ఇది సాఫ్ట్‌ కాదు.. తుఫాన్‌.. రౌడీ తుఫాన్‌ | Vijay Devarakonda Thunder Performance In Thumsup Advertisement | Sakshi
Sakshi News home page

ఇది సాఫ్ట్‌ కాదు.. తుఫాన్‌.. రౌడీ తుఫాన్‌

Published Tue, Feb 1 2022 8:00 AM | Last Updated on Tue, Feb 1 2022 3:11 PM

Vijay Devarakonda Thunder Performance In Thumsup Advertisement - Sakshi

యాక్షన్‌  సీక్వెన్స్‌లో తన ఫ్యాన్స్‌కి విజువల్‌ ఫీస్ట్‌ అందించాడు రౌడీ హీరో విజయ్‌ దేవరకొండ.  లేటెస్ట్‌ థమ్సప్‌ యాడ్‌లో విజయ్‌ దేవరకొండ దుమ్మురేపాడు. కేవలం 45 సెకన్ల పాటే ఉన్న యాడ్‌లో విజయ్‌ మిషన్‌ ఇంపాజిబుల్‌ రేంజ్‌ యాక్షన్‌తో అదరగొట్టాడు.

థమ్సప్‌ యాడ్‌ ప్రారంభంలో... సార్‌, సాఫ్ట్‌ డ్రింక్‌ కావాలా అంటూ బాయ్‌ వచ్చి అడుగుతాడు..  అతనికేసి తిరిగిన విజయ్‌.. వెండితెర చూడమంటూ సైగ చేస్తాడు. బిగ్‌ స్క్రీన్‌పై 30 సెకన్ల పాటు ఉన్న పోరాట దృశ్యాలు రెప్ప వాల్చనివ్వవు. సెకన్‌ బై సెకన్‌ హై వోల్టేజ్‌ యాక‌్షన్స్‌ సీన్లలో రెచ్చిపోయాడీ రౌడీ హీరో.  ఆ యాక్షన్‌ అడ్వెంచర్‌ షాక్‌ నుంచి తేరుకోకముందే మళ్లీ ప్రత్యక్షమైన విజయ్‌.  ఇది స్టాఫ్‌ డ్రింక్‌ కాదు తమ్ముడూ... తుఫాన్‌ అని చెప్పడంలో యాడ్‌ ముగుస్తుంది.  హెవీ యాక‌్షన్‌ మూవీ లైగర్‌ రిలీజ్‌కి ముందే యాక‌్షన్‌తో తుఫాన్‌ సృష్టించాడు విజయ్‌ దేవరకొండ. (అడ్వెటోరియల్‌)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 

పోల్