
కోకా కోలా(125 ఏళ్ల చరిత్రలో) కంపెనీ మొదటిసారిగా అల్కాహాలిక్ డ్రింక్‌ను ప్రవేశపెట్టే ఆలోచనలో ఉంది. జపాన్‌లో స్థానికంగా లభించే 'షోచు' అనే స్పిరిట్‌తో తయారు చేసే చు-హి అనే క్యాన్డ్ ఫ్లేవర్డ్ డ్రింక్స్ బాగా అమ్ముడుపోతున్నాయి. ఈ నేపథ్యంలో కోకా కోలా ఈ నిర్ణయం తీసుకుంది. ఈ డ్రింక్‌లో 3 నుంచి 8 శాతం అల్కాహాల్ ఉండే అవకాశం ఉంది. వీటిని అల్కోపాప్ అని పిలుస్తారు. అల్కోపాప్ డ్రింకులను సులభంగా తాగే అవకాశం ఉండడం వల్ల యువత దాని వైపు ఎక్కువగా మొగ్గుచూపుతోంది. అందువల్ల ఇలాంటి డ్రింకులపై జపాన్‌లో వ్యతిరేకత వ్యక్తమవుతోంది.
'గతంలో అల్కాహాల్ విభాగంలో మేము ఎప్పుడూ ఇలాంటి ప్రయోగం చేయలేదు. అయితే కొత్త ప్రాంతాల్లో అవకాశాలను రావడానికి ఇదో మంచి మార్గం' అని కోకా కోలా జపాన్ అధ్యక్షుడు జోర్జ్ గార్డునో తెలిపారు. అయితే జపాన్‌లో ఇలాంటి డ్రింకులకు బాగా డిమాండ్ ఉంది. బీరులకు ప్రత్యామ్నాయంగా ఈ డ్రింకులను విక్రయిస్తున్నారు. జపాన్ మహిళలు దీనిపై చాలా ఆసక్తి చూపిస్తారు.
Comments
Please login to add a commentAdd a comment