సల్మాన్ ఖాన్‌కు మరో ఎదురుదెబ్బ
సల్మాన్ ఖాన్‌కు మరో ఎదురుదెబ్బ
Published Wed, Oct 19 2016 8:10 PM | Last Updated on Mon, Sep 4 2017 5:42 PM
సుల్తాన్ సినిమా విజయంతో మంచి జోరుమీదున్న బాలీవుడ్ ముదురు బ్యాచిలర్ సల్మాన్ ఖాన్‌కు అనుకోకుండా ఎదురుదెబ్బ తగిలింది. ఇన్నాళ్ల బట్టి థమ్సప్ యాడ్ అంటే సల్మానే గుర్తుకువచ్చేవాడు. కానీ ఇప్పుడు కోకాకోలా సంస్థ అతడిని తప్పించింది. ఇప్పటికి నాలుగేళ్లుగా ఈ ప్రకటనలలో సల్మాన్ కనిపిస్తూ వచ్చాడు. ఈ బంధాన్ని ఇప్పుడు ఆ సంస్థ తెంచుకుంది. ఆయన స్థానంలో ఇప్పుడు రణవీర్ సింగ్‌ను తీసుకుంటారని భావిస్తున్నారు. గత నెలతోనే సల్లూభాయ్‌తో ఒప్పందం గడువు ముగిసింది. ఇక దాన్ని పొడిగించకూడదని కంపెనీ నిర్ణయించుకుంది. దీనిపై వ్యాఖ్యానించేందుకు కోకా కోలా సంస్థ నిరాకరించింది.
సల్మాన్ ఖాన్‌కు ఇప్పటికే 50 ఏళ్ల వయసు దాటడంతో.. కోకా కోలా బ్రాండ్లు ఎప్పుడూ యంగ్‌గా ఉండాలని, అందువల్ల ముసలి హీరోలను పెట్టుకోవడం సరికాదని భావించి ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. అందుకే రణవీర్ సింగ్ లాంటి యువహీరోలైతే బాగుంటుందని కంపెనీ వర్గాలు అన్నాయి. పాకిస్థానీ నటీనటులను భారతీయ సినిమాల్లో పనిచేయడానికి అనుమతించాలంటూ సల్మాన్ వ్యాఖ్యనించినప్పటి నుంచి వివాదం ముదిరింది. సల్మాన్ ఆ వ్యాఖ్యలు చేసిన 20 రోజులకు కోకాకోలా నిర్ణయం వచ్చింది. కోకా కోలా సంస్థకు ప్రచారం చేసినందుకు సల్మాన్‌కు ఏడాదికి రూ. 5 కోట్లు ముడతాయి. 2012 నుంచి థమ్సప్ బ్రాండుకు ప్రచారకర్తగా సల్మానే ఉంటున్నాడు. అంతకుముందు అక్షయ్ కుమార్ ఈ ప్రకటన చేసేవాడు.
Advertisement