీటిని అల్కోపాప్ అని పిలుస్తారు. అల్కోపాప్ డ్రింకులను సులభంగా తాగే అవకాశం ఉండడం వల్ల యువత దాని వైపు ఎక్కువగా మొగ్గుచూపుతోంది. అందువల్ల ఇలాంటి డ్రింకులపై జపాన్‌లో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. 'గతంలో అల్కాహాల్ విభాగంలో మేము ఎప్పుడూ ఇలాంటి ప్రయోగం చేయలేదు. అయితే కొత్త ప్రాంతాల్లో అవకాశాలను రావడానికి ఇదో మంచి మార్గం' అని కోకా కోలా జపాన్ అధ్యక్షుడు జోర్జ్ గార్డునో తెలిపారు. అయితే జపాన్‌లో ఇలాంటి డ్రింకులకు బాగా డిమాండ్ ఉంది. బీరులకు ప్రత్యామ్నాయంగా ఈ డ్రింకులను విక్రయిస్తున్నారు. జపాన్ మహిళలు దీనిపై చాలా ఆసక్తి చూపిస్తారు. -
సల్మాన్ ఖాన్‌కు మరో ఎదురుదెబ్బ
సుల్తాన్ సినిమా విజయంతో మంచి జోరుమీదున్న బాలీవుడ్ ముదురు బ్యాచిలర్ సల్మాన్ ఖాన్‌కు అనుకోకుండా ఎదురుదెబ్బ తగిలింది. ఇన్నాళ్ల బట్టి థమ్సప్ యాడ్ అంటే సల్మానే గుర్తుకువచ్చేవాడు. కానీ ఇప్పుడు కోకాకోలా సంస్థ అతడిని తప్పించింది. ఇప్పటికి నాలుగేళ్లుగా ఈ ప్రకటనలలో సల్మాన్ కనిపిస్తూ వచ్చాడు. ఈ బంధాన్ని ఇప్పుడు ఆ సంస్థ తెంచుకుంది. ఆయన స్థానంలో ఇప్పుడు రణవీర్ సింగ్‌ను తీసుకుంటారని భావిస్తున్నారు. గత నెలతోనే సల్లూభాయ్‌తో ఒప్పందం గడువు ముగిసింది. ఇక దాన్ని పొడిగించకూడదని కంపెనీ నిర్ణయించుకుంది. దీనిపై వ్యాఖ్యానించేందుకు కోకా కోలా సంస్థ నిరాకరించింది. సల్మాన్ ఖాన్‌కు ఇప్పటికే 50 ఏళ్ల వయసు దాటడంతో.. కోకా కోలా బ్రాండ్లు ఎప్పుడూ యంగ్‌గా ఉండాలని, అందువల్ల ముసలి హీరోలను పెట్టుకోవడం సరికాదని భావించి ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. అందుకే రణవీర్ సింగ్ లాంటి యువహీరోలైతే బాగుంటుందని కంపెనీ వర్గాలు అన్నాయి. పాకిస్థానీ నటీనటులను భారతీయ సినిమాల్లో పనిచేయడానికి అనుమతించాలంటూ సల్మాన్ వ్యాఖ్యనించినప్పటి నుంచి వివాదం ముదిరింది. సల్మాన్ ఆ వ్యాఖ్యలు చేసిన 20 రోజులకు కోకాకోలా నిర్ణయం వచ్చింది. కోకా కోలా సంస్థకు ప్రచారం చేసినందుకు సల్మాన్‌కు ఏడాదికి రూ. 5 కోట్లు ముడతాయి. 2012 నుంచి థమ్సప్ బ్రాండుకు ప్రచారకర్తగా సల్మానే ఉంటున్నాడు. అంతకుముందు అక్షయ్ కుమార్ ఈ ప్రకటన చేసేవాడు.