
రౌడీ ఇమేజ్‌తో ఇప్పటికే లక్షలాది అభిమానులను సొంతం చేసుకున్న విజయ్ దేవరకొండ త్వరలో తుఫాన్‌గా మారి దేశం మొత్తం చుట్టేయబోతున్నాడా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు అతని ఫ్యాన్స్. ఈ రౌడీ హీరో ట్విట్టర్‌లో తన పేరును తుఫాన్ (TOOFAN) గా మార్చుకోవడంతో అతని అభిమానులు హంగామా ఆకాశాన్ని తాకుతోంది.
ఒక్కసారిగా విజయ్ దేవరకొండ పేరు ట్విట్టర్‌లో తుఫానుగా మారిపోవడంతో ఫ్యాన్స్ అవాక్కయ్యారు. ఆ తర్వాత తమ అభిమాన హీరో నుంచి మరో క్రేజీ అప్‌డేట్ రాబోతుందని.. అందుకే తుఫాన్‌గా పేరు మార్చుకున్నాడంటూ సోషల్ మీడియాలో హోరెత్తిస్తున్నారు. ‘తుఫాన్ ఆనే వాలా హై’ అంటూ రీ ట్వీట్లు, షేరింగులు, పోస్టింగులతో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నారు. మరికొందరు ఇది ‘సాఫ్ట్ డ్రింక్ కాదు.. ఇది తుఫాన్’ (Soft Drink Kaadu, Idi Toofan) అంటూ కామెంట్లు చేస్తున్నారు. అసలు ఏంటీ తుఫాన్? విజయ్ దేవరకొండ తన పేరులో తుఫాన్ ఎందుకు చేర్చారనే ఆసక్తి సర్వత్రా వ్యక్తం అవుతోంది. లయన్, టైగర్‌ల క్రాస్‌బ్రీడ్ లైగర్‌గా దేశవ్యాప్తంగా ట్రెండింగ్ అవుతున్న విజయ్ దేవరకొండ తుఫానుతో మరో సంచలనానికి రెడీ అయ్యాడు. (అడ్వటోరియల్)