న్యూఢిల్లీ: ప్రీమియం బైక్స్ తయారీలో ఉన్న ఆస్ట్రియన్ కంపెనీ కేటీఎం పూర్తి స్థాయిలో ఉత్పత్తులను అందించడం ద్వారా భారత్‌లో తన మార్కెట్ ఉనికిని పెంచుకోవాలని చూస్తోంది. నాలుగు విభాగాల్లో అంతర్జాతీయంగా లభించే 10 కొత్త బైక్స్‌ను భారత మార్కెట్లో కంపెనీ ప్రవేశపెట్టింది. వీటి ధరలు రూ.4.75 లక్షలతో మొదలై రూ.22.96 లక్షల వరకు ఉంది.
‘అంతర్జాతీయంగా కొన్నేళ్లుగా కేటీఎం అమ్మకాలను పెంచుకోగలిగింది. ప్రత్యేకించి బజాజ్ ఆటోతో భాగస్వామ్యం తర్వాత ఎగుమతులు అధికం అయ్యాయి. మహారాష్ట్ర చకన్‌లోని బజాజ్ ప్లాంటులో తయారైన బైక్స్‌ను 120కిపైగా దేశాలకు ఎగుమతి చేస్తోంది. గత ఏడాది కంపెనీ ప్రపంచవ్యాప్తంగా 3.7 లక్షల మోటార్‌సైకిళ్లను విక్రయించింది’ అని కేటీఎం–స్పోర్ట్‌మోటార్‌సైకిల్ జీఎంబీహెచ్ ఆసియా, పసిఫిక్, మిడిల్–ఈస్ట్, ఆఫ్రికా సేల్స్ వైస్ ప్రెసిడెంట్ పీటర్ పెర్బెర్‌స్లాగర్ తెలిపారు.
ఇదీ చదవండి: మూడు ‘హీరో’ బైక్‌లు లాంచ్‌కు రెడీ
అమ్మకాలలో భారత్ వాటా 40 శాతమని, ఇక్కడి మార్కెట్లో అపార అవకాశాలు ఉన్నాయని చెప్పారు. ఇప్పటి వరకు కంపెనీ పూర్తి ఉత్పత్తి శ్రేణిని దేశీయంగా అందించలేదని వివరించారు. చకన్ ప్లాంటు నుంచి 500 సీసీలోపు సామర్థ్యంగల 12 లక్షల యూనిట్ల కేటీఎం బైక్‌లు ఎగుమతి అయ్యాయి.
కొత్త బైక్‌లు ఇవే..
అడ్వెంచర్ టూరర్ మోటార్‌సైకిల్ సెగ్మెంట్‌లో 1290 సూపర్ అడ్వెంచర్ ఎస్ (రూ. 22.74 లక్షలు), 890 అడ్వెంచర్ ఆర్ (రూ. 15.80 లక్షలు), ఎండ్యూరో మోటార్‌సైకిల్ శ్రేణిలో 350 EXC-F (రూ. 12.96 లక్షలు), మోటోక్రాస్ విభాగంలో 450 SX-F (రూ. 10.25 లక్షలు), 250 SX-F (రూ. 9.58 లక్షలు), 85 SX (రూ. 6.69 లక్షలు), 65 SX (రూ. 5.47 లక్షలు), 50 SX (రూ. 4.75 లక్షలు).
Comments
Please login to add a commentAdd a comment