కోకాకోలా ఇప్పుడు సరికొత్తగా ...! | The Coca Cola Company Unveils A New Global Brand Philosophy And Platform | Sakshi
Sakshi News home page

Coca-Cola: కోకాకోలా ఇప్పుడు సరికొత్తగా ...!

Published Thu, Oct 7 2021 4:01 PM | Last Updated on Thu, Oct 7 2021 4:03 PM

The Coca Cola Company Unveils A New Global Brand Philosophy And Platform - Sakshi

ప్రముఖ మల్టీనేషనల్‌ బెవెరేజస్‌ కంపెనీ కోకాకోలా  కీలక నిర్ణయం తీసుకుంది. కొత్త గ్లోబల్ బ్రాండ్ ఫిలాసఫీ, ప్లాట్‌ఫాంను  కోకాకోలా ఆవిష్కరించింది. కౌగిలింతలాగా చుట్టి ఉన్న కోకాకోలా పేరు రియల్‌ మ్యాజిక్‌ అనే ట్యాగ్‌తో కొత్త లోగోను లాంచ్‌ చేసింది. ఈ కొత్త లోగో కాన్సెప్ట్‌ను వీడెన్‌+కెన్నెడీ  రూపకల్పన చేసినట్లు తెలుస్తోంది. కాగా ఇన్విజిబుల్‌ బాటిల్‌ లో బెవెరేజస్‌ డ్రింక్‌ను కోకాకోలా అందించనున్నట్లు తెలుస్తోంది.   అందుకు సంబంధించిన వీడియోను కోకాకోలా రిలీజ్‌ చేసింది.  కోకాకోలా బ్రాండ్ చరిత్రలో అత్యంత విభిన్న దృశ్య ప్రాతినిధ్యమని కోకాకోలా కంపెనీ గ్లోబల్ వైస్ ప్రెసిడెంట్, రఫా అబ్రూ అన్నారు.  
చదవండి: బుకింగ్‌లో మహీంద్రా ఎక్స్‌యువి 700 ఎస్‌యూ‌వి సరికొత్త రికార్డు

 కోకాకోలాకు  అదొక చీకటి రోజు...!
2021 జూన్‌ 18 నెలలో యూరో ఛాంపియన్‌షిప్‌ ప్రెస్‌ మీట్‌ సందర్భంగా పోర్చుగల్‌ స్టార్‌ ప్లేయర్‌ రొనాల్డో.. తనకు ఎదురుగా ఉన్న కోక్‌ బాటిళ్లను చిరాకుగా పక్కనపెట్టి, మంచి నీళ్లకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించిన విషయం తెలిసిందే. రొనాల్డో ప్రెస్‌మీట్‌లో.. వాటర్‌ బాటిల్‌ పైకెత్తి ‘అగ్వా’(పోర్చుగ్రీసు భాషలో మంచినీళ్లు అని అర్థం) అని కామెంట్‌ చేయగా అప్పట్లో ఈ వీడియో  తెగ సంచలనమైంది. కోకాకోలాకు చీకటి రోజైంది.  రొనాల్డో కామెంట్‌ ఎఫెక్ట్‌ మార్కెట్‌పై దారుణంగా చూపెట్టింది. ​కోకా కోలా స్టాక్‌ ధరలు 1.6 శాతానికి పడిపోయి.. 238 బిలియన్ల అమెరికన్‌ డాలర్లకు చేరింది. అంతకు ముందు కోకా కోలా విలువ 248 బిలియన్ల డాలర్లు ఉండింది. దీంతో 4 బిలియన్ల డాలర్లు(మన కరెన్సీలో 29 వేల కోట్ల దాకా) నష్టం వాటిల్లింది.

కోకాకోలా లోగో ఏం చెప్తుదంటే...!
కోకాకోలా లోగోలో రెడ్‌ కలర్‌.. అభిరుచి, బలం,లవ్‌ను సూచిస్తుంది. వైట్‌ కలర్‌...అమాయకత్వం, యువత, శాంతి, స్వచ్ఛత, వినయాలను సూచిస్తోంది. 

చదవండి: RRR Actress Invests: ఆ కంపెనీలో భారీగా ఇన్వెస్ట్‌ చేసిన ఆర్‌ఆర్‌ఆర్‌ బ్యూటీ..!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement