thums up brand
-
రెండేళ్లలో ఆ టార్గెట్‌ని చేరుకుంటాం: కోకా–కోలా
వచ్చే రెండేళ్లలో తమ పోర్ట్‌ఫోలియోలోని ‘మాజా’ సాఫ్ట్ డ్రింక్ కూడా బిలియన్ డాలర్ బ్రాండ్‌గా ఎదుగుతుందని అంచనా వేస్తున్నట్లు కోకా–కోలా ప్రెసిడెంట్ (భారత్, ఆగ్నేయాసియా) సంకేత్ రే తెలిపారు. వాస్తవానికి 2023లోనే ఈ మైలురాయి సాధించవచ్చని ముందుగా భావించినప్పటికీ ప్రతికూల వాతావరణ పరిస్థితులు, మామిడి గుజ్జు ధరలు పెరిగిపోవడం మొదలైన అంశాల వల్ల కుదరలేదని పేర్కొన్నారు. వచ్చే ఏడాది ఏ విధంగా ఉంటుందో ముందుగా అంచనా వేయలేమని, అయితే 2024 నాటికి మాత్రం తమ లక్ష్యాన్ని తప్పకుండా సాధించే అవకాశాలు ఉన్నాయని రే వివరించారు. కంపెనీకి చెందిన థమ్స్ అప్, స్ప్రైట్ సాఫ్ట్ డ్రింకులు ఈ ఏడాదే బిలియన్ డాలర్ బ్రాండ్లుగా ఎదిగిన నేపథ్యంలో అల్ఫాన్సో రకం మామిడి గుజ్జు నుండి తయారు చేసే మాజా కూడా సదరు మైలురాయిని దాటితే పోర్ట్‌ఫోలియోలో మూడోది అవుతుంది. ఆ రెండింటి ఎంట్రీ మంచిదే.. రిలయన్స్ రిటైల్, టాటా కన్జూమర్ ప్రోడక్ట్స్ (టీసీపీఎల్) వంటి దిగ్గజాలు కూడా శీతల పానీయాల విభాగంలోకి ప్రవేశిస్తుండటంపై స్పందిస్తూ.. ఇది సానుకూల పరిణామమేనని రే అభిప్రాయపడ్డారు. మార్కెట్ మరింతగా పెరుగుతుందని, అంతిమంగా వినియోగదారులకు మరింత ప్రయోజనం చేకూరగలదని ఆయన పేర్కొన్నారు. అయితే, రెండింటి ఎంట్రీతో ధరపరంగా పెద్ద పోటీ లేకపోయినప్పటికీ, స్థానిక స్థాయిలో కొన్ని పెను మార్పులు చోటు చేసుకుని కన్సాలిడేషన్‌కు దారి తీయొచ్చని రే వివరించారు. శీతల పానీయాల మార్కెట్లోకి ప్రవేశించే ఉద్దేశంతో రిలయన్స్ రిటైల్ ఇటీవలే దేశీ బ్రాండ్ కాంపా కోలాను కొనుగోలు చేయగా, టీసీపీఎల్ క్రమంగా బెవరేజెస్ మార్కెట్లో విస్తరిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా కార్యకలాపాలు సాగిస్తున్న కోకా–కోలాకు భారత్ అయిదో అతి పెద్ద మార్కెట్‌గా ఉంది. చదవండి: అమెజాన్ యూజర్లకు అదిరిపోయే ఆఫర్, ఏడాదికి రూ.599కే -
Thums Up: ఎట్టకేలకు ఆ ఘనత సాధించిన శీతల పానీయ సంస్థ
నిదానమే ప్రధానం అనే నానుడి శీతల పానీయ బ్రాండ్ థమ్స్ అప్‌కు సరిగ్గా సరిపోతుంది. ప్యాకేజ్డ్ డ్రింక్స్ మార్కెట్లో నెమ్మదిగా.. స్థిరంగా వ్యాపారవృద్ధిని సాధించుకుంటూ వస్తున్న థమ్స్ అప్ ఇప్పుడు అరుదైన ఫీట్ సాధించింది. ఎప్పటి నుంచో ఊరిస్తూ వస్తున్న ‘బిలియన్ డాలర్ల బ్రాండ్’ ఘనత ఎట్టకేలకు దక్కింది. 