![Worms in Thums Up Woman Illness With Drink East Godavari - Sakshi](/styles/webp/s3/article_images/2020/06/6/thumsup_0.jpg.webp?itok=pfOhtU5t)
కూల్‌డ్రింక్‌లో పురుగులు , అపస్మారక స్థితికి చేరుకున్న నజీమా
తూర్పుగోదావరి, సీతానగరం: మండలంలోని వెదుళ్లపల్లి ఇసుక ర్యాంపు వద్ద గల షేక్ మహ్మద్ నజీమా థమ్స్ అప్ కూల్‌డ్రింక్ తాగి, అపస్మారకస్థితికి చేరుకుని ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్యసేవలు పొందుతున్న ఘటన ఇది.(చిన్న జీతం.. పెద్ద మనసు)
వివరాల్లోకి వెళితే.. శుక్రవారం వెదుళ్లపల్లి ర్యాంపు వద్ద నజీమా చిన్నపాటి టిఫిన్ హోటల్ ఉంది. అందులో అల్పాహారం వండుతూ అలసిపోయిన ఆమె పక్కనే ఉన్న కూల్ డ్రింక్ షాపు నుంచి అరలీటర్లు థమ్స్ అప్ బాటిల్ తెప్పించుకుంది. బాటిల్ అందుకుని కూల్‌డ్రింక్ తాగుతుండగా దుర్వాసన రావడంతో బాటిల్‌ను పరిశీలించింది. అందులో పురుగులు కనిపించాయి. డ్రింక్ తాగిన నజీమాకు వాంతులు మొదలై అపస్మారక స్థితికి చేరుకుంది. కుటుంబ సభ్యులు ఆమెను సీతానగరం బస్టాండ్ వద్దగల శ్రీరమా నర్సింగ్ హోమ్‌లో చేర్చగా, వైద్యసేవలు పొందుతోంది. ఎటువంటి ప్రమాదం లేదని వైద్యులు తెలపడంతో కుటుంబ సభ్యులు ఊపిరిపీల్చుకున్నారు.(విషం కలిసిన కూల్‌డ్రింక్ తాగిన చిన్నారులు)
Comments
Please login to add a commentAdd a comment