1977లో కోలా కింగ్ రమేష్ చౌహాన్ థమ్స్ అప్ శీతల పానీయ బ్రాండ్‌ను ప్రారంబించిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి భారత బేవరేజెస్ మార్కెట్లో దీని హవా కొనసాగుతోంది. స్వదేశీ బ్రాండే అయినప్పటికీ ప్రస్తుతం ఇది కోకా కోలా కింద ఉంది. అయితే కిందటి ఏడాది అమ్మకాల్లో (2021)లో బిలియన్ డాలర్ మార్క్‌ను(7,500 కోట్ల రూపాయలకు పైగా బిజినెస్) దాటేసింది థమ్స్ అప్. గ్లోబల్ బేవరేజెస్ మార్కెట్లో బిలియన్ డాలర్ల మార్కెట్ ఉన్న కంపెనీలు చాలా ఉన్నా.. థమ్స్ అప్ ఈ మార్క్‌ను స్వదేశీ ట్యాగ్‌తో అందుకోవడమే ఇక్కడ కొసమెరుపు. ‘‘మా స్థానిక థమ్స్ అప్ బ్రాండ్ మార్కెటింగ్ ప్రణాళిక, సరైన ఐడియాలతో భారతదేశంలో బిలియన్-డాలర్ల బ్రాండ్‌గా అవతరించింది. థమ్స్ అప్ ఇప్పుడు భారతదేశంలో బిలియన్ డాలర్ల బ్రాండ్” అని కోకా కోలా కంపెనీ CEO జేమ్స్ క్విన్సీ గర్వంగా ప్రకటించుకున్నారు. స్వదేశీ తయారీ కూల్ డ్రింక్ అయిన థమ్స్ అప్ను 1993లో కోకాకోలా సొంతం చేసుకుంది. పార్లే బిస్లరీ వ్యవస్థాపకుడు, ఇండియన్ కోలా కింగ్ రమేష్ చౌహాన్ నుంచి ఈ బ్రాండ్‌ను కొనుగోలు చేసింది కోకా కోలా. థమ్స్ అప్‌తో పాటు మాజా, ఆ టైంలో సూపర్ హిట్ అయిన కూల్ డ్రింక్ బ్రాండ్ గోల్డ్ స్పాట్‌ను సైతం కొనుగోలు చేసేసింది. -
ఇది సాఫ్ట్ కాదు.. తుఫాన్.. రౌడీ తుఫాన్
యాక్షన్ సీక్వెన్స్‌లో తన ఫ్యాన్స్‌కి విజువల్ ఫీస్ట్ అందించాడు రౌడీ హీరో విజయ్ దేవరకొండ. లేటెస్ట్ థమ్సప్ యాడ్‌లో విజయ్ దేవరకొండ దుమ్మురేపాడు. కేవలం 45 సెకన్ల పాటే ఉన్న యాడ్‌లో విజయ్ మిషన్ ఇంపాజిబుల్ రేంజ్ యాక్షన్‌తో అదరగొట్టాడు. థమ్సప్ యాడ్ ప్రారంభంలో... సార్, సాఫ్ట్ డ్రింక్ కావాలా అంటూ బాయ్ వచ్చి అడుగుతాడు.. అతనికేసి తిరిగిన విజయ్.. వెండితెర చూడమంటూ సైగ చేస్తాడు. బిగ్ స్క్రీన్‌పై 30 సెకన్ల పాటు ఉన్న పోరాట దృశ్యాలు రెప్ప వాల్చనివ్వవు. సెకన్ బై సెకన్ హై వోల్టేజ్ యాక్షన్స్ సీన్లలో రెచ్చిపోయాడీ రౌడీ హీరో. ఆ యాక్షన్ అడ్వెంచర్ షాక్ నుంచి తేరుకోకముందే మళ్లీ ప్రత్యక్షమైన విజయ్. ఇది స్టాఫ్ డ్రింక్ కాదు తమ్ముడూ... తుఫాన్ అని చెప్పడంలో యాడ్ ముగుస్తుంది. హెవీ యాక్షన్ మూవీ లైగర్ రిలీజ్‌కి ముందే యాక్షన్‌తో తుఫాన్ సృష్టించాడు విజయ్ దేవరకొండ. (అడ్వెటోరియల్) -
Mahesh Babu: మహేశ్... ఇట్స్ ఏ బ్రాండ్
సూర్య ఇది పేరు కాదు ఇట్స్ ఏ బ్రాండ్ అంటూ బిజినెస్‌మేన్ సినిమాలో మహేశ్‌బాబు చెప్పిన డైలాగ్‌కి బాక్సాఫీస్ దద్దరిల్లింది. వెండితెరపై మహేశ్‌బాబు చేసే యాక్టింగ్‌కే కాదు డైలాగ్ డెలివరీకి, మ్యానరిజమ్ మూమేంట్స్కి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అందువల్లే మహేశ్‌లోని క్రేజ్‌తో తమ బ్రాండ్ల బిజినెస్ పెంచుకునేందుకు కార్పొరేట్ కంపెనీలు క్యూలు కడుతున్నాయి. బ్రాండ్ అంబాసిడర్‌గా తెలుగు రాష్ట్రాల సరిహద్దులు చెరిపేసి నేషనల్ లెవల్‌కి వెళ్లిపోయాడు మన మహేశ్. సాక్షి, వెబ్‌డెస్క్: టాలీవుడ్లో మహేశ్ బాబుకు ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. ఆ మాటకొస్తే మోస్ట్ డిజైరబుల్ జాబితాల ద్వారా జాతీయ స్థాయి గుర్తింపు దక్కించుకున్న హీరో కూడా మహేశే. పాతిక సినిమాలు పూర్తికాక ముందే స్టార్ హీరో రేసులో టాప్ పొజిషన్‌కు చేరడమే కాదు.. హ్యాండ్సమ్ హీరోగానూ మహేష్‌కి పేరుంది. ఈ ట్యాగ్ లైన్ టాలీవుడ్‌కే పరిమితం కాలేదు.. మిగతా భాషల్లోనూ హీరోల అందగాళ్ల జాబితాలోనూ మహేశ్ష్కు చోటు దక్కింది.అందువల్లే ఒకటి కాదు రెండు కాదు డజన్ల కొద్దీ బ్రాండ్లు తమ అంబాసిడర్‌గా మహేశ్‌బాబుని ఎంచుకున్నాయి. సూపర్ స్టార్ ప్రచార పవర్‌కి సలాం కొడుతున్నాయి. వాట్నాట్ కూల్‌డ్రింక్ యాడ్‌తో మొదలైన మహేశ్ యాడ్ ఛరిష్మా.. ఇప్పుడు దాదాపు అన్నింటా పాకింది. బైకులు, సోపులు, బట్టలు, ఈ కామర్స్, మొబైల్ బ్రాండ్స్ వాట్ నాట్ అన్నింటీ మహేశే కావాలన్నట్టుగా బడా కంపెనీలు పోటీ పడుతున్నాయి,. మహేశ్ నటించే యాడ్స్‌ని తీసే బాధ్యతలను ఏస్ డైరెక్టర్లుగా ఉన్న త్రివిక్రమ్ శ్రీనివాస్, కొరటాల శివలాంటి వారికి అప్పగిస్తున్నాయి. మహేశే ఎందుకు మురారీ, అతడు, సీతమ్మ వాకిట్లో, శ్రీమంతుడుతో ఫ్యామిలీ ఆడియెన్స్‌ని ఒక్కడుతో మాస్‌ని, పోకిరితో యూత్‌లో ఫుల్ ఫ్యాన్ ఫాలోయింగ్‌ని సాధించిన మహేశ్ ఇప్పటికీ కాలేజ్ బాయ్‌లా కనిపిస్తుంటాడు. అందువల్లే యాడ్లలో మహేశ్ అప్పీయరెన్స్ ఆయన ఫ్యాన్స్‌నే కాదు ఫ్యామిలీ ఆడియొన్స్‌ను సైతం ఫిదా చేస్తుంది. పిల్లల నుంచి పెద్దల వరకు అందరినీ ఆకట్టుకోవాలంటే మహేశ్‌కే ప్రథమ ప్రాధాన్యం ఇస్తున్నాయి కార్పోరేట్ కంపెనీలు. అందుకే బైజూస్ నుంచి మొదలు పెడితే టూత్‌బ్రష్, వంటనూనె, బంగారం, బట్టలు, పెర్ఫ్యూమ్, బైకులు, కూల్‌డ్రింక్, మొబైల్స్, ఎలక్ట్రానిక్ గృహోపకరణాలు ఇలా అన్నింటా బ్రాండ్ అంబాసిడర్‌గా మహేశ్ కనిపిస్తున్నారు. వేరియేషన్స్ వెండితెరపై కూల్ లుక్‌తో కనిపించే మహేశ్‌కు బుల్లితెరపైనా వచ్చే యాడ్స్‌లో జేమ్స్‌బాండ్ తరహాలో రెచ్చిపోతుంటారు. ముఖ్యంగా థమ్స్యాడ్స్ అన్నీ సూపర్ యాక్షన్ సీక్వెన్స్‌లతోనే వస్తున్నాయి. ప్రొడక్ట్ ఏదైనా సరే ఆ యాడ్‌లో మహేశ్ అలా నడిచి వచ్చి ఇలా ఓ లుక్క్ ఇచ్చి తనదైన స్టైల్లో రెండు మాటలు చెబితే చాలు ఆ బ్రాండ్ జనాల మదిలో రిజిస్టరై పోతుంది. రన్నింగ్ సిగ్నేచర్ సిల్వర్ స్త్రీన్‌పై మహేశ్‌బాబు రన్నింగ్ సీన్లకే ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. మురారీలో అరటితోటలో మొదలెట్టిన రన్నింగ్ టక్కరి దొంగ, పోకిరి, సీతమ్మ మీదుగా ఇప్పటికీ ఆగడం లేదు. ఈ రన్నింగ్ సీన్లని ఓ కూల్ డ్రింక్ కంపెనీ విపరీతంగా వాడేసుకుంటోంది. ఈ కంపెనీకి ఇతర భాషల్లో ఇప్పటికే పలువురు హీరోలని మార్చినా తెలుగు లో మాత్రం మహేశ్ అలానే ఉన్నాడు. లిస్టు పెద్దదే సోషల్ మీడియాలో టాలీవుడ్‌కు ఫాలోయింగ్ పాఠాలు నేర్పించిన మహేశ్.. సౌత్‌లోనే ఎక్కువ బ్రాండ్లకు అంబాసిడర్‌గా ఉన్నాడు. సోషల్ క్యాంపెయిన్స్లోనూ ముందుండే మహేశ్ ఓ ప్రముఖ పిల్లల హాస్పిటల్కూ గుడ్‌విల్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నాడు. ఇక కార్పోరేట్ బ్రాండింగ్ విషయానికి వస్తే మహేశ్ ఇప్పటి వరకు డెన్వర్ డియోడరంట్, ఫ్లిప్‌కార్ట్, క్లోజ్అప్, గోల్డ్ విన్నర్, ప్రోవోగ్ సూపర్ కలెక్షన్, ఐడియా సెల్యూలార్, టాటా స్కై, పారగాన్, టీవీఎస్ మోటార్, సంతూర్, అమృతాంజన్, రాయల్‌స్టాగ్, మహీంద్రా ట్రాక్టర్స్, సౌతిండియా షాపింగ్ మాల్, బైజూస్, నవరత్న, ఐటీసీ వివెల్ షాంపూ, జాస్ అలుకాస్, యూనివర్సల్ సెల్, ప్రోవోగ్, ల్యాయిడ్, గోద్రేజ్, సూర్యా డెవలపర్స్, కార్దేఖో, అభిబస్ ఇలా అనేక బ్రాండ్లకు ప్రచారం చేశారు. దీపం ఉండగానే దీపం ఉండగానే ఇళ్లు.. క్రేజ్ ఉండగానే కమర్షియల్ కెరీర్ చక్కబెట్టుకోవాలి అనేది మన సెలబ్రిటీలకు బాగా వంటపట్టిన విషయం. అందుకే ఓ వైపు వెండితెర వేల్పుగా రెండు చేతులా సంపాదిస్తూనే మరోవైపు కమర్షియల్ యాడ్స్‌లో జిగేల్మంటూ మరికొంత సంపాదిస్తుంటారు. జనాల్లో ఉన్న క్రేజ్‌ను బట్టి వారికి పారితోషం ఇస్తుంటారు. ఇప్పటికే పలువురు సినిమా హీరోలు కమర్షియల్ యాడ్స్ చేస్తూ బాగానే సంపాదిస్తున్నారు. అయితే వీరిలో మహేశ్ బాబు ప్రప్రథమంగా చెప్పుకోవాల్సి ఉంటుంది. వరస హిట్లతో దూసుకెళుతున్న మహేశ్ బాబు ఇటు సినిమాలు చేస్తూ అటు యాడ్స్ కూడా చేస్తూ బాగానే సంపాదిస్తున్నారు. అయితే వీటన్నిటికీ ప్రిన్స్ ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడనేదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ప్రిన్స్ మహేశ్ బాబు ఒక్కో ఎండార్స్మెంట్కి రూ. 5 కోట్లకు పైగానే పారితోషికం తీసుకున్నట్లు సమాచారం. -
షాకిచ్చిన కోర్టు.. ఐదు లక్షల ఫైన్
న్యూఢిల్లీ: శీతల పానీయాలు థమ్సప్, కోకాకోలాలు ఆరోగ్యానికి హానికరం.. నిషేధించాలంటూ పిల్ దాఖలు చేసిన వ్యక్తికి సుప్రీం కోర్టు షాక్ ఇచ్చింది. పిటిషనర్ చట్ట ప్రక్రియను దుర్వినియోగం చేశారని, ఆయన చేసిన వాదనలను నిరూపించలేకపోయారంటూ రూ.5లక్షల జరిమానా విధించింది. వివరాలు.. చావ్డా అనే వ్యక్తి కోకాకోలా, థమ్స్ అప్ ఆరోగ్యానికి హానికరం.. వాటిని నిషేధించాలంటూ సుప్రీం కోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. పిటిషనర్ తరపు వాదనలు విన్న తరువాత న్యాయమూర్తులు డి.వై.చంద్రచుడ్, హేమంత్ గుప్తా, అజయ్ రాస్తోగిలతో కూడిన ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం ‘పిటిషనర్ ఒక 'సామాజిక కార్యకర్త' అని చెప్పుకుంటున్నారు. పిటిషనర్‌కు ఈ విషయంపై సాంకేతిక పరిజ్ఞానం లేకుండానే పిటిషన్ దాఖలైంది. అతని వాదనలు నిరూపించబడలేదు. అతనికి జరిమానా విధించడం సమంజసం. అందుకే అతడికి రూ. 5లక్షల జరిమానా విధిస్తున్నాం’ అని తెలిపారు. ఒక నెలలోపు 5 లక్షల రూపాయలను టాప్ కోర్ట్ రిజిస్ట్రీలో జమ చేయాలని.. అదే మొత్తాన్ని సుప్రీంకోర్టు న్యాయవాదుల రికార్డ్ అసోసియేషన్‌కు పంపిణీ చేయాలని కోర్టు చావ్డాను ఆదేశించింది. -
థమ్సప్‌లో పురుగులు..
తూర్పుగోదావరి, సీతానగరం: మండలంలోని వెదుళ్లపల్లి ఇసుక ర్యాంపు వద్ద గల షేక్ మహ్మద్ నజీమా థమ్స్ అప్ కూల్‌డ్రింక్ తాగి, అపస్మారకస్థితికి చేరుకుని ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్యసేవలు పొందుతున్న ఘటన ఇది.(చిన్న జీతం.. పెద్ద మనసు) వివరాల్లోకి వెళితే.. శుక్రవారం వెదుళ్లపల్లి ర్యాంపు వద్ద నజీమా చిన్నపాటి టిఫిన్ హోటల్ ఉంది. అందులో అల్పాహారం వండుతూ అలసిపోయిన ఆమె పక్కనే ఉన్న కూల్ డ్రింక్ షాపు నుంచి అరలీటర్లు థమ్స్ అప్ బాటిల్ తెప్పించుకుంది. బాటిల్ అందుకుని కూల్‌డ్రింక్ తాగుతుండగా దుర్వాసన రావడంతో బాటిల్‌ను పరిశీలించింది. అందులో పురుగులు కనిపించాయి. డ్రింక్ తాగిన నజీమాకు వాంతులు మొదలై అపస్మారక స్థితికి చేరుకుంది. కుటుంబ సభ్యులు ఆమెను సీతానగరం బస్టాండ్ వద్దగల శ్రీరమా నర్సింగ్ హోమ్‌లో చేర్చగా, వైద్యసేవలు పొందుతోంది. ఎటువంటి ప్రమాదం లేదని వైద్యులు తెలపడంతో కుటుంబ సభ్యులు ఊపిరిపీల్చుకున్నారు.(విషం కలిసిన కూల్‌డ్రింక్ తాగిన చిన్నారులు) -
మహేష్ ఎన్నడూ చేయని యాక్షన్ సీన్స్ చేశాడట!
సూపర్‌స్టార్ మహేష్ బాబు రన్నింగ్.. యాక్షన్స్ సీన్స్‌కు ఉండే క్రేజే వేరు. పోకిరిలో మహేష్ బాబు పరిగెత్తే సీన్స్‌కు థియేటర్స్‌లో విజిల్స్ పడ్డాయి. ఇక యాక్షన్స్ సీన్స్‌లో మహేష్ మ్యానరిజం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే సినిమాల్లో ఇన్ని యాక్షన్ సీన్స్ చేసిన మహేష్.. ఒక వాణిజ్య ప్రకటన కోసం కూడా హాలీవుడ్ లెవల్లో యాక్షన్ సీన్స్ చేశారు. మహేష్ బాబు ఇటు సినిమాలతో అటు ప్రకటనలతో ఎప్పుడూ అభిమానులను పలకరిస్తూనే ఉంటారు. తాజాగా థమ్స్ అప్ యాడ్‌లో మహేష్ చేసిన యాక్షన్ సీన్స్ అభిమానులను ఉర్రూతలూగిస్తున్నాయి. మహేష్ సైతం ఈ యాడ్ గురించి సోషల్‌మీడియాలో చెపుతూ.. ఇలాంటి యాక్షన్ సీన్స్‌తో నేనెప్పుడు చేయని యాడ్..అంటూ వీడియోను కూడా పోస్ట్ చేశారు. ప్రస్తుతం మహేష్ బాబు.. హైదరాబాద్‌లో వేసిన భారీ విలెజ్ సెట్లో ‘మహర్షి’ షూటింగ్లో బిజీగా ఉన్నాడు. View this post on Instagram One of the most action-packed ads that I’ve ever been a part of. Excited to share with you guys! Enjoy the Chase! #TasteTheThunder @thumsupofficial A post shared by Mahesh Babu (@urstrulymahesh) on Nov 24, 2018 at 4:57am PST -
సల్మాన్ ఖాన్‌కు మరో ఎదురుదెబ్బ
సుల్తాన్ సినిమా విజయంతో మంచి జోరుమీదున్న బాలీవుడ్ ముదురు బ్యాచిలర్ సల్మాన్ ఖాన్‌కు అనుకోకుండా ఎదురుదెబ్బ తగిలింది. ఇన్నాళ్ల బట్టి థమ్సప్ యాడ్ అంటే సల్మానే గుర్తుకువచ్చేవాడు. కానీ ఇప్పుడు కోకాకోలా సంస్థ అతడిని తప్పించింది. ఇప్పటికి నాలుగేళ్లుగా ఈ ప్రకటనలలో సల్మాన్ కనిపిస్తూ వచ్చాడు. ఈ బంధాన్ని ఇప్పుడు ఆ సంస్థ తెంచుకుంది. ఆయన స్థానంలో ఇప్పుడు రణవీర్ సింగ్‌ను తీసుకుంటారని భావిస్తున్నారు. గత నెలతోనే సల్లూభాయ్‌తో ఒప్పందం గడువు ముగిసింది. ఇక దాన్ని పొడిగించకూడదని కంపెనీ నిర్ణయించుకుంది. దీనిపై వ్యాఖ్యానించేందుకు కోకా కోలా సంస్థ నిరాకరించింది. సల్మాన్ ఖాన్‌కు ఇప్పటికే 50 ఏళ్ల వయసు దాటడంతో.. కోకా కోలా బ్రాండ్లు ఎప్పుడూ యంగ్‌గా ఉండాలని, అందువల్ల ముసలి హీరోలను పెట్టుకోవడం సరికాదని భావించి ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. అందుకే రణవీర్ సింగ్ లాంటి యువహీరోలైతే బాగుంటుందని కంపెనీ వర్గాలు అన్నాయి. పాకిస్థానీ నటీనటులను భారతీయ సినిమాల్లో పనిచేయడానికి అనుమతించాలంటూ సల్మాన్ వ్యాఖ్యనించినప్పటి నుంచి వివాదం ముదిరింది. సల్మాన్ ఆ వ్యాఖ్యలు చేసిన 20 రోజులకు కోకాకోలా నిర్ణయం వచ్చింది. కోకా కోలా సంస్థకు ప్రచారం చేసినందుకు సల్మాన్‌కు ఏడాదికి రూ. 5 కోట్లు ముడతాయి. 2012 నుంచి థమ్సప్ బ్రాండుకు ప్రచారకర్తగా సల్మానే ఉంటున్నాడు. అంతకుముందు అక్షయ్ కుమార్ ఈ ప్రకటన చేసేవాడు.